Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకషష్టిత మో 7 ధ్యాయః.

అగస్త్యోత్పత్త్యాది కథనమ్‌.

నారదః భూర్లకో7థ భువర్లోక స్స్వర్లోకోథ మహర్జన ః| తప స్సత్యంచ సపై#్తతే దేవలోకాః ప్రకీర్తితాః. 1

పర్యాయేణతు సర్వేషా మాధిపత్యం కథం భ##వేత్‌ | ఇహలోకే శుభం రూప మాయురారోగ్య మేవచ. 2

లక్ష్మీశ్చ విపులా నాధ కథం స్యా త్పురసూదన | ఏతన్మే భగవ స్సర్వంయుథావ ద్వక్తు మర్హసి. 3

అగ్ని మారుత యోరిన్ద్రదత్తశాపః.

ఈశ్వరః : పురా హుతాశనస్సార్దం మారుతలే | అదిష్టః పురుహూతేన వినాశాయ సురద్విషామ్‌.

నిర్దగ్ధేమ తతస్తేన దానవేషు సహస్రశ ః | « తారకః కమలాక్షశ్చ కాలదంష్ట్రః పరావసుః. 5

విరోచనశ్చ సఙ్గ్రామా దపయాతా స్తపోధన | అస్తస్సముద్ర మావిశ్య సన్నివేశ మకుర్వత. 6

ఆశక్తా ఇతి తే7ప్వగ్ని మారుతాభ్యా ముపేక్షితాః | తతః ప్రభృతి న్మనుష్యా స్త్సభుజఙ్గమా& 7

సమ్పీడ్యచ మునీ న్త్సర్వా స్ర్పవిశన్తి పునర్జలమ్‌ | ఏవం యుగసహస్రాణి దానవాః సప్తచ. 8

జలదుర్గగతా బ్రహ్మ న్పీడయన్తి జగత్త్రయమ్‌ | తతః పున రథో వహ్నిమారుతా వమరాధిపః 9

అదిదేశాచిరా దమ్బునిధి రేష నిశోష్యతామ్‌ | యస్మా దస్మద్ద్విషాం చైవ శరణం వరుణలయః. 10

తస్మా ద్భవద్భ్యామద్యైవ శోషమేష ప్రణీయతామ్‌ | తా వూచతు స్తత శ్శక్ర ముభౌ తౌ బలసూదనమ్‌.

అధర్మ న్న పాపం భూయిష్ఠ ముత్స హేతాం పురన్దర | యస్య యోజనమాత్రేపి జీవకోటి శతానివై. 13

నివసన్తి సురశ్రేష్ఠ స కథం నాశ మర్హతి | ఏవ ముక్త స్సురేన్ద్రస్తు కోపా త్సంరక్తలోచనః. 14

ఉవాచేదం వచో రోషాదుద్వమన్నివ పావకమ్‌ | స దర్మాధర్మ సంయోగం ప్రాప్నువ స్త్యమరాః క్వచిత్‌.

భవతోస్తు విశేషణ మహాత్మ్యే నావతిష్ఠతోః | మదాజ్ఞాలఙ్ఘనం యస్మా న్మారుతేన సమన్వితః. 16

మునిత్రాణహింసాది పరిగృహ్య న కిం కృతమ్‌ | ధర్మార్థశాస్త్రరహితం శత్రుం ప్రతి విభావసో. 17

తస్మా దేకేన వపుషా మునిరూపేణ మానుషే | మారుతేన సమం లోకే తవ జన్మ భవిష్యతి. 18

యదాచ మానషత్వేచ తవ గణ్డూషశోషితః | భవిష్యత్యుదధి ర్వహ్నే తదా దేవత్వ మాప్స్వసి. 19

ఇతీన్ద్రశాపా త్పతితౌ తత్షణా త్తౌ మహీతలే | అవాప్తా వేకదేహేన కుమ్భజన్మ తపోధన. 20

అగస్త్యోత్పత్తి ః

మిత్రావరుణయో ర్వీర్యా ద్వసిష్ఠిస్యానుజో7భవత్‌ | ఆగస్త్య ఇత్యుగ్రతపా స్సమ్బభూవ పునర్మునిః. 21

అరువది ఒకటవ అధ్యాయము

అగస్త్యోత్పత్తి-అగస్త్య పూజా విధానాము

నారదుడు ఈశ్వరు నిట్లడిగెను: '' ఇహలోకమున శుభమగు రూపమును ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును పరమున క్రమముగా భూర్లోక భువర్లోక స్వర్లోక మహర్‌లోక జనలోక తపోలోక సత్యలోకము లనెడి ఊర్ద్వలోక ములను పొంది సుఖించుటకు సాధనమగు విధానమును ఉపదేశించి వేడుచున్నాను.''

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెనుః పూర్వము ఇంద్రుడు అగ్ని వాయువులను ఆసుర నాశనము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. వారును వేలకొలదిగా దానవులను దహించిరి. తారకుడు కమలాక్షుడు కాలదంష్ట్రుడు పరావసువు విరోచనుడు సంగ్రామమనుండి తిప్పించుకొని పోయి సముద్రాంతర్భాగమున నివసింపసాగిరి. వీరు చేతకాని వారు కదా! యని అగ్ని వాయువులు వారిని కాల్చక విడిచిరి. వీటి నుండి వారందరును దేవ మనుష్య నాగులను మునులను బాధించి మరల నీటిలో ప్రవేశించుచుండిరి. ఇట్లు పండ్రెండు వేల యుగములు లోకత్రయమును ఈ జలదుర్గమునం నుండి బాధించిరి.

అంతట దేవేంద్రుడు అగ్ని వాయువులను మరల పిలిచి 'ఈ దేవ శత్రువులకు సముద్రము అవాసముగా నున్నది. కనుక మీరు ఈ సముద్రమును ఎండింపజేయుడు. అని కోరెను. వారును ''ఇంద్రా: సాగరమును శోషింప జేయుట ఎంతో అధర్మము. ఏలయన అందుచే వానియందలి ప్రాణులకు ఎన్నిటికో నాశము కలుగును. సముద్రమునందే కాదు- సముద్రమునకు యోజనముల దూరమున కూడ దాని నాధారముగా చేసికొని వందలకొలది ప్రాణులు జీవించుచున్నవి. ఇట్టిదాని నెండింపజేయుట తగునా? ఇట్టి పాపము మేము చేయలేము.'' అనిరి. ఈమాట విని ఇంద్రుడు కోపముతో కనులెర్రజెసి నిప్పులే క్రక్కుచున్నాడేమో అన్నట్లు చూచుచు రోషవచనములు ఇట్లు పలికెనుః ''దేవతలకు పాపమంటుట ఎక్కడనులేదు. విశేషించి మహా మహిమ వంతులగు మీకు అట్టిది లేనేలేదు. ఐనను మీరు నా ఆజ్ఞను ఉల్లంఘించితిరి. దీనిచేత మునులకు హింస దానవులకు రక్షణ మొదలగు దోషములెన్నియో సంభవించును. ఇది ధర్మార్థ శాస్త్ర విరుద్దము. కనుక మీరు ఇద్దరును మానవలోకమున ఒకేఒక మానవ దేహముతో మునులుగా జన్మింతురుగాక: అందునను అగ్నీ! నీవు అప్పుడు కూడా నీ పుక్కిటితో సముద్రమును ఎండింపజేయుదువు. అపుడు మరల నీకు దేవత్వము లభించును.'' అనగానే అగ్ని వాయువులు ఇద్దరును భూతమునకు వచ్చిపడిరి. మిత్రా వరుణుల (మిత్రుడు వరుణుడు అను జంట దేవతల) వీర్యమువలన కుంభమునుండి ఒకే దేహముతో జన్మించిరి. అగ్నిదేవుడు అగస్త్యమునిగా వసిష్ఠునికి తమ్ముడై జన్మించెను. నారదః : సమ్భూత స్సకథం భ్రాతా వసిష్ఠస్యభవ న్మునిః |

కథంచ మిత్రావరుణౌ పితరౌ తస్య తౌ స్మృతౌ. 22

జన్మ కుమ్భా దభూచ్ఛాస్య కథంవా పురసూదన | వీత దాచక్ష్వ భగవ న్యథావ ద్విబుధోత్తమ. 23

ఈశ్వరః: పురా పురాణపురుషః కదాచి ద్గన్ధమాదనే | భూత్వా ధర్మసుతో విష్ణు శ్చచార విపులం తపః 24

తపసా తస్య భేతేన విఘ్నార్థం ప్రేషితా వుభౌ | శ##క్రేణ మాధవాసఙ్గా వప్సరోగణసంయుతౌ. 25

యదా స గీతవాద్యేన నఙ్గహారాదినా హరిః | న కామమాధవాభ్యాం చ «విషయా స్ప్రతిచక్రమే. 26

తదా కామమధుస్త్రీణాం విషాద మగమద్గణః | సంక్షోభాయ తత స్తేషాం స్వోరుదేశా న్న రాగ్రజః. 27

నారీ ముత్సాదయామాస త్రైలోక్యజనమోహినీమ్‌ | సంక్షుబ్దా స్తు తథా లేదా స్తథైవచ సురావుభౌ. 28

అప్సరోభి స్సమక్షం హి దేవాం స్తా నబ్ర వీ ద్దరిః | ఊర్వశీతిచ నామ్నేయం లోకే ఖ్యాతిం గమిష్యతి. 29

తతః కామయమానేన మిత్రేణాహూయ చోర్వశీ| ఉక్తా మాం రమయస్వేతి బాఢ మి త్యబ్రవీచ్చ సా.

గచ్చన్తీ ప్రాన్తరే తస్మి& స్తోక మిన్దీవరేక్షణా | వరుణన వృతా పశ్చా ద్వరుణం నాన్వమన్యత. 31

మిత్రేణాహం వృతా పూర్వ మద్య భార్యా న తే ప్రభో|

ఉవాచ వరుణ శ్చిత్తం మయి విన్యస్య గమ్యతామ్‌. 32

గతాయాం బాఢ మిత్యుక్త్యా మిత్ర శ్శాప మదా త్తదా|

గచ్చ త్వం మానుషే లోకే భజ సోమసుతాత్మజమ్‌. 33

భజస్వేతి యతో వేశ్యాధర్మ ఏష త్వయా కృతః | జలకుమ్భే తతో వీర్యం మిత్రేణ వరుణన చ. 34

ప్రక్షిప్త మథ సఞతౌ ద్వావేవ మునిసత్తమౌ | నిమిర్నామ నృపః పూర్వం స్త్రీభి ర్ద్యూత మదీవ్యత. 35

తదస్తరే జగామాథ వసిష్టో బ్రహ్మణ స్సుతః | తస్య పూజా మకుర్వంస్తు శశాప స ముని ర్నృపమ్‌. 36

విదేహ స్పమ్భవస్వేతి శప్త స్తేనాప్యసౌ మునిః | అన్యోన్యశాపాచ్చ తయో ర్విశరీర విచేతసోః. 37

జగ్మతు శ్శాపనాశాయ బ్రహ్మాణం పద్మసమ్భవమ్‌ | అథ బ్రహ్మసమాదేశా లోచనే ష్వవసన్నిమిః. 38

నిమేషాఃస్యుశ్చలోకానాం తద్విశ్రామాయ నారద | వసిష్ఠో& ప్యభవ తస్మి& జలకుమ్భతు పూర్వవత్‌. 39

తత శ్శ్వేత శ్చతుర్భాహు స్సాక్షసూత్రకమణ్డలుః | అగస్త్య ఇతి శాన్తాత్మా బభువ ఋషిసత్తమః. 40

మలయసై#్యకదేశే తు ¨ వై ఖానసవిధానతః | సభార్య స్సంవృతో విపై#్ర స్తప శ్చక్రే సుదుష్కరమ్‌. 41

ఈశ్వరుడిట్ల చెప్పగా నారదుడు 'ఆగస్త్యుడు కుంభమునుండి ఎట్లు జన్మించెను? వసిష్ఠునకు తమ్ముడెట్లయ్యెను? వీరికి మిత్రావరుణులెట్లు తండ్రులైరి? ఇదంతయు తెలుపుము.' అని వేడెను. ఈశ్వరుడిట్లు చెప్పెను: ఒకానొక సమయమున పురాణ పురుషుడగు విష్ణుడు ధర్ముని కుమారుడుగు నారాయణుడను మునియై గంధమాదన పర్వతమున విస్తృత తవ మాచరించెను. అతని తపమునకు భయమందిన ఇంద్రుడు అతని తపము భగ్నమొనర్పగోరి వసంతుని మన్మథుని ప్రవృత్తులతోకాని కాని ఆముని విషయ సుఖముల వైపునకు ప్రవృత్తుడు కాలేదు. తమ యత్నములు వమ్ముకాగా వారందరును విషాదమందిరి. వారి నింకను కలత పరదలచి నారాయణముని తన తొడలనుండి త్రైలోక్య జన మోహినియగు

___________________________

« విషయాస్ర్పతిచక్షుషోః ¨ వై శ్వానర విధానవిత్‌

యువతిని జనింపజేసి చూపెను. చూచి వారును కలతపడిరి. నా ఊరువుల నుండి జనించినందున ఈ మెకు ఊర్వశియను నామమును ప్రసిద్దయై(అప్సరయై) యుండునని నారాయణముని వసంత మన్మథులకును అప్సరలకును ఇతర దేవతలకును. చెప్పెను

ఆమెను చూసి కామ వశీభూతుడై మిత్రుడు (ఉదయించు సూర్యునకు అభిమాని యగు దేవత) తన్నానందింప జేయుమని ఊర్వశిని కోరెను. అమె అంగీకరించెను. నల్లకలువలవంటి కన్నులుకల ఆ సుందరి అతని వెంట కొంచెము దూరము పోగానే వరుణుడు (అస్తమించు సూర్య కభిమానియగు దేవత) ఆమెను చూచి అతడును ఆమెను తన్నానందింపజేయుమని కోరెను. నన్ను ముందుగా మిత్రుడు వరించెను కావున నేనిప్పుడు అతని భార్యగానున్నాను. (అతని కోరిక తీర్చువరకు) నేను నీ కోరిక తీర్చజాలనని యామె వరుణుని కోరిక అంగీకరించకపోయెను. అట్లయినచో నీవు చిత్తమునైన నాయందు నిలిపి పొమ్మని వరుణుడు పలికెను. ఊర్వశి సరేయని మిత్రునితో వెళ్ళెను. నీవు చేసిన ఈ పని వేశ్యాధర్మము. కావున నీవు భూలోకమునకు పోయి అచట సోముని పౌత్త్రుని (కి భార్యవై అతనిని) ఆశ్రయింతువు. అని మిత్రుడామెను శపించెను. (అతడును ఆమెతో సుఖించలేదు.) (ఊర్వశీ విషయకమయిన కామ వశమున స్థానము తప్పిన) తమ వీర్యమును మిత్రావరుణులు ఇద్దరును (అపుడచట లభించినయొక) జలకుంభమున నిలపిరి. (దాని నుండి) లోగడ చెప్పిన ముని సత్తములు వసిషాగస్త్యులు జనించిరి.

« పూర్వము ఒకనాడు నిమి అనురాజు తన భార్యలతో జూదమాడుచుండెను. అట్టి సమయమున బ్రహ్మ మానసపుత్రుడు వసిష్ఠుడచటికి పోయెను. నిమి అతనిని ఆదరించలేదు. అందుచే నీవు విదేహుడవు (దేహము లేనివాడవు) కమ్ము-అని వసిష్ఠుడు నిమిని శపించెను. నిమికూడ వసిష్ఠుని శపించెను. దానిచే నిమి విదేహుడయ్యెను. వసిష్ఠుడు చేతస్సు (చిత్తవృత్తి ప్రవృత్తులు) లేనివాడయ్యెను. (ఇద్దరును ఇట్లు కావలసియుండగా) శాపనాశమునకై ఇరువురును బ్రహ్మకడకు పోయిరి. బ్రహ్మదేవుని ఆదేశమున నాటి నుండి 'నిమి' (భూలోక జీవుల) కన్నుల యందు నివసింపసాగెను. అతని విశ్రాంతికై అప్పటినుండి మానవులు మొదలగు ప్రాణులకు నిమే(మి)షములు ఏర్పడెను. (నిమి-శ= నిమిః శేతే ఆస్మిన్‌ -'నిమి' దీనియందు శయనించును కనుక నిమిశ-నిమేశ > నిమిష-నిమేష) (బ్రహ్మదేవుని ఆజ్ఞచేతనే) వసిష్ఠుడును జల కుంభమునందు చేరి లోగడ చెప్పినట్లు మిత్రావరుణుల కుమారుడయ్యెను. అతనితోపాటు ఆకడవనుండియే తెల్లని మేనిచాయ నాలుగు బాహువుల జపమాల కమండలువు కలిగి శాంతాత్ముడగు ఆస్త్య మహర్షి ఉద్భవించెను. ఆయన మలయ పర్వత భాగమున తన భార్యతోకూడి విప్రవరివృతుడయి వైఖానన (వానప్రస్థ) విధానముతో దుష్కరమగు తప మాచరింపసాగెను.

తతః కాలేన మహతా « తారకాది నిపీడితమ్‌ | జగద్వీక్ష్యస కోపేన పీతవా స్వరుణాలయమ్‌. 42

విస్ధ్యవృద్ధిక్షయతో మృత్యు రన్యో విధాయ చ | కాలకూటం వృథా చక్రే శ్వేతకేతో ర్న తృప్తికృత్‌.

తతో7 స్య వరదా స్సర్యే బభూవు శ్శఙ్కరాదయః | బ్రహ్మ విష్ణుశ్చ భగవా స్వరదానాయ జగ్మతుః. 44

« కాలకాది

« మొదట బ్రహ్మ మానసపుత్త్రడుగా చెప్పబడిన వసిష్ఠుడుమరల మిత్రావరుణల కుమారుడై అగస్త్యునితో పాటు ఎట్లు జన్మించెనను ప్రశ్నకు ఈ ఉపాఖ్యానము సమాధానముగా నున్నది. ఛాందోగ్యోపనిషత్తునందు. వసిష్ఠ పదముతో చెప్పబడిన ముఖ్య ప్రాణతత్త్వమునకును వసిష్ఠుడు బ్రహ్మ మానసపుత్త్రడనుటకును వాయుదేవుడే ఇంద్రశాపమున జలకుంభమునుండి వసిష్ఠడుగా పుట్టెననుటకును వేదాంత శాస్త్రానుసారము సమన్వయము కూడ ఈ కథవలన కుదురుచున్నది. ఇదియంతయు తత్త్వ విచారణ మార్గమును ఆలోచించుటచే తెలియవలసిన విషయము. పురాణములు ఇట్లు సర్వవిధ విజ్ఞానమును అందించుచున్నవి.

వరం వృణీష్వ భద్రం తే యదభీష్టం భ##వే న్మునే |

అగస్త్యః: యావ ద్బ్రహ్మసహస్రాణాం పఞ్చవింశతికోటయః. 45

వైమానికో భవిష్యామి దక్షినాచలవర్త్మని | మద్విమానోదయే కుర్యా ద్యః కశ్చి త్పూజనం మమ. 46

స సప్తలోకాధిపతిః పర్యాయేణ భవిష్యతి | ఈశ్వరః: ఏవమ స్త్వితి తే7ప్యుక్త్వా జగ్ము ర్దేవా యథాగతమ్‌.

తస్మా దర్ఘ్యః ప్రదాతవ్యో హ్యగస్త్యస్య నదా బుధైః |

నారదః: కథ మర్ఘ్యప్రదానంతు క ర్తవ్యం తస్య వై ప్రభో. 48

విధానం య దగ స్త్యస్య పూజనం తద్వదస్వ మే |

ఈశ్వరః : ప్రత్యూషసమయే విద్వా న్కుర్యా దస్యోదయే సతి. 49

స్నానం శుక్లతిలై స్తద్వ చ్ఛుక్లమాల్యామ్బరో గృహీ | స్థాపయే దవ్రణం కుమ్భం మాల్యవస్త్రవిభూషితమ్‌.

పఞ్చరత్నసమాయుక్తం ఘృతపాత్రేణ సంయుతమ్‌ |

అఙ్గుష్ఠమాత్రం పురుషం తథైవ సౌవర్ణ మత్యాయతబాహు దణ్డమ్‌. 51

చతుర్భుజం కుమ్భముఖే నిధాయ ధాన్యాని రత్నా మ్బర నంయుతాని |

సకాంస్యపాత్రాక్షతశు క్తియుక్తం మన్త్రేణ దద్యా ద్ద్విజపుఙ్గవాయ. 52

ఉతిక్షప్య లమ్బోదరదీర్ఘబాహు రనన్యచేతా«7య ముదఙ్ముఖ స్స& |

శ్వేతాంచ దద్యా ద్యది శ క్తిర స్తి రౌప్యాం ఖురై ర్హేమముఖీం సవత్సామ్‌. 53

ధేనుం తతః క్షీరవతీం ప్రణమ్య సమత్స ఘణ్టాభరణాం ద్విజాయ |

ఆస ప్తరాత్రా దుదయే7ర్ఘ్య మస్య దాతవ్య మేత త్సకలం నరేణ. 54

యావ త్సమా స్సప్త దశాథవా స్యు రథోర్ధ్వమప్యత్ర వదన్తి కేచిత్‌ |

కాశపుష్పప్రతీకాశ హ్యగ్నిమారుత సమ్భవ. 55

మిత్రావరుణయోః పుత్త్ర కుమ్భయోనే నమో7స్తు తే |

ప్రత్యబ్దం చ ¨ఫలత్యాగ మేవం కుర్వన్న ముహ్యతి. 56

హోమం కుర్యా త్తతః పశ్చ ద్వర్జయే న్మనసా ఫలమ్‌ | అనేన విధినా యస్తు పుమా నర్ఘ్యం నివేదయేత్‌.

ఇమం లోక మవాప్నోతి రూపారోగ్యసమన్వితః | ద్వితీయేన బువర్లోకం స్వర్లోకంచ తతః పరమ్‌. 58

స ప్త లోకా నవాప్నోతి సప్తార్ఘ్యా న్యః ప్రయచ్ఛతి |

ఇతి పఠతి శృణోతి వా య ఏత ద్వసుయుగళాంగభవస్య సమ్ప్రదానమ్‌. 59

మతిమపిచ దదాతి సో7పి విష్ణో ర్భవనగతః పరిపూ%్‌యతే7మరౌఘైః. 59||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమను సంవాదా న్తర్గతేశ్వరనారదసంవాదే

అగస్త్యోత్పత్తి తత్పూజాదికథనం నామైక షష్టితమో7ధ్యాయః.

ఇట్లు చాలకాలము గడచెను. ఈ అగస్త్యుడు తారకాది దానవులును జగములను పీడించుట చూచి కోపవశమున సముద్రమును త్రాగివేసెను. వింధ్య పర్వతవృద్ధిని ఆటంకపరచెను. రెండవ మృత్యువును సృష్టించెను. కాలకూట విషమును వ్యర్థమయిన దానినిగా (శ క్తిమీనమగునట్లు) చేసెను. శ్వేతకేతువను నాతని చంపెను. ఇట్టి మహాకార్యములు చేసినందున సంతసించి శంకరుడు బ్రహ్మ విష్ణువు మొదలగువారు అగస్త్యునకు వరమీయదలచివచ్చి ''మునీ! నీకభీష్టమగు వరమేదియో కోరుము. ఇత్తుము'' అనిరి. అగస్త్యుడిట్లు వరము కోరెను. ''ఇరువదియైదు కోట్ల సంవత్సరముల కాలము

« యమదిఙ్ముఖస్స *ఆస ప్తరాత్రోదయమూర్ధ్వమస్య ¨ఫలైర్యోగమేవం.

నేను దక్షిణ (మలయ) మార్గమున వైమానికుడనై (అంతరిక్షమున వెలుగు జ్యోతిర్గోలమనై) ఉండవలయును. నావిమానము (జ్యోతీరూపము) ఉదయించినపుడు నన్ను పూజించినవాడు క్రమముగా భూర్లోకమాదిగా ఏడు ఊర్ధ్వ లోకములకు అధిపతి (వాటియందు సుఖించుటకు అధికారి) కావలయును.'' అని కోరగా అట్లే యగునని వరమిచ్చి ఆదేవతలు వచ్చిన త్రోవను వెళ్ళిరి. కావున ఈ విషయము నెరిగి వివేకులై జనులు అగస్త్యునకు అర్ఘ్యమునీయవలెను.

ఈశ్వరు డిట్లు చెప్పగా విని నారదుడు అగస్త్యునకు అర్ఘ్య మిచ్చుటకును పూజ సేయుటకును కల విధాన మేదో తెలుపుమని ఈశ్వరుని ప్రార్థించగా ఆ దేవు డిట్లు చెప్పెను: ప్రభాతకాలమున అగ స్త్య నక్షత్రము ఉదయించు వేళకు సంప్రదాయ మెరిగిన గృహస్థుడు నిద్ర మేల్కాంచి తెల్లని నూవులతో (నూవుపిండితో నూవులనూనెతో) స్నాన మాడ వలయును. తెల్లని పూలను వస్త్రములను ధరించవలెను. పూలను వస్త్రములను చుట్టును చుట్టి అలంకరించిన కలశమును (నీటితో నింపి) నిలిపి దానియందు పంచరత్నములను (ముత్యము పగడము మొదలగునవి) వేయవలెను. దాని దగ్గర ఒక నేతి పాత్ర ఉంచవలెను. బంగారుతో బొటనవ్రేలంత పరిమాణము కలిగి పొడవయిన నాలుగు బాహువులుకల పురుషుని ప్రతిమ చేయించి ఆ ఘృతపాత్ర దగ్గర ఉంచవలయును. ఆ ప్రతిమతోపాటు ధాన్యములు రత్నములు నూతన వస్త్రములు కంచుపాత్రము అక్షతలు ముత్తెపు చిప్పలు చేర్చవలెను. ఇవన్ని యు మంత్రపూర్వకముగా దానము చేయవలెను. ఈ దానము చేయునపుడు దాత ఉత్తరాభిముఖుడై తన దీర్ఘబాహువులను పైకెత్తవలయును. అనన్యచిత్తుడై యుండవలయును. శ క్తియున్నచో తెల్లని వన్నె కలిగి వెండి గిట్టలు బంగరు మొగపుపట్టె మెడలో గంటలు మొవ్వలు కలిగి దూడకల పాడి యావును కూడ దానము చేయవలెను. ఇట్లు అగస్త్యోదయదినము మొదలు ఏడు దినములు ఈ విధమగు దానముతోపాటు అర్ఘ్యము నగస్త్యున కీయవలయును.

ఇట్లు వరుసగా పదునేడు సంవత్సరములు చేయవలయును. అంతకంటె ఎక్కువ కాలము వరకు కూడ చేయవలయు(వచ్చు)నని కొందరందురు.

ఫలత్యాగమంత్రము: ''ఱల్లుపూవువంటి దేహప్రకాశము కలిగి అగ్ని మారుతుల వలన జనించినవాడవై మిత్రా వరుణదేవుల పుత్త్రుడవై జలకుంభమునుండి ఉత్పన్నుడవైన అగస్త్యా! నీకు నమస్కారము.''

సంప్రదాయ మెరిగి ప్రతి ఏడు ఇట్లర్ఘ్యము నీయవలెను. తరువాత హోమము జరిపి మనః పూర్వకముగా ఫలత్యాగము చేయవలెను.

ఈ విధానానుసారము అగస్త్యునకు అర్ఘ్యము నర్పించు పురుషుడు ఈ భూర్లోకమున రూపాయురారోగ్యములతో సుఖించును. తరువాత క్రమముగ భువర్లోకము మొదలగు ఊర్ధ్వలోకములను అన్నిటిని పొంది అచ్చటను సుఖించును.

అష్టవసువులలోని వాగు అగ్ని మూరుతుల అంశవలన జనించిన (వారి కుమారుడేయగు) అగస్త్యుని అర్ఘ్యదాన విధానమును చదివినను వినినను ఉ త్తమ జ్ఞానమును పొంది విష్ణులోకమును చేరి అచట దేవతలచేత పూజల నందుకొనును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అగస్త్యోత్పత్తి తదర్ఘ్య తత్పూజా విధానమను

అరువది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters