Sri Matsya Mahapuranam-1    Chapters   

పఞ్చాదశోత్తరశతతమో7ధ్యాయః.

ఇరావతీవర్ణనమ్‌.

సూతః: 

స దదర్శ నదీం రమ్యాం పుణ్యాం హైమవతీం శుభామ్‌| గన్ధర్వగణసఙ్కీర్ణాం నిత్యం శక్రనిషేవితామ్‌. 1

సురేభమదసంసిక్తవరగన్ధసమన్వితామ్‌| మధ్యేన శక్రచాపాభాం తస్మిస్వహతి సర్వదా. 2

తపస్విశరణోపేతాం మహాబ్రాహ్మణసేవితామ్‌| దదర్శ తవనీయాభాం మహారాజః పురూరవాః. 3

అచ్ఛాచ్ఛనుతపానీయాం య¸° రాజా పురూరవాః పాణ్డుహంసావళిచ్ఛత్త్రాం కాశచామరవీజితామ్‌. 4

స్వాభిషేకార్థ మిచ్ఛన్తీం పశ్యన్ప్రీతిం పరాం య¸°| పుణ్యాం సుశీతలాం హృద్యాం మననః ప్రీతివర్ణనీమ్‌.

క్షయవృద్ధియుతాం సౌమ్యాం సోమూర్తిమివాపరామ్‌| సుశీతశీఘ్రపానీయాం ద్విజసఙ్ఘనిషేవితామ్‌. 6

సుతాం హిమవత శ్శ్రేష్ఠాం చంచద్వీచివిరాజితామ్‌| అమృతస్వాదుసలిలాం సారసై రుపవోభితామ్‌. 7

స్వర్గారోహణనిశ్శ్రేణీం సర్వకల్పషనాశినీమ్‌|అగ్ర్యాం సముద్రమహిషీం మహర్షిగణసేవితామ్‌ 8

సర్వలోకస్య చౌత్సుక్యకారిణీం సుమనోహరామ్‌ | గోకులాకులతీరాంచ రమ్యాం శైవాలవర్జితామ్‌. 9

హంససారససఙ్ఘుష్టాం జలజై రుపశోభితామ్‌ | ఆవర్తనాభిగమ్భీరాం ద్వీపోరుజఘనస్థలీమ్‌. 10

నీలనీరజనేత్రాన్తా ముత్ఫుల్లకమలాననామ్‌ | హిమాభ##పేనవసనాం చక్రవాకస్తనీం శుభామ్‌ 11

బలాకపఙ్త్కిరశనాం చలన్మత్స్యావళఙభ్రువమ్‌| స్వజలోద్భవమాతఙ్గరమ్యకుమ్భపయోదరామ్‌. 12

హంసనూపురసంయుక్తాం మృణాళవలయావళిమ్‌|

నూట పదునైదవ అధ్యాయము.

ఐరావతీనది(రావీనది)వర్ణనము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ మద్ర దేశాధిపతియగు పురూరవనుడు చూచిన ఇరావతీ నది చూచుటకు మనోరమముగ నుండునది మాత్రమే కాక పుణ్యదము కూడ ఐయుండెను. హైమవతి-హిమవంతము నుండి పుట్టినది-పార్వతి-కావున శుభ స్వరూప. జలక్రీడాది విహారములకై చేరిన గంధ్వర్వులు అందెల్లపుడు నిండి యుందురు. ఇంద్రుడందు విహరించుచు ఆనందించుచు అనదిని నిషేవించుచుండును. దేవరాజ గజమగు ఐరావతమందు క్రీడించుచుండుటచే నీట కలిసిన మదముతో పదనైనవాసనలు కలిగియుండుటయే కాక ఆమదము నీట కలిసి ప్రవహించు ఆ నదీప్రవా మధ్యము ఇంద్ర దనుర్వర్ణము లీనుచుండును. దాని తీర పరిసరములందు తపసులు ఆశ్రముల నిర్మించు కొని తపమాచరించుచుందురు. మహా బ్రాహ్మణులు తమ స్నానానుష్ఠానాదికమునకై ఆనదిని సేవించుచుందురు. ఇట్టి ఆనది బంగారు కాన్తులు వెదజల్లుచుండును. మహారాజా పురూరవుడానదినిట్లు దూరమునుండి చూచుచు సమీపించిని కొలది అనది నీరు మిగుల తేటయై కానవచ్చెను. అతడానదిని చేరెను. తెల్లని హంసవావశులు అను శ్వేతచ్ఛత్త్రము పట్టుచు తన తీరములందలి రెల్లు అనెడి వింజామరలు కదల్చుచుండుటచే ఆనది తనయందా రాజును రాజలాంఛనముల-మర్యాదలతో స్నానామాడింపగోరుచున్నదో యనునట్లుండట చూచి యాతడు మిగుల ప్రీతిననుభవించెను. ఏలయన ఆనది (తనరాఙ్జివలె) పుణ్యమును సంపాదించి ఇచ్చునది సుశీలవతి-హృదయమునకు హాయి గొల్పునది-మనస్సునకు ప్రీతిని వర్థిల్ల జేయునది. రెండవ చంద్రమూర్తియే యనునట్లు( ఆయా ఋతువులందు) క్షయవృద్ధులు కలదియైనను సౌమ్య రూప స్వభావములతో నొప్పరుచుండును. మిగుల చల్లనై వేగమున ప్రవహించుఆనది నీటిని ద్విజ (పక్షి-బ్రాహ్మణాది తైవర్ణకు) సంఘములు నిషేవించు (వినియోగించుకొని ఆనందించు)చుండును. ఆమె హిమవంతుని మేలయిన బిడ్డ; చక్కగా ఒప్పారు అలలతోను అమృతమువలె రుచిగల నీటితోను బెగ్గురు(లనెడు జలపక్షు)లతోను ఆనది ఉపశోభిల్లుచు సర్వకల్మష నాశనియై స్వర్గము నారోహించువారికి నిచ్చెనయో యనదగియుండెను. ఆమె సముద్రుని భార్యలలో అగ్రగణ్య; ఆమెను ఎల్లప్పుడును మహర్షి గణమాశ్రయించి యుండును. మిగుల మనోహర యగుటచే ఆనదిని సమీపించి సేవించి యుపయోగించుకొని ఇహపర సుఖానందముల నెపుడందుదుమాయని ఎల్లజనులు ఉత్సకులగుచుందురు. రమ్యమగు ఆ నదిలో నాచు ఉండదు. ఆనది తీరమున గోవులమందలు తరచై యుండును. ఆమెయందెపుడును హంస సారసములు ధ్వని చేయుచుండును; ప్రవాహము జలజములతో ఉపశోభిల్లుచుండును. సుడులే గంభీర నాభియు ద్వీపములే విశాలజఘనస్థలియు నీలోత్పలములును పద్మములును సుందర నేత్రములును వికసిత కమలములే మొగమును మంచువలె మెరయ నురుగే సూక్ష్మవస్త్రమును శోభిల్లు చక్రవాకపక్షులే స్తనములును కొంగల బారులు దంతపంక్తులును చలన్మత్స్యావశులే కనుబొమలును స్వజలమున క్రీడించి లేచుచుండు గజముల రమ్య కుంభస్థలములే స్తనములును హంసలే కాలియందెలును తామరకాడలే కరకంకణములును కాగా ఆ ఇరావతీ(రావీ) నది సుందరియగు యువతిగా తోచుచుండెను.

తస్యాం రూపమదోన్మత్తా గన్ధర్వానుగతా స్తథా. 13

మధ్యాహ్నసమయే రాజ న్క్రీడన్త్యప్సరసాం గణాః | తామప్సరోవినిర్ముక్తాం వహన్తీం కుసుమావళిమ్‌. 14

స్వతీరద్రుమనమ్భూతనానాగన్ధసుగన్ధినీమ్‌| తరఙ్గశతసఙ్క్రాస్తసూర్యమణ్డలదుర్ధృశామ్‌. 15

సురేభజనితాఘాతవప్రద్వయవిభూషితామ్‌|శ##క్రేణ జుష్టసలిలాం దేవస్త్రీకుచచన్దనైః. 16

సంయుతం సలిలం యస్యాం షట్పదై రుపసేవితమ్‌|తస్యా స్తీరభవా వృక్షా స్సుగన్ధికుసుమాన్వితాః. 17

మరన్దాకృష్ణసంభ్రాస్త భ్రమర స్వనితాకులాః| తస్యాసీ%్‌తరే రతిం యాన్తి సదా కామవశం గతాః. 18

తపోధనా స్సమునయ స్సహదేవాస్సహాప్సరాః| రతిం లభ##న్తే(యత్రు) సిక్తాఙ్గా దేవేభ్యశ ప్రీతమానసాః. 19

స్త్రియ ఆనాకిబహుళాః పద్మేన్దుప్రతిమాననాః| యా బిభర్తి సదా తోయం దేవసఙ్ఘై ర్ని షేవితమ్‌.

« విలీనం మృగబృన్దైశ్చ వ్యాధసఙ్ఘైరపీడితమ్‌| సతామరసపానీయం సతారగగనామలమ్‌. 21

తదా పశ్య న్య¸° రాజా సతా మీప్సితకర్మదామ్‌| యాచ తీరభ##వైకాశైః పుల్లైశ్చన్ద్రాంశుసన్నిభైః 22

రాజతే విధృతాకాశై రన్యై స్తీరమహాద్రుమైః| యా సదా వివిధైర్విపై#్ర ర్దేవైశ్చాపి నిష్యేవ్యతే. 23

యాచ సదా సకలాఘవినాశం భక్తజనస్య కరోత్యచిరేణ|

యా7నుగతా సరితాం హి కదమ్బై ర్యా7నుగతా సతతం హిమనీరైః. 24

యాచ సుతానివ పాతి మనుష్యా న్యాచ యుతా సతతం హి మృగౌఘైః|

యాచ సురాసురసిద్ధమహర్షీ న్సాతి సదా మిహికోదకమిశ్రా. 25

యుక్తాచ కేసరిగణౖః కరిబృన్దయానా సన్తానయుక్తసలిలా7పి సువర్ణవర్ణా|

సూర్యాంశుతాపపరివృద్ధజలా హిమాంశుతుల్యామ్బుకాచ సహసా దదృశే నృపేణ. 26

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవశ్చరితే ఇరావతీనదీవర్ణనం నామ

పఞ్చదశోత్తరశతతమో7ధ్యాయః.

అప్సరసలు ధరించి జలక్రీడా కాలమున విడిచిన పూలమాలలును రాసులును నదియందు నీటివెంట కొట్టుకొని పోవుచుండును. తన యొడ్డున మొలచిన వృక్షముల సుగంధములతో ఆనది గుబాళించుచుండును. నూరుల కొలది అలల యందు ప్రతిఫలనముచే సంక్రమించిన రవి బింబములు-కన్నుల నుపహతమొనర్చుచుండ ఆనది తేరిపార చూడరాకుండును. దేవగజములు తమ దంతములతో ఒడ్డులయందు దెబ్బలు వ్రేసిన గుర్తు లలంకారములయి యుండెను. దేవేంద్రుడా నది నీటిని ననుభవించుచుండును; రూపమదోన్మత్తలగు అప్సరసలు గుంపులై రూపమదోన్మత్తులగు గంధర్వులు తమ్మనుసరింప మధ్యాహ్న సమయములందా నదియందు జలవిహారము లొనర్చుచుందురు. ఇట్టి జలక్రీడా సక్తలగు దేవస్త్రీల హృదయములందలి చందనములతో మిశ్రితములగు ఆ ఏటి నీటిని తేటులు ఉపసేవించుచుండును. సుగంధి కుసుమాన్వితములగు తత్తీర సంజాత వృక్షములు ఆ పుష్పముల మకరందపు ఆకర్షణమునకు వశవర్తులై సంబరమున గుమియై తిరుగు తుమ్మెదల రొదలతో నిండియుండును. తపోధనులే కాదు. మునులే కాదు- దేవతలే కాదు- అచ్చరలే కాదు- ఎల్లవారును ఆనది యెడ్డున శృంగార భావవర్తులై ఆనందమందుచుందురు. స్వర్గవాసులగు దేవతలు మొదలగువారితో దట్టమైయుండి పద్మములను చంద్రుని పోలు మోములుకల దేవస్త్రీలు తన్నదీజలమున తడిసిన శరీరములు కలవారును దేవతల (తోడి క్రీడల) వలన ప్రీతినొందిన మానసములు కలవారునై ఆనందమనుభవించుచుందురు. ఆ నదీజలమును సదా దేవతలనుభవింతురు; మృగబృందములందు వ్యాధ సంఘముల పీడలనుండి తప్పించుకొనవచ్చి మునుకలతో దాగియుండును. తామరలతో నొప్పారు. ఆ ఏటి నీరు తారలతోడి అమలాకాశమువలె అందగించుచుండును. ఆనది తన తీరమున పూచి వెలయు చంద్రకిరణములపోలు ఱల్లు పూలతోను గగనమునే తమ శాఖాగ్రములతో నిలిపి పట్టుకొను మహాధ్రుమములతోను రాజిల్లుచుండును. వివిధ దేవ భూదేవు లానది నెల్లవేళల నిషేవించుచుందురు. భక్తజనుల కచిర కాలముననే సకల కలుష నాశము సేయునది యానది ఎన్నియో ఏళ్ళును హిమజలములును ఆ ఏట కలిసిపోవుచుండును. మంచుతో చల్లనైన ఆనది మానవులను మృగ సంఘములను సిద్ధ మహర్షి సంఘములను కూడ ఆయా ప్రకారముల రక్షించుచుండును.

ఆ రావీనది సింగణ యుక్తము-అయియునుకరి బృందయాన(ఏనుగుల మందలచే అనుసరింపబడునది ఏనుగువలె ఠీవిగా నడచునది;) ఆనది నీరు సంతాన సహితము అయియు సువర్ణ ప్రకాశము కలది.(ఎడతెగని ప్రవాహముతో కూడినది యనియు పచ్చని కల్పవృక్షములతో కూడినది యనియు రెండర్థములు) సూర్యకిరణ తాపముచే మిగుల వృద్ధి నొందుచుండియు ఆనది నీరు చంద్రునివలె చల్లనిది. ఇట్టి ఇరావతీ నదిని ఆ మద్ర దేశాధిపతి పురూరవనుడు కాంచెను.

(ఈ చివర శ్లోకమున విరోధాభాసాలంకారము; ఎట్లన ఒకేచోట సింహములు గజములు ఉండుట విరుద్ధము. సింహములు జలము త్రాగుటకు వచ్చును-నది నడక ఏనుగునడకవలె నుండును. అని విరోధ పరిహారము. పచ్చని ఆకులు కల చెట్ల కాంతితో కూడియు బంగారు కాంతితో నుండుట విరుద్ధము బంగారు కాంతిగల నిరంతర ప్రవాహముండెననుటతో విరోధ పరిహారము సూర్యకిరణములతో క్రాగిన నీరు చంద్రునివలె చల్లగా నుండుట విరుద్ధము-సూర్యుని వేడిమికి కరగినను మంచునీరు నదియందు చల్లనై ప్రవహించుననుటతో విరోధ పరిహారము.)

ఇదిశ్రీమత్స్యమహాపురాణమున సప్త ద్వీపాంతర్గత జంబూ ద్వీపాంతర్గత

భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున బుధపుత్త్ర పురూరవశ్చరితమున మద్రరాజు పురూరవుడు ఇరావతిని చూచుటయను నూట పదునైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters