Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రిచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

ద్వాపరయుగధర్మాః.

సూతః : అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి ద్వాపరస్య విధిం పునః | తత్ర త్రేతాయుగే క్షీణ ద్వాపరం ప్రతిపద్యతే.

ద్వాపరాదౌ ప్రజానాంతు సిద్ధి స్త్రేతాయుగేతు యా | పరివృత్తే యుగే తస్మిం స్తత స్తా వై ప్రణశ్యచ. 2

తతః ప్రవర్తతే తాసాం ప్రజానాం ద్వాపరే పునః | లోభో భృతి ర్వణి గ్యుద్ధం తత్త్వానా మవినిశ్చయమ్‌.

ప్రధ్వంసాశ్చైవ వర్ణానాం కర్మణాంతు విపర్యయః | యజ్ఞో వధః పరో దణ్డో మానో దర్పః క్షమా బలమ్‌.

తథా రజ స్తమో భూయః ప్రవృత్తే ద్వాపరే పునః | ఆద్యే కృతే నాధర్మోస్తి స త్రేతాయాం ప్రవర్తితః.

ద్వాపరే వ్యాకులో భూత్వా ప్రణశ్యతి కలౌ పునః | వర్ణానాం ద్వాపరే ధర్మా స్సఙ్కీర్యన్తే తథాక్రమాః. 6

ద్వైధ ముత్పద్యతే చైవ యుగే తస్మి ఞ్ర్ఛుతి స్మృతౌ | ద్విధా శ్రుతి స్స్మృతిశ్చైవ నిశ్చయో నాధిగమ్యతే

అనిశ్చయోపగమనా ద్ధర్మతత్త్వం న విద్యతే | ధర్మతత్త్వే హ్యవిజ్ఞాతే మతిభేదస్తు జాయతే. 8

పరస్పరం విభిన్నైసై#్త ర్దృష్టీనాం విభ్రమేణతు | అథో దృష్టివిభిన్నైసై#్తః కృత మత్యాకులం త్విదమ్‌. 9

ఏకో వేద శ్చతుష్పాద స్సంహత్యతు పునః పునః | సజ్ఞేపా దాయుషశ్చైవ వ్యతీతే ద్వాపరే తథా. 10

వేదశ్చైక శ్చతుర్ధాతు వ్యస్యతే ద్వాపరాదిషు | ఋషిభిశ్చ పునర్వేదా భిద్యన్తే దృష్టివిభ్రమైః. 11

సతు బ్రాహ్మణవిన్యాసై స్స్వర క్రమవిపర్యయైః | సంహృత్య ఋగ్యజుస్సామ్నాం సంహితాసై#్త శ్శ్రుతిర్షిభిః.

సామాన్యా ద్వైకృతాచ్చైవ దృష్టిభిన్నైః క్వచిత్క్వచిత్‌ | బ్రాహ్మణం కల్పసూత్రాణి భాష్యవిద్యా స్తథైవచ.

అన్యేతు ప్రస్థితా స్తాన్వై కేచిత్తాన్‌ ప్రత్యవస్థితాః | ద్వాపరేషు ప్రవర్తన్తో భిన్త్నార్థెసై#్స స్స్వదర్శనైః. 14

ఏకమాధ్వర్యం పూర్వ మాసీ చ్చైవతు తత్పునః | సామాన్యవిపరీతార్థైః కృతం శాస్త్రాకులం త్విదమ్‌. 15

నూట నలువది మూడవ అధ్యాయము.

ద్వాపర-కలి-యుగధర్మములు.

అందు ద్వాపర యుగధర్మము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ఇక మీదట ద్వాపర యుగధర్మ స్వరూపమును తెలిపెదను. త్రేతాయుగము ముగిసిన మీదట ద్వాపరయుగ మారంభమగును. త్రేతాయుగమున ప్రజలకు ఏఏ విధములగు లౌకిక ప్రవృత్తులును వాటి ఫలములును ఉండెనో అవియే ద్వాపర యుగాదియం దుండును. ఆ యుగము మారిపోగానే క్రమముగా తత్పూర్వయుగ కార్యఫలసిద్ధులు నశించును. తరువాత ద్వాపర యుగమున ప్రజలలో లోభము భృతి (వేతనముతో పని చేయుట) వాణిజ్యము యుద్ధము తత్త్వ నిశ్చయము చేయలేకపోవుట వర్ణవ్యవస్థ ధ్వంసమగుట కర్మ విపర్యయము (విహిత కర్మములు చేయకపోవుట-నిషిద్ధ కర్మములను ఆచరించుట) బాటసారులను చంపుట తీవ్రమగు దండనము (దురభి) మానము దర్పము ఓర్పు లేకుండుట బలమునకు ప్రాముఖ్యము - అధిక మగును. ద్వాపరయుగ మారంభము కాగానే రజస్తమోగుణ ప్రవృత్తు లధిక మగును. మొట్టమొదటిదగు కృతయుగమున అధర్మము ఏ మాత్రమును లేకుండెను. త్రేతాయుగమునందు అది ప్రవర్తింపజేయబడెను. ద్వాపరమున వ్యాకులత నొందును. కలియుగమున ధర్మము పూర్తిగా నశించును. ఈ ద్వాపరయుగమున వర్ణధర్మములును బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములును సంకీర్ణములు (ఒక దాని ధర్మమునందు మరియొకటి కలిసినవి - విహితమును చేయుటతోపాటు అవిహితమును కూడ చేయుట అవిహితమును విహితమని వాదించుట ఆచరించుట మొదలగు పాండిత్య దుర్విలసితములును) అగును. శ్రుతి స్మృతుల అర్థ నిర్ణయము విషయమున ద్వైధము (భిన్నాభిప్రాయ చిత్తవృత్తి) ఏర్పడును. శ్రుతి స్మృతులును తామై రెండు అభిప్రాయముల నిచ్చుచుండును. దాని మూలమున ధర్మతత్త్వము ఇది యని తెలియకపోవును. దానివలన ప్రజలలో అభిప్రాయఖేదములు పెరుగును. దృష్టి భేదముచే ఐకమత్యము లోపించును. దానిచే లోకము ఆకులత నందును. త్రేతాయుగమున నాలుగు పాదములతో ఒకటిగానే యున్న వేదము మరల మరల సమకూర్చబడుటచేతను ఆయువు తక్కువ యగుటచేతను ద్వాపరయుగమున అది ఋషి పుత్త్రులచే నాలుగుగా విభజింపబడును. ఐనను అపుడు కూడ దృష్టి విభ్రాంతి చేత వేదములు ఏవి ఏవి అను విషయమునను అర్థముల విషయమునకు భేదము ఏర్పడును. ఆనాటి మహర్షులు వేదములను బ్రాహ్మణ (వేదములకు ఆర్ష వ్యాఖ్యానములు బ్రాహ్మణములు) విన్యాసము (అమరిక) స్వరక్రమ విపర్యయములతోను ఋగ్యజుః సామ సంహితలుగా వ్యస్తములు (విభక్తములు)గా చేయబడును. వాటిలో ఆయా శాఖలయందు కొంత సమానత యున్నను వాటిలో కొంత వైకృతము (ఆకృతి భేదము) కలిగి అచ్చటచ్చట దృష్టిభేదమును కలుగును. బ్రాహ్మణములు కల్ప సూత్రములు వాటిపై భాష్యములనెడు విద్యాస్థాన భేదములు వానిలో ప్రస్థానభేదములు (మార్గ-సంప్రదాయ-విచారణా పద్ధతి భేదములు) ఏర్పడును. కొంద రొక విషయమున ఒక ప్రస్థానము ననుసరించుచుండ మరికొందరు వారితో ప్రత్యవస్థితులు (ఎదురు వాదము చేయువారు) అగుదురు. ఇట్లు ద్వాపరయుగమున ఋషులు స్వస్వదర్శన (దృష్టి భేద)ములు ననుసరించి వేద తత్సంప్రదాయముల విషయమున భిన్నార్థ ప్రకాశనము చేయుదురు. ఆధ్వర్యవ (యజుర్వేద) శాఖయు అతః పూర్వము ఒకే రూపమున నుండినది ద్వాపరమున ద్విధాభావమును (రెండుగా అగుటను) పొంది కొన్ని అర్థములు సమానాకారముతో ఉండియు కొన్నిటికి విపరీత (శాస్త్ర సంప్రదాయ విరుద్ధ) ములగు అర్థములు ప్రతిపాదింపబడుటచే శాస్త్రములు ఆకులములగును.

అధ్వర్యవంచ ప్రఎ్థానై ర్బహుధా వ్యాకులీకృతమ్‌ | తథైవాథర్వణాం సామ్నాం వికల్పే స్వస్య సజ్షేయైః. 16

వ్యాకులో ద్వాపరే ష్వర్థః క్రియతే భిన్నదర్శరైః | ద్వాపరే సన్నివృత్తాస్తే వేదా నశ్యన్తివైకలౌ. 17

అదృష్టిర్మరణం చైవ తథైవ వ్యాధ్యుపద్రవాః | వాఙ్మనః కర్మభి ర్దుఃఖై ర్నిర్వేదో జాయతే తతః. 18

నిర్వేదా జ్జాయతే తేషాం దుఃఖమోక్షవిచారణా | విచారణాయాం వైరాగ్యం వైరాగ్యా ద్దోషదర్శనమ్‌. 19

దోషాణాం దర్శనాచ్చైవ జ్ఞానోత్పత్తిస్తు జాయతే |

తేషాం మేధావినాం పూర్వం మర్త్యే స్వాయమ్భవేన్తరే. 20

ఉత్పత్స్యన్తీహ శాస్త్రాణాం ద్వాపరే పరిపన్థినః | ఆయుర్వేదవికల్పశ్చ అఙ్గానాం జ్యోతిషస్యచ. 21

అర్థశాస్త్రవికల్పాశ్చ హేతుశాస్త్రవికల్పనమ్‌ | ప్రక్రియా కల్పసూత్రాణాం భాష్యవిద్యావికల్పనమ్‌. 22

స్మృతిశాస్త్రప్రభేదాశ్చ ప్రస్థానాని పృథక్పృథక్‌ | ద్వాపరే ష్వభివర్తన్తే మతిభేదా స్తథా నృణామ్‌. 23

మనసా కర్మణా వాచా కృచ్ఛ్రా ద్వార్తా ప్రసిధ్యతి | ద్వాపరస్సర్వభూతానాం కాయక్లేశధుర స్స్మృతః. 24

లాబో భృతి ర్వణిగ్యుద్ధం తత్త్వానా మవినిశ్చయః | వేదశాస్త్రప్రణయనం ధర్మాణాం సఙ్కర స్తథా. 25

వర్ణాశ్రమపరిధ్వంసః కామద్వేషా తథైవచ | పూర్ణే వర్షసహస్రే ద్వే పరమాయు స్తథా నృణామ్‌. 26

నిశ్శేషే ద్వాపరే తస్మిం స్తస్యసంధ్యాతు పాదతః | గుణహీనాస్తు తిష్ఠన్తి ధర్మస్య ద్వాపరస్య తు. 27

తథైవ సన్ధ్యా పాదేన అంశ స్తస్యాం ప్రతిష్ఠితః | ద్వాపరస్య తు పర్యాయే తిష్యస్యతు నిభోధత. 28

కలియుగధర్మాః.

ద్వాపరస్యాంశ##శేతు ప్రణిపత్తిః కలే రథ | హింసాస్తేయానృతం మాయా వధశ్చైవ తపస్వినామ్‌. 29

ఏతే స్వభావా స్తిష్యస్య సాధయన్తిచ తాః ప్రజాః | ఏష ధర్మ స్స్మృతః కృత్స్నో ధర్మశ్చ పరిహీయతే.

ఆధ్వర్యవ(యజుర్‌) వేదము కూడ వేరు వేరు ప్రస్థాన(మార్గ-సంప్రదాయ) ములతో బహు భేదముల నొంది వ్యాకుల మగును. వాటి అర్థములకు ఆయా ఋషులును మునులును భిన్న దర్శనులయి సాంకర్యము కలిగింతురు. (ఉచితానుచితార్థ సంమిశ్రణము కలిగింతురు.) ద్వాపరయుగమున ఇట్లు నడచి నడచి వ్యాకులత నొందిన ఆ వేదవేదార్థ ములును కలియుగమున నాశమునందును; దీనిచే ద్వాపరమున అజ్ఞానము (ఆకాల) మరణము వ్యాధ్యుపద్రవములు కలుగును. వాఙ్మనః కాయికములగు దుఃఖము లనుభవించుట కలుగును. దానిచే నిర్వేదము (ప్రాపంచిక జీవనముపై విసుగు) కలుగును. తత్ఫలముగా ప్రజలలో ఈ దుఃఖములనుండి ముక్తి ఎట్లను విచారణ కలుగును. విచారణచే వైరాగ్యమును దానిచే సంసార దోష దర్శనమును దానిచే జ్ఞానోత్పత్తియు కలుగును.

ఈ ద్వాపరమున స్వాయంభువ మన్వంతరము నాటి మేధావులకు శత్రువులు (అలనాటి మేధావుల ఉదారాభి ప్రాయములను కాదనువారు) జన్మింతురు. ఈ ద్వాపరమున ఆయుర్వేదము జ్యోతిషము ఇతర వేదాంగములు - వీని విషయమునను శాస్త్ర విరోధులు జన్మింతురు. ఈ శాస్త్రములలో వికల్పములును (సంప్రదాయ-తదభి ప్రాయ-భేదములును) ఏర్పడును. అర్థశాస్త్రమున హేతు (న్యాయ వైశేషిక) శాస్త్రమునందు కల్పసూత్రములందు భాష్యరూపమగువిద్యాస్థానములందు స్మృతి శాస్త్రములందు ప్రస్థానములందు వికల్పములేర్పడి దానిచే ప్రజలందును మతి భేదములు ఏర్పడును. మనో వాక్కాయిక కర్మములతో ఎంతో శ్రమ పడిన మీదటగాని లోకయాత్ర జరుగకపోవును ఇట్లు ద్వాపరయుగము సర్వభూతములకును కాయక్లేశము కలిగించునదియని పెంచగలుచుచున్నారు. లాభము-భృతి-వాణిజ్యము-యుద్ధము. శాస్త్రతత్త్వ నిశ్చయము లేకపోవుట-వేదశాస్త్రములను (విభిన్నరీతుల) నిర్మించుట ధర్మ సంకరము వర్ణాశ్రమ ధర్మపరిధ్వంసము కామము ద్వేషము రెండువేల సంవత్సరముల పరమాయువు ఇవి ద్వాపరయుగ లక్షణములు. ద్వాపర సంధ్యా కాలమున యుగ కాలధర్మములో చతుర్థాంశమును సంధ్యాంశకాలమున దానిలో చతుర్థాంశమును ధర్మము ప్రవర్తిల్లును. ఇట్లు ద్వాపరము గడచిన తరువాత వచ్చు కలియుగ స్వరూపమును తెలిపెదను; వినుడు;

కలియుగ ధర్మములు-ఈయుగమున విప్రుల ప్రవృత్తియందలి దోషములు ప్రజల క్షేమహానికి హేతువులనుట. ద్వాపరయుగ సంధ్యా-సంధ్యాంశముల ప్రవృత్తి ముగియగానే తిష్య (కలి) యుగము ఆరంభమగును. హింస-చౌర్యము-అనృతము-మాయ- తపస్వుల వధ-ఇవి కలియుగ ధర్మములు; ఆనాటి ప్రజలు ఈ ప్రవృత్తులను సాధింతురు. ఇదియే వారికి ధర్మము; వాస్తవమగు ధర్మమంతయు పరిహీణమగును. (పూర్తిగా నశించును.)

మనసా కర్మణా వాచా వార్తా సిధ్యతివా నవా | కలిఃప్రమారకో రోగ స్సతతం చాపి క్షుద్భయమ్‌. 31

అనావృష్టిభయంచైవ దేశానాంచ విపర్యయః | న ప్రమాణిస్థితి ర్హ్యస్తి తిష్యే ఘోరే యుగే కలౌ. 32

గర్భస్థో మ్రియతే కశ్చి ద్యౌవనస్థ స్తథా పరః | స్థావిరే వాథ కౌమారే మ్రియన్తేచ కలౌ ప్రజాః. 33

అల్పతేజోబలాః పాపా మహాకోపా హ్యధార్మికాః | అనృతవ్రతలుబ్ధాశ్చ తిష్యే చైవ ప్రజా స్థ్సితాః. 34

దురిష్టై ర్దురధీతైశ్చ దురాచారై ర్దురాగమైః | విప్రాణాం కర్మదోషైసై#్తః ప్రజానాం జాయతే భయమ్‌. 35

హింసా మానస్తథేర్ష్యాచ క్రోధో మాయాక్షమాధృతిః | తిష్యే భవతి జన్తూనాం లోభో మోహశ్చ సర్వశః.

సజ్షోభో జాయతేత్యర్థం కలి మాసాద్య వై యుగమ్‌ | నాధీయన్తే కలౌ వేదాన్న యజన్తే ద్విజాతయః. 37

ఉత్సీదన్తి తదా చైవ వైశ్యై స్సార్దంతుక్షత్త్రియాః | శూద్రాణాం మన్త్రయోనీషు సమ్బన్ధో బ్రాహ్మణౖస్సహ.

భవన్తీహ కలౌ తస్మి ఞ్ఛయనాసనభోజనైః | రాజాన శ్శూద్రభూయిష్ఠాః పాషణ్డానాం ప్రవృత్తయః. 39

కాషాయిణశ్చ నిర్గ్రన్థా (నిష్కచ్ఛా) స్తథా కాపాలినశ్చ హ |

పైశున్యే దేవవ్రతిన స్తేషాం యే ధర్మదూషకాః. 40

దివావ్రతాశ్చ యే కేచి ద్వృత్త్యర్థం శ్రుతిలిఙ్గినః | ఏవంవిధాశ్చ యే కేచి ద్భవన్తీహ కలై యుగే. 41

అధీయన్తే తథా శూద్రా శ్శూద్రా ధర్మార్థకోవిదాః | యజన్తే హ్యశ్వమేధైశ్చ రాజాన శ్శూద్రయోనయః. 42

స్త్రీబాలగోవధం కృత్వా హత్వాచైవ పరస్పరమ్‌ | ఉపకృత్య తథా న్యోన్యంసాధయన్తి తథా ప్రజాః. 43

దుఃఖప్రచురతాల్పాయు ర్దేశోత్సార స్సరోగతాః | అధర్మాభినివేశత్వా త్తమోవృత్తం కలౌయుగే. 44

భ్రూణహత్యా ప్రజానాంచ తథాహ్యేవం ప్రవర్తతే |

తస్మా దాయు ర్బలం రూపం ప్రహీయన్తే కలౌ యుగే. 45

దుఃఖేనాభిప్లుతానాంచ పరమాయు శ్శతం నృణామ్‌ | భూత్వాచ నభవన్తీహ వేదాః కలియుగేఖిలాః. 46

ఉత్సీదన్తే తథా యజ్ఞాః కేవలా ధర్మసేతవః | ఏషా కలియుగావస్థా సన్ధ్యాంశౌ తు నిబోధత. 47

కలియుగమున మనోవాక్కాయ కర్మములతో వార్త (లోకయాత్ర) నెరవేరునో జరుగునో లేదో కూడ చెప్పజాలము. కలియుగము ప్రాణులకు అధికముగా మరణప్రదము; ఎల్లప్పుడును రోగము ఆకలివలని భయము అనావృష్టి భయము దేశోపద్రవము ఉండును. ప్రజలు దేనినిగాని ప్రమాణముగా గ్రహించరు. ఇట్లీ ఘోర కలి యుగమున గర్భస్థులుగా ¸°వనస్థులుగా కౌమారమున వార్ధకమున ఇట్లనేక వయో దశలలో జనులు మరణింతురు. ప్రజలకు తేజోబలతములల్పములు; వారు పాపులు - మహాకోపులు - అధార్మికులు - గా నుందురు. అనృతమాడుటయే వారి వ్రతము. వారు లోభపరులు; వారు అనుష్ఠించు యజములా అధ్యయనములు ఆచారములు (ప్రమాణముగా గ్రహించు) ఆగమములు సరియైనవికావు. (ముఖ్యముగా సమాఖ్యమున క్షేమము కలిగింప యత్నించవలసిన) బ్రాహ్మణులు ఆచరించు కర్మములందలి దోషముల ప్రభావమున ప్రజలు భయముల పాలగుదురు. ఈ యుగమున ప్రజలలో హింసా (దురభి) మానము ఈర్ష్య క్రోధము మాయ అక్షమ (ఓర్పు లేకుండుట) అధృతి (నిబ్బరము లేకపోవుట) లోభము మోహము అన్ని విధముల వ్యాప్తమగును. సర్వవిధములగు సంక్షోభములును మిక్కిలిగా కలుగును. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయరు; (సరియగు) యాగములనుష్ఠించరు. ఇట్లు విప్రుతే కాదు-క్షత్త్రియులును వైశ్యులును ఉత్సాదము (మానసికమగు నాశస్థితి) నందుదురు - శూద్రులకు బ్రాహ్మణులతో (వాస్తవమున బ్రాహ్మణులకు శూద్రులతో) మంత్రము - (వేదము) యోని (కాని ప్రవృత్తి) పడక - భోజనము కలిసి-కూర్చుండుట మొదలగు విషయములలో సంబంధము ఏర్పడును. చాలవరకు శూద్రులు రాజు (పాలకు లగుదురు. పాషండ (వేద శాస్త్రములందు ప్రామాణ్య బుద్ధిలేని) ప్రవృత్తులధికమగును - ప్రజలు కాషాయ వస్త్రధారులు నిర్గ్రంథులు (కర్మానుష్ఠానములను వదలిన వారు) నిష్కచ్ఛులు (లోపల గోచీవంటి దానిని ధరించకయే వస్త్రధారణ చేయువారు) కపాలాది ధారణము తమ ధర్మ లక్షణముగా ధరించు కాపాలియులు - దేశభక్తుల వేషములు ధరించిన లోకవ చకులు లోకనాశకులు ధర్మమును పాడుచేయువారు కొందరు దివావ్రతులు (పగలు మాత్రము జనులకు తాము సదాచారాది లక్షణ సంపన్నులని చూపుటకు వేషముతో నటన చేయుచు పరోక్షమునను మనస్సులోను దుష్ప్రవృత్తులతో ఉండువారు) వృత్తినిమిత్తము (పొట్టకూటికై) వేదాధ్యయనాదికము చేసినట్లు నటించువారు అగుదురు. శూద్రులు వేదాధ్యేతలుగా ధర్మార్థకోవిదులుగా అగుదురు. స్త్రీబాల గోవధ పరస్పర వధలు స్వార్థమునకై పరస్పరోపకారము చేయువారు అగుదురు. దుఃఖప్రాచుర్యము అల్పాయువు-ప్రజలు దేశములు వదలిపోవుట రోగములు చెందుట అధర్మమునందభినివేశము (గాఢాసక్తి) తమోగుణ ప్రవృత్తి భ్రూణ (సాంగ వేదాధ్యయనము వేద ధర్మానుష్టానము కల బ్రాహ్మణుల-గర్భస్థ శిశువులు - హత్య) ఆయుర్బల రూపహాని అధికమగును. (ప్రజలెలరు దుఃఖములతో అభిప్లుతులు (మునుకలెత్తినవారు) అగుదురు. వీరి పరమాయువు (ఎక్కువకు ఎక్కువయును) నూరు సంవత్సరములు. అదివరకు ఉన్నంత మంచిస్థితిలో కాదు సరేగదా ఏమాత్రమును మంచిస్థితిలో ఈయుగమున వేదములుండవు. కేవలము ధర్మ వ్యవస్థాపరిరక్షణలో అడ్డుకట్టలవలెనుండు యజ్ఞములు నడువక నశించును. ఇది కలియుగధర్మ ప్రవృత్తి స్వరూపము. ఇక కలి సంధ్యా సంధ్యాంశముల ధర్మస్వరూపమును తెలిపెదను.

కలిసన్ధి-తదంశ-ధర్మాః.

యుగే యుగే తు హీయన్తే త్రీంస్త్రీన్పాదాంశ్చసిద్ధయః | యుగస్వభావా త్సన్ధ్యాస్తు అవతిష్ఠన్తి పాదతః. 48

సన్ధ్యాస్వభావా స్స్వాంశేషు పాదేనైవావతస్థిరే | ఏవం సన్ధ్యాంశ##కే కాలే సమ్ప్రాప్తేతు యుగాన్తికే. 49

తేషాం రాజ్ఞా మసాధూనాం శాస్తా భృగుకులోత్థితః | గోత్రేణవై చన్ద్రమసో నామ్నా ప్రమతి రుచ్యతే. 50

కలిసన్ధ్యాంశభావేషు మనో స్స్వాయమ్భువేన్తరే | సమాస్త్రింశత్తు సమ్పూర్ణాః పర్యటన్వై వసున్ధరామ్‌. 51

అస్త్రకర్మా సవై సేనాం హస్త్యశ్వరథసఙ్కులామ్‌ | ప్రగృహీతాయుధై ర్విపై#్ర శ్శతశోథ సహస్రశః. 52

స తదా తైః పరివృతో వ్లుెచ్ఛా న్త్సర్వా న్నిజిఘ్నివా& |

స హత్వా సర్వశ##శ్చైవ రాజాన శ్శూద్రయోనయం. 53

పాషణ్డాం త్స తదా సర్వా న్నిశ్శేషా నకరో త్ప్రభుః | అధార్మికాశ్చ యే కేచిత్తాన్త్సర్వా& హన్తి సర్వశః.

ఉదీచ్యా న్మధ్యదేశ్యాంశ్చ పార్వతీయాం స్తథైవచ | ప్రాచ్యా న్ప్రతీచ్యాంశ్చ తథా విన్ధ్యపృష్ఠాపరాన్తికా&.

తథైవ దాక్షిణాత్యాంశ్చ ద్రవిడా న్త్సింహళై స్సహ | గాన్ధారా న్దరదాంశ్చైవ పప్లవా న్యవనా ఞ్ఛకా&. 56

తుషారా& బర్బరాం చ్ఛ్వేతా& పుళిన్దా న్పుల్కసా నథ |

లిమ్బకా నర్ధకరకాం శ్చౌరాణాం చైవ జాతయః. 57

ప్రవృత్తచక్రో బలవా ఞ్చూద్రాణా మన్తకృద్విభుః | విద్రావ్య సర్వభూతాని చచార వసుధా మిమామ్‌. 58

మానవస్యతు వంశేతు నృదేవస్యేహ జజ్ఞివా& | పూర్వే జన్మని విష్ణుశ్చ ప్రమతిర్నామ వీర్యవా&. 59

సుతస్సవై చన్ద్రమసః పూర్వే కలియుగే ప్రభుః | ద్వాత్రింశేభ్యుదితే వర్షే ప్రకాన్తస్త్రింశతః సమాః. 60

నిజఘ్నే సర్వభూతాని మానుషాణ్యన సర్వశః | కృత్వా బీజావశిష్టాన్తాంపృథ్వీం క్రూరేణ కర్మణా. 61

ప్రతి యుగమునందును ఆయా యుగపు సద్‌ ధర్మములు దాని సంధ్యాకాలమునందు మూడు వంతులు నశించి ఒక నాల్గవవంతు మాత్రము శేషించును. సంధ్యాకాల ధర్మములలో నాల్గవవంతు మాత్రమే ఆయుగపు సంధ్యాంశ కాలమున మిగులును. ఇట్టి కలియుగ సంధ్యాకాలము కూడ గడచి సంధ్యాంశకాలము వచ్చిన యుగావసాన సమయమున ఆనాటి అసాధు వర్తనులను రాజులను దండించుటకై భృగు వంశమున జన్మించిన చంద్రుడను వాని గోత్రమున (మీదటి తరములలో) ప్రమతియను నాతడు జన్మించును. అతడా స్వాయంభువ మన్వంతరపు కలియుగ సంధ్యాంశకాలమున నిండుగ ముప్పదిఏండ్లు పృథివియంతయు సంచరించుచు అస్త్ర ప్రయోగముతో యుద్ధములు చేయుచు చతురంగ బలము వెంటరాగా ఆయుధములుపట్టి నూర్లకొలది వేలకొలది విప్రులు తను పరివారించి వచ్చుచుండగా సర్వ వ్లుెచ్ఛులను సంహరించును. శూద్రులగు రాజులను పాషణ్డులను నిఃశేషులనుగా చేసెను. అధార్మికులనందరను - ఉదీచ్య మధ్యదేశ్య వార్వతీయ ప్రాచ్య ప్రతీచ్య వింధ్య పృష్ఠవాసులను అపరాంతికులను (భారతదేశపు పడమటి అంచులందలివారిని) దాక్షిణాత్య ద్రవిడ సింహళ జనులను గాంధార దరద పప్లవ యవన శకతుషార బర్బర పుళింద పుల్కన లింబకార్ధకరక చౌర జాతులను - సంహరించును. తన చక్రము (సేన) ను ప్రవర్తిల్ల (సంచరింప) జేసి శూద్ర రాజులను అంతమొందించును. (ధర్మవిరోధి) సర్వప్రాణులను తరుముచు ఈ భూమియందంతటను అతడు సంచరించును. ఇతడు మను వంశమున జన్మించిన నృదేవునికి (రాజునకు) కుమారుడు; ఈ జన్మమునకు ముందు అతడు సాక్షాద్విష్ణువే. అతడు ప్రమతియను పేర చంద్రముడను రాజునకు వీర్యశాలియగు కుమారుడుగా పుట్టును. అతడు తన ముప్పది రెండవేట బయలుదేరి ఇరువది సంవత్సరములపాటు ఇట్లు మానవులలో సర్వ ప్రాణులను చంపిచంపి క్రూరకర్మమునాచరించి ఈ పృథివిని మానవ బీజావశేషమునుగా (ఏకొలదిమందియో మాత్ము మిగులునట్లు) చేసెను.

పరస్పరనిమిత్తేన కాలేనాకస్మికేన చ | సంస్థితా సహసా యాతుసేనాప్రమతినా సహ. 62

గఙ్గాయమునయోర్మధ్యే సిద్ధిం ప్రాప్తా సమాధినా | తతస్తేషు ప్రణష్టేషు సన్ధ్యాంశే క్రూరకర్మసు. 63

ఉత్సాద్య పార్థివా న్త్సర్వా స్తేష్వతీతేషు వై తదా | తన స్సన్ధ్యాంశ##కే కాలే సమ్ప్రాప్తేచ యుగాన్తికే. 64

స్థితాః స్వల్పావశిష్టాస్తు ప్రజాస్త్విహ క్వచిత్క్వచిత్‌ | స్వప్రధానా స్తదా తేవై లోభావిష్టాస్తుసర్వశః. 65

ఉపహింసన్తి చాన్యోన్యం ప్రలుమ్పన్తి పరస్పరమ్‌ | అరాజకే యుగాంశేతు సంశ##యే సముపస్థితే. 66

ప్రజాస్తావై తదాసర్వాః పరస్పరభయార్దితాః | వ్యాకులాస్తా పరావృత్తా స్త్యజ్య దేహం గృహాణి తు. 67

స్వాన్త్స్వా న్ప్రాణా నవేక్షన్తో నిష్కారుణ్యాత్‌ సుదుఃఖితాః |

నష్టే శ్రౌతస్మృతౌ ధర్మే కామక్రోధవశానుగాః. 68

నిర్మర్యాదా నిరానన్దా నిస్స్నేహా నిరపత్రపాః | నష్టే ధర్మే ప్రతిహతా హ్రస్వకాః పఞ్చవింశకాః. 69

హిత్వా దారాంశ్చ పుత్త్రాంశ్చ విషాదవ్యాకులాః ప్రజాః |

ఆనావృష్టిహతా స్తేవై వార్తాముత్స్యజ్య దుఃఖితాః. 70

సదా కృష్ణాజినధరా నిష్క్రియా నిష్పరిగ్రహాః | వర్ణాశ్రమపరిభ్రష్టా స్సఙ్కరం ఘోర మాస్థితాః. 71

ఏతాం కాష్ఠా మనుప్రాప్తా హ్యల్పశేషాః ప్రజాస్తతః | జన్తవశ్చ క్షుధా೭೭విష్టా దుఃఖా న్నిర్వేద మాగమన్‌.

సంశ్రయన్తి విదేశాంస్తాం శ్చక్రవ త్పరివర్తనాః | తతః ప్రజాస్తు తాస్సర్వా మాంసాహార భవన్తి తాః. 73

మృగా న్వరాహా న్వృషభా న్యేచాన్యే వనచారిణః | భక్ష్యాంశ్చైవాప్యభక్ష్యాంశ్చ సర్వాంస్తా న్భక్షయన్తి తాః.

సముద్రం సంశ్రితా యాస్తు నదీశ్చైవ ప్రజా స్తథా | తేపి మత్స్యా& హరన్తీహ ఆహారార్థం చ సర్వశః. 75

అభక్ష్యాహారదోషేణ ఏకవర్ణా గతాః ప్రజాః | యథా కృతయుగే పూర్వ మేకవర్ణ మభూత్కిల. 76

తథా కలియుగస్యాన్తే శూద్రీభూతాః ప్రజా స్తథా | ఏవం వర్షశతం ప్యుం దివ్యం తేషాం ప్రవర్తతే. 77

* షట్త్రింశత్తు సహస్రాణి మానుషాణితు తానివై |

ఇట్టి స్థితిలో పరస్పర హేతువుల చేతను కాలవశమునను ఆకస్మికముగను (ఏ కారణమును లేకయును) ఒకటిగా ప్రమతివెంట కూడియున్న సేన ఈ చెప్పిన పని పూర్తికాగానే శీఘ్రకాలముననే గంగా యమునల నడుమ (ప్రయాగ క్షేత్రములో) సమాధి నవలంబించి ప్రమతితోకూడ దేహత్యాగమొనరించెను. ఇట్లు స్వాయంభువ మన్వంతర మందలి సంధ్యాంశమున క్రూరకర్ములగు జనులు పూర్తిగా నశించగా నాటి రాజులనందరను నశింపజేసి ప్రమతి మొదలగువారును గతించిపోగా సంధ్యాంశమందలి కడపటి కాలమాసన్నముకాగా స్వల్పావశిష్టులుగా మిగిలిన కొలదిమంది ప్రజలను అచ్చటచ్చట మిగిలియుందురు. వారును తమ క్షేమమే తాము చూచుకొనుచు స్వప్రధాన దృష్టి కలవారై సర్వ విధముల లోభావిష్టులయి పరస్పరము హింసించుకొనుచు దోచుకొనుచు నుండిరి. లోకమరాజకమై ప్రజల జీవితము సంశయగ్రస్తమయ్యెను. ప్రజలు పరస్పర భయపీడితులై వ్యాకులతనొంది ఒకరికింకొకరికి పొత్తు పొంతనలు లేక కొందరు గృహములు విడిచిపోయిరి. మరికొందరు దేహములనే విడిచిరి. తమ్ము దయచూచువారు లేకపోగా తమతమ ప్రాణముల కాపాడుకొనుచు మిగుల దుఃఖపీడితులైరి. శ్రౌతస్మార్త ధర్మములు నశించెను. ప్రజలు కామక్రోధవశులు మర్యాద తప్పినవారు ఆనందరహితులు స్నేహబుద్ధి సిగ్గు బిడియయములు లేని వారునయిరి. ధర్మనాశమయ్యెను. వారాపదలపాలైరి. పొట్టివారును ఇరువదియైదేండ్లకంటె జీవించని వారునయిరి. ప్రజలు విషాదముతో వ్యాకులురై దారపుత్త్రుల విడిచి వానలు లేక ఇబ్బందులపాలయి జీవనోపాధులు విడిచి (లేక) దుఃఖితులై జింకచర్మములే ధరించుచు ఏ పనులును చేయక ఇచ్చువారును పుచ్చుకొనువారును లేక వర్ణాశ్రమ పరిభ్రష్టులయి ఘోరమగు ధర్మ సంకరము నొందిరి. మిగిలిన కొలదిమంది ప్రజలును ఈ స్థితినొందిరి. ఇతర ప్రాణులును ఆకలి పీడనందుచు జీవితముపై విసుగు చెందెను. చక్రములవలె నిలుకడలేక సంచరించుచు తమ దేశముల విడిచి విదేశముల నాశ్రయించిరి. వారు మాంసాహారులయి లేళ్ళు మొదలగు వానిని పందులను ఎద్దులను మరి ఇతర వనచారి ప్రాణులను తినసాగిరి. సముద్ర నదీ తీరముల నాశ్రయించిన ప్రజలును మత్స్యములు మొదలగువానిని (వారు బ్రాహ్మణులైనను) తినిరి. భక్ష్యాభక్ష్య విచారణను వారు విడిచిరి. అభక్ష్యాహార దోషముచే జగత్తును ఒకే వర్ణమయ్యెను. ఇది కృతయుగపు స్థితివలె నుండెను. (కృతమున అందరును ధర్మపరులై ఒకే వర్ణము వారుగానయిరి. ఈ కలియుగమున అధర్మవశులై ఏక వర్ణమువారైరి.) ఇట్లు కలియుగాంతమున ఎల్ల ప్రజలును శూద్రీభూతులయిరి. ఇట్లు నూరు దివ్య వర్షముల కాలము గడచెను. ఇది మానవ మాసమున ముప్పది ఆరువేల సంవత్సరములు.

అథ దీర్ఘేణ కాలేన పక్షిణః పశవ స్తథా. 78

మత్స్యాశ్చైవ హతాస్సర్వే క్షుదావిష్టైశ్చ సర్వశః | నిశ్శేషేష్వథ సర్వేషు మత్స్యపక్షిపశుష్వథ. 79

సన్ధ్యాంశే ప్రతిపన్నేషు నిశ్శేషాస్తు తదాకృతాః | తతః ప్రజాస్తు సమ్భూయ కన్ధమూల మథాఖనత్‌. 80

ఫలమూలాశినస్సర్వే అనికేతా స్తథైవచ | వల్కలా న్యథ వాసాంసి అధశ్శయ్యాశ్చ సర్వశః. 81

పరిగ్రహో న తేష్వస్తి న చ శుద్ధి మవాప్నుయుః | ఏవం క్షయం గమిష్యన్తి హ్యల్పశిష్టాః ప్రజా స్తదా. 82

తాసా మల్పావశిష్టానా మాహారా ద్వృద్ధిరిష్యతే | ఏవం వర్షశతం దివ్యం సన్ధ్యాంశ స్తస్య వర్తతే. 83

తతో వర్షసహస్రాన్తే అల్పశిష్టాః స్త్రియస్తు తాః | మిథునానితు తాస్పర్వా హ్యన్యోన్యం సమ్ప్రజజ్ఞిరే. 84

తతస్తాస్తు మ్రియంతేవై పూర్వోత్పన్నాః ప్రజాస్తు యాః | జాతమాత్రే ష్వపత్యేషు తతః కృత మవర్తత. 85

_______________________________________________

* షడ్వింశస్తు.

యథా స్వర్గే శరీరాణి నరకేచైవ దేహినామ్‌ | ఉపభోగసమర్థాని ఏవం కృతయుగాదిషు 86

ఏవం కృతస్య సన్తానః కలేశ్చైవ క్షయ స్తథా | విచారణాత్తు నిర్వేద స్సామ్యావస్థాత్మతా తథా. 87

తతశ్చైవాత్మసమ్బోధః సమ్బోధా ద్ధర్మశీలతా | కలిశిష్టేషు తేష్వేవ జాయన్తే పూర్వచ త్ర్పజాః. 88

భావినోర్థస్యచ బలా త్తతః కృత మవర్తత | అతీతానాగతాని స్యు ర్యాని మన్వన్తరే ష్విహ.89

ఏతే యుగస్వభావాశ్చ మయోక్తాస్తు సమాసతః | విస్తరేణానుపూర్వ్యాచ్చ నమస్కృత్వా స్వయమ్భువే. 90

ఇట్లు చాలకాలము గడచిన మీదట ఆకటి బాధతో ప్రజలు పశుపక్షులను మత్స్యములను దొరకినచోట దొరకిన వెల్ల తిని వేయగా అవి ఏమాత్రమును మిగులకపోయెను. నాటి కలి సంధ్యాంశస్థితి ఇది. అంతట ప్రజలు నేల త్రవ్వి కొని కందమూలములను - చెట్లనుండి ఫలములను - తినసాగిరి. వారుండుట కిండ్లు లేకుండెను. వారికి చెట్లబెరడులే వస్త్రములు. నేలయే పడకలు. దాన పరిగ్రహములు వారిలో లేకుండెను. శుద్ధి లేకుండెను. ఇంకను మిగిలిన కొలది మంది కూడ ఇట్లు క్రమముగ నశించిరి. ఇంకను అల్పావశిష్టులుగా మిగిలినవారు ఆహారమునుఉన్నదానిని తిని వృద్ధి నొందిరి. ఇట్లు కలిసంధ్యాంశము నూరేండ్లును గడచెను. ఇట్లు వేల మానవ సంవత్సరముల తరువాత మిగిలిన కొలది మంది ప్రజలును వారి కుమారులును మిగిలియున్న స్త్రీలతో దాంపత్య సంబంధమును వ్యవస్థ చేసికొనిరి. సంతానమును కనిరి. వారికి సంతానము కలిగిన కొలదికాలములోనే వారికి ముందటి తరముల జనులు (ఈ పుట్టిన సంతానపు తల్లిదండ్రుల తరపు జనులు) మరణించిరి. (కలియుగపు జను లెవ్వరును మిగులలేదు.) ఇట్లంతట కృతయుగ మారంభమయ్యెను. జీవులు ఈ భూలోకపు దేహమును విడిచిన తరువాత వారి పుణ్య పాపముల ననుసరించి స్వర్గనరక సుఖదుఃఖానుభవార్థము మరి యొక దేహము ఆ జీవులకు లభించునట్లే కలియుగపు జనులనుండి కృతయుగమునకు సంబంధించిన జనులకు దేహప్రాప్తి యయ్యెను. ఇది కలియుగము ముగిసి కృతయుగ మారంభమయిన విధము. కలియుగమునుండి మిగిలినవా రెవ్వరైన నున్నచో వారియందును ఈ కృతయుగ ప్రజలయందును విచారణా ప్రవృత్తి కలిగెను. దానిచే ప్రాపంచిక జీవితముపై విసుగు సత్త్వరజస్తమోగుణముల సమతాస్థితి దానిచే ఆత్మజ్ఞానము దానిచే ధర్మశీలము కలిగి మొదటి కృతయుగమందువలె సజ్జనులగు ప్రజలు పుట్టిరి. దీని కంతటికిని భవితవ్యమగు అర్థము (జరుగవలసిన విషయము-జీవుల పూర్వ కర్మాను గుణమగు అదృష్టమను ధర్మాధర్మఫలములును) హేతువు. దీని కంతటికిని మూలతత్త్వమగు స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి మీకు ఈ యుగధర్మ ప్రవృత్తులన్నియు తెలిపితిని. యుగప్రవృత్తులు ప్రతి ఆ వృత్తియందును ఇట్లే యుండును. ఇది యుగ ప్రవృత్తుల సమాన - వ్యాస - కథనము. (మొదట ఒక విషయమును సంగ్రహముగ చెప్పి పిదప దానియందలి ప్రత్యేకాంశముల గ్రహించి విస్తరించి చెప్పుట సమాన-వ్యాస-కథనము.)

ప్రవృత్తేతు తత స్తస్మి న్పునం కృతయుగే తు వై | ఉత్పన్నాః కలిశేషేషు ప్రజాః కార్తయుగా స్తథా.

తిష్ఠన్తి చేహ సిద్ధా యే అదృష్టా విహరన్తిచ | సహ సప్తర్షిభి ర్యేతు తత్ర

యేచ వ్యవస్థితాః. 92

బ్రహ్మక్షత్త్రవిశ శ్శూద్రా బీజార్థే యే ఇహ స్స్మృతాః |

కార్తే యుగభ##వై స్సార్ధం నిర్విశేషా స్తదాభవ&. 93

తేషాం సప్తర్షయో ధర్మం కథయన్తీహ తేషు చ |

వర్ణాశ్రమాచారయుక్తా శ్శ్రౌతస్మార్తోదితం తదా. 94

శ్రౌతస్మార్తస్థితానాంతు ధర్మే సప్తర్షిదేశితే | తేతు ధర్మవ్యవస్థార్థం తిష్ఠన్తే హ యుగే యుగే. 95

మన్వన్తరాధికారేతు తిష్ఠన్తి ఋషయస్తు తే | యథా దావప్రదగ్ధేషు తృణష్వేవాపరం తృణమ్‌. 96

వనానాం ప్రథమం వృష్ట్యా తేషాం మూలేషు సమ్భవః | ఏవం యుగయుగానాంవై సన్తానస్తు పరస్పరః.

వర్తతే హ్యనవచ్ఛేదా ద్యావ న్మన్వన్తరక్షయః | సుఖ మాయు ర్బలం రూపం ధర్మోర్థః కామ ఏవ చ. 98

యుగే ష్వేతాని హీయన్తే త్రీన్పాదాంశ్చ క్రమేణ తు | ఇత్యేష ప్రతిసన్ధిర్వ | కీర్తితస్తు మయా ద్విజాః. 99

చతుర్యుగానాం సర్వేషా మేతదేవ ప్రసాధనమ్‌ | ఏషాం చతుర్యుగానాంతు గణితా హ్యేకసప్తతిః. 100

క్రమేణ పరివృత్తాస్తా మనోరన్తర ముచ్యతే | యుగాఖ్యాసుతు సర్వాసు భవతీహ యథాచ యత్‌. 101

తదేవ చ తదన్యాసు పురస్తాద్వై యథాక్రమమ్‌ | సర్గేసర్గే యథా భేదా హ్యుత్పద్యన్తే తథైవచ. 102

చతుర్దశసు జాయన్తో జ్ఞేయా మన్వన్తరే ష్విమ | ఆసురీ యాతుధానీచ పైశాచీ యక్షరాక్షసీ. 103

యస్మి న్యుగే తదాకాలం ప్రజా జాయన్తి తా శ్శృణు | తథా కల్పయుగై స్సార్ధం భవన్తే తుల్యలక్షణాః.

ఇత్యేత ల్లక్షణం ప్రోక్తం యుగానాం వై యథాక్రమమ్‌ |

మన్వన్తరాణాం పరివర్తనాని చిరప్రవృత్తాని యుగస్వభావాత్‌. 105

క్షణం న సంతిష్ఠతి జీవలోకః క్షయోదయాభ్యాం పరివర్తమానః |

ఏతే యుగస్వభావాశ్చ పరిక్రాన్తా యథాక్రమమ్‌. 106

మన్వన్తరాణి యాన్యస్మి న్కల్పే వక్ష్యామి తాని చ. 106

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మన్వన్తరానువర్ణనే ద్వాపరకలియుగ యుగధర్మాది

కథనం నామ త్రిచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

ఇట్లు ప్రవర్తిల్లిన కృతయుగమునందు అది కలియుగమునుండి మిగిలిన వారికి జనించినవారే ఆది ప్రజ లగుదురు. ఈ లోకమున ఎవరికిని కనబడక అదృష్టులై తిరుగుచుండు సిద్ధులును సప్త ఋషులతోను కూడ ద్యులోకమందుండు మహాపురుషులును లోకమున ఈ కృతయుగ ప్రజల ఉత్పత్తికి బీజరూపమున నిలిచియున్న బ్రహ్మ క్షత్త్రియ వైశ్య శూద్ర శేష ప్రజలును ఈ కృతయుగారంభవు ఆది ప్రజలతో కలిసిమెలసి తత్సములయి యుండి వీరికి ధర్మము నుపదేశింతురు. వర్ణాశ్రమా చార ధర్మములను శ్రౌత స్మార్త కర్మ మూల ధర్మప్రవృత్తులును సప్తర్షులు వీరి కుపదేశిం తురు. ఏలయన ధర్మవ్యవస్థా ప్రతిష్ఠార్థమై సప్తర్షులు ఈ లోకపు ప్రజల నడుమ ప్రతియుగమునను నిలుతురు. వారి యుపదేశముచే ప్రజలును ధర్మకర్మాచరణములందు ప్రతిష్ఠితులు (దృఢాభి నివేశముతో నిలిచినవారు) అగుదురు. ఈ ఋషు లిట్లు మన్వంతర ప్రవర్తనాధికారమునందు నిలిచియుండి లోకమున ధర్మప్రతిష్ఠా ప్రవృత్తులకు హేతుభూతు లగుదురు. వనము లలో దావాగ్ని (దవమనగా అడవి) వలన తృణములు కాలిపోయినను దానిని చల్లార్చుటకై కురిసిన వాననీటిబొట్టు పడి నందున ఆ దావాగ్ని పాలయిన తృణపు మొదటినుండియే ఈ దావాగ్నితో దగ్ధము కాక మిగిలిన ఈ తృణ బీజ శేషము నుండి క్రొత్త తృణము మొలచును గదా! అట్లే యుగము తరువాత మరియొక యుగపు ఆరంభమున ప్రజా సంతానము (సంతానము=నైరంతర్యమున కొనసాగుట) జరుగును. ఇట్లు రెండేసి యుగముల పరస్పర సహకారముతో యుగానంతర యుగ ప్రవృత్తి మన్వంతరము ముగియు వరకు అనవచ్ఛిన్నమయి సాగుచునే యుండును. కృతము మొదలు కలివరకు యుగములలో ఆయుర్బల ధర్మార్థ కామములు క్రమమున నాల్గవవంతు చొప్పున తగ్గుచు వచ్చును. ఇది ప్రతిసంధి (సంధ్యా సంధ్యాంశ) దశాప్రవృత్తి ప్రకారము (ప్రకారము=రీతి); ప్రతి చతుర్యుగము (చతుర్యగము=మహాయుగ ము=కృత త్రేతా ద్వాపర కలియుగముల సముదాయము) నందును యుగ పరివర్తన క్రమ మిట్లే యుండును.

ఇటువంటి మహాయుగములు డెబ్బది యొకటి ఐనచో ఒక మన్వంతర మగును.

ప్రతి యుగమునందును కృతాదియుగ చతుష్టయమునందును ఏ యుగమునందు ఒకసారి ఏది ఎప్పుడు ఎట్లు జరుగునో అదియే అట్టి ప్రతియొక ఆవృత్తియందును జరుగును. ప్రతియొక యుగ సృష్టియందును కొన్ని విశేషాంశము లందు వీటికి పరస్పర భేదమును ఉండవచ్చును. ఇవియు అట్లే ప్రతియుగ మహాయుగా వృత్తియందును జరుగుచుండును. ఈ విషయము పదునాలుగు మన్వంతరములందును ఇట్లే ఆవృత్త మగును. మానవులు మాత్రమేకాక అసురులు యాతు ధానులు పిశాచులు యక్షులు రాక్షసులు మొదలగు జాతులవారు కూడ ఆయా యుగ మహాయుగ మన్వంతరముల యందు సమాన లక్షణములతో నుందురు.

ఇట్లు మీకు యుగముల లక్షణము యథాక్రమముగ తెలిపితిని. ఇట్లే కల్పావసానము వరకు మన్వంతరములును పరివర్తనమునందుచు పోవును. ఇవి ఇప్పటికి ఎంతయో చిరకాలమునుండి ప్రవర్తిల్లుచు వచ్చుచున్నవి. ఇక ముందును కొనసాగుచుండును. యుగ స్వభావమే ఇందులకు హేతువు. ఈ జీవలోకము క్షణకాలము కూడ ముందునకు సాగక మార్పు నొందక యుండదు. ఈ జీవలోకమునకు నాశము ఉత్పత్తి ఈ రెండును స్వాభావికములు.

ఇట్లు యథాక్రమమున మీకు యుగ స్వభావములను తెలిపితిని. ఈ కల్పమునందు గడచిన - గడుచుచున్న - గడువనున్న - మన్వంతరముల విషయమును కూడ తెలిపెదను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మన్వంతరాను కీర్తనమున యుగ లక్షణాను కీర్తనమను

నూట నలువది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters