Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రిపంచాశో7ధ్యాయః.

పురాణదానవ్రతకథనమ్‌-

పురాణసఙ్ఖ్యనుక్రమణికా.

ఋషయః : 

పురాణ సఙ్ఖ్యా మాచక్ష్వ సూత విస్తరతః క్రమాత్‌ | దానవ్రత మశేషంచ యథావ దనుపూర్వశః. 1

సూతః : ఇదమేవ పురాణ7స్మి న్పురాణపురుష స్తథా |

యదు క్తవా న్త్స విశ్వాత్మా మనవే త న్నిబోధత. 2

శ్రీమత్స్యః ! పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్‌ |

అనన్తరంచ వక్త్రేభ్యో వేదా స్తస్య వినిర్గతాః. 3

పురాణ మేక మేవా సీ త్తదా కల్పాన్తరే7నఘ | త్రివర్గసాధనం పుణ్యం శతకోటి ప్రవిస్తరమ్‌. 4

నిర్దగ్ధేషుచ లోకేషు వాజిరూపేణవై మయా | అఙ్గాని చతురో వేదాః పురాణన్యాయవిస్తరః. 5

మీమాంసా ధర్మశాస్త్రంచ పరిగృహ్యాత్మసాత్కృతమ్‌ | మత్స్యరూపేణతు పునః కల్పాదా వుదకార్ణవే. 6

అశేష మేత త్కథిత ముదకాన్తర్గతేనచ | శ్రుత్వా జగాదచ మునీ న్ర్పతి దేవాం శ్చతుర్ముఖః. 7

ప్రవృత్తి స్సర్వశాస్త్రాణాం పురాణస్యాభవ త్తతః | కాలే నాగ్రహణం దృష్ట్వా పురాణస్య తతో నృప. 8

వ్యాసరూప మహం కృత్వా సంహరామి యుగేయుగే | చతుర్లక్షప్రమాణన ద్వాపరే ద్వాపరే సదా. 9

తదష్టాదశధా కృత్వా భూలోకే7స్మి న్ర్పకాశ్యతే | అద్యాపి దేవలోకేస్మి& శతకోటిప్రవిస్తరమ్‌. 10

తదర్థో7త్ర చతుర్లక్షం సంక్షేపేణ నివేశితమ్‌ | పురాణాని దశాష్టౌచ సామ్ర్పతం తదిహేర్యతే. 11

నామత స్తాని వక్ష్యామి శృణుద్వ మృషిసత్తమాః |

ఏబది మూడవ అధ్యాయము

పురాణ సంఖ్యానుక్రమము-పురాణ దాన వ్రతము.

పురాణముల గ్రంథ సంఖ్యను వాటిని దానము చేయుట అను వ్రత విధానమును సవిస్తరముగా నిరవశేషముగా మాకు దెలుపుమని ఋషులడుగ సూతుడు ఈ విషయమును పురాణ పురుషుడగు మత్స్యరూప జనార్దనుడు మనువునకు చెప్పిన విధముననే మీకు తెలిపెదనని ఇట్లు చెప్పెనారంభించెను:

మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: బ్రహ్మ(కు గల ఐదు ముఖములలో ఊర్ధ్వ) ముఖమునుండి సర్వ శాస్త్రములకు ఆది భూతమగు పురాణము వెలువడెను. పిమ్మటనే (మిగిలిన) ముఖములనుండి వేదములు వెలువడెను. పూర్వకల్పమున మొదట పురాణము ఒక్కటియే యుండెను. అపుడది శతకోటి గ్రంథ పరిమాణము కలది (ముప్పది రెండక్షరముల సముదాయమునకు గ్రంథమని వ్యవహారము.) లోకములు నిశ్శేషముగ దగ్ధమైన తరువాత (ప్రళయా నంతరము) నేను హయ (గ్రీవ) రూపమున (ఆరు) వేదాంగములు నాలుగు వేదములు పురాణములు న్యాయవిస్తరము మీమాంస-ధర్మశాస్త్రము(లు) అను పదునాలుగు విద్యలను (శబ్దాత్మక నిత్య త త్త్వమును) పరిగ్రహించి నాస్వాధీనము చేసికొంటిని. మరల కల్పాదియందు మహా ప్రళయ సముద్రమున మత్స్యరూపమున నేను నీటియందేయుండి పలుకగా విని చతుర్ముఖుడు మునులకును అవి దేవతలకును ప్రవచించెను. ఇట్లు సర్వశాస్త్ర రూపమగు పురాణము లోకమున వ్రవర్తిల్లెను. కాని కాలక్రమమున దానిని జనులు సులభముగా గ్రహింపలేకపోవుట చూచి నేను ప్రతి మహా యుగమునందలి ద్వాపరయుగమునను వ్యాసరూపుడనై చతుర్లక్ష గ్రంథ పరిమాణమునకు సంగ్రహించి ఈ మొత్తమును పదునెనిమిదిగా విభజించి లోకమున ప్రకాశింపజేయుదును. దేవలోకమున మాత్రమది ఇప్పటికిని శతకోటి గ్రంథ పరిమితముగానే యున్నది. వాని వివరణమును వాటిని విభజించి దానము చేయవలసిన వ్రతవిధానమును తెలి పెదను.

బ్రహ్మణా7భిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే. 12

బ్రాహ్మం తద్దశసాహస్రం పురాణం పరికీర్తితమ్‌ | లిఖిత్వా తచ్చ యో దద్యా జ్జలధేను సమన్వితమ్‌. 13

వైశాఖే పౌర్ణమాస్యాంచ బ్రహ్మలోకే మహీయతే | ఏతదేవ యదా పద్మ మభూ న్నీరమయం జగత్‌. 14

తద్వృత్తాన్తాశ్రయం బ్రహ్మా పాద్మమిత్యుచ్యతే బుధైః | పాద్మంతు పఞ్చపఞ్చాశ త్సహస్రాణి నిగద్యతే.

తత్సురాణంచ యో దద్యా త్సువర్ణకమలాన్వితమ్‌ | జ్యేష్ఠమా సే తిలైర్యుక్తం సో7శ్వ మేధఫలం లభేత్‌. 16

వారాహకల్పవృత్తాన్త మధికృత్య పరాశరః | యత్రాహ ధర్మా సఖిలాం స్తదు క్తం వైష్ణవం విదుః. 17

*త్రయోవింశతి సాహస్రం తత్పురానం విదు ర్బుధాః | తదాషాఢేతు యో దద్యా ద్ఘృతధేనుసమన్వితమ్‌.

పౌర్ణమాస్యాం విశుద్ధాత్మా స పదం యాతి వైష్ణవమ్‌ | శ్వేతకల్ప ప్రసఙ్గేన ధర్మా న్వాయు రిహాబ్రవీత్‌. 19

యదేత ద్వాయవీయం స్యా ద్రుద్రమాహాత్మ్యసంయుతమ్‌ |

¡ ద్వాదశైవ సహస్రాణి పురాణం తదిహోచ్యతే. 20

శ్రావణ్యాం శ్రావణ మాసి గుడధేనుసమన్వితమ్‌ | యో దద్యా ద్దధిసంయుక్తం బ్రాహ్మణాయ కుటుమ్బినే.

శివలోకే స పూతాత్మా కల్పమేకం వసే న్నరః | యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః. 22

వృత్రాసురవధోపేతం తద్భాగవత ముచ్యతే | సారస్వతస్య కల్పస్య కథా యా స్స్యు ర్నరాధిప. 23

తద్వృత్తాన్తోద్భవం లోకే తద్భాగవత ముచ్యతే | లిఖిత్వా తచ్చ యో దద్యా ద్ధేమసింహసమన్వితమ్‌. 24

పౌర్ణమాస్యాం ప్రోష్ఠపద్యాం స యాతి పరమం పదమ్‌ |అష్టాదశసహస్రాణి పురాణం త త్ర్పకీర్తితమ్‌. 25

*విష్ణ్వాఖ్యమష్టసాహస్రంతత్పురాణంవిదుర్భదాః ¡చతుర్వింశతిసాహస్రంపురాణం

*చతుర్వింశతిసాహస్రం

యత్రాహ నారదో ధర్మా న్బృహత్కల్పాశ్రయాం స్త్విహ |

పఞ్చవింశత్సహస్త్రాణి నారదీయం త దుచ్యతే. 26

ఆశ్వయుజ్యాం పఞ్చదశ్యాం యో దద్యా ద్ధేనుసంయుతమ్‌ | పరాం సిద్ధి మవాప్నోతి పునరావృత్తిదుర్లభామ్‌.

యత్రాధికృత్య శకుని న్ధర్మాధర్మవిచారణమ్‌ | వ్యాఖ్యాతం స్యాజ్జైమినయే పక్షిభి ర్ధర్మచారిభిః. 28

మార్కణ్డయేన కథితం తత్సర్వం విస్తరేణ తు | పురాణం నవసాహస్రం మార్కణ్డయ విహోచ్యతే. 29

త త్ర్పయచ్ఛే ల్లిఖిత్వా య స్సౌవర్ణకరిసంయుతమ్‌ | కార్తిక్యాం పౌణ్డరీకస్య క్రతోశ్చ ఫలభా గ్భవేత్‌. 30

య త్త దీశానకల్పస్య వృత్తాన్త మధికృత్యచ | వసిష్ఠాయాగ్నినా ప్రోక్త మాగ్నేయం త త్ర్పచక్షతే. 31

లిఖిత్వా తచ్చ యో దద్యా ద్ధేమపద్మసమన్వితమ్‌ | మార్గశీర్ష్యాం విధానేన తిలధేనుయుగం తథా. 32

తచ్చ షోడశసాహస్రం సర్వక్రతుఫలప్రదమ్‌ | యః ప్రదద్యా న్నర స్సోథ స్వర్గలోకే మహీయతే. 33

బ్రహ్మ మరీచికి ప్రవచించినది బ్రాహ్మపురాణము. దీని గ్రంథ పరిమాణము పదివేలు. దీనిని లిఖించి వైశాఖ పూర్ణిమనాడు జలధేను సహితముగా దానమిచ్చినచో బ్రహ్మలోకప్రాప్తి యగును.

జగత్తు అంతయు జలమయమై పద్మముగా (జలస్థానముగా) నున్నప్పుడు బ్రహ్మ ప్రవచించినది పద్మపురాణము. దీని గ్రంథ పరిమాణము ఏబదిఐదువేలు. దీనిని లిఖించి జ్యేష్ఠమాస పూర్ణిమనాడు సువర్ణ కమలముతోను తిలలతోను దానము చేసినచో అశ్వమేధ ఫలము లభించును.

పరాశరుడు వారాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి అఖిల ధర్మములను ప్రవచించినది విష్ణు పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువదిమూడు వేలు. దీనిని లిఖించి ఆషాఢ పూర్ణిమనాడు ఘృత ధేనువుతో దానమిచ్చినచో విష్ణు లోకము ప్రాప్తించును.

వాయుదేవుడు శ్వేత (వరాహ) కల్ప వృత్తాంతము నాశ్రయించి రుద్రమాహాత్మ్య ప్రధానముగా ప్రవచించినది వాయు పురాణము. దీని గ్రంథ సంఖ్య పండ్రెండు వేలు. దీనిని లిఖించి శ్రావణ పూర్ణిమనాడు పెరుగుతో బెల్లముతో ధేనువుతో కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసినవాడు శివలోకమున ఒక కల్పకాల ముండును.

గాయత్రీ త త్త్వము నాశ్రయించి వృత్రాసుర వధతో కూడ సారస్వత కల్ప వృత్తాంత ప్రధానముగా ధర్మ విస్తరమును వర్ణించినది భాగవత పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునెనిమిదివేలు. దీనిని లిఖించి భాద్రపద పూర్ణిమనాడు బంగారు సింహముతో కూడ దానము చేసినచో పరమపదమును పొందును.

నారదుడు బృహత్కల్పాశ్రయములగు కథలను ప్రవచించినది నారద పురాణము. దీని గ్రంథ ప్రమాణము ఇరువదియైదువేలు. దీనిని లిఖించి ఆశ్వయుజ పూర్ణిమనాడు దేనువుతో కూడ దానమిచ్చినచో పునరావృత్తి లేని దుర్లభమగు పరమ సిద్ధి నందును.

పక్షులను ఆశ్రయముగా చేసికొని ధర్మానుష్ఠాన పరములగు పక్షులు జైమినికి ధర్మాధర్మ విచారణమును వ్యాఖ్యానించినట్లు మార్కండేయుడు ప్రవచించినది మార్కండేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము తొమ్మిదివేలు. దీనిని లిఖించి సువర్ణ గజముతోకూడ కార్తిక పూర్ణిమనాడు దానమిచ్చినచో యజ్ఞఫలము లభించును.

ఈశాన కల్పము నాశ్రయించిన వృత్తాంతములను అగ్ని వసిష్ఠునకు ప్రవచించినది ఆగ్నేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునారువేలు. దీనిని లిఖించి బంగరు పద్మముతో కూడ తిల ధేనువుతో కూడ మార్గ శీర్ష పూర్ణిమనాడు దానము చేసినచో సర్వక్రతు ఫలము లభించి స్వర్గ సుఖములందును.

యత్రాధికృత్య మాహాత్మ్య మాదిత్యస్య చతుర్ముఖః | అఘోరకల్పవృత్తాన్తప్రసంగేన జగత్థ్సితిమ్‌. 34

మనవే కథయామాస భూత గ్రామస్య లక్షణమ్‌ | చతుర్దశసహస్రాణి తథా పఞ్చశతాని చ. 35

భవిష్యచరితప్రాయం భవిష్యం తదిహోచ్యతే | తత్పౌషమాసి యో దద్యా త్పౌర్ణమాస్యాం విమత్సరః.

*గుడధేనుసమాయుక్త మగ్నిష్టోమఫలం లభేత్‌ | రాథ న్తరస్య కల్పస్య వృత్తాన్త మధికృత్య తు. 37

సావర్ణినా నారదాయ కృష్ణమాహాత్మ్య ముత్తమమ్‌ | యత్ర బ్రహ్మవరాహస్య చరితం వర్ణ్యతే ముహుః. 38

త దష్టాదశసాహస్రం «బ్రహ్మకైవర్త ముచ్యతే |

యో దద్యా న్మాఘమాసే తు బ్రాహ్మణాయ కుటుమ్బినే. 39

పౌర్ణమాస్యాం స భవనం బ్రహ్మలోకే మహీయతే | యత్రాగ్ని లిఙ్గమధ్యస్థః ప్రాహ దేవో మహేశ్వరః. 40

య త్త దీశాసకల్పస్య వృతాన్త మధికృత్య చ | కల్పితం లైఙ్గ మిత్యుక్తం పురాణం బ్రహ్మణా స్వయమ్‌.

త దేకాదశసాహస్రం ఫాల్గున్యాం యః ప్రదాపయేత్‌ | తిలధేనుసమాయుక్తం సయాతి శివసాత్మతామ్‌. 42

అర్ధనారీశ్వరం దేవం కృత్వా దేయం తు తత్ఫలమ్‌ | మహావరాహస్య పున ర్మాహాత్మ్య మధికృత్యచ. 43

విష్ణునా7భిహితం క్షోణ్యౖ త ద్వారాహ మిహోచ్యతే | మానవస్య ప్రసంగేన కల్పస్య మునిసత్తమాః. 44

చతుర్వింశత్సహస్రాణి త త్పురాణ మిహోచ్యతే | కాఞ్చనం గరుడం కృత్వా తిలధేనుసమన్వితమ్‌. 45

దద్యా చ్చైత్ర్యాం పౌర్ణమాస్యాం బ్రాహ్మణాయ కుటుమ్బినే |

వరాహస్య ప్రసాదేన పద మాప్నోతి వైష్ణవమ్‌. 46

యత్ర మాహేశ్వరా న్ధర్మా నధికృత్యచ షణ్ముఖః | కల్పే తత్పురుషే వృత్తచరితై రుపబృంహితమ్‌. 47

స్కాన్దం నామ పురాణం త న్నిర్మమే స త్రయోదశమ్‌ |

సహస్రాణాం శతం చైక మితి మర్త్యేషు వర్ణతే. 48

పరిలిఖ్యచ యో దద్యా ద్ధేమశూల సమన్వితమ్‌ | స శైవం పద మాప్నోతి *నరో విచ్ఛిన్న బన్ధనః. 49

త్రివిక్రమస్య మాహాత్మ్య మధికృత్య చతుర్ముఖః | త్రివర్గ మభ్యధా త్తచ్చ వామనం త త్ప్రకీర్తితమ్‌. 50

¡చతుర్దశసహస్రాణి కూర్మకల్పానుగం శివమ్‌ |

యచ్చ త ద్విషువే దద్యా ద్వైష్ణవం యాత్యసౌ పదమ్‌. 51

యత్ర ధర్మార్థకామానాం మోక్షస్యచ రసాతలే | మాహాత్మ్యం కతయామాస కూర్మరూపీ జనార్దనః. 52

ఇన్ద్రద్యుమ్నప్రసఙ్గేన మునిభ్య శ్శక్రసన్నిధౌ | ¨కూర్మంతు షట్సహస్రాణి లక్ష్మీకల్పానుషఙ్గితమ్‌. 53

యో దద్యా దయనే కౌర్మం హేమకూర్మసమన్వితమ్‌ |

గోసహస్ర ప్రదానస్య ఫలం సమ్ప్రప్ను యా న్నరః. 54

శ్రుతీనాం యత్ర కల్పాదౌ ప్రవృత్త్యర్థం జనార్దనః | మత్స్యరూపేణ మనవే నరసింహోపవర్ణనమ్‌. 55

అధికృత్యా7బ్రవీ త్సప్త కల్పవృత్తం మునీశ్వరాః | తన్మాత్స్యమితి జానీధ్వం సహస్రాణి చతుర్దశ. 56

lయుగాదౌ హేమమత్స్యేన ధేన్వాచైవ సమన్వితమ్‌ |

అలఙ్కృతాయ విప్రాయ కాంస్యపాత్రం సకల్పకమ్‌. 57

యో దద్యా త్పృథివీ తేన దత్తా భవతి సా కిల | యదా చ గారుడే కల్పే విశ్వాణ్డా ద్గరుడోద్భవమ్‌. 58

అధికృత్యా7బ్రవీ ద్విష్ణు ర్గారుడం త దిహోచ్యతే | త దష్టాదశ చైకంచ సహస్రాణీహ పఠ్యతే. 59

>సౌవర్ణహంససంయుక్తం యో దదాతి పుమా నిహ | సిద్ధిం స లభ##తే ముఖ్యాం శివలోకే చ సంస్థితిమ్‌.

____________________________________

*గుడకుమ్భ. « బ్రహ్మవైవర్త.

*ఉపరాగేగతేరవౌ. ¡పురాణందశసాహస్రం. ¨సప్తదశసహస్రాణిలక్ష్మీ.

l విషువే. > సౌవర్ణహంసమిథునసంయుక్తంవిషువేనరః

బ్రహ్మ మనువునకు ఆదిత్య మాహాత్మ్యము నాధారముగా చేసికొని అఘోర కల్ప వృత్తాంతమును భూత సమూహ లక్షణమును ప్రాసంగికముగా జగత్‌ స్థితిని విశేషించి భవిష్య వృత్తాంతమును చెప్పినది భవిష్య పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగువేల ఐదువందలు. (ప్రకృతము లభించు భవిష్య పురాణమున ఇంచుమించుగా ఇరువది ఏడువేల శ్లోకములున్నవి.) దీనిని లిఖించి పుష్యమాస పూర్ణిమనాడు విమత్సరుడై గుడ ధేనువుతో దానము చేసినచో అగ్నిష్టోమ యాగఫలము లభించును.

సావర్ణి మనువు నారదునకు రథంతర కల్ప వృత్తాంతమును ఆశ్రయించి ఉత్తమమగు కృష్ణ మాహాత్మ్యమును బ్రహ్మ వరాహ చరితమును చెప్పినది బ్రహ్మకై (వై) వర్తపురాణము. దీని పరిమాణము పదునెనిమిది వేలు. దీనిని లిఖించి మాఘ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు భవనముతోకూడ దానము చేసినచో బ్రహ్మలోక ప్రాప్తియగును.

మహేశ్వరు డగ్ని లింగమధ్యముననుండి ఈశాన కల్ప వృత్తాంతము నాశ్రయించి ప్రవచించినది లైంగ పురాణమని బ్రహ్మ స్వయముగా చెప్పెను. దీని పరిమాణము పదునొకండువేలు. దీనిని లిఖించి ఫాల్గున పూర్ణిమనాడు తిలలతోను నూవులతోను అర్ధ నారీశ్వరదేవుని ప్రతిమతోను దానము చేసినచో శివసాయుజ్యము కలుగును.

విష్ణువు భూమికి మానవకల్పము నాశ్రయించి మహా వరాహ మాహాత్మ్యమును చెప్పినది వారాహ పురాణము. దీని పరిమాణ మిరువదినాలుగువేలు. దీనిని వ్రాసి చైత్ర పూర్ణిమనాడు కుటుంలియగు బ్రాహ్మణునకు బంగారు గరుడునితో తిలలతో ధేనువుతో కూడ దానము చేసినచో వరాహదేవుని అనుగ్రహమున విష్ణు లోకము ప్రాప్తించును.

తత్పురుషకల్పవృత్తాంత మాశ్రయించి మాహేశ్వర ధర్మములను షణ్ముఖుడు (స్కందుడు) ప్రవచించినది స్కాందపురాణము. దీని గ్రంథ పరిమాణము లక్షపై ఒక వేయి శ్లోకములు. దీనిని వ్రాసి బంగరు శూలముతో కూడ దానము చేసిన మానవుడు బంధముక్తుడై శివలోకము నందును.

త్రివిక్రమ మాహాత్మ్యము నాధారముగా గొని కూర్మ కల్ప వృత్తాంతమును పురుషార్థములను బ్రహ్మ ప్రవచించినది వామన పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగు వేలు. దీనిని వ్రాసి విషువ దినమున (రాత్రింబగళ్ళు సమముగానుండు దినమున) దానమిచ్చినవారు విష్ణుస్థాన మందుదురు.

కూర్మరూపు డగు జనార్దనుడు ఇంద్రసన్ని ధియందు మునులకు ఇంద్రద్యుమ్నుని ప్రసంగము మూలముగా లక్ష్మీ కల్ప వృత్తాంతములతో నాలుగు పురుషార్థముల మాహాత్మ్యమును ప్రవచించినది కూర్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఆరువేలు (పదునెనిమిదివేలని మరియొక మతము.) దీనిని వ్రాసి ఆయన ప్రవేశ పుణ్యకాలమున బంగరు కూర్మముతో కూడ దానమిచ్చిన మానవునకు వేయి గోవుల దానము చేసినంత ఫలము కలుగును.

కల్పాదియందు మత్స్యరూపుడగు జనార్దనుడు సత్యవ్రత మనువునకు సప్త (ఋషి) కల్ప వృత్తాంత మాధారముగా వేదముల ప్రవర్తిల్లజేయుటకై (కాలరూపుడగు) పురుషోత్తమ తత్త్వమును వర్ణించి చెప్పినది మత్స్యపురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగున్నర వేలు (లోగడ చెప్పబడిన) యుగాది దినమున బంగారు మత్స్యముతో ధేనువుతో అన్ని అమరికలు కల కాంస్య పాత్రముతోను కూడ దీని వ్రాతప్రతిని బ్రాహ్మణునకు అనేక భూషణములతో అతని నలంకరించి దానము చేసినచో భూమినంతటిని దానము చేసినంత ఫలము కలుగును.

గారుడ కల్పమున బ్రహ్మాండమునుండి గరుడు డుద్భవిల్లిన వృత్తాంతమును విష్ణువు ప్రవచించినది గారుడపురాణము. దీని పరిమాణము పందొమ్మిదివేలు. దీనిని లిఖించి బంగారు హంసతో కూడ దానముచేసినచో సాలోక్య ముక్తిగా శివలోకము లభించును.

బ్రహ్మా బ్రహ్మాణ్డమాహాత్మ్య మధికృత్యా7బ్రవీ త్పునః |

తచ్చ ద్వాదశసాహస్రం బ్రహ్మాణ్డం ద్విశతాధికమ్‌. 61

భవిష్యాణాంచ కల్పానాం శ్రూయతే యత్ర విస్తరః |

తద్బ్రహ్మాణ్డపురాణంచ బ్రహ్మణా సముదాహృతమ్‌. 62

యో దద్యా త్త ద్వ్యతీపాతే చౌర్ణాయుస్వర్ణసంయుతమ్‌ | రాజసూయసహస్రస్య ఫల మాప్నోతి మానవః.

(యత్ర నన్దీశ్వర స్సాక్షా దృషిభిః పృష్టవా న్పురా | నృష్టిసంహారకర్తార మీశ్వరం యత్ర చోక్తవా&.

దేవాసురాణాం సఙ్గ్రామం పురాణం శైవ సంజ్ఞితమ్‌ | చతుర్వింశతిసాహస్రం పురాణం తత్ప్రకీర్త్యతే.

మాఘమాసే చతుర్దశ్యాం కృష్ణపక్షే జనేశ్వర | శివవ్రతాయ దాతవ్యం త త్ప్రలేపాదిభోజనైః

మన్వన్తరశతం సాగ్రం రుద్రలోకే మహీయతే) | చతుర్లక్ష మిదం ప్రోక్తం వ్యాసేనాద్భుతకర్మణా.

మత్పితు ర్మమ పిత్రాచ మయా తుభ్యం నివేదితమ్‌ | ఇదం లోకహితార్థాయ సంక్షిప్తం పరమర్షిణా. 64

ఇద మద్యాపి దేవేషు శతకోటి ప్రవిస్తరమ్‌ | ఉపభేదా న్ప్రవక్ష్యామి లోకే యే సమ్ప్రతిష్ఠితాః 65

పాద్మే పురాణ యత్ప్రోక్తం నరసింహోపవర్ణనమ్‌ | తచ్చాష్టాదశసాహస్రం నారసింహ మిహోచ్యతే. 66

నన్దాపురాణం తత్ప్రోక్తం సఙ్ఖ్యానమితి కల్ప్యతే | నన్దాయ యత్ర మాహాత్మ్యం కార్తికేయేన వర్ణ్యతే. 67

యత్ర సామ్బం పురస్కృత్య భవిష్యోపకథాత్మకమ్‌ | ప్రోచ్యతే తత్పునర్లోకే సామ్బమేవ శుచివ్రతాః. 68

ఏవమాదిత్యసంజ్ఞంచ తత్రైవ పరిగద్యతే | అష్టాద శేభ్యస్తు పృథ క్పురాణం యత్ర దృశ్యతే. 69

విజానీధ్వం ద్విజశ్రేష్ఠా స్తదేతేభ్యో వినిర్మితమ్‌ | పఞ్చాఙ్గాని పురాణస్య వ్యాఖ్యాన మితరత్‌స్స్మృతమ్‌. 70

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశమన్వన్తరాణిచ | వంశానుచరితం చేతి పురాణం పఞ్చలక్షణమ్‌. 71

బ్రహ్మవిష్ణ్వర్క రుద్రాణాం మాహాత్మ్యం భువనస్యచ | సంహారంచ ప్రదృశ్యేత పురాణ పఞ్చవర్ణకే. 72

ధర్మశ్చార్థశ్చ కామశ్చ మోక్షశ్చ పరికీర్త్యతే | సర్వేష్వపి పురాణషు తద్విరుద్ధేషు యత్ఫలమ్‌. 73

సాత్త్వికేషు చ కల్పేషు మాహాత్మ్య మధికం హరేః | రాజ సేషుచ మాహాత్మ్య మధికం బ్రహ్మణో విదుః. 74

తద్వదగ్నే శ్చ మాహాత్మ్యం తామ సేషు శివస్యచ | సఙ్కీర్ణేషు సరస్వత్యాః పితౄణాం చ నిగద్యతే. 75

ఇమ మష్టాదశానాంచ పురాణానా మనుక్రమమ్‌ | యః పఠే ద్ధవ్యకవ్యేషు స యాతి భవనం హరేః. 76

అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీసుతః | భారతాఖ్యాన మతులం చక్రే తదుపబృంహితమ్‌. 77

లక్షేణౖ కేన తత్ప్రోక్తం వధార్థపరిబృంహితమ్‌ | వాల్మీకినాచ యత్ప్రోక్తం రామోపాఖ్యాన ముత్తమమ్‌.

బ్రహ్మణాభిహితం తచ్చ శతకోటి ప్రవిస్తరమ్‌ | ఆహృత్య నారదశ్చైవ తేన వాల్మీకయే పునః. 79

వాల్మీకినాచ లోకేతు ధర్మకామార్థసాధనమ్‌ | ఏవం సపాదాః పఞ్చైతే లక్షా మర్త్యే ప్రకీర్తితాః. 80

పురాతనస్యోదర్కస్య పురాణం తద్విదుర్బధాః |

ధన్యం యశస్య మాయుష్యం పురాణానా మనుక్రమమ్‌. 81

యః పఠే చ్ఛృణుయాద్వాపి సోపి యాతి పరాం గతిమ్‌ |

ఇదం పవిత్రం యశసాం నిదాన మిదం పితౄణామపి వల్లభం స్యాత్‌. 82

ఇదంచ దేవేష్వమృతాయ నిత్య మిదం మహారోగహరం హి పుంసామ్‌. 824

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే పురాణసఙ్ఖ్యానుక్రమణికాకథనం నామ త్రిపఞ్చాశో7ధ్యాయః.

బ్రహ్మ బ్రహ్మాండ వృత్తాంతము నాశ్రయించి భవిష్య కల్ప వృత్తాంత విస్తరమును ప్రవచించినది బ్రహ్మాండపురాణము. దీని పరిమాణము పండ్రెండువేల రెండువందలు. దీనిని లిఖించి వ్యతీపాతయోగమున ఉన్ని వస్త్రములతో బంగారముతో కూడ దానము చేసినచో వేయి రాజసూయముల ఫలము లభించును.

(నందీశ్వరుడు ఋషులకు శివుని సృష్టి సంహార కర్తనుగాను దేవాసుర సంగ్రామ వృత్తాంతమునుకూడ ప్రవచించినది శివ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువది నాలుగు(ఇరువదియైదు) వేలు. వీనిని లిఖించి మాఘ కృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి) నాడు గంధాది ద్రవ్యములతో భోజనములతో కూడ దానము చేసినచో సంపూర్ణముగా నూరు మన్వంతరముల కాలము రుద్రలోక నివాసము సిద్ధించును.)

ఆశ్చర్యకర కర్మలు చేయ సమర్థుడగు వ్యాసుడు నేటికిని దేవలోకమునందు శతకోటి గ్రంథ పరిమాణము గల ఈ పురాణ (సముదాయ)మును లోక హితమునకై సంగ్రహించి నాలుగు లక్షల పరిమాణము గలదిగా చేసెను. దీనిని అతడు మాతండ్రికి చెప్పగా అతడు నాకు ప్రవచించగా నేను మీకు ప్రవచించితిని.

లోకమునందు ప్రతిష్ఠితములై యున్న ఉప పురాణముల సంఖ్య ప్రవచింతును. పాద్మ పురాణమునందు ప్రవచింపబడిన నరసింహ విషయ వర్ణనము కలది నారసింహ పురాణము. దాని పరిమాణము పదునెనిమిదివేలు. కుమార స్వామి నందునకు (శివ) మాహాత్మ్యమును ప్రవచించినది నందా పురాణము. సాంబుని గురించి భవిష్యోపాఖ్యాన రూపమున ప్రవచించినది సాంబ పురాణము. ఇట్లే ఆదిత్య పురాణమును గలదు. ఇట్లే అష్టాదశ పురాణములలో దేనికి సంబంధించిన వేరొక పురాణము కనబడునో అది ఈమూల పురాణమునుంది ఏర్పడిన ఉపపురాణమని ఎరుగ వలయును.

ఇదికాక పురాణమయులకు ఉండవలసిన పంచలక్షణములను పెద్దలు చెప్పియున్నారు. అవి-సర్గము-(ఆదిసృష్టి) ప్రతినర్గము-(భూత పంచకసృష్ఠి) వంశము (ప్రజాపతుల సృష్టి) మన్వంతరములు-వంశానుచరితము (ప్రజాపతుల నుండి కొనసాగిన ఆయా రాజరాజర్షి మహర్ష్యాది పరంపర); ఇట్లీ పంచలక్షణములుకల పురాణములందు బ్రహ్మ విష్ణు రుద్రసూర్యుల మహిమమును భువన సృష్టి సంహారములును ధర్మార్థ కామమోక్షముల ప్రకారములును ప్రవచింపబడును. అన్ని పురాణములయందును (శాస్త్రములకు ప్రతికూలముగా నడచిన దుష్టులకు) ఏతద్విరుద్ధ ఫలము కూడ (ఉదాహరణములతో) చెప్పబడును. (పురాణములు సాత్త్వికములు రాజసములు తామసములు మిశ్రములునని నాలుగు విధములు) సాత్త్విక పురాణములందు విష్ణు మాహాత్మ్యము రాజసపురాణములందు బ్రహ్మ మహిమము తామసపురాణములందు అగ్ని శివుల మాహాత్మ్యము మిశ్రములయందు సరస్వతీ మహిమ పితృదేవతా మాహాత్మ్యములు చెప్పబడును. ఈ అష్టాదశ పురాణాను క్రమమును దేవతా కార్యములందు పఠించినచో విష్ణులోక ప్రాప్తియగును.

వ్యాసుడు పదునెనిమిది పురాణములు రచించిన పిమ్మట వాటి యుపబలముచే కూర్చబడిన భారతేతిహాసమును లక్ష గ్రంథ పరిమాణముతో రచించెను. అది వధప్రధానమైనది. శతకోటి గ్రంథ పరిమాణముతో బ్రహ్మ రచించిన రామాయణమును నారదుడు బ్రహ్మ నుండి ఎరిగి వాల్మీకికి బోధించగా దాని నా ఋషి ధర్మార్థకామమోక్ష సాధకముగా రచించెను. ఇట్లు ఈ పురాణ వాఙ్మయము సపాదపంచ లక్ష (525000) గ్రంథ రూపమయ్యెను. ఉదర్కము (అభ్యుదయము)ను కలిగించు పురాతన (వృత్తాంత) మునకు సంబంధించినది కావున ఈ వాఙ్మయము 'పురాణము' అనబడుచున్నది.

ఈ పురాణానుక్రమము ధన్యతను యశమును ఆయువును కలిగించునది. దీనిని చదివినను వినినను పరమ పదము లభించును. ఇది పవిత్రము కీ ర్తికి మూలము పితృప్రీతికరము. దేవతలకును అమృతమువలె ప్రీతికరము. మానవులకు మహారోగహరము.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున పురాణ సంఖ్యానుక్రమ పురాణ దాన వ్రతములను ఏబది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters