Sri Matsya Mahapuranam-1    Chapters   

చత్వారింవో7ధ్యాయః.

అష్టకాయ యయాత్యుపదిష్టగృహస్థాదిధర్మాః.

అష్టకః :

 చర న్గృహస్థః కథమేతి ధర్మా న్కథం భిక్షుః కథ మార్యకర్మా | వాన ప్రస్థః ప్రస్థితే సన్ని విష్ణో బహూ నస్మి న్త్సమ్ర్పతివేదయన్తి. 1

యయాతిః : ఆహూతాధ్యాయీ గురు కర్మ స్వచోద్యః పూర్వోత్థాయీ చరమే చోవశాయీ |

మృదుర్దాన్తో ధృతిమా నప్రమత్త స్స్వాధ్యాయ శీల స్సిద్ధ్యతి బ్రహ్మచారీ. 2

ధర్మాగమం ప్రాప్య దనం యజేత దద్యా త్సదై వా7తిథీ న్భోజయేచ్చ |

అనాదదానశ్చ పరై రదత్తం సైషా గృహస్థోపనిష త్పురాణీ. 3

స్వవీర్యజీవీ వృజినా న్నివృత్తో దాతా పరేభ్యో న పరోపతాపీ |

తాదృఙ్ముని సిద్ధి ముపైతి ముఖ్యాం చరన్నరణ్య నియతాహారవేషః. 4

అశిల్పజీవీ గుణవాంశ్చైవ నిత్యం జితేన్ద్రియ స్సర్వతో విప్రయుక్తః |

అనోకశాయీ లఘు లిప్సమాన శ్చర న్దేశా నేకచర స్స భిక్షుః. 5

రాత్ర్యా యయా చాభిహితాశ్చ లోకా భవన్తి కామాభిజితా స్సుఖాశ్చ |

తామేవ రాత్రిం ప్రయతేత విద్వా నరణ్యసంస్థో భవితుం యతాత్మా. 6

దశైవ పూర్వా న్దశ చాపరాం శ్చ జ్ఞాతీ నథాత్మాన మథైకవింశమ్‌ |

అరణ్యవాసీ సుకృతం దదాతి ముక్త్వా త్వరణ్య స్వశరీర ధాతూన్‌. 7

అష్టకః : కతిస్వి దేవ మునయః కతి మౌనాని చాప్యుత |

భవన్తీతి తదాచక్ష్వ శ్రోతు మిచ్ఛామహే వయమ్‌. 8

యయాతిః : అరణ్య వసతో యస్య గ్రామో భవతి పృష్ఠతః |

గ్రామేవా వసతో7రణ్యం స ముని స్స్యా న్నరాధిప. 9

అష్టకః : కథఞ్చి ద్వసతోరణ్య గ్రామో భవతి పృష్ఠతః |

గ్రామేవా వసతో రణ్యం కథం భవతి పృష్ఠతః. 10

యయాతిః : న గ్రామ్యా నుపయుఞ్జీత య శ్చారణ్యో ముని ర్భవేత్‌ :

తథ్యాస్య వసతో7రణ్య గ్రామో భవతి పృష్ఠతః. 11

అనగ్ని రనికేతశ్చా ప్యగోత్రచరణో మునిః | కౌపీనాచ్ఛాదనం యావ త్తావదిచ్ఛేచ్చ చీవరమ్‌. 12

యావ త్ప్రాణాభిసన్ధానం తావ దిచ్ఛే చ్చ భోజనమ్‌ !

తథాస్య వసతో గ్రామే7రణ్యం భవతి పృష్ఠతః. 13

యస్తు కామా న్పరి త్యజ్య త్యక్త కర్మా జితేన్ద్రియః |

అతిష్ఠేచ్చ ముని ర్మౌనం స లోకే సిద్ధి మాప్నుయాత్‌. 14

ధౌతదన్తం కృత్త నఖం సదా స్నాత మలఙ్కృతమ్‌ | అసితం సితకర్మస్థం కస్తం నార్చితు మర్హతి. 15

తపసా కర్శితః క్షామః క్షీణమాంసాస్థిశోణితః | స చ లోక మిమం జిత్వా లోకం విజయ తే7పరమ్‌. 16

యదా భవతి నిర్ద్వ న్ద్వో ముని ర్మౌనం సమాస్థితః | కథ లోక మిమం జిత్వా కం వా విజయతే పరమ్‌.

ఆస్యేన తు యదాహారం గోవ న్మృగయతే మునిః | అథాస్య లోకపూర్వో య స్సోమృతత్వాయ కల్పతే.

ఇది శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీక సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే గృహస్థాద్యాశ్రమధర్మ విచారో నామచత్వారింశో7ధ్యాయః.

నలువదవ అధ్యాయము

యయాతి అష్టకునకు గృహస్థాది ధర్మముల నుపదేశించుట

''బ్రహ్మచారి - గృహస్థుడు - సంప్రదాయానుసారముగ ఆ ఆశ్రమపు నియమములందు అభినివేశము కల వానప్రస్థుడు సంన్యాసి-వీరు ఎట్లు నడుచుకొనినచో ఆయా ఆశ్రమ ధర్మముల నాచరించిన పుణ్యమును ఫలమును పొందగలుగుదురు? ఈ విషయమునందు అనేక విధముల(గు భేదముల) ఆయా ఋషులు చెప్పుచున్నారు.'' అని అష్టకుడడుగ యయాతి ఇట్లు చెప్పెను. ''బ్రహ్మచారి గురువు పిలిచినప్పుడు వచ్చి అధ్యయనము చేయవలెను. అడుగనిదే చెప్పనిదే గురుని పనులు చేయవలెను. గురునికంటె ముందు మేల్కొనవలెను. గురుని తరువాత నిదుర పోవలెను. మృదు స్వభావము ఇంద్రియనిగ్రహము నిబ్బరము హెచ్చరిక స్వాధ్యాయము చేయుట-ఈ గుణముల కలిగియున్నచో అతని ఆశ్రమ ధర్మములు సిద్ధించును. ధర్మముచే ధనము నార్జించవలెను. దానితోనే యజ్ఞములు చేయవలెను. దానినే దానము చేయవలెను. దానితోనే అతిథులను భుజింపజేయవలెను. ఇతరులు తమంతతాము ఈయనిదానిని తీసికొనరాదు. ఇది సంప్రదాయాగతమయిన గృహస్థ ధర్మము. తన శ్రమతో జీవించవలెను. పాపము చేయరాదు. ఇతరుల కీయవలెను. ఇతరులను నొప్పించరాదు. ఆహారమునందును వేషమునందును నియమముల పాటించవలెను. ఇట్లు వానప్రస్థ ధర్మమును పాటించుముని ఉ త్తమ (వానప్రస్థధర్మ) సిద్ధిని పొందును. విద్యలతో జీవనము గడుపరాదు. సద్గుణములు కలిగియుండవలెను. ఎల్లప్పుడు ఇంద్రియముల నిగ్రహించుకొనవలెను. అన్ని అనుభవములనుండియు విరక్తుడు కావలెను. ఏ స్థానమునందైనను పడుకొనవలెను. అత్యల్పములైన వానినే కోరవలెను. దేశములందంతట తిరుగుచుండవలెను. ఒంటరివాడై యుండవలెను. ఇది సంన్యాసధర్మము. ఏ రాత్రియందు ఈ లోకములు నాకిక చాలుననియు కామములను సుఖములును నాచే జయింపబడినవి అనియును భావన కలుగునో ఆరాత్రియే వివేకవంతుడగు మానవుడు మనోనిగ్రహముపూని వానప్రస్థుడగుటకు యత్నించవలయును. తాను వానప్రస్థుడై జీవించి శరీర ధాతులవును అరణ్యమునందు విడిచిన వాడు తన వంశమువారిలో తనకు ముందరి పదితరములవారికిని తన తరువాత రాబోవు పది తరములవారికిని తనకును తన సుకృతమును పంచగలుగును.'' అష్టకుడు: ''మునులును మౌనములును ఎన్ని విధములో వినగోరుచున్నాము.'' యయాతి! ''ఎవడు తాను అరణ్యమునందు నివసించుచున్నను గ్రామము తన వెనుకనే యుండునో ఎవడు తాను గ్రామమునందున్నను అరణ్యము తన వెనుకనే యుండునో అతడు ముని యనదగియున్నాడు.'' ఇది ఎట్లని అష్టకుడడుగ యయాతి: ''అరణ్యమునందు మునిగా నున్నప్పుడు గ్రామములందు లభించు వానిని వేనిని ఉపయోగింపరాదు. అట్టివానికి గ్రామము తన వెనుక నున్నట్లగును. గ్రామమునందు తానున్నను అగ్నిహోత్రములను (కామముతో) ఆరాధించక ఇంటిని పట్టించుకొనక తన గోత్రము వేదశాఖ మొదలగు వానికి ప్రాముఖ్యమీయక కౌపీనమును (రహస్యాంగమును) కప్పునంత మాత్రము వస్త్రమును ప్రాణములు నిలుచునంత మాత్రమాహారమును ఉపయోగించుచుండు మునికి అరణ్యము తన వెనుకనున్నట్లగును. కామములను కామ్య కర్మములను విడిచి జితేంద్రియుడై మునియై మౌనమును (మనన ధర్మమును) పూనియున్నచో అట్టివాడు లోకమునందుండియు సిద్ధి పొందును. స్వచ్చపరుపబడిన దంతములు కత్తిరించబడిన గోళ్ళు కలిగి ఎల్లప్పుడును స్నా నమాడి ఉండుచు అలంకరించుకొనియున్నను ఇవి ఏవియు లేక నల్లనివాడై (మలినుడై) యున్నను నిర్మలములగు నడువడులు కలిగియున్న చో అట్టివానిని ఎవరు అర్చింపతగరు? (ఎల్లవారును పూజింపవలసినదే.) తపస్సుచే కృశించి శుష్కించి మాంసము అస్థులు రక్తము క్షీణించియుండువాడు ఈలోకమును పరలోకమును కూడ జయించును. సుఖ దుఃఖములు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను జయించి మౌనము (మనన రూవమగు తపోధర్మము)ను ఆశ్రయించి మునియై ఈ లోకమును జయించినవాడు మరి ఎవ్వరిని జయింపవలసియుండును? (అతడు సర్వమును జయించినట్లే.) మానవుడు తాను మునియై గోవువలె నోటితోనే ఆహారమును వెదకువాడగుచో అట్టి స్థితిలో లోకపూర్వుడు (సనాతనుడు) అగు పరమాత్ముడు ఇతనికి అమృతత్వము (మోక్షపదము)ను సిద్ధింపజేయును.''

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున

యయాత్యష్టక సంవాదము అను నలువదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters