Sri Matsya Mahapuranam-1    Chapters   

షడ్వింశతితమో7ధ్యాయః.

కచ దేవయానీ సంవాదః.

శౌనకః : 

సమావృత్తం తు దత్తం తం విసృష్టం గురుణా తతః | ప్రస్థితం త్రిదశావాసం దేవయా న్యబ్రవీ దిదమ్‌. 1

దేవయానీ: ఋషే రఙ్గిరసః పౌత్త్ర! వృత్తే నాభిజనేన చ| భ్రాజసే విద్యయా చైవ తపసా చ దమేన చ.

ఋషి ర్యథాఙ్గిరా మాన్యః పితు ర్మమ మహాయశాః |

తథా మాన్యశ్చ పూజ్యశ్చ మమభూయో బృహస్పతిః. 3

ఏవం జ్ఞాత్వా విజానీహి యద్ర్బవీమి తపోధన | వ్రతస్థనియమో పేత యథా వర్తా మ్యహం త్వయి. 4

స సమావృత్తవిద్యో మాం భక్తాం న త్యక్తు మర్హసి | గృహాణ పాణిం విధిన న్మమ మన్త్రపురస్కృతమ్‌.

కచః: పూజ్యో మాన్యశ్చ భగవా న్యథా మమ పితా తమ | తథా త్వ మనవద్యాఙ్గి*పూజనీయో త్తమా శుచిః.

ఆత్మప్రాణౖః ప్రియతమా భార్గవస్య మహాత్మనః | త్వం భ##ద్రే ధర్మతః పూజ్యా గురుపుత్త్రి సదా మమ.

గురు ర్నిత్యం పూజ్యతమో మాన్య శ్శుక్రః పితా తవ |

దేవయాని తథైవ త్వం నైవం మాం వక్తు మర్హసి. 8

దేవయాని :గురుపుత్త్రస్య పుత్త్రో మేన తు త్వమసి మే పితుః|

తస్మా న్మాన్యశ్చ పూజ్యశ్చ మమాపి త్వం ద్విజోత్తమ. 9

అసురై ర్హన్యమానే చ కచ త్వయి పునః పునః | తదాప్రభృతి యా వృత్తి స్తాం త్వం వేత్సి న వేత్సమే.

సౌహార్దే చానురాగేచ వేత్థ మే భక్తి ముత్తమామ్‌ | న మా మర్హసి ధర్మజ్ఞ త్యక్తుం ¨శక్తాం మనోరమామ్‌.

ఇరువది ఆరవ అధ్యాయము

కచ దేవయానీ సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను! కచుడు ఇట్లు విద్యాధ్యయన సమాప్తి చేసి సమావర్తన వ్రతము జరిపి స్వగృహమునకు పోవుటకు తన గురుని అనుమతి నందెను. గురుడు అతనికి వీడ్కోలు చెప్పెను. అతడును దేవలోకమునకు పోవుటకు బలుదేరెను. అపుడు దేవయాని కచునితో ఇట్లు పలికెను: ''నీవు స్వయముగా అంగిరః ప్రజీపతికి పౌత్త్రడవు. ఉన్నత వంశము మంచి నడువడి విద్య తపస్సు దమము కలిగి మిగుల ప్రకాశించుచున్నావు. మాతండ్రికి మహాయశుడగు అంగిరోమహర్షి పూజ్యు డైనట్లు మీ తండ్రి బృహస్పతి నాకు అట్లును అంతకంటె అధికముగా కూడ మాన్యుడును పూజ్యుడును. ఇది తెలిసి తనపోధనా! నేను చెప్పుచున్న విషయము అర్థము చేసికొనుము. నీవు విద్యావ్రతము నందుండి ఆ నియమములు పాటించుచున్న నీ విషయములో నే నెట్లుంటినో నీవు ఎరుగుదువు. ఇపుడు నీవు విద్యాధ్యయనము ముగించి సమావర్తనము చేసికొనినావు. నేనో నీ భక్తురాలను. నన్ను నీవు విడుచుట తగదు. యథావిధిగా మంత్రపూర్వకముగా నీవు నా పాణిగ్రహణముచేయుము.''

_________________________________________

* పూజనీయోత్తమోత్తమా. శక్తామనాగనమ్‌.

కచుడు: ''నీవు లక్షణవంతమయిన దేహము కలదానవగుటతోపాటు ఉత్తమురాలవును పవిత్రురాలవును. భగవానుడగు మీ తండ్రివలె నీవును నాకు పూజ్యురాలవు. మహాత్ముడగు భార్గవు(శుక్రు)నకు నీవు వారి ప్రాణములవలె ఇష్టవు. గురుపుత్త్రివగుటచే పూజ్యురాలా! ధర్మము ననుసరించి నీవును సదా నాకు పూజ్యపు. నీకు తండ్రియు నాకు గురుడును అగు శుక్రులవారు నాకు సదా పూజ్యుడే కధా! కనుక నీవును నాకు అట్టిదానవే. కనుక దేవయానీ! నీవు ఇట్లు పలుకదగదు.''

దేవయాని: '' నాకు గురుడు (పూజ్యుడు) అగు అంగిరసుని కుమారుడగు బృహస్పతికి కుమారుడవే కాని నా తండ్రికి పుత్త్రుడవు కావు. కనుక నీవును నాకు మాన్యుడవును పూజ్యుడవును. అదియుగాక మాటిమాటికిని నిన్ను రాక్షసులు వధించగా నేను నీ విషయమున ఎట్లుంటినో నీవు ఎరుగుదువా-ఎరుగవా? సౌహార్దముగాగాని అనురాగముగాగాని నాకు నీ యందలి భక్తిని నీవు ఎరుగుదువు. నీవు ధర్మమును ఎరిగినవాడవు. నేను శక్తురాలను-సౌందర్యవతిని-నీ మనస్సును ఆనంద పెట్టుదానను. నన్ను నీవు విడుచుట తగదు.''

కచః: అనియోజ్యే నియోగే మాం నియుంక్ష్యసి శుభవ్రతే|ప్రసీద సుభ్రూ ర్మహ్యం త్వం గురో ర్గుతరే శుభే.

యత్రోషితం విశాలా క్షి త్వయా చన్ద్రనిభాననే | తత్రాహ ముషితో భ##ద్రే కుక్షౌ కావ్యస్య భామిని. 13

భగినీ ధర్మతో మే త్వం మైవం వోచ శ్శభాననే | సుఖేనాధ్యుషితో భ##ద్రే న మన్యు ర్విద్య తే మమ. 14

ఆపృచ్ఛే త్వాం గమిష్యామి శివ మస్తు చ మే పథి | అవిరోధేన ధర్మస్య కర్తవ్యో7స్మి కథాన్తరే. 15

అప్రమత్తోత్థితా నిత్య మారాదయ గురుం మమ |

దేవయానీ: యది మాం ధర్మకామార్థం ప్రత్యాఖ్యాస్యసి ధర్మతః. 16

తతః కచ న తే విద్యా సిద్ధి మేషా గమిష్యతి | కచః: గురుపుత్త్రీతి కృత్వా హం ప్రత్యాచక్షే న దోసతః.

గురుణా చాభ్యనుజ్ఞాతా కామ మేవం శ్రయస్వ మామ్‌ |

ఆర్షం ధర్మం బ్రువాణో హి దేవయాని యథా త్వయా. 18

శప్తో నార్హో7స్మి శాపస్య కామతో7పి న ధర్మతః | తస్మా ద్భవత్యా యః కామో స తథా స భవిష్యతి. 19

ఋషిపుత్త్రో న తే కశ్చి త్కదా పాణిం గ్రహీష్యతి | ఫలిష్యతి న మే విద్యా త్వద్వచశ్చేతి త త్తథా. 20

అధ్యాపయిష్యామి చ యం తస్య విద్యా ఫలిష్యతి |

శౌనకః: ఏవ ముక్త్వా నృపశ్రేష్ఠ దేవయానీం కచ స్తదా. 21

త్రిద శేశాలయం శీఘ్రం జగామ ద్విజపుఙ్గవః | తదాగమ మభిప్రేక్ష్య దేవా స్సేన్ద్రపురోగమాః. 22

బృహస్పతేశ్చ సదసి కచ మాహు ర్ముదాన్వితాః |

దేవాః : య త్త్వ మస్మద్ధితం కర్మ కృతవా న్మహ దద్భుతమ్‌. 23

న తేజసా ప్రణశితా భాగభా క్త్వం భవిష్యసి.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీక

సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే దేవయానీ

కచసంవాదో నామ షడ్వింశతితమో7ధ్యాయః.

కచుడు: ''నీవు శుభములగు కర్మములనే ఆచరించుదానవు. నియోగించకూడని పనిలో నీవు నన్ను నీయోగించుచున్నావు. నా పై దయ చూపుము. (అనురాగమును కాదు.) నీవు సుందరివి కాదని నే ననలేదు. కాని నీవు శుభస్వరూపవు. కావున నీవు నాకు నా గురునికంటెను గురుతర(పూజ్యతర)వు. నీవు వసించిన శుక్రుని గర్భమునందే నేనును వసించితిని. కోపింపకుము. ధర్ముముచే నీవు నీకు సహోదరివి. శుభాననా! నన్నిట్లు పలుకదగదు. నీ దయచే నే నిచట సుఖముగా ఉంటిని. నిజమే. నీ విట్లడిగితి వని నాకు నీపై కోపమును లేదు. నాకు సెలవు ఇమ్ము. పోయి వత్తును. నాకు మార్గమున శుభమగునట్లు దీవించుము. ఇకమీదట ఇతర విషయములందును ధర్మావిరుద్ధముగా నడుచుకొనునట్లు ఆశీర్వదించుము. ఏమరుపాటులేని పూనికతో నా గురుని నిత్యమును అరాధించుచుండును.''

దేవయాని: ''నీవు కేవలము ధర్మమునందే దృష్టినుంచి నా అనురాగమును తిరస్కరించుచున్నావు. కనుక నీకు ఈ విద్య సిద్ధి నీయదు.''

కచుడు: ''నీవు గురుపుత్త్రివి అను హేతువుచే నేను నన్ను కాదంటినే కాని నీయందు దోషమున్నదని కాదు. ఒకవేళ మీ తండ్రి అనుమతించినచో నన్ను నీవు భర్తగా ఆశ్రయించినను నేను కాదనను. నేను చెప్పినది ఆర్షమగు ధర్మము. ఇట్టి నన్ను నీవు ధర్మ దృష్ఠితో నైను కామదృష్టితోనే యైనను శపించుట న్యాయము కాదు. కనుక నీ కామ పురుషార్థము కూడ అది ధర్మానుకూలముగా నడువకపోవుగాక! (బ్రాహ్మణుడగు) ఋషిపుత్త్రుడు ఎవ్వడును ఎప్పుడును నిన్ను వివాహమాడకకుండుగాక! నీ మాటచే నాకు ఈ విద్య ఫలింపకున్నను నేను దాని నుపదేశించిన వానికి ఫలించును.''

దేవయానితో ఇట్లు పలికి వెంటనే కచుడు స్వర్గమునకై బయలుదేరిపోయెను. ఇంద్రాది దేవతలును కచుడు స్వర్గమునకు మరలి వచ్చిన సందర్భమున-బృహస్పతి సన్నిధిలో సభ జరిపి దానిలో సంతోషమున కచునితో ఇట్లనిరి: ''నీవు చాల గొప్పదియు అద్భుతమును నగు హితమును మాకు ఆచరించితివి. కావున నీ తేజస్సు ఎన్నటికిని నశింపకుండును. నీకు యజ్ఞములందు భాగము ఉండును.''

ఇది శ్రీతమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున దేవయానీ కచ సంవాదమును ఇరువది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters