Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తతి తయో7ధ్యాయః.

అనజ్గశయనవ్రతమ్‌.

బ్రహ్మా:  

వర్ణశ్రమణాం ప్రభవః పురాణషు మయా శ్రుతః l సదాచారాశ్చ భగవ& దర్మశాస్త్ర వినిశ్చయా. 1

పుణ్యస్త్రీణా సదాచారం శ్రోతు మిచ్ఛామి తత్త్వతః l పతిప్రతానాం దేవేశ చరితం పరికీర్తయ. 2

ఈశ్వరః: యస్మిన్నేవ యుగే బ్రహ్మ న్త్సహస్రాణి చ షోడశ l

వాసుదేవస్య భార్యాణాం భవిష్య స్త్యమ్బుజోద్భవ. 3

తాభి ర్వసన్తసమయే కోకిలాళికులాకులే l పుష్పితో పవతోపవనోత్ఘల్ల కల్హరసరస స్తటే. 4

నిర్భరాపానగోష్ఠీషు ప్రసక్తాభి రలంకృతః l కురజ్గనయన శ్ర్శీమాన్మాలతీకృతశేఖరః. 5

గచ్ఛస్త్సమీపమార్గేణ సామ్బః పరపురఞ్జయః l సాక్షాత్కన్దర్పరూపేణ సర్వాభరణభూషితః. 6

అనజ్గశరతప్తాభి స్వాభిలాషాభి రీక్షితః l ప్రవృద్ధో మన్మథ స్తాసాం భవిష్యతి యదా77త్మని. 7

తదా7వేక్ష్య జగన్నాధ స్సర్వతో జ్ఞానచక్షుషా l శాపం వక్ష్యతి తా స్సర్వా వో హరిష్యన్తి దస్యవః. 8

మత్పరోక్షం యతః కామా త్ర్పాప్త మీదృగ్విచేష్టితమ్‌ l తదా ప్రసాదితో దేవ ఇదం వక్ష్యతి శార్జభృత్‌. 9

కృష్ణశాపా త్తత్పత్నినాం వేశ్యాత్వప్రాప్తిః.

తాభిశ్శాపాభితప్తాభి ర్భగవాన్భూతభావనః l ఉత్తారభూతం దాసీత్వం సమదా ద్ర్భాహ్మణః ప్రియమ్‌ 10

ఉపదేక్ష్యత్యథ్తాత్మానం భావికర్మణి కారకమ్‌ l భవతీనాం ముని ర్దాల్భ్యో యద్ర్వతం కథయిష్యతి. 11

తదేవోత్తారణాయాలం దాసీత్వే7పి భవిష్యతి ! ఇత్యుక్త్వాతాః పరిత్యజ్య * గతో న్తర్దాన మీశ్వరః. 12

డెబ్బదియవ అధ్యాయము.

అనంగ శయన వ్రతము.

బ్రహ్మదేవుడు ఈశ్వరు నిట్లడిగెను. భగవన్‌! (వైదిక) పురాణములయందు చెప్పబడియున్న వర్ణాశ్రమముల ఉత్పత్తిని ధర్మశాస్త్రములయందలి ఆచార నిర్ణయములను సదాచారములను కూడ వింటిని. పుణ్య స్త్రీలు పాటించవలసిన సదాచారమును పతివ్రతల సదాచారమును వినగోయచున్నాను. నా కవి తెలుపుము.

ఈశ్వరు డతనికి ఇట్లు చెప్పెనుః ముందు రాబోవు యుగమున శ్రీకృష్ణునకు పదునారువేల మంది భార్యలగుదురు. ఆ కాలమును ఒకానొక వసంతర్తువునందు కోయిలల-తుమ్మెదల గుంపులు దట్టమయి ధ్వనులు చేయుచుండ పూచిన ఉద్యానముల నడుమ వికసించిన ఎర్ర కలవలతో నిండిన సరస్సు నొడ్డున ఉన్న శ్రీ కృష్ణ భార్యల పదునారువేల మందికి సమీపముగా కృష్ణ కుమారుడు సాంబుడు పోవుట జరుగును. అతడు లేడి కన్నులవంటి చంచలములు మనోహరములు నగు కన్నులు కలవాడు; మాలతీ పుష్పములతో కేశపాశము నలంకరించుకొనినవాడు. మద్యపానగోష్ఠులయందు దట్టముగా మునిగియున్న స్త్రీలు అతని చుట్టు పరిపవేష్టించి యుండి ఆతని నలంకరించి యుందురు. అతడు సర్వాభరణము లతో అలంకరించబడి సాక్షాత్‌ మన్మథునివలెనుండును. అతనిని శ్రీ కృష్ణపత్ను లందరును మన్మథబాణ తాపముచే వాంఛాపూర్వకముగా చూతురు. వారి మనస్సులందు కామ మధికమగుటను భగవానుడు జ్ఞాననేత్రముతో చూచి ''నేను లేని చోట మీరు కామముచే ఇట్లు ఆచరించితిరి కావున మిమ్ము దోపిడిగాండ్రు హరింతురు.'' అని శపించును.

శాపముచే అభితాపము చెంది వారందరును సర్వభూతముల సృజించి పొషించువాడు శార్జధారియగు కృష్ణ భగవానుని వేడికొని అనుగ్రహంపజేసికొందురు. ''మీరు ఈ శాపమునుండి తరించుటకు మీకు దాసీత్వము ప్రాప్తించును. నేను రాబోవు పనులు ఏవి ఎట్లు జరుగనున్నవో అట్లు జరుగనున్నవో అట్లు చేయువాడను. ఇకముందు దాల్భ్యుడు అను బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేని నుపదేశించునో దాని నాచరించుడు. అది మిమ్ములను మీ దాసీత్మునుండి తరింప జేయగలుగును.'' అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతర్ధానము నందును.

_______________________________________________________________________

*గతేద్వారవతీశ్వరే

తతః కాలేన మహతా భారావతరణ కృతే l నివృత్తే మౌసలే తద్వత్కేశ##వే7పి దివం గతే. 13

శూన్చే యదుకులే సర్వే చోరైరపి జితే7ర్జునేl హృతాసు కృష్ణపత్నీషు దాసభోగ్యాసు చాంబుధౌ. 14

తిష్ఠత్సు దుఃఖదౌర్భగ్యసన్తప్తాసు చతుర్ముఖ l ఆగమిష్యతి యోగాత్మా దాల్భ్యో నామ మహాతపాః. 15

తాస్త మర్ఝ్యైశ్చ సమ్పూజ్య ప్రణిపత్య పునఃపునః లాలప్యమానా బహుశో బాహుశో బాష్పపర్యాకులేక్షణాః. 16

స్మరన్త్యో వివిధా న్బోగా& దివ్యమాల్యానులేపనా& l భర్తారం జగతా మీశ మనన్త మపరాజితమ్‌. 17

దివ్యానుభావాంచ పురీం నానారత్నగృహాణిచ l ద్వారకావాసిన స్సర్వా& దేవభూతాన్కు మారకా&. 18

ప్రశ్న మేత త్కరిష్యన్తి మునే రభిముఖం స్థితాః l

స్త్రియః: దస్యుభి ర్భగవ న్త్సర్వాః పరిభుక్తా వయం బలాత్‌. 19

స్వధర్మచ్యవనే7 స్మాక మస్మి న్న శ్శరణం భవా& l ఆదిష్టో7 సిపురా బ్రహ్మ న్కే శ##వేనచ ధీమతా. 20

కస్మా దీశేన సంయోగం ప్రాప్య వేశ్యాత్వ మాగతాః l వేశ్యానామపి యో ధర్మ స్తన్నో బ్రూహి తపోధన. 21

కథయిష్యతి తత్తాసాం యద్దాల్భ్య్మ శ్చకితాననఃl దాల్భ్యః: జల క్రీడా విహారేషు పురా సరసి మానసే. 22

భవతీనాం సగర్వాణాం నారదో 7భ్యాశ మాగమత్‌l హుతాశనసుతా స్సర్వా భవన్త్యో7 ప్సరసః పురా. 23

అప్రణమ్యావలేపేన పరిపృష్ట స్స యోగవిత్‌ l కథం నారాయణో7స్మాకం భర్తా స్యా దిత్యుపోషణమ్‌. 24

తస్మాద్ర్వతప్రదానం చ శాపశ్చాయ మభూ త్పురాl శయ్యాద్వయప్రదానేన మధుమాధవమాసయోః. 25

సువర్ణోపస్కరాస్సర్వాఃప్రదేయా శ్శుక్లపక్షయోఃl భర్తా నాపాపసళ్ష నసకనప భవి

ష్య త్యన్యజన్యని. 26

యదకృత్వా ప్రణామం మే రూపసౌభాగ్యమత్సరాత్‌ l పరిపృష్టో7స్మి తేనాశు వియోగో వో భవిష్యతి . 27

చోరై రపహృతా స్సర్వా వేశ్యాత్వం సమవాప్స్యథ l ఏవం నారదశాపేన కేశవస్యచ ధీమతః. 28

వేశ్యాత్వ మాగతా స్సర్వా భవన్త్యః కామమోహితాః l ఇదానీమపి యద్వక్ష్యే తచ్ఛృణుధ్వం వరాజ్గనాః 29

తరువాత చాలకామునకు శ్రీకృష్ణ భగవానుడు భూభారావతారణముచేసి మౌనల (ఇనుపరోకలి పోడినుండి ఉత్పన్నమైన తుంగదుబ్బులతో యాదవులు పరస్పరము చేసికొనిన) యుద్ధమునకు తరువాత తానును వైకంఠము చేరును. యదుకులమున వీరులు లేకపోగా అర్జునుని జయించి దోపిడిగండ్రు కృష్ణపత్నుల నపహరించి దాసీత్వమునకు పాలుపరతురు. వారు దుఃఖముచేతను దురదృష్టముచేతను సంతాపము చెంది సముద్ర తీరమున నుండగా యోగాత్ముడగు దాల్భ్యుడనుమహాతపస్వి అచ్చటకు వచ్చును. వారతనిని అర్ఝ్యపాద్యాదులతో పూజించి పునః పునర్నమస్కారము లర్పింతురు. బాష్ప వ్యాప్తములయిన కన్నులతో వారనేక విధములుగా ఏడ్చుచు (తా మదివరకు అనుభవించిన) దివ్య పభోగములను దివ్య మాల్యసుగంధానులేపనములను లోకేశుడు అనంతుడు పరాజయము నెరుగనివాడు నగు తమ పతిని దివ్య లక్షణ ములుగల తమ ద్వారకాపురిని అచటి నానా రత్న గృహములను దేవ సదృశులై యుండి అప్పుడు దేవత్వమును పొందిన ద్వారకాలవాసులగు కమమారకులను తలచుచు దుఃఖించుచు ఆ ముని కెదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు.

''భగవన్‌ ! మేమందరమను దస్యులచే బలాత్కారమున అనుభవించబడితివి. మాకు కలిగిన ఈ ధర్మభ్రంశములో మీరే మాకు దిక్కు అగుదురని పూర్వమే శ్రీకృష్ణభగవానుడు మాకు అదేశించియున్నాడు. భగవానునకు పత్నులమగు మేము వేశ్యాత్వమును పొందుటకేమి హేతువు? తపోధనా! వేశ్యలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము.'' అని అడుగగా ఆశ్చర్యచకితమయిన ముఖముతో దాల్భ్యుడు వారితో నిట్లనును:''పూర్వము మీరందరును అగ్ని పుత్త్రికలగు అప్సరసలుగా ఉంటిరి. ఒకప్పుడు మీరు మనస సరస్సున జలక్రీడా విహారములందుండగా నారదుడు మీకడకు వచ్చెను. మీరు గర్వముచే అతనిని నమస్కరించకయే 'మాకు నారాయణుడు పతియగు ఉపాయము ఏమ' ని అడిగితిరి. మధు (చైత్ర) మాధవ (వైశాఖ) మాసములందు బంగారు అలంకరణములతో సర్వ పరికరములతో మంచము లను పడకలను (ఒక్కొక్క మాసమునందొక్కొక్కటిగా) ఉపవాస సహితమగు వ్రతాచరణముతో దానము చేసినచో నారాయుణుడు పతియగునని ఉపదేశించి ఆముని రూప సౌభాగ్య గర్వముచే నన్ను నమస్కరింపకయే ఈ విషయము అడిగితిరి కావున మీకు నారాయణునితో వియోగము శీఘ్రకాలములోనే కలుగును. చోరులచే అపహరింపబడి మీరు వేశ్యాత్వమును పోందుదురు. అని శపించును . ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపముచే మీరు కామ మోహితులయి వేశ్యాత్యమును పొందితిరి. ఉత్తమ స్త్రీలారా! నేనిపుడు చెప్పునది వినుడు.

పురా దైవాసురేయుద్దే హతేషు శతశ స్సురైః l దానవాసురదైత్యేషు రాక్షసేషు తత స్తతః. 30

తేషాం నారీసహస్రాణి శతశో7థ సహస్రశః l పరిణీతాని యాని స్యు ర్బలా ద్భుక్తాని యాని తు. 31

తాని సర్వాణి దేవేశః ప్రోవాచ వదతాం వరః l వేశ్యాధర్మేణ వర్తధ్వ మధునా నృపమన్దిరే. 32

భక్తిమత్యో వరారోహా స్తథా దేవకులేషుచ l రాజానస్స్వామినస్తుభ్యం సూతకం చాపి తత్సమమ్‌. 33

భవిష్యతిచ సౌభాగ్యం సర్వాసామపి శక్తితః l యః కశ్చి చ్ఛుల్క మాదాయ గృహమేష్యతి వై సదా. 34

అచ్ఛద్మనైవోపచార్య స్సతదా7 న్యత్ర దామ్భికాత్‌ l దేవతానాంచ విప్రాణాం పుణ్య7హ్ని సముపస్థితే. 35

గోభూహిరణ్యధాన్యాని ప్రదేయాని చ శక్తితః l బ్రాహ్మణభ్యో వరారోహాః కార్యాణి వివిధానిచ. 36

యచ్చాన్యచ్చ వ్రతం సమ్య గుపదేక్ష్యా మ్యహం తతఃl అవిచారేణ సర్వాభి రనుష్ఠేయంచ తత్పునః 37

సంసారోత్తారణా యాలం ఏత ద్వేదవిదోవిదుః l యదా సూర్యదినే హస్తః పుష్యోవాథ పునర్వసూ. 38

భ##వేత్సర్వౌషధిస్నాననం సమ్యజ్నౌరీ సమాచరేతేl తదా పఞ్చశరస్యాపి సన్నిధానత్వ మేష్యతి. 39

అర్చయే త్పుణ్ణరీకాక్ష మనజ్గ స్యానుకీర్తనైః l

పూర్వము దేవాసుర యుద్ధములందు దేవతల చేతులలొ వందలకొలదిగా దానవులు అసుయలు దైత్యులు రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేలకొలదిమంది వేరిచే హరించబడి బలత్కారమున పెండ్లాడబడుటయో అనుభవించబడుటయో జరిగెను. వారితో పురుషోత్తముడగు దేవేంద్రుడిట్లనెను-మీరికమీదట (భూలోకమున) రాజమందిరము లందును దేవమందిరములంందును భక్తిమతులై వేశ్యా ధర్మముతో నుండుడు. (అచట) రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన ఆశౌచములు మొదలగునవి మీకును వర్తించును. మీకందరకును యోగ్యతానుసారమ సౌభాగ్యము (ఐదువతనము) ఉండును. కపటి కాని ఎవడు శుల్కము (వెల) తీసికొని మీకడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండ ఉపచారము చేయవలయును. పుణ్య దినములందు దేవతలకును బ్రాహ్మణులకును గో భూ-హిరణ్య-దానములు చేయవలయును. బ్రాహ్మణులకు మీచేతనైన కార్యములు (నృత్యము-సంగీతము మొదలగునవి) చేయవలయును. ఇదికాక నేను మీకొక వ్రతము నుపదేశింతును. దానిని మీరు ఏమాత్రమును వెనుకమందులు విచారించక అనుష్ఠించవలయును. దానిచే మీరు సంసారమును తరింతురు. అదిత్యవారమున హస్తపుష్య పునర్వసులలో నేదైన నక్షత్రముండగా (మీజాతి వారు) సర్వౌషధులతో స్నానమాడి మన్మథుని సన్నిధానము (ప్రతిమా ప్రతిష్ఠాపనము) ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణు నర్చించవలయను.

కామాయపాదౌ సమ్పూజ్య జజ్ఝేవై మోహకారిణ. 40

మేఢ్రం కన్దర్పనిధయే కటిం ప్రీతిమతే నమః l నాభిం సౌఖ్యసముద్రాయ వాసవాయ తధోదరమ్‌. 41

హృదయం హృదయేశాయ స్తనా వానన్దకారిణ l ఉత్కణ్ఠాయచ వై కణ్ఠ మాస్య మాహ్లాదకారిణ. 42

వామాజ్గం పుష్పచాపాయ పుష్పాబాణాయ దక్షిణమ్‌ l నమో7నజ్గాయవై మౌళిం విలోలాయేతి మూర్ధజా&.

సర్వాత్మనే శిర స్తద్వ ద్దేవదేవస్య పూజయేత్‌ l నమ శ్శివాయ శాన్తాయ పాశాజ్కుశధరాయ చ. 44

గదినే పీతవస్త్రాయ శజ్ఖుచక్రధరాయచ l నమో నారాయణాయేతి కామదేవాత్మనే నమః 45

నమశ్శాన్త్యై నమః ప్రీత్యై నమో రత్యై నమో నమఃl నమః పుష్ట్యై నమ స్తుష్ట్యై నమ స్సర్వార్థసమ్పదే.

ఏవం సమ్పూజ్య గోవిన్ద మనజ్గౌత్మాన మీశ్వరమ్‌l గన్దై ర్మాల్యై స్తథా ధూపై ర్నైవేద్యై శ్చైవ కామినీ . 47

తత ఆహూయ ధర్మజ్ఞం బ్రాహ్మణం వేదపారగమ్‌ | అవ్యజ్గౌవయవం పూజ్య గన్ధధూపార్చనాదిభిః. 48

శాలేయం తణ్డులప్రస్థం ఘృతపాత్రేణ సంయుతమ్‌ l తసై#్మ విప్రాయ సా దద్యా న్మన్మథః ప్రీయతామితి. 49

యథేష్టాహారభుక్తేతు తమేవ ద్విజసత్తమమ్‌ | రత్యర్థం కామదేవో7య మితి చితేన ధార్యతామ్‌. 50

యద్య దిచ్ఛతి విప్రేన్ద్ర స్తత్త త్యుర్యా ద్విలాసినీ l సర్వభావేన చాత్మాన మర్పయే త్స్మితభాషీణీ. 51

ఏవ మాదిత్యవారేణ సదా తద్వ త్సమాచరేత్‌ l తణ్డుల ప్రస్థదానంచ యావన్మాసా స్త్రయోదశ. 52

పూజమంత్రములు: 1. కామాయనమః- పాదౌ పూజయామి; 2. మోహకారిణనమః- జంఘే పూజయామి; 3. కందర్ప నిధయేనమః- మేఢ్రం పూజయామి; 4. ప్రీతిమతేనముః-కటిం పూజయామి; 5. సౌఖ సముద్రాయనమః నాభిం పూజయామి; 6 .వాసవాయనమః ఉదరం పూజయామి; 7. హృదయేశాయనమః-హృదయం పూజయామి; 8. ఆనందకారిణనుః- స్తనౌ పూజయామి; 9. ఉత్కంఠాయనమః-కంఠం పూజయామి; 10. ఆహ్లాదకారిణనమః-ఆస్యం పూజయామి; 11. పుష్పచాపాయనమః- వామాంగం పూజయామి; 12. పుష్పబాణాయ నమః-దక్షిణాంగం పూజయామి; 13. అనంగాయనమః- మౌళిం పూజయామి; 14. విలోలాయనముః-కేశాన్‌ పూజయామి; 15. సర్వాత్మనేనమఃశిరః పూజయామి; ( ఇది అంగపూజ).

గదాధరుడు-పీతవస్త్రుడు-శంఖచక్ర ధరుడు - మన్మథాత్ముడునగు నారాయణునకు నమస్కారము. శాంతి-ప్రీతి-రతి-పుష్టి-తుష్టి-సర్వార్థసంపద్‌ రూపయగు లక్ష్మికి నమస్కారము.

ఇట్లు మన్మథాత్మకుడు ఈశ్వరుడగు గోవిందుని గంధమాల్య ధూపదీప నైవేద్యములతో ఈ స్త్రీలు పూజించవలెను. తరువాత ఆమె ధర్మజ్ఞుడు వేదపారంగతుడు అంగవైకల్యములేనివాడు నగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపాద్యర్చనలతో అతనిని పూజించి కుంచెడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను'మన్మథః ప్రీయతామ్‌' అనెడు మంత్రముతో దానముచేసి ఈ పదార్థములు మీయథేష్ట భో

జనమునకు సరిపోవుచగాక! యని భక్తితో పలుకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మథుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయుచు ఈ విలాసిని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావముతో ఆత్మార్పణముచే నృత్య గీతాది విలాసములతో అతనిని సంతోషపెట్టవలయును. ఇట్లు ప్రతి ఆదివారమునాడును పదుమూడు మాసములు విడువక వ్రతము చేయవలయును.

తత స్త్రయోదశే మాసే సమ్ప్రా ప్తే తస్య భామినీ l విప్రస్యోపస్కరై ర్యుక్తాం శయ్యాం దద్యా ద్విలక్షణామ్‌. 53

సోపధానకవి శ్రామాం స్వాస్తరావరణాం శుభామ్‌ l ప్రదీపోపానహచ్ఛ త్రపాదుకాసనసంయుతామ్‌. 54

సవత్నీక మలజ్కృత్య హేమసూత్రాజ్గుళీయకైః l సూక్ష్మవసై#్త్ర స్సకటకై ర్దూపమాల్యానులేపనైః. 55

కామదేవం సపత్నీకం గుడకుమ్భోపరి స్థితమ్‌ l తామపాత్రాసనగంతం హేమసూత్రపటావృతమ్‌. 56

సకాంస్యభాజనోపేత మిక్షుదణ్డసమన్వితమ్‌ l దద్యా దనేన మన్త్రేణ తథైకాం గాం పయస్వినీమ్‌. 57

యథాన్తరం న పశ్యామి కామకేశవయో స్సదా l తథైవ సర్వకామాప్తిరస్తువిష్ణో సదా మమ. 58

యథా న కామినీ దేహా త్స్రయాతి తవ కేశవ l తథా మమాపి దేవేశ శరీరేషు కురు ప్రభో. 59

తథాచ కాఞ్చనం దేవం ప్రతిగృహ్య ద్విజోత్తమఃl

*కో7దా త్కామో దదాతీతి వైదికం మన్త్ర ముచ్చరేత్‌. 60

అనజ్గః ప్రతిగృహ్ణాతి అనజ్గోవ్తె దదాతి చ l ఆనజ్గ స్తారకోభాభ్యా మనజ్గాయ నమోనమః. 61

తతః ప్రదక్షీణీకృత్య విసృజ్య ద్విజపుజ్గవా& l శయ్యాగవాదికం సర్వం బ్రాహ్మణస్య గృహం నయేత్‌. 62

తతఃప్రభృతి యో7న్యోవై రత్యర్థం గృహ మాగతః l స మాన్య శ్చోపచారేణ స సమ్పూజ్యో భ##వే త్తదా.

ఏవం త్రయోదశం యావ న్మాస మేకం ద్విజోత్తమమ్‌ l

తర్పయేత యథాకల్పం ప్రోషితేన్యం సమర్చయేత్‌. 64

తదనుజ్ఞయాచ వస్తవ్యం యావ దబ్దాగమో భ##వేత్‌ l ఆత్మనో 7పి తథా విఘ్నో గర్బసూతకరాజతః. 65

దైవోవా మానుషో వా స్యా దుపరాగేణ పాతతః l సా వత్సరా నష్ట పఞ్చ చాష్ట సజ్ఖ్యా సమాపయేత్‌. 66

తథాపిచ ద్విజం దేవం యథాశక్త్యా సమర్చయేత్‌ l

పదుమూడవ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు యజ్ఞోపవీతము ఉంగరములు కడి యములు మురుగులు సన్నని వస్త్రములు గంధమాల్యాను లేపనములు- ఇట్టివానితో అలంకరించి వారికి శయన దానము చేయవలెను . వారికి అన్ని పరికరములతో కూడిన మంచము- దిండు- పరపు- పరపుపై కప్పు దుప్పటి- ఆనుకొనుదిండు-ప్రదీపము-చెప్పులు-గొడుగు-పాదుకలు-పీట-ఇట్టి వన్నియు చేర్చిన విలక్షణమయిన శయ్యను దానము చేయవలెను. ఒక కడవలో బెల్లము నింపి దానిపై తామ్ర పాత్ర నిలుపవలెను. దానిపై అసనము నమర్చి దానిపై రతీ మన్మథుల (బంగారు) ప్రతిమలను బంగారు సరిగగల వస్త్రములు కట్టిన వానిని ఉంచవలెను. కంచు పాత్రను చెరకు గడను కూడ వాటితో పాటు చేర్చి పాడియాపును ఇవన్నియు కూడ ఆ విప్రదంపతులకు దానమీయవలెను.

దాన మంత్రమునకు అర్థము: మన్మథ విష్ణువుల నడుమ నేను అభేదము భావించుచు (నారాయణుని) సేవించుచున్నాను కావున నారాయణా! నాకు అన్ని కోరికలు నెరవేరుగాక! కేశవా! నీ దేహమునుండి నీకామిని (లక్ష్మి) వేరు కానట్లే నాకునుఅన్ని కోరికలును (కామములు) తీరుగాక! ఈ దానమును ప్రతిగ్రహించువాడును దానఫలమును ఇచ్చు వాడును మన్మథుడే. విప్రా! దానము గ్రహించునిన్నును ఇచ్చు నన్నును తురింపజేయువాడును మన్బ్మథుడే. అట్టి మన్మధునకు నమస్కారము. (ఇచట కామో దాతా-ఇత్యాది వేదమంత్రమును చెప్పవలెను.)

తరువాత ఆ విప్రదంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహమునకు పంపి పిమ్మట ఈ దానమిచ్చిన వన్నియు వారి ఇంటికి చేర్చవలెను.

అది మొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వత్తురో వారిని ఉపచారములతో ఆనందపరచవలెను.

లోగడ చెప్పిన పదుమూడు మాసముల క్రమములోను ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలెను. ఒక వేళ ఆతడు ఆ నడుమ దేశాంతరము పోయినచో ఆతని అనుమతితో మరియొక బ్రాహ్మణుని ఆర్చించవచ్చును.

తాను గర్భవతి యగుట- తనకు పురుడువచ్చుట- తన రాజునకు ఆ శౌచమువచ్చుట- ఇతరములగు దైవిక హేతుపులు- మానుషములైన హేతుపులు-గ్రహణములు-వ్యతీపాతము మొదలగు దోషములు - వీనిచే వ్రతమును విఘ్నము సంభవించినను ఎనిమిది- ఐదు - ఎనివిది- ఈ క్రమమున (8+5=13) మొత్తము పదుమూడు మాసములగునట్లు కొన్ని సంవత్సరములపాటు ఈ వ్రతమును ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను బ్రాహ్మణుని (మన్మథ) దేవుని యథా శక్తిగా ఆర్చించుచునే యుండవలెను.

___________________________________________________________________________

*కామోదా7త్కామో

ఏతద్ది కథితం సమ్య గ్భవతీనాం విశేషతః. 67

స్వధర్మో7యం యతో భావ్యో వేశ్యానా మిహ సర్వదాl పురుహూతేన యత్ప్రోక్తం దానవేషు పురా మయా.

తదిదం సామ్ప్రతం సర్వం భవతీ ష్వనుయుజ్యతే l సర్వపాపప్రశమన మన న్తఫలదాయకమ్‌. 69

కల్యాణినీనాం కథితం త త్కురుధ్వం వరాజ్గనాః l

కరోతి యా7 శేష మఖణ్డ మేత త్కల్యాణినీ మాధవలోక కసంస్థా. 70

సా పూజితా దేవగణౖ రశేషై రానన్దకృత్థ్సాన ముపైతి విష్ణోః l

శ్రీమత్స్యః: తపోధన స్సో7ప్య భిదాయచైత దనజ్గదానవ్రత మజ్గనానామ్‌. 71

స్వస్థాన మేష్యంత్యథతాస్సమస్తా వ్రతం చరిష్యన్తి చ దేవయోనే . 71u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మత్స్య మనుసంవాదే అనజ్గశ యన వ్రతకథనం నామ సప్తతితమో7 ధ్యాయః .

(దాల్భ్య వచనము) కృష్ణ పత్ను లారా! పూర్వము దేవేంద్రుడు రాక్షస స్త్రీలను భూలోకమున వేశ్యలుగా బుట్టుడని వారికి చెప్పిన స్వధర్మము ఇది; ప్రకృతమున మీరును ఈ వ్రతమునే అనుష్ఠించ వలయును. ఇది సర్వపాప ప్రశమనము; అనన్త ఫలదాయకము; 'కల్యాణినులు' అను (వేశ్యా) స్త్రీలకు విధించబడిన వ్రతము ఇది; దీనిని మీరును ఆచరించుడు. దీనిని ఆఖండముగా-ఎడతెగక ఆచరించిన 'కల్యాణిని' విష్ణు లోకమున వసించును. అచట ఆమె ఆశేష దేవ గణముల పూజల నందుకొనును.

మత్స్యుడు చివరకు ఇట్లు చెప్పెను. ఆ దాల్భ్యముని కృష్ణ పత్నులకు పదునారు వేల మందికిని ఇట్లు ఈ ఆనంద శయన దాన వ్రతమును ఉపదేశించి తన స్థానమునకు మరలి పోవును. వారును ఈ వ్రతమును అట్లే ఆచరింతురు.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున అనంగశయన వ్రతము అను డెబ్బదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters