Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వితీయో7ధ్యాయః

మనవే మత్స్యరూప కేశవోక్తావాన్తర ప్రళయః.

సూతః: ఏవ ముక్తో మను స్తేన పప్రచ్ఛాసురసూదనమ్‌ | కియద్భి ర్భగవా న్వర్షై ర్భవిష్య త్యంతరక్షయః. 1

సత్త్వాని చ కథం నాధ రక్షిష్యే మధుసూదన | త్వయా సహ పున ర్యోగం కథం వా భవితా మమ. 2

శ్రీమత్స్యః: అద్యప్రభృ త్యనావృష్టి ర్భవిష్యతి మహీతలే | యావ దబ్దశతం సాగ్రం దుర్భిక్షం *మరణావహమ్‌. 3

తతో7ల్పసత్త్వక్షయదా రశ్మయ స్సప్త దారుణాః | సప్తసప్తే ర్భవిష్యన్తి ప్రతప్తాఙ్గారవర్షిణః. 4

ఔర్వానలోపి వికృతిం గమిష్యతి యుగక్షయే | దృష్ట్వాగ్నిశ్పాపి పాతాళా త్సఙ్కర్షణముఖోద్గతః. 5

భవస్యాపిలలాటోత్థతృతీయనయనానలః | త్రిజగ న్నిర్దహ& క్షోభం నయిష్యతి మహీపతే. 6

ఏవం దగ్ధా మహీ సర్వా యదా స్యా త్కూర్మసన్నిభా | ఆకాశం సూర్యసన్తప్తం భవిష్యతి పరన్తప. 7

తత స్సదేవనక్షత్రం జగ ద్యాస్యతి సంక్షయమ్‌ | సంవర్తో భీమనాదశ్చ ద్రోణ శ్చేన్ద్రో వలాహకః. 8

విద్యుత్పతాక శ్శోణస్తు సపై#్తతే లయవారిదాః | అగ్నిప్రస్వేదసమ్భూతాః ప్లావయిష్యన్తి మేదినీమ్‌. 9

సముద్రాః క్షోభ మేష్యన్తి సపై#్తక్యేన వ్యవస్థితాః | ఏతే చైకార్ణవం సర్వం కరిష్‌యన్తి జగత్త్రయమ్‌. 10

దేవనావ మిమాం గృహ్య న త్వం బీజాదిసఞ్చయమ్‌ | ఆరోప్య రక్ష యోగేన మత్ప్రవృత్తేన సువ్రత. 11

సంయమ్య నావం మచ్ఛృఙ్గే మత్ప్రభావాభిరక్షితః | ఏకః స్థాస్యసి దేవేషు దగ్ధేష్వపి పరన్తప. 12

సోమసూర్యా వహం బ్రహ్మా చతుర్లోకసమన్వితః | నర్మ దాచ నదీ పుణ్యామార్కణ్డయో మహానృషి! 13

భవో వేదః పురాణాని విద్యాభి స్సహితో ధ్రువః | త్వయా సార్థ మిదం సర్వంస్థాస్య త్యన్తరసంక్షయే. 14

ఏవ మేకార్ణవే జాతే చాక్షుషేన్తరసంక్షయే | వేదా న్ప్రవర్తయిష్యామి త్వత్సర్గాదౌ మహీతలే. 15

ద్వితీయాధ్యాయము-మత్స్యరూపుడగు విష్ణువు మనువునకు

అవాంతర ప్రళయాదిక మెరిగించుట

ఆ మత్స్యము ఇట్లు పలుకగా మను వా విష్ణుని ఇట్లడిగెను: భగవన్‌! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును! ప్రభూ! మధుసూదనా! ప్రాణులను ఎట్లు రక్షింతును? నేను మరల నీతో ఎట్లు కలియగలను? మత్స్యము ఇట్లనెను: ఇది మొదలుగా మహీతలమున అనావృష్టి కలుగును. నూరేండ్ల వరకు కరవులు కలిగి ప్రాణులకు మరణము కలిగించును. పిమ్మట అల్పప్రాణులకు నాశముకలిగించుచు సూర్యుని ఏడు కిరణములు కాలెడి నిప్పు కణికలను వర్షించును. ఆ ప్రళయకాలమున బడబాగ్నియును విజృంభించును. పాతాళమునుండి సంకర్షణుని (భగవంతుని ఒక వ్యూహము) ముఖమునుండి అగ్ని వెలువడును. శివుని నుదుటి మూడవకంటి అగ్నియు మూడులోకములను నిర్దహించుచు క్షోభము కలిగించును. ఇట్లు భూమియంతయు తగులబడి తాబేటి(వీపు)వలె అగును. ఆకాశము సూర్యునిచే మిగుల వేడిమిపొందును. దానివలన దేవతలు నక్షత్రములు కూడ నశించును. సంవర్తము భీమనాదము ద్రోణము ఇంద్రము వలాహకము విద్యుత్పతాకము శోణము అను ఈ ఏడు ప్రళయమేఘములును ప్రళయాగ్ని వేడిమికి పుట్టి భూమిని తమ వాననీటితో ముంచివేయును. ఏడు సముద్రములును కలిసి ఒకటిగా ఏర్పడి కలవరము చెందును. ఇవి మూడు లోకములను పూర్ణముగా ఏకార్ణవముగా చేయును. అట్టి స్థితిలో నీవు ఈ దేవనౌకను తీసికొని బీజములు మొదలగు వాని నిలువను దీనియందు ఉంచి నేను ప్రవర్తిల్ల చేయు యోగము (రక్షణ విధానము)తో వాటిని రక్షించుము. ఈ నావను నాకొమ్మున కట్టి వేసి నాప్రభావమున అన్ని విధముల రక్షింపబడుచు దేవతలును నశంచినను నీవు ఒక్కడవు ఉందువు. ఈ అవాంతర ప్రళయకాలమున చంద్ర సూర్యులు-నేను బ్రహ్మ-నాలుగు లోకములు (స్వర్గమర్త్య పాతాళ బ్రహ్మలోకములు)-పుణ్య అగు నర్మదానది-మార్కండేయ మహాఋషి శివుడు వేదము(లు) పురాణములు ఇతర విద్యలు నీవు ఇవి అన్నియు నిలుచును. ఇట్లు చాక్షుష మన్వంతరము తరువాత అవాంతర ప్రళయముతో ఏకార్ణవముకాగా పిమ్మట నీ సృష్టికి ఆరంభమున మహీతలమున వేదములను ప్రవర్తిల్ల జేయుదును.

సూతః ఏవముక్త్వాథ భగవాం స్తత్రైవాస్త రధీయత | మనుర ప్యాస్థితో యోగం వాసుదేవప్రసాదజమ్‌. 16

అభ్యస న్యావదాభూతసంప్లవః పూర్వసూచితః | కాలే యథో క్తేసఞ్జాతే వాసుదేవముఖోద్గతే. 17

శృఙ్గీ ప్రాదుర్బభూవాథ మత్స్యరూపీ జనార్దనః | అనన్తోరజ్జురూపేణ మునేః పార్శ్వ ముపాగమత్‌. 18

భూతాని సర్వాణ్యాకృష్య యోగేనారోప్య ధర్మవిత్‌ | భుజఙ్గరజ్జ్వా మత్స్యస్యశృఙ్గే నావ మయోజయత్‌. 19

ఉపశృఙ్గం స్థిత న్తస్య ప్రణిపత్య జనార్దనమ్‌ | ఆభూతసమ్పవే తస్మి న్నతీతే యోగశాయినా. 20

పృష్టేన మనునా పూర్వం పురాణం మత్స్యరూపిణా | తదిదానీం ప్రవక్ష్యామి శృణుధ్వమృషిసత్తమాః. 21

యద్భవద్భిః పురా పృష్ట స్సృష్ట్యాదిక మహం ద్విజాః | తథైవైకార్ణవే తస్మి న్మనుః వప్రచ్ఛ కేశవమ్‌. 22

మనుః: ఉత్పత్తిం ప్రళయం చైవ వంశమన్వన్తరాణి చ | వంశానుచరితం చైవ భువనస్యచ విస్తరమ్‌. 23

దానధర్మంచ వివిధం శ్రాద్ధకల్పంచ శాశ్వతమ్‌ | వర్ణాశ్రమవిభాగం చ తథేష్టాపూ ర్తసంజ్ఞితమ్‌. 24

దేవతానాం ప్రతిష్ఠాది సర్వం వ్యాహర్తు మర్హసి |

ఇట్లు పలికి భగవానుడు అక్కడనే అంతర్ధానము పొందెను. మనువుకూడ పూర్వము సూచింపబడిన ప్రాణి ప్రళయము వరకును తనకు వాసుదేవుని అనుగ్రహము వలన కలిగిన యోగమును అవలంబించి అభ్యాసము (మరలమరల అనుష్ఠించుట) చేయుచు ఉండెను. వాసుదేవుడు చెప్పిన సమయమున అట్లు జరుగగానే జనార్దనుడు కొమ్ముగల మత్స్యము రూపమున ప్రాదుర్భవించెను. ఆదిశేషుడు త్రాటిరూపమున ముని(మనువు)కడకు వచ్చెను. ఆధర్మవేత్త సర్వభూతములను లాగి దగ్గరకు తీసికొని నిలిచెను. ఆ అవాంతర ప్రళయము గడిచిన తరువాత మనువు అడుగగా మత్స్యరూపుడు అగు యోగశాయి(విష్ణువు)పురాణమును ప్రవచించెను. ఋషిసత్తములారా! దానిని మీకు ఇప్పుడు చెప్పెదను వినుడు. ఇంతకు ముందు మీరు నన్ను అడిగిన సృష్టి మొదలగు విషయములను గూర్చియే అట్లే ఏకార్ణవమున ఉన్న మనువు కేశవుని ఇట్లు ప్రశ్నించెను: ప్రపంచపు ఉత్పత్తిని ప్రళయమును వంశమును మన్వంతరములను వంశాను చరితమును భువన విస్తారమును వివిధములగు దానములను ధర్మములను శాశ్వతమగు శ్రాద్ధకల్పమును వర్ణాశ్రమ విభాగమును ఇష్టములు పూర్తములు అను సత్కర్మములను దేవతల ప్రతిష్ఠలు మొదలగునవి ఇది ప్రతియొక్కటియు చెప్పవేడుచున్నాను.

మత్స్యః: మహాప్రళయకా లేతు ఏత దాసీ త్తమోమయమ్‌. 25

ప్రసుప్తమివ చాతర్క్య మప్రజ్ఞాత మలక్షణమ్‌ | అవిజ్ఞేయ మవిజ్ఞాతం జగత్థ్సాస్ను చరిష్ణు చ. 26

తత స్స్వయమ్భూ రవ్యక్తః ప్రభవః పుణ్యకర్మణామ్‌ | వ్వఞ్జయన్నేవ తచ్ఛీలం ప్రాదురాసీ త్తమోనుదః. 27

అతీన్ద్రియః పరోవ్యక్తా దన్తర్యామీ సనాతనః | నారాయణ ఇతి ఖ్యాత స్సఏష స్వయ ముద్బభౌ. 28

బ్రహ్మాణ్డసృష్టిః.

స్వశరీర మభిధ్యాయ న్త్సిసృక్షు రఖిలం జగత్‌ | అపఏవ ససర్జాదౌ తాసు వీర్య మవాసృజత్‌. 29

తదేవాణ్డం సమభవ ద్ధేమరూపం పరం మహత్‌ | సంవత్సరసహస్రం త దసూర్యం తమసా೭೭వృతమ్‌. 30

ప్రవిశ్యాన్త ర్మహాతేజా స్స్వయమే వాత్మసమ్భవమ్‌ | ప్రహాయ మాత్స్య మవ్యక్తం విష్ణుత్వ మగమ త్పునః. 31

తదన్త ర్భగవా నేష సూర్య స్సమభవ త్పునః | ఆదిత్య శ్చాదిభూతత్వా ద్బ్రహ్మా బ్రహ్మపరత్వతః. 32

దివ్యం తదా సమభవ త్తదణ్డం శకలద్వయమ్‌ | సచాకరో ద్దిశస్సర్వా మధ్యే వ్యోమచ శాశ్వతమ్‌. 33

జరాయు మేత్య సఞ్జాతా శ్శెలాస్తస్యాభవం స్తదా | యదుల్బం చాభవ న్మేఘాః స్రోతాంసి సరిత స్తథా. 34

సప్తసర్వే సముద్రాశ్చ నానార్త్నసమన్వితాః | నద్యో థ నాడ్యస్యఞ్జాతా స్స్రోతాంసి సరితస్తథా. 35

సప్త సర్వే సముద్రాశ్చ తే పి నాన్తర్జలోద్భవాః | లవణక్షుసురాద్యాశ్చ నానారత్న సమన్వితాః. 36

సిసృక్షు రభవ ద్దేవః ప్రజాపతి రరిన్దమః | యత్తేజ స్తత్ర తసై#్యష మార్తాణ్డ స్సమజాయత. 37

మృతేణ్డ జాయతే యస్మా న్మార్తాణ్డ స్తేన స స్మృతః | రజోగుణమయం యత్త ద్రూపం తస్య మహాత్మనః.

చతుర్ముఖ స్స భగవా నభూ ల్లోకపితామహః | యేన సృష్టం జగ త్సర్వం సదేవాసురమానుషమ్‌. 39

తమ వేహి రజోరూపం మహత్తత్త్వము దాహృతమ్‌.

ఇతిశ్రీమత్స్యమహాపురాణమత్స్యమనుసంవాదేమత్స్యప్రోక్తావాన్తరప్రళయాదికథనంనామ ద్వితీయోధ్యాయః.

బ్రహ్మాండ సృష్టి

మనువుతో మత్స్యము ఇట్లు పలికెను : (ఈ జరిగినది అవాంతర ప్రళయము. కాని ఈ కల్పాదికి ముందు) మహాప్రళయము జరిగిన సమయమున ఇది అంతయు చీకటితో నిండినదై స్థిరచర రూపమయిన ప్రపంచమంతయు గాఢనిద్ర యందు మునిగినదో అన్నట్లు తర్కప్రమాణముతో ఎరుగరానిదిగా అనుభూతిలో గురుతింపరానిదిగా దీని లక్షణము ఇది అని నిశ్చయించి చెప్పవీలుకానిదిగా అనుభవముతో తెలియ శక్యము కానిదిగా ఇంతవరకును అనుభవముతో తెలియబడనిదిగా ఉండెను. అంతట నామరూపములతో వ్యక్తముకానివాడు యజ్ఞాది పుణ్యకర్మలకు కారణుడు అగు స్వయంభూ పరమేశ్వరుడు తన ఆ స్వభావమును వ్యక్తముచేయుచు ఆ చీకట్లను పోగొట్టుచు సాక్షాత్కారమునందెను. అనగా ఇంద్రియములకు గోచరము కానివాడును ఈ అవ్యక్తముకంటె పరుడు (శ్రేష్ఠుడు)ను అంతర్యామి (సమస్త భూతములయందుండి వాటి చిత్తవృత్తులను తన అదుపునందుంచువాడు)యు సనాతనుడు (అతిప్రాచీనుడు శాశ్వతుడు)ను నారాయణుడు అని ప్రసిద్ధి పొందినవాడు అగు ఆపరమాత్మయే స్వయముగా ఉద్భూతుడు అయ్యెను. తనకు శరీరము కావలెనని సంకల్పించు కొనుచు సమస్త జగత్తును సృష్టింపదలచుచు మొదట జలములనే సృష్టించెను. వాటియందు వీర్యమును నిలిపెను. ఆ వీర్యమే గొప్పదియు పెద్ద పరిమాణము కలదియు అగు బంగారు గ్రుడ్డుగా అయ్యెను. అది వేల సంవత్సరముల కాలము పాటు సూర్యుడే లేనిదై చీకటితో ఆవరింపబడినదయి యుండెను. మహా తేజస్స్వరూపుడు అగు పరమాత్మ తననుండి పుట్టిన గ్రుడ్డులోపల ప్రవేశించి అవ్యక్తమగు మత్స్యరూపము వదలి మరల విష్ణుత్వమును పొందెను. (మత్స్యము-కేవలసత్‌-చిత్‌-ఆనంద రూప విష్ణువు-ప్రవేశించి యుండువాడు) దానిలోపల ఈ భగవానుడు మరల సూర్యుడయ్యెను. ఆదిభూతుడు కావున ఆదిత్యుడు వేదపరుడగుటవలన బ్రహ్మయును అయ్యెను.

అంతట దివ్యమగు ఆ అండము రెండు ముక్కల య్యెను. అతడు అన్ని దిక్కులను శాశ్వతమగు -అండమునడుమ ఆకాశమును నిర్మించెను. దానిమావి నాశ్రయించి లోపలివైపున పర్వతములు ఏర్పడెను. ఉల్బము (మావితో సంబంధించిన నీటిబుడగ) జల ప్రవాహములును నదులును నానారత్నములతో కూడిన సముద్రములును అయ్యెను. పరమాత్ముడగు ఆ దేవుడే ప్రజలను సృష్టింప సంకల్పించినందున శత్రువుల నణచి ప్రజలను రక్షించగల ప్రజాపతి అయ్యెను. అండము మృతము(చీలినది) అయిన తరువాత ఏర్పడినందున అతని ఆ తేజస్సునకు (సూర్యునకు) మార్తాండుడని పేరువచ్చెను. ఆ మహాత్ముని రజోగుణమయ మగురూపము లోకముల కన్నిటికిని పితామహుడు(తాత)అగు చతుర్ముఖ భగవానుడుగా అయ్యెను. దేవాసుర మనుష్యులతో నిండిన జగమంతయు ఆయన చేతనే సృష్టింపబడినది. ఈరజోగుణ ప్రధాన పరమాత్ముని రూపమే మహత్తత్త్వము అని చెప్పబడుచున్నది.

ఇది మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున మత్స్యరూప నారాయణుడు మనువునకు అవాంతర ప్రళ యాదికము నెరింగించుట అను ద్వితీయాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters