Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

నిమేషాదిదివ్యసంవత్సరాన్తకాలనిర్ణయః.

ఋషయః : 

చతుర్యుగాని యాని స్యుః పూర్వే స్వాయమ్భువేన్తరే | ఏషాం నిసర్గం సఙ్ఖ్యాంచ | శోతుమిచ్ఛామ విస్తరాత్‌. 1

సూతః : పృథివీద్యుప్రసఙ్గేన న మయా ప్రాగుదాహృతమ్‌ |

తేషాం చతుర్యుగం త్వేవం తద్వక్ష్యామి నిబోధత. 2

తత్ప్రమాణం ప్రసఙ్ఖ్యాయ విస్తరాచ్చైవ కృత్స్నశం | లౌకికేన ప్రమాణన నిష్పద్యాబ్దంతు మానుషమ్‌. 3

* ఇచట పురాణము అనగా మనకు ఈనాడు లభించుచున్న పదునెనిమిది పురాణములలో ఏదో ఒకటి అనికాదు. వేదమునందలి ఒక యంశముగా పురాణము అను వాఙ్మయాంశము కలదు. అది వాస్తవమున వేదమునకు పూరణము; ఈ విధమగు 'పురాణము' నందలి కొన్ని వచనములను ఆపస్తంబాది మునులు తమ ధర్మసూత్రము లందు ఇచ్చియున్నారు. మరికొన్ని ఈనాడు మనకు లభించు స్మృతులలో వైదిక రూపమును కోల్పోయి లౌకిక మగు సంస్కృతపు రూపమునకు మారి కనబడుచున్నవి. (అనువాదకుడు)

తేనాపీహ ప్రసఙ్ఖ్యాయ వక్ష్యామీహ చతుర్యుగమ్‌ | నిమేషతుల్యకాలాని మాత్రా లఘ్వక్షరాణిచ. 4

కాష్ఠానిమేషా దశపఞ్చచైవ త్రింశచ్చ కాష్ఠా గణయేత్కలాంతు |

త్రింశత్కలాశ్చైవ భ##వేన్ముహూర్త సై#్తస్త్రింశతా రాత్ర్యహనీ సమేతే. 5

అహోరాత్రైర్విభజతే సూర్యో మానుషలౌకికః | రాత్రి స్స్వప్నాయ భూతానాం చేష్టాయై కర్మణా మహః. 6

ప్రిత్యే రాత్ర్యహనీ మాసః ప్రవిభాగ స్తయోఃపునః | కృష్ణపక్ష స్త్వహస్తేషాం శుక్ల స్స్వప్నాయ శర్వరీ. 7

త్రింశ##ద్వై మానుషా మాసాః పితృమాస స్స ఉచ్యతే | శతాని త్రీణి మాసానాం షష్ట్యాచాభ్యధికానితు. 8

పిత్ర్య స్సంవత్సరోహ్యేష మానుషేణ విభావ్యతే | మానుషేణౖవ మారేన వర్షాణాం యచ్ఛతం భ##వేత్‌. 9

పితౄణాం తాని వర్షాణి సఙ్ఖ్యాతానితు త్రీణివై | దశ##చైకా. (చత్వారశ్చా) ధికామాసాః పితృసఙ్ఖ్యైహ కీర్తితాః.

లౌకికేన ప్రమాణన అబ్దో యో మానుష స్స్మృతః | ఏత ద్దివ్యమహోరాత్ర మిత్యేషా వైదికీ శ్రుతిః. 11

దివ్యే రాత్ర్యహనీ వర్షం ప్రవిభాగ స్తయోఃపునః | అమస్తు యదుదర్కశ్చ రాత్రిర్యాదక్షిణాయనమ్‌. 12

ఏతే రాత్ర్యహనీ దివ్యే ప్రసఙ్ఖ్యాతం తయోః పునః | త్రింశ ద్యానితు వర్షాణి దైవో మాసస్తు స స్మృతః. 13

మానుషాణాం శతం యచ్చ దివ్యమాసాస్త్రయస్తుతే | దశ##చైకా తథాహాని దివ్యఏష విధి స్స్మృతః. 14

త్రీణి వర్షశతాన్యేవ షష్టివర్షా స్తథైవచ | దివ్యసంవత్సరో హ్యేష మానుషేణ ప్రకీర్తితః. 15

నూట నలువది యొకటవ అధ్యాయము.

నిమేషాది దివ్య వత్సరాంతకాల నిర్ణయము.

ఋషులు సూతుని 'పూర్వము స్వాయంభువ మన్వంతరమున వ్యవస్థ చేయబడిన చతుర్యుగముల వ్యవస్థను స్వరూపమును సంఖ్యా పరిమాణమును సవిస్తరముగ వినగోరుచున్నాము.' అని అడిగిరి. సూతు డిట్లు చెప్పసాగెను. పృథివీలోక ద్యులోక (భూలోక ఖగోళ వ్యవన్థాకథన) ప్రసంగమున నేను ఇదివరకు మీకు ఇది చెప్పి యుండలేదు. ఇపు డది మీకు తెలిపెదను. ఎరుగుడు. మొదట మీకు మానుష ప్రమాణముతో సంవత్సర పరిమాణమును నిష్పన్నము చేసి దాని ఆధారమున చతుర్యుగ పరిమాణమును తెలిపెదను. పదునైదు నిమేషములు (ఱప్పపాటు కాల ములు) కాష్ఠ; ముప్పదికాష్ఠలు కల; ముప్పది కలలు ముహూర్తము; ముప్పది ముహూర్తములు ఒకే రేయింబగలు; రవి రేయింబవళ్లుగా మానవ లౌకిక కాలమును విభజించుచున్నాడు. మానవులు పనులు చేసికొనుటకు పగలు-నిద్రించుటకు రాత్రి-ఉపయోగపడుచున్నవి. ఒక మానవమాసము పితరులకు ఒక రేయింబవలు; అందునను కృష్ణపక్షము పగలు; శుక్ల పక్షమురాత్రి; మానవ మానములు ముప్పది కలిసి పితరుల కొక మాసము; మానవ మాసములు మున్నూ టరువదికలిసి పితృ సంవత్సరము; మానవ మానముచే నూరు సంవత్సరము లైనచో పితరులకు - మూడు సంవత్సరముల నాలుగు మాసము లగును. మానవ లౌకిక ప్రమాణమున సంవత్సరము దేవతలకు రేయింబగలు. అని వేదము తెలుపుచున్నది. అందును - మానవుల ఉత్తరాయనము దేవతలకు పగలు - దక్షిణాయనము రాత్రి; మానవ లౌకిక వత్సరములు ముప్పది దేవమాన మాసము; మానవ వత్సరములు నూరెనచో దేవతలకు మూడు మాసములు (మరి పది దినములు) అగును;

మానవ లౌకిక వత్సరములు మూడువందలఅరువది యైనచో ఒక దేవవత్సరము. (మాత్రా-లఘూచ్చారణ కాలము; నిమేషము)

త్రీణి వర్షసహస్రాణి మానుషేణ ప్రకీర్తితః | త్రింశదన్యాని వర్షాణి స్మృత స్సప్తర్షివత్సరః

16

నవ యాని సహస్రాణి వర్షాణాం మానుషాణిచ | వర్షాణి నవతిశ్చైవ ధ్రువసంవత్సర

స్మృతః. 17

షట్త్రింశత్తు సహస్రాణి వర్షాణి మానుషాణితు | వర్షాణాం తచ్ఛతం జ్ఞేయం దివ్యో హ్యేష విధి స్స్మృతః.

త్రీణ్యవనియుతాన్యాహుర్వర్షాణాం మానుషాణిచ షష్టిశ్చైవ సహస్రాణి సఙ్ఖ్యాతానితు సఙ్ఖ్యయా. 19

దివ్యం వర్షసహస్రంతు ప్రాహు స్సఙ్ఖ్యావిదోజనాః | ఇత్యేత దృషిభిర్గీతం దివ్యయా సఙ్ఖ్యయా ద్విజాః. 20

దివ్యేనైనం ప్రమాణన యుగసఙ్ఖ్యా ప్రకల్పితా | చత్వారి భారతేవర్షే యుగాని ఋషయో బ్రువ.& 21

కృతం త్రేతా ద్వాపరంచ కలించైవ చతుర్యుగమ్‌ | పూర్వం కృతయుగం నామ తతస్త్రేతాభిధీయతే. 22

ద్వాపరంచ కలించైవ యుగాని పరికల్పయేత్‌ | చత్వార్యాహు స్సహస్రాణి వర్షాణితు కృతం యుగమ్‌. 23

తస్య తావచ్ఛతీ సన్ద్యా సన్ధ్యాంశశ్చ తథావిధః | ఇతరేషు ససన్ధ్యేషు ససన్ధ్యాంశేషు చ త్రిషు. 24

ఏకపాదేన వర్తన్తే సహస్రాణి శతానిచ | త్రేతా త్రీణిసహస్రాణి యుగసఙ్ఖ్యావిదో విదుః. 25

తస్యాపి త్రిశతీ సన్ధ్యా సన్ధ్యాంశ స్సన్ధ్యయా సమః | ద్వేసహస్రే ద్వాపరంచ సన్ధ్యా సన్ధ్యాంశతశ్చతే. 26

సహస్ర మేకం వర్షాణాం కలిరేవ ప్రకీర్తితః | ద్వేశ##తేచ తథాన్యేచ సన్ధ్యాసన్ధ్యాంశయో

స్స్మృతః. 27

ఏషా ద్వాదశసాహస్రీ యుగ సంఖ్యాతు సంజ్ఞితా | కృతం త్రేతా ద్వాపరంచ కలిశ్చేతి చతుష్టయమ్‌. 28

మూడువేల ముప్పది మానవ లౌకిక సంవత్సరములు ఒక సప్తర్షి వత్సరము. దీనికి మూడింతలు - అనగా తొమ్మిది వేల తొంబది మానవ లౌకిక సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరము. ముప్పది ఆరు వేల మానవ లౌకిక సంవత్సరములు నూరు దివ్య సంవత్సరములు; మూడు లక్షల అరువది వేల మానవ లౌకిక సంవత్సరములు వేయి దివ్య సంవత్సరములు; ఇట్లు దివ్య (దేవ సంబంధి) ప్రమాణానుసారము చతుర్యుగవ్యవస్థ పెద్దలచే చేయబడినది; ఋషి వచనాను సారము భారత వర్షమున కృత త్రేతా ద్వాపర కలియుగములు నాలుగు వ్యవహార మందున్నవి. నాలుగువేల దివ్య వర్షములు కృతయుగము; అన్ని వందల దివ్య వర్షములు కృత త్రేతా సంధికాలము; అవే నాలుగు వందల దివ్య వర్షములు సంధ్యాంశకాలము; ఇట్లే మూడు వేల దివ్య వర్షములు త్రేతాయుగ పరిమాణము; మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్యాకాలము; మరి మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్యాంశకాలము; రెండువేల దివ్య వర్షములు ద్వాపరయుగ ప్రమాణము; రెండు వందల దివ్య వర్షములు దాని సంధ్యాకాలము; రెండు వందల దివ్య వర్షములు దాని సంధ్యాంశ కాలము; వేయి దివ్య వర్షములు కలియుగ ప్రమాణము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యాకాలము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యాంశకాలము.

తత్ర సంవత్సరా స్సృష్టా మానుషా స్తాన్నిబోధత | చత్వారింశ త్తథా త్రీణినియుతానా మిహోచ్యతే. 29

వింశతిశ్చ సహస్రాణి కాలోహ్యేష చతుర్యుగః | పృథక్త్వేనేహ వక్ష్యామి యుగానితు నిబోధత. 30

యుగాని దశ ద్వేపఞ్చ పఞ్చచైవాత్రసఙ్ఖ్యయా | అష్టావింశత్సహస్రాణి కృతంయుగ మిహోచ్యతే. 31

ప్రయుతంతుతథాపూర్ణేద్వేచాన్యేనియుతేపునః | షణ్ణవతి సహస్రాణి సఙ్ఖ్యాతానితు సఙ్ఖ్యయా. 32

త్రేతాయుగస్య సఙ్ఖ్యైవ మానుషేణతు కీర్తితా | అష్టౌ శత సహస్రాణి వర్షాణాం మానుషాణి తు. 33

చతుష్టష్టిసహస్రాణి వర్షాణాం ద్వాపరం యుగమ్‌ చత్వారి నియుతాని స్యు ర్వర్షాణి తు కలిర్యుగమ్‌. 34

ద్వాత్రింశచ్చ తథాన్యాని సహస్రాణితు సఙ్ఖ్యయా | ఏత త్కలియుగం ప్రోక్తం మానుషేణ ప్రమాణతః. 35

ఏషా చతుర్యుగావస్థా మానుషేణ ప్రకీర్తితా | చతుర్యుగస్య సఙ్ఖ్యాతా సన్ధ్యాసన్ధ్యాంశ##కై స్సహ. 36

మన్వన్తరపరిమాణనిర్ణయః.

ఏషా చతుర్యుగాఖ్యాతు సాధికా త్వేకసప్తతిః | కృతత్రేతాదియుక్తా సా మనోరన్తర ముచ్యతే. 37

మన్వన్తరస్య సఙ్ఖ్యాతు మానుషేణ నిబోధత | ఏకత్రింశత్తథాకోట్య స్సఙ్ఖ్యాతా సఙ్ఖ్య ద్విజైః. 38

తథాశతసహస్రాణి దశచాన్యాని భాగశః | సహస్రాణిచ ద్వా త్రింశ చ్ఛతాన్యష్టాధికాని చ.

39

అశీతిశ్చూవవర్షాశ్చ మాసాశ్చైవాధికాస్తు షట్‌ | మన్వన్తరస్య సఙ్ఖ్యైషా మానుషేణ ప్రకీర్తితా. 40

దివ్యేనచ ప్రమాణన ప్రవక్ష్యామ్యన్తరం మనోః | సహస్రాణాం శతాన్యాహు ర్నవచైవతు సఙ్ఖ్యయా. 41

చత్వారింశత్సహస్రాణి మనోరన్తర ముచ్యతే | మన్వన్తరస్య కాలస్తు యుగైస్సహ ప్రకీర్తితః. 42

ఏషాచతుర్యుగాఖ్యాతు సాధికా హ్యేకసప్తతిః | క్రమేణపరివృత్తాస్తా మనోరన్తర

ముచ్యత 43

ఏతచ్చతుర్దశగుణం కల్పమాహుస్తు తద్విదః | కల్పప్రమాణా ద్ద్విగుణోయథా భవతి సఙ్ఖ్యయా. 44

తతస్తు ప్రళయః కృత్స్న స్సతు సమ్ర్పళయో మహా& | చతుర్యుగం సమాఖ్యాతా ద్వాపరం కలిమేవచ.

యుగప త్సమవేతౌ ద్వౌ ద్విధా వక్తుం న శక్యతే |

ప్రమాగతం మయా ప్యేత త్తుభ్యం నోక్తంయుగద్వయమ్‌. 46

ఋషివంశప్సఙ్గేన వ్యాకులత్వా త్తథా క్రమాత్‌ | నోక్తం త్రేతాయుగం శేషం తద్వక్ష్యామి నిబోధత. 47

దిప్యమానముచే యుగ ప్రమాణము సంవత్సరములలో

యుగము యుగపు మానము యుగ సంధ్య యుగ సంధ్యాంశము మొత్తము

కృత 4000+ 400 +400 =4800

త్రేతా 3000+ 300 +300 =3600

ద్వాపర 2000+ 200 +200 =2400

కలి 10000+ 100 +100 =1200

చతుర్యుగము 10000 1000 +1000 =12000

మానవ మానముచే యుగ ప్రమాణము సంవత్సరములలో

యుగము యుగ ప్రమాణము యుగ సంధ్యాం యుగ సంధ్యాంశము మొత్తము

కృత 1440000+ 144000+ 144000= 1728000

త్రేతా 1080000+ 108000+ 108000= 1296000

ద్వాపర 720000+ 72000 +72000= 864000

కలి 360000+ 36000+ 36000= 432000

3600000+ 360000+ 360000= 4320000

ఈ విధమగు చతుర్యుగమునకు దివ్యయుగమని వ్యవహారము. ఇటువంటి దివ్యయుగములు డెబ్బదియొకటి పై చిల్లర యైనచో ఒక మన్వంతరమగును. ఇది మనుష్య లౌకిక మానానుసారము ముప్పదియొక్క కోట్ల పదిలక్షల ముప్పది రెండువేల ఎనిమిది వందల ఎనుబది సంవత్సరముల ఆరు మానములగును. ఇదే మన్వంతర పరిమాణ్ము దివ్య మానము ననుసరించి తొమ్మిది లక్షల నలువదివేల సంవత్సరములగును.

విశేషాంశము : వాస్తవమున వేయి దివ్యయుగములు - అనగా వేయి మానవ మహాయుగములు - అయినచో బ్రహ్మకు ఒక పగలు; బ్రహ్మదేవుని రాత్రికి కూడ ఇదే పరిమాణము; అనగా 12000000 దివ్య సంవత్సరములు= 12000000X360=4320000000 మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలు; అనగా సృష్టికాలము; ఇంతయే బ్రహ్మకు రాత్రి-అనగా ప్రళయకాలము; ఒక సృష్టికాలములో 14గురు మనువులు జీవించి తమతమ ప్రవృత్తులను లోకమున ప్రవర్తిల్లజేయుదురు; కావున 1 మన్వంతరము =12000000 14 =సుమారుగా 857143 దివ్య సంవత్సరములు=432000000 14=308571428 - సంవత్సరములమీద 7 మాసములు కాలవయును; కాని ఇచ్చట పురాణములో ఇచ్చిన మన్వంతర పరిమాణములో దేవమానుముచేకాని మానవ మానముచేకాని సరిపోవుటలేదు. ఇంతే కాదు; పైని దివ్యమానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణమగు 940000 దివ్య వర్షములను 360తో గుణించగా మానవమాన సంవత్సరములు 338400000 మానవ వర్షములు కావలయును. కాని పైని మానవ మానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణ సంఖ్య వేరుగా నున్నది.

ఇది సరిపోవుట ఎట్లు? ఆలోచించవలెను.

యుగ పరిమాణములకు నాలుగింటికిని దివ్యమానములోగాని మానవ మానములోకాని సంధ్యా సంధ్యాంశములు ఉన్నట్లే సృష్టికాలము (బ్రహ్మదినము) నకు కూడ సంధ్యా సంధ్యాంశలు కలవు. కాని యుగముల విషయములో దివ్య మానమున యుగ పరిమాణము ఎన్నివేల దివ్య సంవత్సరములో అన్ని వందల దివ్య సంవత్సరములే ఆయుగపు సంధ్యయు - అంతయే ఆయుగపు సంధ్యాంశమును; కాని ఈ సృష్టికాలమునకు కల సంధ్యా-సంధ్యాంశ పరిమాణము అట్లు కాదు - ఈచెప్పిన 12000000 దివ్యమాన సంవత్సరములు=4320000000 మానవ సంవత్సరములలో 14 వంతును మరియు ఆ 14వ వంతులో 3వ వంతును కలిసి యగునంత కాలము మొత్తము సంధ్యా సంధ్యాంశము లగునవి తోచు చున్నది. అట్లు చూడగా 12000000లో 14వ వంతు 857143 దివ్య వత్సరములును దీనిలో 3వ వంతు 285714 దివ్య వర్షములును కలిసి 1142857 దివ్య వర్షము లగును. ఈ సంఖ్యను సహస్ర దివ్య యుగముల కగు సంవత్సరములతో కలిపి 14తో భాగించగా అవి ఇక్కడ ఇచ్చిన దివ్యమాన మన్వంతర పరిమాణము ఇంచుమించుగా అగును. దానిని 360తో గుణించగా మానవ మానములో ఇంచుమించుగా 338032885 సంవత్సరములపై ఆరు మాసము లగును. దీనిని బట్టి మూల ప్రతులలో ఒకానొక కాలమున పాఠభ్రంశము జరిగెననియు పై మూల శ్లోకపు పంక్తులు:

''త్రయస్త్రింశత్తథా కోట్యః సంఖ్యాతా సంఖ్యయా ద్విజైః |

తథా శీతి సహస్రాణి దశచాన్యాని భాగశః.

సహస్రాణి చ ద్వాత్రింశచ్ఛతా న్యష్టాధికానిచ |

అశీతిశ్చైవ వర్షాశ్చ మాసాశ్చై వాధి కాస్తు షట్‌.''

అని యుండవలెననియు తోచుచున్నది.

అపుడు ముప్పది మూడు కోట్లును - అశీతి సహస్రాణి - అన్యానిచ భాగశః - అనగా 80000X10X10=8000000 అగును. మిగిలిన 32 వేలు 8 వందలు 85 అను సంఖ్యలు సమానమే. కాగా పైని చెప్పిన 338032885 అగును. (ఇది ఇంకను లోతుగా ఆలోచించవలసిన విషయము.)

మన్వంతరమునకు పదునాలుగు రెట్లు కల్ప ప్రమాణము; ఇదే బ్రహ్మకు పగలు.

దీనికి రెండింతలు సంపూర్ణ ప్రళయకాలము; దీనికి మహాప్రళయకాల మనియు పేరు; ద్వాపర కలియుగములు రెండును పరస్పరము విడదీయరానివై కలిసియుండుటచే వాని లక్షణము వేరువేరుగా వివరించ వీలుగాక నేను మీకు వివరించలేదు. అట్లే త్రేతాయుగ లక్షణములను గూడ ఋషివంశ ప్రసంగమున నాకు కలిగిన వ్యగ్రతచే చెప్పియుండలేదు. శేషాంగమగు ఆత్రేతాయుగ విషయము ఇపుడు చెప్పెద వినుడు.

త్రేతాయుగధర్మాః.

అథ త్రేతాయుగస్యాదౌ మను స్సప్తర్షయశ్చ యే |

శ్రౌతస్మార్తం ధ్రువం ధర్మం బ్రహ్మణాతు ప్రచోదితాః. 48

దారాగ్నిహోత్రసమ్భన్ధం ఋగ్యజుస్సామసంహితమ్‌ |

ఇత్యాది బహులం శ్రౌతం ధర్మం సప్తర్షయోబ్రువ. 49

పరమ్పరాగతం ధర్మం స్మార్తం త్వాచారలక్షణమ్‌ |

వర్ణాశ్రమాచారయుక్తం మనుస్స్వాయమ్భువోబ్రవీత్‌. 50

సత్యేవ బ్రహ్మచర్యేణ శ్రుతేన తపసా తథా | తేషాం సుతప్తతపసా మార్షేనానుక్రమేణ హ.

51

సప్తర్షీణాం మనోశ్చైవ ఆదౌ త్రేతాయుగే తతః | అబుద్ధిపూర్వకం తేన సకృత్పూర్వక మేవచ. 52

అభివృత్తాస్తు తే మన్త్రా దర్శనైస్తారకాదిభిః | ఆధికల్పేహి దేవానాం ప్రాదుర్భూతాస్తు తే స్వయమ్‌. 53

ప్రమాణష్వథ సిద్ధానా మన్యేషాంచ ప్రవర్తతే | మన్త్రయోగో వ్యతీతేషు కల్పేష్విహ సహప్రశః. 54

తే మన్త్రావై పునస్తేషాం ప్రతిభాయా ముపస్థితాః | ఋచోయజూంషి సామాని మన్త్రాశ్చాథర్వణాశ్చయే.

సప్తర్షిభిస్తు తే ప్రోక్తా స్మ్సార్తంతు మనురబ్రవీత్‌ | త్రేతాదౌ సంహతా వేదాః కేవలం ధర్మసేతవః. 56

సంరోధా దాయుషశ్చైవ వ్యస్యంతే ద్వాపరేతు తే | ఋషయ స్తపసా వేదా నహోరాత్రమధీయతే. 57

అనాదినిధనా దివ్యాః పూర్వే ప్రోక్తాః స్వయమ్భువా | స్వ ధర్మసంస్కృతా న్త్సాఙ్గా న్యథాధర్మం యుగేయుగే.

విక్రియన్తే స్వధర్మాత్తు వేదా వేదా ద్యథాయుగమ్‌ | ఆరమ్భయజ్ఞాః క్షత్రస్య హవిర్యజ్ఞా విశ స్స్మృతాః.

పరిచారయజ్ఞా శ్శూద్రాశ్చ జపయజ్ఞాశ్చ బ్రాహ్మణాః | తత స్సముదితా వర్ణా స్త్రేతాయాం ధర్మశాలినః. 60

క్రియావన్తః ప్రజావన్త స్సమృద్ధా స్సుఖినశ్చ వై | బ్రాహ్మణౖశ్చ విధీయన్తే క్షత్త్రియాః క్షత్రియై ర్విశః.

వైశ్యా శ్శూద్రానువర్తన్తే తతఃపర మనుగ్రహాత్‌ | శుభాః ప్రకృతయ స్తేషాం ధర్మా వర్ణాశ్రమాశ్రయాః.

శుభకరములగు త్రేతాయుగ ధర్మములను వినుడు. త్రేతాయుగారంభమున స్వయంభూ బ్రహ్మ స్వాయంభువ మనువునకును (మరీచ్యాది సప్త ప్రజాపతులగు) సప్త ఋషులకును శాశ్వతమగు శ్రౌత స్మార్తమగు ధర్మమును విధి రూపమున బోధించెను. దారాగ్నిహోత్ర సంబంధము గల అగ్నిహోత్ర విధాన సంబంధులగు శ్రౌత కర్మముల ననుష్ఠించు విధానము ఋగ్యజుః సామాత్మకమగు వేదసంహితులు తత్సంబంధి ధర్మములు తదంగములు తత్సంబంధి విద్యలు ఈ మొదలగు విస్తృత శ్రౌత ధర్మమును సప్త ఋషులును తమ తరువాతి తరముల వారికి ప్రతిపాదించి లోకమున ఆ ధర్మములను ప్రవర్తిల్ల చేసిరి. సామయాచారికధర్మమను ప్రసిద్ధిగల వర్ణాశ్రమాచార ధర్మములను తనకు బ్రహ్మనుండి గురు పరంపరగా లభించిన వానిని స్వాయంభువ మనువు ఈ లోకమున ప్రవర్తిల్ల జేసెను. ఇవి స్మార్త (స్మృతిప్రోక్త) ధర్మములు.

ఈ సప్తర్షులును స్వాయంభువ మనువును కల్పాది త్రేతాయుగాదియందు సత్యము బ్రహ్మచర్యము శ్రుతము (శాస్త్రములను సంప్రదాయ శుద్ధితో అధ్యయనము చేయుట) తపస్సు (నియమ పాలనముతో శరీరమును శ్రమకు పాల్పరచుట) - అనెడు ఈ ప్రక్రియలతో అతి తీవ్రమగు తపస్సు ఆచరించిరి. (ఇచ్చట తపస్సు అనగా చిత్తమునకు అత్యుత్తమ సంస్కారమును సంపాదించుట); తత్ఫలముగా వారికి తమ సంకల్ప మేమియు లేకయే వారికి మరెవ్వరి నుండియు ఉపదేశము లేకయే అదియే ఈ కల్పమున ప్రథమ పర్యాయముగా వేదమంత్రములు అన్నియు అభివృత్తము లయ్యెను (వారి దగ్గరకు అవి తమంతట తామే వచ్చెను.) వైదిక మంత్రములు వీరికి సాక్షాత్కరించుట దర్శనమున (మంత్రములందు ప్రతిపాదింపబడు విషయము శబ్దరూపమున చిత్తమునకు మాత్రమే కాక చెవికి గూడ గోచరించుట) 'తారక' రూపమున (నక్షత్రములందు అంతరిక్షముననే ఈ మంత్రరూపములును వానియందు ప్రతిపాదింపబడు దేవతా తత్త్వములును వానితో ఆచరించవలసిన యాగాది ప్రక్రియలును గోచరించుట - దత్తాత్రేయాది యోగులు ఎరిగిన తారక యోగసిద్ధిచే ఈ విషయములు వారి చిత్త శ్రవణములకు గోచరించుట) ఇట్టి అద్భుత విధానములతో జరిగెను. ఈ వేద మంత్రములు దేవతలకు అందరకును శబ్దాత్మకములగు ఆశ్రయములు. మరి ఈ వేదమంత్రములు సప్తర్షులకు ఎట్లు మొదటిసారిగా ఈ కల్పమున ప్రతిభాతములు (స్ఫురించినవి) అయ్యెను? అనిన - ఇతః పూర్వపు కల్పములందును ఆయా ప్రమాణ జ్ఞానమునందు సిద్ధి నందిన ఆయా మహానుభావులకు అంతకు ముందటి కల్పములందు వలెనే స్ఫురించగా వారు వానిని ఆ కల్పములందు లోకములందు ప్రవర్తిల్ల జేసిరి. ఇవి వేలకొలది మంత్ర ద్రష్టలకు వేలకొలదిగా ప్రతిభాతములై యుండెను. అవియే ఈ కల్పమునందు మరల ఈ సప్తర్షులకును స్వాయంభువ మనువునకును వారి వారి ప్రతిభ (స్వయం సిద్ధమగు బుద్ధి స్పందన-యందు గోచరించెను. అని సమాధానము. ఇవి ఋగ్యజుః సామాథర్వణ రూపములగు నాలుగు వేదములు. వీనినే సప్తర్షులు తాము దర్శించి లోకమున ప్రవచించిరి. (ఇచట సప్తర్షులనగా వారును వారి వంశజులగు మరి ఇతరులగు ఋషులును) స్మార్త ధర్మమును స్వాయంభువ మనువు లోకమున ప్రవర్తిల్లజేసెను. ఇట్లు కల్పాది యందలి త్రేతాయుగాదియందు సంహతములయిన (వ్యవస్థా పూర్వకముగా అమర్చబడిన) వేదములు ధర్మ సేతువులుగా (ధర్మాతి క్రమణము జరుగకుండ కాపాడు అడ్డుకట్టలుగా) అయ్యెను. ఆయుః పరిమాణము మొదలగు శక్తులు తగ్గుటచే ఈ ద్వాపరయుగము నాటికి అవి మొదటివలె నుండక వ్యత్యాస మందినవి. ఈ వేదములను ఋషులు తమ తపోబలాధిక్యముచే అహోరాత్రములు అధ్యయనము చేయుచుందురు. వీనికి ఆదియు అంతమును లేదు. (ఇవి నిత్యశబ్దములు) వీటిని స్వయంభూ బ్రహ్మ తాను స్వయముగా - అని ప్రతిపాదించు ధర్మము వాటియందు చక్కగా సంస్కరింపబడిన రూపములో నిలిపి ఆయా యుగ ధర్మములకు అనుగుణముగా ఉండు రూపములో వాటి అంగములతో కూడ - ప్రతియుగము (కల్పభేదము) నందును ప్రవచించును. కాని ఆయా యుగములలో ధర్మ వ్యవస్థయందలి మార్పుల ననుసరించి ఒక వేదముకంటె మరియొక వేదము మార్పు నొంది కనబడును. ఈ శ్రుతులను అనుసరించి తెలియు తత్త్వము ఏమనిన లోకక్షేమకరమగు కర్మలను ఉత్సాహముతో తమ విక్రమముతో ఆచరించుటయే క్షత్త్రియులకును - హవిస్సులు (ప్రజల నిత్య జీవనములకు సాధనములగు ఆహారాది పవిత్ర వస్తువులు) జనులకు సమకూర్చుటయే వైశ్యులకును - తమ శారీరక శ్రమతో జనులకు ఉపయోగించు పరిచర్యలు (కృత్యములు) (సేవ అని అర్థముకాదు.) చేయుటయే శూద్రులకును యజ్ఞములు; బ్రాహ్మణులకు జపమే (జనులకు క్షేమము కూర్చవలెనను దృష్టి చేయు వేదాధ్యయనమే అని అర్థము; మంత్రజపమని అర్థము కాదు;) వాస్తవమగు యజ్ఞము. దీనిని ఇట్లే అందరును ఆచరించెడు వారు కావునను నాటి జనులు స్వధర్మాచరణశాలురు కావునను వారు కార్యపరులు సత్సంతానవంతులు సమృద్ధి కలిగి సుఖించువారునై యుండిరి. బ్రాహ్మణులు ఉపదేశించినట్లు క్షత్త్రియులు క్షత్త్రియు లుపదేశించినట్లు వైశ్యులు వైశ్యు లుపదేశించినట్లు శూద్రులు ఆచరించుచు అనుగ్రహము (జనానుకూల ప్రవర్తనము)తో నడచెడివారు. నాటి జనుల ప్రకృతులు (స్వభావములు) శుభకరములయి వర్ణాశ్రమానుకూల ధర్మ రూపములయి యుండెడివి.

సఙ్కల్పితేన మనసా వాచా వా హస్తకర్మణా | త్రేతాయుగే హ్యవికలే కర్మారమ్భః ప్రసిధ్యతే. 63

ఆయూ రూపం బలం మేధా ఆరోగ్యం ధర్మశీలతా | సర్వసాధారణం హ్యేత దాసీ త్త్రేతాయుగేతు వై. 64

వర్ణా శ్రమవ్యవస్థానం తేషాం బ్రహ్మా తథాకరోత్‌ |

సంహితాశ్చ తథా మన్త్రా ఋషిభి ర్బ్రహ్మణ స్సుతైః. 65

యజ్ఞాః ప్రవర్తితాశ్చైవ తదా హ్యేవతు దైవతైః | యామై శ్శుక్లై ర్జయైశ్చైవ సర్వ సాధనసమ్భృతైః. 66

సార్ధం విశ్వసృజా చైవ దేవేన్ద్రేణ మహౌజసా | స్వాయమ్భువేన్తరే దేవై సై#్తర్యజ్ఞాః ప్రాక్ర్పవర్తితాః. 67

సత్యం జప స్తపో దానం పూర్వధర్మోయ ఉచ్యతే | యథా ధర్మస్య హ్రసతో శాఖాధర్మస్య వర్ధతే. 68

జాయంతే చ తదా శూరా ఆయుష్మన్తో మహాబలాః | న్యస్తదణ్డా మహాయోగా యజ్వానో బ్రహ్మవాదినః. 69

పద్మపత్రాయతాక్షాశ్చ పృథువక్త్రా స్సుసంహతాః | సింహోరస్కా మహాసత్త్వా మత్తమాతఙ్గగామినః. 70

మహాదనుర్ధరాశ్చైవ త్రేతాయాం చక్రవర్తినః |

సర్వలక్షణసమ్పూర్ణా న్యగ్రోధపరిమణ్డలా 71

న్యగ్రోధౌతు స్మృతౌ బాహూ వ్యామో న్యగ్రోధ ఉచ్యతే |

వ్యామేన తూచ్ఛ్రయో యస్య త్వధ ఊర్ధ్వంచ దేహినామ్‌. 72

సముచ్ఛ్రయః పరీణాహో న్యగ్రోధపరిమణ్డలః | చక్రం రథో మణి ర్భార్యా నిధి రశ్వో గజ స్తథా. 73

ప్రోక్తాని సప్తరత్నాని పూర్వే స్వాయమ్భువేన్తరే | విష్ణో రంశేన జాయన్తే పృథివ్యాం చక్రవర్తినః. 74

మన్వన్తరేషు సర్వేషు అతీతానాగతేషు వై | భూతభవ్యాని యానీహ వర్తమానాని యానిచ. 75

త్రేతాయుగాని తేష్వత్ర జాయన్తే చక్రవర్తినః | భద్రాణీమాని నైతేషాం విభావ్యన్తే మహీభృతామ్‌. 76

త్రేతాయుగమున ధర్మము సమగ్రముగా నడుచుచుండ మనస్సుతో చేయు సంకల్పము నోటితో చెప్పెడి మాట చేతితో చేయు పని - ఈ మనోవాక్కాయిక కర్మములు మూడును ఏకరూపములు కాగా జనుల కర్మాచరణములు సఫల ములయి యుండెను. జనుల ఆయువు రూపము బలము మేధా ఆరోగ్యము ధర్మశీలము ఇవి జనులలో త్రేతాయుగమున సర్వ సాధారణమయి యుండెను. బ్రహ్మ ఆనాటి వారికి వర్ణాశ్రమ వ్యవస్థను అట్లే చేసెను. వేద సంహితలను వేదమంత్రములను బ్రహ్మమానస పుత్త్రులగు ఋషులు అంత బాగుగా ప్రవర్తిల్లజేసిరి. వారు యజ్ఞముల నంత తిన్నగా ఆనాడు ప్రవర్తిల్లజేసిరి. స్వాయంభువ మన్వంతరమునందు యాములు శుక్లులు జయులు అను దేవ వర్గములును విశ్వ స్రష్టయగు న్వయంభూబ్రహ్మయును సర్వ సంభారములతో సమృద్ధిగా నుండు యజ్ఞములను ప్రవర్తిల్లజేసిరి. సత్య జప తపోదానములు పూర్వ యుగములందలి ధర్మములయి యుండెను. కాని క్రమముగ ధర్మశాఖ తగ్గిన కొలది అధర్మ మధికము కాసాగెను. ఆ యుగములందు జనులు శూరులు ఆయుష్మంతులు తత్త్వజ్ఞానపరులు పద్మపత్త్రనేత్రులు విశాల ముఖులు చక్కని దేహపు అమరిక కలవారు సింహవక్షముకంటె దృఢ విశాలవక్షము కలవారు మహాసత్త్వులు మదపు టేనుగువలె నడుచువారు మహాధానుష్కులు న్యగ్రోధ పరిమండలులు సర్వ లక్షణ సంపూర్ణులునై నాటి చక్రవర్తు లుండెడివారు. న్యగ్రోధము అనగా 'బార' అని అర్థము; బారకొలతకు వచ్చుటచే బాహువులకును న్యగ్రోధములు అని నామము; నిలువునగాని అడ్డమునగాని బారలతో కొలువదగినంత పొడవు లావు(చుట్టు కొలత) కల వారిని న్యగ్రోధ పరిమండలులు అందురు. ఆ స్వాయంభువ మన్వంతరమున - చక్రవర్తులు విష్ణు నంశమున చక్రము రథము మణులు భార్య నిధి (ధనరాశి) అశ్వములు గజములు అనెడు సప్త రత్నములు కలిగియుండెడువారు. గడిచిన గడచుచున్న గడువనున్న త్రేతాయుగ ములందెల్ల చక్రవర్తులు ఇట్టివారే; ఈ చెప్పిన సప్త రత్నములును ముందు చెప్పబోవు లక్షణములును వారికి శుభకర లక్షణములుగా నుండును.

అత్యద్భుతాని చత్వరి బలం ధర్మ స్సుఖం ధనమ్‌ | అన్యోన్యస్యావిరోధేనప్రాప్యన్తేతై ర్నృపై స్సమమ్‌. 77

అర్థో ధర్మశ్చ కామశ్చ యశో విజయ ఏవచ | ఐశ్వర్యేణాణిమాద్యేన

ప్రభుశక్తిబలాన్వితాః. 78

శ్రుతేన తనపసాచైవ ఋషీంస్తేభిభవన్తి హి | బలేనాభిభవం త్యేతే తేన దానవమానవా&. 78

లక్షణౖశ్చైవ జాయన్తే శరీరస్థై రమానుషైః | కేశాః స్థితా లలాటేన జిహ్వాచ పరిమార్జనీ. 80

శ్వామప్రభా శ్చతుర్దంష్ట్రాస్సువంశాశ్చోర్ధ్వరేతసః | ఆజానుబాహవశ్చైవ తాలహస్తా వృషాకృతీః. 81

పరిణాహప్రమాణాభ్యాం సింహస్కన్ధాశ్చ మేధినః | పాదయో శ్చక్రమత్స్యౌతు శఙ్ఖపద్మౌచ హస్తయోః. 82

పఞ్చాశీతిసహస్రాణి జీవన్తే హ్యజరామయాః | అసఙ్గా గతయ స్తేషాం చతస్ర శ్చక్రవర్తినామ్‌. 83

అన్తరిక్షే సముద్రేషు పాతాళే సర్వతేషుచ | ఇజ్యా దానం తప స్సత్యం త్రేతాధర్మాస్తు వై స్మృతాః. 84

తదా ప్రవర్తతే ధర్మో వర్ణాశ్రమవిభాగశః | మర్యాదాస్థాపనార్థంచ దణ్డనీతిః ప్రవర్తతే. 85

హృష్టపుష్టా జనాస్సర్వే ఆరోగ్యాపూర్ణమానసాః | ఏవో వేద శ్చతుష్పాద సై#్త్రతాయాం త్రివిధ స్మృతః. 86

త్రీణి వర్షసహస్రాణి జీవన్తే తత్ర తాః ప్రజాః | పుత్త్రపౌత్త్రసమాకీర్ణా మ్రియన్తేచ క్రమేణ తాః. 87

ఏష భావస్త్రేతాయుగే త్రేతాసంధ్యాం నిబోధతః | త్రేతాయుగస్య భావానాం సన్ధ్యా పాదేన వర్తతే. 88

సన్ధ్యాపాదే స్వభావాశ్చ యో ంశః పాదేన తిష్ఠతి. 89

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మన్వన్తరానుకీర్తనే నిమేషాదికాలనిర్ణయాది

కథనం నామ ఏకచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

బలము ధర్మము సుఖము ధనము ఇవి అత్యద్భుతములగు లక్షణములు; వీటిని పరస్పర విరోధము లేకుండ ఆ త్రేతాయుగ రాజులు సమముగా నిర్వహింతురు. ధర్మార్థ కామ యశో విజయైశ్వర్యాణిమాది ప్రభుశక్తి శాస్త్రతపో లక్షణములందు వారు (నాటి చక్రవర్తులు) ఋషులను మానవులను దానవులనుకూడ తిరస్కరించగలిగియుందురు. మానవ సహజ శరీర లక్షణములు కూడ వారికున్నతములుగా నుండును. ఎట్లన - వారి జుట్టు నుదుటి వైశాల్యమును క్రమ్మివేయునంతగా మీదికివచ్చి పడుచుండును. నాలుక నోటినంతటిని ఒరయునంతగా పొడవుగా నుండును. చామన చాయ - నాలుగు కోర దంతములు కలిగి ఉన్త వంశమున పుట్టి జితేంద్రియులు ఆజాను బాహువులు తాటికాండమువంటి చేతులు వృషభములవంటి ఠీవికల ఆకృతితో వృషభములకువలె దేహనిర్మాణము పెద్దకొలత కలిగి సింహపు మూపు వంటి మూపులతో మేధావంతులయియుందురు. వారి పాదములందు శంఖచక్ర రేఖలు హస్తములందు శంఖపద్మ రేఖలు కలిగి ఎనుబది ఐదువేల సంవత్సరములు ఏరోగమును వార్ధకమును లేక జీవింతురు. ఆ చక్రవర్తులు అంత రిక్షమున సముద్రములందు పాతాళమున పర్వతములందు ఈ నాలుగు చోట్లకూడ వీరు అడ్డులేక సంచరింతురు.

మొత్తముమీద త్రేతాయుగమున యజ్ఞదాన తపస్సత్యములు ప్రధాన ధర్మములు; వర్ణాశ్రమ ధర్మములు సరిగా నడచును; ఐనను ఎవరి మేరలో వారిని నిలుపుటకై దండనీతియు నామమాత్రముగా ప్రవర్తిల్లును. జనులు ఎల్లరు హర్షముతో పుష్టితో మానస శారీరారోగ్యములతో నుందురు. త్రివిధ వేదములును (కర్మవరములు ఉపాసనావరములు జ్ఞానపరములు) ఋగ్‌-యజుః-సామాథర్వణములను నాలుగు పాదములతో ఏకవస్తువుగా అఖండ రూపమున నుండును. ప్రజలు మూడు వేలేండ్లు జీవింతురు. వారు పుత్త్ర పౌత్త్రాది పరివారము నడుమ క్రమముగా నెప్పుడో మరణింతురు. ఇది త్రేతాయుగ ధర్మము; త్రేతా సంధ్యాకాలములో ఈ ధర్మములన్నియు ఇందు నాల్గవవంతున నడుచును. సంధ్యాంశ కాలమునందు సంధ్యాకాల ధర్మములో నాల్గవవంతు మాత్రము నడుచును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మన్వంతరాను కీర్తన కాల పరిమాణు కథన

త్రేతాయుగధర్మ ప్రతిపాదనమను నూట నలువది ఒకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters