Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్షష్టితమో7ద్యాయః

సారస్వతవ్రతమ్‌.

మనుః : అధునా భారతీ కేన వ్రతేన మధుసూదన | తథైవ జ్ఞానసౌభాగ్యమతి విద్యాసుకౌశలమ్‌. 1

అభేదశ్చాపి దమ్పత్యో స్తథా బన్ధుజనస్య చ | ఆయుష్యం విపులం పుంసాం తన్మే కథయ మాధవ. 2

శ్రీమత్స్యః : సమ్య క్పృష్ఠం త్వయా రాజ ఞ్ఛృణు సారస్వతం వ్రతమ్‌ |

యస్య సజ్కీ ర్తనాదేవ సా తుష్యతి సరస్వతీ. 3

యో యద్భక్తః పుమా న్కుర్యా దేతద్ర్వత మనుత్తమమ్‌| తద్వాసరాదౌ సమ్పూజ్య విధానేన సమారబేత్‌.

అథవా77దిత్యవారేణ గ్రహతారాబలేన చ | పాయసం భోజయే ద్విప్రా స్కృత్వా బ్రాహ్మణవాచనమ్‌. 5

శుక్లవస్త్రాణి దత్వాతు సహిరణ్యాని శక్తిత ః | గాయత్రీం పూజయే ద్భక్త్యా శుక్లమాల్యానులేపనైః. 6

యథా స దేవి భగవా స్ర్భహ్మాలోకపితామహః | త్వాం పరిత్యజ్య సన్తిష్ఠే త్తస్మా ద్భవ వరప్రదా. 7

వేదశాస్త్రాణి సర్వాణి నృత్తగీతాదికం చ యత్‌ | త్వదధీనం యథా దేవి తథా మే సన్తు సిద్ధయః. 8

లక్ష్మీర్మేధా వరా పుష్టి ర్గౌరీ తుష్టి ః ప్రభా మతిః | ఏతాభిః పాహి చాష్టాభి స్తనుభి ర్మాం సరస్వతి. 9

ఆరువది ఆరవ అధ్యాయము.

సారస్వత వ్రతము

మనువు మత్స్య నారాయణునితో ఇట్లనెను: సరస్వతికి సంబంధించిన ఏవ్రతముచేత జ్ఞానము సౌభాగ్యము విద్యలయందు అత్యంత కౌశలము దంపతుల నడుమను బంధుజనములోను అభేద భావము విపులమగు ఆయుష్యము లభించునో దానిని నాకు తెలుపుము. అని ఇట్లడుగగా నారాయణుడిట్లనెను : రాజా: నీవు చక్కగా అడిగితివి. సారస్వత వ్రతమును తెలిపెదను. దీనిని కీర్తించినంత మాత్రముననే సరస్వతి సంతుష్ఠయగును.

ఈ వ్రతమును చేయదలచిన భక్తుడు ఆ దినారంభమున యథా శాస్త్ర విధానమున ఆరంభించి పూజ చేయవలయును. లేదా ఆదిత్యావారమున గ్రహ తారాబల యుక్తదినమున బ్రాహ్మణులచే పాయసమును భుజింపజేసి వారిచేత స్వస్తి పుణ్యాహవాచనము జరిపించెను. వారికి తెల్లని వస్త్రములను బంగారును ఈయవలెను. తరువాత భక్తితో తెల్లని పూవులతో సుగంధపు పూతలతో గాయత్రిని పూజించవలెను.

''దేవీ : లోకపితామహుడు భగవానుడు అగు బ్రహ్మ సదా నిన్ను విచియుండడు. అట్టి నీవు నాకు వర ప్రదురాలవుకమ్ము. సర్వ వేదశాస్త్రములును నృత్తగీతాది విద్యలును నీ అధీనములు. అట్టి నీకృపవలన నాకును వాటి యందు సిద్దులు కలుగుగాక : సరస్వతీ : లక్ష్మీ - మేధా- పరా (వాక్తత్వము) పుష్ఠి -గౌరి-తుష్టి-ప్రభా-మతి- అను ఈ ఎనిమిది శరీరములతో కూడిన నీవు నన్నురక్షించుము.'' అని దేవిని ప్రార్థించవలయును.

ఏవం సమ్పూజ్య గాయత్రీం వీణాక్షమణిధారిణిమ్‌ | శుక్లపుష్పాక్షతై ర్భక్త్యా సకమణ్డలుపుస్తకమ్‌. 10

మౌనవ్రతేన భుఞ్ఞీత సాయం ప్రాతశ్చ ధర్మవిత్‌ | పఞ్చమ్యాం ప్రతిపక్షంచ పూజయేచ్చ సువాసినీమ్‌. 11

తథైవ తణ్డులప్రస్థం ఘృతపాత్రేణ సంయుతమ్‌ | క్షీరం దద్యా ద్దిరణ్యంచ గాయత్రీ ప్రీయతా మితి. 12

సన్ద్యాయాంచ తథా మౌన మేత త్కుర్వ స్త్సమాచరేత్‌|

నాస్తరా భోజనం కుర్వా ద్యావ న్మాసా స్త్రయోదశ. 13

సమాప్తేతు వ్రతే దద్యా ద్భాజనం శుక్లతణ్డులైః | పూర్ణం సవస్త్రయుగ్మంచ గాంచ విప్రాయ శోభనమ్‌. 14

దేవ్యా వితానఖణ్డంచ సితనేత్రపటావృతామ్‌ | చన్దనం వస్త్రయుగ్మం చ దద్యన్నకరకం పునః. 15

తతోపదేష్టారమపి భక్త్యా సమ్పూజయే ద్గురుమ్‌ | విత్తశాఠ్యేన రహితో వస్త్రమాల్యానులేపనైః. 16

అనేన విధినా యస్తు కుర్యా త్సారస్వతం ప్రతమ్‌ | విద్యావా సర్థసంయుక్తో రక్త కణ్ఠశ్చ జాయతే. 17

సరస్వత్యాః ప్రసాదేన బ్రహ్మలోకే మహీయతే | నారీవా కురుతే యాతు సాపి తత్ఫలభాగినీ. 18

బ్రహ్మలోకే వసే ద్రాజ న్యావత్కల్పాయుతత్రయమ్‌ |

సారస్వతం వ్రతం యస్తు శృణుయా దపి యః పఠేత్‌. 19

విద్యాధరపురే సో7పి వసే త్కల్పాయుతత్రయమ్‌ |

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే సారస్వత

వ్రతకథనం నామ షట్షష్టిత మో7ధ్యాయః.

వీణాక్షమాలా కమండలా పుస్తకధారిణియగు గాయత్రిని తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో పూజించవలెను. సంప్రదాయ ధర్మమునుఎరిగి యజమానుడు ప్రతిపక్షమున పంచమినాడు సాయం ప్రాతఃకాలములందు దేవిని పూజించి సువాసినిని పూజించి మౌన వ్రతము పాటించి (హవిష్యమును) భుజించవలయును. కుంచెడు బియ్యమును ఘృతపాత్రమును పాలను బంగారమును ఆ ముత్తైదువకు ''గాయత్రీ ప్రీయతామ్‌'' అను మంత్రముతో దానమీయవలెను. ఈ వ్రత దినమునందు సంధ్యా కాలమునందు మౌనవ్రతమును పాటించవలయును. ఇట్లు పదుమూడు మాసములు జరుపవలెను. ఈ వ్రతకాలములో నియత కాలములందు నియత భోజనము తప్ప నడుమ ఏ ఆహారమును భుజించరాదు.

ఇట్లు వ్రతము ముగిసిన తరువాత తెల్లని బియ్యముతో నిండిన పాత్రలును వస్త్రముల జతను తెల్లని కంటి ఆవరణ వస్త్రముతో కూడ చక్కని గోవును దేవిని పూజించిన మండపపు చాందనీనుంచి తీసిన ముక్కను చందనమును అంగవస్త్రముల జతను పెరుగన్నముతో నిండిన గరిగ పాత్రను కూడా దానముగ ఈయవలయును. తరువాత తనకు ఉపదేష్టయగు గురుని భక్తితో వస్త్రమాల్య సుగంధ ద్రవ్యములతో పూజించవలయును. ఏ విషయమును ధనమునకు లోభము చూపరాదు.

ఈ విధానము ననుసరించి సారస్వతి వ్రతము నాచరించువాడు విద్యావంతుడును ధనవంతుడును మధురమగు కంఠము కలవాడునునగును. సరస్వతీ ప్రసాదమున బ్రహ్మలోకమున సుఖించును. దీనిని స్త్రీ ఆచరించినను ఈ ఫలమును పొందును. ముప్పదివేల కల్పములంతకాలము బ్రహ్మలోకమున వసించును. ఈ సారస్వత వ్రతమును వినినను చదివినను అట్టివారు కూడా ముప్పదివేల కల్పముల కాలము విద్యాధర లోకమున వసింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సారస్వత (గాయత్రీ)వ్రతము అను అరువది అరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters