Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనవింశత్యుత్తరశతతమోధ్యాయః.

గన్ధర్వైస్సహాప్సరసాం నానావిధ క్రీడావిహారవర్ణనమ్‌.

సూతః : తత్రాశ్రమపదే రమ్యే త్యక్తాహార పరిచ్ఛదః | క్రీడావిహారం గన్ధర్వైః పశ్య న్నప్సరసాం సహ. 1

కృత్వా పుష్పోచ్చయం గుర్వీం గ్రథయిత్వా తథా స్రజమ్‌ | అగ్రం నివేద్య దేవాయ గన్ధర్వేభ్య స్తథాదదౌ.

పుష్పోచ్చయప్రసక్తానాం క్రీడ న్తీనాం యథాసుఖమ్‌ | వేశ్యానాం వివిధాకారా న్పశ్యన్నపి నపశ్యతి. 3

కాచిత్పుష్పోచ్చయే సక్తా లతాజాలేన వేష్టితా | సా స్వీయజనన న్త్యక్తా కా న్తేనాపి సముజ్ఘితా. 4

కాచి త్కమలగన్ధాఢ్యా నిశ్శ్వాసపవనాహతైః | మధుపై రాకులముఖీ కాన్తేన పరిమోక్షితా. 5

మకరన్దసమాక్రాన్త నయనా కాచిదఙ్గనా | కాన్తనిశ్వ్వాసవాలేన నిరస్కీకృతేక్షణా. 6

కాచి దుచ్చీయ పుష్పాణి దదౌ కాన్తస్య భామినీ | కాన్తజఙ్గ్రథితైః పుషై#్ప రరాజ కృత శేఖరా. 7

ఉచ్చీయ స్వయముద్గ్రథ్య రమణ్యాహిత శేఖరమ్‌ | కృతకృత్య మివాత్మానం మేనే మన్మథవర్ధనమ్‌. 8

అన్యస్మి న్గహనే కుఞ్జే విశేషకుసుమాలతాః | కాచిదేవం రహోనీత్వా రమణన రిరంసునా. 9

కాన్తపన్దానితలతా కుసుమాని విచిన్వతీ | సర్వాభ్యః కాచి దాత్మానం మేనే సర్వగుణాధికామ్‌. 10

నూట పందొమ్మిదవ అధ్యాయము.

మద్రరాజ పురూరవస్తపశ్చర్య-గంధర్వాప్సరసల నానావిధ విహారముల వర్ణనము.

రమ్యమగు ఆ ఆశ్రముమున మద్రరాజు పురూరవనుడు ఏ పరివారమును ఏ సాధనములును లేక ఒంటరియై ఆహారమును కూడ విడిచి తపమాచరించుచుండ ఆ తాపులందే అప్సరసలు గంధర్వులతో క్రీడించుచుండెడివారు. అతడిది చూచుచునే ఉండియు వాటియందాసక్తి లేక పూవుల సేకరించి పెద్ద మాలను కూర్చి దానియందలి మొదటి అంశమును దేవదేపునకర్పించి మిగిలిన అల్ప ఖండమును గంధర్వులకు (దేవజాతివారు కదా అను ఆదరముతో) ఇచ్చెడివాడు.

దేవవేశ్యలు (అప్సరసలు) కూడ పుష్పోచ్చయము చేయుచు యథా సుఖముగా వివిధములుగ క్రీడించుచుండ అతడు అది చూచుచుండియు చూడనివాడుగనే ఉండెను.

క్రీడా వర్ణనము.

ఒకతె పూవులు కోయుచు ఏరుచునుండ ఆమెను తీగలు చుట్టుకొనెను. ఆమెను పాపము! సఖులను ప్రియుడును విడిచిపోయిరి. ఒకతె ముఖము కమల గంధము కలదగుటచే శ్వాసవాయువులచే ఆకర్షింపబడిన తుమ్మెదలు మొగముపై గుంపుగా క్రమ్మి కలవరపరచగా ప్రియుడును ఆమెను విడిచి దూరముగా పోయెను. ఒకతె కంటిలో మకరందము పడెను. ప్రియుడు తన శ్వాసవాయువులతో కంటియందలి ధూళిని పోగొట్టి బాధ పోగొట్టెను. ఒకతె పూవులు కోసి ఏరితెచ్చి ప్రియునకీయ ఆతడు వానితో కూర్చిన మాల తన శిరమున నలంకరించుకొని ప్రకాశించెను. ఒకతె తానై పూవులు కోసి ఏరి వానిని మాలగా కూర్చి ప్రియుని శిరమున నలంకరించగా నాతడు తను ధన్యునిగాను మన్మథోద్దీపనము చేయగల సుభగునిగాను భావించెను. ఒకతె తన ప్రియుడు తనతో ఏకాంతమున విహరింపగోరి అదిగో! ఆ దట్టమైన పూబొదయందు ఎక్కువ పూలుగల తీగలున్నవని అటకుపోయి పూలు సేకరించసాగెను. అపుడు ప్రియుడామెను విలాసముగా తీగలతో కట్టివేయగా ఆమె తాను మిగిలిన తన చెలులందరకంటె సర్వాధిక గుణములుగల సౌభాగ్యవతియని భావించి తృప్తియయ్యెను.

కాచి త్పశ్యతి భూపాలం నళినీషు పృథక్పృథక్‌ | క్రీడమానాపి గన్ధర్వై రసమా నామ కామినీ. 11

కాచి చ్చాతాడయత్కాన్త ముదకేన శుచిస్మితా | తాడ్యమానాథ కాన్తేన ప్రీతిం కాచి దుపాయ¸°. 12

కాన్తేన తాడయామాస జాతస్వేదా వరాఙ్గనా | అదృశ్యత వరారోహా శ్వాసనృత్య త్పయోధరా. 13

కాన్తానుతాడితోద్ఘృష్ట కేశపాశనిబన్ధనా ! కేశాకులముఖీ భాతి మధుపైరివ పద్మినీ. 14

స్వచక్షుస్సదృశైః పుషై#్ప స్సఞ్ఛన్నే నళఙనీవనే | భర్త్రా కాచిచ్చిరాత్ప్రాప్తా కాన్తేనాన్విష్య యత్నతః. 15

స్నాతా శీతాపదేశేన కాచిత్ప్రౌఢాఙ్గనా భృశమ్‌ | రమణాలిఙ్గనం చక్రే మనోభిలషితం చిరమ్‌. 16

జలార్ద్రవసనం సూక్ష్మ మఙ్గలీనం శుచిస్మితా | ధారయన్తీ జనం చక్రే కాచిత్తత్ర సమన్మథమ్‌. 17

కంఠమాల్యగుణౖః కాచి త్కా న్తేనాకృష్యతామ్భసి | త్రుట్యత్‌ స్రగ్దామపతితం రమణం ప్రాహస చ్చిరమ్‌. 18

కాచి ల్లగ్న సఖీదత్త జానుదేశే నఖాన్తరే | సమ్భ్రాన్తాక్రాన్తరమణా కాచిద్దృష్టా హతం చిరమ్‌. 19

కాచి ద్దృష్టీకృతాదిత్యా కేశనిస్తోయకారిణీ | శిలాతలగతా తత్ర దృష్టా కామార్తచక్షుషా. 20

కృతమాల్యం విలులితం సఙ్క్రాన్తం కుచకుఙ్కుమమ్‌ | రత్నకాఞ్చనకాన్తాభ మభవ త్తత్సరోదకమ్‌. 21

సుస్నాతదేవగన్ధర్వ దేవరామాగణనచ | పూజ్యమానంచ దదృశే తత్ర దేవం జనార్దనమ్‌. 22

సాటిలేని కాముకియగు ఒకతె గంధర్వులతో తాను క్రీడించుచుండియు ఆ సరస్సులయందు వేరు వేరుగ ప్రతి ఫలించుచున్న ఆరాజును చూచుచుండెను. నిర్మలమయిన చిరునవ్వు నిర్మల హృదయము కల ఒకతె నీటితో ప్రియుని కొట్టి మరల నాతడు తను నీటితో కొట్టగా సంతోషించెను. ఒకతె ప్రియుడు తను కొట్టుచుండ పోనిమ్మని ఊరకుండెను. అందుచే ఆమెకు ఒడలు చెమట పట్టుటయు నిట్టూర్పు వాయువులచే ఆమె వక్షోజములు నృత్యము చేయుటయు కానవచ్చెను. ప్రియుడు తను వెంటాడి కొట్టుటచే ఒకతెను కొప్పు శిథిలమైనందున మొగమంతయు వెంట్రుకలు క్రమ్మగా తుమ్మెదలు క్రమ్మిన పద్మలతవలె కానవచ్చెను. ఒకతె తన కన్నులను పోలు తామరలు కొలనినిండ ఉండుటచే ఒక ప్రియుడు వెదకి వెదకి చాల సేపటికామెను గుర్తించి దగ్గరకు వచ్చెను. ఒకానొక ప్రౌంఢాగన (సుఖానుభవములో నేర్పు మీరిన స్త్రీ) స్నానము చేయుటచే చలి వేయుచున్నదను నెపమున తనకు చిరాభిలషితమగు తన ప్రియుని ఆలింగనమును పొందగలిగెను. స్నానమాడినందున తాను ధరించిన సన్నని వలువ తన ఒడలికంటుకొనిపోయిన ఒకతె చూపఱకు కామభావమును ఉద్దీపింప జేసెను. ఒకతెను ప్రియుడు ఆమె కంఠమందలి హారములు పట్టిలాగెను. లాగుచుండగా ఆ దారమును తెగినందున ఆ ప్రియుడు ముందునకు మ్రొగ్గిపడగా ఆమె నవ్వెను. ఒకతె మోకాళ్ళపై ఆమెకు చేరువగానున్న చెలి తన గోళ్ళతో క్షతము చేయగా ఆమె తడబాటుతో పోయి తన ప్రియునిపై పడి అతనితో చాలసేపు మాటలాడుచు కనబడెను. ఒకతె సూర్యునికి ఎదురుగా నిలిచి వెంట్రుకలారబెట్టుకొనుచుండియు కామార్తములగు నేత్రములతో తన ప్రియుని చూచుచు శిలాతలముపై కూర్చుండియుండుట కానవచ్చెను. ఇట్లా సరస్సు నీరంతయు మాల్యములతో నిండెను. కెలికి వేయబడెను. స్తన కుంకుమముతో కలిసెను. ఇట్లది రత్నములు పొదిగిన బంగారు సొమ్ములవలె నయ్యెను.

ఇట్టి స్థితియందు కూడ చక్కగా స్నానమాడిన దేవస్త్రీలును దేవగంధర్వ స్త్రీలను దేవదేవుడగు జనార్దనుని పూజించుచుండుటకు ఆరాజు చూచెను.

క్వచిచ్చ దదృశే రాజా లతాగృహగతా స్త్ర్సియః | మణ్ణయన్త్య స్స్వగాత్రాణి కాన్తసంస్య స్తమానసాః. 23

కాచిదాదర్శనవ్యగ్రకరా దూతీముఖోద్గతమ్‌ | శృణ్వతీ కాన్తవచన మధికాన్త మథాబభౌ. 24

కాచి త్సత్వరితా దూత్యా భూషణానాం విపర్యయమ్‌ | కుర్వాణా నైవ బుబుధే మన్మథావిష్టచేతసా. 25

వాయునున్నాతిసురభి కుసుమాకరమణ్డితే | క్వచిత్పిబన్త్యో (న్తీ) దదృశే ప్రదేశే నీలశాడ్వలే. 26

పాయయామాస రమణం పయః కాచిద్వరాఙ్గనా | కాచిత్పపౌ వరారోహా కాన్తపాణిసమర్పితమ్‌. 27

కాచిత్స్వనేత్రచపల నీలోత్పలయుతం పయః | పీత్వా పప్రచ్ఛ రమణం క్వగతే తే మమోత్పలే. 28

త్వయైవ పీతౌ నూనంవై ఇత్యుక్తా రమణన సా | తథా విదిత్వా ముగ్ధత్వా ద్బభూవ వ్రీడితా చిరమ్‌. 29

కాచిత్కాన్తార్పితం సుభ్రూః కాన్తపీతావశేషితమ్‌ | సవిశేషరసాపానం పపౌ మన్మథవర్ధనమ్‌. 30

ఆపానగోష్ఠీషు తథా తాసాం స నరపుఙ్గవః | శుశ్రావ వివిధం గీతం తన్త్రీస్వరవిమిశ్రితమ్‌. 31

ప్రదోషసమయే తాశ్చ దేవదేవం జనార్దనమ్‌ | రాజ న్త్సదోపనృత్యన్తో నానావిద్య పురస్సరాః. 32

యామమాత్రే గతే రాత్రౌ వినిర్గత్య గుహాముఖాత్‌ | ఆవసన్తి యుతాః కాన్తై స్తత్తద్విరచితాం గుహామ్‌. 33

నానాగన్ధాన్వితతలాం నానాగన్ధసుగన్ధినీమ్‌ | నానావిచిత్రశయనాం కుసుమోత్కరమణ్డితామ్‌. 34

ఏవ మప్సరసాం పశ్య న్క్రీడితాని స వర్వతే | తప స్తేపే మహారాజః కేశవార్పితమానసః. 35

ఒకానొకచోట కొందరు (దేవ) స్త్రీలు తమ ప్రియులయందు తమ మనస్సులు లెస్సగా నిలిపి లతాగృహ గతలయి తమ గాత్రముల నలంకరించుకొనుచుండుట రాజు కాంచెను. ఒకతె చేత అద్దముంచుకొని చూచుకొనుచు తన దూతి వచించు తన ప్రియుని వచనములు వినుచు మిగుల అందముతో ఒప్పెను. కామ భావ పరవశయగు ఒకతె తను దూతి త్వరపెట్టుచుండ అందుచే జరుపుచున్న తన అలంకరణముతో భూషణముల తారుమారును గురుతింపక పోయెను. ఒకానొకచోట వాయు ప్రేరణచే కదలు అతి సుగంధి పుష్పయుతమగు నల్లని పచ్చికబయట ఆయా పానీయముల త్రాపు స్త్రీలాతనిని కనవచ్చిరి. ఒక ఉత్తమాంగన తన ప్రియునిచే పాలు త్రావించుచుండెను. మరియొక తన ప్రియుడందించు పాలు త్రావుచుండెను. ఒకతె తన కన్నులవలె చంచలములగు నల్ల కలువ రెక్కలతో కూడి ఉన్న పాలు త్రావి నా ఆ కలువపూలెక్కడకు పోయెనని యడిగెను. నీవే అవి త్రావియుండవచ్చునని ప్రియుడనగా అపుడది గుర్తించి తానంతటి ఆమాయికురాలయినందులకు చాలసేపు సిగ్గుపడియుండెను. విశిష్టములగు రుచులు గల రసములతో మిశ్రితమగు కామవర్దక పానీయమును తన ప్రియుడు త్రావి పిదప తనకందీయగా ఒకతె తానది త్రావెను. ఇట్లే జరుగుచుండిన ఆపానగోష్ఠులందు తంత్రీవాద్యముల స్వరముతో విమిశ్రితమగు వివిధ గీతముల నాదేవస్త్రీలు పాడుచుండ రాజది వినెను. వారు అనుదినమును ప్రదోష సమయములందు అట్లే దేవదేవుడగు జనార్దనుని సన్నిధియందు నానావాద్య సహితముగా నృత్యము చేయుచుందురు. జామురాత్రి గడచిన తరువాత గుహా ముఖము నుండి వెలికివచ్చి తమకు తమకు ఏర్పరచబడిన ఆయా గుహలను తమ ప్రియులతో కూడి ఆవాసముగా చేసికొందురు. ఆ గుహలు నానాగంధాన్వితతలములయి సుగంధముల నీనుచుండును. నానావిధములగు పడకలు కుసుమాలంకరణములు వానియందుండును. ఈ విధముగ ఆ పర్వతమున అప్సరసలు చేయు ఆయా విహరణములను చూచుచుండి (యు వానియందాసక్తుడు కాక) మహారాజు కేశవార్పితమానసుడై తపమాచరించెను.

త మూచు ర్నృపతిం గత్వా గన్ధర్వాప్సరసాం గణాః | రాజ న్త్సర్గోపమం దేశ మిమం ప్రాప్తోస్యరిన్దమ. 36

వయంహి తే ప్రదాస్యామో మనసః కాంక్షితా స్వరా& | తానాదాయ గృహం గచ్ఛ తిష్ఠేహ యదివా పునః.

పురూరవాః : అమోఘదర్శనా స్సర్వా భవన్త శ్చామితాజసః | వరం వితరతా దేత త్ప్రసాదం మధుసూదనః. 38

ఏవమస్త్వి త్యథోక్తసై#్త స్సతు రాజా పురూరవాః | తత్రోవాస సుఖీ మాసం పూజయానో జనార్దనమ్‌. 39

ప్రియఏవ సదైవాసీ ద్గన్ధర్వాప్సరసాం నృపః | తుతుషు స్సజ్జనా రాజ్ఞ స్తస్యాలౌల్యేన కర్మణా. 40

మాఘస్య మధ్యే స నృపః ప్రవిష్ట స్తమాశ్రమం రత్నసహస్ర చిత్రమ్‌ | ఉవాస మాసం ప్రియకృత్సమగ్రం శీతోష్ణభేదై ర్నృప ఫాల్గునస్య. 41

ఫాల్గునామలపక్షాన్తే రాజా స్వప్నే పురూరవాః | తసై#్యవ దేవదేవస్య శుశ్రావ గదితం శుభమ్‌. 42

రాత్ర్యా మస్యా మతీతాయా మత్రిణా త్వం సమేష్యసి | తేస రాజ న్త్సమాగమ్య కృతకృత్యో భవిష్యసి. 43

స్వప్నమేవం స రాజర్షి ర్దృష్ట్వా దేవేన్ద్రవిక్రమః | ప్రత్యూషకాలే విధివ త్న్నాతః ప్రాయో జితేన్ద్రియః. 44

కృతకృత్యోవసత్కామ మర్చయిత్వా జనార్దనమ్‌ | తత్రాన్తరేత్రిరాగత్య తస్థౌ చాత్ర శ్రియా జ్వల&.

స్వప్నంతు దేవస్య తథా న్యవేదయత ధార్మికః | తత శ్శుశ్రావ వచనం దేవతానాం సమీరితమ్‌. 46

ఏవమేవ మహీపాల నాత్ర కార్యా విచారణా | ఏవం ప్రసాదం సమ్ప్రాప్తో దేవదేవా జ్జనార్దనాత్‌. 47

కృతదేవార్చనో రాజా తథా హుతహుతాశనః | సర్వా న్కామా నవాపాశు వరదానేన కేశవాత్‌. 48

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవసో వరలాభో నామైకోన వింశత్యుత్తర శతతమోధ్యాయః.

ఒకప్పుడు ఆ గంధర్వాప్సరోగణములు రాజుకడకు పోయి 'అరిందమా! నీవు వచ్చిన ఇది స్వర్గతుల్య దేశము. మేము నీకు మనఃకాంక్షిత వరముల నిత్తుము. అది గ్రహించిన తరువాత నీవిటనే యున్ననుసరే. ఇంటికి వెడలిననుసరే; అనిరి. మద్రరాజు పురూరవసుడును ''అమితమగు ఓజస్సుగల మీ దర్శనము వ్యర్థముకాదు. మధు సూదనుడు నన్ననుగ్రహించునట్లు వరమిండు.'' అనగా వారు 'తథాస్తు' అనిరి. ఆతడును ఒక మాసము కాలము జనార్దనుని పూచించుచు అటనే యుండెను. ఆతనికి లోలత్వము లేనందులకు ఆ గంధర్వాప్సరసలు సంతసించిరి. వారికతడు ప్రీతిపాత్రుడయ్యెను. రత్న సహస్ర చిత్రమగు ఆయాశ్రమమును ఆరాజు మాఘమాస మధ్యమున ప్రవేశించెను. ఫాల్గున మాసవు శీతోష్ణ భేదములతో ప్రీతిననుభవించుచు ఒక మాసము గడపెను. ఫాల్గున కృష్ణ వక్షాంతమున రాజగు పురూరవునకు స్వప్నమున దేవదేవుని శుభవచనము ''రాజా ! ఈ రాత్రి గడువగనే నీకు అత్రిమునితో సమాగమమగును. అందుచే నీవు కృతకృత్యుడవగుదువు.'' అనుచు వినబడెను. ఇంద్ర విక్రముడగు ఆ రాజర్షి ఇట్లు స్వప్నము కాంచి పిదప ప్రత్యూష కాలమున స్నానముచేసి నియతేంద్రియుడై కృతకృత్యుడనైతినను భావముతో జనార్దను నర్చించియుండెను. అంతలోనే కాంతితో జ్వలించుచు అత్రిముని అటకు వచ్చెను. ధార్మికుడగు ఆరాజు తన స్వప్న దర్శనము నామునికి తెలిపెను. రాజా! ఇది ఇట్లేయగును. ఇందు సంశయింపవలసిన పనిలేదు. అని అత్రియ దేవతలును పలికిన పలుకులు అతనికి వినవచ్చెను. ఇట్లు దేవదేవుడగు జనార్దనుని వలన అనుగ్రహముంది రాజు దేవతార్చనమును అగ్నిహోత్రమును జరిపి సర్వకామ పూర్తినొందెను.

(ఉత్తర భారమతమున కృష్ణపక్షముతో మాసారంభము లెక్కింతురు. రాజు మాఘ మధ్యమున అనగా కృష్ణ పక్షము ముగియగానే శుక్లపక్షారంభమున అత్యాశ్రమమునకు పోయెను. ఆ పక్షమంతయును ఫాల్గున కృష్ణపక్షమంతయును కలిసి సమగ్రమగు ఒక మాసమగును.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున మద్రరాజ పురూరవసుని వరప్రాప్తియను నూట పందొమ్మిదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters