Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రిచత్వారింశో7ధ్యాయః.

యదువంశానువర్ణనమ్‌.

సూతః: ఇత్యేత చ్ఛౌనకా ద్రాజా శతానీకో నిశమ్యతు | విస్మితః పరయా ప్రీత్యా పూర్ణచన్ద్ర ఇవాబభౌ. 1

పూజయామాస నృపతి ర్విధివ చ్చాథ శౌనకమ్‌ | రత్నై ర్గోభి స్సువర్ణైశ్చ వాసోభి ర్వివిధై స్తథా. 2

ప్రతిగృహ్య తత స్సర్వం యద్రాజ్ఞా ప్రహితం ధనమ్‌ | దత్వా చ బ్రాహ్మణభ్యశ్చ శౌనకో7న్తరధీయత.

ఋషయః: యయాతే ర్వంశ మిచ్ఛామ శ్ర్శోతుం విస్తరతో7నఘ |

యదుప్రభృతిభిః పుత్త్రై ర్యథా లోకే ప్రతిష్ఠితః. 4

సూతః: యదో ర్వంశం ప్రవక్ష్యామి జ్యేష్ఠ స్యోత్తమతేజసః | విస్తరేణానుపూర్వ్యాచ్చ గదతో మే నిబోధత.

యదోః పూత్త్రా బభూవుర్హి పఞ్చ దేవసుతోపమాః | మహారథా మహేష్వాసా నామత స్తా న్నిబోధత. 6

సహస్రజి దథో జ్యేష్ఠః క్రోష్టు ర్నీలో బకో లఘుః | సహస్రజేస్తు దాయాద శ్శతజిన్నామ పార్థివః. 7

శతజేరపి దాయాదా స్త్రయః పరమకీర్తయః | హైహయశ్చ హయశ్చైవ తథా వేణుయశ్చ యః. 8

హైహయస్య తు దాయాదో ధర్మనేత్రః ప్రతిశ్రుతః | ధర్మనేత్రస్య కున్తిస్తు సంహత స్తస్య చాత్మజః. 9

సంహతస్య చదాయాదో మహిమా నామ పార్థివః ఆసీ న్మహిమతః పుత్త్రో భద్రశ్రేణ్యః ప్రతాపవా&.

వారాణస్యా మభూ ద్రాజా ప్రథితః పూర్వ మేవతు | భద్రశ్రేణ్యస్య పుత్త్రోభూ ద్దుర్దమో నామ పార్థివః. 11

దుర్దమస్య సుతో ధీమాన్‌ కనకో నామ వీర్యవా& | కనకస్య తు దాయాదా శ్చత్వారో లోకవిశ్రుతాః. 12

కృతవీర్యః కృతాగ్నిశ్చ కృతధర్మా తథైవ చ | కృతౌజాశ్చ చతుర్థోభూ త్కృతవీర్యాత్తు సో7ర్జునః. 13

కార్తవీర్యార్జునచరితమ్‌.

జాతః కరసహస్రేణ సప్తద్వీ పేశ్వరో నృపః | వర్షాయుతం తప స్తేపే దుశ్చరం పృథివీపతిః. 14

దత్త మారాధయామాస కార్తవీర్యో7త్రిసమ్భవమ్‌ | తసై#్మ దత్తా వరా స్తేన చత్వారః పురుషోత్తమః. 15

పూర్వం బాహుసహస్రం తు స వవ్రే రాజసత్తమః | అధర్మం చరమాణస్య సద్భిశ్చాపి నివారణమ్‌. 16

యుద్ధేన పృథివీం జిత్వ ధర్మేణౖవానుపాలనమ్‌ | సఙ్గ్రామే వర్తమానస్య వధశ్చైవాధికా ద్భవేత్‌. 17

నలువదిమూడవ అధ్యాయము

యదువంశాను వర్ణనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇట్లు శౌనకుడు చెప్పిన యయాతి చరితమును విని శతానీకుడు అధికానందముతోపాటు ఆశ్చర్యమును పొంది పూర్ణచంద్రుడువలె ప్రకాశించెను. మరియు అనంతరము శౌనకుని శాస్త్రవిధానానుసారము గోవులతో సువర్ణములతో రత్నములతో వివిధ వస్త్రములతో పూజిం(ఆదరిం)చెను. రాజు తనకు పంపిన ధనమంతయు స్వీకరించి శౌనకుడు దానిని బ్రాహ్మణులకిచ్చి అంతర్ధానమునందెను.

అనగా విని ఋషులు సూతునితో ఇట్లనిరి: ''అయ్యా! యయాతి వంశము యదువు మొదలగు ఆతని పుత్త్రులతో లోకమున ఎట్లు ప్రతిష్ఠితమయ్యెనో తెలుపవేడుచున్నాము.''

నూతుడిట్లనెను: ఉత్తమ తేజశ్శాలియు యయాతికి జ్యేష్ఠపుత్త్రుడునునగు యదుని వంశమును ఆను పూర్వితో విస్తరముగా చెప్పెదను. వినుడు. యదువునకు దేవ కుమారులను పోలిన ఐదుగురు కుమారులు కలిగిరి. వారు మహాధానుష్కులు; మహారథులు. వారిపేరులు: సహస్రజిత్‌-క్రోష్టుడు-నీలుడు-బకుడు-లఘువు-అనునవి. సహస్రజితుని కుమారుడు శతజిత్‌. అతనికి హైహయ-హయ-వేణుహయులు ముగ్గురు కుమారులు. వీరిలో హైహయునికి ధర్మనేత్రుడు-అతనికి కుంతి-అతనికి సంహతుడు-అతనికి మహిముడు-అతనికి భద్రశ్రేణ్యుడు-కుమారులు. ఈ భద్రశ్రేణ్యుడు పూర్వమే వారాణసియందు రాజుగా ప్రసిద్ధుడై యుండెను. భద్రశ్రేణ్యుని కుమారుడు దుర్దముడు. అతని కుమారుడు కనకుడు. అతని కుమారులు లోకవిశ్రుతులగు కృత వీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు అను నలుగురు. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతడు వేయి చేతులు కలవాడుగా - స ప్తద్వీపములకు అధిపతియగు రాజుగానయ్యెను. ఆ రాజు పదివేల సంవత్సరములపాటు ఇతరులు ఆచరించజాలని తపస్సును ఆచరించెను. కార్తవీర్యుడు అత్రి కుమారుడగు దత్తుని ఆరాధించెను. అతడు అతనిని నాలుగు వరములు కోరుకొమ్మనెను. ఆ రాజస త్తముడు సహస్ర బాహువులను- తా నధర్మము నాచరించుచున్నచో సత్పురుషులు దానినుండి తను నివారించుట-యుద్దముతో పృథివిని జయించి ధర్మముననుసరించి దానిని పాలించుట-సంగ్రామమునందు తనకంటె అధికుని చేతిలో మరణము అను నాలుగు వరములను కోరెను.

తేనేయం పృథివీ సర్వా సప్తద్వీపా సపర్వతా | సప్తోదధిపరిక్షిప్తా క్షాత్త్రేణ విధినా జితా. 18

యుధ్దే బాహు సహస్రం వై ఇచ్ఛత స్తస్య ధీమతః | రథై ర్ధ్వజైశ్చ సంజజ్ఞే ఇత్యేవ మనుశుశ్రుమః. 19

దశ యజ్ఞ సహస్రాణి రాజ్ఞాం ద్వీపేమ వై తదా | నిరర్గళాని వృత్తాని శ్రూయన్తే తస్య ధీమతః. 20

సర్వే యజ్ఞా స్సావభృథా స్తస్యాసన్‌ భూరిదక్షిణాః | సర్వే కాఞ్చనయూపా స్తే సర్వే కాఞ్చనవేదికాః. 21

సర్వదేవై స్సమం ప్రాపై#్త ర్విమానై సై#్స్వ రలఙ్కృతః | గన్ధర్వై రప్సరోభిశ్చ నిత్యమే వోపశోభితః. 22

యస్య యజ్ఞే జగౌ గాథాం గన్ధర్వో నారద స్తథా | కార్తవీర్యస్య రాజర్షే ర్మహిమానం నిరీక్ష్య సః. 23

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యన్తి క్షత్త్రియాః | యజ్ఞై ర్దానై స్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేన చ. 24

స హి స ప్తసు ద్వీపేషు ఖడ్గీ చక్రీ శరాసనీ | రథీ ద్వీపా ననుచర న్యోగీ పశ్యతి తస్కరా&. 25

పఞ్చాశీతి సహస్రాణి వర్షాణాం స నరాధిపః | సర్వరత్నై స్సుసమ్పూర్ణ శ్చక్రవ ర్తీ బభూవహ. 26

స ఏవ పశుపాలో7భూ తేక్షత్రపాల స్స ఏవ హి | స ఏవ వృష్ట్ర్యా పర్జన్యో మోగిత్వా దర్జునో7భవత్‌. 27

యో7సౌ బాహు సహస్రేణ జ్యాఘాతకఠిన స్వనః | భాతి రశ్మి సహస్రేణ శారదేనేవ భాస్కరః. 28

ఏష నాగం మనుష్యాణాం మాహిష్మత్యాం మహాద్యుతిః |

కర్కోటక సుతం జిత్వా పురం తత్ర న్యవేశయత్‌. 29

ఏష వేగం సముద్రస్య ప్రావృట్కాలే భ##జే(జ్యే)త వై | క్రీడన్ని వ ముఖోద్భిన్న ప్రతి స్రోతో మహీపతిః.

లలనీః క్రీడితా స్తేన ప్రతి స్రగ్దామమాలికాః | యస్య భ్రుకుటి సన్త్రాసా చ్ఛఙ్కితా7భ్యేతి నర్మదా. 31

ఏకో భుజసహస్రేణ జగ్రాహ స మహార్ణవమ్‌ | కరోత్యావృత్తవేగాం తు నర్మదాం ప్రావృడుత్థితామ్‌. 32

తస్య బాహు సహస్రేణ క్షోభ్యమానే మహోదధౌ | భవన్త్యాలీనని శ్చేష్టాః పాతాళస్థా మహాసురాః. 33

స్థాలీకృత్య మహావీచినక్రమీనమహాతిమిమ్‌ | మారుతావిద్ధ ఫేనౌఘ మావర్తాక్షి ప్తదుస్సహమ్‌. 34

కరో త్యాలోడయన్నే వ దోస్సహస్రేణ సాగరమ్‌ | మన్దరక్షోభచకితా హ్యమృతోత్పాదశఙ్కితాః. 35

తదా7తిచలమూర్తానో భవన్తి చ మహోరగాః | సాయాహ్నే కదళీఖణ్డా నివాత స్తిమితా ఇవ. 36

అతడు సప్తద్వీపములు పర్వతములు కలిగి సప్తసముద్రములనుడుమ నున్న పృథివిని తన విక్రమముతో జయించెను. అతడు కోరుకొనినట్లు యుద్దములయుందు రథములుగా ధ్వజములుగా భుజసహస్రము ఉత్పన్న మయ్యెడిదని పరంపరలో వినుచుందుము. అతడాయా రాజుల ద్వీపములందు నిరాటంకముగా పదివేల యజ్ఞములను నిర్వర్తించెనని వినుచున్నాము. అతని సర్వ యజ్ఞములకు అవభృథములు (యజ్ఞ దీక్షాంతస్నానములు) జరిగెను. భూరిదక్షిణలతో కాంచన యూపము (యజ్ఞపశువును బంధించుస్తంభము)లతో కాంచన వేదికలతో ఆ యజ్ఞములు జరిగెను.

కార్యవీర్యార్జునునియజ్ఞములకు నారదుడను గంధర్వుడు వచ్చెడివాడు. అతడు తాను విమానములో రాగా అతని వెంట అనేక విమానములలో సర్వదేవతలు గంధర్వులు అప్సరసలును వచ్చెడివారు. ఆ విమానములలో ఆ దేవజాతులతో ఉపశోభితుడగు నారద గంధర్వుడు కార్యవీర్యార్జునుని మహిమమును ఇట్లు కొనియాడుచు గాథను గానము చేసెడివాడు: 'తమ యజ్ఞములచేగాని దానములచేగాని తపస్సులచేగాని విక్రమముచేగాని శాస్త్రాధ్యయనముచేగాని క్షత్త్రియు లెవ్వరును కా ర్తవీర్యార్జునుడు పొందుగతిని పొందరు.' అని ఈ గాథకు అర్థము.

ఆ రాజు స ప్తద్వీపములయందును రథమునారోహించి ఖడ్గము చక్రము ధనువు ధరించి యోగియై తస్కరులను కనిపెట్టెడివాడు. అతడు ఎనుబదియైదు వేల సంవత్సరములపాటు సర్వరత్న సంపూర్ణుడగు చక్రవర్తిగా ఉండెను. అతడే పశుపాలుడుగా క్షేత్రపాలుడుగా వర్షము కురియించుటతో పర్జన్యుడుగా యోగియై అర్జునుడుగా అయ్యెను. వింటి నారిని కరోరముగా మ్రోయించుచు వేయి బాహువులు కలిగి శరత్కాలము నందలి వేయికిరణములతో భాస్కరుడు వెలిగినట్లు వెలిగెడివాడు. మహా విజేతయగు ఆ అర్జునుడు మనుష్యుల నడుమనున్న నాగుడను కర్కోటక సుతుని జయించి అతని మాహిష్మతీ నగరమును తన రాజధానిగా చేసికొనెను. (మహి+అహి+మత్‌=మహాహిష్మతీ=మాహిష్మతీ) అతడు (తన మోగశ క్తిచే) నోటితోనే సముద్రపు పోటులను వెనుకకునెట్టియు చెదరగొట్టియు వర్షా కాలములో సముద్ర వేగమును తగ్గించెడివాడు. అతని కనుబొమముడికి భయపడి నర్మదా నది అతని కడకురాగా దానియందు విశిష్టములగు పూలమాలలను ధరించిన తన స్త్రీలను క్రీడింపజేసెడివాడు. తన వేయి చేతులతో సముద్రమును పట్టివేసెడివాడు. వర్షాకాలమున పొంగిన నర్మదకు వేగమును పొంగును తగ్గించెడివాడు. అతడు తన భుజ సహస్రముతో సముద్రమును కలత పరచుచుండగా పాతాళమున (సముద్రమునకు అడుగున)ఉన్న మహా7సురులు భయముతో ముడుచుకొని కదలక మెదలకయుండెడివారు. అతడు సముద్రమును తన భుజ సహస్రముతో పళ్లెరమును పట్టినట్లు పట్టుకొని అటుఇటు ఊపుచుండెడివాడు. అపుడు దానియందలి పెద్ద అలలును వానిలోని నక్రములును మీనములును తిమింగిలములును కలవరపాటు చెందెడివి. గాలియొత్తిడిచే నురుగు పైకి లేచెడిది. సుడులు మరింత భయంకరముగా రేగి దుఃసహములయ్యెడివి. అమృతమునుత్పత్తి చేయుటకై మందర సర్వతముతో సముద్రమును మథించుచున్నా రేమో అను భ్రాంతి భయములతో మహాసర్పములు సాయాహ్న కాలమున గాలిలేని చోట కదలక యుండు అరటి గుబురులవలె కదలక నిలిచి యుండెడివి.

ఏష బద్ధ్వా ధనుర్జ్యాయా ముత్థితః పఞ్చభి శ్శరైః |

లఙ్కాయాం మోహయిత్వా తు బలవా న్రావణం బలాత్‌. 37

నిర్జిత్య బద్ధ్వా7తిరయం మాహిష్మత్యాం బబన్ధ చ | తతో గత్వా పులస్త్యస్తు అర్జునం సమ్ప్రసాదయ&.

ముమోచ రక్షః పౌలస్త్యం పులస్త్యేనేహ సాన్త్వితః | తస్య బాముసహస్రస్య బభూవు ర్జ్యాతలస్వనాః. 39

యుగాన్తార్కసహస్రస్య ఆస్ఫోటా హ్యశ##నేరివ| అహో చిత్రం విధే ర్వీర్యం భార్గవో7యం యదాచ్ఛినత్‌.

తద్వై సహస్రం బాహునాం హైమతాలవనం యథా |

య ద్భార్గవస్తు సఙ్క్రుద్ధో హ్యర్జునం శ ప్తవా న్స్రభుః. 41

యస్మా ద్వనం ప్రదగ్ధం వై విశ్రుతం మమ హైహయ |

తస్మా త్తే దుష్కరం కర్మ కృత మన్యో హరిష్యతి. 43

అర్జునో నామ కౌన్తేయ స్స చ రాజా భవిష్యతి | చిత్త్వా బాహుసహస్రం తే ప్రమథ్య తరసా బలీ. 43

తపస్వీ బ్రాహ్మణః కశ్చి త్త్వాం వధిష్యతి భార్గవః | తస్య రామ స్తదా త్వాసీ న్మృత్యు శ్శాపేన ధీమతః.

వర శ్చైవం తు రాజర్షే స్స్వయమేవ వృతః పురా | తస్య పుత్త్రశతం త్వాసీ త్తే చ తత్ర మహారథాః.

కృతాస్త్రా బలిన శ్శూరా ధర్మాత్మానో మహాబలాః | శూర సేనశ్చ శూరశ్చ వృష్ణిః కృష్ణ స్తథైవ చ. 46

జయధ్వజశ్చ వై కర్తా అవన్తేశ్చ విశామ్పతే | జయధ్వ జస్య పుత్త్రసు తాలజఙ్ఘో మహాబలః. 47

తస్య పుత్త్రశతాన్యేవ తాలజఙ్ఘా ఇతి శ్రుతాః | తేషాం పఞ్చ కులాః ఖ్యాతా హైహయానాం మహాత్మనామ్‌.

వీతిహోత్రాశ్చ పార్యాతా బోజాశ్చావన్తయ స్తథా | తుణ్డికేరాశ్చ విక్రాన్తా స్తాలజఙ్ఘా స్తథైవలచ. 49

వీతిహోత్రసుతశ్చాపి ఆనర్తో నామ వీర్యవా& | దుర్జయ స్తస్య పుత్త్రస్తు బభూవామిత్రకర్శనః. 50

సద్భావేన మహారాజః ప్రజా ధర్మేణ పాలయ& | కార్తవీర్యో7ర్జునో నామ రాజా బాహుసహస్రవా&. 51

యేన సాగరపర్యన్తా ధనుషా నిర్జితా మహీ | యస్తస్య కీర్తయే న్నామ కల్య ఉత్థాయ మానవః. 52

న తస్య విత్తనాశ స్యా న్నష్ణం చ లభ##తే పునః | కార్తవీర్యస్య యో జన్మ కథయే దిహ ధీమతః. 53

యథావత్స్విష్టపూతాత్మా స్వర్గలోకే మహీయతే. 53u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే కా ర్తవీర్యార్జునమహి

మానువర్ణనం నామ త్రి చత్వారింశో7ధ్యాయః.

బలశాలియగు అతడు లంకకుపోయి రావణుని మోహపరచి తన బలముచే ఐదు బాణములతో వానిని జయించి తన వింటి నారితో బంధించి మహిష్మతికి తెచ్చి చెరలో నుంచెను. తరువాత పులస్త్యుడు పోయి బ్రతిమాలగా నతడు రావణుని విడిచెను. అతడు తన భుజసహస్రముతో చేసెడి జ్యాధ్వనులు ప్రళయకాలపు వేయిమంది సూర్యుల నుండి పడెడి పిడుగుల మ్రోతలవలె వినబడెడివి. కాని విధిశ క్తి ఎంత బలవ త్తరమును విచిత్రమును నై నది! ఆ బాహు సహస్రమును భార్గవుడగు పరశురాముడు బంగారు తాటితోపును నరకినట్లు నరకెనుగదా! మహా సమర్థుడగు భార్గవుడను మహాముని క్రుద్ధుడై అర్జునుని ఇట్లు శపించెను: ''ఓ హైహయా! లోక ప్రసిద్ధమగు నా వనమును నీవు దహించితివి కావున నీవు చేసిన దుష్కరమగు సుకృతపు ఫలమునంతటిని మరియొక మానవుడు హరించును. అట్లు నీ సుకృతమును పొంది కౌంతేయుడగు అర్జునుడు (నీ పేరుగలవాడు) రాజగును. నా వంశమునందు పుట్టిన తపస్వి బ్రాహ్మణుడొకడు తన శక్తిచే నీ బాహుసహస్రమును ఖండించి నిన్ను వధించును.'' అని శపించెను. దానికి ఫలముగా ముందుకాలమున పరశురాముడతనికి మృత్యువయ్యెను. అర్జునుడు పూర్వము దత్తాత్రేయుని వలన కోరిక వరము కూడ ఇదియే.

ఈ కార్త వీర్యార్జునునకు నూరు మంది కుమారులు-వారందరును మహారథులును అస్త్ర విశారదులును ధర్మాత్ములును మహాబలులునునై యుండిరి. శూరసేనుడు శూరుడు వృష్టి-కృష్ణుడు జయధ్వజుడు మొదలగువారు వీరిలో ముఖ్యులు. జయధ్వజుడు అవన్తి నగరమును నిర్మించెను. అతని కుమారుడు తాలజఘుడు. అతనికి నూరుమంది కుమారులు కలిగిరి. వారికి తాలజంఘులని వ్యవహారము. వీరిలో ఐదుగురి వంశములు ప్రసిద్ధములు: వార-శర్యాతికోవలోని వీతిహోత్రులు-భోజులు-ఆవంతులు-తుండికేరులు-తాలజంఘులు అనువారు. వీతిహోత్రుని కొడుకు ఆనర్తుడు. అతని కొడుకు దుర్జయుడు. అతడు శత్రు విజేతయై మహారాజై సద్భావముతో ధర్మముతో ప్రజలను పాలించెను.

యదువంశములో కృతవీర్యుని కొడుకగు అర్జునుడు ఇట్లు ప్రసిద్ధుడగు రాజు. అతడు సహస్ర బాహుడు. సాగరపర్యన్తమగు భూమిని అతడు తన ధనువుతో జయించెను. వేకువలో మేల్కొనగానే అతని పేరు తలచిన వానికి ధననాశము కలుగదు. పోయినదియు తిరిగి దొరకులను. అతని కథను చెప్పిన వాడును యజ్ఞములాచరించినవాడు వలె పవిత్రుడై స్వర్గలోకమున పూజింపబడును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యదువంశాను కీర్తనమున కార్తవీర్యార్జున మహిమాను వర్ణమను నలువది మూడవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-1    Chapters