Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకత్రింశదుత్తరశతతమోధ్యాయః

ఈశ్వరస్య త్రిపురవిజయాయ ప్రస్థానమ్‌.

సూతః : బ్రహ్మాద్యై స్త్సూయమానస్తు దేవదేవో మహేశ్వరః | వాచస్పతి మువాచేదం దేవానాం క్వ భయం మహత్‌. 1

మహేశ్వరః : భోబో దేవా స్స్వాగతం వో బ్రూత యద్ధి మనోగతమ్‌ | యద్దేయం వాప్యదేయం వా నాదేయంచ మయా హి తత్‌. 2

యదభీష్టం భవత్కామం తద్దదామి సురర్షభాః | యుష్మాకమిహ ముఖ్యానాం కృతేహం విబుధర్షభాః. 3

చరామి మహదత్యుగ్రం యచ్చాపి పరమం తపః | యుష్మద్ద్వేష్యామమద్వేష్యాః కష్టాః కష్టతరా మమ. 4

తథా మద్భవ మాపన్నో యుష్మాకం భవ ఏవచ | తఏవ ముక్తా దేవేన ప్రేవ్ణూ సబ్రహ్మకా స్సురాః. 5

రుద్రమాహు ర్మహాభాగా భాగార్హా స్సర్వఏవతు | దేవాః : భగవ& దానవై స్తప్తం రౌద్రం రౌద్రపరాక్రమైః 6

లోకేషూత్పాట్యమానేషు త్వాం వయం శరణం గతాః | మయోనామ దితేఃపుత్త్ర స్త్రినేత్రః కలహప్రియః. 7

త్రిపురం యేనత ద్దుర్గం కృతం పాణ్డురగోపురమ్‌ | తదాశ్రిత్య పరందుర్గం దానవా వరనిర్భయాః. 8

బాధన్తేస్మా న్మహాదేవ ప్రేష్యాన్వై స్వామినో యథా | ఉద్యానానిచ భగ్నాని నన్దనాదీని యానిచ. 9

వరా శ్చాప్సరస స్సర్వా రమ్భాద్యా దనుజైర్హృతాః | ఇన్ద్రౌపవాహ్యాశ్చ గజాః కుముదాఞ్జనవామనాః 10

ఐరావణో యథావాహ్యం దేవనాంచ మహేశ్వర | యే చన్ద్రమూహు ర్హి హయా స్తేపి సర్వే హృతాస్తుతైః.

జాతాస్తు దానవానాం తే రథయోగ్యా స్తురఙ్గమాః | యే రథా యే గజా యేశ్వా యా స్త్సియో యచ్చ నో వసు. 12

తచ్చాప్యపహృతం దైత్యై స్సంశయో జీవితే పునః | త్రినేత్ర ఏవముక్తస్తు దేవై శ్శక్రపురోగమైః. 13

ఉవాచ దేవా& దేవేశో వరదో వృషవాహనః |

నూట ముప్పది ఒకటవ అధ్యాయము.

ఈశ్వరుడు త్రిపుర విజయమునకై సన్నాహముతో బయలు వెడలుట.

సూతు డిట్లు చెప్పనారంభించెను : బ్రహ్మాదులు తన్నిట్లు స్తుతించుచుండ దేవదేవుడు అగు మహేశ్వరుడు బ్రహ్మనుద్దేశించి 'దేవతలకు మహాభయ మెవరి వలన?' అనియడిగి ఇంకను ఇట్లు పలికెను దేవతలారా! మీకు స్వాగతమా! మీమనోగతమేమో చెప్పుడు. అది ఈయదగినదగుగాక-ఈయరానిదగుగాక: నాకు మాత్రమది ఈయ రానిదికాదు. సురశ్రేష్ఠులారా! మీరు కోరు అభీష్టమేదైనను అది తప్పక ఇత్తును. నేను ఆచరించు మహోగ్ర తపము కూడ మీకొరకే. మీకు ద్వేష్యులు నాకును ద్వేష్యులే; వారు నాకు నీచులు నీచతరులు కూడి; అట్లే మీకు శుభమగు విషయము నాకును శుభమయినదే.

ప్రీతితో శివుడిట్లు పలుకగా యజ్ఞముగా భాగార్హులగు బ్రహ్మాది దేవతలందరును రుద్రునితో నిట్లనిరి: భగవన్‌! రౌద్ర (భయంకర) పరాక్రములగు దానవులు రౌద్రమగు తపమాచరించి తద్బలమున లోకములనే నిర్మూలించుచుండ భయమంది నిన్ను శరణు చొచ్చితిమి. త్రినేత్రా! మయుడను కలహప్రియుడగు దైత్యుడు రాజార్హములగు శ్వేత గోపురములుగల త్రిపుర దుర్గము నిర్మించెను. శ్రేష్ఠమగు ఆ దుర్గమాశ్రయించి దానవులు వర ప్రభావమున నిర్భయులై ప్రభువులు తమ సేవకులనువలె మమ్ము బాధించుచున్నారు. వారు నందనాది వసములు భగ్న మొనర్చినారు. మేలగు రంభాద్యప్సరసలనెల్ల హరించినారు. ఇంద్రుని వాహనములగు ఐరావత కుముదాంజన వామనములను చంద్రుడు మొదలగువారి వాహనములగు అశ్వములను దానవులు హరించినారు. వారు వానిచే తమరథములు లాగించుకొనుచున్నారు. ఇంతఏల? మారథములు గజములశ్వములు స్త్రీలు ధనము సమన్తమును అపహరించుటే కాక దైత్యులు మాజీవితములే సంశయాస్పదములు చేసినారు.

మహాదేవః : వ్యపగచ్ఛతు వో దేవా మహాదానవజం భయమ్‌. 14

తదహం త్రిపురం ధక్ష్యె; క్రియతాం యద్బ్రవీమి తత్‌ | యదీచ్ఛత మయా దగ్ధుం త్రిపురం సహ దానవైః.

రథ మౌపయికం మహ్యం సజ్జయధ్వం కిమాస్యతే | దిగ్వాససా తథోక్తాస్తే సపితామహకా స్సురాః. 16

ఈశ్వరారోహణయోగ్యరథనిర్మాణమ్‌.

తథేత్యుక్త్వామహాదేవంచక్రుస్తేరథముత్తమమ్‌ | ధరాం-కూబరకౌ తుల్యౌ రుద్రపార్శ్వచరా వుభౌ. 17

అధిష్ఠానం శిరో మేరు రక్షో మన్దర ఏవచ | చక్రుశ్చన్ద్రశ్చ సూర్యశ్చ చక్రే కాఞ్చనరాజతే. 18

కృష్ణపక్షంచ శుక్లంచ పక్షద్వయ మపీశ్వరాః | రథనేమిద్వయం చక్రు ర్దేవాబ్రహ్మపురస్సరాః. 19

ఆదిద్వయం తక్షకంచ యన్త్రమేతాశ్చ దేవతాః | కమ్బళాశ్వతరాభ్యాం వై నాగాభ్యాం సమవేష్టయ&. 20

భార్గవశ్ఛాఙ్గిరాశ్ఛైవ బుధోఙ్గారక ఏవచ | శ##నైశ్చర స్తథైవాత్ర సర్వే తే దేవసత్తమాః. 21

వరూథం గగనం చక్రు శ్చారురూపం రథస్యవై | కృత్వా ద్విజిహ్వత్రితయం త్రివేణుం శాతకౌమ్భకమ్‌. 22

మణిముక్తేన్ద్రనీలాదివృతంహృష్షైస్తదాసురైః | గఙ్గా సిన్దుశ్శతద్రూశ్చ చన్ద్రభాగా ఇరావతీ. 23

వితస్తాచ విపాశాచ యమునా గణ్డకీనదీ | సరస్వతీ దేవికాచ సతాథ సరయూరపి. 24

ఏతా స్సరిద్వరా స్సర్వా శ్శృణు సజ్జీకృతా రథే | ధార్తరాష్ట్రాశ్చ యే నాగా యేచ కర్కోటకాత్మజాః. 25

వాసుకేః కులజా యేచ యేచైరావతవంశజాః | యే సర్పా దర్పసమ్పూర్ణా స్తత్ర తూణీర మాశ్రితాః. 26

ఉపతస్థు శ్శరా భూత్వా నానాజాతిసముద్భవాః |

ఇంద్రాది దేవతలిట్లు పలుక దేవేశుడు వరదుడు వృష వాహనుడగు త్రినేత్రుడు వారితో ఇట్లు పలికెను: దేవతలారా: మీరు దానవులవలన భయపడవలసిన పని లేదు; నేనది తొలగింతును. అందులకై నేను త్రిపుర దుర్గమును దహింతును. మీరందులకై చేయవలసినది చెప్పెద వినుడు; అట్లు చేయుడు. నేను దానవులతో కూడ మయుని త్రిపుర దుర్గమును దహించుట మీకిష్టమైనచో ఊరకుండక-తడవు చేయక-నాకు తగిన రథమును సిద్ధపరపుడు. దిగ్వస్త్రుడగు శివుడట్లు పలుక బ్రహ్మాది దేవతలు అట్లేయని మహాదేవునితో పలికి వారుత్తమ రథమును సిద్ధపరచిరి. భూమియే రథము; శివుని పార్శ్వచరులిద్దరు కూబరములు (కాడికొనలు); మేరుపర్వత శిఖరము కూర్చుండు స్థానము; మందర పర్వతము ఇరుసు; చంద్రసూర్యులు ఇద్దరును బంగరు వెండి చక్రములు; శుక్ల కృష్ణపక్షములు రథనేమి ద్వయము; నాగులలో మొదటి ఇద్దరు (శ్రేష్ఠుడు-వాసుకి) తక్షకుడు కంబళాశ్వతరనాగులు అను నాగులను త్రాళ్ళుగాచేసి శుక్ర బృహస్పతి బుధాంగారక శ##నైశ్చరులను ఆయా రథ భాగములుగాచేసి ఈ భాగముల నా త్రాళ్ళతో బిగించి కట్టిరి. ఆకాశము ఆరథమునకు దారు నిర్మిత రక్షణ పంజరము. మరి ముగ్గురు నాగశ్రేష్ఠులు బంగారు త్రివేణువు (అను రథపు ముందు భాగమునందలి త్రిభుజాకారపు అమరిక) గంగ సింధు శతద్రు చంద్రభాగ ఇరావతి వితన్త విపాశ యమున గండకి సరస్వతి దేవిక సీత సరయూ అనునదులు అమ్ముల పొదులు; ధార్త రాష్ట్ర కర్కోటక వాసుక్యైరావత జాతినాగులు తూణీరములందలి శరములు అయ్యెను.

సురసా సరమా కద్రూ ర్వినతా శుచిరేవచ. 27

తృష్ణా బుభుక్షా యాచోగ్రా వేదనా చిత్రసమ్భవా | బ్రహ్మవధ్యాచ గోవధ్యా అశ్వవధ్యా భయానకాః. 28

గదా భూత్వాచ శక్త్యశ్చ తస్థు ర్దేపరథేవ్యయాః | యుగం కృతయుగం చాత్ర చాతుర్హోత్ర ప్రయోజకాః.

చతుర్వర్ణా స్సలీలాశ్చ బభూవు ర్వర కుణ్డలాః | తద్యుగం యుగసఙ్కాశం రథశీర్షే ప్రతిష్ఠితమ్‌. 30

ధృతరాష్ట్రేన నాగేన బద్ధం విషవతా మహత్‌ | ఋగ్వేదా స్సామవేదాశ్చ యజుర్వేదా హ్యథర్వణాః. 31

వేదా శ్చత్వారఏవైతే చత్వారశ్చ తురఙ్గమాః | అన్నదానపురోగాణి యాని దానాని కానిచిత్‌. 32

తా న్యాస న్వాజినాం తేషాం భూషణాని సహస్రశః | పద్మద్వయం తక్షకశ్చ కార్కోటకధనంజ¸°. 33

నాగా బభూవు రేవైతే హయానాం దృఢబన్ధనాః | ఓఙ్కారప్రభవా స్సోమా స్సర్వాశ్చైవ క్రతుప్రియాః. 34

ఉపద్రవాః ప్రతీహారాః పశుబన్ధే ష్వవస్థితాః | యజ్ఞోపవాహ్యా న్యేతాని తస్మి న్లోకరథే శుభే. 35

మణిముక్తాప్రవాళాని భూత్వాచైవ సహస్రశః | ప్రతోదం ప్రణవశ్చాసీ త్తదగ్రేచ వషట్కృతమ్‌. 36

సినీవాలీ కుహూ రాకా తథా భానుమతీ శుభా | యోక్త్రాణ్యాసం స్తురఙ్గాణా మపసర్పణవిగ్రహాః. 37

కృష్ణాన్యపిచ పీతాని నీలమాఞ్జిష్ఠకానిచ | వ్యజనాని పతాకాస్స్యుర్బభూవుః పవనేరితాః. 38

చతుర్భి శ్చిత్రితం షడ్భి ర్దను స్సంవత్సరోభవత్‌ | అజరా జ్యాభవచ్చాపి సాత్త్వికీ ధనుషో దృఢా. 39

కాలోహి భగవా న్రుద్ర స్తంచ సంవత్సరం విదుః | తస్మా దుమా కాళరాత్రీ ధనుషో జ్యాజరాభవత్‌.

సమర్థ స్త్రిపురం దగ్ధుం భగవా న్నీలలోహితః | స ఇషు ర్విష్ణుసోమాగ్ని త్రిదైవతమయోభవత్‌. 41

ఆసనం హ్యగ్ని రభవ చ్ఛల్య స్సోమః శిఖా హరిః | తేజసోత్తేజయామాస ఇషోస్తేజో యథాభవత్‌. 42

తస్మి& శరాగ్రే సఙ్క్రుద్ధో వాసుకి ర్నాగపార్థివః | తేన సంహరణార్థాయ ముమోచాశీవిషం జ్వలత్‌. 43

సురస-సరమ-కద్రువ-వనత-శుచి-తృష్ణ-బుభుక్షా-ఉగ్రవేదన-చిత్రసంభవ-బ్రహ్మహత్య- గోహత్య-అశ్వహత్య మొదలగు భయానకతత్త్వములు గదలుగా శక్త్యాయుధములుగా నయి రథమున నిలిచెను. కృతయుగము కాడి-చాతుర్హోత్ర యజ్ఞము సారథికూర్చుండుస్థానము-చతుర్వర్ణములు విలాసవంతములగు వన్నెల కుండలములు అయ్యెను. కృతయుగము వలె ధర్మయుతమై ప్రకాశించు ఆ గొప్పకాడిని రథశీర్షమున (అగ్రభాగమున) నిలిపి విషవంతుడగు ధృతరాష్ట్ర నాగునితో బంధించిరి. ఋక్సామయజు గాథర్వణవేదములు నాలుగు గుర్రలు లయ్యెను. అన్నదానాది దానములు అశ్వములకు వేల కొలది భూషణము లయ్యెను. పద్మమహాపద్ములు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు అను నాగులు గుర్రములను కట్టి వేయు పగ్గము లయ్యెను. ఓంకారమునుండి జనించిన క్రతుప్రియములగు సర్వస్తోమములును పశుబంధ యజ్ఞములందు వినియుక్తమగు ఉపద్రవ ప్రతీహారాదికముల ఉపవాహ్యములు ఇవన్నియు వేలకొలది మణులు ముత్తెములు పగడములు మొదలగునవి అయ్యెను. ప్రణవము కొరడా వషట్కారము ఆకారడాకొన-సినీవాలీ (చంద్రదర్శనము కల అమావాస్య) కుహూ (చంద్రదర్శనములేని అమావాస్య) రాకా (నిండు పున్నమ) భానుమతి (సూర్యుడస్తమించుటకు ముందే చంద్రో దయమగు పూర్ణిమ-ఇట్టి పర్వతిథులన్నియు గుర్రములను కాడితో కట్టు యోక్త్రము లయ్యెను. నల్లనివి పచ్చనివి నీలవర్ణము కలవి మాంజిష్ఠ(ఎర్రని) వర్ణముకలవియగు వ్యజన(ధవిత్ర)ములు (యజ్ఞములందుపయోగించు విసన కర్రలు) గాలిలో రెపరెపలాడు జెండా లయ్యెను. నాలుగు ఋతువులలో (వసంత గ్రీష్మము లొకటిగా హేమంత శిశిరము లొకటిగా లెక్కించగా) (ఆరు ఋతువులతో) చిత్రించబడిన సంవత్సరము ధను మయ్యెను. కాలాంశము లన్నియు గట్టి అంబక (బాణ) ముల మొనలు అయ్యెను. భగవానుడగు రుద్రుడు సాక్షాత్కాలమూర్తియగు సంవత్సరమే. అందుననే సత్త్వ రూపఉమ కాలరాత్రిరూప కావున ఆమె వింటి నారి యయ్యెను. భగవానుడగు నీలలోహితమూర్తి త్రిపురముల దహించ సమర్థుడగు వీరు డయ్యెను. విష్ణు సోమాగ్ని దేవతాత్రయము ఒకటయి ప్రధాన బాణ మయ్యెను. అగ్ని రథికూర్చుండు ఆసనము-సోముడు పీఠమును రథముతో బిగించు చీల(శల్యము) విష్ణువు; ఆ ఆసనపు శిఖాభాగము బాణమునకు ఆయా తేజస్సులతో పదును పెట్టిరి. బాణపు మొనయందు నాగరాజగు వాసుకి శత్రు సంహార సమర్థమగు తన కోరలయందలి జ్వలించు విషమును విడిచెను.

కృత్వా భూమిం రథశ్రేష్ఠం దివ్యం దివ్యప్రభావతః | లోకాధిపతి మభ్యేత్య ఇదంవచన మబ్రువ&. 44

సుకృతోయం రథోస్మాభి స్తవ గీర్వాణశత్రుహ& | ఇమ మాస్థాయ త్రిపురం దహ ప్రదహతాం వర. 45

తం మేరుశిఖరాకారం త్రైలోక్యం రథరూపిణమ్‌ | ప్రశస్య దేవతాస్తాశ్చ రథం పశ్యతు శఙ్కరః. 46

ముహుర్దృష్ట్వా రథం సాధు హృష్టో విషమలోచనః | ఉవాచ సేన్ద్రా నమరా నమరాధిపతి ర్వచః. 47

సుకృతోయం రథః ప్తో యుష్మాభి ర్మమ దేవతాః | ఈదృశీ రథసమ్పత్తి ర్యన్తా శీఘ్రం విధీయతామ్‌.

ఇత్యుక్తా దేవదేవేన దేవా విద్ధా ఇవేషుభిః | అవాపు ర్మహతీం చిన్తాం కథం కార్యం భ##వేదితి. 49

మహాదేవస్య దేవోన్యః కో నామ సదృశో భ##వేత్‌ | ముక్త్వా చక్రాయుధం దేవం సోప్యస్య ఇషుమాశ్రితః.

ధురి యుక్తావఖిద్యన్తో ఘటన్తఇవ పర్వతైః | సారథిస్త్వత్ర కశ్చస్యా దితిచాన్యోన్య మబ్రువ&. 51

వేధాశ్చ దృశ్యతే దేవై ర్లోకనాధస్య ధూర్జటేః | అహం సారథిరిత్యుక్త్వా జగ్రాహాశ్వాం స్తతో హ్యజః. 52

తతో దేవైశ్చ గన్ధర్వై స్సింహనాదో మహాన్కృతః | ప్రతోదహస్తం తందృష్ట్వా ఆరురోహ రథం హరః. 53

త్రిపురసంహారార్థమీశ్వరప్రస్థానమ్‌.

ఆరోహతి రథం దేవే అశ్వా మరభరాతురాః | జానుభిః పతితా భూమౌ రజో జగృహు రేవచ. 54

వేదాన్‌ దృష్ట్వాథ దేవశ్చ న భీమా న్పర్వసంస్థితా& | ఉజ్జహార పితౄ& సర్వా& సుపుత్త్రఇవ దుఃఖితా&.

తత స్సింహరవో భూయో బభూవ రణభైరవః | జయశబ్దశ్చ దేవానాం సమ్బభూవాద్భుతోపమః. 56

ఇట్లు దేవతలు తమ దివ్య ప్రభావముతో భూమిని రథశ్రేష్ఠమునుగా చేసి లోకాధిపతియగు శివుని కడకు వచ్చి ఇట్లు పలికిరి; దేవ శత్రువుల సంహరించ సంకల్పించిన దేవా! ఇదిగో! ఈ రథమును చక్కగా నిర్మించినాము. దహన మొనర్చుటలో నేర్పరివగు నీవు దీని నారోహించి త్రిపుర దుర్గమును దగ్ధ మొనర్చుము. ఈ రథమును శంకరుడు చూడ వలయునను కోరికతో మేరుశిఖరాకారమును త్రైలోక్యాత్మకమును నగు రథమును ఇట్లు వారు ప్రశంసించగా విషమలోచనుడగు ఆ శివుడు ఆ రథమును మాటిమాటికి చూచి చూచి మిగుల హర్షము చెందెను. దేవాధిపతియగు ఆ శివుడు ఇంద్రాది దేవతలతో ఇట్లు పలికెను. దేవతలారా! నాకై మీ రీ రథమును బాగుగా నిర్మించితిరి. ఇంత యోగ్యత కలిగిన రథము నకు యోగ్యుడవు సారథిని త్వరగా ఏర్పాటు చేయుడు. ఈ మాట వినిన దేవతలు బాణముల దెబ్బలు తిని నట్లయిరి. ఇప్పు డేమి చేయవలయునని వారు చింతిల్ల సాగిరి. మహాదేవునకు సాటియగు వాడు సారథిగా నుండదగినవాడు విష్ణువు తప్ప మరెవ్వరును లేరు. అతడో-బాణము నాశ్రయించియున్నాడు. అని ఆలోచించుచు వారు బరువున పూన్చిన ఎద్దుల వలె కొండతో డీకొనిన వృషభములవలె నిట్టూర్పులు విడువసాగిరి. అంతలో వారు బ్రహ్మదేవుని చూచిరి. లోకనాథుడగు ధూర్జటికి నేనే సారథి నయ్యెదనని బ్రహ్మ గుర్రముల (పగ్గముల)ను పట్టుకొనెను. వెంటనే దేవతలును గంధర్వులును బిగ్గరగా సింహనాద మొనరించిరి. బ్రహ్మ సారథియై కొరడా పట్టుకొనుట చూచి హరుడు రథ మారోహించెను. మహాదేవుడు రథ మారోహించుచుండ హరుని బరువునకు తట్టుకొనలేక గుర్రములు పీడితములై మోకాళ్లపై వంగి నేలపై పడి మట్టికరచినవి. వేదాశ్వము లట్లు పేద వడి ముడిగియుండుట చూచి మహాదేవుడు ఆర్తులగు తండ్రులను సుపుత్త్రుడు లేవనెత్తినట్లు లేవనెత్తెను. తరువాత మరల యుద్ధ స్పోరకమగు భయంకరమగు సింహనాదమును సాటిలేని జయధ్వనిని దేవత లాశ్చర్యకరముగ నొనరించిరి.

తదోంకారమయం గృహ్య ప్రతోదం వరదః ప్రభుః | స్వయమ్భూ ర్భగవా న్వాహ్యా ననుమన్త్య్ర యథాతథమ్‌. 57

గ్రసమానా ఇవాకాశం ధున్వన్తఇవ మేదినీమ్‌ | ముఖేభ్య స్సంసృతిం వేదా ఉద్గిరన్త ఇవాశుగాః. 58

స్వయమ్భువా చోద్యమానా శ్చోదితేన కపర్దినా | వ్రజన్త్యశ్వాశ్చ జవనాః క్షయకాల ఇవానిలాః. 59

అభ్యుచ్ఛ్రాయవినిర్మాణాం ధ్వజయష్టి మనుత్తమామ్‌ | ఆక్రమ్య నన్దీ వృషభ ఆస్తే తత్ర యథేచ్ఛయా. 60

అథర్వాఙ్గిరసౌ దేవౌ దణ్డహస్తౌ రవిప్రభౌ | రథచక్రౌ చ రక్షేతాం రుద్రస్య ప్రియకారకౌ. 61

శేషశ్చ భగవాన్నాగో హ్యనన్తోన్తకరో నృణామ్‌ | విషహస్తో రథంయాతి దిధక్షన్నివ దానవా&. 62

యమో మహిషమాస్థాయ మకరం వరుణస్తథా | ద్రవిణాధిపతి ర్యానం సురాణా మధిపో ద్విపమ్‌. 63

మయూరం శతచన్ద్రంచ కూజన్తం కిన్నరం యథా | స్కన్దోహ్యారుహ్య వరదో జుగోప స్వరథం పితుః. 64

నన్దీశ్వరశ్చ భగవాఞ్చాలమాదాయ వీర్యవా& | పృష్ఠతీః పార్శ్వతశ్చాపి లోకస్య క్షయకృద్యథా. 65

ప్రమథా శ్చాగ్నివర్మాణ స్సాగ్విజ్వాలా ఇవాచలాః | అనుజగ్మూ రథం సర్వే నక్రా ఇవ మహార్ణవమ్‌. 66

*భృగు ర్భరద్వాజవసిష్ఠ గౌతమాః క్రతుః పులస్త్యః పులహ స్తపోధనాః | మరీచి రత్రి ర్భగవా నథాఙ్గిరాః Oప్రాచేతసాద్యాః ప్రయయు ర్మహర్షయః. 67

హర మజిత మజం ప్రతుష్టువుస్తే వచనవిశేష విచిత్రభూషణౖః | రథవర మధిరుహ్య కాఞ్చనంచ వ్రజతి నపక్షమివాపరేమ్బరే. 68

కరివరవృష మేఘసన్నిభాస్తే సజలపయోదనినాదనాదినః | ప్రమథగణాః పరివార్య దేవదేవం రథమభితః ప్రయయు స్స్వదర్పయుక్తాః. 69

మకరతిమితిమిఙ్గిలాదిసఙ్ఘాః ప్రళయ ఇవార్ణవ మావ్రజన్తి తూర్ణమ్‌ | త్రిపురరథవరోతిభాసురో హ్యశనినిపాతపయోదనిస్వనః. 70

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే ఈశ్వరస్య త్రిపురవిజయ

ప్రస్థానకథనం నామైకత్రింశదుత్తర శతతమోధ్యాయః.

ఓంకారమయమగు ప్రతోదమును(కొరడాను)పట్టుకొని వరదుడు ప్రభుడు (మహా సమర్థుడు) నగు స్వయంభూ బ్రహ్మ భగవానుడు అశ్వములను తగిన విధమున అను మంత్రణము చేసెను. (మంచి మాటలతో నడచుటకు ప్రేరించెను.) అశ్వములు ఆకాశమును మ్రింగుచున్నవో-భూమిని విదలించి ఎగురగొట్టుచున్నవో అన్నట్లు పరుగు అందుకొనెను. శివునిచే ప్రేరితుడైన బ్రహ్మచే ప్రేరింపబడుచు ఆ వేదరూపాశ్వములు తమ వాక్కులతో సంసారగతిని పలుకుచు ప్రళయ కాల వాయువులో అనునట్లు ధనుర్ముక్తములగు బాణములో అనునట్లు మహావేగవంతములై పోవుచుండెను. నంది అచట పరమేశ్వరేచ్చానుగుణముగా అత్యున్నత వినిర్మాణముకల ధ్వజదండపు కొన నాక్రమించి వృషభపు రూపము ధరించి కూర్చుండెను. రవితేజస్కులు అథర్వాంగిరోఋషులు రుద్రునకు ప్రీతిజనకులై దండములు చేత ధరించి రథచక్రరక్షకు లయిరి. (కాలాత్ముడై) నరులకు అంతకరుడును భగవానుడు నగు శేషనాగుడు దానవులను దహింప గోరుచున్నాడో యను నట్లు రథము ననుసరించి పోవుచుండెను. యముడు మహిషమును వరుణుడు మకరమును కుబేరుడు అశ్వమును ఇంద్రుడు గజమును ఆరోహించగా వరదుడగు స్కందుడు వందల కొలది పించెములు కలిగి కింనరుడువలె కూయుచున్న మయూర మరోహించి వారితోపాటు తనతండ్రిరథమును రక్షించుచుండెను. వీర్యశాలియగు నందీశ్వరభగవానుడును శూలమును చేత ధరించి లోకక్షయకరుడేమో యనునట్లు రథమునకు పార్శ్వములందును పశ్చాద్భాగమునను తానై యుండెను. అగ్ని కవచులై ప్రమథులు అందరు రథము వెంట అగ్ని జ్వాలలు క్రక్కెడి పర్వతములో యనునట్లు నక్రములు మహార్ణవము వెంట పోయినట్లు పోవసాగిరి. భృగు భరద్వాజ వసిష్ఠ గౌతమ క్రతు పుతస్త్య పులహ మరీచ్యత్య్రంగిరః ప్రాచేతసాది మహర్షులు వెంట పోవుచుండిరి వారు వచన వివేషములే విచిత్రాలంకారములయియున్న వాక్కులతో అజితుడు అజుడు (ఓటమి నెరుగనివాడు పుట్టుకలేనివాడు)నగు హరుని స్తుతించుచుండిరి. ఇతరులును రెక్కలుకలదో యనునట్లున్న కాంచనరథశ్రేష్ఠ మారోహించి ఆకాశమున శివరథము ననుసరించి పోవుచుండిరి. ఏనుగులతో వృషభములతో మేఘములతో సదృశులగు

* భృగుర్వసిష్ఠశ్చ్యవనఃపర్వతోనారదస్తథా | అనుజగ్మూరథంశార్వమన్యేచపరమర్షయః ||

O పరాశరాగస్త్యముఖామహర్షయః

ప్రమథులు అందరును సజల మేఘములవలె ధ్వని చేయుచు తమ తమ దర్పములతో కూడి దేవదేవుని పరివారించి రథము నకు అన్ని వైపులను క్రమ్మి పోవుచుండిరి. ప్రళయమహార్ణవమువెంట మకరతిమి తిమింగిలాది జల జంతు సముదాయమువలె వారు వెంట పోవుకుండ ఆ త్రిపుర దాహియగు రథశ్రేష్ఠము పిడుగుపాటుతో కూడిన మేఘమువలె ధ్వని చేయుచు ముందునకు సాగుచుండెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున ఈశ్వరుడు త్రిపుర విజయమునకై బయలు వెడలుట యను నూట ముప్పది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters