Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టత్రింశో7ధ్యాయః.

యాయాత్యష్టకసంవాదః.

యయాతిః : అహం యయాతి ర్నహుషస్య పుత్త్రః పూరోః పితా సర్వభూతావమానాత్‌

ప్రభ్రంశిత స్సురసిద్ధర్షిలోకా త్పరిచ్చుతః ప్రపతా మ్యల్పపుణ్యః. 1

అహం హి పూర్వో వయసా భవద్భ్య స్తేనాభివాదం భవతాం న ప్రయుంజే |

యో విద్యయా తపసా జన్మ నా వావృద్ధ స్స పూజ్యో భవతి ద్విజానామ్‌. 2

అష్టకః : అవాదీ ప్త్వం వయసాస్మి ప్రవృద్ధ ఇతి వై రాజ న్నభ్యధికః కథంచిత్‌ |

యో వై విద్యా న్వయసా సమ్ప్రవృద్ద స్స ఏవ పూజోభవతి ద్విజానామ్‌. 3

యయాతిః : ప్రతికూలం కర్మణాం పాప మాహు స్తద్వర్తినాంప్రాపణః పాపలోకం |

సన్తో7సతాం నానువర్తన్తి చైత ద్యథా చైషా మనుకూలా స్తథా7సన్‌. 4

అభూద్దనం మే విపులం మహద్వై విచేష్టమానో నాధిగన్తా తదస్మి |

ఏవం ప్రధార్యాత్మహితే నివిష్టో యో వర్తతే స విజానాతి జీవమ్‌. 5

నానాభావా బహవో జీవలోకే దేవాధీనా నష్టచేష్టావిచారాః |

తత్త త్ర్పాప్య న హి హన్యేత ధీరో దిష్టం బలీయ ఇతి మత్త్వాత్మబుద్ధ్యా. 6

సుఖం హి జన్తు ర్యది వాపి దుఃకం దైవాధీనం విన్దతే నాత్మశక్త్యా |

తస్మా ద్దిష్టం బలవ న్మన్యమానో న సఞ్జ్వరే న్నాపి హృ ష్యే త్కదాచిత్‌. 7

దుఃఖే న ము హ్యేత సుఖే న హృ ష్యేత్సమేన వర్తేత సదైవ ధీరః |

తస్మాద్దిష్టం బలవ న్మన్యమానో న సఞ్జ్వరే న్నాపి దూయే త్కదాచిత్‌. 8

భ##యే న ముహ్యా మ్యష్టకాహం కదాచి త్సన్తాపో మే మనసో నాస్తి కిఞ్చిత్‌ |

ధాతా యథా మాం విదధాతి లోకే ధ్రువం తథాహం భవితేతి మత్యా. 9

సం స్వేదజా జరజాణ్డజోద్భిజా స్సరీసృపాః క్రిమయో యథాప్సు మత్స్యాః |

తథా7శ్మాన స్తృణకాష్ఠంచ సర్వం దిష్టోయే స్వాం ప్రకృతిం భజన్తే. 10

అనిత్యతాం సుఖదుఃఖస్య బుద్ధ్వా కస్మా త్సన్తాప మష్టకాహం భ##జేయమ్‌ |

కింకుర్వన్వై కిఞ్చ కృత్వా న తప్యే త్తస్మా త్సన్తాపం వర్జయా మ్యప్రమత్తః. 11

ముప్పది ఎనిమిదవ యధ్యాయము

యయాత్యష్టక సంవాదము.

యయాతి: ''నేను యయాతి అనువాడను. నహుషుని పుత్త్రుడను. పూరుని తండ్రిని. సర్వభూతములను అవమానించినందున పుణ్యము తరిగి పడద్రోయబడి సురసిద్ధ ఋషిలోకమునుండి జారినవాడనగుచు పడుచున్నాను. వయస్సు చేత మీకంటె పూర్వుడను కావున మీకు నమస్కరింపకున్నాను. ద్విజులలో (బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యులలో విద్యచేగాని తపస్సుచేగాని జన్మచేగాని వృద్ధుడగువాడు పూజ్యుడు. అష్టకుడు: ''రాజా! 'నేను వయస్సుచే చాల పెద్దవాడను.' అని నినుగూర్చి చెప్పితివి. ఏదోయొక విధముగా (మాకంటె) అభ్యధికుడవే. ఎవడు తాను ద్వాంసుడును వయస్స చేతను పెద్దవాడును నై యుండునో అతడు ద్విజులలో తప్పక పూజ్యుడే.'' యయాతి: ''కర్మములలో (ఇతరులకు) ప్రతి కూలమయినది పాపము అనబడును. దానిననుసరించువారికి పాపలోకమే గమ్యస్థానము. సత్పురుషులు అసత్పురుషులు అనుసరించెడు పాపకర్మమును అనువ ర్తించరు. వీరికి సత్పురుషులు అనుకూలురై నట్లు అసత్పురుషులుకారు. నాకు విస్తారమగు ధనము ఉన్నది. అది గొప్పది కూడను. యత్నముచేసినచో దానిని పొందక పోవుదునా? అని మనస్సున నిశ్చయము కలిగి ఆత్మహితమునకై అభినివేశముతో యత్నించువాడు జీవుని తత్త్వమును అనుభవ సహితముగా తెలిసికొనగలడు. జీవలోకమునందలి జీవులు నానా రూపములలో నున్నారు. వీరందరును దేవునకు అధీనులు. తమతమ యత్నములందును ఆలోచనము లందును అస్వతంత్రులు. బుద్ధిమంతుడగువాడు అదృష్టము బలవత్తరమయినదని ఎరుగవలయును. తనకు అప్రియములగు ఆయా అనుభవములు ప్రా ప్తించినపుడు దుఃఖమునొందరాదు. జీవులు సుఖమును కాని దుఃఖమును కాని దైవమునకు అధీనులై పొందుదురే కాని తమ శక్తితో (స్వతంత్రతతో) కాదు. కావున దైవము బలవ త్తరమని గురుతెరిగి ఎప్పుడును దుఃఖమునుగాని హర్షమునుగాని పొందరాదు. దుఃఖము ప్రాప్తించినచొ మోహముగాని సుఖము ప్రాప్తించినపుడు హర్షమునుకాని పొందక విచారశీలుడై రెంటియందును సమభావముతో నుండవలయును. దైవము బలవ త్తరమని ఎరిగి ఎట్టి స్థితి యందును మనస్సున బాధనొదకుండవలయును. అష్టకా! నేను మాత్రము భయము ప్రాప్తించినను మోహము పొందను. ఏ సమయమందును నామనస్సునకు ఏమాత్రమును సంతాపము ఉండదు. సృష్టికర్త లోకమునందు ఎట్లు చేయునో నేను అట్లే యగుదునని నేను తలంతును. స్వేదజములు జరాయుజములు అండజములు ఉద్భిజ్జములు సరీసృపములు (ప్రాకెడి ప్రాణులు) క్రిములు మత్స్యములు మొదలగు ప్రాణులుకాని శిలలు తృణములు కాష్ఠములు ఇట్టివి ఏవి అయినను తమతమ అదృష్టమును అనుభవించుట ముగియగనే తమతమ స్వాభావికస్థితిని పొందును. సుఖదుఃఖములు రెండును అనిత్యములేయని నాకు తెలియును. ఇట్టి నేను ఏ హేతువుచే సంతాపమును పొందవలసియున్నది? జీవునకు ఏది చేసిన తరువాతను ఏది చేయుచున్నప్పుడును ఈ సంతాపము కలుగకుండును? (ఏది చేసిన తరువాతగాని ఏది చేయుచున్నప్పుడుగాని ప్రతిపనివలన కలుగు ఫలముకూడ సుఖదుఃఖ సంమిశ్రితమే కావున ఏది చేయువానికిని దుఃఖము కలుగుట తప్పదు.) అందుచే నేను ఏమియు పొరపడక (అన్ని సందర్భము లందును) సంతాపమును పొందకయుందును.

శౌనకః : ఏవం బ్రువాణాం నృపతిం యయాతి యథాష్టకః పునరేవాన్వపృచ్ఛత్‌ |

మాతామహం సర్వగుణోపపన్నం యత్ర స్థితం స్వర్గలోకే యథాచ. 12

అష్టకః : యే యే లోకాః పార్థి వేన్ద్ర ప్రధానా స్త్వయా భుక్తా యం చ కాలం యథా చ |

త న్మే రాజన్ర్బూహి సర్వం యథావ తేక్షత్రజ్ఞవ ద్భాషసే త్వం మి ధర్మమ్‌. 13

యయాతిః : రాజాహ మాసం భువి సార్వభౌమ స్తతో లోకా న్మహతాం సఞ్చరన్వై |

తత్రావసం వర్షసహస్రమాత్రం తతో లోకం పరమ స్మ్యభ్యుపేతః. 14

తతః పురీం పురుహూతస్య రమ్యాం సహస్రద్వారాం శతయోజనాన్తామ్‌ |

తత్రావసం వర్షసహస్రమాత్రం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః. 15

తతో దివ్య మజరం ప్రాప్య లోకం ప్రజాపతే ర్లోకపతే ర్దురాపమ్‌ |

తత్రావసం వర్షసహస్రమాత్రం తతో లోకం పరమస్మ్యభ్యు పేతః. 16

దేవస్య దేవస్య నివేశ##నేచ విజిత్య లోకా నవసం యథేష్టమ్‌ |

సమ్పూజ్యమాన స్త్రిదశైస్సమసై#్త స్తుల్యప్రభావద్యుతి రీశ్వరాణామ్‌. 17

తథా7వసం నన్దనే కామరూపీ సంవత్సరాణా మయుతం శతానామ్‌ |

సహాప్సరోభి ర్విచర న్పుణ్యగన్ధా న్పశ్య న్నగా న్పుష్పితాం శ్చారురూపాన్‌. 18

తత్ర స్థితం మాం దేవసుఖేషు యుక్తం కాలే7తీతే మహతి తతో7తిమాత్రమ్‌ |

దూతో దేవానా మబ్రవీదుగ్రరూపో ధ్వంసే త్యుచ్చై స్త్రిఃప్లుతేన స్వరేణ. 19

ఏతావన్మే విదితం రాజసింహ తతో భ్రష్టోహం నన్దనా తీక్షణపుణ్యః |

వాచో7శ్రౌషం చాన్తరిక్షే సురాణాం సానుక్రోశా శ్శోచతాం మానవేన్ద్ర. 20

అహో కష్టం క్షీణపుణ్యో యయాతిః పతత్యసౌ పుణ్యకృత్పుణ్యకీర్తిః |

*తానబ్రువం పాత్యమాన స్తతో7హం సతాంమధ్యే నిపతేయం బ్రువన్తు. 21

తై రాఖ్యాతా భవతాం యజ్ఞభూమి స్సమీక్ష్య చేమాం త్వరిత ముపాగతో7స్మి|

హవిర్గన్ధై ర్దర్శితా యజ్ఞభూమి ర్ధూమాపాఙ్గం ప్రతిగృహ్య ప్రతీతః. 22

_________________________________________

* స్థానాద్భువం

ఇది శ్రీ మత్స్యమమాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంవానువర్ణనే

యయాతిచరితే యయాత్యష్టకసంవాదో నామాష్టత్రింశో7ధ్యాయః.

ఇట్లు చెప్పుచుపోవుచున్న యయాతి రాజును అష్టకుడు మరల అడిగెను: (యయాతి అష్టకునకు మాతామహుడు కావున ఏ విషయమునైన అడుగదగిన చనవు తనకు గలదు. అతడు సర్వ విషయములను ఎరిగియుండుటేకాక సర్వ సద్గుణములును గలవాడు. కావున ఏ విషయములనైనను విసుగులేకుండ చెప్పగలడు.) అష్టకు డిట్లడిగెను: ''రాజేంద్రా! యయాతిరాజా! నీవు క్షేత్ర-క్షేత్రజ్ఞతత్త్వమును ఎరిగినవాడువలె ధర్మమును చెప్పుచున్నావు. ఇట్టి నీవు స్వర్గలోకము నందు ఎచ్చటనెచ్చట నుంటివో ఎట్లు ఉంటివో ఏయే ప్రధాన లోకముల ననుభవించితివో ఎంతకాలము అనుభవించితివో ఎట్లనుభవించితివో ఈ ప్రతియొక యంశమును వాస్తవ రూపమున నాకు తెలుపుము.'' యయాతి: ''నేను భూలోకము నందు ఉన్నంతవరకును సార్వభౌముడనగు రాజుగా నుంటిని దేహత్యాగానంతరము 'మహత్‌' జనులు నివసించెడి లోకములందు సంచరింపసాగితిని. అచ్చట సహస్రవర్షము లుంటిని. తరువాత అంతకంటెను పైలోకములకు పోయితిని. తరువాత అచ్చటి నుండి ఇంద్రునినగరికి పోయినాను. అది రమ్యమయినది. అది వేయి వాకిండ్లు గలది. నూరు యోజనములు పరిధికదలది. దానియందు సహస్ర సంవత్సరము లుంటిని. తరువాత దాని కంటె పై లోకమునకు వెళ్లితిని. తరువాత లోకరక్షకుడగు ప్రజాపతి లోకమునకు వెళ్లితిని. అది దివ్యము. ఎన్నటికిని చెడనిది. దానిని చేరుట సుకరముకూడ కాదు. అచ్చటను నేను సహస్రవర్షములుంటిని. తరువాత దానికంటె పైలోకమునకు వెళ్లితిని. ఇట్లు ఏయే దేవుని లోకమున కైనను (నాపుణ్యబలముచే) దానిని జయించి వెళ్లితిని. కనుకనే వాటియందు నేను నా ఇచ్చ ననుసరించి నివసించితిని. లోకేశ్వరుల కాంతితో ప్రభావముతో తుల్యములగుద్యుతిము ప్రభావమును కలిగి అచ్చట నుండెడివాడును. సమస్త దేవతలును నన్నచ్చట సంపూజించు (సర్వోపచారములతో ఆదరించు) చుండెడివారు. అట్లు నేను నందనవనమునందు కామ రూపుడనై అయుతశత సంవత్సరములు (10000×100 =1000000) ఉంటిని. అచ్చట మనోహరములగు రూపములు కలవియు పుష్పించినవియు అగు పుణ్య సుగంధములను (సుగంధవంతములగు మనోహర పుష్పములను) చూచుచు అప్సరసలతోకూడి సంచరించెడి వాడను. ఇట్లు దేవభోగములయందు ఆసక్తుడనై నేనచటనుండగా అవధి లేనంత అధికకాలము గడచెను. అంతలో భయంకర రూపుడగు దేవదూత యొకడు వచ్చి ప్లుతస్వరముతో'ధ్వంస(3) (జారిపడుము!) అని మూడు మారులు బిగ్గరగా ననెను. రాజసింహా! నాకు ఇంత మాత్రమే తెలియును. వెంటనే నేను క్షీణపుణ్యుడనై నందనమునుండి జారిపడితిని. ఇంతేకాక అంతరిక్షమందు నాస్థితికై శోకించు దేవతల దయాపూర్ణమైన వాక్కులు నాకిట్లు వినబడెను: ''అయ్యో! ఎంత కష్టము! ఇడుగో! ఈ యయాతి పుణ్యకర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించినవాడు. పుణ్య కరమగు కీర్తికలవాడు. ఇట్టివాడు క్షీణపుణ్యుడై క్రింద పడుచున్నాడే!'' ఏమైనను నేనచ్చటినుండి పడద్రోయబడితిని. క్రిందకు పడుచునేయుంటిని. కనుక సత్‌జనుల నడుమ నేను పడవలెనని దీవించి పలుకుడని నేను వారిని వేడితిని. వారును మీయజ్ఞ భూమిని పేర్కొనిరి. నాకు వెంటనే ఇది కనబడినది. త్వరితముగా ఇటకు చేరితిని. ఎట్లన హవిర్గతంధములే మీయజ్ఞ భూమిని నాకు చూపినవి. యజ్ఞ ధూమపు కొనను దాని సుగంధమును అందుకొని ఆనందితుడనై తిని.''

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున

యయాత్యష్టక సంవాదము అను ముప్పది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters