Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తషష్టిత మో 7 ధ్యాయః.

గ్రహణస్నానవిధిః.

మనుః. 

చన్ద్రాదిత్యోపరాగేషు య త్స్నాన మభిధీయతే| తదహం శ్రోతు మిచ్చామి ద్రవ్యమస్త్రవిధానతః. 1

శ్రీమత్స్యః యస్య రాశిం సమాక్రమ్య భ##వేద్గ్రహణ « సమ్భవః|

తత్ర స్నానం ప్రవక్ష్యామి మన్త్రౌషధివిధానతః. 2

చన్ద్రోపరాగే సమ్ప్రాప్తే కృత్వా బ్రాహ్మణవాచనమ్‌ |

సమ్పూజ్య చతురో విప్రా ఞ్చక్ల మాల్యానులేపనైః. 3

పూర్వమేవోపరాగస్య సమాసా ధ్యౌషధీగణమ్‌ | స్థాపయే చ్చతురః కుమ్భా సవ్రణా న్త్సాగరానివ. 4

రథశ్వగజవల్మీక సఙ్గమహ్రద గోకులాత్‌ | రాజద్వార ప్రదేశాచ్చ మృద మానీయ నిక్షిపేత్‌. 5

పఞ్చగవ్యంచ కుమ్భేషు శుద్దముక్తాఫలాని చ | రోచనాం పద్మశఙ్ఖౌచ పఞ్చరత్న సమన్వితౌ. 6

స్ఫటికం చన్దనం శ్వేతం తీర్థవారి ససర్షపమ్‌ | గజదన్తం సకుముదం తథైవోశీరగుగ్గులు. 7

ఏతత్సర్యం వినిక్షిప్య కుమ్భే ష్వావాహయే త్సురా & |

అరువది ఏడవ అధ్యాయము.

గ్రహణ స్నాన విధి.

మనువు మత్స్య నారాయణునిట్లు ప్రార్థించెను. చంద్ర సూర్యగ్రహణములు సంభవించినపుడు స్నానము చేయవలయునని శాస్త్రము విధించుచున్నది కదా: దాని విధానమును అందు వినియోగించవసిన ద్రవ్యములను మంత్రములను

_______________________________________

«సవ్ల్పువః.

మీనుండి వినగోరుచున్నాను. అనగా నారాయణుడ తనకి ఇట్లు తెలిపెను:

ఏ రాశియందు గ్రహణము సంభవించునో ఆ రాశి నందు చేయవలసి స్నానపు విధానమును మంత్రములను ద్రవ్యములను తెలిపెదను; వినుము చంద్ర సూర్యగ్రహణములు జరుగబోవుచున్నవి అనగా ముందుగానే బ్రాహ్మణులచే స్వస్తి వాచనమును జరిపించుకొనవలయును. నలుగురు బ్రాహ్మణులను లెస్సగా శుక్ల వస్త్రములతో శుక్ల గంధ ద్రవ్యములతో పూజించవలయును. గ్రహణమునకు ముందుగానే దర్భాదికమగు ఓషదులను సంపాదించుకొనవలయును. రంధ్రములు లేని నాలుగు కడవలను నాలుగు సముద్రములను వలె నాలుగుచోట్ల వేరువేరుగా నిలుపవలెను. రథములు అశ్వముల గజములు గోవులు నిలుచు తావులనుండియు పుట్టలు నదీ ద్వయ సంగమ-నదీ సాగర సంగమ ప్రదేశముల నుండియు పెద్ద హ్రదములనుండియు రాజద్వర ప్రదేశములనుండియు మట్టిని తెచ్చి వాటియందు వేయవలెను. పంచ గవ్యములను మంచి మత్తెములను గోరోచనమును పద్మములను శంఖములను పంచరత్నములను స్పటికమును తెల్ల చందనమును తీర్థజలములను తెల్ల ఆవాలను ఏనుగ దంతమును కలువపూలను వట్టివేళ్ళను గుగ్గిలమును కూడా వానియందు వేయవలయును. పిమ్మట ఈ మంత్రములతో ఆయా దేవతలను ఆ నాలుగు కడవలలోనికి అవాహనము చేయవలయును. (వచ్చి వాటియందు నిలువవలసినదిగా పిలువవలయును.)

సర్వేసము ద్రాస్సరిత స్తీర్థాని జలదా సదాః. 8

ఆయాన్తు యజమానన్య దురితక్షయకారకాః | యో7సౌ వజ్రధరో దేవ అదిత్యానాం ప్రభుర్మతః. 9

సహస్రనయన శ్చేన్ద్రో గ్రహపీడాం వ్యపోహతు | ముఖం య స్సర్వదేవానాం సప్తార్చి రమితద్యుతిః. 10

చన్ద్రోపరాగ « సమ్భూతాం గ్రహపీడాం వ్యపోహతు | యః కర్మసాక్షి భూతానాం ధర్మో మహిషవాహన ః.

యమ శ్చన్ద్రో పరాగోత్థపీడాం మత్ర వ్యపోహతు | రక్షోగణాధిప స్సాక్షా త్ర్పళయానలసన్నిభః. 12

ఖడ్గహస్తో 7తిభిశ్చ«గ్రహపీడాం వ్యపోహతు | ఖడ్గపాశధరో దేవస్సదా మకరవాహనః. 13

సజలాధిపతి శ్చన్ద్రగ్రహపీడాం వ్యపోహతు | ప్రాణరూపేణ యో లోకా న్పాతి కృష్ణమృగ ప్రియః. 14

వాయు శ్చన్ద్రోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు | యో7సౌ నిధిపతి ర్దేవః ఖడ్గశూలగదా ధరః. 15

చన్ద్రోపరాగసమ్భూతాం గ్రహపీడాం వ్యపోహతు | యో7సావిన్దుధరో దేవః పినాకీ వృషవాహనః. 16

చన్ద్రోపరాగపాపాని శీఘ్రం నాశయ శంకర | త్రైలోక్యే యాని భూతాని స్థావరాణి చరాణి చ. 17

బ్రహ్మవిష్ణ్వర్కయుక్తాని తాని పాపం హరన్తు మే |

అన్ని సముద్రములను నదులును తీర్థములును మేఘములును నదములను ఈ యజమానునకు దురితమును నశింపజేయుటకై ఈ కలశములలోనికి వచ్చుగాక: వజ్రధరుడు ఆదిత్యులకు ప్రభువు సహస్రనయనుడు అగు ఇంద్రుడు గ్రహపీడను పోగొట్టుగాక: సర్వ దేవతలకు ముఖము వంటివాడు అమిత ప్రకాశము కలవాడు అగు అగ్ని చంద్ర గ్రహణమువలన కలిగిన పీడను పోగొట్టుగాక : ప్రాణుల కర్మలకు సాక్షి మహిష వాహనుడు ధర్మదేవుడు అగు యముడు చంద్రగ్రహణము వలన కలిగిన పీడను తొలగించుగాక: రాక్షస గణాధిపతియు సాక్షాత్‌ ప్రళయాగ్ని వంటి వారు ఖడ్గహస్తుడు అతి భయంకరుడు అగు నిరృతి గ్రహ బాధను తొలగించుకాగ: ఖడ్గ పాశధరుడు మకర వాహనుడు జలాధిపతియగు వరుణుడు చంద్రగ్రహణ గ్రహపీడను తొలగించుగాక: ప్రాణరూపుడై యుండి లోకములను రక్షించు వాడు కృష్ణమృగము (నల్లని లేడి)యందు ప్రీతి కలవాడునగు వాయువు చంద్రగ్రహణముచే కలిగిన గ్రహపీడను పోగొట్టుగాక : నిధిపతియు ఖడ్గశూల గదాధరుడునగు కుబేరుడు చంద్రగ్రహణము వలన కలిగిన గ్రహపీడను పోగొట్టుగాక: చంద్రధరుడు పినాకధారి వృషభ వాహనుడు అగు శంకరుడు చంద్రగ్రహణ పాదముల నశింపజేయుగాక: త్రిలోకముల యందున్న స్థిరచర భూతములు బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరును గ్రహణ పాదములను పోగొట్టుగాక:

_________________________________________________________

«సమ్భూతామగ్ని పీడాం « రక్షఃపీడాం

ఏవ మామన్త్రితైః కుమ్భై రభిషిక్తో గుణాన్వితై ః. 18

ఋగ్యజుస్సామమన్రైశ్చ శుక్లమాల్యానులేపనైః | పూజయే ద్వస్త్రగోదానై ర్ర్బాహ్మణా నిష్టదేవతాః. 19

ఏతానేవ తతో మన్త్రా నాలి ఖ్య కరకాన్వితా 7 | స్థాపయేయుశ్చ తైఃకుమ్భై ర్యజమానం ద్విజోత్తమాః. 20

వస్త్రఖణ్డ 7 థవా పట్టే హేమరత్న సమన్వితా & | యజమానస్య శిరసి నిదధ్యు స్తే ద్విఓత్తమాః. 21

తతో7తివాహయే ద్వేలా ముపరాగానుగామినీమ్‌ | ప్రాఙ్ముఖః పూజయిత్వా తు నమస్య న్నిష్టదేవతాః. 22

చన్ద్రగ్రమే వినిర్వృతై కృతగోదానమఙ్గళః | కృతస్నానాయ తద్వస్త్రం బ్రాహ్మణాయ నివేదయేత్‌. 23

అనేన విధినా యస్తు గ్రహణ స్నాన మాచరేత్‌ | న తస్య గ్రహపీడా స్యా స్న చ బన్దునక్షయః. 24

పరమాం ¡ శుద్ది మాప్నోతి క్షేమ మారోగ్య ముత్తమమ్‌ |

సూర్యగ్రహే సూర్యనామ సదా మన్త్రేషు కీర్తయేత్‌. 25

అధికం పద్మరాగంచ కపిలాంచ సుశోభనామ్‌ | ప్రయచ్ఛే ద్విత్తసమ్పన్న శ్చన్ద్రసూర్యోపరాగయోః. 26

య ఇదం శృణుయా న్నిత్యం శ్రావయేద్వా సమాహితః | సర్వపాపవినిర్ముక్త శ్శివలోకే మహీయతే. 27

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే చన్ద్రసూర్యోప

రాగస్నానవిధికథనం నామ సప్తషష్టితమో7ధ్యాయః.

ఈ విధముగా పూర్ణముగా మంత్రింపబడిన సర్వగుణ సమన్వితములగు కుంభములలోను ఋగ్యజుస్సామ మంత్రములతోను స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని పూవులతోను తెల్లని సుగంధములతోను వస్త్రదాన గోధానములతోను బ్రాహ్మణులను ఇష్టదేవతలను పూజించవలయును.

తరువాత ఈ మంత్రములనే(పత్రములపై)వ్రాసి కరక (గరిగ) యందుంచి వాటితోపాటు బంగారును రత్నములను చేర్చి యజమానుని వస్త్ర ఖండమునందు కాని పట్టముమీద (జంపకానావంటి దానిమీద) కాని ఆకడవలతో కూడా యజమానుని కూర్చుండ పెట్టుదురు. తరువాత ఆ మంత్రలేఖనములతో కూడిన గరిగను యజమానుని తలమీద ఉంచుదురు.

తరువాత యజమానుడు ప్రాజ్ముఖుడై దేవతలను పూజించి నమస్కరించుచు చంద్రగ్రహణ కాలమునంతటిని గడవును.

చంద్రగ్రహణము విడిచిన తరువాత గోదానము అనెడు శుభమును (కేశఖండనమును) జరిపించుకొనవలెను. స్నానము చేసియున్న బ్రాహ్మణునకు తానంతవరకు కూర్చుండి యున్న వస్త్రమును ఈయవలెను.

ఈ విధానము ననుసరించి గ్రహణ స్నానము చేసిన వానికి గ్రహపీడ కలుగదు. వాని బంధుజనులకును కీడుకలుగును. ఉత్తమ శుద్దిని ఉత్తమమగు క్షేమారోగ్యములను పొందును.

సూర్య గ్రహణమునందు ఎల్లప్పుడును మంత్రములతోపాటు సూర్య నామములను కీర్తించవలెను. చంద్రసూర్యోపరాగ(గ్రహణ)ములందు పద్మరాగమును ప్రశస్తమగు కపిలగోవును కూడ విత్త సంపన్నుడైనచో దానము చేయవచ్చును.

దీనిని చదవినను వినినను సర్వపాప విముక్తుడై శివలోకమునందు సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్ర సూర్యగ్రహణ స్నానవిధి కథనము

అను ఆరువది ఏడవ అధ్యాయము.

______________________________________________

¡ సిద్ధిమాప్నోతిపునరావృత్తిదుర్లభామ్‌

Sri Matsya Mahapuranam-1    Chapters