Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోన పంచాశో7ధ్యాయః.

పూరువంశః.

సూతః : 

పురోః పుత్త్రో మహాతేజా రాజాసీ జ్జనమేజయః | ప్రాచీన్వత స్సుత స్తస్య యః ప్రాచీ మకరోద్దిశమ్‌. 1

ప్రాచీన్వతసుతశ్చాపి మనస్యుశ్చ తతోభవత్‌ | రాజా వాతాయుధో నామ మనస్యో రభవ త్సుతః. 2

* దాయాద స్తస్య చాప్యాసీ చ్ఛఙ్కుర్నామ మహీపతిః |

l శఙ్కో ర్బహువిదః పుత్త్ర స్సమ్పాతి స్తస్య చాత్మజః. 3

« సమ్పాతేస్తు హ్యహంవాది ర్భద్రాశ్వ స్తస్య చాత్మజః | భద్రాశ్వస్యఘృతాచ్యాంతు దశాప్సరసి సూనవః.

ఋచేపుశ్చ విలేపుశ్చ కక్షేపుశ్చ తథైవచ | ఘృతేపుశ్చ విచేపుశ్చ స్థణ్డిలేపు ర్బలేపుచ(శ్చ). 5

ధర్మేపు స్సన్తతేపుశ్చ పుణ్యపు శ్చేతి వై దశ | ఋచేపోర్జ్వలనా నామ భార్యావై తక్షకాత్మజా. 6

తస్యాం నఞ్జనయామాస అన్తినారం మహీపతిః | అన్తినారో మనస్విన్యాం పుత్త్రా న్జజ్ఞే వరాన్ఛుభా&. 7

అంశుం నరపతిం వీరం త్రిహనుం చాపి ధార్మికమ్‌ | గౌరీ కన్యా తృతీయాచ మాన్ధాతు ర్జననీ శుభా. 8

ఆసీ దంశోరథ సతీ యా7స్మాత్‌ పుత్త్రా నజీజనత్‌ | బ్రహ్మవాదపరీతాంస్తు ఉపదానా తథాపిచ. 9

ఉపదానా సుతా న్లేభే చతురస్తు నిజాత్మజా& | రుష్యన్త మథదుష్యన్తం ప్రవీర మనఘం తథా. 10

చక్రవర్తీ తతో జజ్ఞే దుష్యన్తా త్సమితిఞ్జయః | శకున్తలాయాం భరతో యస్య నామ్నా తు భారతాః. 11

దుష్యన్తం ప్రతి రాజానం వాగువాచాశరీరిణీ | మాతా భస్త్రా పితుః పుత్త్రో యేన జాత స్స ఏవ సః. 12

భరస్వ పుత్త్రం దుష్యన్త సత్య మహ శకున్తలా | రేతోధా స్త్రాయతే పుత్త్రః పరేతంచ యమక్షయాత్‌. 13

త్వం చాస్య ధాతా గర్భస్య నావమంస్థా శ్శకున్తలామ్‌ | భరతస్య వినష్టేషు తనయేషు పురా కిల. 14

___________________________________________

* దాయాద స్తస్యచాప్యాసీద్దున్దుర్నామ lదున్దోర్బహువిధః «సంయాతేస్తు

«ఈ విషయమున వివరణము అనుబంధములో చూడుడు.

పుత్త్రాణాం మాతృకోపేన యుగప త్సంక్షయే కృతే |

తతో మరుద్భి రానీయ పుత్త్ర స్స తు బృహస్పతేః. 15

సఙ్క్రామితో భరద్వాజో మరుద్భి ర్భరతస్యచ |

నలువది తొమ్మిదవ అధ్యాయము

పూరువంశము

సూతుడు పూరువంశ వృత్తాంతమును ఋషులకు ఇట్లు చెప్పెను: పూరునకు జనమేజయుడు అతనికి తూర్పు దెన నంతటిని పాలించిన ప్రాచీన్వతుడు అతనికి మనస్యుడు అతనికి వాతాయుదుడు అతనికి శంకుడు అతనికి బహువిదుడు అతనికి సంపాతి అతనికి అహంవాది అతనికి భద్రాశ్వుడు అతనికి ఘృతాచియను అప్సరసయందు ఋచేపు విలేపు కక్షేపు ఘృతేపు విచేపు స్థండిలేపు బలేపు ధర్మేపు సంతతేపు పుణ్యపులను పదిమంది కుమారులు. వీరిలో ఋచేపునకు తక్షక పుత్త్రియగు జ్వలనయందు అంతినారుడు అతనికి మనస్విని అను భార్యయందు వీరుడగు అంశుడను నరపతియు ధార్మికుడగు త్రిహనుడును గౌరియను కన్యయు కలిగిరి. ఈ గౌరి మాంధాతృని తల్లి యయ్యెను. అంశునకు ఉపదానయను పత్నియందు బ్రహ్మవాదులగు రుష్యంతుడు దుష్యంతుడు ప్రవీరుడు అనఘుడు అనుకుమారులు కలిగిరి. అతనికి యుద్ధ విజయియగు భరతుడు అను చక్రవర్తి కలిగెను. ఈతని పేరుననే ఈ వంశము వారికి భారతులను పేరు వచ్చెను. శకుంతల ఈతని తల్లి. (శకుంతలను దుష్యంతుడు తిరస్కరించినపుడు) అశరీరవాణి దుష్యంతుని ఉద్దేశించి ఇట్లనెను: ''దుష్యంతా! తల్లి (వస్తువులను దాచు.) తోలుతిత్తి వంటిది. కుమారుడు తండ్రికి చెందినవాడు. అతడు తాను ఎవరివలన పుట్టెనోఅతడే కాని వేరు కాదు. (కనుక కుమారుని వదలుట తన్ను తాను వదలుకొనుటయే యగును.) కనుక నీవు ఈ కుమారుని భరించుము. శకుంతల సత్యమే చెప్పినది. తనకు జన్మకారణముగా రేతస్సును (శుక్రమును-గర్భమును) నిలి పిన తండ్రిని యమలోకము (నందలి బాధల) నుండి సుతుడు కాపాడును. దుష్యంతా! (శకుంతలయందు) గర్భము నిలిపిన వాడవు నీవు. ఈ శకుంతలను అవమానించకుము.'' (ఈతనిని భరించుము. అని చెప్పబడినవాడు కనుక భరతుడు.)

పూర్వము భరతుని కుమారులు తమ తల్లి కోపమునకు గురియై ఒకేమారు అందరును నశించగా మరుత్తులు (దేవతలు) బృహస్పతి పుత్త్రుడగు భరద్వాజుని ఈ భరతునికి పుత్త్రనిగా సంక్రమింపజేసిరి.

భరద్వాజోత్పత్తి స్తత్సన్తతిశ్చ

ఋషయః: భరతస్య భరద్వాజః పుత్త్రర్థం మారుతైః కథమ్‌. 16

సఙ్కృమితో మహాతేజా స్త న్నో బ్రూహి యథాతథమ్‌ |

సూతః : పత్య్న మాసన్న సత్త్వాయా ముచథ్యే సంస్థితే భువి. 17

భ్రాతు ర్భార్యాం న దృష్ట్వా తు బృహస్పతి రువాచ తమ్‌ |

ఉపతిష్ఠ స్వలఙ్కృత్య మైథునాయచ మే శుభే! 18

వినయో నోపదేష్టవ్య స్త్వయా వే వరవర్ణిని! | ఏ వ ముక్తా7బ్రవీ దేన మన్తర్వత్నీ త్వహం ప్రభో. 19

గర్భః పరిణతశ్చాయం బ్రహ్మ వ్యాహరతే గిరా | అమోఘరేతా స్త్వంచాపి ధర్మం చైవం విగర్హి తమ్‌. 20

ఏవముక్తో7బ్రవీ దేనాం స్వయమేవ బృహస్పతిః | నోపదేష్టవ్యో వినయ స్త్వయా మే వరవర్ణిని. 21

కర్షమాణః ప్రసహ్యైనాం మైథునాయోపచక్రమే | తతో బృహస్పతిం గర్భో ధర్షమాణ ఉవాచహ. 22

సన్ని విష్ణో హ్యహం పూర్వ మిహ తావ ద్బృహస్పతే | అమోఘరేతా స్త్వం తాత నావకాశ ఇహ ద్వయోః.

ఏవ ముక్త స్స గర్భేణ కుపితః ప్రత్యువాచ హ |

బృహస్పతిః: యస్మా త్త్వ మీదృశే కాలే సర్వభూతహితే సతి. 24

ప్రతిషేధసి యస్మా త్త్వం తమో దీర్ఘం ప్రవేక్ష్యసి | తతః కామం సన్నివృత్య తస్యానన్దం బృహస్పతిః.

తద్రేత స్త్వపత ద్భూమౌ నివృత్తం శిశుకో7భవత్‌ |

సద్యోజాతం కుమారం తు దృష్ట్వా తం మమతా7బ్రవీత్‌. 26

గమిష్యామి గృహం స్వం వై భరసై#్వనం బృహస్పతే |

ఏవ ముక్త్వా «గతాయాంతు పిత్రా త్యాగీకృతో7ప్యసౌ. 27

మాతాపితృభ్యాం త్యక్తంతు దృష్ట్వా తం మరుత శ్శిశుమ్‌ |

జగృహుస్తే భరద్వాజం మరుతః కృపయా7న్వితాః. 28

తస్మి న్కాలేతు భరతో బహుభిః క్రతుభి ర్విభుః | కామ్యనైమి త్తికై ర్యజ్ఞై రయజ త్పుత్త్రలిప్సయా. 29

యతస్స యజమానస్తు పుత్త్రం నాసాదయ త్ప్రభుః |

తతః క్రతుం మరుత్త్సోమం పుత్త్రార్థం సముపాహరత్‌. 30

తేన తే మరుత స్తస్య మరుత్త్సోమేన తుష్టువుః | ఉపనిన్యు ర్భరద్వాజం వుత్త్రార్థం భరతాయ వై. 31

దాయాదో7ఙ్గిరస స్సూనో రౌరసస్తు బృహస్పతేః | సఙ్క్రామితో భరద్వాజో మరుద్భి ర్భరతం ప్రతి. 32

ఋషులు నూతు నిట్లు ప్రశ్నించిరి: ''మారుతులు భరతునికి పుత్త్రునిగా భరద్వాజు నెట్లు సంక్రమింపజేసిరో తెలుప వేడెదము.''

సూతు డిట్లు చెప్పెను: ఉచ(చ)థ్యుడు తన భార్య మమత గర్భవతిగా ఉండగా మరణించెను. అతని తమ్ముడు బృహస్పతి మమతను చూచి ''సుందరీ! నీవు చక్కగా అలంకరించుకొని నాతో కలియుటకు సిద్ధవు కమ్ము. నీవు నా కేమియు కట్టుబాటు మాటలు (నీతులు) నేర్పవలదు.'' అనెను. మమత ''ప్రభూ! నేను గర్భవతిని. గర్భము పరిణతమయి (ప్రసవమునకు సిద్ధమయి) యున్నది. ఆ శిశువు వేదమును చెప్పుచున్నది. నీవును వ్యవర్థముకాని వీర్యము కలవాడవు. ఇటువంటి ధర్మము నిందిత మయినది.'' అనెను. కాని ''నీవు నాకు సత్ప్రవర్తనమునుపదేశించ నక్కరలేదు.'' అని బృహస్పతి ఆమెను బలవంతముగా లాగి మైథునము నారంభించెను. అంతట గర్భము (శిశువు) బృహస్పతిని మందలించుచు ''బృహస్పతీ! నేను ముందుగా ఇక్కడ ప్రవేశించితిని. నీవును అమోఘ రేతస్కుడవు. ఇక్కడ ఇద్దరకు తావు లేదు.'' అనెను. శిశువుతో బృహస్పతి ''సర్వభూతములకు (ఆనందకర) హితకరమగు ఇటువంటి సమయమున నన్ను నిషేదించితివి. కావున దీర్ఘమగు తమస్సును (గ్రుడ్డితనమును) ప్రవేశింతువు.'' అనెను. అంతట అతడు తన కామమును ఆనందమును కూడ మరలించుకొనెను. ఆతని వీర్యము భూమి పై పడి వెంటనే శిశువయ్యెను. సద్యోజాతుడగు (వెంటనే పుట్టిన) ఆ శిశువును చూచి మమత బృహస్పతితో ''నేను నా ఇంటికి పోవుచున్నాను. వీనిని భరించుము.'' అని పోయెను. బృహస్పతియు ఆ శిశువును వదలిపోయెను. ఇట్లు తల్లిదండ్రు లిద్దరును వదలిన శిశువును చూచి మరుత్తులు జాలి చెంది తీసికొనిరి. వాయువులచే భరింపబడినందున అతడు భరద్వాజు డనబడెను. (భరత్‌-వాయు > భరత్‌-వాజు > భరద్వాజ) ఆ కాలమునందే భరతుడు పుత్త్రులనువ కోరి కామ్యములను నైమిత్తికములునగు యజ్ఞములతో దేవతల నారాధించెను. కాని అతనికి సంతతి కలుగలేదు. అంతట నతడు 'మరుత్త్సోమము' అను యజ్ఞము నాచరించి దానియం దతడు మరుత్తులను స్తుతించెను. దానికి ప్రీతులై వారు భరద్వాజుని తెచ్చి భరతునకు పుత్త్రునిగా ఇచ్చిరి. ఇతడు ఇట్లు వా స్తవమున అంగిర: పుత్త్రుడగు బృహస్పతికి కుమారుడు.

భరతస్తు భరద్వాజం పుత్త్రం ప్రాప్య తతో7బ్రవీత్‌ |

ఆదాయ త్వాం హితార్థాయ కృతార్థో7హం త్వయా విభో. 33

పూర్వంతు వితథే తస్మి న్కృతే వై పుత్త్రజన్మని | తత స్త్వవితథో నామ భరద్వాజో నృపో7భవత్‌. 34

___________________________________________

« గతా సా గు గతాయాం సో7పి తం త్యజత్‌.

భరతునకు దత్తుడగు భరద్వాజుని ద్వ్యాముష్యాయణ సంతతి -49 అ.

తస్మాదేవ భరద్వాజా ద్ర్బాహ్మణాః క్షత్రియా భువి|

ద్వ్యాముష్యాయణకౌలీనా స్మ్సృతాస్తు ద్వివిధా హి తే. 35

తతో జాతే7వ్యవితథే భరతోపి « వనం య¸°| భరద్వాజాభిధం పుత్త్రామభిషిచ్య చ తం నృవః. 36

దాయాదో7వితథ సాభూ ద్బవమన్యు ర్మహాయశాః|

మహాభూతోపమాః పుత్త్రాశ్చత్తారో భవమన్యవః. 37

బృహతక్షత్రో మహావీర్యో నరో గర్గశ్చ వీర్యవాన్‌ | నరస్యసజ్క్రతిః పుత్త్ర స్తస్య పుత్రోమహాయశాః. 38

గురుశ్చరన్తిదేవశ్చ సాజ్క్రతే స్తావుభౌ స్మ్రతౌ| గర్గస్య చైవ దాయాద శ్శిబి ర్విద్వా న్బభూవహ. 39

స్మ్రతా శ్శైబ్యాస్తతో గర్గ్యాః క్షత్త్రోపేతా ద్విజాతయః| ఆహార్యతనయశ్చైవ ధీమా నాసీ త్తరక్షుకః . 40

తస్య భార్యా విశాలాతు సుషువే పుత్త్రకత్రయమ్‌|

త్ర్యూషణం పుష్కరం చైవ కవిం చైవ మహాయశాః. 41

తరక్షుకసుతా హ్యేతే సర్వే బ్రాహ్మణతాం గతాః|

కావ్వానాంతు సుతా హ్యేతే త్రయః ప్రోక్తా మహర్షయః. 42

గర్గాస్సజ్ర్కతయః కావ్యాః క్షత్త్రోపేతా ద్విజాతయః| సంవృతాఙ్గిరసః పుత్త్రోః బృహత్‌క్షత్త్రశ్చ వక్ష్యతే.

బృహత్‌క్షత్త్రస్య దాయాదో హస్తీ నామ బభూవ హ|

యేనేదం నిర్మితం పూర్వం పురంతు గజసాహ్వయమ్‌. 44

హస్తినశ్చాపి దాయాదా స్త్రయః పరమకీర్తయః| ఆజామీఢో వ్యుమీఢశ్చ పురుమీడ స్తథైవ చ. 45

అజామీఢస్య భార్యాస్తు తిస్రః కన్యాః కులోద్వహాః | నీలినీ ధూమినీ చైవ కేశినీ చైవ విశ్రుతాః. 46

న తాసు జనయామాస పుత్త్రాన్వె దేవవర్చసః| తపసో7న్తే సుమహతో జాతా వృద్దస్య ధార్మికాః. 47

తనకు పుత్త్రడుగా లభించిన భరద్వాజునితో భరతుడు ''విభూ! నాకు హితకరుడవగు నీవు లభించుటచే కృతార్థుడ నయితిని''. అని అతనిని ప్రశంసించెను. తనకు కుమారులు కలుగుట వితథము (వ్యర్థము - అసత్యము) అయి ఉన్నప్పుడు లభించినందున భరతుడీ తనకి అవితథుడు (అసత్యము కానివాడు) అని పేరుంచి అతనిని తన రాజ్యమున పట్టాభిషిక్తుని చేసి తాను వనమునకు పోయేను. «ద్వ్యాముష్యాయణుడగు ఈ భరద్వాజుని వంశమున పుట్టినవారు కొందరు బ్రాహ్మణులును మరికొందరు క్షత్త్రియులు - ఇట్లు రెండు విధములవారు (లేదా ఈ రెండు జాతుల ధర్మముల ననుసరించువారు) జనించిరి.

ఈ అవితథుని కుమారుడు భవమన్యుడు. అతనికి వాయ్యాది మహాభూతములతో తుల్యులగు నలుగురుకుమారులు బృహతక్షత్త్రుడు మహావీర్యుడు నరుడు గర్గుడు అనువారు కలిగిరి. నరునకు సంకృతి అతనికి గురుడు రంతిదేవుడు కుమారులు. గర్గుని కుమారుడు విద్వాంసుడగు శిబి. ఇతని కుమారులు శైబ్యులు గార్గ్యులు అను పేరున క్షత్రియ ధర్మము పాటించు బ్రాహ్మణు లయిరి. వీరిలో ఆహార్యునికి తరక్షుకుడు అతనికి విశాల అను భార్యయందు త్ర్యూషణుడు పుష్కరుడు కవి అనువారు కలిగి బ్రాహ్మణు లయిరి. కావ్యులు అను పేర ప్రసిద్దులలో ఈ మువ్వురును మహర్షులయిరి. గర్గులు సంకృతులు కావ్యులు వీరందరును క్షత్త్రధర్మముతో వర్తించు బ్రాహ్మణులు. వీరిలో సంవృతాంగిరుడు అను నతని కుమారుడు బృహత్‌క్షత్త్రుడు. అతని కుమారుడు హస్తి. అతని పేరుతోనే హస్తినాపురము నిర్మితమయ్యెను. ఇతనికి అజామీడుడు వ్యుమీడుడు పురుమీడుడు అను ముగ్గురు కుమారులు. అతనికి వంశోద్దారికలగు నీలిని ధూమిని కేశిని అను ముగ్గురు భార్యలు. అతడు మహాతపస్సుచేసి తన వార్దకమున భరద్వాజుని అనుగ్రహమున దేవవర్చసులగు ముగ్గురు కుమారులను పొందెను.

__________________________________________

«దివం.

* ఒకరికి జన్మించి మరొకరికి దత్తుడై కాని మరొక హేతువుచే కాని ఇద్దరు తండ్రులకు కుమారుడుగా ఐన ఒకే వ్యక్తి.

భరద్వాజప్రసాదేన విస్తరం తేషు మే శృణు| ఆజామీఢస్య కేశిన్యాం కణ్వ స్సమభవత్కిల. 48

మేధాతిథి స్సుత స్తస్య తస్మా త్కాణ్కాయనా ద్విజాః|

అజామీఢస్య ధూమిన్యాం బృహద్వా నభవ న్నృపః. 49

బృహ ద్బృహద్వతః పుత్త్రో బృహతశ్చ బృహన్మనాః|

బృహన్మన స్సుతశ్చాపి బృహద్దను రితి స్మృతః. 50

బృహద్దనోర్‌ బృహదిషుః పుత్తృ స్తస్య జయద్రథః| అశ్వజి త్తనయ స్తస్య సేనజి త్తస్యచాత్మజః. 51

అథ సేనజితః పుత్త్రా శ్చత్తారో లోకవిశ్రుతాః| రుచిరాశ్వశ్చ తవ్యశ్చ రాజా దృఢరథ స్తథా. 52

వత్స శ్చావన్తికో రాజా యస్య తే పరివర్తకాః | రుచిరాశ్వస్య దాయాదః పృథుసేనో మహాయశాః. 53

వృథుసేనస్య పారస్తు పారా న్నీపోథ జజ్ఞివా9| నీ పసై#్యకశతం చాసీ త్పుత్త్రాణా మమితౌజసామ్‌. 54

నీపా ఇతి సమాఖ్యాతా రాజాన స్సర్వ ఏవ తే| తేషాం వంశకర శ్శ్రీమా న్నీపానాం కీర్తివర్ధనః. 55

* కాశ్యప స్సమరో నామ సచేష్టసమరో 7భవత్‌ | సమరస్య 0 చరో భాను స్సుదర్శ ఇతి తే త్రయః. 56

పుత్త్రాస్సర్వగుణోపేతాః పారపుత్త్రః పృథుర్భవః | పృథోస్తు సువ్రతోనామ సువ్రతే నేహ కర్మణా. 57

జజ్ఞే సర్వగుణోపేతో విభ్రాజ స్తస్య చాత్మజః | విభ్రాజస్య తు దాయాద స్త్వణుహో నామ వీర్యవా9. 58

బభూవ శుకజామాతా కృత్వాభర్తా మహాయశాః | అణుహస్య తు దాయాదో బ్రహ్మదత్తో మహీపతిః. 59

యుగదత్త స్సుత స్తస్య విష్వక్సేనో మహాయశాః| విభ్రాజః పున రాజాత స్సుకతేనేహ కర్మణా. 60

విష్యక్సేనస్య పుత్త్రస్తు ఉదక్సేనో బభూవ హ|

పాల్వాయ స్తస్య పుత్త్రస్తు తస్యాసీ జ్జనమేజయః. 61

ఉగ్రాయుధేన తస్వార్థే సర్వే నీపాః ప్రణాశితాః |

వీరి వంశ విస్తరమును చెప్పెదను వినుడుః అజమీఢునకు కేశినియందు కణ్వుడు అతనికి మేధాతిథి కుమారులయిరి. వీరికి కాణ్వాయనులని వ్యవహారము.

ఈ అజమీఢునకు ధూమినియందు బృహద్వాన్‌ అతనికి బృహత్‌ అతనికి బృహన్మనసుడు అతనికి బృహద్దనువు అతనికి బృహదిషుడు అతనికి జయద్రఢుడు అతనికి అశ్వజిత్‌ అతనికి సేనజిత్‌ అతనికి రుచిరాశ్వుడు కావ్యుడు దృఢరథుడు అవన్తి జనపద రాజగు వక్రుడు అను నలుగురు కుమారు లయిరి. రుచిరాశ్వునకు పృథసేనుడు అతనికి పారుడు అతనికి వీపుడు అతనికి నూటొక్కమంది కుమారులు కలిగిరి. వీరిలో సమరుడు అను నతడు నీపుల వంశమును కీర్తిని వృద్ధి చేయువాడయ్యెను. అతనికి చరుడు భానుడు సుదర్శుడు కలిగిరి. పారునకు పృథుడు అతనికి సువ్రతుడు అతనికి విభ్రాజుడు అతనికి శుకుని అల్లుడును కృత్వా అను నామెకు భర్తయు అగు అణుహుడు అతనికి బ్రహ్మదత్తుడు అతనికి యుగదత్తుడు అతనికి నిష్వక్వేనుడు కలిగిరి. ఇతడు సుకృతవశమున మరల జన్మించిన విభ్రాజుడు అని కీర్తి పొందెను. విష్వక్సేనునకు ఉదక్సేనుడు అతనికి పాల్వాయనుడు అతనికి జనమేజయుడు కలిగెను. ఇతని నిమిత్తమయి ఉగ్రాయుధుడు అను నతడు నీపులనందరను నశింపజేసెను.

ఋషయః : ఉగ్రాయుధ ః కస్య సుతః కస్య వంశే చ కథ్యతే. 62

కిమర్థం తేన తే నీపా స్సర్వే వై సమ్ర్పణాశితాః |

సూతః : ఉగ్రాయుధ స్సూర్యవంశ్య స్తప స్తేపే పరాశ్రమే. 63

స్థాణుభూతో 7బ్దసాహస్రం తం భేజే జనమేజయః| తస్య రాజ్యం ప్రతిశ్రుత్య నీపానాం జగ్మివా న్ప్రభుః.

_______________________________________________________

« కావ్యశ్చ l పరఃపారస్సదశ్వఇతి

ఉవాచ సాన్త్వం వివిధ జఘ్నతు స్తే హ్యుభావపి | హన్యమానా గతా నో చే ద్యస్మాద్ధేతో ర్న మే వచః.

శరణాగతదీక్షార్థం తస్మా దేవ శపామి వః| యది మే 7 స్తి తప స్త ప్తం సర్వాన్తకకరోయమః. 66

తత స్త్వాకృష్యమాణాస్తు యమేన పురత స్తథా | కృపయా పరయా 77 విష్టో జనమేజయ మూచివా9. 67

అజానతా నిమా న్వీరాం స్తన్మేరక్షితు మర్హసి |

జనమేజయ ః : అరే పా పా దురాచార భవితారో 7స్య కిఙ్కరాః. 68

తథేత్యుక్త స్తతో రాజా యమేన యుయుధే చిరమ్‌ | వ్యాధిభి ర్నారకైః పా పై ర్యమేన సహ తా న్బలాత్‌.

విజిత్య మునయే ప్రాదా త్తదద్బుత మివాభవత్‌ | యమస్తుష్ట స్తత స్తసై#్మ ము క్తిజ్ఞానం దదౌ వరమ్‌. 90

సర్వే యథోచితం స్మృత్వా జగ్ముస్తే కృష్ణ మవ్యయమ్‌ |

ఏ షాం తు చరితం గృహ్య హన్యతే నా పమృత్యుభిః. 71

ఇహలోకే పరే చైవ సుఖ మక్షయ మశ్నుతే | అజామీఢస్య నీలిన్యాం విద్వా ఞ్జజ్జే యవీనరః. 72

ధృతిమాం స్తస్య పుత్త్రస్తు తస్య సత్యధృతి స్మ్సృతః |

అథ సత్యధృతే ః పుత్త్రో దృఢనేమిః ప్రతాపవా9. 73

దృఢనేమేస్సు తశ్చాపి సుధర్మా నామ పార్థివః | ఆసీ త్సుధర్మతనయ స్సార్వభౌమః ప్రతాపవా9. 74

సార్వభౌమేతివిఖ్యాతః పృథివ్యా మేకరా డ్బలీ | తస్సాన్వవాయే మహతి మహాపౌరవనన్దనః. 75

మహాపౌరవపుత్త్రస్తు రాజా రుక్మరథ స్మ్సృతః | అథ రుక్మరథస్యాపి సుపార్శ్వోనామ పార్థివః. 76

సుపార్శ్వతనయశ్చాపి సుమతిర్నామ ధార్మికః | సుమతేరపి ధర్మాత్మా రాజా సన్నతిమానపి. 77

తస్యాపి సన్నతిమతః కృతోనామ సుతో మహా9 | హిరణ్యనాభిన శ్శిష్యః కౌసల్యస్య మహాత్మనః. 78

చతుర్విరింశతిధా యేన ప్రోక్తా స్తా స్సామ సంహితాః |

సుతాస్తే ప్రాచ్యసామానః కార్తి ర్నామేహ సామగః. 79

కార్తే రౌ గ్రాయుధస్యాసౌ మహాపౌరవవర్ధనః | విజితో యేన విక్రమ్య వృష స్తస్య పితామాహః. 80

నీలో నామ మహారాజా పాఞ్చాలాధిపతి ర్చలీ | ఉగ్రాయుధస్య దాయాదః క్షేమ్యో నామ మహాయశాః. 81

క్షేమ్యాత్సునీథ స్సంజజ్ఞే సునీథస్య నృపఞ్జయాః| నృపఞ్జయాశ్చ విరథా ఇత్యేతే పౌరవా స్స్మృతాః. 82

ఇతి శ్రీమత్స్య మహాపురాణ చన్ద్రవంశానువర్ణనే పూరువంశ

కథనం నామైకోన పఞ్చాశో 7ధ్యాయః.

ఋషులు ఇట్లడిగిరి ః ''ఉగ్రాయుధుడు ఏ వంశమున ఎవరి కుమారుడై జన్మించెను? ఏల అతడు నీపుల నందరను నశింపజేసెను?''

నూతడు ఇట్లు చెప్పెను ః ఉగ్రాయుధుడు సూర్యవంశజుడు. అతడు ఉత్తమమగు ఆశ్రమమున స్థాణుభూతుడై (కొయ్యవలె కదలక) వేయి ఏండ్లు తపస్సు చేసెను. నీపవంశీయుడగు జనమేజయుడు ఇతనిని తనకు కుమారుడగునట్లు వేడుకొని తన నీపవంశ రాజ్యము నతని కిత్తునని వాగ్దానము చేసెను. ఇందులకు ప్రతికూలత చూపవలదని అతడు నీపులను మంచి మాటలతో బ్రతిమాలి తాను వనమునకు పోయెను. కాని నీపులు ఊరకుండక ఈ ఉగ్రాయుధ జనమేజయుల నిద్దరను చంపవచ్చిరి - కొట్టసాగిరి. అపుడు ఉగ్రాయుధుడు వారితో ''మీరు అకారణముగా మమ్ములను చంపుచున్నారు. ఈ జనమేజయుడు నన్ను ఆశ్రయించినవాడు. అతనిని కాపాడదలచి చెప్పుచున్న నా మాట విని ఇతనిని- జనమేజయుని. విడువుడు.'' అనెను. వా రది వినలేదు. అంతట అతడు ''మీరు నా మాట వినుటలేదు. కావున మిమ్ములను శపించుచున్నాను. నేను చేసిన తపః ఫలము ఏమయిన ఉన్నచో యముడు మిమ్ముల నందర నశింపజేయుగాకః'' అనెను. వెంటనే వారి నందరను యముడు ముందునకు లాగికొని పోసాగెను. అది చూచి జాలిపడి ఉగ్రాయుధుడు ''వీరు తెలియనివారు. ఈ వీరులు నా వారుగా భావించి వీరిని రక్షింప వేడుచున్నాను.'' ఆని జనమేజయునితో పలికెను. వెంటనే జనమేజయుడు యమకింకరులతో ''పాపులగు దురాచారులారా! మీరు ఈ ఉగ్రాయుధునకు కింకరులు కండు.'' అని చెప్పి కింకరులగు వ్యాధులు నారకీయులగు పాపులు మొదలగు వారితోపాటుగా యమునితో పోరాడి వారి నందరను జయించి ఉగ్రాయుధునకు అప్పగించెను. అది చాల ఆశ్చర్యకరమగు విషయముగా నయ్యెను.

జనమేజయుని శక్తికి మెచ్చి యముడు అతనికి ముక్తిజ్ఞానమును వరముగా నిచ్చెను. తత్ఫలితముగా అందరును తగినట్లు ధ్యానమును పూని అవ్యయుడగు కృష్ణుని చేరిరి. (మోక్షము పొందిరి.)

ఈ ఉగ్రాయుధ జనమేజయ నీపుల ఆఖ్యానమును గ్రహించినావరు అపమృత్యువు పాలు గారు. ఇహపరసుఖముల నందుదురు.

అజామీఢునకు నీలినియందు యవీనరుడు అతనికి ధృతిమాన్‌ అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి అతనికి సుధర్మన్‌ అతనికి సార్వభౌముడు (ఇది ఇతని బిరుదనామము) అతని వంశమున మహాపౌరవుడు (ఇది ఇతని బిరుదనామము) అతనికి రుక్మరథుడు అతనికి సుపార్శ్వుడు అతనికి సుమతి అతనికి సన్నతిమాన్‌ అతనికి కృతుడు కలిగిరి. ఇతడు కోసల దేశీయుడు మహాత్ముడు నగు హిరణ్యనాభిన్‌ అను మునికి శిష్యుడై సామ సంహితలను ఇరువది నాలుగు శాఖాభేదములతో ప్రవచించెను. ఆతని కుమారులకు 'ప్రాచ్యసామన్‌'లు అని ప్రసిద్ధి. వారిలో కార్తి అను నాతడు ప్రసిద్ధుడు. ఆతనికి ఉగ్రాయుధుడు. ఈతనికి మహాపౌరవవర్దనుడు అని బిరుదనామము - (పూరువంశము వృద్ది చేయువారిలో చాల గొప్పవాడు అని అర్థము.) ఈతడు తన విక్రమముతో పాంచాలధిపతియు బలశాలియు వృషస్తుడు అను ప్రసిద్ద రాజునకు పితామహుడు నగు నీలుడు అను నతనిని ఓడించి ఈ బిరుదము నందెను. ఇతనికి క్షేమ్యుడు ఇతనికి సునీథుడు అతనికి సృపంజయుడు కలిగెను. ఇతని వంశీయులకు నృపంజయులు అనియు విరథులు అనియు ప్రసిద్ధి. ఇది పౌరవవంశము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున వర్ణనము అను నలువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters