Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయోవింశో7ధ్యాయం.

చన్ద వంశ వర్ణనప్రారమ్భశ్చన్ద్రోత్పత్తి శ్చ.

ఋషయః: సోమః పితౄణా మధిపః కథం శాస్త్రవిశారద| తద్వంశ్యా యేచ రాజానో బభూవుః కీర్తివర్ధనాః.

సూతః: ఆదిష్టో బ్రహ్మణా పూర్వ మత్త్రి స్సర్గవిధౌ పురా |

అనుత్తమం నామ తప స్సృష్ట్యర్థం తప్తవా న్ప్రభుః. 2

యదానన్దకరం బ్రహ్మ జగతః క్లేశనాశనమ్‌ | బ్రహ్మవిష్ణ్వర్కరురుద్రాణా మభ్యన్తర మతీన్ద్రియమ్‌. 3

శాన్తకృ చ్ఛాన్తమనసాం త దత్రినయనే స్థితమ్‌ | మహా న్తం తపసో విప్రాః పరమానన్దకారకమ్‌. 4

కస్మా దుమాపతి స్సార్ధ ముమయా తదధిష్ఠితమ్‌ |

తద్దృష్ట్వా చాష్టమాం శేన తస్మా త్సోమో7 భవచ్ఛిశుః. 5

అథ సుస్రావ నేత్రాభ్యాం తత్తేజ శ్చామ్బుసమ్భవమ్‌|

దీపయ న్విశ్వ మఖిలం జ్యోత్స్న యా సచరాచరమ్‌. 6

తద్దిశో జగృహుర్ధామ స్త్రీరూపేణ సుతేచ్ఛయా | గర్భో భూత్వోదరే తాసా మాస్థిత శ్చా యుతత్రయమ్‌. 7

ఆశాస్తం ముముచు ర్గర్భ మశక్తా ధారణ తతః | సమాదాయాథ తం గర్భ మేకీకృత్య చతుర్ముఖః. 8

యువాన మకరో ద్బ్రహ్మా సర్వాయుధధరం నరమ్‌ | స్యన్దనే7థ సహస్రాశ్వే దేవశ క్తిమయే ప్రభుః. 9

ఆరోప్య లోక మనయ దాత్మన స్స పితామహః | తతో బ్రహ్మర్షిభిః ప్రోక్త మస్మత్స్వామీ భవత్వయమ్‌.

ఋషిభి ర్ధేవగన్ధర్వై రోషధీభి న్తథైవచ | తుష్టువు స్సోమదైవత్యైర్బ్రహ్మాద్యా మన్త్రసఙ్గ్రహైః. 11

స్తూయమానస్య తస్యాభూ దధికో ధామసఞ్చయః | తేజోవితానా దభవ ద్భువి దివ్యౌషధీగణః. 12

తద్దీప్తి రధికా తస్మా ద్రాత్రౌ భవతి సర్వదా | తదోషధీశ స్సోమో7భూ ద్ద్విజేశశ్చ నిగద్యతే. 13

వేదధామర సశ్చాపి యదిదం చన్ద్రమణ్డలమ్‌ | క్షీయతే వర్ధితం చైవ శుక్లే కృష్ణేచ సర్వదా. 14

వింశతిశ్చ తథా స ప్త దక్షః ప్రాచేతసో దదౌ | రూపలావణ్యసంయుక్తా స్తసై#్మ కన్యా స్సువర్చసః. 15

ఇరువది మూడవ అధ్యాయము

చంద్రవంశ వర్ణనము-చంద్రోత్పత్తి మొదలగు వృత్తాంతములు.

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: సూతా! మీరు సర్వ పురాణ శాస్త్రములను బాగుగా ఎరిగిన వారు. సోముడు పితరులకు అధిపతి ఎట్లు అయ్యెను? అతని వంశమునందు లోకమున తన కీ ర్తిని వృద్ధి చేసికొన గలిగిన రాజులు ఎవరెవరు జన్మించిరి?

సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను: బహ్మ మానస పుత్త్రుడును ప్రజా పతియును అగు అత్రి మిగుల సమర్థుడు. అతనిని బ్రహ్మ ఆదేశించగా అతడు లోక సృష్టిని కొనసాగించుటకై సంకల్పించి సర్వోత్తమమగు తపస్సాచరించెను.

పర్రబహ్మ తత్త్వము లోకముల కన్నిటికిని క్లేశమును నశింపజేయునది. ఆనందమును కలిగించునది. బ్రహ్మ విష్ణు రవి రుద్రులకును అంతరంగ రూపమయినది. ఇంద్రియములకు గోచరించనిది. శాంతమగు మనస్సు కల వారిని శాంతి నొందించునది! గొప్ప వాటికంటెను గొప్పది. తపస్సు వలన కలిగెడి పరమానందమును కలిగించునది. ఇట్టి తత్త్వము అత్రి మహాముని తపోమహిమచే అతని కన్నుల యందే నిలిచియుండెను.

దానిని చూచి ఉమాపతి యగు శివుడు ఉమతో కూడి జలమునుండి సంభవమయిన తన ఎనిమిదవ అంశముచే ఆ అత్రి నేత్రమును ఆశ్రయించెను. తత్ర్పభావమున కలిగిన ఆనంద బాష్పముల వెంట జలములనుండి పుట్టిన ఆ శివుని అష్ట మా శమగు తేజస్సు అత్రి మహాముని నేత్రములనుండి స్రవించెను. దాని నుండియే సోముడు అను శిశువు ఏర్పడెను. ఆ శిశువు తన వెన్నెలలచే చరాచర ప్రాణులతో నిండిన సమ స్త విశ్వమును ప్రకాశింప జేయుచుండెను.

దిక్కులు తాము పుత్త్రుని కనగోరి స్త్రీ రూపమును ధరించి ఆ తేజస్సును తమయందు నిలుపుకొనెను. అది గర్భము అయి వారి ఉదరముల యందు ముప్పది వేల సంవత్సరముల పాటు ఉండెను. అంతట దిక్కులు ఆ గర్భమును ధరించలేక విడిచి వేసెను. చతుర్ముఖుడగు బ్రహ్మ అంతవరకు దిక్కుల యందు వ్యాపించియున్న ఆ తేజో రూప గర్భమును ఒకటిగా చేసి సర్వాయుధ ధరుడును యువకుడునగు నరునిగా రూపొందించెను. తరువాత మహా శక్తి శాలి యగు బ్రహ్మ దేవశ క్తితో ఏర్పడి వేయి అశ్వములచే లాగబడు రథమునందు ఎక్కించి అతనిని తన లోకమునకు తీసి కొని పోయెను. అంతట ఋషులును బ్రహ్మర్షులును దేవతాత్మకములగు ఓషధులును దేవ గంధర్వులును ఈ యువకుడు మాకు ప్రభుగాక ! అని కోరుకొనిరి. బ్రహ్మ మొదలగు అచటి వారందరును సోమదేవతాకములగు మంత్ర సముదాయములతో అతనిని స్తోత్రము చేసిరి. వారట్లు స్తోత్రము చేసిన ప్రభావమున అతని తేజస్సమూహము ఇంకను అధిక మయ్యెను. ఆ తేజోరాశి నుండి భూలోకమునందలి దివ్యములగు ఓషధుల సముదాయము ఉత్పత్తి చెందెను. అందువలననే అతని నుండి ఏర్పడు దీప్తి (ప్రకాశము) రాత్రివేళ యందు అధికమగుచుండును. ఇట్లు నాటి నుండి నేటి వరకును జరుగుచునేయున్నది. అందువలననే సోముడు ఓషధులకు అధిపతియనియు ద్విజులకు (ద్విజములకు-పక్షులకు) అధిపతియనియు వ్యవహరింపబడుచున్నాడు.

ఈ కనబడు చంద్రమండలము ఈ హేతువులచే వేదములకు స్థానమును రసాత్మకమును ఐ యున్నది. ఇది నిరంతరమును శుక్లపక్షమున వృద్ధి పొందును కృష్ణపోమున క్షీణించుచు ఉండును.

అనంతరము దక్షప్రజాపతి రూపమును లావణ్యమును కలవారును శోభనమగు వర్చస్సు కలవారును అగు తన ఇరువది ఏడుమంది కన్యలను సోమునకు ఇచ్చెను.

తతః పద్మసహస్రాణాం సహస్రాణి దశైవతు | తపశ్చచార శీతాంశు ర్విష్ణుధ్యానై కతత్పరః. 16

తత స్తుష్టస్తు భగవాం స్తసై#్మ నారాయణో హరిః | వరం వృణీష్వ చోవాచ పరమాత్మా జనార్దనః. 17

తతః ప్రాప్య వరం సోమ శ్శక్రలోకే వ్రజా మ్యహమ్‌ | ప్రత్యక్ష మేవ భోక్తారో భవన్తు మమ మన్దిరే. 18

రాజసూయే సురగణా బ్రహ్మాద్యా స్సన్తు మే ద్విజాః | రక్షఃపాల శ్శివో7స్మాక మాస్తాం శూలధరో హరః.

తథేత్యుక్త స్సమాజగ్మూ రాజసూయే తు విష్ణునా |

హోత్రధ్వర్యూ గురుభృగూ హ్యు ద్గాతా7భూ చ్చతుర్ముఖః. 20

బ్రహ్మత్వ మగమత్తస్య ఉపద్రష్టా హరి స్స్వయమ్‌ | సదస్యా స్సనకాద్యాస్తు రాజసూయవిధౌ స్మృతాః.

చమసాధ్వర్యవస్తత్ర విశ్వేదేవా దశైవతు | త్రైలోక్యం దక్షిణా తేన ఋత్విగ్భ్యః ప్రతిపాదితమ్‌. 22

తత స్సమాప్తే7వభృథే తద్రూపాలోకనేప్సవః | కామబాణాభితప్తాంగ్యో నవ దేవ్యః ప్ర పేదిరే|| 23

లక్ష్మీ ర్నారాయణం త్యక్త్వా సినీవాలీచ కర్దమమ్‌| ద్యుతి ర్విభావసుం తద్వ త్పుష్టి ర్ధాతార మవ్యయమ్‌. 24

ప్రభా ప్రభాకరం త్యక్త్వా హవిష్మన్తం కుహూః పతిమ్‌ | కీర్తి ర్జయన్తం భర్తారం వసు ర్మారీచిశ్యపమ్‌. 25

ధృతి స్త్యక్త్వా పతిం దేవీ సోమమే వాభజం స్తదా | స్వకీయా ఇవ సోమోపి కామయామాస తా స్తదా. 26

ఏవం కృతాపచారస్య తాసాం భ ర్తృగణ స్తదా | న శశాకాపచారాయ శాపై శ్శస్త్రాదిభిః పునః. 27

తథాప్యరాజత విభు ర్దశధా భావయ న్దిశః | సోమః ప్రాప్యాథ దుష్ర్పాప మైశ్వర్య మృషిసత్కృతమ్‌. 28

సురలో కైకనాధత్వ మాప్త స్స తపసా తదా |

తరువాత చంద్రుడు విష్ణుధ్యానైక తత్పరుడయి దశ సహస్ర పద్మ సహస్ర సంవత్సరములు (10×1000×1000×1000000000) తపమాచరించెను. నారాయణుడగు (సమస్త జీవులకు ఆశ్రయమగు) హరిభగవానుడు అతని తపస్సు విషయమున సంతుష్టి చెందెను. పరమాత్ముడగు జనార్దనుడు (జనులచే ప్రార్థింపబడు దేవుడు) వరము కోరు కొమ్మని చంద్రునితో ననెను. విష్ణుని వలన వరదానమును పొందిన చంద్రుడు ఆ భగవానుని ఇట్లు కోరెను. నేను ఇంద్రలోకమునకును వెళ్ళగలుగ వలయును. (ఇంద్ర లోకమును జయించవగలుగ వలయును.) నేను జరుపు రాజసూయ యాగమున దేవతలు అందరును ప్రత్యక్షముగా ఆ యజ్ఞమున ఇచ్చు హవిస్సులను భుజించవలయును. బ్రహ్మమొదలగు వారు నా యజ్ఞమున ఋత్విక్కులగు బ్రాహ్మణులుగా కావలయును. లోకముల లయింపజేయగల దేవుడును శూలధారియునగు శివుడు ఆ యజ్ఞమున మాకు యాగ రక్షకుడై యుండవలయును. అని కోరగా విష్ణువు సరే యనెను.

చంద్రునకు విష్ణువు ఇచ్చిన వర ప్రభావమున అతని రాజసూయయాగములో గురుడు హోతగా భృగువు అధ్వర్యుడుగా బ్రహ్మ%్‌మదేవుడు ఉద్గాతగా న్వయముగా హరి ఉపద్రష్టయగు బ్రహ్మగా సనకసనందనాది మహర్షులు సదస్యులుగా విశ్వేదేవతలు పది మందియు చమసాధ్వర్యువులుగా ఉండిరి. అతడు మూడు లోకముల రాజ్యమును ఋత్విక్కులకు దక్షిణగా దానము చేసెను. ఇట్లు యజ్ఞము ముగిసెను. అవభృథ స్నానము జరిగెను. ఆ సమయమున కాముని బాణములచే తమ శరీరములు తపింపగా తొమ్మిది మంది దేవులు అతనిని చూడగోరి వచ్చిరి. వారు ఎవరనగా-లక్ష్మీదేవి నారాయణుని-సినీవాలి అను నామె కర్దముని-ద్యుతి అనునామె విభావసుడను సూర్యుని-తుష్టి అనునామె అవ్యయుడగు ధాతను-ప్రభా అనునామె ప్రభాకరుడను సూర్యుని-కుహూ అనునామె తన పతియగు హవిష్మంతుని-కీ ర్తి అనునామె ఈన పతియగు జయంతుని-వసువను నామె తన భర్తయగు మారీచ (మరీచి కుమారుడగు) కశ్యపుని-ధృతి అనునామో తన పతియగు నంది అనునతనిని-విడిచి సోముని ఆశ్రయించిరి సోముడును వారిని అందరను స్వకీయలనుగా (తాను ధర్మానుసారము పెండ్లాడిన భార్యలను వలె) స్వీకరించెను.

ఆయా దేవుల భర్తలు చంద్రుడు తమకు చేసిన అపచారమునకు ప్రతీకారముగా అతనిని శపించికాని ఆతనిపై శస్త్రాస్త్రములు ప్రయోగించికాని అతనికి అపచారము ఏమియు చేయజాలకపోయిరి. వారు తనకు ఎన్ని విధముల హాని కలిగింప యత్నంచినను శక్తి సంపన్నుడగు ఆ చంద్రుడు పది దిక్కులను పది విధములుగా ప్రకాశింపచేయుచు వెలిగెను. ఇట్లు ఆ చంద్రుడు తన తపః ప్రభావముచేత ఋషులు కూడ ఆదరించెడు ఐశ్వర్యమును దేవలోకమునకు ఏకైకాధి పతిత్వమును పొందెను.

చన్ద్రకృతతారాపహరణమ్‌.

కదాచి దుద్యానగతా మపశ్య దనేకపుష్పాభరణో పశోభామ్‌. 29

బృహన్నితమ్భస్తనభారనమ్రాం పుష్పావతంసా మతిదుర్మదాంగీమ్‌ |

భార్యాంచ తాం దేవగురోరనఙ్గబాణాభిరామాయతచారునేత్రమ్‌. 30

తారాం స తారాధిపతిః స్మరార్తః కేశేషు జగ్రాహ వివిక్తభూమౌ |

సాపి స్మరార్తా సహ తేన రేమే తద్రూపకాన్త్యాహృతమానసైన. 31

చిరం విహృత్యాథ జగామ తారాం విధు ర్గృమీత్వా స్వగృమం తతో7పి |

న తృప్తి రాసీ త్స్వగృ హే7పి తస్య తారానుర క్తస్య సుఖగమేషు. 32

బృహస్పతి స్తద్విరహాగ్ని దగ్ధ స్తద్ధ్యా నదృష్ట్యే కమనా బభూవ |

శశాక శాపం న చ దాతుమసై#్మ న మన్త్రశస్త్రాగ్నివిషైశ్చ తసై#్మ. 33

తస్యాపకర్తుం వివిధై రుపాయై ర్నైవాపచా రైరపి వాగధీశః |

స యాచయామాస తతస్తు దైన్యా త్సోమం స్వభార్యార్థ మనఙ్గతప్తః. 34

స యాచ్యమానో7పి దదౌ న తారాం బృహస్పతే స్తత్సుఖపాశబద్ధః |

మహేశ్వరేణాథ చతుర్ముఖేన సాధ్యై ర్మరుద్భి స్సహ లోకపాలైః. 35

దదౌ యదా తాం న కథఞ్చి దిన్దు స్తదా శివః క్రోధపరో బభూవ |

యో వామదేవః ప్రథితః పృథివ్యా మనేకముద్రార్చితపాదపద్మః. 36

పినాకిసోమయోర్యుద్ధమ్‌.

తత స్సశిష్యో గిరిశః పినాకీ బృహస్సతిస్నే హరసానుబద్ధః |

ధనుర్గృహీత్వా7 జగవం పురారి ర్జగామ భూతేశ్వరసిద్ధజుష్టః. 37

యుద్ధాయ సోమేన విశేషదీప్త స్తృతీయనేత్రానలభీమవక్త్రః |

సహైవ జగ్ము స్సగణశకోట్యా వింశచ్చతుష్షష్టి రథశ్వయుక్తాః. 38

యక్షేశ్వరః కోటి శ##తై రనేకై ర్యుతో7న్వగా త్స్యన్దనసంస్థితానామ్‌ |

వైతాళయక్షోరగకిన్నరాణాం పద్మేన చైకేన తథార్బుదేన. 39

లక్షై స్త్రిభి ర్ద్వాదశభీ రథానాం సోమో7ప్యగా త్తత్ర వివృద్దధమన్యః |

నక్షత్ర దైత్యాసుర సైన్యయుక్త శ్శనైశ్చరాఙ్గారకవృద్ధతేజాః. 40

జగ్ముర్భయం సప్త తథైవ లోకా శ్చలచ్చలద్ద్వీపసముద్రగర్భాః |

స సోమమేవాభ్యగమ త్పినాకీ గృహీతదీప్తాస్త్రవిశాలవహ్నిః. 41

అథాభవ ద్భీషణభీమసోమ సైన్యద్వయస్యాపి మహాహవో7సౌ |

అశేషసత్త్వక్షయకృత్ర్పవృద్ధ స్తీక్షాయుధాస్త్రజ్వలనై కరూపః. 42

శ##సై#్త్రస్తథాన్యోన్య మశేషసైన్యం క్షయోగమ త్తతక్షణముగ్రతీక్షైః |

పత న్తి శస్త్రాణి తథా బలాని స్వర్భూమిపాతాళతలం దహన్తి. 43

రుద్రః కోపా ద్ర్బహ్మశీర్షం ముమోచ సోమోపి సోమాస్త్ర మమోఘవీర్యమ్‌ |

తయో ర్నిపాతేనచ దివ్యభూమ్యో రథన్తరిక్షస్యచ భీతిరాసీత్‌. 44

తతస్తు యుద్ధే జగతః క్షయాయ ప్రవర్ధమానేచ పితామహోపి |

అన్తఃప్రవిశ్యాథ కథంకథఞ్చి న్నివారయామాస సురై స్సహైవ. 45

అకారణం కిం క్షయకృజ్జనానాం సోమ త్వయాపీద మకా ర్యకార్యమ్‌ |

యస్మా త్పరస్త్రీహరణాయ సోమ త్వయా కృతం యుద్ధ మిదం నిభీషమ్‌. 46

పాపగ్రహ స్త్వం భవితా జనేషు శాన్తో7ప్యలం నూన మభీప్సితంతే |

భార్యా మిమా మర్పయ వాక్సతే స్త్వం న చావమానో7స్తి పరస్వహారే. 47

సూతః తథేతి చోవాచ హిమాంశుమాలీ యుద్ధా దపాక్రామ దతః ప్రశాన్తః |

బృహస్పతి స్తామపి గృహ్య తారాం హృష్టో జగామ స్వగృహం సరుద్రః. 48

ఇది శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే చన్ద్రవంశానువర్ణనే

చన్ద్రోత్పత్త్యాదికథనం నామ త్రయోవింశతితమో7ధ్యాయః.

చంద్రుడు తార నపహరించుట

ఒకమారు చంద్రునకు ఉద్యానవనయములో దేవగురువగు బృహస్పతికి భార్యయగు తార కనబడెను. ఆమె అనేకములగు పుష్పములతోను ఆభరణములతోను ఉపశోభించుచుండెను. పెద్ద పిరుదులు కలిగి స్తనముల భారముచే వంగి యుండెను. పుష్పములు శిరోలం కారముగా ధరించి యుండడెను. మిగుల మదించిన దేహము కలదై యుండెను. మన్మథ బాణములవలె మనఖస్సునకు హాయి గొల్పుచు విశాలములును మనోహరములునైన కన్నులు కలిగియుండెను.

(దక్షుడు భార్యలుగా ఇచ్చిన) తారకు (నక్షత్రములకు) (అప్పటికే) అధిపతిగా ఉన్న ఆ చంద్రుడు కామవశుడై ఏకాంత ప్రదేశమున ఆమె జడ పట్టెను. ఆతని రూపముచే కాంతిచే అప్పటికే తన మనస్సు హరింపబడి ఉన్న ఆ తార ఆ స్థితిలో కామ పీడితురాలయి ఆతనితో విహరించి ఆనందించెను. చాల సేపటివరకు ఆమెతో క్రీడించియు తృప్తినొందక చంద్రుడు అక్కడి నుండి తారను స్వగృహమునకు తీసికొని పోయెను. ఆమెవలన తనకు కలుగు సుఖములందు అనురక్తుడగు ఆ చంద్రునకు స్వగృహమునందు కూడ ఆమెతో ఎంత కాలము కామ సుఖములను భవించినను తృప్తి కలుగలేదు.

బృహస్పతియును తన భార్యయగు తారతోడి ఎడబాటు సహించలేక విరహాగ్నితో దగ్ధుడగుచు తన మనోధ్యానమున నిరంతరమును ఆమెనే చూచుచు బాధనొందుచుండెను. కాని అతడు చంద్రుని శపించుటచే కాని మంత్రములతో కాని శస్త్రములతో కాని అగ్నితో కాని విషాదికముతో కాని అపకారము చేయ జాలకపోయెను. తాను వాచన్పతి (వేదాది విద్యలకు అన్నింటికి అధిపతి) ఐయుండియు వివిధములగు ఉపాయములతోను అప(భి)చారములతోను కూడ బృహస్సతి చంద్రునకు ఏమియు అపకారము చేయలేక పోయెను. అతడు కామ బాదచే తపించి దీనుడై తన భార్యను తనకిమ్మని చంద్రుని వేడుకొనెను. మ హేశ్వరుడు చతుర్ముఖుడు సాధ్యులు మరుత్తులు లోకపాలురు మొదలగు వారు ఎవరు ఎవరు వేడినను తారాసుఖపాశములచే బద్ధుడైన ఆ చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఈయలేదు.

ఈ కారణమున సదాశివునకు చంద్రునిపై తీవ్రమగు కోపము కలిగెను. అతడు సామాన్యుడా! వామదేవుడు (కోపించినచో ఎవరికిని అనుకూలుడు కాక హాని కలిగింప కలవాడు) అని లోకములందు ప్రసిద్ధుడు. అనేకములగు ముద్రలతో (భావ విశేష ప్రకటనములతో) అతని పాదపద్మములను ఎల్లవారును అర్చింతురు. పైగా ఆయనకు బృహస్పతి యందు స్నేహము అధికము. ఇట్టి సదాశివుడు త్రిపురాసుర సంహారి పినాకధనుర్ధారియగు పరమేశ్వరుడు జయముతప్ప ఓటమి నెరుగనీయని అజగవమను ధనుస్సు ధరించి చంద్రునితో యుద్ధమునకై బయలుదేరెను. అతని శిష్యులును విధేయులును అతనివెంట నుండిరి. భూతనాధులును సిద్ధులును అతనిని పరివేష్ఠించి వచ్చుచుండిరి. తృతీయ నేత్రము అగ్ని జ్వాలలను ప్రకటించుచుండ అతని ముఖము భయము గొల్పుచుండెను. ఇట్లాయన విశేషముగా దీపించుచుండెను. రథములతోను అశ్వములతోను కూడి గణశులు ఇరువది అరువది నాలుగు కోట్లమంది (10000 000×20×64) శివుని వెంట బయలుదేరి వెళ్ళిరి. అదే విధముగా కుబేరుడును రథముల నెక్కిన వీరులు అనేక శతకోటి సంఖ్యలో తనకు తోడు రాగా శివునివెంట వెళ్ళెను. వేతాళులు యక్షులు ఉరగులు కిన్నరులు పద్మము అర్బదము సంఖ్యలో (పద్మము =1000000000, అర్బుదము=100000000) కుబేరునివెంట నుండిరి. సోముడును అధికమగు కోపముతో మూడు పండ్రెండు లక్షల రథములపై నక్షత్రులు దైత్యులు అసురులు తనవెంట వచ్చుచుండ శ##నైశ్చరుడు అంగారకుడు తన తేజస్సును వృద్ధిపరచుచుండ యుద్ధమునకు వచ్చెను. ఈ భయంకర యుద్ధోద్యమమునకు సప్తలోకములును భయమునందెను. సముద్రములు అన్ని యును వాని నడుమనున్న సమస్తద్వీపములును అత్యంతముగా చలించుచుండెను. ప్రజ్వలించుచున్న అస్త్రముల నుండి విశాలములగు వహ్ని జ్వాలలు దిక్కుల వ్యాపించుచుండ పినాకధారియగు శివుడు సోముని ఎదుర్కొనెను.

అంతట భీముని శివుని)-సోముని-భయంకర సేనలకు రెండింటికిని మహాయుద్ధము జరిగెను. ఆయుద్ధము సమస్త ప్రాణులకును నాశము కలిగించునదియు మిగుల క్రమక్రమముగా వృద్ధి పొందుచు పోవుచున్నదియు తీక్‌ష్ణములగు అయుధములనుండియు అస్త్రములనుండియు వెలువడు మంటలు దట్టమై కనబడుచున్నదియునై భయంకరగా ఉండెను. పరస్పరము ప్రయోగించుకొనుచున్న భయంకర తీక్ష శస్త్రములతో ఇరుపక్షములవారి సేనయంతయు తత్‌ క్షణమే నాశము నొందసాగెను. సేనలపై పడుచుండిన శ క్తి సంపన్నములగు ఆయుధములు ఆ సేననేకాక స్వర్గమ ర్త్య పాతాళ లోకములను కూడ కాల్చి వేయుచుండెను.

రుద్రుడు కోపించి బ్రహ్మశీర్షాస్త్రమును ప్రయోగించెను. సోముడు వ్యర్థము కాని శ క్తిగల సోమాస్త్రమును వదలెను. వాటిని ప్రయోగించుటవలనను అవి పరస్పరము డీకొనుటవలనను ద్యుభూమ్యంతరిక్షములకు మూడింటికిని (ఈ మూడు లోకములందలి సకల భూతములకును) భయము గలిగెను.

ఇట్లా భీమ సోముల యుద్ధము క్రమక్రమముగా వృద్ధి పొందుచుండెను. లోకములు క్షయమునొందునట్లుండెను. ఇది చూచి లోక పితామహుడగు బ్రహ్మ ఎంతో శ్రమతో (దేవతలతో కూడ) లోపల ప్రవేశించి వారి యుద్ధమును నివారించెను. బ్రహ్మ సోమనితో నిట్లు పలికెను: ''సోమా! నీవిట్లు అకారణముగా భూతములకు నాశమును కలిగించు యుద్ధమునకు పూనితివి. ఇది చేయరాని దుష్కృత్యము. ఇది కాక నీవు పర స్త్రీహరణము అనెడు అకృత్యమునకు సంకల్పించితివి. అందుకలయియే నీవీ భయంకర యుద్ధమును చేయుచున్నావు. నీవు సహజముగ శాంత స్వభావుడవే కావచ్చును. కాని నీవు చేసిన ఈ దోషమునకు ఫలితముగా జనులయందు పాపగ్రహముగానే ప్రసిద్ధినొందుదువు. నీకు కలిగిన ఈ కోరిక (పరదార హరణవాంఛ) ఇంతటితో చాలింపుము. బృహస్పతి భార్యయగు తారను మరల అతనికి అప్పగించుము. పరుల ధనమును హరించిన వారు దానిని మరల దాని సోంతగాని కప్పగించుటలో అవమానము ఏమియు లేదు.''

పితా మహుని మాటలు విని సోముడు సరేయని అంగీకరించెను. ప్రశాంతభావముతో యుద్ధము నుండి తొలగిపొయెను. బృహస్పతియును భార్యయగు తారను వెంట తీసికొని హర్షించుచు రుధ్రునితో కూడి స్వగృహమునకు పోయెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున చందృవంశానువర్ణనమున చంద్రుని. ఉత్పత్తి మొదలగు వృత్తాంతములు అను ఇరువదిమూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters