Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనస ప్తతిత మో7ధ్యాయః.

కల్యాణభీమద్వాదశీవ్రతమ్‌.

మనుః : కథ మారోగ్య మైశ్వర్య మనస్త మమరేశ్వర | స్వల్పేన తపసా దేవ భ##వే న్మోక్ష స్సదా నృణామ్‌. కి మజ్ఞాతం మహాదేవ త్వత్ర్పసాదా దధోక్షజ | అల్పకేనాపి తపసా మహాఫల విహోచ్యతామ్‌. 2

శ్రీ మత్స్యః : పురా రాథస్తరే కల్పే పరిపృష్టో మహాత్మనా |

మన్దరస్థో మహాదేవః పినాకీ బ్రహ్మణా స్వయమ్‌. 3

ఇతి పృష్ట స్సవిశ్వాత్మాబ్రహ్మణా లోకభావనః | ఉమాపతి రువాచేదం మననం ప్రీతికారకమ్‌. 4

ఈశ్వరః : అస్మా ద్రాథన్తరా త్కల్పాత్త్రయోవింశతిమే యదా |

వారాహో భవితా కల్ప స్తస్య మన్యస్తరే శుభే. 5

వైవస్వతాఖ్యే సఞ్జాతే సప్తమే సప్తలోకకృత్‌ | ద్వాపరాఖ్యం యుగం తచ్చ సప్తవింశ త్తమం యదా. 6

తస్యాన్తే సుమహాతేజా వాసుదేవో జనార్దనః | భారావతరణార్థాయత్రిధా విష్ణు ర్భవిష్యతి. 7

ద్వైపాయనో ముని స్తద్వ ద్రౌహిణయో7థ కేశవః | కంసారిః కేశిమథనః కేశవః క్లేశనాశనః.

అరువది తొమ్మిదవ అధ్యాయము.

కల్యాణ భీమ ద్వాదశీ వ్రతము.

మనువు మత్స్య నారాయణు నిట్లడిగెను : దేవేశ్వరా! దేవా: మానవులకు స్వల్పమగు తపస్సుతోనే అనంతమగు ఆరోగ్యము ఐశ్వరము మోక్షము కలుగు నుపాయమును తెలుపుము. నీకు తెలియనిదేదియు లేదు. అనగా నారాయణుడిట్లతనికి తెలిపెను. పూర్వము రాథంతర కల్పమున మందర పర్వతమున నున్న పినాకధారియగు మహాదేవుని భగవానుడు సాక్షాత్‌ బ్రహ్మదేవుడు ఈ విషయమును అడుగగా అతడతనికి మనఃప్రీతికారకమగు ఈ విషయము ఇట్లు చెప్పెను: బ్రహ్మః ఇపుడు జరుగుచున్న ఈ రథంతర కల్పమునుండి ఇరువది మూడవ కల్పమున వారాహకల్పము వచ్చును దానిలో ఏడవదగు వైవస్వత మన్వంతరమున ఇరువది ఏడవ ద్వాపరయుగపు తుదలో మిగుల మహాతేజస్కుడు వాసుదేవుడు నగు (సర్వమునందు తానుండుచు సర్వమునందు తానుండు) జనార్ధనుడు విష్ణవులోకు (భూ) భారమును దించుటకు మూడుగానై ద్వైపాయనముని-బలరాముడు-కృష్ణుడు-అని ముగ్గురుగా అగును. కృష్ణునికే కేశవుడు కంసారి కేశి మథనుడు అని ప్రసిద్ధి. ఆ మహానుభావుడు క్లేశముల నన్నిటిని నశింపజేయువాడు.

పురీ ద్వారవతీ నామ సామ్ర్పతం యా కుశస్థలీ | దివ్యానుభావసంయుక్తా సా నివాసాయ శర్జిణః. 9

త్వష్టా మమాజ్ఞయా బ్రహ్మ స్కరిష్యతి జగతృతేః | తస్యాం కదాచి దాసిన స్సభాయాం చామితద్యుతిః.

భార్యాభిర్వృష్ణిభి ర్భూయే సుహృద్భిరివ దక్షిణౖః | కురుభి ర్తేవగన్దర్వై స్సహితః కైటభార్దనః. 11

ప్రవృత్తేషు పురాణషు ధర్మసంవాదినీషు చ | కథాన్తే భీమ సేనేన పరిపృష్టః ప్రతాపవా 7 . 12

త్వయా పృష్టస్య ధర్మస్య రహస్యస్యా భేదకృత్‌ | భవితా స తదా బ్రహ్మ న్కర్తా చైవ వృకోదరః 13

ప్రవర్తకో7స్య ధర్మస్య పాణ్డుసూను ర్మహాబలః | యస్య తిక్‌ష్ణో వృక్షో నామ జఠరే హవ్యవాహనః. 14

మయా దత్త స్స ధర్మాత్మా తేన చాసౌ వృకోదరః | మతిమా న్దానశీలశ్చ నాగాయతబలోమహా&. 15

భవిష్య త్యజర స్సాక్షా త్కస్దర్ప ఇవ మూర్తిమా&. | ధార్మిక స్యాక్తస్య తీవ్రాగ్నిత్వా దుషోషణ. 16

ఇదం ప్రత మశేషాణాం ప్రతానా మధికం యతః | కథయిష్యతి విశ్వాత్మా వాసుదేవో జగద్గురుః. 17

అశేషయజ్ఞఫలద మశేషాఘవినాశనమ్‌ | అశేషదుంఖశమన మశేషామరపూజితమ్‌. 18

పవిత్రాణాం పవిత్రం య స్మఙ్గళానాంచ మఙ్గళమ్‌ | భవిష్యాణాం భవిష్యంచ పురాణాం పురాతనమ్‌. 19

వాసుదేవః : యద్యష్టమీ చతుర్ధశ్యో ర్ద్వాదశీష్యపి భారత - అన్వేష్వసి దినర్షేషు నశక్త స్త్వ ముపోషితుమ్‌.

తతః పుణ్యా మిమాం భీమా తిథిం పాపప్రణాశనీమ్‌ | ఉపోష్య విధినా7నేన గచ్చే ద్విష్ణోః పరం పదమ్‌.

దివ్యములగు అనుభావములు కల ఈనాటి (మత్యనారాయణుడు మనువునకు ఈ విషయమును చెప్పిపన కాలమునందలి) కుశస్థలీపురిని జగత్పతియగు గుయాజ్ఞచే (దేవశిల్పి) త్వష్ట శార్జ ధనుర్దారీయగు శ్రీ కృష్ణభగవానుని నివాసమునకై ద్వాగవతీ పురియను పేర నిర్మించును. కైటభాంతకుడగు శ్రీ కృష్ణుడు ఒకానొక సమయమున ఆ ద్వారక యందు సభయందాసీనుడు అగును. అమిత ప్రకాశకుడు ఆయనను తన పత్నులును వృష్టిజాతీయులగు క్షత్త్రియులును మిగుల ప్రియులగు మిత్రులును కురు వంశీయులగు క్షత్రియులును దేవతలును గంధర్వులును దేవ గంధర్వులును పరివేష్ఠించియుందురు. ఆ సభలో పురాణములును ధర్మమున కనుకూలములగు కథా ప్రవృత్తులను సాగుచుండ మాటలనడుమ ప్రతాపవంతుడగు శ్రీ కృష్ణుని భీమ సేనుడు ఇపుడు నన్ను (మత్స్యనారాయణుని)నీవు (మనువు) అడిగిన ఈ రహస్యమును భేదించు ప్రశ్నమును ప్రశ్నించును. తరువాత ఆ భీమ సేనుడే ఆ ధర్మము (వ్రతము) ను ఆచరించువాడును అధర్మమును లోకమున ప్రవర్తింపజేయువాడును అగును.

ఆ భీమ సేనుడు పాండు రాజకుమారుడు-మహాబలుడు; ఆ ధర్మాత్మునకు నేను వృకము అను పేరుగల జఠరాగ్నిని ఇత్తును. అందుచే అతనికి వృకోదరుడను పేరు ప్రసిద్దమగును. అతడు బుద్దిశాలియు దానశీలుడును పదివేల ఏనుగుల బలమంత బలముగల గొప్పవాడును వార్దక్యము మొదలగు లోపములు లేనివాడును సాక్షాత్‌ రూపొందిన మన్మధుని వంటివాడును; ఐనను ఇతడు ధార్మికుడై ఉండియు తీవ్రమగు జఠారాగ్ని దీప్తి కలవాడగుటచే ఉపవాసముచేయుటకు శక్తిలేనివాడు.

అతని విశ్వాత్ముడును లోకగురుడును అగు వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) అన్ని వ్రతములలో గొప్పదియగు ఈ వ్రతము తెలుపును. ఇది సమస్త యజ్ఞముల ఫలము నిచ్చునది. సర్వపాపరాసుల నశింపజేయునది-అశేష దుఃఖముల శమింపజేయునది-సకల దేవతల పూజలనందుకొనునది. పవిత్రములగు వానిలో పవిత్రమును-శుభములగు వానిలో శుభమగునదియు భవిష్యములగు వానిలో భవిష్యము (ఇంక ముందెంత కాలమువరకైన లోకమున ప్రచారములో నుండునది) పురాతన కాలములగు వానిలో పురాతనమయినది (ఎంతో కాలమునుండి లోకమున ప్రచారమునందున్నది.)

మాఘమానస్య దశమీ యదా శుక్లా భ##వే త్తదా | ఘృతే నాభ్యఞ్జనం కృత్యాతిలైః స్నానం సమాచారేత్‌ 22

తథైవ విష్ణు మభ్యర్చ్య నమో నారాయణతి చ | కృష్ణస్య పాదౌసమ్పూజ్య శిర స్సర్వాత్మనే నః. 23

వైకుణ్ఠాయేతి వై కణ్ఠ ముర శ్ర్శీవత్సధారిణ | శఙ్ఖినే చక్రిణ తద్వ ద్గదినే వరదాయ చ. 24

సర్వం నారాయణసై#్యవం సమ్పూజ్యా77వాహయే త్ర్కమాత్‌ |

దామోదరాయో త్యుదరం మేఢ్రం పఞ్చశరాయ వై. 25

ఊరూ సౌభాగ్యనాధాయ జానునీ భూతధారిణ | నమో7తులాయవై జఙ్ఘే పాదౌ విశ్వసృజే నః. 26

నమో దేవ్యై నమ శ్శాన్త్యై నమో లక్ష్మ్యై నమశ్శ్రియై |

నమః పుష్ట్యై నమ స్తుష్ట్యై నమో ధృత్యై నమో నమః. 27

నమో విహఙ్గనాధాయ వాయువేగాయ పక్షిణ | విషప్రమథనాయేతి గురుడం చాభిపూజయేత్‌. 28

ఏవం సమ్పూజ్య గోవిన్ద ముమాపతివినాయకౌ | గన్దమాల్యై స్తథా ధూపై ర్భక్ష్యై ర్నానావిధై రవి. 29

గవ్యేన పయసా సిద్దాం కృసరా మథ వాగ్యతః | పరిషా సహా భుక్తా తాం గతా శతపదం బుధః. 30

న్యగ్రోధం దస్తకాష్ఠం స్యా దథవా ఖాదిరం బుధః | గృహీత్యా ధావయే ద్దన్తా నాచాన్తః ప్రాగుదఙ్మఖః.

బ్రూయా త్సాయన్తనీం కృత్వా సన్ద్యా మస్తమితే రవౌ |

నమో నారాయణాయోతి త్వామహం శరణం గతః. 32

ఏకాదాశ్యాం నిరాహార స్సమ్య గభ్యర్చ్య కేశవమ్‌ | రాత్రించ సకలాం స్థిత్యా స్నానంచ పయసా తతః.

సర్పిషావాఫి వాహనం హుత్వా బ్రహ్మణపుఙ్గవై ః| సహైవ పుణ్డరీక్షా ద్వాదశ్యాం క్షీరభోజనమ్‌. 34

కరిష్యామి యతాత్మ7హం నిర్వఘ్నం కురు మే ప్రతమ్‌ | ఏ వముక్త్వా స్వ పే ద్బూమా వితిహాసకథాం పునః.

వాసుదేవుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: అన్ని అష్టమీ ద్వాదశీ చతుర్ధవీ తిథులయందును ఇతర ములగు శుభ నక్షత్ర తిథులయందును ఉపవసించి వ్రతము అనుష్టించుటకు శక్తి లేనివడయినచో ఈ పాప ప్రణాశకముమగు మాఘశుక్ల దశ##మ్యేకాదశీ ద్వాదశీ తిథుల యందయిన ఈ చెప్పబోవు విధానము వ్రతము చేసినచో విష్ణస్థానము నందగలవు.

శ్రీ కృష్ణుడు భీమ సేనునకు ఇట్లు చెప్పెను ః (ఈ వ్రతము మూడు నాళ్ళు- మాఘ శుక్ల దశ##మ్యేకాదశీ ద్వాదశీ తిథులయందు-దీక్షతో నుండి చేయవలసినది. అందు మొదటి దశమినాటి కృత్యము) మాఘ శుక్ల దశమినాడు నేతితో అభ్యంజనము చేసికొని నూవుల (పిండి)తో స్నానము చేయవలెను. ఈ చెప్పబోవు మంత్రములతో విష్ణుని పూజించవలయును. మొదట విష్ణని పాదములను పూజించవలయును. పిమ్మట-1, సర్వాత్మనేనమః శిరః పూజయామి; 2. వైకుంఠాయనమః కంఠం పూజయామి; 3. శ్రీవత్సధారిణనమః ఉరః పూజయామి; 4. దామోదరాయనమః ఉదరం పూజయామి; 5. పంచశరాయనమః మేఢ్రం పూజయామి; 6. సౌభాగ్యనాథాయనః ఊరూ పూజయామి; 7. భూత ధారిణనః జానునీ పూజయామి; 8. అతులాయనమః జంఘే పూజయామి 9. విశ్వసృజేనమః పాదౌ పూజయామి.

ఈ మంత్రములతో నారాయణుని ప్రతియొక అవయవమును పూజించవలెను. ఈ పూజకు ముందుగా శంఖినే నమః చక్రిణనమః వరదాయనమః-ఇత్యాది మంత్రములతో విష్ణుని అవాహనము చేయవలెను.

శ్రీదైవ్యైనమః-శాంతైన్యమః లక్ష్య్మైనమః-శ్రియైనమః-తుష్ట్యైనమం-ధృత్యైనమః - ఇత్యాది మంత్రములతో లక్ష్మిని పూజించవలెను.

విహంగనాధాయనమః- వాయువేగాయనమః-పక్షిణనమః- విషప్రమథనాయనమః -ఇత్యాది మంత్రములతో గరుడుని పూజించవలెను.

ఇట్లు గోవిందుని (లక్ష్మిని-గరుడుని) శివుని వినాయకుని నానావిధ గంధమాల్య ధూపదీప భక్ష్యములతో పూజించవలయును. ఆవుపాలతో వండిన పులగమును నేతితో మౌనముగా భుజించవలెను. నూరడుగులు నడువవలెను. సాయంకాలము కాగానే మర్రి ఊడను కాని చండ్రపుల్లను కాని ఉపయోగించి దంతధావనము చేసి తూర్పుగానో ఉత్తరముగానో తిరిగి కూర్చుండి ఆచమించవలెను. పిమ్మట సూర్యాస్తమయము కాగానే సాయం సంధ్యను ఉపాసించ వలయును. నమో నారాయణాయ-అహంత్వాం శరణంగతః-(నేను నిన్ను శరణు చొచ్చుచున్నాను.) అని ప్రార్థించి భూమిపై నిద్రించవలెను.

(ఏకాదశీ దినకృత్యము) ఏకాదశినాడు నిరాహారడై యుండి లెస్సగా కేశపుని అభ్యర్చించవలెను. (పిమ్మట విష్ణుని ఇట్లు ప్రార్థించవలెను.) '' నేను ఈ రాత్రియంతయు గడపి (రేపుదయము) స్నానమాడుదును. పాలతోగాని నేతితో గాని (నిన్నుద్దేశించి) హోమము చేయుదును. బ్రాహ్మణులతో కూడ క్షీరముతో భోజనము చేయుదును. ఇట్లు నియత మనస్కుడనై నీ వత్రము చేయుదును. ఆ వ్రతమును నిర్విఘ్నము చేయుము.'' అని ఇట్లు ప్రార్థించి కడపట ఇతి హాస కధను విని భుమిపై పరుండవలెను.

శ్రుత్వా ప్రభాతే సఞతే నదీం గత్వా విశాం పతేl స్నానంకృత్వా మృదా తద్వ త్పాషణ్డనపి వర్జయేత్‌.

ఉపాస్య సన్ధ్యాం విధివ త్కృత్వాచ పితృతర్పణమ్‌ l

ప్రణమ్యచ హృషీకేశ మమలం చార్క మీశ్వరమ్‌. 37

గృహస్య పురత శ్శక్త్యా మణ్డపం కారయే ద్బుధః l దశహస్త మథాఎ్టౌవా తత్ర కుర్యా ద్విశాం పతే. 38

చతుర్హస్తాం శుభాం కుర్యా ద్వేదీ మరినిషూదనl చతుర్హస్తప్రమాణంచ విన్యసే త్తత్ర తోరణమ్‌. 39

ప్రలమ్బ్య కలశం తత్ర మాషమాత్రేణ సంయుతమ్‌l ఛిద్రేణ జలసమ్పూర్ణ మధః కృష్ణాజినే స్థితః 40

తస్య ధారాం చ శిరసా ధారమే త్సకలాం నిశామ్‌l ధారభి ర్బహుభి ర్భురి ఫలం వేదవిదో విదుః. 41

యస్మా త్తస్మా త్కురుశ్రేష్ఠ ధారా ధార్యాస్తు శక్తితః l తథైవ విష్ణో శ్శిరసి క్షీరధాంపాం ప్రదాపయేత్‌ . 42

అరత్ని మాత్రం కుణ్డంచ కృత్వా తత్తు త్రిమేఖలమ్‌l

యోనిచక్రంతు తత్కృత్వా బ్రాహ్మణౖ ర్యవసర్పిషీ. 43

తిలాశ్చ విష్ణుదైవత్యై ర్మన్త్రై రేకాగ్నివ త్తథా l కృత్వాచ వైష్ణవం సవ్యు క్చరుం పగోక్షీరసంయుతమ్‌. 44

మాషమాత్ర ప్రమాణంతు ధారా మజ్యస్య పాతయేత్‌ l జలకుమ్భా న్మహావీర స్థాపయిత్వా త్రుయోదశ.

భ##క్ష్యై ర్నానావిథై ర్యుక్తాన్త్సితవసై#్త్ర రలజ్కృతా&l

యుక్తా నౌదుమ్బరైః పత్రైః పఞ్చరత్న సమన్వితా&. 46

చతుర్భి ర్బహ్వృచై ర్హోమ స్తత్ర కార్యో హ్యదజ్ముఖైః l రుద్రజాప శ్చతుర్భిశ్చ యజుర్వేదపరాయణౖః.

వైష్ణవానిచ సామాని చతుర స్సామవేదినః l అరిష్టవర్గసహితా నభితః పరిపాఠయేత్‌ 48

(ద్వాదశీ దిన కృత్యము) ద్వాదశినాడు ఉదయమున నదికిపోయి మృత్తికతో స్నానముచేసి వేదబాహ్యుల నెవరిని చూడక తాకక వారితో మాటలాడక సంధ్యావందనమును పితృ తర్పణమును చేయవలెను. నారాయణుని సూర్యుని ఈశ్వరుని నమస్కరించవలెను. ఇంటిముందు యథా శక్తిగ మంటపమును (పందిరిని) ఎనిమిది మూరలు కాని పది మూరలు కాని భుజముండునట్లు చతురస్రముగా నిర్మించిదాని నడుమ నాలుగు మూరల కొలతతో చతురస్రా కారపు చక్కని వేదిక (అరుగు) నిర్మించవలెను. అంతే కొలతగల తోరణమును కూడ దానిపై చుట్టును కట్టవలయును. ఆ వేదిక నడుమ పైనుండి వ్రేలాడునట్లు జలపూర్ణమై మినుప గింజంత రంధ్రముకల కడవను వ్రేలాడదీయవలయును. దానినుండి పడు ఉదకధారను రాత్రియంతయు యజమానుడు కృష్ణాజినముపై కూర్చండి తన తలపై పడునట్లు చేసికొనవలెను. ఇట్లు అనేక జలధారలు పడుటచే విస్తారమగు ఫలము కలుగునని వేదవేత్తలు చెప్పుదురు. అట్లే వ్రతదినమున విష్ణుని శిరముపై ఈ కలశము నుండి గోక్షీరధారపడునట్లు చేయవలెను.

పిడిమూర కొలతతో చతురస్రపు కుండమును దానిచుట్టును మూడు మేఖలలను (అంచులను) చేయవలెను. దాని ముందు యోనిచక్రమును ఏర్పరచవలయును. బ్రాహ్మణులు విష్ణు దైవత్యములగు మంత్రములతో ఏకాగ్ని విధానమున విష్ణుని ఉద్దేశించి ఆజ్యాహుతులను వేయవలయును. హోమమునకు యవలు నేయి తిలలు ఆవుపాలతో నేతితో వండిన చరువును ఉపయోగించవలయును. ఆహుతులు మినుప గింజంత పరిమాణముతో ఉండవలయును. హోమస్థానము నందు పదుమూడు జలకలశములను నిలుపవలయును. వాటిపై నానా విధములు భక్ష్యముల నుంచవలయును. పంచరత్నములతో మేడి చిగురాకులతో తెల్లని క్రొత్త వస్త్రములతో వాటినలంకరించవలయును. నలుగుంచు ఋగ్వేదీయులు ఉత్తరముఖులై కూర్చుండి హోమము చేయవలయును. నలుగురు యజుర్వేదీయులు రుద్రమంత్ర జపము చేయవలయును. నలుగురు సామవేదులు విష్ణుదేవతాక సామమంత్రములు పఠించుచుండవలయును. వీరందరు శుభ లక్షణములు శుభ వస్త్రధారణము కలిగి శుభద్రవ్యములు దగ్గరనుంచుకొని యుండవలయను.

ఏవం ద్వాదశ తా న్విప్రాన్వస్త్రమాల్యానులేపనైఃl పూజయే దజ్గుళీయైశ్చ కటకై ర్హేమభుషణౖః. 49

వాసోభి శ్శయనీయైశ్చ విత్తశాఠ్యవివర్జతఃl ఏవం క్షపా7తినేయా చ గీతమజ్గుళనిస్స్వనైః. 50

ఉపాధ్యాయస్య చ తతో ద్విగుణం సర్వమేవ తత్‌ l తతః ప్రభాతే విమతే సముద్థాంచు త్రయోదశ. 51

గావో దద్యా త్కురుశ్రేష్ఠ సౌవర్ణశృజ్గసంయుతాః l పయస్విన్య శ్శీలవత్సః కాంస్యదోహసమన్వితాః. 52

రౌప్యఖురా స్సవస్త్రాశ్చ చన్దనే నాభిషేచితాఃl తాశ్చ తేషాం తతో దద్యా ద్భక్ష్యభోజ్యసమన్వితా&. 53

కృత్వాచ బ్రాహ్మణా న్త్సర్యా న్భక్త్యా పరమయా యుతః l భుక్త్వా చాక్షారలవణ మాత్మనా చ విసర్జయేత్‌.

అనుగమ్య పదాన్యష్టౌ పుత్త్రభార్యాసమన్వితః l ప్రీయతామత్ర దేవేశః కేశవః క్లేశనాశనః. 55

శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః l

యథా7న్తరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి. 56

ఏవ ముచ్చార్య తా న్కుమ్భా న్గావశ్చ శయనానిచ l

వాసాంసిచైవ సర్వేషాం గృహాణి ప్రాపయే ద్బుభః . 57

అభావే బహుశయ్యానా మేకామపి సుసంస్కృతామ్‌ l

శయ్యాం దద్యా ద్ద్విజాతీనాం సర్వోపస్కరసంయుతామ్‌. 58

ఇతిహాసపురాణాని వాచయిత్వా7తివాహయేత్‌l తద్దినం ద్విజశార్దూల య ఇచ్ఛే ద్విపులాం శ్రియయ్‌. 59

ఇట్లు పూజా-జప-హోమ-ప్రక్రియ ముగిసిన తరువాత వస్త్ర-మాల్య- గంధానులేపనములతోను స్వర్ణాంగుళీయ-కటక-హేమభూషణములతోను మంచములతో పడకలతోను శక్తికి లోపము రానీయక ఆ పండ్రెండు మంది విప్రులను పూజించవలెను. ఆచార్యునకు మాత్రము ఋత్విక్కులలో ఒక్కొక్కరికి ఇచ్చిన దానికి రెట్టింపు దక్షిణాదికము ఈయవలెను.

తరువాత ఆ రాత్రి గీత వాద్యవినోదములతో గడుపవలెను. తెల్లవారిన తరువాత (త్రయోదశినాడుదయమున) ఈ పదుముగ్గురకును( గాని మరి పదుముగ్గురు బ్రాహ్మణులకుగాని) పదుమూడు పాడియాపులను దాన మీయవలెను. అవి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచుపాత్రలు నూతన వస్త్రపు కప్పడములు కలవై పోడువక తప్పిపోక మంచి స్వభావము కలవై యుండవలెను. వాటిని చందనముతో అభిషేకించి దానము ఈయవలెను. పిమ్మట వారిని భక్ష్యబోజ్య సమన్వితముగా భుజింపజేసి తానును ఉప్పు పులుపు కారములేని యాహారము భుజించి వారిని వీడ్కొని తన భార్యాపుత్త్రలతో కూడ ఎనిమిది అడుగులు కూడవెళ్లి వారిని సాగనంపవలయను. ''క్లేశముల నశింపజేయువాడును దేవేశుడు నగు కేశవుడు నేను జేసిన ఈ వ్రతముచే ప్రీతి నొందుగాక!'' శివుని హృదయ(తత్త్వ)ము విష్ణువు-విష్ణుని హృదయ(తత్త్వ)ము శివుడు; ఇట్లు నా రిరువుర నడము నేను అభేదమును భావన చేయుచున్నాను. కావున నాకు శుభమగు ఆయువును శుభములును కలుగుగాక!'' అని పలుకుచు ఆకుంభములను గోవులను శయనీయములను వస్త్రవఋలను ఆయా బ్రాహ్మణులు ఇండ్లకు పంపవలయను. శక్తిలేని యజమానుడు అరదరకును (బ్రాహ్మణులకు) కలిసి ఒకే శయ్యనైన సామగ్రులతో అలంకరించిన దానిని ఈయవలెను.

ఆ దినము అంతయు ఇతిహాస పురాణ కథాశ్రవణములతో గడుపవలయును. ఇట్లు చేసినచో విపులమగు సంపత్‌ భాగ్యములు కలుగును.

తస్మా త్సత్త్వం సమాలమ్బ్య భీమసేన విమత్సరః l

కురువ్రత మిదం సమ్యక్సేహా ద్గుహ్యం మయేరితమ్‌. 60

త్వయా కృత మిదం వీర త్వన్నామాజ్కం భవిష్యతిl సా భీమద్వాదశీ హ్యేషా సర్వపాపప్రణాశనీ. 61

యా తు కల్యాణినీ నామ పురాకల్పేషు పఠ్యతేl

త్వ మాదికర్తా భవ సౌకరే7స్మి న్కల్పే మహావీరవర ప్రదానే. 62

యస్మా త్మ్సర న్కీర్తన మప్యశేషం వినష్టపాప స్త్రిదశాధిప స్స్యాత్‌ l

కృత్వాచ యా మప్సరసా మధీశా వేశ్యా కృతా హ్యన్యభవాన్తరేషు. 63

ఆభీరకన్యాతు కుతూహలేన సైవోర్వశీ సమ్ర్పతి నాకపృష్ఠే l

జాతా7థ సా వైశ్యకులోద్భవాపి పులోమకన్యా పురుహూతపత్నీ. 64

తత్రాపి తస్యాః పరిచారికేయం మమ ప్రియా సమ్ర్పతి సత్యభామా l

స్నాతః పురా మణ్డల మేష తద్వ త్తేజోమయం వేదశరీరమాప. 65

అస్యాంచ కల్యాణతిథౌ వివస్వా న్త్స హస్రధారేణ సహస్రరశ్మిః l

ఇదవేవ కృతం మహేన్ద్రముఖ్యైర్వసుభిర్దేవసురారికోటిభిశ్చ. 66

ఫలమస్య న శక్యతే7భివక్తుం యది జిహ్వాయుతకోటయో ముఖే స్యుః l

కలికలుషవిదారిణి మనన్తా మితి కథయిష్యతి యాదవేన్ద్ర సూనుః. 67

అపి నరకగతా న్పితౄ నశేషా నల ముద్ధర్తు మిహైవ యః కరోతిl

య ఇద మనుశృణోతి చాతిభక్త్యా పరిపఠతీహ పరోపకారహేతోః 68

తిథి మిహ సకలార్థదాం నరేన్ద్ర స్సచ చతురాననసామ్యణా ముపైతి l

కల్యాణినీ నామ పురా7బ్జగర్బా ద్యా ద్వాదశీ మాఘదినే7భిపూజ్యా. 69

సాపాండుపుత్త్రేణకృతా భవిష్య త్యనన్తపుణ్యా7నఘభీమపూర్వా. 69u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే కల్యాణభీమద్వాదశీ వ్రత కథనం నామైకోనసప్తతితమో7ధ్యాయః.

కావున భీమసేనా! నీవు మత్సరములేక (ఇతరలతో పోటీ చేయు తలంపులేక) సత్త్వగుణము నవలంబించి లెస్సగా ఈ వ్రతము నాచరింపుము. ఈ వ్రత మతి రహస్యమయినను నీ యందలి స్నేహముచే నేను నీ కిది తెలిపితిని. నీవు దీన ననుష్ఠించుటచేత సర్వపాప ప్రణాశనమగు ఈ వత్రమునకు భీమ ద్వాదశీ వ్రతమును పేరు ప్రసిద్ధ మగును. పూర్వ కల్పములందు కల్యాణినీ వ్రతమని ప్రసిద్ధమయి ఇష్టవరప్రదమగు దీనికి నీవు ఈ వారాహ కల్పమున ఆదికర్తవు (మొదట చేసినవాడవు) కావలయును. ఏలయన ఈ వ్రతకల్పము అంతయు కీర్తంచినను స్మరించినను%ు అతడు కూడ దేవేంద్రుడగును. కుతూహలముతో (దీనిని చేసినచో ఏ ఫలము కలుగునో చూతమని) ఒకానొక అభీర (అహీరులను గొపాలకుల) కన్య జన్మాంతరమునందు ఈ వ్రతముచే దేవవేశ్యలలో శ్రేష్ఠయగు ఊర్వశి యయ్యెను. ఆ జన్మమున ఆమెకు పరిచారికగా నున్న యామె ఇపుడు నా భర్య సత్యభామగా నైనది. పూర్వము రం శుభ తిథియందు సహస్ర రంధ్రములుకల కలశపు జలధారలతో స్నాన మాడిన పుణ్యపు ప్రభావమున సూర్యుడు వేదాత్మక శరీరరూపమగు తేజో మయ మండలమును పొందగలిగెను.

ఇపుడు మహేంద్రుడుగా వసువులుగా గణదేవతలుగా దేవకోటులుగా రాక్షస శ్రేష్ఠులుగా నున్నవారు కూడ ఒకప్పుడు ఈ వ్రతము నాచరించివారే.

నోటియందు పదివేల కోటుల నాలుకలున్నను దీని మహిమము చెప్పుట సాధ్యము కాదు. ఇది కలికలుష నాశకము. అనంత పుణ్యప్రదము. అని ఇట్లు శ్రీకృష్ణుడు భీమసేనునకు చెప్పును.

దీని నాచరించినవారు తమ పితరులను అందరను నరకమునుండి ఉద్ధరించినవా రగుదురు. సకలార్థప్రదమగు ఈ ద్వాదశీ వ్రత మహిమమును వివినవాడును చదివి ఇతరులరు పరోపకారబుద్ధితో వినిపించినవాడును బ్రహ్మత్వమును పొందును.

పూర్వకల్పములందు కల్యాణినీ ద్వాదశీ వ్రతమను పేర బ్రహ్మదేవునిచే లోకమున ప్రవర్తల్ల చేయబడిన ఈ వ్రతము వాసుదేవుని ఉపదేశముచే భీమసేనునిచేత చేయబడి అనంత పుణ్యప్రదమయి భీమ ద్వాదశీ వ్రతమని ప్రసిద్ధమగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున కల్యాణినీ భీమ ద్వాదశీ వ్రత కథనమను అరువతి తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters