Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయస్త్రింశదుత్తరశతతమో7ధ్యాయః.

నారదస్య త్రిపురా దీశ్వరంప్రతి ప్రత్యాగమనమ్‌.

సూతః : తతో రణ దేవబలం నారదోభ్యాగమత్సునః | త్రిపురా త్తత్ర చాగత్య సభాయా మాస్థితస్స్వయమ్‌. 1

ఇళావృత మితిఖ్యాతం తద్వర్షం విస్మితం యతః | యత్ర యజ్ఞో బలేర్వృత్తో బలిర్యత్రైవ సంస్థితః. 2

దేవానాం యజ్ఞభూమిర్యా త్రిషులోకేషు విశ్రుతా | వివాహాః క్రతవశ్చైవ జాతకర్మాదీకాః క్రియాః. 3

దేవానాం యత్రవృత్తాని కన్యాదానాని యానిచ | రేమే నిత్యం భవస్తత్ర సహాయైః పార్షదైర్గణౖః. 4

లోకపాలా స్తథా యత్ర తస్థు ర్మేరుగిరౌ యథా | మధుపిఙ్గళ##నేత్రస్తు చన్ద్రావయవభూషితః. 5

దేవానా మధిపః ప్రాహ భగవాంశ్చ మహేశ్వరః | గగనే చరన్తి (త్‌) త్రిపురం దానవానాం ప్రదృశ్యతే. 6

విమానైశ్చ పతాకాభి ర్ధ్వజైశ్చ సమలఙ్కృతమ్‌ | ఇదంవిత్త మిదంఖ్యాతం వహ్నివ ద్విషమోపమమ్‌. 7

ఏతేఞ్జనగిరిప్రఖ్యాః సకుణ్డలకిరీటినః | ప్రాకారగోపురాగ్రేషు లక్ష్యన్తే దానవాస్థ్సితాః. 8

ఇమేచ తోయదాభాసా దనుజా వికృతాననాః | నిర్గచ్ఛన్తి పురాద్దైత్యా దానవా విజయైషిణః. 9

సత్యం సురశ##తై స్సార్ధం సవాహనవరాయుధైః | సహైవ మామకై ర్భృత్యై ర్వ్యాపాదయ మహాసురా&.

అహంతు రథమాస్థాయ నివ్చలో బలమాస్థితః | పురః పురస్య రన్ద్రార్థీ తస్యాస్య విజయాయ వః. 11

యదాతు పుష్యయోగేన ఏకత్వం యాస్యతే పురమ్‌ | తదైత న్నిర్దహిష్యామి శ##రేణౖ కేన వాసవ. 12

ఏవముక్తో భగవతా రుద్రేణన్ద్ర స్సురేశ్వరః | య¸°చ త్రిపురం జేతుం తేన సైన్యేన సంవృతః. 13

*ఆక్రాన్తరథపాదాతై ర్మేఘగిర్యోఘసన్నిభైః | కృతసింహరవోపేతై రుద్వమద్భి రివామ్బుదైః. 14

నూట ముప్పది మూడవ అధ్యాయము.

నారదుడు త్రిపుర దుర్గమునుండి శివుని కడకు వచ్చుట-దేవదానవ యుద్ధము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను : అనంతరము నారదుడు త్రిపుర దుర్గమునుండి దేవబలముకడకు వచ్చి సభయందు కూర్చుండెను. ఆ దేవసేనాస్థానము అద్భుతమగు ఇలావృత వర్షము. అచ్చటనే బలి యజ్ఞ మాచరించెను. అచ్చటనే అతడు వసించెడువాడు. అది దేవతల (ప్రాచీనార్యుల) యజ్ఞభూమిగా త్రిలోకప్రసిద్ధము. దేవతలు వివాహములు క్రతువులు జాత కర్మాది క్రియలు కన్యాదానములు ఇచ్చటనే జరుపుకొనిరి. శివుడిచ్చటనే తన సహాయులగు పార్షదులతో కూడ సతతము ఆనందించెను. లోకపాలురును అచ్చటనే మేరుపర్వతమందువలె కొలువు తీరెడి వారు. ఇపుడు అచ్చట కూర్చుండి తేనెవలె పింగళ నేత్రములుకల దేవాధిపుడు మహేశ్వరుడు దేవతలతో ఇట్లు పలికెను: ఇదిగో! గగన సంచారియగు దానవుల త్రిపుర దుర్గము కనబడుచున్నదే! అది విమానములతో పతాకలతో ధ్వజములతో అలంకరింపబడియున్నది. ఇది అందరు ఎరిగినది-ప్రసిద్ధమైనది-అగ్ని వంటిది-నిరుపమానమైనది. వీరుగో! కాటుక కొండలవంటి దానవులు కుండలములు కిరీటములు ధరించి ప్రాకార గోపురాగ్రములయందు నిలిచి కన బడుచున్నారు. వీరుగో! మేఘములవలె ప్రకాశించు వికృతముఖులగు దైత్యులను దానవులును విజయాభిలాషులై త్రిపుర దుర్గమునుండి వెలికి వచ్చుచున్నారు. ఇంద్రా! ఇట్టి స్థితిలో నీవును వాహనముల నెక్కి వరాయుధధారులైన దేవశతముల తోను నా భృత్యులగు ప్రమథులతోను కూడి మహాసురుల చంపుము. మరి నేనో! రథ మారోహించి సైన్యమును వెంటగొని నిశ్చలుడనై ఈ దుర్గమును గెలిచి మీకు విజయము కలిగింప అనుకూలమగు అవకాశమునకై నిరీక్షించుచుందును. పుష్య యోగమున ఈ త్రిపురదుర్గము ఒకటిగా ఐనపుడు నేను ఈ పురమును ఏకశరముతో నిర్దహింతును.

రుద్ర భగవాను డిట్లు చెప్పగా సురేంద్రుడు ఆ సైన్యముతో కూడి త్రిపుర విజయమునకై వెడలెను. అతని సైనికు లెల్ల కొందరు రథారోహులు మరికొందరు పదాతులు; అందరును మేఘములను కొండలను పోలినవారు; సింహధ్వనులు చేయుచున్నవారు; పిడుగులు క్రక్కుచు ఉరుముచున్న మేఘములపంటి వారు.

దేవదానవయోర్యుద్ధమ్‌.

తేన నాదేన త్రిపునదానవా యుద్ధలాలసాః | చేరు స్స్మ దుద్రువుశ్చాపి యుయుధుః ఖే గణశ్వరైః. 15

అన్యే పయోధరాకారాః పయోధరనిభా బభుః | నసింహనాదవాదిత్రా& తాడయామాసు రుత్థితాః. 16

దేవానాం సింహనాదశ్చ సర్వతూర్యరవో మహా& | గ్రస్తం దైత్యపురం దేవై శ్చన్ద్రస్తోయధరైరివ. 17

*ప్రకీర్ణరథభీమైసై#్త స్సదైవైః పార్షదాం గణౖః.

చన్ద్రోదయసముద్భూతః పూర్యమాణ ఇవార్ణవః | త్రిపురం ప్రబభౌ తద్వ ద్భీమరూపై స్సురాసురైః. 18

ప్రాకారేషు తథా తత్ర గోపురేషు తథాపరే | అట్టాలకా న్త్సమారుహ్య కేచిత్తస్థు ర్విలాసినః. 19

స్వర్ణమాలాధరా శ్శూరాః ప్రభాసిత +కృపాణికాః | కేచి న్నదన్తి దనుజా స్తోయపూర్ణా ఇవామ్బుదాః. 20

ఇతశ్చేతశ్చ ధావన్తః కేచిదుద్ధూతవాససః | కిమేతదితి పప్రచ్ఛు రన్యోన్యం గృహనిస్సృతాః. 21

కిమేత న్న విజానామి జ్ఞాన మన్తర్హితం హి మే | జానామి మాతః కస్యేతి కాలోత్ర పరమో మహాన్‌. 22

కోహ్యసౌ పృథివీపాల స్సింహస్య రథమాస్థితః | వర్తతే త్రిపురం పీడ్య దేహం వ్యాధిరివోత్థితః. 23

య ఏషోస్తు స ఏషోస్తు కాపృచ్ఛా సమ్భ్రమేసతి | ఏహ్యాయుధ మ థాదాయ; భవితవ్యం భవిష్యతి. 24

ఇతి తేన్యోన్య మావిగ్నా ఉత్తరోత్తరాభాషిణః | ఆసాద్యాసాద్య పృచ్ఛన్తి దానవా స్త్రిపురాలయాః. 25

తారకాక్షపురే దైత్యా స్తారకాక్షపురే సురాః | నిర్యాతాః కుపితా స్తూర్ణం బిలాదివ మహోరగాః. 26

ప్రధావన్తస్తు తే దైత్యాః ప్రమథాధిపయూథపైః | నిరుద్ధా గజరాజానో యథాకేసరియూథపైః | గర్వితానాం తతస్తేషాం దర్పితానాంచ సమ్పదా. 27

రూపాణి జజ్వలుః కోపా దగ్నీనామివ దమ్యతామ్‌ | తతో బృహన్తి చాపాని భీమనాదాని సర్వశః. 28

నికృష్య జఘ్ను రన్యోన్య మిషుభిః ప్రాణభోజనైః | మార్జారమృగభీమాస్యా న్పార్షదా న్వికృతాననా&. 29

దృష్ట్వాదృష్ట్వా హసన్త్యుచ్చై ర్దానవా రూపసమ్పదః | బహుభిః పరిఘాకారైః కృష్యన్తాం ధనుషాం శరాః. 30

ఆస్మాభి ర్వః ప్రవేక్ష్యన్తే తటాకానీవ పక్షిభిః | మృతాశ్చ ప్రతియుధ్యధ్వం హనిష్యామో నివర్తతామ్‌. 31

ఆ నాదము విని రెచ్చిపోయి త్రిపుర దానవులు యుద్ధ లాలసులయి సంచరింపసాగిరి; అంతేకాదు; యుద్ధము నకై దేవతల కభిముఖులై పరుగెత్తిరి.న ఆకాశమందలి గణశ్వరులతో తలపడి యుద్ధము చేసిరి. వారిలో కొందరు మేఘములవంటి ఆకారములు కలవారు; మేఘములవలె ధ్వనులు చేయువారు నయిరి; సింహనాదములను కూడ చేసిరి; లేచి నిలిచి వాద్యములను కూడ మ్రోగించిరి. దేవతల సింహనాదమును సర్వ వాద్యముల ధ్వనియును గొప్పదిగా నయ్యెను. ఇన్ని విధములను దేవతల చేత త్రిపురదుర్గము మేఘముల చేత చంద్రబింబమువలె క్రమ్మి వేయబడెను. చంద్రోదయ మున ఉద్రేకింపజేయబడి నింపబడిన సముద్రమువలె భయంకరరూపులగు సురాసురులచేత త్రిపురదుర్గము నిండిపోయి ప్రకాశించెను. వారిలో కొందరు విలాసవంతులు ప్రాకారములపై మరికొందరు గోపురములపై ఇంకను కొందరు అట్టాల కములపై (బురుజులపై-మేడల పైఅంతస్తులపై) నిలువబడిరి. ఆ విలాసవంతు లందరును సువర్ణహారములను దాల్చిన వారును పదునుపెట్టి మెరుగలు తీర్చగా తళతళ మెరయు కృపాణికలను ధరించిన శూరులును కాని సామాన్యులు కారు. వారిలో కొందరు జలపూర్ణ మేఘములవలె గర్జించుచుండిరి. మరికొందరు వస్త్రముల నెగురవేయుచు ఇటు నటు పరుగెత్తు చుండిరి. ఇంకను కొందరు ఇండ్లలోనుండి బయటికి వచ్చి-ఇది యేమి జరుగుచున్నదని పరస్పర మడుగుచుండిరి. ఇది యేమో నాకు తెలియుట లేదు. నా తెలివియంతయు మరుగుపడి పోయినది. అమ్మా! నేను ఎవరివాడనో నాకు తెలియుట లేదు. ఇడుగో! ఇక్కడ చాల గొప్ప వ్యక్తి ఎవరో కనబడుచున్నాడు. ఇతడు కాలు (యము)డేమో! సింహములు లాగురథము నారోహించి కనబడుచున్న ఈ రాజెవ్వరో! దేహమును పీడించు వ్యాధివలె త్రిపురదుర్గమును పీడించుచు పైకి విజృంభించుచున్నా డీత డెవరు? ఇతడు ఎవరైన నగును గాక! తందరలాడు ఈ తడబాటు సమయములో ఈ ప్రశ్నములతో పని యేమి? ఇక ఆయుధములు ధరించి రండు; జరుగవలసినది జరుగును. అని ఇట్లు త్రిపుర దుర్గవాసులగు వారందరు భయాక్రాంతులయి వరస్పరమనుచు మాటలపై మాట లాడుచుండిరి. మరికొందరు ఒకరింకొకరి దగ్గరకు పోయి పోయి ఏమోమో అడుగుచుండిరి.

+కరామ్బరాః.

అంతలో తారకాక్షపురమునందలి అసురులును దైత్యులును కుపితులై బిలమునుండి మహానర్పములవలె బయటకు వచ్చిరి. వారందరును ప్రమథనాయక సేనాపతులతో తలపడుటకై పరుగెత్తుచు సింహములచే అడ్డగించబడిన గజ యూథనాయకులవలె వారిచే అడ్డగించబడిరి. సంపదలచే గర్వితులును దర్పితులును నగు ఆ అసురుల రూపములు తిత్తితో గాలి ఊదుటచే మండెడు అగ్నుల రూపములవలె ప్రజ్వలింపసాగెను. అంతటవారు భయంకరనాదములు చేయు పెద్ద చాపములను ఆకర్షించి ప్రాణము లాహారముగా గొను బాణములతో పరస్పరము కొట్టుకొనుచుండిరి. రూప సంపదలు గలిగి గర్వితులగు దానవు లందరును పిల్లులవలె మృగములవలె భయంకర వికృత ముఖములుగల ప్రమథులను చూచి బిగ్గరగా నవ్వుచుండిరి. మే మాకర్షించెడు ధనుస్సులనుండి వెలువడు పరిఘలను పోలు శరములు పక్షులు తటాకములలో ప్రవేశించునట్లు ప్రవేశించును. మీరు మాకు ఎదురు నిలిచి యుద్ధము చేసితిరా-చచ్చితి రన్నమాటయే; మేము మిమ్ము చంపు దుము; వెనుకకు మరలుడు.

భీమరూపాశ్చ తాన్త్సర్వా న్దానవా యుద్ధదుర్మదాః | ఇత్యేవం పరుషాణ్యుక్త్వా పార్షదా& దానవర్షభాః. 32

బిభిదు స్సాయకై ర్ఘోరై స్సూర్యః పాదై రివామ్బుదా& | ప్రమథాఅపి సింహాస్యా స్సింహవిక్రాన్త విక్రమాః.

గణ్డశైంశిలావర్షైర్బిభిదు ర్దైత్యదానవా& | అమ్బుదైరాకులమివ హంసాకుల మివామ్బరమ్‌. 34

దానవాకులమత్యర్థం తద్బలం సఙ్కులంబభౌ | వికృష్టచాపా దైత్యేన్ద్రాః సృజన్తి శరదుర్దినమ్‌. 35

ఇన్ద్రచాపాన్వితోరస్కా జలదాఇవ దుర్దినమ్‌ | ఇషుభిస్తాడ్యమానాస్తు భూయోభూయో గణశ్వరాః. 36

చక్రతు ర్దేహనిర్యాసం స్వర్ణధాతు మివాచలాః | తథా వృక్షశిలాశైలవజ్రశూలపరశ్వథైః. 37

చూర్ణ్యన్తేభిహతా దైత్యై రుత్స్వనద్భిర్మృతాఇతి | తారకాక్షో జయత్యేష ఇతి దైత్యా హ్యఘోషయ&. 38

జయతీన్ద్రశ్చ రుద్రశ్చ ఏవమూచు ర్గణశ్వరాః | దారితా వారితా బాణౖర్యోధా స్తస్మి న్బలార్ణవే. 39

నిస్వనన్త్యమ్బుసమయే జలగర్భా ఇవామ్బుదాః | కరైశ్ఛిన్నై శ్శిరోభిశ్చ ధ్వజైశ్ఛత్రైశ్చ కుణ్డలైః. 40

యుద్ధభూమి ర్భయవతీ మాంసశోణితపూరితా | వ్యోమ్నిచాప్లుత్య చాప్లుత్య తాళమాత్రం వరాయుధైః. 41

దృఢాహతాః పతన్త్యూర్ధ్వం దానవాః ప్రమథాస్తథా | సిద్దాహ్యప్సరసశ్చైవ చారణాశ్చ నభోగతాః. 42

దృఢప్రహారహృషితా స్సాధుసాధ్వితి చుక్రుశుః | అన్వాహతాశ్చ వియతి దేవదేన్ధుభయ స్తథా. 43

నదన్తో మేఘశ##బ్దేన *వృషభాఇవ రోషితాః | మయూఖాఇవ చాదిత్యం నద్యస్సిన్ధుపతిం యథా. 44

విశన్తి క్రుద్ధవదనా వల్మీకమివ పన్నగాః | తారకాక్షపురే తద్వ దసురాస్సురతాడితాః. 45

నశస్త్రా నిపతన్తిస్మ యుగా న్తఇవ భూధరాః | యోధయన్తి త్రిభాగేన త్రిపురేతు గణశ్వరాః. 46

భయంకరరూపులు యుద్ధ దుర్మదులు నగు దానవులు-దానవశ్రేష్టులు-శివపార్షదుల నిట్లు పరుషములు పలికి సూర్యుడు తన కిరణములతో మేఘములను చీల్చినట్లు శరములతో చీల్చిరి. సింహముల మొగములవంటి మొగములు కల వారును సింహములవలె విక్రమించువారు నగు ప్రమథులును దైత్య దానవులను గండశైలముల శిలల వానతో నలగుగొట్టిరి; చీల్చిరి; ఆకాశము మేఘముతోను హంసలతోను కలత చెందునట్లు ఆ సేనా సముదాయము దైత్య దానవులతో సంకులమయి ప్రకాశించెను. ఇంద్ర ధనువులతో మెరయు హృదయములుకల మేఘములు దుర్దినమును (మేఘచ్ఛాదిత మయిన ఆకాశముకల దినము దుర్దిన మనబడును.) సృష్టించినట్లు దైత్య దానవులును ధనువుల లాగి విడిచిన శరములతో దుర్దినమును సృష్టించిరి. బాణపు దెబ్బలు తగిలిన ప్రమథుల దేహములనుండి స్రవించు రక్తధారలు పర్వతముల నుండి వెలువడు సువర్ణ ధాతువులవలె కనబడుచుండెను. దైత్యులు వృక్షములతో శిలలతో శైలములతో గండ్రగొడ్డండ్రతో శూలములతో ప్రమథులను కొట్టి చూర్ణము చేయుచు-చచ్చితిరి-చచ్చితిరి-అని5 కేకలు వేయుచుండిరి. ఇడుగో! తారకాక్షుడే

*శరభాఇవరోషితాః జయించినాడు. అని దైత్య దానవు లుద్ఘోషించగా ఇంద్రరుద్రులకే జయము కలిగినదని ప్రమథులు అరచుచుండిరి. ఆ బల సముద్రమునందలి ఇరుపక్షముల యోధులును పరస్పర బాణములతో చీల్చబడి వారింపబడి వర్షాకాలమందలి సజల జలదములవలె ధ్వనులు చేయుచుండిరి. ఆ యుద్ధభూమి తెగిపడిన చేతులతో శిరములతో ధ్వజములతో కుండలములతో మాంస శోణితములతో భయంకరమయి కనబడుచుండెను. దానవులును ప్రమథులును తాటి చెట్టంత ఎత్తున ఎగిరి ఎగిరి మేలగు ఆయుధములతో పరస్పరము కొట్టుకొని నిలుపున లేచిపడుచుండిరి. ఇరు పక్షములవారికి తగులుచున్న గట్టి దెబ్బలు చూచి ఆకాశగతులగు సిద్ధులును అప్సరసలును హర్షముచెంది 'బాగుబాగు!' అని పలుకుచుండిరి. అంతరిక్షమున నిరంతరముగా మ్రోగించపబడుచున్న దేవదుందుభుల ధ్వనులు మేఘ శబ్దములు విని రోషించి ఱంకెలువేయు వృషభధ్వనులవలె వినబడుచుండెను. కిరణములు సూర్యునియందువలె- నదులు సముద్రము నందువలె- సర్పములు వల్మీకములందువలె- ప్రమథుల చేతిలో దెబ్బలు తినిన దానవులు క్రుద్ధవదనులై తమ పురమున ప్రవేశించుచుండిరి. ప్రళయ కాలమందు పర్వతములు జెక్కలతో ఎగిరివచ్చి ప్రజలపై పడునట్లు నశస్త్రులై వచ్చి దేవతలపై పడుచుండిరి. ప్రమథగణ నాథులు మూడవవంతుదానవసేనతో తలపడి ఇట్లు పోరు సాగించుచుండిరి.

విద్యున్మాలీ మయశ్చైవ తత్రాయాతౌ సహానుగౌ | తాభ్యాం నిపతమానాభ్యాం దానవాభ్యాం గణశ్వరాః. 47

త్రాసితా నిహతాశ్చైవ భగ్నాశ్చ ద్రుమవద్రణ | విద్యున్మాలీచ దైత్యన్ద్రో గిరీన్ద్రసదృశో బలీ. 48

ఆదాయ పరిఘాం నన్దిం తాడయామాస దానవః | స నన్దీ దానవేన్ద్రేణ పరిఘేణ దృఢాహతః. 49

భ్రమతే మధునా భగ్నః పురా నారాయణోయథా | నన్దీశ్వరే హతే తత్ర గణపాః ఖ్యాతవిక్రమాః. 50

దుద్రువు ర్జాతసంరమ్భా విద్యున్మాలిం మహాసురమ్‌ | ఘణ్టాకర్ణ శ్శఙ్కుకర్ణో మహాకాళశ్చ పార్షదః. 51

తత స్స సాయకైస్సర్వా న్గణాంశ్చ గణపాకృతిమ్‌ | భూయోభూయః పునశ్చాపి గణశ్వర మహత్తరా&. 52

భిత్త్వాభిత్త్వా రరాసోచ్చై ర్నభస్యమ్బుధరో యథా | తస్య రావితశ##బ్దేన స నన్దీ దినకృత్ప్రభః. 53

సంజ్ఞాం లబ్ధ్వా తతస్సోపి విద్యున్మాలిన మాద్రవత్‌ | రుద్రదత్తం తతోదీప్తం దీప్తానలసమప్రభమ్‌. 54

వజ్రం వజ్రనిభాఙ్గస్య సత్య నన్దీ ససర్జహ | నన్దినో భుజనిర్ముక్తం ముక్తాఫలవిభూషితమ్‌. 55

పపాత వక్షసి తదా వజ్రం దైత్యస్య భీషణమ్‌ | స త త్రాభిహతో దైత్యో వజ్రసంహననోపమః. 56

పపాత వజ్రేణ హత శ్శక్రేణాద్రిరివార్దితః | దైత్యేశ్వరే వినిహతే నన్దినా కులనన్దినా. 57

*చుక్రుశు ర్గణపాన్ప్రేక్ష్య దుద్రువుశ్చైవ దానవాః | దుఃఖామర్ష పరీతాస్తే విద్యున్మాలిని పాతితే. 58

భూమౌ శైలమహావృష్టిం ససృజు ర్దానవోత్తమాః | +ప్రపాత్యమానా గిరిభిస్తరుభి శ్చ గణశ్వరాః. 59

కర్తవ్యం న విదుః కించి ద్వధ్యమానా హ్యధార్మికైః |

అంతలో విద్యున్మాలియు మయుడును తమ అనుయాయులతో కూడ అక్కడకు వచ్చిరి. వారు వచ్చి తమ మీద పడుచుండగనే ప్రమథ గణాధినాథులు వారినిచూచి భయపడిరి; వారి చేతిలో కొందరు చంపబడిరి; మరికొందరు రణరంగమున వృక్షములవలె విరిగిరి; (పారిపోయిరి.) పర్వతేంద్రమువంటి పెద్ద దేహము కలవాడును బలశాలియునగు విద్యున్మాలి దానవుడు పరిఘను తీసికొని నందీశ్వరుని కొట్టెను. నందియును ఆ దెబ్బతిని పూర్వము మధురాక్షసుని చేతి దెబ్బతినిన నారాయణుడువలె గిరగిర తిరగి భంగమందెను. ఆ మహాయుద్ధమున నందీశ్వరుడే దెబ్బ తినగానే ప్రసిద్ధ విక్రమశాలురగు ఘంటాకర్ణుడు శంకుకర్ణుడు మహాకాళుడను ప్రమథులందరును తడబాటునందుచు పారిపోసాగిరి. అంతట వదలక విద్యున్మాలి ప్రమథగణములను గణాధిపతిని గణాధిపతికంటె గొప్పవారగు పారిషద శ్రేష్ఠులను చీల్చి చెండాడి అంతరిక్షమున మేఘమువలె గర్జించెను. వాని గర్జన ధ్వని వినబడగానే సూర్యతేజస్కుడగు నందీశ్వరుడు

*చుక్రుశుర్దానవాన్ప్రేక్ష్యదుద్రువుశ్చగణాధిపమ్‌. + తేపీడ్య మానాగురుభిర్గిరిభిశ్చగణశ్వరాః.

మరల తెలివినొంది విద్యున్మాలిమీదకు పరువెత్తెను. అతడు వజ్ర సదృశ##దేహుడగు ఆ దానవుని మీదకు రుద్రుడు తనకిచ్చినది దీప్తానల నమప్రభమయి ప్రజ్వలించుచున్నది అగు వజ్రమును విసరెను. మూక్తాఫల విభూషితమగు ఆ వజ్రమను భీషణాయుధము నందీశ్వరుని బాహులచే విడువబడివచ్చి ఆ దానవుని వక్షముపై పడెను. వాడు వజ్రమువలె దృఢశీరీరుడే అయినను ఆ వజ్రపుదెబ్బ తిని ఇంద్రుని వజ్రపుదెబ్బ తినిన పర్వతేంద్రమువలె పడిపోయెను. ప్రమథకుల మునకు ఆనందప్రదుడగు నందిచేతిలో దైత్యేశ్వరుడగు విద్యున్మాలి దెబ్బతినగానే దానవులు ప్రమథ గణాధిపతులను చూచి అరచుచు మీదకు పరువెత్తుకొని వచ్చిరి. విద్యున్మాలి పడిపోయెనే యను దుఃఖముచే కలిగిన క్రోధముతో నిండి పోయి ఆ దానవోత్తములు భూమి మీదకు పర్వత వర్షము కురిపించ నారంభించిరి. అధార్మికులగు దానవశ్రేష్ఠులు అట్లు కొండలతో వృక్షములతో చావగొట్టుచుండ ఆదెబ్బలు తినుచు ప్రమథులు ఏమి చేయుటకును తోచనివారైరి.

తతోసురవరః శ్రీమాం స్తారకాక్షః ప్రతాపవా&. 60

స తరూణాం గిరీణాంవై తుల్యరూపధరో బభౌ | భిన్నోత్తమాఙ్గా గణపా భగ్నపాదాననా స్తథా. 61

విరేజు ర్భుజగా మన్త్రై ర్వార్యమాణా యథా తథా | మయేన మాయావీర్యేణ వధ్యమానా గణశ్వరాః. 62

భ్రమన్తి బహుశబ్దాలాః పఞ్జరే మఞ్జవాగ్యథా | స చాసురవర శ్శ్రీమాం స్తారకాక్షః ప్రతాపవా&. 63

దదాహ తద్బలం సర్వం శుష్కం వనమివానలైః | తారకాక్షేణ వార్యన్తే శరవర్షై స్తథాగణాః. 64

భ్రమన్తే క్రమశస్సర్వే పఙ్కేషు శకునా యథా | మయేన మాయానిహతా స్తారకాక్షేణ చేషుభిః. 65

గణశా విధురా జాతా జీర్ణమూలా ఇవద్రుమాః | భూయశ్చ సాగరం హ్యగ్నిం సింహగ్రాహ భుజఙ్గమా&. 66

గిరీన్ద్రాంశ్చ హరీన్వ్యాఘ్రా నృక్షా న్భేరుణ్డపక్షిణః | శరభా నష్టపాదాంశ్చ అపః పవనమేవచ. 67

మయో మాయాబలేనైవ పాతయామాస శత్రుషు | స తారకాక్షేణ మయేన మాయయా సమ్మోహ్యమానా వివశా గణశ్వరాః. 68

నాశక్నువంస్తే మనసా విచేష్టితుం యథేన్ద్రియార్థం మునినాభిసంవృతాః | మహాజలాగ్నీన్గిరికుఞ్జరోరగై ర్హరీన్ధ్రవ్యా ఘ్రరక్షతరక్షురాక్షసైః. 69

తే వధ్యమానా స్తమసా విమోహితా స్సముద్రమధ్యేష్వివ జీవకాఙిణః | సమ్బాధ్యమానేషు గణశ్వరేషు ప్రమథ్యమానేషు సురేషు తేషు. 70

తతస్సురాణాం ప్రవరాస్తు రక్షితుం రిపోర్బలం సంవివిశు స్సహాయుధైః | యమో ధనేశో వరుణశ్చ భాస్కర స్తథా కుమారోమరకోటిసంయుతః. 71

స్వయంచ వజ్రీ వరనాగవాహన స్సవజ్రపాణి స్సురలోకపూజితః | స చోడునాథ స్సమరే నిశాకర స్సుచారుపక్షో ద్యుతిమా న్మహాద్యుతిః. 72

బలం రిపూణాం ప్రమథాశ్చ వీక్షితుం రిపోర్బలం సంవివిశు ర్మదోద్ధతాః |

అంతలో శోభావంతుడును ప్రతాపవంతుడునగు తారకాక్షుడు యుద్ధరంగమునకు వచ్చి పర్వతములతో వృక్షములతో సమానమగు శరీరము కలిగి భయంకరుడై కనబడెను. అతని చేతిలో తతలు పగిలి మొగములు పగిలి కాళ్ళు విరిగి ప్రమథ గణాథిపతుల మంత్రములతో స్తంభితములయిన సర్పములవలె కనబడుచుండిరి. మాయాశక్తి శాలియగు మయుని చేతిలో దెబ్బలుతిని మిగుల కేకలు వేయుచు పంజరములలోని చిలుకలవలె రొద చేయుచుండిరి. ప్రతాపవంతుడును శ్రీమంతుడు నగు తారకాక్షుడు ప్రమథగణ బలమంతయు ఎండుటడవిని అగ్నులతో కాల్చినట్లు కాల్చివేసెను. తారకాక్షునిచే వారింపబడుచున్న ప్రమథ గణనాథులు బురదలో చిక్కుకొని తిరుగుడు పడుచున్న పక్షులవలె తిరుగుడు పడుచుండిరి. మయుడు మాయతో దెబ్బలు కొట్టుచుండగా దెబ్బలు తినిన ప్రమథ గణానాథులు వేళ్ళు శిథిలమయిన వృక్షములవలె నిలువచేతకాని వారైరి. అంతలో మయుడు తన మాయా బలముతో మరల మరల సముద్రమును అగ్నిని సింహములను మొసళ్ళను సర్పములను గిరీంద్రములను వ్యాఘ్రములను వృక్షములను భేరుండ పక్షులను శరభములనెడి అష్టపాద మృగములను జలములను వాయువులను సృష్టించి తన శత్రువుల నడుమ విడువ సాగెను. తారాకాక్షుడును మయుడును మాయతో ప్రమథ గణశ్వరులను సంమోహనపరచుచుండ మునిచే తననిగ్రహ శక్తిచే అదుపులో నుంచబడిన ఇంద్రియములు ఆయా విషయములయందు ప్రవర్తిల్లలేనట్లు వారును మనస్సుతో ఏమియు ఆలోచించనైన లేనివారైరి. మహాజలము అగ్నులు గిరులు ఏనుగులు సర్పములు సింహశ్రేష్ఠములు వ్యాఘ్రములు భల్లూకములు చిరుతపులులు రాక్షసులు దెబ్బలుకొట్టి బాధించుచుండ ప్రమథ గణాధిపతులెల్లరును సముద్ర మధ్యమందు చిక్కుకొని బ్రదికి బయటపడుటెట్లా యని కలతపడువారివలె అజ్ఞానముతో మోహితులయిరి. ఇట్లు ప్రమథ గణశ్వరులు మిగుల బాధింపబడుచుండ సురలు నలుగకొట్టబడుచుండ కొందరు సురశ్రేష్ఠులు వారిని రక్షణ సేయదలచి ఆయుధముల ధరించి శత్రుబలమునందు ప్రవేశించిరి. వజ్రము ఆయుధముగా గలవాడును సురలోక పూజితుడునగు ఇంద్రుడు వజ్రమును చేతధరించి ఐరావత గజమారోహించెను. నక్షత్రాధిపతియు రాత్రుల నేర్పరచువాడును మిగుల మనోహరమగు పక్షము (తన పక్షమందలిసేన - శుక్ల కృష్ణ పక్షములు) కలవాడు ప్రకాశ శీలుడునగు చంద్రుడు మహాప్రకాశము కలవాడయ్యెను. ఇట్లా ఇంద్రచంద్రులిరువురు సన్నద్ధులై శత్రుబలమున ప్రవేశించిరి. మదోద్ధతులగు ప్రమథ గణాధిపతులును శత్రు బలమును చూడదలచి దానియందు ప్రవేశించిరి.

యథా వనం గర్వితకుఞ్జరాధిపై ర్యథా నభ స్సామ్బుధరం సమీరణౖః. 73

యథైవ సింహై ర్విజనేషు గోకులం తథా బలంచ త్రిదశై రభిద్రుతమ్‌ |

కృతప్రహారాతురదీనమానసం బలం సమేత్యాథ మయ స్త్సమోసృజత్‌. 74

తముల్బణం ధ్వాన్తముదగ్రరోచిషా విద్యోతనాస్త్రేణ తథైవ దేవరాట్‌ |

వికాసయామాస యథాచ చంద్రమా దివాకరో వాహని శార్వరం తమః. 75

స్వజ్యోతిషాం జ్యోతిరివోష్మవా& హరి ర్విపాతయామాస శ##రేణ సాదరమ్‌ |

తజ్జ్యోతిషా తేన తమః ప్రణష్టం ననాశ తూర్ణం త్రిదశాధిపేన. 76

తతోపకృష్టే తమసి ప్రభావా దస్త్రప్రభావేచ వివర్ధమానే |

దిగ్లోకపాలై ర్గణనాయకైశ్చ కృతో మహా న్త్సింహరవో ముహూర్తమ్‌. 77

కోటీరభగ్నా స్త్వసురోత్తమా స్తే చ్ఛిన్నోత్తమాజ్గా శ్శరపూరితాజ్గాః |

దేవేతరా దేవవరాభిభూతా స్సీదన్తి పఙ్కేషు యథా గజేన్ద్రాః. 78

వజ్రేణ భీమేనచ వజ్రపాణిః శక్త్యాసశక్త్యాచ మయూరకేతు |

ర్దణ్డన చోగ్రేణచ ధర్మరాజః పాశేన చోగ్రేణ వనేశ్వరోపి. 79

గణశ్వరాస్తేమరసన్నికాశాః పూర్ణాహుతిస్నిగ్ధశిఖిప్రకాశాః |

ఉత్సాదయన్తో దనుపుత్త్రవృక్షాన్‌ వృక్షాన్యథేన్ద్రాశనయః పతన్తః. 80

మయస్తుదేవానభిరక్షితారమ్‌ తారాత్మజం దేవవరం కుమారం |

శ##రేణ భిత్త్వా ముహురారసిత్వా సతారకాక్ష స్త్విద మాబభాషే. 81

కృత్వా ప్రహారం ప్రవిశామ ధీరాః పురాణి దైత్యేన్ధ్రబలేనయుక్తాః |

విశ్రామ మూర్జస్కర మప్యవాప్య పునః కరిష్యామ రణం సమేతాః. 82

వయం హి శస్త్ర క్షతజోక్షితాంగా విశీర్ణశస్త్రధ్వజచర్మవాహాః |

జయైషిణస్తే జితకాశినశ్చ గణశ్వరా లోకనరాధిపాశ్చ. 83

మయస్య శ్రుత్వా దివి తారకాక్షః వచోతికాలఃక్షతజోపమాక్షః |

వివేశ తూర్ణం త్రిపురం సహైవ దితేస్సుతై ర్యుద్ధవివృద్ధదర్పైః. 84

తతస్సశఙ్ఖానకభేరిభీమం ససింహనాదం హరసైన్యమాబభౌ |

మహాబలం ఘోరసుభీమగహ్వరం యథా మహాద్రే ర్వరసింహనాదితమ్‌. 85

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే దేవదానవయో ర్యుద్ధకథనం నామ త్రయస్త్రింశదుత్తర శతతమో7ధ్యాయః.

మదపుటేనుగు వనమును వలె పెనుగాలులు జలద సహితమయిన అంతరిక్షమును వలె సింహములు విజన ప్రదేశములందలి గోవులమందను వలె దేవసేనలు రాక్షసుల బలమును కలవరపరచెను. తన బలమంతయు దేవతల చేతిలో దెబ్బలు తిని ఆతురమగుట చూచి మయుడు మాయతో అంధకారమును సృజించెను. గాఢమగు ఆ అంధకారమును ఇంద్రుడు అతితీవ్రమగు ప్రకాశముగల విద్యోతనాస్త్రముతో నశింపజేసెను. రాత్రులందు చంద్రుడును పగళ్లయందు సూర్యుడును వలె తమ సేనను ఇంద్రుడు ఆ విద్యోతనాస్త్రముతో ప్రకాశింపజేసెను. త్రిదశాధిపతిచేత ప్రకాశింపజేయబడిన ఆ జ్యోతిస్సుచే మయుడు కల్పించిన చీకటి ప్రణష్టమై శీఘ్రమే అతని మాయ నశించెను. ఇట్లు చీకటి తగ్గుచు ఇంద్ర ప్రభావమున అతని అస్త్ర ప్రభావము వృద్ధి పొందుచుండ ఒక ముహూర్తకాలము దిక్పాలురును లోకపాలురును ప్రమథగణ నాయకులును గొప్ప సింహనాదము చేసిరి. రాక్షసశ్రేష్ఠులు కిరీటములు పగిలి విరిగి శిరస్సులు పగిలి తెగి అవయవములం దంతట శరములు గ్రుచ్చుకొని ఇట్లు దేవతాశ్రేష్ఠుల చేతిలో పరాభవమునంది బురదలో చిక్కుకొనిన గజేంద్రముల వలె చిక్కులలో పడిరి. ఇంద్రుడు బయంకర వజ్రముతోను మయూరధ్వజుడగు కూమారస్వామి శక్తియను ఆయుధము తోను తన శక్తి(బలము) తోను ధర్మరాజు భయంకర దండాయుధముతోను వరుణుడు పాశముతోను అమరుల వలెనే సుందరరూపములతో ప్రకాశించు ప్రమథ గణశ్వరులను పూర్ణాహుతి సమయమున ఆజ్యబలముతో వెలుగు అగ్నివలె ప్రకాశించుచును దానవులు అనెడి వృక్షములను పిడుగుల వృక్షములపై పడి నశింపజేయునట్లు నశింపజేయసాగిరి. ఆ సమయములోమయుడును దేవతలను కాపాడుచున్న వాడును కృత్తికా నక్షత్ర కుమారుడగు దేవశ్రేష్ఠుడును నగు కుమారస్వామిని శరముతో భేదించి మాటామాటికిని గర్జించెను. అంతలో మయుడు తారకాక్షునితోను రాక్షసులతోను ఇట్లనెను : ''ధీరులారా! దానవశ్రేష్ఠులారా! దేవతలను దెబ్బతీసి మనము దానవ బలమును వెంట తీసికొని పురములందు ప్రవేశింతము. అట్లు విశ్రాంతి తీసికొనుటచే మనకు బలము వృద్ధి నందును. మరల మన మందరమును కూడి వచ్చి యుద్ధము చేయుదము. మన మందరమును దెబ్బలు తిని గాయములనుండి కారు నెత్తుటితో తడిసియున్నాము. మన ఆయుధములును ధ్వజములును డాలులును విరిగినవి పగిలినవి తెగినవి. శివసేనాపక్షము వారు జయము పొంది ప్రకాశించుచున్నారు. ఇంకను గెలువ ఉత్సాహపడుచున్నారు. మయుని మాటవిని కాలయముని మించి భయంకరరూపుడును రక్తమువలె ఎర్రని కన్నులు కలవాడును అగు తారకాక్షుడు యుద్ధము చేవలెనను ఉత్సాహమదములతో నిండిన దైత్యులను వెంటగొని శీఘ్రమే త్రిపురదుర్గమును ప్రవేశించెను. అంతట శివుని సేనలో ఆనక శంఖఖేరీ వాద్యములు ధ్వనులు సింహనాదములు చెలరేగెను. మహాబలశాలియగు ఆ సేన మహా సింహనాదములతో నిండినదియు భయంకరమును లోతైనదియు నగు మహా పర్వత గుహవలె ప్రకాశించెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున దేవదానవ యుద్ధ కథనమను నూట ముప్పది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters