Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్విచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

త్రేతాయుగే యజ్ఞప్రవృత్తికథనమ్‌.

ఋషయః : 

కథం త్రేతాయుగముఖే యజ్ఞస్యాసీ త్ర్పవర్తనమ్‌ | పూర్వే స్వాయమ్భువే సర్గే యథాచ ప్రబ్రవీహి నః. 1

సూతః : అన్తర్హితాయాం సన్ధ్యాయాం సార్ధం కృతయుగేన తు |

కాలాఖ్యాయాం ప్రవృత్తాయాం ప్రాప్తే త్రేతాయుగే తథా. 2

ఓషధీషు చ లీనాసు ప్రవృత్తే పృష్టిసర్జనే | ప్రతిష్ఠితాయాం వార్తాయాం గ్రామేషుచ పురేషుచ. 3

వర్ణాశ్రమసమస్థానం కృత్వా మన్త్రాశ్చ నః పునః | సహితా స్తాస్తు సంహృత్య కథం యజ్ఞం ప్రవర్తయేత్‌.

దైవతైస్సహ సంహృత్య సర్వసాధన సంభృతః | తస్యాశ్వమేధే వితతే సమాజగ్ము ర్మహర్షయః. 5

యజన్తం పశుభి ర్మేధ్యై రూచు స్సర్వే మహర్షయః | యజ్ఞకర్మణ్యపి తతే కర్మణ్యగ్రే తథార్త్విజి. 6

హూయమానే దేవహోత్రే అగ్నౌ బహువిధః క్రతుః | సమ్ర్పతీతేషు దేవేషు సామగేషుచ సుస్వనమ్‌. 7

పరిక్రాన్తేషు లఘుషు అధ్వర్యుపురుషేషు చ | ఆలబ్ధేషుచ ముఖ్యేషు తదా పశుగణషు వై. 8

ఆహూతేషుచ దేవేషు యజ్ఞ భుక్షు తదా తతః | య ఇన్ద్రియాత్మకా దేవా యజ్ఞభాగభుజస్తు తే. 9

తా న్యజన్తి తదా దేవాః కల్పాదిషు భవన్తియే | అధ్వర్యుపై#్రషకాలేతు వ్యుత్థాయ ఋషయ స్త్వథ. 10

ఋషీణా మిన్ద్రస్యచ యజ్ఞవిషయకవివాదః.

మహర్షయశ్చ తాన్దృష్ట్వా దీనా న్దేవ(న్పశు) గణాం స్తథా | విశ్వంచ భుఞ్జతే కోత్ర కోయంయజ్ఞవిధి స్తథా.

అధర్మో బలవానేష హింసా ధర్మేప్సయా తవ | పశుబన్ధవధ స్త్విష్ట స్తవ యజ్ఞే సురోత్తమ. 12

అధర్మో ధర్మఘాతాయ ప్రారబ్ధః పశుభి స్త్వయా |

నాయం ధర్మో హ్యధర్మోయం న హింసా ధర్మ ఉచ్యతే. 13

ఆగమేన భవా న్ధర్మం ప్రకరోతు యదీచ్ఛసి | విధిదృష్టేన యజ్ఞేన ధర్మేణాత్యయసేతునా. 14

యజ్ఞబీజై స్సురశ్రేష్ఠ త్రివర్గపరిమోషితైః | ఏష యజ్ఞో మహానిన్ద్రః స్వయమ్భువిహితః పురా. 15

ఏవం విశ్వభుగిన్ద్రస్తు ఋషిభి స్తత్త్వదర్శిభిః | ఉక్తో న ప్రతిజగ్రాహ మానమోహసమన్వితః. 16

నూట నలువది రెండవ అధ్యాయము.

త్రేతాయుగమున యజ్ఞ ప్రవృత్తి స్వరూపము.

యజ్ఞములకంటె లోకోపకారకమగు తపస్సే గొప్పదియనుట.

పూర్వము స్వాయంభువ మన్వంతరమున త్రేతా యుగారంభమున యజ్ఞ ప్రవృత్తి ఎట్లుండెను? ఎట్లు జరిగెను? కృతయుగమును దాని సంధ్యా సంధ్యాంశములును ముగిసి కాలనామము ననుసరించిన ప్రవృత్తులతో త్రేతాయుగమారంభమయ్యెను. తద్‌ యుగానుసారము ఓషధులు మొలచెను. వానలు కురియసాగెను. గ్రామములందును పురములందును జనుల జీవన ప్రవృత్తికి వలసిన వృత్తిధర్మపు నడక ఆరంభమయ్యెను. ఇట్టి దశలో పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను లోకమున ఎట్లు నిలిపెను? మంత్రము లను ఎట్లు ఏకత్ర కూర్చెను? వాటితో వేద సంహితలనెట్లు కూర్చెను? వాటితో యజ్ఞములను ఎట్లు ప్రవర్తిల్లజేసెను? ఇదియంతయు మాకు తెలుపుమని ఋషులడుగ సూతుడిట్లు వారికి చెప్పసాగెను. ఋషులారా! మీరడిగిన ప్రశ్నకు సమాధానమును తెలిపెదను; వినుడు; సమర్థుడగు వాడును విశ్వమందలి ప్రాణులను తమ ఆహారమును భుజించునట్లు అనుగ్రహించి వారిచ్చిన హవిరాదులను అనుభవించువాడునునగు ఇంద్రుడు ఐహ లౌకిక పారలౌకిక (స్వర్గపద) కర్మానుష్ఠానమునకు ఉపయుక్తములగు మంత్రములను సమకూర్చి వాటితో లోకమున యజ్ఞములను ప్రవర్తిల్లజేసెను. అందులకై ఇంద్రుడు తానే యజమానుడై సర్వ సాధనములను సమకూర్చుకొని దేవతలందరతో కూడి అశ్వమేధయాగ మాచరించ పూనెను. యజ్ఞమును వితతము చేయు సమయమునకు మహర్షులును వచ్చిరి.ఆ యజ్ఞకర్మమునందలి ఆరంభ కర్మము ననుష్ఠించుటకై ప్రవర్తిల్లసాగిరి. దేవతలనుద్దేశించి హవనము చేయుటకై ప్రణయనము చేయబడిన అగ్నియందు బహువిధములగు హవిస్సులు హోమము చేయబడుచుండెను. దేవతలందరును సంతుష్టులయిరి. సుస్వరముతో సామ వేదము గానము చేయబడుచుండెను. అధ్వర్యు పురుషులు మిగుల వేగముగా అటునిటు తిరుగు చుండిరి. యజ్ఞ పశువులును ఆలంభము (మంత్రపూర్వకముగ ప్రాణములు తీయబడుట) చేయబడెను. యజ్ఞభాగముల ననుభవించవలసిన దేవతలును ఆహ్వానించబడిరి. ఇంద్రియాభిమానులగు దేవులు ఎవరెవరో వారువారు మాత్రము యజ్ఞ భాగములను అనుభవించు వారయిరి. మిగిలిన దేవతలందరును ఆ ఇంద్రియాధిష్ఠాన దేవతల నారాధించిరి. ప్రతి కల్పాదులయందును యజ్ఞ భాగ భోక్తలగు దేవతలు ఈ ఇంద్రియాభిమాని దేవతలే. (కాని ఈ యజ్ఞమున విశేషము ఒకటి జరిగెను.)

ఆధ్వర్యువులు 'పై#్రష' మంత్రములతో ఆయా దేవతలను ఆహ్వానించిన సమయమున ఋషులును మహర్షులును లేచి నిలువబడిరి. యజ్ఞమున ఆలంభము చేయబడిన (చేయబడుచున్న) దీనములగు పశు (దేవ) గణములను చూచిరి. విశ్వభుక్‌గా నున్న ఇంద్రుని వారు ఇట్లు ప్రశ్నించిరి: ''నీ ఈ యజ్ఞ విధానము ఎటువంటిది? (ఇది ఏమి యజ్ఞ ప్రక్రియ?) దీనియందు విశ్వభుక్‌? ఎవరు? సహజముగా ఇతరులు చేయు యజ్ఞమున విశ్వభుక్‌గా నున్న నీవే యజమానుడవై యుండగా దీనియందు ఎవరు 'విశ్వభుక్‌' స్థానమునందుండును? ధర్మ (ఫల)మును పొందగోరి నీవు చేయు ఈ (పశు) హింస మిగుల బలవత్తరమగు అధర్మము; సురోత్తమా! నీ ఈ యజ్ఞమునందు పశు బంధనమును వాని వధయును నీకు ఇష్టమయినట్లున్నది. పశువులు ఉపకరణములుగా నీవు ఆచరించు ఈ అధర్మము నీ ధర్మమును నశింపజేయును. ఇది ధర్మముగాదు; ఇది అధర్మము; హింస ధర్మము అని ఎవరును అనరు. నీకు ఇట్టి యజ్ఞము నాచరించుటయే ఇష్టమైనచో ఇది తగునని ఆగమ (శాస్త్రవిధి) ప్రమాణమును చూపి ఇది ధర్మమని నిశ్చయించుము. సురశ్రేష్ఠా! ఇంద్రా! ప్రజలను ధర్మమునుండి నివారించు సేతువుఅగు ధర్మమును అవలంబించినదియు శాస్త్రవిధియందు కనబడుచున్నదియు అగు యజ్ఞ ప్రక్రియతోను ధర్మార్థకామములచే ఆకర్షింపబడిన (వాటిని సాధించగల) యజ్ఞ బీజముల (వేదమంత్రముల)తోను స్వయంభూబ్రహ్మ పురాతన కాలమునందే ఈ యజ్ఞమును వేదములందు విధించెను. అనిరి. విశ్వభుక్‌ (ప్రతియొక విధమగు దేవతారాధనములం దును ప్రజలర్పించిన దానియందలి భాగమును తప్పక అనుభవించువాడు) అగు ఇంద్రునితో తత్త్వద్రష్టలగు ఋషులిట్లు పలుకగా మానమునకును మోహము (అజ్ఞానము) నకును వశీభూతుడయియున్న ఇంద్రుడు వారి మాటలను అంగీకరించలేదు.

తేషాం వివాద స్సుమహా న్యజ్ఞే ఇన్ద్రమహర్షిణామ్‌ | జఙ్గమైః స్థావరైః కేన యష్టవ్యమితి చోచ్యతే. 17

తే తు ఖిన్నా వివాదేన శక్త్యా ముక్తా మహర్షయః | సన్ధాయ సమమిన్ద్రేణ పప్రచ్ఛుః ఖచరం వసుమ్‌. 18

ఋషయః : మహాప్రాజ్ఞ కథం దృష్ట స్తవ యజ్ఞవిధి ర్నృప |

ఔత్తానపాదే! ప్రబ్రూహి సంశయన్నో నుద ప్రభో. 19

సూతః : శ్రుత్వా వాక్యం వసుస్తేషా మవిచార్య బలాబలమ్‌ | వేదశాస్త్ర మనుస్మృత్య యజ్ఞే విధిమువాచహ.

యథోపనీతై ర్యష్టవ్య మితి హోవాచ పార్థివః | యష్టవ్యం పశుభి ర్మేధ్యై రథ మూలఫలైరపి. 21

హింసా స్వభావో యజ్ఞస్య ఇతి మే దర్శనాగమః | యథేమే భాషితా మన్త్రా హింసాలిఙ్గా మహర్షిభిః. 22

దీర్ఘేణ తపసా యుక్తా స్తారుకాదినిదర్శనైః | తత్ప్రమాణం మయా చోక్తం తస్మాత్‌క్షమితు మర్హథ. 23

యది ప్రమాణంస్వాన్యేవ మన్త్రవాక్యాని వో ద్విజాః | తదా ప్రవర్తతాం యజ్ఞో అన్యథా మానృతం వచః.

ఏవంకృతోత్తరా స్తేతు యుజ్యా೭೭త్మానం తతో ధియా | ఆశప న్భావినం దృష్ట్వా తమర్థ మృషయ స్తథా.

ఇత్యుక్తమాత్రో నృపతిః ప్రవివేశ రసాతలమ్‌ | ఊర్ధ్వచారీ నృపో భూత్వా రసాతలచరోభవత్‌. 26

వసుధాతలచారీ తు తేన వాక్యేన సోభవత్‌ |

ధర్మాణాం సంశయచ్ఛేత్తా రాజా వసు రధో గతః. 27

తస్మాన్న వాచ్యో హ్యేకేన బహుజ్ఞేనాపి సంశయః | బహుద్వారస్య ధర్మస్య సూక్ష్మా దురనుగా గతిః. 28

తస్మా న్న నిశ్చయాద్వక్తుం ధర్మః శక్యోహి కేనచిత్‌ |

దేవానృషీ నుపాదాయ స్వాయమ్భువమృతే మనుమ్‌. 29

యజ్ఞము నాచరించవలసినది జంగమ ప్రాణులగు పశువులతోనా-స్థావర ప్రాణులగు వృక్షాదులనుండి లభించు కందమూల ఫలాదులతోనా? అను విషయమున ఇంద్రునకును మహర్షులకును గొప్ప వాదము నడచెను. మహర్షులు ఈ వాదముతో శక్తిహీనులై మిగుల ఖేదము (అలసట) చెందిరి. చివరకు వారు ఇంద్రునితో (వసుని మధ్యవర్తిగా గ్రహించి అతడు చెప్పిన మాట ఇరుపక్షములవారును అంగీకరింతమని) ఒప్పందమునకు వచ్చి అంతరిక్ష సంచారియగు వసుని ఇట్లడిగిరి. ఉత్తానపాదుని పుత్త్రుడవును మహాప్రాజ్ఞుడ వును అగు వసురాజా! ఈ రెండు విధములతో ఏ యజ్ఞము విధివిహితమని నీవు తలంచుచున్నావో తెలిపి మాసంశయమును పోగొట్టుము. అనిరి. అది వినిన వసురాజు ఈ రెండు పక్షముల బలాబలములను విచారించకయే (తనకు స్ఫురించిన) వేదశాస్త్రము ననుసరించి యజ్ఞ తత్త్వమునిట్లు చెప్పెను; యజమానుడు తన శక్తిననుసరించి ఏవి సమకూర్చుకొన్నచో వానితోనే యజ్ఞము చేయుట సమంజసము; పవిత్రములగు పశువులతోనైననుసరే - కందమూల ఫలాదులతోనైనసరే. యజ్ఞము సహజముగనే హింసా స్వభావము కలది; అని శాస్త్రములనుండి నాకు తెలిసిన విషయము. అదికాక మహర్షులు కూడ మంత్రములు హింసారూపములగు అర్థములనే ప్రతిపాదించునని విరవించుచు న్నారు. ఆ ప్రమాణముచే నేను చెప్పితిని. కావున మీరు శాంతింప వేడుచున్నాను. విప్రులారా! మీరు అంగీకరించుచున్న మంత్రవాక్యములు మీకు ప్రమాణములయినచో యజ్ఞమును జరుగనిండు; కాదందురా; కాదనుట తగదు; ఏలయన-నేను చెప్పినది అనృతము కాదు. వసురాజిట్లు తమకు సమాధానము చెప్పగా ఆ మహర్షులు తమ బుద్ధిని హృదయమును సంయోజనముచేసి (యోగ దృష్టితో ఆలోచించి) రాబోవు విషయము ఇదియని ఎరిగి ఇది సత్యమగునట్లు వారు ఆవసుని శపించిరి. వారు శాపవచనమును వలుకగనే రాజు రసాతలమును ప్రవేశించెను. అంతవరకును ఆకాశచరుడుగా నుండిన అతడిప్పుడు రసాతలచరు డయ్యెను. ఈ శాప వాక్యముతో ఆతడు వసుధాతలమున చరించువాడు కూడ నయ్యెనుకాని ఖేచరత్వము లేకపోయెను. ఇట్లు ఆతడు ధర్మ విషయక సంశయమును ఛేదింప యత్నించి ఆధోగతి నందెను. కావున తానెంతగా బహు విషయముల నెరిగిన వాడైనను ఒక్కడే (ఇతరులతో సంప్రతించక) సంశయమును నిర్ణయించరాదు. ఏలయన ధర్మ నిశ్చయమును చేరుటకు వాకిండ్లు ఎన్నోయున్నవి. వానిలో ఏ ద్వారమునుండి పోయినచో ధర్మమును సరిగా చేరవ్చునో నిర్ణయించి సరియగు మార్గమున నడుచుట సుకరముకాదు. కావున దేవతలును ఋషులును స్వాయంభువ మనువు అంతటివారు తప్ప మరి ఎవ్వరును సంశయాస్పద విషయమున నిశ్చయముచేసి చెప్పజాలరు.

తస్మా న్న హింసా యజ్ఞే స్యాద్యదుకర్త మృషిభి స్స్వయమ్‌ |

ఋషికోటిసహస్రాణి సై#్వ స్తపోభి ర్దివం గతాః. 30

తస్మా న్న దానయజ్ఞంచ ప్రశంసన్తి మహర్షయః | అంభో మూలం ఫలం శాకముదపాత్రం తపోధనాః. 31

ఏతద్దత్వా విబవత స్స్వర్గలోకే ప్రతిష్ఠితాః | అద్రోహశ్చా ప్యలోభశ్చ దమో భూతదయా తపః. 32

బ్రహ్మచర్యం తవ స్సత్య మనుక్రోశః క్షమా ధృతిః | సనాతనస్య ధర్మస్య మూల మేత దిదం నవ. 33

ద్రవ్యమన్త్రాత్మకో యజ్ఞ స్తపశ్చ సమతాత్మకమ్‌ | యజ్ఞైశ్చ దేవా నాప్నోతి వైరాజం తపసా పునః. 34

ఏవం వివాద స్సుమహా న్యజ్ఞస్యాసీ త్ర్పవర్తనమ్‌ | ఋషీణాం దేవతానాంచ పూర్వంస్వాయమ్భువేన్తరే. 36

తతస్తే ఋషయో దృష్ట్వా హృతం ధర్మం బలేన తు | వసోర్వాక్య మనాదృత్య జగ్ముస్తే వై యథాగమమ్‌.

గతేషుఋషిసఙ్ఘేషు దేవాయజ్ఞమవాప్నుయుః | శ్రూయన్తేహి తపస్సిద్ధా బ్రహ్మక్షత్త్రా దయో నృప. 38

ఏతే చాన్యేచ బహవస్తేతపోభిర్దివం గతాః | రాజర్షమో మహాత్మానో యేషాం కీర్తిః ప్రతిష్ఠితా. 39

తస్మాద్విశిష్యతే యజ్ఞా త్తపస్సర్వైస్తుకారణౖః | బ్రహ్మణా తపసా సృష్టం జగద్విశ్వమిదం పురా. 40

తస్మాన్నాత్యేతి తద్యజ్ఞస్తపోమూలమిదంస్మృతమ్‌ | యజ్ఞప్రవర్తనం హ్యేవమాసీత్స్యాయ మ్భువేన్తరే. 41

తదాప్రభృతి యజ్ఞోయం యుగైస్సార్ధం ప్రవర్తితః. 41

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మన్వన్తరానువర్ణనే చతుర్యుగకల్పానుకీర్తనే యజ్ఞవిషయక దేవర్షిసంవాద కథనం నామ ద్విచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

ఈ చెప్పిన దానిని బట్టి ఋషుల అభిప్రాయానుసారము యజ్ఞమున హింస యుక్తము కాదు. హింస లేకుండగనే పూర్వము వేలకోట్ల ఋషులు (మరి వేరు సాధనములతో) స్వర్గము చేరిరి. పై చెప్పిన కారణముననే మహర్షు లెల్లరును యజ్ఞమే కాదు-దానము కూడ-హింసా సాధ్యమయినచో తగనిదని తలచిరి. దానిని వారు మెచ్చరు. నీరు మూలములు - (దుంపలు-వేళ్లు) ఫలములు శాకములు జలపాత్రము ఇట్టివి తమ శక్త్యనుసారము దానము చేసి స్వర్గమును సంపాదించి అచట స్థిరముగా నిలిచిరి. ద్రోహము (అపకారము) చేయకుండుట లోభము లేకుండుట బహిరింద్రియ నిగ్రహము భూతదయ అనెడు తపము బ్రహ్మచర్యమను తపము సత్యము జాలి ఓర్పు నిబ్బరము ఈ తొమ్మిదియు సనాతన (సనా=సదా; సనాతన=ఎల్లప్పుడు ఉండునది; శాశ్వత మయినది) ధర్మమునకు మూలమగు అంశములు; ఋషుల అభిప్రాయానుసారము 1. (హింసాయుక్తము కాకుండ) కేవలము యజ్ఞ విహిత ద్రవ్యములును మంత్రములును యజ్ఞపు వాస్తవరూపము; అట్లే 2. సర్వభూతములందును సమతాదృష్టితో నుండుట వాస్తవమగు తపస్సు; ఇట్లు యజ్ఞముల నాచరించుటచే దేవత్వప్రాప్తియు తపస్సుచేత విరాడ్రూపతాప్రాప్తియు సిద్ధించును. 3. కర్మల ననుష్ఠించుచుండియు తత్ఫలములు తాను పొందవలె నను నభిసంధి లేకుండి కర్మఫల సంన్యాసము చేయుటచే బ్రహ్మలోక (హిరణ్య గర్భస్థాన) ప్రాప్తియు 4. వైరాగ్యముతో జీవించుట వలన ప్రకృతి లయమును 5. జ్ఞానము వలన కైవల్యమును పొందును. ఇట్లు ఉత్తమగతి ప్రాప్తికి ఈ ఐదును మార్గములు అని ఋషులు సిద్ధాంతీకరించిరి.

ఈ విధముగా స్వాయంభువ మన్వంతరమునందే (హింసా సహితమగు) యజ్ఞమును ప్రవర్తిల్లజేయుట విషయమున ఋషులకును దేవతలకును మహా వివాదము జరిగెను.

తరువాత ఋషులు బలముతో ధర్మము నెట్టివేయబడుట చూచి వసురాజు చెప్పిన వాక్యమును లెక్క పెట్టకయే (ఆ దేవ ప్రవర్తిత యజ్ఞమును విడిచి) తమ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్లిరి.

ఋషి సంఘములు ఇట్లు శాలనుండి వెళ్లిపోయిన తరువాత దేవతలు యజ్ఞమును జరిపిరి. కాని బ్రాహ్మణులు కాని క్షత్త్రియులు కాని రాజులు కాని చాలమంది (హింసాత్మక యజ్ఞములతో పని లేకయే) తపస్సుతేనో సిద్ధి పొందిరి. అట్టి వారిలో ప్రియవత్రుడు ఉత్తానపాదుడు ధ్రువుడు మేధాతిథి వసువు (ఋషులతో హింసాత్మక యజ్ఞము తగునని చెప్పిన యాతడు) సుధామన్‌ విరజస్‌ శంఖపాత్‌ - రాజసుడు ప్రాచీనబర్హి - పర్జన్యుడు హవిర్ధానుడు మొదలగు రాజులును ఇంకు ఇట్టివారే మరికొందరును తపశ్చర్యతోనే స్వర్గమునకు పోగలిగిరి. వీరందరును లోకమున ప్రతిష్ఠిత కీర్తిశాలురును మహాత్ములు నగు రాజర్షులే.

కావున సర్వ హేతువులచేతను హింసాయుత యజ్ఞము కంటెను తపస్సే విశిష్టతర మయినది. పూర్వము బ్రహ్మ ఈ విశ్వమును తపస్సుతోనే సృష్టించెను. కావున తపస్సుతో సృష్టింపబడిన ఈ విశ్వస్థితికిని తపస్సే మూలము. కావున తపస్సుచే కలుగు సిద్ధి యజ్ఞము వలన కలుగదు. అని సిద్దాంతము.

స్వాయంభువ మన్వంతరమున యజ్ఞముమొదటిసారిగా ఇట్లు ప్రవర్తిల్లెను. అది మొదలు కొని ఈ విధమగు యజ్ఞము యుగముల క్రమమున ప్రవర్తిల్లుచు కొనసాగుచున్నది.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మన్వంతరాను కీర్తనమున యజ్ఞ విషయమున దేవ ఋషి సంవాదమను నూట నలువది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters