Sri Matsya Mahapuranam-1    Chapters   

షష్టితమో 7 ధ్యాయః.

సౌభాగ్యశయనప్రతమ్‌.

శ్రీమత్స్యః 

తథైవాన్య త్ర్వవక్ష్యామి సర్వకామఫలప్రదమ్‌| సౌభాగ్యశయనం నామ యత్పురాణవిదో విదుః. 1

పురా దగ్దేషు లోకేషు భూర్భువస్స్వర్మహాదిషు | సౌభాగ్యం సర్వభూతానా మేకస్థ మభవత్తదా. 2

తచ్చ వైకుణ్ఠమాస్థాయ విష్ణో ర్వక్షస్థ్సలే స్థితమ్‌ | తతఃకాలేన మహతా పునస్సర్గవిధౌ నృప. 3

అహఙ్కారావృతే లోకేప్రధానపురుషాత్మకే | స్పర్ధాయాంచ ప్రవృత్తాయాం కమలాసనకృష్ణయోః. 4

లిఙ్గాకారా సముద్భూతా వహ్నిజ్వాలా 7తిభీషణా | తస్కాతిత ప్తస్యహరే ర్వక్షస స్తద్వినిస్స్రతమ్‌. 5

యద్వక్షస్థ్సల మాశ్రిత్య విష్ణో స్సౌభాగ్య మాస్థితమ్‌ | రసభూతం నతద్యావ దాప్నోతివసుధాతలమ్‌. 6

తక్షిప్త మన్తరిక్షాత్త ద్ర్బహ్మపుత్త్రేణ ధీమతా | దక్షేణ పీతమాత్రంతు రూపలావణ్యకారకమ్‌. 7

బలం తేజో మహజ్జాతం దక్షస్య పరమేష్ఠినః | శేషం యదపతద్బూమా వష్టదా తదజాయత. 8

తత స్త్వోషదయో జాతా స్సర్వ సౌభాగ్యదాయికాః | ఇక్షవ స్తవరాజశ్చ నిష్పావో జాతిధాన్యకమ్‌. 9

వికారవచ్చ గోక్షీరం కుసుమ్భకుసుమంతథా | లవణం చాష్టమం చాత్ర సౌభాగ్యష్టక ముచ్యతే. 10

పీతం యద్ర్బహ్మపుత్రైణ యోగజ్ఞాన విదాపురా | దుహితా సా7భవత్తస్య యా సతీ త్యభిధీయతే. 11

లౌకానతీత్య లావణ్యాల్లలితా తేనచోచ్యతే | త్రైలోక్యసున్దరీ మేనా ముపయేయే పినాకభృత్‌. 12

సా సౌభాగ్యమయీ దేవీ భుక్తి ముక్తి ఫలప్రదా | తామారాద్య పుమాన్భక్త్యానారీవా కింనవిన్దతి. 13

మనుః : కథమారాధనం తస్యా జగద్దాత్ర్యా జనార్దన | యద్విధానం జగన్నాధ తత్సర్వంత్వం పదస్వ మే.

అరుపదవ అధ్యాయము.

సౌభాగ్య శయన పత్రము.

మత్స్య నారాయణుడు ఇట్లు చెప్పెను : ఇట్టిదే మరియొక వ్రతమును చెప్పెదను. వినుము. సౌభాగ్యశయన వ్రతమని దానిని పురాణవేత్తలందురు. అది సర్వ కామఫలదము.

పూర్వము ప్రళయకాలమున భూర్భవః సువరాది లోకములన్నియు దగ్దములు కాగా సర్వభూతముల సౌభాగ్యమును ఒకచో చేరి ఒకటిగానై వైకుంఠమున కేగి విష్ణు నక్షమున నిలిచెను. మరల చాలకాలమునకు సృష్టి ఆరంభము కాసాగెను. ప్రధాన పురుషాత్మకమగు లోకమంతయు మాయాకృతమయిన అహంకారముతో అవృతమయి యుండెను. బ్రహ్మ విష్ణులకు (తమ తమ గొప్పతనము విషయంలో) పోటీ ఏర్పడెను. «అపుడు లింగాకృతితో మహాభయంకర వహ్నిజ్వాల ఉద్భవించెను. దాని వేడిమితో మిగుల క్రాగిన విష్ణు వక్షమునుండి అంతవర కచట నిలిచిన సౌభాగ్యఘనము కరగి బయటికి వచ్చెను. అది అచటి నుండి లేచి ఎగిరినది. అది భూమికి చేరులోపలనే అంతరిక్షమునందుండగనే బ్రహ్మ మాననపుత్త్రుడును బుద్దిశాలియు నగు దక్షుడు దానిని త్రావెను. వెంటనే అతడు రూపలావణ్యబలతేజోవంతుడయ్యెను. దానిలో కొంత మిగిలినదై (చిందినదై) సర్వసౌభాగ్యదాయకములగు ఎనిమిది ఓషధులుగా నయ్యెను. 1. చెరకు 2. యవలు మొదలగువాని నుండి చక్కెర (Glucose) 3. జాజికాయ 4. ధనియాలు 5. విరిగిన అవుపాలు 6. కుంకుమ పూవు 7. బొబ్బరలు 8. ఉప్పు అను ఈ ఎనిమిదిటికిని సౌభాగ్యాష్టకము అని పేరు. ఇవియే ఈ ఓషధులు. వీటిని పానము చేసిన దక్షుని కూతురే సతీదేవి అతిలోక లావణ్యవతి; కనుకనే ఆమెకు లలిత అని పేరు. ఆమెను శివుడు పెండ్లాడెను. ఆమె సౌభాగ్యమయియు భుక్తి ముక్తి ప్రదాయినియు; ఆమె నారాధించిన స్త్రీకి కాని పురుషునకు కాని ఏమి లభింపకుండును? అనగా విని మనువు ఆ జగద్దాత్రిని ఆరాధించు విధానమును తెలుపుమని యడుగగా మత్స్య నారాయణుడిట్లు చెప్పెను;

« ఇది బ్రహ్మదేవుని రజోగుణవ్యాప్తిచే కలిగిన తపః ప్రభావము.

శ్రీ మత్స్యః : వసన్తమాన మాసాద్య తృతీయాయాం జనప్రియ |

శుక్లపక్షస్య పూర్వాహ్ణే తిలైస్న్సానం సమాచరేత్‌. 15

తస్మిన్న హని సాదేవీ కిల విశ్వాత్మనా సతీ| పాణిగ్రహణికై ర్మన్రైరుదూఢా వరవర్ణినీ 16

తయా స హైవ దేవేశం తృతీయాయా మథార్చయేత్‌ | ఫలై ర్నానావిధైః పుషై#్ప ర్దూపనై వేద్యసంయుతైః. 17

ప్రతిమాం పఞ్చగవ్వేన తథా గన్దోదకేనచ | స్నాపయిత్వా7 ర్చయే ద్గౌరీం చన్ద్రశేఖరసంయుతామ్‌. 18

నమోస్తు పాటలాయైచ పాదౌ దేవ్యా శ్శివస్యచ | శివాయోతిచ సఙ్కీర్త్య జయాయై గుల్ఫయోర్ద్విజ. 19

త్ర్యమ్బకాయేతి రుద్రస్య భవాన్యై జఙ్ఘయోర్యుగమ్‌ | శివం భ##ద్రేశ్వరాయేతి విజయాయైచ జానునీ. 20

సఙ్కీర్త్య హరికేశాయ తథోరూ వరదే సమః | ఈ శానాయా ఇతి కటిం శఙ్కరాయేతి శఙ్కరమ్‌. 21

కుక్ష్విదయంచ కౌళిన్యై శూలినం శూలపాణయే | మఙ్గశాయే నమస్తుభ్య ముదరం చాభిపూజయేత్‌. 22

సర్వాత్మనే సమస్తుభ్య మీశాన్యైచ కుచద్వయమ్‌ | శివం వేదాత్మనే తద్వ ద్రుదాణ్యౖ కణ్ఠమర్చయేత్‌. 23

త్రిపురఘ్నాయ విశ్వేశ మనన్తాయై కరద్వయమ్‌ | త్రిలోచనాయేతి హరం బహూ కాలానంప్రియే. 24

సౌభాగ్యభవనాయేతి భూషణాన సమర్చయేత్‌ | సాహాస్వధాయైచ ముఖ మీశ్వరాయేతి శూలినమ్‌. 25

అశోకమధువాసినై పూజ్యా వోష్ఠౌ విభూతిదౌ | స్థాణవేతి హరం తద్వ దాస్యం చన్ద్రముఖ ప్రియే. 26

నమోర్దనారీశ హర మఖిలీఙ్గీతి నాసికమ్‌ | నమ ఉగ్రాయ లోకేశం లలితేతి పునర్ర్బువౌ. 27

శర్వాయ పురహన్తారం వాస్తవ్యైతు తథాలకా& నమశ్శ్రీకణ్ఠనాధాయ శివం కేశాం స్తథార్చయేత్‌. 28

భీమోగ్రసమరూపిణ్యౖ శిర స్సర్వాత్మనే నమః | శివమభ్యర్చ్య విధివ త్సౌభాగ్యష్టక మగ్రతః. 29

స్థాపయేజ్జాతినిష్పావ కుసుమ్భ క్షీర ధాన్యకాన్‌ | తవరాజేక్షులవణం కుసుమ్భక మథాష్టకమ్‌. 30

దత్తం సౌభాగ్యకృ ద్యస్మా త్సౌభాగ్యాష్టక మిత్యుత | ఏవం నివేద్య తత్సర్య మగ్రశ్శివయోస్తతః. 31

చైత్రే శృఙ్గోదకం ప్రాశ్య స్వపే ద్భూమా వరిన్దమ|

వసంత మాసారంభమున చైత్ర శుక్ల తృతీయ తిథియందు ఉదయమున నూవులతో (నూవుపిండితో నూవుల నూనెతో) స్నానము చేయవలెను. ఆనాడు ఆమె విశ్వాత్ముడగు పరమేశ్వరుని సమంత్రకముగా పెండ్లాడెను. కనుక ఆనాడు శ్రీలలితా పరమేశ్వరుల ప్రతిమలను గంధోదకముతోను పంచగవ్యములతోను స్నానము చేయించి వారిని నానా విధ ఫలపుష్పగంధ ధూపదీపములతో అర్చించవలెను.

మంత్రక్రమముః 1. పాటలాయై నమః - శివస్య దేవ్యాశ్చ పాదౌ పూజయామి; 2. జయాయై - శివాయచ నమః - గుల్పౌ పూజయామి; 3. భువాన్యై -త్ర్యంబకాయచ నమః - జంఘే పూజయామిః 4. విజయాయై - భ##ద్రేశ్వరాయచ నమః - జానునీ పూజయామి; 5. వరదాయై-హరికేశాయ నమః - ఊరూ పూజయామి; 6. ఈశానాయై - శంకరాయ నమః- కటిం పూజాయామి; 7. కౌళిన్యై-శూలపాణయే నమః- కుక్షిద్వయం పూజయామి; 8. మంగళాయై నమః - ఉదరం పూజయామి; 9. ఈశాన్యై - సర్వాత్మనేచ నమః- కుచద్వయం పూజయామి; 10. రుద్రాణ్యౖ- వేదాత్మనేచ నమః-కంఠం పూజయామి; 11. అనన్తాయై- త్రిపురఘ్నాయ నమః-కరౌ పూజయామి; 12. కాలానలప్రియాయై - త్రిలోచనాయ నమః - బాహూ పూజయామి; 13. సౌభాగ్యభవనాయ - సౌభాగ్య భవనాయ నమః- భూషణాని పూజయామి; 14. స్వాహాస్వధాయై - ఈశ్వరాయచ నమః- ముఖం పూజయామి; 15. అశోక మధువాసిన్యై- అశోక మధువాసిన్యే నమః- ఓష్ఠౌ పూజయామి; 16. చంద్రముఖ ప్రియాయై - స్థాణ వేచ నమః - అస్యం పూజయామి; 17. అఖిలాంగ్యై- అర్ధనారీశ్వరాయ నమః- నాసికాం పూజయామి; 18. లలితాయై-ఉగ్రాయచ-నమః- భ్రువౌ పూజయామి; 19. వాస్తవ్యైశర్యాయ నమః- అలకాన్‌ పూజయామి; 20. శ్రీకంఠనాధాయై - శ్రీ కంఠనాధాయై నమః-కేశాన్‌ పూజయామి; 21. భీమోగ్రసమరూపిణ్యౖ-నర్వాత్మనే నమః-శిరః పూజయామి.

ఇట్లు పూజించి సౌభాగ్యాష్ఠ ద్రవ్యములను ఎనిమిదింటిని లలితా పరమేశ్వరులముందుంచి ఉత్తరపూజ జరుపవలెను. గో శృంగోదకమును మాత్రము త్రాగి ఉపవాస ముండి భూమియందే శయనించి రాత్రి గడుపవలెను.

పునః ప్రభాతేతు తథా కృతస్నానజప శ్శుచిః. 32

సమ్పూజ్య ద్విజదామ్పత్యం మాలవస్త్రవిభూషణౖః | సౌభాగ్యాష్టక సంయుక్తం సువర్ణ ప్రతిమాద్వయమ్‌. 33

ప్రీయతామత్ర లలితా బ్రాహ్మణాయ నివేదయేత్‌ | ఏవం సంవత్సరం యావ త్తృతీయాయం సదా మునే.

ప్రాశ##నే దానమన్రైచ విశేషం తన్నిబోదమే | గోశృఙ్గోదక మాద్యే స్యాద్వైశాఖే గోమయం పునః. 35

జ్యేష్ఠే మన్దారపుష్పంచ బిల్వపత్రం శుచౌ స్మృతమ్‌| శ్రావణ దధి సమ్ర్పాశ్యం సభ##స్యేతు కుశోదకమ్‌.

క్షీర మాశ్వయుజే మాసి కార్తికే వృషదాజ్యకమ్‌|

మార్గోత్తమాజ్గే గోమూత్రం పౌషే సమ్ర్పాశ##యే ద్ఘ్పతమ్‌. 37

మాఘే కృష్ణతిలాం స్తద్య త్పఞ్చగవ్యంచ ఫాల్గునే | లలితా విజయా భద్రా భవానీ కుముదా శివా. 38

వాసుదేవీ తథ గౌరీ మఙ్గళా కమళా సతీ | ఉమాచ దానకాలే తు ప్రీయతా మితి కీర్తయేత్‌ 39

మల్లికాశోక కమల కదమ్బోత్పల మాలతీః | కుబ్జకం కరవీరంచ బాణ మవ్లూన కుఙ్కుమమ్‌. 40

స్థిన్దువారంచ సర్వేషు మాసేషు క్రమశ స్స్మృతమ్‌ | జపా కుసుమ్భకుసుమం మాలతీ శతపత్రకమ్‌. 41

యథాలాభం ప్రశస్తాని కరవీరంచ సర్వదా | ఏవం సంవత్సరం యావ దుషోష్య విధివన్నర ః. 42

స్త్రీ కుమారీ పుమాన్వాపి శివం చాభ్యర్చ్య భక్తితః | వ్రతాన్తే శయనం దద్యా త్సరోపస్కర సంయుతమ్‌.

ఉమామహేశ్వరం హైమం వృషభంచ గవా సహ| స్థాపయిత్వా7థ శయనే బ్రాహ్మణాయ నివేదయేత్‌.

అన్యాన్యపి యథాశక్తి మిథునా న్యమ్బరాదిభి ః | ధాన్యాలఙ్కారగోదానై రభ్యర్య్చ వినిమన్త్రితమ్‌. 45

విత్తశాఠ్యేన రహితః పూజయే ద్గతవిస్మయ ః | ఏవం కరోతి యస్సమ్మ క్సౌభాగ్యశయన వ్రతమ్‌. 46

సర్వా న్కామా నవాప్నోతి పదం చానన్త్య మశ్నుతే|

ఫలసై#్యకన్య« నాత్యాగ మేతత్కుర్వ స్త్స మాచరేత్‌. 47

యతః కీర్తి మవాప్నోతి ప్రతిమాసం నరాధిప | సౌభాగ్యారోగ్య రూపాయు ర్వస్త్రాలఙ్కార భూషణౖః. 48

న వియుక్తో భ##వే ద్రాజ్యా ద్వర్షార్బుద శతత్రయమ్‌ | యస్తు ద్వాదశ వర్షాణి సౌభాగ్యశయనవ్రతమ్‌. 49

కరోతి సప్త చాష్టౌవా శ్రీకణ్ఠభవనే7 మరైః | పూజ్యమానో వసే త్సమ్య గ్యావ త్కల్పాయుతం నరః. 50

నారీవా కురుతే యత్ర కుమారీ వా నరేశ్వర | సా7పి తత్పల మాప్నోతి దేవ్యనుగ్రహలాలితా. 51

శృణుయాదపి యశ్చైత త్ర్పదద్యా దథవా మతిమ్‌ | సోపి విద్యధరో భూత్వా

స్వర్గలోకే చిరం వసేత్‌. 52

ఇదమిహ మదనేన పూర్వమిష్టం శతధృతినా కృతవీర్యసూనునా చ |

కృతమథ వరుణన నన్దినా7న్యైః కిము జననాధ తదద్భుతం మహా త్స్యాత్‌. 53

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదాన్తర్గతేశ్వర నారద -

సంవాదే సౌభాగ్య శయన వ్రతకథనం నామ షష్టితమో 7ధ్యాయః.

తెల్లవారిన తరువాత (చవితినాడు) స్నానజపములు చేసి శుచియై వస్త్రమాల్య విభూషణములతో విప్ర దంపతులను పూజించి లలితా పరమేశ్వరుల ప్రతిమలను సౌభాగ్యాష్టకమును 'లలితా ప్రీయతాం' అని వారికి దాన మీయవలెను. ఇట్లు ప్రతి మానమున సంవత్సరము పొడవున చేయవలెను. ఉపవాసమునాడు తీసికొనవలసిన ఆహారమును దానమంత్రమునను భేద ముండును. ఎట్లనగా - చైత్రమాసమున గో శృంగోదక మాహారము 'లలితా ప్రీయతాం' మంత్రము. వైశాఖమున గోమము మహారము -'విజయా ప్రీయతాం' మంత్రము; జ్యేష్ఠమున మందార పుష్ప మహారము- 'భద్రా ప్రీయతాం' మంత్రము; ఆషాఢమున బిల్వపత్రము ఆహారము- 'భవానీ ప్రీయతాం' మంత్రము; శ్రావణమున పెరు గాహారము - 'కుముదా ప్రీయతాం' మంత్రము; భాద్రపదమున కుశోదక మహారము- 'శివాప్రీయతాం' మంత్రము; అశ్వయుజమున క్షీర మహారము - 'వాసుదేవీ ప్రీయతాం' మంత్రము; కార్తికమున వృషదాజ్యము (మీగడ పెరుగు) ఆహారము-'గౌరీ ప్రీయతాం' మంత్రము; మార్గశిరమున - గోమూత్ర మాహారము- 'మంగళా ప్రీయతాం' పుష్యమున నేయి ఆహారము- 'కమలా ప్రీయతాం' మంత్రము; మాఘమున నల్ల నువ్వులు (నువ్వుల పొడి) ఆహారము; 'సతీ ప్రీయతాం' మంత్రము; ఫాల్గునమున పంచగవ్య మాహారము- 'ఉమా ప్రీయతాం' మంత్రము; చైత్రాదిమానములందు వరుసగా మల్లె అశోకము-తామర-కడిమి-కలువ-మాలతి-కుబ్జకము-(గొజ్జంగి) కరవీరము(ఎర్రగన్నేరు ఎర్రని తెల్లని పూలు) రెల్లు-వాడగన్నేరు-కుంకుమ పూవు- ప్రేంకణము- ఈ పూవులతో పూజించవలెను. జపాపుష్పము - కుంకుమపూవు-మాలతి- నూరు రేకుల తామర -కర వీరము పూలు ఎప్పడును ప్రశస్తములే.

ఇట్లు పండ్రెండు మాసములందును భక్తితో పూజించవలెను. వ్రతము ముగిసిన తరువాత ఉమా మహేశ్వర ప్రతిమను సర్వసామగ్రీయుక్తమయిన క్రొత్త మంచముపై నుంచి వానిని బ్రాహ్మణ దంపతులకు దాన మీయవలెను. యథాశక్తిగా మరికొందరు బ్రాహ్మణ దంపతులకు వస్త్రములు ధాన్యము ఆభరణములు గోవులు మొదలైనవి దానమీయవలెను. ధనమునకై లోభించరాదు. అహంకారముతో చేయరాదు.

ఇట్లు చేసిన స్త్రీకాని పురుషుడుకాని కుమారి కాని అన్ని కోరికలును అనంతఫల మందురు. కీర్తి సౌభాగ్యారోగ్య రూపాయుర్వస్త్రాలంకరణ భూషణములు లభించును. మూడువందల అర్బుదముల సంవత్సరములు రాజత్వ మందును. ఇట్లీ వ్రతమున వరుసగా పండ్రెండేండ్లు కాని పదెనెనిమిదేండ్లయినను చేసినవారు పదివేల కల్పముల పాటు దేవతల సేవల నందుకొనుచు కైలాసమున వసింతురు.

దీనిని వినినను వినిపించనను వారికి కూడా విద్యాధరత్వమును స్వర్గలోక చిరనివాసమును లభించును. దీనిని పూర్వము బ్రహ్మదేవుడు కార్తవీర్యార్జనుడు వరుణుడు -నంది- వీరు చేసిరి. మిగిలిన వారి మాట చెప్పవలసిన పనియే లేదు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున సౌభాగ్యశయన వ్రతమను అరువదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters