Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుఃషష్టితమో7ధ్యాయః.

ఆర్ద్రానన్దతృతీయావ్రతమ్‌.

ఈశ్వరః:

 తథైవాన్యాం ప్రవక్ష్యామి తృతీయాం పాపనాశనీమ్‌ | నామ్నా లోకే తు విఖ్యాతా మార్ద్రానన్దకరీ మిహ. 1

యదా శుక్లతృతీయాయా మషాడరక్షం భ##వే త్క్వచిత్‌ | బ్రహ్మరక్షంతు మఘరక్షంవా హస్తో మూలరక్ష మేవచ.

దర్భగన్ధోదకై స్స్నానం తదా సమ్య క్సమాచరేత్‌ | శుక్లమాల్యామ్బరధర శ్శుక్లగన్ధానులేపనః. 3

భవానీ మర్చయే ద్భక్త్యా శుక్లపుషై#్ప స్సుగన్ధిభిః | మహాదేవేన సహితా ముపవిష్టాం మహాసనే. 4

వామదేవ్యై నమః పాదౌ శఙ్కరాయ నమో హరమ్‌ | జఙ్ఘే శోకవినాశిన్యై ఆనన్దాయ నమః ప్రభో. 5

రమ్భాయై పూజయే దూరూ శివాయచ పినాకినః | ఆనన్దిన్యై కటిం దేవ్యా శ్శూలినం శూలపాణయే. 6

మాధవ్యై చ తథా నాభి మథ శమ్భో ర్భవాయ వై | స్తనా వానన్దకారిణ్యౖ శఙ్కరస్యేన్దుమౌళ##యే. 7

ఉత్కణ్ఠిన్యై నమః కణ్ఠం నీలకణ్ఠాయమై హరమ్‌ | కరా వుత్పలధారిణ్యౖ భద్రాయ జగతాం పతేః. 8

బాహూచ పరిరమ్భిణ్యౖ నృత్తశీలాయ వై హరమ్‌ | దేవ్యా ముఖం విలాసిన్యై వృషేశాయ పున ర్విభోః. 9

స్మితంచ స్మరలీ లాయై వివ్వవక్త్రాయవై విభుమ్‌ | నేత్రే మదనవాసిన్యై విశ్వధామ్నేతి శూలినమ్‌. 10

భ్రువౌ నృత్తప్రియాయైచ తాణ్డవేశాయ శూలినమ్‌ | దేవ్యా లలాట మిన్ద్రాణ్యౖ హవ్యవామాయ వై విభోః.

స్వాహాయై మకుటం దేవ్యా విభో ర్గఙ్గాధరాయ వై | విశ్వకా¸° విశ్వపాదకరౌ శివౌ. 12

ప్రసన్నవదనౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ |

అరువది నాలుగవ అధ్యాయము

ఆర్ద్రానంద తృతీయావ్రతము

ఈశ్వరుడు గౌరి కిట్లు చెప్పెను: ఇట్టిదియే పాపనాశనియగు మరియొక తృతీయా వ్రతమును చెప్పెదను. దీనికి లోకమున ఆర్ద్రానందకర తృతీయా వ్రతమని ప్రసిద్ధి. శుక్లపక్షమున తదియనాడు ఆషాఢా ద్వయముకాని రోహిణీ మఘాహ స్తమూల నక్షత్రములలో నేదైన కాని ఉన్న దినమున యజమానుడు దర్భలతో పవిత్రమయిన సుగంధ జలములతో స్నాన మాడవలెను. తెల్లని వస్త్రములను తెల్లని పుష్పములను తెల్లని సుగంధపు పూతలను తాల్చవలెను. భవానీ మహాదేవులను మహాసనమున నిలిపి సుగంధవంతములగు తెల్లని పూవులతో పూజించవలెను.

పూజా మంత్రము: 1. వామదేవ్యై నమః శంకరాయ నమః-హరస్య పాదౌ పూజయామి; 2. శోక వినాశిన్యై నమః ఆనందాయ నమః ప్రభోః-జంఘే పూజయామి; 3. రంభాయై నమః శివాయ నమః - పినాకినః ఊరూ పూజయామి; 4. ఆనందిన్యై నమః శూలపాణయే నమః-శూలినః దేవ్యాశ్చ కటిం పూజయామి; 5. మాధవ్యై నమః భవాయ నమః శంభోః నాభిం పూజయామి; 6. ఆనందకారిణ్యౖ నమః ఇందుమౌళ##యే నమః-శంకరస్య స్తనౌ పూజయామి; 7. ఉత్కంఠిన్యై నమః-నీలకంఠాయ నమః-హరస్య కంఠం పూజయామి; 8. ఉత్పలధారిణ్యౖ నమః-భద్రాయ నమః-జగతాం పతేః కరౌ పూజయామి; 9. పరిరంభిణ్యౖ నమః నృత్తశీలాయ నమః-హరస్య బాహూ పూజయామి; 10. విలాసిన్యై నమః-వృషేశాయ నమః-విభోః దేవ్యాశ్చ ముఖం పూజయామి; 11. స్మరలీలాయై నమః విశ్వవక్త్రాయ నమః-విభోః స్మితం పూజయామి; 12. మదనవాసిన్యై నమః విశ్వధామ్నే నమః శూలినః నేత్రే పూజయామి; 13. నృత్తప్రియాయై నమః తాండవేశాయ నమః-శూలినః భ్రువౌ పూజయామి; 14. ఇంద్రాణ్యౖ నమః హవ్యవామాయ నమః-దేవ్యాః విభోశ్చలలాటం పూజయామి; 15. స్వాహోయై నమః గంగాధరాయ నమః-దేవ్యాః విభోః మకుటం(శిరః)పూజయామి.

విశ్వము తమ శరీరమై అన్ని వైపులకు తమ ముఖములను పాదములును కరములును కలిగి ప్రసన్నములైన ముఖములు కలవారగు పార్వతీ పరమేశ్వరులను నమస్కరించుచున్నాను.

ఏవం సమ్పూజ్య విధివ దగ్రత శ్శివయోః పునః. 13

పద్మోత్పలాని రజసా నానావర్ణాని కారయేత్‌ | శఙ్ఖచక్రే సకటకే స్వస్తికాఙ్కుశచామరాః. 14

యావన్తః పాంసవస్తత్ర రజసః పతితా భువి | తావద్వర్షసహస్రాణి శివలోకే మహీయతే. 15

చత్వారి ఘృతపాత్రాణి సహిరణ్యాని శక్తితః | దత్వా ద్విజాయ కరక ముదకాన్న సమన్వితమ్‌. 16

ప్రతిపక్షం చతుర్మాసం యావదేవం సమర్చయేత్‌ | తతస్తు చతురో మాసా న్పూర్వవ త్కరకోపరి. 17

చత్వారి సక్తుపాత్రాణి తిలపాత్రా ణ్యనన్తరమ్‌ | గన్ధోదకం పుష్పవారి చన్దనం కుఙ్కుమోదకమ్‌. 18

దుగ్ధం మధు ఘృతం చైవ గోశృఙ్గోదక మేవచ | పుష్పోదకం తథా వారి కృష్ణచూర్ణసమన్వితమ్‌. 19

ఉశీరసలిలం తద్వ ద్యవచూర్ణోదకం తతః | తిలోదకంచ సమ్ప్రాశ్య వసే న్మార్గశిరాదిషు 20

మాసేషు పక్షద్వితయం ప్రాశసం సముదాహృతమ్‌ | సర్వత్ర శుక్లపక్షాణి ప్రశస్తాని సదార్చనే. 21

ఇట్లు పార్వతీ పరమేశ్వరులను యథావిధిగా పూజించి మరల వారిముందు మ్రుగ్గు పొడితో పద్మములు కలువలు శంఖచక్రములు కడియములు శంఖచక్రములు చామరములు అంకుశములు మ్రుగ్గులు వేయవలెను. అచ్చటి భూమి పై ఎన్ని మ్రుగ్గు ధూళికణములు పడునో అన్ని వేల ఏండ్లు యజమానుడు శివలోకమున ఆదరపాత్రుడై యుండును. తరువాత అచ్చట బ్రాహ్మణునకు యథాశ క్తిగా నాలుగు నేతి పాత్రలను అన్న పానీయములను బంగారమును కరక (గరిగ అను మట్టి పాత్ర)పై నాలుగు సక్తు (పేల పిండి) పాత్రలను నాల్గు తిల పాత్రలను కూడ ఉంచి అవియును దాన మీయవలెను. ఇట్లు నాలుగు మాసములు ప్రతి శుక్లపక్షమునందును చేయుచుండవలయును. మార్గశిరము మొదలు కా ర్తిక మాసము వరకు పండ్రెండు మాసములలో వరుసగా ఈ మంచి గంధము వేసిన నీరు-పుష్పజలము-నల్ల (నూవుల) పొడి కలిపిన నీరు-వట్టి వేళ్ళు వేసిన నీరు-యవల పొడి వేసిన నీరు-నూవులు వేసిన నీరు ఆ వ్రత దినములందు రెండు పక్షములలో దేనియందయినను ఆహారముగా ఉపవసింపవలెను. వ్రతమునకు శుక్లపక్షమే చాల మంచిది.

దానకాలేచ సర్వత్ర మన్త్ర మేత దుదీరయేత్‌ | గౌరీ మే ప్రీయతా మద్య అఘనాశాయ మంగళా. 22

సౌభాగ్యాయా7స్తు లలితా భవానీ సర్వసిద్ధయే | సంవత్సరాన్తే లవణం కుసుమ్భం కుఙ్కుమం తథా. 23

చన్దనం నేత్రపట్టంచ సహిరణ్యామ్బుజేన చ | ఉమామహేశ్వరం హైమం తద్వ దిక్షుఫలై ర్వృతమ్‌. 24

స్వాస్తరావరణాం శయ్యాం సోపధానాం నివేదయేత్‌ | సపత్నీకాయ విప్రాయ గౌరీ మే ప్రీయతా మితి. 25

ఆర్ధ్రనన్దకరీ నామ తృతీయా పాపనాశనీ | యా ముపోష్య నరో యాతి శమ్భో స్త త్పరమం పదమ్‌. 26

ఇహలోకే పరానన్దం ప్రాప్నోతి ధనసమ్పదమ్‌ | ఆయమురారోగ్యస స్తత్యా న క్వచి చ్ఛోక మాప్ను యాత్‌. 27

య ఇదం శృణుయా న్నిత్యం శ్రావయే ద్వాపి మానవః | నారీవా కురుతే యా తు కుమారీ విధవాపివా.

సా7పి తత్ఫల మాప్నోతి దేవ్యనుగ్రహలాలితా | ప్రతిపక్ష ముపోషై#్యవం మన్త్రార్చన విధానవిత్‌. 29

రుద్రాణీలోక మాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌ | శక్రలోకే స గన్ధర్వైః పూజ్యతే7బ్దాయుతత్రయమ్‌. 30

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే ఆర్ద్రనన్దకృతీయా

వ్రతకథనం నామ చతుష్షష్టితమో7ధ్యాయః.

దాన కాలమున ''ఇపుడు గౌరి నాయందు ప్రీతురాలై మంగళ (శుభకరురాలు) పాపనాశమును లలిత సౌభాగ్యమును భవాని సర్వసిద్ధులను కలిగించుగాక!'' అను అర్థ మిచ్చు మంత్రము చెప్పవలెను.

ఇట్లు సంవత్సరమయిన తరువాత లవణము కుంకుమపూవు చందనము నేత్రపటము (కండ్లపై ధరించు ముసుగు వస్త్రము) బంగారు తామరపూవు చెరకుగడ-పండ్లు - ఉమా మహేశ్వర ప్రతిమ-పరపులతోను ఇతర పరికరములలతోను కూడిన మంచముబ్రాహ్మణ దంవతులకు ''గౌరీ మే ప్రీయతామ్‌'' అను మంత్రముతో దానము చేయవలెను.

ఈ ఆర్ద్రానందకర తృతీయా వ్రతము పాపనాశకమ; దీనియం దుపవాసముతో వ్రతము చేసినవారు ఇహలోక మున ధనసంపత్తి ఆయురారోగ్యసంతతి పరమానందములు పొంది శోకరహితులై పరమున శంభులోకమును పొందుదురు.

దీనిని వినినను చదివినను ఆచరించినను సువాసినియు కన్యయు విధవయు ఐనను దేవ్యనుగ్రహపాత్రమయి ఈ చెప్పిన ఫలమునందును. ప్రతిపక్షమునందును మంత్రార్చన విధానము ననుసరించి ఉపవసించి వ్రతము చేసినవారు పునరావృత్తి రహితమగు రుద్రాణీలోకము పొందుదురు. ఇంద్రలోకమున ముప్పదివేల సంవత్సరములు గంధర్వులచే పూజించబడుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆర్ద్రానందకర తృతీయా వ్రతమను అరువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters