Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్విపంచాశో7ధ్యాయః.

కర్మయోగః.

ఋషయః 

ఇదానీం ప్రాహ య ద్విష్ణుః పృష్ణః పరమ ము త్తమమ్‌ | త్వ మిదానీం సమాచక్ష్వ ధర్మాధర్మస్య విస్తరమ్‌. 1

ఏవ మేకార్ణవే తస్మి న్మత్స్యరూపీ జనార్దనః | విస్తార మాదిసర్గస్య ప్రతిసర్గస్య చాఖిలమ్‌. 2

కథయామాస విశ్వాత్మా మనవే సూర్యసూనవే | కర్మయోగం చ సాఙ్ఖ్యం చ యథావ ద్విస్తరాన్వితమ్‌. 3

శ్రోతు మిచ్ఛామహే సూత కర్మయోగస్య లక్షణమ్‌ | యస్మా దవిదితం లోకే న కిఞ్చి త్తవ సువ్రత. 4

సూతః : కర్మయోగం ప్రవక్ష్యామి యథావ చ్ర్ఛుతిభాషితమ్‌ |

జ్ఞానయోగ సహస్రా ద్ధి కర్మయోగః ప్రశస్యతే. 5

కర్మయోగోద్భవం జ్ఞానం తస్మా త్త త్పరమం పదమ్‌ |

కర్మ జ్ఞానోద్భవం బ్రహ్మ న చ జ్ఞాన మకర్మణః. 6

తస్మా త్కర్మణి యుక్తాత్మా త త్త్వ మాప్నోతి శాశ్వతమ్‌ |

వేదో7ఖిలో ధర్మమూల మాచారశ్చైవ తద్విదామ్‌. 7

అష్టా వాత్మగుణా స్తస్మి న్ర్పధానత్వేన సంస్థితాః | దయా సర్వేషు భూతేషు క్షాన్తి రప్యాతురస్య తు. 8

అనసూయా తథా లోకే శౌచ మన్త ర్బహి ర్ద్విజాః | అనాయాసస్తు కాయేషు మఙ్గల్యాచార సేవనమ్‌. 9

తథా ద్రవ్యే ష్వకార్పణ్య మర్థే షూపార్జితేషు చ | తథా7స్పృహా పరద్రవ్యే పరస్త్రీషు చ సర్వదా. 10

అష్టా వాత్మగుణాః ప్రోక్తాః పురాణస్య తు కోవిదైః | అయ మేవ క్రియాయోగో జ్ఞానయోగస్య సాధకః. 11

కర్మయోగం వినా జ్ఞానం కస్యచి న్నేహ దృశ్యతే | శ్రుతిస్మృత్యుదితం ధర్మ ముపతిష్ఠే త్ర్పయత్నతః.

ఏబది రెండవ అధ్యాయము

కర్మయోగము

ఋషులు సూతు నిట్లడిగిరి: ''మనువు ప్రశ్నించగా మత్స్యరూప విష్ణువు అతనికి తెలిపిన పరమో త్తమమగు ధర్మాధర్మ విస్తరమును తెలుపుము. ఈ చెప్పిన విధమున ఏకార్ణవమయిన జలమునందుండిన మత్స్యరూప జనార్దనుడు సూర్యపుత్త్రుడగు మనువునకు మొదట ఆదిసర్గము ప్రతిసర్గము మొదలగునదంతయు-అనగా వంశ-మన్వంతర-వంశాను చరితములను కూడ-తెలిపియుండెను. అతడు వాటితోపాటు కర్మయోగమును సాంఖ్య (యోగ) మును ఉన్నదియున్నట్లు సవిస్తరముగ చెప్పియుండెను. అని విందుము. (వానిలో సర్గ ప్రతిసర్గ వంశమన్వంతర వంశాను చరితములను నీవలన వింటిమి.) ఇక ఇప్పుడు కర్మయోగ లక్షణమును వినగోరెదము. ఏలయన నీవు సువ్రతుడవు. (యథావిధిగ గురుశుశ్రూష చేసి అన్ని విషయముల నెరిగినవాడవు.) లోకమునందు నీకు తెలియనిది ఏ కొంచెమును లేదు.''

సూతు డిట్లు చెప్పనారంభించెను: శ్రుతులయందు చెప్పబడిన విధమున మీకు కర్మయోగమును తెలిపెదను. (అది తెలిసికొనవలసినదే.) ఏలయన వేయి జ్ఞానయోగములకంటెను కర్మయోగము మేలయినది. కర్మయోగము ననుష్ఠించుట వలననే జ్ఞానయోగములకంటెను కర్మయోగము మేలయినది. కర్మయోగము ననుష్ఠించుట వలననే జ్ఞానము కలుగును. జ్ఞానమువలన పరమపదము-పరమాత్మ త త్త్వము-లభించును. కనుక కర్మము వలనను జ్ఞానము వలనను బ్రహ్మము లభించును. కర్మాచరణము లేనివానికి జ్ఞానము లభించదు. కావున కర్మయోగము నాశ్రయించినవాడు శాశ్వత తత్త్వమును పొందును. వేదము అంతయును దాని త త్త్వమును ఎరిగినవారి ఆచరణమును ధర్మమునకు (ధర్మ కర్మల ననుష్ఠించుటకు) మూలము. ఆ ఆచారమునందును ఎనిమిది ఆత్మగుణములు ప్రధానములు. సర్వ భూతములయందు దయ-ఎన్ని బాధలయందును ఓర్ప లోకము విషయమున అసూయ (దోషారోపబుద్ధి) లేకుండుట-దేహమునను చిత్తమునను పవిత్రత-అక్కరలేని శ్రమ పడకుండుట-శరీరమున శుభలక్షణమును వేషమును కలిగియుండుట-లేని ద్రవ్యముల విషయమున కాని సంపాదించిన ద్రవ్యముల విషయమునకాని పిసినిగొట్టుతనము లేకుండుట- పర ద్రవ్యములందును పరస్త్రీల విషయమునందును కోరిక లేకుండుట (దయ-క్షాంతి-అనసూయ-శౌచము అనాయాసము-మంగళ్యాచార సేవనము-అకార్పణ్యము-అస్పృహ) అనునవి ఈ ఎనిమిది గుణములు. ఇట్టి నడువడియే క్రియాయోగము-ఇది జ్ఞాన సాధకము. ఇది లేనిచో అది లేదు. ప్రయత్నపూర్వకముగా ప్రతియొకరును శ్రుతి స్మృతి ప్రోక్తమగు కర్మల నాచరించుచుండవలయును.

దేవతానాం పితౄణాంచ మసుష్యాణాం చ సర్వదా | *కుర్యా దహరహ ర్యజ్ఞై ర్దేవర్షిగణతర్పణమ్‌. 13

స్వాధ్యాయే నార్చయే దృషీ& హోమై ర్దేవా న్యథావిధి | పితౄ న్ర్ఛాద్ధే దద న్నగ్నౌ భూతాని బలికర్మణా.

పఞైచతే విహితా యజ్ఞాః పఞ్చసూనా7పనుత్తయే | ఖణ్డినీ పేషినీ చుల్లీ జలకుమ్భీ ప్రమార్జనీ. 15

పఞ్చ సూనా గృహస్థస్య తేన స్వర్గం న గచ్ఛతి | తత్పాపనాశనాయాలం పఞ్చ యజ్ఞాః ప్రకీర్తితాః. 16

ద్వివింశతి తథా చాష్టౌ యే సంస్కారాః ప్రకీర్తితాః | తద్యుక్తో7పి న మోక్షాయ య స్త్వాత్మగుణవర్జితః.

తస్మా దాత్మగుణోపేత శ్ర్శుతికర్మ సమాచరేత్‌ | గోబ్రాహ్మణానాం విత్తేన సర్వధా భద్రమాచరేత్‌. 18

గోభూహిరణ్యవాసోభి ర్గన్ధమాల్యాదికేన చ | పూజయే ద్ర్బహ్మవిష్ణంర్కరుద్రవస్వాత్మకం శివమ్‌. 19

వ్రతోపవాసై ర్విధివ చ్ర్ఛద్ధయాచ విమత్సరః | యో7సా వతీన్త్రియ శ్శాన్త స్సూక్ష్మో7వ్యక్త స్సనాతనః.

వాసుదేవో జగత్సూతి స్తస్య సమ్భూతయో హ్యమీ | బ్రహ్మా విష్ణుశ్చ భగవా న్మార్తాణ్డో వృషవాహనః. 21

అష్టౌచ వసవ స్తద్వ దేకాదశ గణాధిపాః | ¡ద్వాదశైవ తథా77దిత్యాః పితరో మాతర స్తథా. 22

ఇమా విభూతయః ప్రోక్తా శ్చరాచరసమన్వితాః | బ్రహ్మాద్యా శ్చతురో మూల మవ్యక్తాధిపతే స్స్మృతాః. 23

బ్రహ్మణా చాథ సూర్యేణ విష్ణునా7థ శివేన వా | అభేదా త్పూజితేన స్యా త్పూజితం సచరాచరమ్‌. 24

బ్రహ్మాదీనాం పరం ధామ త్రయాణా మపి సంస్థితమ్‌ |

దేవమూర్తి రతః పూషా పూజపీయః ప్రయత్నతః. 25

తస్మా దగ్ని ద్విజముఖం కృత్వా సమ్పూజయే దిమా& |

దానై ర్ర్వతోపవాసైశ్చ జపహోమాదినా నరః. 26

ఇతి క్రియాయోగపరాయణస్య వేదా న్తశాస్త్రస్మృతివత్సలస్య |

వికర్మభీతస్య సదా న కిఞ్చి దప్రాప్య మస్తీహ పరే చ లోకే. 27

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే కర్మయోగకథనం నామ

దిపఞ్చాశో7ధ్యాయః.

గృహస్థునకు ఇంటి పనులలో ప్రాణి హింసకు కారణములై పాపము కలిగించునవి ఐదు; అవి: కత్తిపీట-తిరుగలి-పొయ్యి-నీటికడవ-చీపురు అనుననవి; వీనిని పోగొట్టుకొనుటకై అతడు హోమములచే దేవయజ్ఞము శ్రాద్ధములచే పితృయజ్ఞము వేదాధ్యయనముచే ఋషియజ్ఞము అన్నదానముచే మనుష్యయజ్ఞము భూతములకు బలి (నూకలు మొదలగునవి) వేసి భూత యజ్ఞము అను పంచయజ్ఞములను దేవర్షి పితృ తర్పణములను చేయవలెను. ముప్పది సంస్కారములు

____________________________________

*కుర్యాదహరహర్యజ్ఞైర్భూతర్షి «నార్చన్మౌనీ9 ¡లోకపాలా గ్రహాశ్చైవ

పొందినవానికైనను ఈ చెప్పిన ఆత్మ గుణములు లేనిచో మోక్షమురాదు. తనకున్న ధనముతో గోబ్రాహ్మణులకు శుభము కలిగించవలెను. గోవులు భూమి హిరణ్యము వస్త్రములు గంధమాల్యములు మొదలగువానితో బ్రాహ్మణులను పూజించవలెను. బ్రహ్మ విష్ణు భాస్కరరుద్ర వసురూపుడగు శివుని (పరమాత్మను) యథావిధిగా శ్రద్ధాపూర్వకముగా మత్సరము లేకుండ (మరియొకరితో పోటీపడక) వ్రతములు ఉపవాసములు మొదలగునవి ఆచరించుచు అర్చించుచు ఉండవలెను. అతీంద్రియుడు శాంతుడు సూక్ష్ముడు అవ్యక్తుడు సనాతనుడు జగజ్జన్మకారణుడు నగు వాసుదేవుని నుండి రూపొందిన తత్త్వములే బ్రహ్మవిష్ణు శివ రవి వసుగణ రుద్ర గణాదిత్య గణములు సప్త పితృ గణములు సప్త మాతృకలును చరాచరములగు సర్వభూతములును. అవ్యక్త త త్త్వమగు పరమేశ్వరుడు అధిపతిగాగల ఈ విశ్వమునకు బ్రహ్మ విష్ణు శివ సూర్యులు వేళ్ళవంటివారు. కనుక వారిని పరస్పరము అభిన్నులనుగాను వారిని పరమేశ్వరునితో అభిన్నులను గాను ఆరాధించినచో చరాచర విశ్వమును ఆరాధించుట యగును. బ్రహ్మాది మూ ర్తిత్రయమును రవియందు రూపొంది యున్నారు. కనుక ప్రయత్నముతో విధి విధానమున రవి నుపాసించవలయును. అగ్నిముఖ ద్విజముఖములు చేసి (అగ్నియందు ఔపాసనము కాని దేవ సన్నిధిలో దీపము వెలిగించుటకాని చేసి బ్రాహ్మణుని పూజించి ఆతని నోటితో వేదమంత్రములు చెప్పించుచు) దాన వ్రతోపాసన జప హోమాదులతో వీరి నారాధించవలెను.

ఇట్లు క్రియాయోగ పరాయణుడై వేదాంత శాస్త్రమునందును స్మృతి విధానములందును ఆస క్తి కలిగియుండు వానికి ఇహపర లోకములందు పొందరాని దేదియు లేదు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున కర్మయోగమను ఏబది రెండవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters