Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుః పంచాశో7ధ్యాయః.

నక్షత్రపురుషవ్రతమ్‌.

సూతః: అతఃపరం ప్రవక్ష్యామి దానధర్మా నశేషతః | వ్రతోపవాససంయుక్తా న్యథామత్స్యోదితా న్మనోః. 1

మహాదేవస్య సంవాదం నారదస్య చ ధీమతః | యథావృత్తం ప్రవక్ష్యామి ధర్మకామార్థసాధనమ్‌. 2

కైలాసశిఖరాసీన మపృచ్ఛ న్నారదః పురా | త్రిశూలిన మనఙ్గారి ముమాఙ్గార్దధరం హరమ్‌. 3

నారదః: భగవ న్దేవదేవేశ బ్రహ్మవిష్ణ్విన్ద్రనాయక | శ్రీమదారోగ్య రూపాయు ర్భోగ్య సౌభాగ్య సమ్పదా. 4

సంయుక్త స్తవ విష్ణోర్వా పుమా న్భక్తః కథం భ##వేత్‌ | నారీవా7విధవా సర్వగుణసౌభాగ్యసంయుతా. 5

క్రమాన్ముక్తిప్రదం దేవ కిఞ్చి ద్వ్రత మిహోచ్యతామ్‌ |

శ్రీఈశ్వరః: సమ్య క్పృష్టం త్వయా బ్రహ్మ న్త్సర్వలోకహితావహమ్‌. 6

వ్రతమప్యత్ర యచ్చాన్య త్తద్వ్రతం శృణు నారద | నక్షత్రపురుషం నామ వ్రతం నారాయణార్చనమ్‌. 7

పాదాది కుర్యా ద్విధివ ద్విష్ణునామాని కీర్తయ& | «ప్రతిమాం వాసుదేవస్య మూలర్షాది ప్రపూజయేత్‌. 8

చైత్రమాసం సమాసాద్య క్రత్వా బ్రాహ్మణవాచణమ్‌ | సితపక్షేచ విధిత స్సోమో మూలేన సంయుతః. 9

ఏబది నాలుగవ అధ్యాయము.

నక్షత్రపురుష వ్రతము.

సూతుడిట్లు ఋషులకు చెప్పెను : ఇక మీదట (కర్మయోగ సంబంధులగు) దానములను ధర్మములను వ్రతములను ఉపవాసములను యథా శాస్త్రముగా సమగ్రముగా తెలిపెదను. ఇవి అన్నియు దర్మకామార్థ సాధకములు. మహాదేవ నారద సంవాద రూపములగు వీటిని మత్స్యనారాయణుడు మనువునకు తెలిపెను.

పూర్వము ఒకప్పుడు త్రిశూలి మన్మథ శత్రువు ఉమాదేహార్ధ ధారి అగు హరుడు కైలాస శిఖరమున కూర్చుండి యుండ నారదుడు అతని నిట్లడిగెను : ''భగవన్‌! నీవు దేవదేవేశుడవు-బ్రహ్మ విష్ణ్వింద్రులకును ఈశ్వరుడవు. నీ యందో విష్ణునందో భక్తి గల పురుషుడు కాని సువాసిని అగు స్త్రీకాని యథాసంభవముగా సిరి ఆయువు రూపము భోగములు సౌభాగ్యము సమృద్ధిగ పొందుటకు అనుకూలించునదై క్రమముగ ము క్తినికూడ ఇచ్చు వ్రతమేదయిన నున్నచో తెలుపుము.'' ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: నారదా! నీవు అడిగిన ప్రశ్నము సర్వలోకహితక్రమయినది. ఇట్టి వ్రతము ఒకటి కలదు. దీనికి నక్షత్రపురుషవ్రత మని పేరు. (పరమ పురుషుని శరీరమును నక్షత్ర రూపమున భావించి అర్చించుట); దీని యందు వాసుదేవుని ప్రతిమను పాదాదిగా నక్షత్ర నామములతో విష్ణు నామములు కీర్తించుచు అర్చించవలయును. చైత్రమాస శుక్ల పక్షమున చంద్రుడు మూల నక్షత్రముతో కూడియున్ననా డీ వ్రతము చేయవలెను. మొదట (సంకల్ప పూర్వకముగా) బ్రాహ్మణులచే పుణ్యాహవాచనము జరిపించవలెను. పిమ్మట ఈ క్రింది విధమున పూజించవలెను.

మూలే నమో విశ్వధరాయ పాదౌ గుల్ఫా వనన్తాయచ రోహిణీషు |

జఙ్ఘేతు పూజ్యే వరదాయ చైవ ద్వే జానునీ చాశ్వికుమార ఋక్షే. 10

పూర్వోత్తరాషాఢయుగే తథోరూ నమశ్శివాయే త్యభిపూజనీయమ్‌ |

పూర్వోత్తరాఫల్గునయుగ్మ కేచ మేఢ్రం నమః పఞ్చశరాయ పూజ్యమ్‌. 11

కటిం నమ శ్శార్గధరాయ విష్ణో స్సమ్పూజయే న్నారద కృత్తికాసు |

తథార్చయే ద్భాద్రపదద్వయేచ పార్శ్వే నమః కేశినిషూదనాయ. 12

_______________________________________________________________

« ప్రీత్యర్థం

కుక్షిద్వయం నారద రేవతీషు దామోదరాయే త్యభిపూజనీయమ్‌ |

తథా7నురాధాసు చ మాధవాయ నమ స్తథోరస్థ్సలమేవ పూజ్యమ్‌. 13

పృష్ఠం ధనిష్ఠాసుచ పూజనీయ మఫ°ఘవిధ్వంసకరాయ తద్వత్‌ |

శ్రీశఙ్ఖచక్రాసిగదాధరాయ నమో విశాఖాసు భుజాశ్చ పూజ్యాః. 14

హస్తేపి హస్తా న్మధుసూదనస్య నమో7భిపూజ్యా న్మధుకైటభారేః |

పునర్వసా వఙ్గుళిపర్వభాగా స్సామ్నా మధీశాయ నమో7భిపూజ్యాః. 15

భుజఙ్గనక్షత్రదినే నఖాని సమ్పూజయే న్మత్స్యశరీరిణశ్చ |

కూర్మస్య పాదౌ శరణం ప్రజామి జ్యేష్ఠాసు కణ్ఠ హరి రర్చనీయః. 16

శ్రోత్రే వరాహాయ నమో7భిపూజ్యె జనార్దనస్య శ్రవణన సమ్యక్‌ |

పుష్యే ముఖం దానవసూదనాయ నమో నృసింహాయ చ పూజనీయమ్‌. 17

నమోనమః కారణవామనాయ స్వాతీషు దన్తాగ్ర మథార్చనీయమ్‌ |

ఆస్యం హరే ర్భార్గవనన్దనాయ సమ్పూజనీయం ద్విజ వారుణ తు. 18

నమోస్తు రామాయ మఘాసు నాసా సమ్పూజనీయా రఘనన్దనస్య |

మృగో త్తమాఙ్గే నయనే7భిపూజ్యే నమోస్తు తే రామ విఘూర్ణితాక్ష. 19

బుద్ధాయ శాన్తాయ నమో లలాటం చిత్రాసు సమ్పూజ్యతమం మురారేః |

శిరో7భిపూజ్యం భరణీషు విష్ణో ర్న మోస్తు విశ్వేశ్వర కల్కిరూప. 20

ఆర్ద్రాసు కేశాః పురుషోత్తమస్య సమ్పూజనీయా హరయే నమస్తే |

1. విశ్వధరాయ నమః-మూలే పాదౌ పూజయామి; 2. అనన్తాయ నమః-రోహిణీషు-గుల్ఫౌ పూజయామి, 3. వరదాయ నమః-అశ్విన్యాం-జం ఘే-జానునీచ పూజయామి; 4. శివాయ నమః-పూర్వాషాఢాసు ఉత్తరాషాఢాసుచ-ఊరూ పూజయామి; 5. పంచశరాయ నమః-పూర్వ ఫల్గున్యాం ఉత్తర ఫల్గున్యాంచ-మేఢ్రం పూజయామి; 6. శార్జధరాయ నమః-కృత్తి కాసు-కటిం పూజయామి; 7. కేశినిషూదనాయ నమః-పూర్వాభాద్రో త్తరాభాద్రయోః-పార్శ్వే పూజయామి; 8. దామోద రాయ నమః-రేవతీషు-కుక్షిద్వయం పూజయామి; 9. మాధవాయ నమః-అనూరాధాసు-ఉరఃస్థలం పూజయామి;10. అఫ°ఘ విధ్వంసకరాయ నమః-ధనిష్ఠాసు-పృష్ఠం పూజయామి; 11. శ్రీ శంఖ చక్రగదాసిధరాయ నమః-విశాఖాసు-భుజాన్‌ పూజయామి; 12. మధుకైట భారయే మదుసూదనాయ నమః-హస్తే-హస్తాన్‌ పూజయామి- 13. సామ్నాం అధీశాయ నమః-పునర్వసౌ-అంగుళి పర్వభాగాన్‌ పూజయామి; 14. మత్స్య శరీరిణ నమః-ఆశ్లేషాసు-నఖాని పూజయామి; 15. కూర్మ రూపిణ హరయేనమః-జ్యేష్ఠాసు-కంఠం పూజయామి; 16. వరాహ రూపిణ జనార్దనాయ నమః-శ్రవణ-శ్రోత్రే పూజయామి; 17. దానవ సూదనామ నరసింహాయ నమః-పుష్యే-ముఖం పూజయామి; 18. కారణ వామనాయ సమః-స్వాతీషు-దంతాగ్రం పూజయామి; 19. భార్గవ నందనామ నమః-శతభిషక్షు-ముఖం పూజయామి; 20. రఘునందనాయ రామాయ నమః-మఘాసు-నాసికాం పూజయామి; 21. పరశురామాయ నమః-మృగశీర్షే-నేత్రే పూజయామి; 22. శాన్త రూపాయ బుద్ధాయ నమః-చిత్రాసు-లలాటం పూజయామి; 23. కల్కి రూపాయ నమః-భరణీషు శిరః పూజయామి; 24. పురుషోత్తమాయ నమః-ఆర్ద్రాసు-కేశాన్‌ పూజయామి-(ఇవి మొత్తము ఇరువది నాలుగు).

ఉపోషితేన ర్షదినేషు భక్త్యా సమ్పూజనీయా ద్విజపుఙ్గవా స్స్యః. 21

పూర్ణే వ్రతే సర్వగుణాన్వితాయ వాగ్రూపశీలాయ చ సామగాయ |

హైమీం విశాలాయతబాహుదణ్డాం ముక్తాఫలేన్ద్రోపలవజ్రజుష్టామ్‌. 22

గుడస్య పూర్ణే కలశే నివిష్టా మర్చాం హరే ర్వస్త్రగవా సహైవ |

శయ్యాం తథోపస్కరభాజనాదియుక్తాం ప్రదర్యా ద్ద్విజపుఙ్గవాయ. 23

యద్య త్ర్పియం కించిదిహాస్య దేయం త త్త ద్ద్విజా యాత్మహితాయ సర్వమ్‌ |

మనోరథా న్న స్సఫలా న్కురుష్వ హిరణ్యగర్భాచ్యుతరుద్రరూపి&. 24

సలక్ష్మీకం సభార్యాయ కాఞ్చనం పురుషోత్తమమ్‌ | శయ్యాంచ దద్యా న్మన్త్రేణ గ్రన్థిభేదవివర్జితామ్‌. 25

యథా న విష్ణుభక్తానాం వృజినం జాయతే క్వచిత్‌ | తథా7నురూప మారోగ్య మర్ఘ్యం దద్యాచ్చ కేశ##వే.

యథా న లక్ష్మ్యా శయనం తవ శూన్యం జనార్దన| శయ్యా మమా వ్యశూన్యాతు(7స్తు)కృష్ణ జన్మని జన్మని.

ఏవం నివేద్య తత్సర్వం వస్త్రమాల్యానులేపనమ్‌ | నక్షత్రపురుషజ్ఞాయ విప్రాయాథ విసర్జయేత్‌. 28

భుఞ్జీతాతైలలవణం సర్వరేక్షష్య ప్యుపోషణమ్‌ | భోజనంచ యథాశక్త్యా విత్తశాఠ్యవివర్జితః. 29

ఇతి నక్షత్రపురుష మవాస్య విధివ త్స్వయమ్‌ | సర్వా న్కామా నవాప్నోతి విష్ణులోకే మహీయతే. 30

బ్రహ్మహత్యాదికం కిఞ్చి ద్యదత్రాముత్ర వా కృతమ్‌ |

ఆత్మనా వా7థ పితృభి న్తత్సర్వం నాశ మాప్ను యాత్‌. 31

ఇతి పఠతి శృణోతి వా7థ భక్త్యా పురుషవరో7త్ర త మఙ్గనాచ కుర్యాత్‌ |

కలికలువిదారణం మురారే స్సకలవిభూతిఫలప్రదం చ పుంసామ్‌. 32

ఇది శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గతేశ్వర నారదైసంవాదే

నక్షత్రపురుష వ్రతకథనం నామ చతుఃపఞ్చాశో7ధ్యాయః.

ఇట్లు ఆయా నక్షత్ర దినములందు ఉపవాసముండి ఏ నక్షత్రమునాడు ఏ అవయవమును పూజించవలెనో ఆ అవయవమును ప్రధానముగా ఉద్దేశించి మిగిలిన సర్వావయముల పూజను కూడ చేయుచుండవలెను. ఈ విధముగా పూజించుచు ఆ నక్షత్ర దినములందు బ్రాహ్మణులను భోజన దక్షిణా వస్త్రాదులతో పూజించవలెను.

ఇట్లు వ్రతము పూర్తియైన తరువాత సర్వ సద్గుణములును ఉత్తమమగు వాక్కు రూపము శీలము కలిగి సామవేదము నధ్యయనము చేసిన బ్రహ్మణునకు ఈ చెప్పబోవు వానిని దానము చేయవలయును. 1. విశాలములయి పొడవయిన బాహుదండములు కలదియై ముత్తెములు ఇంద్రనీలమణులు వజ్రములు తాపటము చేసిన విష్ణు స్వర్ణ ప్రతిమను బెల్లముతో నింపిన పాత్రయందుంచి దానిని-గోవును-వస్త్రములను-ఆయా సాధన సామగ్రులతోను పాత్రలతోను కూడ మంచమును పడవను కూడ దానము చేయవలయును. ఇది కాక తనకు ఏదేది ప్రీతికరమో అది ఎల్ల తనహితమునకు గాను దానము చేయవలయును. ''హిరణ్య గర్భ రూపా! అచ్యుతా! రుద్రరూపా! మా మనోరతములను సఫలము చేయుము.'' అను అర్థమిచ్చు మంత్రమును దానసమయమున పలుకవలెను. ఇట్లు బంగారుతో చేసిన విష్ణు ప్రతిమను లక్ష్మీ ప్రతిమతోకూడ భార్యతో కూడియున్న బ్రాహ్మణునకు (బ్రాహ్మణ దంపతులకు) దానమీయవలెను. ముడులు పగుళ్లు లేని మంచమును శయ్యను కూడ ఈయవలెను. విష్ణువునకు అర్ఘ్యమును కూడ ఈయవలెను. ఇట్టి విష్ణుభక్తులకు పాపములు తొలగును. ఏ పాపమును అంటదు. ఆరోగ్యము కలుగును. శయ్యా దానము చేయునప్పుడు ''జనార్దనా! నీ శయనము లక్ష్మీదేవితో శూన్యము కానట్లే కృష్ణా! నాశయనము కూడ జన్మజన్మములందును శూన్యము కాకుండుగాక!'' అను అర్థమిచ్చు మంత్రము చెప్పవలయును.

ఇట్లు వస్త్రములను మాల్యములను గంధద్రవ్యములను పై చెప్పిన వాటిని నక్షత్ర పురుషతత్త్వ మెరిగిన బ్రాహ్మణునకు దానమిచ్చి అతనిని వీడు కొనవలయును. ఈ ప్రతి నక్షత్ర దినమునందును ఉపవాసముండి తైలము లవణము (పులుపు కారము) లేని ఆహారము తినవలెను. ధనమున లోభము చూపక యథాశక్తిగ భోజనములు పెట్టవలెను.

ఇట్లు నక్షత్ర పురుషవ్రతమును సమాప్తము చేసినవారికి సర్వకామములు (సంకల్పములు) నెరవేరును. విష్ణులోక ప్రాప్తియగును. తాను కాని తన పెద్దలు కాని చేసిన బ్రహ్మ హత్య మొదలగు పాపములన్నియు నశించును.

ఈ వ్రత (విషయ) మును చదివినను వినినను వ్రతమును ఆచరించినను స్త్రీలకు కాని పురుషులకు కాని కలిదోషములన్ని యు నశించును. సకలైశ్వర్యములు కలుగును. అన్ని కోరికలును తీరును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున నక్షత్ర పురుష వ్రతము

అను ఏబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters