Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్పంచాశోద్యాయః.

కృష్టాష్టమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

కృష్ణాష్టమీ మతో వక్ష్యే సర్వపాపప్రణాశనీమ్‌ | శాన్తి ర్ము క్తిశ్చ భవతి యథా పుంసాం విశేషతః. 1

శఙ్కరం మార్గశిరసి శమ్భుం పౌషే7భిపూజయేత్‌ |

మాఘే మహేశ్వరం దేవం మమాదేవం చ ఫాల్గునే. 2

స్థాణుం చైత్రే శివం తద్వ ద్వైశాఖే ప్యర్చయే న్నరః|జ్యేష్ఠే పశువతిః పూజ్య ఆషాడే హ్యుగ్ర మర్చయేత్‌.

పూజయే చ్ర్ఛావణ శర్వం నభ##స్యే త్ర్యమ్బకం తథా | హర మాశ్వయుజే మాసి తథేశానంచ కార్తికే. 4

కృష్ణాష్టమీషు సర్వాసు *శక్త్యా సమ్చాయే చ్ఛివమ్‌ | గోభూహిరణ్యవాసోభి శ్శివభక్తాశ్చ యోషితః. 5

గోమూత్రం గోఘృతం క్షీరం తిలాన్యథ కుశోదకమ్‌ | గోశృఙ్గోదకరీషార్క బిల్వపత్రదధీని చ. 6

పఞ్చగవ్యంచ సంప్రాశ్య శఙ్కరం పూజయే న్నిశి | అశ్వత్థంచ వటంచైవో దుమ్బరం ప్లక్షమేవచ. 7

పాలాశం జమ్బువృక్షంచ విదు ష్షష్ఠం మహర్షయః |

మార్గశీర్షాదిమాసాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యామనుక్రమాత్‌. 8

ఏకైకం ద న్తధవనం వృక్షే ష్వేతేషు భక్షయేత్‌ | దద్వా త్సమాప్తే దధ్యన్నం వితానధ్వజచామరమ్‌. 9

దేవాయ దద్యా ద్దణ్డాంశ్చ కృష్ణాం గాం కృష్ణవాససీ |

¡ద్విజానాం తామ్రకుమ్భాంశ్చ పఞ్చరత్న సమన్వితా&. 10

గావః కృష్ణా స్సువర్ణాశ్చ వాసాంసి వివిధానిచ | అశ క్తస్తు పున ర్దద్యా ద్గా మేకా మతిభ క్తితః. 11

విత్తశాఠ్యం న కుర్వీత కుర్వ& దోష మవాప్నుయాత్‌ | కృష్ణాష్ణమీ ముపోషై#్యవం సప్తకల్పశతత్రయమ్‌.

________________________________________________________

* భక్త్యా ¡ ద్విజానాముదకుమ్భాంశ్చ

పుమా న్త్సమ్పూజితో దేవై శ్శివలోకే మహీయతే.

ఇతి శ్రీమపత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గతేశ్వరనారద

సంవాదే కృష్ణాష్టమీవ్రతకథనం నామ షట్పఞ్చాశో7ధ్యాయః.

ఏబదియారవ అధ్యాయము.

కృష్ణాష్టమీవ్రతము.

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: ఇక కృష్ణాష్టమీ వ్రతమును తెలిపెద వినుము; ఇది సర్వపాప ప్రణాశకము; విశేషించి నరులకు ఇది శాంతిని ముక్తిని ఇచ్చును. దీనిని కృష్ణపక్షాష్టమినాడు చేయవలసినందున దీనికీ పేరు కల్గినది. మార్గశిరము మొదలు కార్తికము వరకు మార్గశిరమున శంకరుడు పుష్యమును శంభుడు మాఘమున మహేశ్వరుడు ఫాల్గునమున మహాదేవుడు చైత్రమున స్థానుడు వైశాఖమున శివుడు జ్యేష్ఠమున పశుపతి ఆషాఢమున ఉగ్రుడు శ్రావణమున శర్వుడు భాద్రపదమున త్ర్యంబకుడు ఆశ్వయుజమున హరుడు కార్తికమున ఈశానుడు అను పేర్లతో పరమేశ్వరుని పూజించవలెను. శివభక్తులగు స్త్రీలను శివునితో పాటు గోభూహిరణ్య వస్త్రములతో అర్చించవలెను. ఈ వ్రతపు అష్టమీ తిథినాడు గోమూత్రము ఆవు నేయి ఆవు పాలు నూవులు దర్భలు వేసి ఉంచిన నీరు ఆవు కొమ్ములో సోసి ఉంచిన నీరు గోమయము తెల్ల జిల్లేడాకు మారేడాకు ఆవు పెరుగు వీటిని ఆమారముగా తీసికొని ఉండి రాత్రివేళ శివు నర్చించవలెను. మార్గశిరము మొదలు ప్రతి రెండేసి మాసములందు వరుసగా రావి-మర్రి-మేడి-మోదుగ-నేరేడు పుల్లలతో పండ్లు తోముకొని ఆ చెట్లక్రింద భుజించుచుండంవలెను. ఇట్లొక సంవత్సరము వ్రతము జరిపి ముగిసిన తరువాత పెరుగన్నము-చాందనీ-చామరము దండములు నల్లని గోవు నల్లని (రెండు) వస్త్రములు పంచరత్నములతో కూడ రాగి కడవను దేవున కర్పించి బ్రాహ్మణునకు దానము చేయవలెను. నల్లని గోవులను బంగారమును వివిధ వస్త్రములను కూడ బ్రాహ్మణులకు దాన మీయవలెను. శ క్తిలేనివాడు ఒక గోవునైన అతిభక్తితో నీయవలెను. ధనమునకు లోభించినచో దోషము కలుగును. ఇట్లు ఉపవాస పూర్వకముగా కృష్ణాష్ణమీ వ్రతమును జరిపినవారు ఏడువందల కల్పముల కాలము దేవతల పూజ లందుకొనుచు శివలోకమున సుఖింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున కృష్ణాష్టమీవ్రతము అను ఏబది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters