Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయోదశోత్తర శతతమో 7ధ్యాయః.

భారతవర్షవర్ణనమ్‌.

ఋషయః :

 యదిదం భారతం వర్షం యస్మి న్త్స్వాయమ్భువాదయః | చతుర్దశైతే మనవః ప్రజా స్తత్‌ ససృఞిరే. 1

ఏత ద్వేదితు మిచ్ఛామి స్త్వతో నిగదసత్తమ | ఏతచ్ఛ్రత్వా ఋషీణాంతు ప్రాబ్రవీ ద్రోమహర్షణిః. 2

పౌరాణిక స్తథా సూతో ఋషీణాం భావితాత్మనామ్‌ | బుద్ద్యా విచార్య బహుధా విమృశ్యచ పునః పునః. 3

తద్వ్యాహృతేతు సమ్బూయ స్స ఉవాచ ముదాన్వితః | అద్య వః కథయిష్యామి వర్షే 7స్మిన్భారతే ప్రజాః. 4

ఇదంతు మధ్యమ వర్షం శుభాశుభఫలోదయమ్‌ |

దక్షిణంతు హిమాహ్వస్య సముద్రస్యాపిచోత్తరమ్‌. 5

వర్షం తద్భారతం నామ యత్రేమా భారతాః ప్రజాః | భరణాత్తు ప్రజానాం వై నను భారత ముచ్యతే. 6

నిరుక్తవచనాచ్చైవ వర్షం తద్భూరతం స్మృతం | తత్రస్వర్గశ్చమోక్షశ్చ మధ్యమశ్చ ఇతి స్మృతః. 7

నఖల్వన్యత్ర మర్త్యానాం భూమిః కర్మవిధౌ స్మృతా | భారతస్యాస్య వర్షస్య నవ భేదాన్నిబోధత. 8

ఇన్ద్రద్వీపః కశేరుశ్చ తామ్రపర్ణో గభస్తిమా& | నాగద్వీప స్తథా సౌమ్యో గన్దర్వ స్తథ వారణః.

నూట పదుమూడవ అధ్యాయము.

భారత వర్షవర్ణనము.

ఋషులు సూతునిట్లడిగిరి: పరమ్మాత్మనుండి జనించిన స్వాయంభువాది చతుర్దశ మనువులను ప్రజలను సృజించుటకు ఆశ్రయమగు భారతవర్ష స్వరూపము తాము ప్రతిపాదించగా వినవలెనని మాకు కుతుహలమున్నది. అనరౌమ హర్షణుడగు సూత పౌరాణికుడు భావితాత్ములగు ఋషుల వచనము విని తన బుద్ధితో బహు విధముల విచారణము చేసి మరల మరల విమర్శము చేసికొని వారందరును కూడి అడిగిన విషయమునందు సంతోషము కలిగి ఇట్లు పలికెను: మీకు ఇకమీదట భారత వర్షమునందలి ప్రజల విషయమును తెలిపెదను; స్వర్గ పాతాళములకు నడుమ నుండుటచే మధ్యమ మనబడుచున్న ఈ భూలోకమందును ఈ భారత వర్షము మానవులు చేసిన కర్మలననుసరించి శుభాశుభఫలోదయమునకు హేతువయినది. దక్షిణ మహా సముద్రమునకు ఉత్తరమునను హిమాలయమునకు దక్షిమమునను కల ఈ దేశ##మే భారత వర్షమనునది. దీనియందలి ప్రజలకు భారతులని వ్యవహారము. ప్రజలను భరించు-పోషించు-నదికావుననే దీనికి భారతము అని పేరు. ఈ దేశమునందలివారికి మాత్రమే తాము చేసిన తర్మల ఫలాను సారము స్వర్గము కలుగును. సాధనానుసారము మోక్షము గలుగును. దీనికే మధ్యమ (లోక) మను వ్యవహారము సార్థకము. ఈ భూమియందు కాక మరి ఎచ్చటివారికిని (వైదిక స్మార్త పౌరాణిక) కర్మ విధులు ఇచట వలె విధింబడియుండలేదు. ఈ భారత వర్షము మరల నవద్వీప(ఖండ)ములుగా విభక్తమయి ఉన్నది. అవి తెలిపెదను వినుడు. 1.

ఇంద్రద్వీపము 2. కశేరు ద్వీపము-3. తామ్రపర్ణ ద్వీపము 4. గభస్తి (మాన్‌) మత్‌ ద్వీపము 5. నాగ ద్వీపము 6. సౌమ్య ద్వీపము 7. గంధర్వ ద్వీపము 8. వారుణ

ద్వీపము 9. భారత ద్వీపము (వీనినే ఆయా ఖండములనియు ననవచ్చును.

దీనిలో భరత ఖండము సమగ్ర భారతదేశమనియు మిగిలిన ఎనిమిదియు సింహళము బర్మా తూర్పు ఇండియా దీవులు మలయా అనియు గ్రహింపవలయును.)

*అయంతు నవమ స్తేషాం ద్వీప స్సాగరసంవృతః | యోజనానాం సహస్రంతు

ద్వీపోయం దక్షిణోత్తరః.

ఆయత స్త్వాకుమారీభ్యో గఙ్గాయాః ప్రభవో7 వధిః | తిర్యగూర్ద్వంతు విస్తీర్ణో సహస్రాణి నవైవతు. 11

ద్వీపో హ్యుపనివిష్టో 7యం వ్లుెచ్ఛై రన్తేషు సర్వశః | యవనాశ్చ కిరాతాశ్చ తథాన్తే పూర్వపశ్చిమే. 12

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః | ఇజాయుధవణిజ్యాభి ర్వర్తయన్తో వ్యవస్థితాః.

తేషాం సంవ్యవహారోయం వర్తతేచ పరస్పరమ్‌ | ధర్మార్థకామసంయుక్తో వర్ణానాంచ స్వకర్మసు. 14

సఙ్కల్పపచ్యమానాత్తు ఆశ్రమాణాం యథావిధి| ఇహస్వర్గావర్గార్థం ప్రవృత్తిరితి

మానుషీ. 15

____________________________________________

*భారతో

యస్త్వయం నవమోద్వీప స్తిర్యగ్గ్రామః ప్రకీర్తితః | యఏనం జనయేత్కృత్స్నం ససమ్రాడితి కీర్త్యతే. 16

అయంలోకస్తు వైసమ్రా డన్తరిక్షం విరాట్స్మృతః | స్వరాడసౌ స్మృతోలోకః పునర్వక్ష్యామి విస్తరమ్‌. 17

ఈ భారతవర్షము మూడు వైపులందు సముద్రముచే చుట్టబడియున్నది. దీని దక్షిణోత్తర దైర్ఘ్యము వేయి యోజనములు; ఈ వర్షపు దక్షిణావధి కుమారీ స్థానము-ఉత్తరావధి-గంగా నదీ జన్మస్థానము. పొడవు వెడల్పులు పరస్పరము

గుణించగా అగు వైశాల్యము తొమ్మిదివేల చదరపు యోజనములు. దేశపు పూర్వ పశ్చిమోత్తర దిశల అంతములయందు అంతటను వ్లుెచ్చులగు యవనులును కిరాతులును ఉపనివేశముల నేర్పరచుకొని వసించుచున్నారు. ఇక నడుమయందు బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్య శూద్ర వర్ణములవారు ఆయా తావులయందు యజనము ఆయుధవృత్తి వాణిజ్యము జీవనోపాధులుగా వర్తిల్లుచు వ్యవహరించుచు నివసించుచున్నారు. వారియందు పరస్పర భేదముండని ఏకరూప సమాన వ్యవహారమున కలదు. అయా వర్ణములకును ఆశ్రమములకును విహితములగు

కర్మలననుష్ఠించుచు ధర్మార్థ కామ మోక్షములపై సంకల్ప పూర్వకముగా యత్నము చేయుటలో విరందర వ్యవహారమును సమముగా నుండును. ఇచటి మానవుల

ప్రవృత్తియంతయు ఇహలోక జీవనము విషయమున గాక పరమున స్వర్గమునో అపవర్గము(మోక్షము)నో సాధించుటకు అభిముఖమైయుండును. ఈ చెప్పిన తొమ్మిదిం టిలో తోమ్మిదవదియగు భారతద్వీప (భరతఖండ)మునకు తిర్యగ్గ్రామని (తూర్పు పడమరలుగా వ్యాపించిన వీథి నిర్మాణముగల గ్రామములు గలదియని) వ్యవహారము కలదు. ఈ లోకమునంతటిని సృష్టించు సృష్టకర్తకు సమ్రాట్‌ అని వ్యవహారము; ఇంతియకాక-భూర్‌-భువర్‌-సువర్‌ అను మూడు వ్యాహృతులలో మొదటిదానికి

అర్థమగు ఈ మధ్యమ లోకమునకు సమ్రాట్‌ అనియు భువర్‌ అను వ్యాహృతికర్థమగు అంతరిక్ష లోకమునకు విరాట్‌ అనియు సువర్‌ అను వ్యాహృతికర్థమగు ద్యులోకమునకు స్వరాట్‌ అనియు వ్యవహారము. వీనిలో మొదటిదియు 'సమ్రాట్‌' అనబడునదియునగు ఈ లోకపు-భరత వర్షపు- విస్తరమున ఇంకను చెప్పెదను.

సప్త(నవ)మేస్మి న్మహావర్షే విస్తృతాః కులపర్వతాః | మహేన్ద్రో మలయస్సహ్య శ్శుక్తిమా నృక్షవానపి. 18

విన్ధ్యశ్చ పారియాత్రశ్చ సపై#్తతే కులపర్వతాః | తేషాం సహస్రశశ్చాన్యే పర్వతాస్తు సమీపతః. 19

అభిజ్ఞాతాః పర్వవన్తో విపులా శ్చిత్రసానవః | అన్యే తేభ్యః ప్రతిజ్ఞాతా హ్రస్వా స్స్వల్పోపజీవినః. 20

తైర్విమిశ్రా జనపదా ఆర్యా వ్లుెచ్ఛాశ్చ సర్వతః | పిబన్తి బహుళా నద్యో గఙ్గాం సిన్ధుం సరస్వతీమ్‌. 21

గఙ్గాదినదీవర్ణనమ్‌

శతద్రూం చన్ద్రభాగాంచ యమునాం సరయూమపి | శరావతీం వితస్తాంచ విపాపాం దేవికాంకుహూమ్‌. 22

గోమతీం ధూతపాపాంచ బాహుదాంచ దృషద్వతీమ్‌ | కౌశికీంచ తృతీయాంతు

నిశ్చారీం గణ్డకీంతథా . 23

బహులోహిత్య ఇత్యేతా హిమవత్పాద నిస్సృతాః | వేదస్మృతిం వేత్రవతీం వితస్తాం సిన్ధుమేవచ. 24

పర్ణాసాం నర్మాదాంచైవ కౌబేరీం మహతీంతాథా | వారాం చన్ద్రవతీం యూపాం విదుషాం వేణుజీవికామ్‌. 25

శిప్రామవన్తీం కౌన్తీంచ పారియాత్రా న్త నిస్సృతాః | శోణం మహానదంచైవ నన్దినీం సుకృశాం కృశామ్‌. 26

మన్దాకినీం దేవపర్ణా చిత్రాకూటాం తథైవచ | తమసాం పిప్పలాం శోణాం కరతోయాం తథామ్బికామ్‌. 27

చిత్రోపలాం విశాలాంచ మధురాం బహువాహినమ్‌ | ముక్తిం మన్దాకినీం లజ్జాం

మకుటోద్భేదికామపి. 28

ఋక్షవతః ప్రసూతాస్తా నద్యో7 మలజలశ్శుభాః | తాపీంపయోష్ణీం నిర్విన్దాం శీ(క్షి) ప్రాంచ వృషభాం నదీమ్‌.

వేణీం వైతరణీంచైవ విశ్వమాలాం కుముద్వతీయమ్‌ | తోయాంచైవ మహాగౌరీం

దుర్గమాంతు శిలాంతథా. 30

విన్ద్యపాదప్రసూతాస్తా స్సర్వా శ్శీతజలా శ్శుభాః | గోదావరీ భీమరథీ కృష్ణవేణీచ వఞ్జుళా. 31

తుఙ్గభద్రా సుప్రయోగా బాహ్యా కావేరిరేవచ | దక్షిణాపథనద్యస్తా స్సహ్యపాదా

ద్వినిస్సృతాః. 32

కృతామాలా తామ్రపర్ణీ పుష్పజా హ్యుత్పలాఅపి | మలయప్రసృతా నద్య స్సర్వా శ్శీతజలశ్శుభాః. 33

విషమా సర్పకుల్యాచ ఇక్షుజా త్రిదివాచలా | తామ్రపర్ణీ తథామూలీ శరారీ విమలాతథా. 34

మహేన్ద్రతనయా స్సర్వాః ప్రఖ్యాతా శ్శుభగామీనీః| కౌశికా సుకుమారీచ మన్దగా మన్దవాహినీ. 35

కృపా పలాశినీచైవ శుక్తిమత్పర్వతోద్బవాః | సర్వాః పుణ్యజలాః పుణ్యా స్సమగ్రాశ్చ సముద్రగాః. 36

ఏతాః పుణ్యజలా నద్యో మహాద్రి తనయా శ్శుభాః | విశ్వస్య మాతర స్సర్వా స్సర్వపాపహరా శ్శుభాః. 37

తాసాం నద్యుపనద్యశ్చ శతశోథ సహస్రశః |

ఏడ (తొమ్మిద)వదగు ఈమహావర్ణమునందు ఏడు విశాల కులపర్వతములు-

మహేంద్రము-మలయము-సహ్యము-శుక్తిమాన్‌-ఋక్షవాన్‌-వింధ్యము-పారియాత్రము-అఅనునవి కలవు. వీటికి సమీపములందు ఈ కులపర్వతములకు సంబంధించినవి. ఇవి అని గుర్తింవ వీలగు లక్షణములు కలవి-పర్వములు (బుడిపెలు-ఉబ్బు-ఎత్తులు) కలవి విశాలములై చిత్రములై వివిధ లక్షణములు కలిగి అచ్చెరువు గొల్పు నెత్తములు(ఉన్నత సమతలములు) కలవి అగు శాఖా పర్వతములు వేలకొలదిగ కలవు. ఈ శాఖా పర్వతములకు అనుబద్దములై వీనికి పిలకలవలె పుట్టినవి-పొట్టినవి-స్వల్పమగు

ఉపజీవనము (వృద్ధియు శిలాదార్డ్యమును) కలివియగు చిన్న గుట్టలు మరి వేలకొలది గలవు. ఈ పర్వతములతో శాఖోపశాఖా పర్వతములతో విమిశ్రములగు (వీనికి చుట్టు పట్టులనో వీని నడుమనో ఉన్న) జనపదములు (పల్లెలు)న్నవి. వానియందు ఆర్యులను వ్లుెచ్ఛులును అంతట నివసించుచున్నారు. వారు ఆయా ప్రదేశములందు గంగా

సింధు సరస్వతీ శతద్రూ చంద్రభాగా యమునా సరయూ శరావతీ వితస్తా విపా పా(శా) దేవికా కుహూ గోమతీ ధూతపాపా బాహుదా దృషద్వతీ కౌశీకీ తృతీయా నిశ్చారీ గండకీ బహు లోహితా నదులనెడుహిమవత్పాదములనుండి జనించిన నదుల(జలము)ను వేదస్మృతి వేత్రవతీ వితస్తా సింధు పర్ణాసా నర్మదా కౌబేరీ మహతీ వారా చంద్రవతీ యూపావిదుషా వేణు జీవికా శిప్రా7 వంతీ కౌంతీ నదులనెడు పారియాత్రగిరి పరిసరములనుండి జనించిన నదుల (జలము)ను శోణమహానద నందినీ సుకృశా కృశా మందాకినీ (ఇది గంగానది కాదు.) దేవ పర్ణా చిత్రకూటా తమసా

పిప్పలా శోణా కరతోయా 7ంబికా చిత్రోపలా విశాలా మధురా బహు వాహినీ ముక్తి మందాకినీ (ఇది మరియొకటి) లజ్జా మకుటోద్భేదికా నదులనెడు అమల జలయుతములగు ఋక్షవత్పర్వత సంజాత నదుల (జలము)ను తాపీపయోష్ణీ నిర్వింధ్యా శీప్రావృషభా వేణి వైతరణీ విశ్వమాలా కుముద్వతీ తోయా మహాగౌరీ దుర్గమా శిలానదులనెడు వింధ్య పాదమునుండి ప్రభవించిన మరి కొన్ని నదుల (జలము)ను శుభ శీత జలములగు గోదావరీ భీమరథీ కృష్ణవేణి వంజుళా తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేరి నదులనెడు సహ్య పర్వత పాద సంజాత దక్షిణాపథ

నదుల (జలము)ను కృతమాలా తామ్రపర్ణీ పుష్ప జోత్పలా నదులనెడు శుభ శీత జలములగు మలయ పర్వత పాద సంజాత నదుల (జలము)ను విషమా సర్వకుల్యేక్షుజా త్రిదివాచలా తామ్రపర్ణీ మూలీ శరారీ విమలా నదులనెడు శుక్తిమత్పర్వత శుభ ప్రవాహ యుతములగు మహేంద్ర పర్వత సంజాత నదుల (జలము)ను కౌశికా సుకుమారీ మందగా మందవాహినీ కృపా పలాశినీ నదులనెడు శుక్తిమత్పర్వత సంజాతములను పుణ్య జలయుతములను పుణ్యకరములును నమగ్రములును సముద్రము గామినులును నగు నదుల (జలము) ను త్రావుచు జీవించుచుందురు. ఈ చెప్పిన నదులన్నియును పుణ్య జలవంతములు-మహాద్రి సంజాతములు-విశ్వమునకు తల్లులవంటివి-సర్వ పాపహరములునైనవి. ఈ నదులలో కలిసెడి చిన్న నదులును ఉపనదులును నూరుల కొలదిగా వేలకొలదిగా గలవు.

కురుపఞ్చాలాదిదేశాః

తాస్విమే కురుపాఞ్చాలా స్సాళ్వాశైవ సజాఙ్గలాః. 38

శూరసేనా7 థ కామ్భోజా ఆన్ద్రాశ్చైవ సబర్బరాః | మత్స్యాః కులాశ్చ కాశీకున్తలకోసలాః. 39

అవన్తా శ్చానులిఙ్గాశ్చ మూకాశ్చైవామ్బకైస్సహ | మధ్యదేశ్యా జనపదాః ప్రాయశః పరికీర్తితాః. 40

ధన్యస్స దేశో మన్తవ్యో యత్రగోదావరీనదీ | పృథివ్యామపి కృత్స్నాయాం స ప్రదేశో మనోరమః. 41

యత్ర గోవర్ధనా నామ నగరీచ వినిర్మితా | రామప్రియార్థం సుగ్రీవఋక్షై ర్దివ్యాస్తథౌషధీః. 42

భరద్వాజేన మునినా 7యత్ప్రియార్థే వతారితాః | తస్మాత్స ప్రవరో దేశ స్తేన జజ్ఞే మనోరమః. 43

బాహ్లికా రాజధాన్యాశ్చ ఆభీరాఃకాలతోయకాః | పరాన్దాశ##చైవ శూద్రాశ్చ పప్లవా

శ్చోపఖణ్డితాః. 44

గాన్దారా యవనాశ్చైవ సిన్దుసౌవీరమద్రకాః | శశా(కా) హూణాః కళిఙ్గాశ్చ పారదా హారమూర్తికాః. 45

రామఠాః కర్ణికారాశ్చ కేకయా దశనాసికాః | క్షత్త్రియోపనివేశాశ్చ వైశ్యాశ్శూద్ర

జనాఅపి. 46

ఆత్రేయాశ్చ భరద్వజాః ప్రస్థలా స్సరమేరకాః | లమ్బకా స్థ్సలబాణాశ్చ సైనికా

స్సహజాఙ్గలైః. 47

ఏతే దేశా ఉదీచ్యాస్తు ప్రాచ్యాన్దేశా న్నిబోధత | అఙ్గా వఙ్గా మణ్డువకా ఆన్తర్గిర

బహిర్గిరాః. 48

తతః ప్లవఙ్గమాతఙ్గ యమకామలవర్ణకాః | సహ్యోత్తరాః ప్రవిజయా భార్గవా గేయమాళవాః. 49

ప్రాగ్జ్యోతిషాశ్చ పుణ్డ్రాశ్చ విదేహా స్తామ్రలిప్తగాః | సాళ్వా మాగధగోనర్‌క్షాః ప్రాచ్యాం జనపదాః స్మృతాః.

ఆ నదుల నడుమ ఈ చెప్పబోవు దేశము లనేకములు గలవు. (అవి మధ్యదేశములు -ఉదీచ్య దేశములు-ప్రాచ్య దేసములు-దక్షిణాపథ దేసములు- అపరాంత దేసములు-వింధ్య పృష్ఠస్థ దేసములు-పార్వతీయ దేశములు అని ఆరు విధములుగా విభజింపబడినవి. వానిలో మొదట *మధ్య దేశ జనపదములు:) కురువులు పాంచలములు సాళ్వములు జాంగలములు (పంటకు అంతగా పనికిరాని భూములు కల జనపదములు) శూరసేనములు కాంభోజములు ఆంధ్రములు బర్బరములు మత్స్యములు కిరాతములు కుల్యములు కాశిజనపదములు కుంతలములు కోసలములు ఆవంతములు అనులింగములు మూకములు అంబకములు- ఇవి మధ్యదేశ్య జనపదములలో చాలవరకు అయినవి. (మధ్యదేశము అనగా హిమాలయపు దక్షిణపు అంచునకును వింధ్యపు ఉత్తరసు అఁచునకు నడుమ కురుక్షేత్రమునకు తూర్పున

ప్రయాగకు పడమటగల దేశము.)

గోదావరినది ప్రవహించు దేశము ధన్యము; పృథియంతటిలోను అది మనోరమము. ఈ నదీతీరమునందే శ్రీరామ ప్రీతికై సుగ్రీవాది వానరులును ఋక్షులు (జాంబవజ్జాతీయులు)ను గోవర్ధన అను నగరిని నిర్మించిరి. భరద్వాజమునియు ఆ శ్రీరామ ప్రీతికే దివ్యౌషధులను భూమి కవతరింపజేసెను. కావుననే ఆ దేశ##శ్రేష్ఠము మనోరమమయ్యెను.

ఇక ఉదీచ్య దేశములు: బాహ్లికములు - రాజధాన్యములు ఆభీరములు ఆకాలములు తోయకములు పరాంధములు శూద్రములు (దేశనామము) పప్లవములు ఉపఖండితములు గాంధారములు యవనములు సింధువులు సౌవీరములు మద్రకములు శశ(క)ములు హూణములు కళింగములు పారదములు హారములు మూర్తికములు రామఠములు కర్ణికారములు కేకయములు దశనములు అసికములు క్షత్త్రియ వైశ్య శూద్రుల ఉపనివేశములు ఆత్రేయములు భరద్వాజములు ప్రస్థలములు రమేరకములు లంబకములు స్థల బాణములు సైనికములు జాంగలములు అను ఈజనపదములు ఉదీచ్యములు.

__________________________________________

* శరావతీనది సీమారేఖగా దానికి పశ్చిమోత్తరమునం(లం)దు ఉండిన ఉత్తర భారత దేశమునకు ఉదీచ్యదేశము అనియు ఆనదికే ప్రాగ్దక్షిణములందు ఉన్న ఉత్తర భారతదేశమునకు ప్రాచ్యదేశము అనియు పూర్వుల వ్యవహారము. ఇట్లుత్తర భారతదేశమునందలి దేశములన్నియు ఉదీచ్యములు ప్రాచ్యములు అని రెండు విధములే అగు చున్నవి. దేశములకు పూర్వము జనపదములనియే ఎక్కువ వాడుక. జనపదములే (గ్రామములే) అధికముగా ఉండుటచే వాని సముదాయమునే ఒక పాలనా విభాగముగా గ్రహించుటచే ఈ వాడుక ఏర్పడియుండును. కనుకనే కురువులు ఇత్యాదిదేశనామములు బహువచనములు.

ఇక ప్రాచ్యజనపదములు: అంగములు వంగములు మండుకములు ఆంతర్గిరములు బహిర్గిరములు (పర్వతము లకు లోపల-వెలుపల ఉండునవియని అర్థము) ప్లవంగములు మాతంగములు యమకములు అమలవర్ణకములు సహ్యోత్తరములు ప్రవిజయములు భార్గవములు గేయములు మాళవములు ప్రాగ్జ్యోతిషములు పుండ్రములు విదేహములు తామ్రలిప్తక ములు సాళ్వములు మాగధములు గోనర్‌క్షములు అనునవి ప్రాచ్యజనపదములు.

తేషాంపరే జనపదా దక్షిణాపథవాసినః | పాణ్డ్యాశ్చ కేరళాశ్చైవ చోళాః కుల్యాస్త థైవచ. 51

సేతుకా మూషికాశ్చైవ కుపథాశ్చారవాసికాః | నవరాష్ట్రా మాహిషకాః కళిఙ్గాశ్చైవ సర్వశః. 52

కావేర్యాశ్చ మహాశ్రీకాః కేరాఖ్యా స్సృవరాస్తథా | పుళిన్దా విన్ద్యభూతాశ్చ మూషకా దణ్డకైస్సహ. 53

కులపాశ్చ నిరాభాశ్చ రూపసా స్తారసైస్సహ | సదనాస్తథా తరుణికా యేచ సర్వాకరాస్తథా. 54

వాసిక్యాశ్చైవ యేచాన్యే యేచైవాన్తర నర్మదాః | భారుకచ్చాః సమాహేయా స్సహసారస్వతతై స్సహ. 55

కాశ్మీరాశ్చైవ సౌరాష్ట్రా ఆనన్దా హ్యర్బుదైస్సహ |ఇత్యేతే అపర్తాన్తాస్తు శృణు తే విన్ద్యవాసినః. 56

మలకా(దా)శ్చ కరూషాశ్చ మేలకాశ్చేలకైస్సహ |ఆర్ద్రాశ్చ షోడశార్ణాశ్చ భోజాః కిష్కిన్దకైస్సహ. 57

గోసహ్యాః కోసలాశ్చైవ త్రైపురా వైదికా స్తథా | తుసురాస్‌ తుమ్బురాశ్చైవ పడుమా నైరథైస్సహ. 58

ఉత్తరాశ్చ దశాశ్చైవ కామ్భోజా మాగధైస్సహ | కౌసలాః కోసలాశ్చైవ కైపురా వేదికాస్తథా. 59

మర్మరా ఘూర్జరాశ్చైవ తావద్గృహబలైస్సహ| అన్తపా స్తుణ్డికారాశ్చ వీతిహోత్రా హ్యవన్తయః. 60

ఏతే జనపదాః ఖ్యాతా విన్ద్యపృష్ఠనివాసినః | అతో దేశా న్ప్రవక్ష్యామి పర్వతాశ్రయిణశ్చ యే. 61

నీహారా హిమవర్గాశ్చ కున్తోదాః కుశలావహాః | కర్ణప్రావరణాశ్చాపి ఊర్వా దర్వాః సమద్రకాః. 62

త్రిగర్తా మండలాశ్చైవ కిరాతాశ్చామరైః సహ |

ఇక దక్షిణాపథ జనపదములు: పాండ్యములు కేరళములు చోళములు కుల్యములు సేతుకములు మూషికములు కుపథములు చారవాసికములు నవరాష్ట్రములు మాహిషకములు కళింగములు కావేర్యములు మహాశ్రీకములు కేరములు నృవరములు- ఇవి దక్షిణాపథమునందలి జనపదములు.

ఇక అపరాంత (పశ్చిమ దిశయందలి) జనపదములు: పుళిందములు (నేటి బుందేల్‌ ఖండ్‌) వింధ్యభూతములు మూషకములు దండకములు కులుపములు నిరాభములు రూపసములు తారసములు సదనములు తరుణికములు సర్వాకరములు నాసిక్యములు ఆంతర నర్మదములు భరుకచ్ఛములు మాహేయములు సారస్వతములు కాశ్మీరములు సౌరాష్ట్రములు అర్బుదములు-ఇవి అపరాంత జనపదములు (భారతదేశపు పడమటి దిశలో పశ్చిమ సముద్రవరకు వ్యాపించిన ప్రదేశమందలి జనపదములు.)

ఇక వింధ్య పర్వతముతో సంబంధముగల జనపదములు: మలదములు కరూశములు మేలుకములు చేలకములు అర్ద్రములు షోచశార్ణములు భోజములు కిష్కంధకములు గోసహ్యములు కోసలములు త్రైపురములు వైదికములు తుసురములు తుంబురములు పడుమములు నైరథములు ఉత్తరములు దశములు కాంభోజములు మాగధములు కౌసలములు కోసలములు కైపురములు వేదికములు మర్మరములు ఘూర్జరములు గృహ బలములు అంతపములు తుండికా క్రేరములు వీతిహోత్రములు అవంతులు-ఇవి వింధ్యమును ఆశ్రయించియుండు జనపదములు.

ఇక ఇతర పర్వత ప్రాంతములందును పర్వతములందును ఉండు జనపదములు: నీహారములు హిమవర్గములు కుంతోదములు కుశలావహములు కర్ణప్రావరణములు దార్వములు మద్రకములు త్రిగర్తములు (తిర్‌ హుత్‌)మండలములు కిరాతములు చామరములు(చమరీపశువు లుండు జనపదములు)- ఇవి పర్వతాశ్రయి జనపదములు.

(ఈ చెప్పిన జనపదముల పేరులలో కొన్ని ఆయా స్థానములందలి గుణలక్షణములను బట్టి ఏర్పడినవి. కొన్ని అచట నివసించు జనులను బట్టి ఏర్పడినవి. కొన్ని మన కీనాడు తెలియని ఏ భాషకో చెందినవి.

ఈ జనపదములు కూడ మనకు తెలిసిన కొన్ని ఈనాడు మన మనకొనుచోట కాక మరియొక ప్రాంతముననున్నట్లు ఇచట కనపడుచున్నది. మరికొన్ని దేశనామములు రెండుచోట్ల వచ్చుచున్నవి. ఇందులకు హేతువులను జాగ్రత్తతో పరిశీలించుకొన నగునే కాని అవి తోచినట్లు వ్రాసిన పుక్కిటి పురాణము మాత్రము కాదు. ఉదాహరణముకు ఆంధ్ర జనపదము మధ్యదేశ జనపదములలో నున్నది. నేడీ ఆంధ్రదేశము దక్షిణాపథమునందున్నది. నేడును మధ్యదేశమున ఆంధ్రులు చాలమంది యుండుట ప్రసిద్ధము. దీనిని బట్టి చూడగా ఈ ఆంధ్రులు పూర్వము మధ్యదేశీయులేయై యుండి వారిలో కొందరు దక్షిణాపథమున కూడ వ్యాపించిరేమో యనియు ఆలోచింపవలయును. ఇట్లే మరికొన్ని జనపదముల విషయమును.)

సూతః: చత్వారి భారతే వర్షే యుగాని మునయో7 బ్రువన్‌. 63

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్‌| తేషాం స్వరూపం వక్ష్యామి హ్యుపరిష్టాత్తు కృత్స్నశః.

ఏతచ్ఛ్రుత్వాతు ఋషయ ఉత్తరం పునరేవతే | శుశ్రూషవో ముదా యుక్తా హ్యాబ్రువ న్రోమహర్షణిమ్‌. 64

ఋషయః : జమ్బూద్వీపస్య విస్తారం తథా7 న్యేషాం ద్విజోత్తమ |

ద్వీపానాం వాసినాం తేషాం వృక్షాణాం ప్రబ్రవీహి నః. 66

యచ్చ కిమ్పురుషం వర్షం హరివర్షంతథైవచ | ఆచక్ష్వవై యథాతత్త్వం కీర్తితం భారతం త్వయా. 67

పృష్టశ్చైవ తథా విపై#్ర ర్యథాపృష్టం విశేషతః | ఉవాచర్షిః పురాణాని యథాచైవ నరోత్తమ. 68

కిమ్పురుషాదివర్షవర్ణనమ్‌.

సూతః:శుశ్రూషా యది వో విప్రా స్తచ్ఛృణుధ్వ మతంద్రితాః |

జమ్బూషణ్డః కిమ్పురుషో సుమహా న్నన్దనోపమః. 69

దశవర్షసహస్రాణి స్థితః కిమ్పురుషే స్మృతః | జాయన్తే మానవాస్తత్ర * నిర్ఘృష్టకనక ప్రభాః. 70

వర్షేకిమ్పురుషేపుణ్య ప్లక్షో మధువహస్స్మృతః | తస్య కిమ్పరుషాస్సర్వే పిబన్తో రసముత్తమమ్‌. 71

అనామయా హ్యశోకాశ్చ నిత్యం ముదిత మానసాః | సువర్ణవర్ణాశ్చ నరా స్త్ర్సియ శ్చాప్సరసోపమాః. 72

పరం కిమ్పురుషాద్వర్షం హరివర్షం ప్రచక్షతే | నరా రాజతసఙ్కాశా జాయన్తే తత్రమానవాః. 73

దేవలోకచ్యుతా స్సర్వే దేవరూపాశ్చ సర్వశః | హరివర్షే నరాస్సర్వే ఇచ్ఛన్తీక్షురసం

శుభమ్‌. 74

న జరా బాధతే తత్ర ఏతే జీవన్తివై చిరమ్‌ | + ఏకాదశసహస్రాణి తేషామాయుః ప్రకీర్తితమ్‌. 75

ఈ భారతవర్షమునందు కృత త్రేతా ద్వాపరకలులు అను నాలుగు యుగములు వ్యవహారమునం దుండునని మునులు వచించిరి. ఈ చతుర్యుగ స్వరూప లక్షణములను ఇకమీదట ఏమియు విడువక అంతయు చెప్పెదను. అనగా ఋషులు ఇంతవరకు అతడు

చెప్పినదే మరికొంత వినగోరి సంతోషముతో కూడిన కుతూహలముతో నిట్లనిరి: ద్విజోత్తమా: జంబూద్వీప తదితర ద్వీప విస్తరమును వానియందు వసించు మానవులయు ఉండు వృక్షములయు వివరణమునుమాకు తెలుపుడు. మీరు భారతవర్షమును యథాతత్త్వముగ మాకు తెలిపితిరి. హరి కింపురుష వర్షములను కూడ తెలుప వేడెదము. అనగా సూతు డిట్లనెను: విప్రులారా: మీకు వినగోరికకలదేని సావధానులై వినుడు. కింపురుష వర్షమున నందనవనమువంటి జంబూ (నేరెడు)వనము కలదు. అచట వారి ఆయువు పదివేలేండ్లు. వారి దాని ఉత్తమ రసముత్రావి రోగ శోకరహితులై సదా ముదిత మానసులై ఉందురు. అచటి వారు దాని ఉత్తమ రసముత్రావి రోగ శోకరహితులై సదా ముదిత మానసులై ఉందురు. అచటి స్త్రీ లప్సరసలవంటి సుందరులు. దాని కవతలిది హరివర్షము. అచటి జనులు వెండి కాంతిబోలు దేహచ్ఛాయ కలవారు. దేవలోక పరిభ్రష్టులు అచట జనింతురు. వారు దేవతలను పోలి యుందురు. వారు చెరకు రసమును త్రావి జరాబాధలు లేక పదునొకండు వేలేండ్లు జీవింతురు.

___________________________________________

* సుతప్త + త్రయోదశ

మధ్యమం యన్మయా ప్రోక్తం నామ్నా వర్ష మిళావృతమ్‌ | న తత్ర సూర్య స్తపతి తేన జీర్యన్తి మానవాః.

న చన్ద్రసూర్యౌ నక్షత్రం న తత్ర పవనాలౌ | పద్మప్రభాః పద్మవర్ణాః పద్మపత్రనిభేక్షణాః. 77

పద్మగన్దానువర్ణశ్చ జాయన్తే తత్ర మానవాః | జమ్బూఫలరసాహార మశ్నన్త స్తే సుగన్దినః. 78

దశపఞ్చసహస్రాణి వర్షాణాం తే నరోత్తమాః | ఆయుఃప్రమాణం జీవన్తి వర్షే యే తు ఇళావృతే. 79

తస్య జమ్బూఫలరసో నదీ భూత్వా ప్రసర్పతి | మేరుం ప్రదక్షిణం కృత్వా జమ్బూమూలం గతా పునః. 80

తం పిబన్తి సదాతుష్టా జమ్బూరస మిలావృతే | జమ్బూఫలరసం పీత్వా న జరా బాధతే చ తాన్‌. 81

న క్షుధా న క్లమశ్చాపి న మృత్యుర్నచ వైజరా | తత్ర జామ్బూనదంనామ కనకం దేవభూషణమ్‌. 82

ఇన్ద్రగోపవ్రతీకాశం జాయతేవా స్వయంచ యత్‌ | సర్వేషాం వర్ష వృక్షాణాం శుభః ఫలరసస్తు సః. 83

స్కన్నంతు కాఞ్చనం శుభ్రం జాయతే దేవభూషణమ్‌ | తేషాం మూత్ర పురీషంవా దిక్ష్వష్టాసు చ సర్వదా. 84

ఈశ్వరానుగ్రహాద్‌ భూమి స్తేషాంతు గ్రసతే మృతా& | రక్షః పిశాచయక్షాశ్చ సర్వేహేమయుతాస్తు తే. 85

హేమకూటేతు గన్దర్వా విజ్ఞేయా స్సాప్సరోగణాః సర్వేనాగా నిషేవన్తే శేషవాసుకితక్షకాః. 86

మహామేరౌ త్రయంస్త్రింశ త్క్రీడన్తే చాజ్ఞయా సురాః |

నీలవైదూర్యయసక్తే 7స్మి న్త్సదా బ్రహ్మర్షయో 7వస&.

దైత్యానాం దానవానాంచ శ్వేతఃపర్వత ఉచ్యతే | శృఙ్గవా న్పర్వతశ్రేష్ఠః పితృణాం ప్రతిసఞ్చరః. 88

ఇత్యేతాని మయోక్తాని నవవర్షాణి భారతే | భూతైరపి నివిష్టాని గతిమన్తి ధ్రువాణిచ. 89

తేషాంవృద్ది ర్బహువిధా దృశ్యతే దేవమానుషైః | అశక్యా పరిసఙ్ఖ్యాతుం శ్రద్ధేయావై మయోదితాః. 90

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే భారతాదివర్షవర్ణనం నామ త్రయోదశోత్తరశతతమో 7ధ్యాయః.

భారత కేతుమాల భద్రాశ్వ కురువర్షముల నడుమ నున్నదని నేను లోగా చెప్పిన ఇలావృత వర్షమున సూర్యుడు తపింపడు. అచటి వారికి శైథిల్యము కాని వార్ధ్యకము గాని లేదు. అచట చంద్ర రవి నక్షత్ర పవనాగ్నులతో పనిలేదు. అచటివారు పద్మకాంతి పద్మవర్ణము పద్మపత్ర నేత్రములు పద్మ గంధ నదృశగంధము కలిగి అచటి జంబూ ఫలరసపానముచే పదునైదు వేల ఏండ్లు జీవింతురు. వారికి వార్ధ్యకము ఆకలిబడలికలు మృత్యువు లేవు. ఇదంతయు వారు త్రాపు జంబూ ఫలరస మహిమమే. ఆ రసము నదియై మేరువును ప్రదక్షిణించి మరల జంబూవృక్ష మూలమును చేరును. అచటి దేవులకును మానవులకును సహజ కనకమయ భూషణములే. అవి ఇంద్రగోవ కీటముల (అర్ద్రపురుగుల)వన్నెతో నుండును. ఏలయన అన్ని వర్షములందలి ఆయా ఫలరములును ప్రవహించి నిర్మలమగు బంగారము దేవభూషణ మగును. అచటి వారి మూత్ర పురీషములును అష్టదిశలందును సువర్ణమై సదా ప్రకాశించును. ఈశ్వర సంకల్ప రూపానుగ్రహమున వారిలో కొందరిని అచటి భూమి మ్రింగివేయును. అదియే వారికి మృతి. అచట వసించు రక్షః పిశాచయక్షులును సువర్ణవంతులే.

హేమకూట పర్వతమున గంధ్వర్వాప్సరసలు శేషవాసుకి తక్షకాది మహానాగులు వసింతురు మహేమేరు పర్వత మున ముప్పది ముగ్గురు దేవతలును (ఏకాదశ రుద్రులు-ద్వాదశౄదిత్యులు - అష్టవసువులు-ఇద్దరు అశ్వినులు) సదా వసింతురు. నీలై వైదూర్యమణియుతమగు దీనియందు సదా బ్రహ్మర్షులు నివసింతురు. శ్వేత పర్వతములనందు దైత్యులు దానవులు నివసింతురు. శృంగవత్పర్వతము శ్రేష్ఠమయినదియు పితృ దేవతలకు లయాత్మకమయినదియు; (పితృ దేవతలు దీనియందు లయమునొంది అదృశ్యరూపులై యుందురు.)

ఈ విధముగ నేను మీకు భరతవర్షము మొదలుగా నవవర్షముల విషయము తెలిపితిని. వీనియందు ఆయా స్థిరచర భూతములు నివసించుచున్నవి. దేవమాన మానుషమానముల ననుసరించి వాని పరిమాణాదికమును జనన వృద్ధులు ఆయువు మొదలగు పరిమాణములును బహు విధములుగా పెద్దలు చెప్పుచున్నారు. దానిని స్పష్ట రూపమున ఇది ఇట్లని చెప్పుట శక్యము కాదు. కావున నేను చెప్పిన ఈ విషయము లన్నియు ఆస్తికతా ప్రామాణికతా భావముతలో విశ్వసింప వలసినది.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణమున సప్తద్వీప వర్ణమున జంబూద్వీప వర్ణమున భారతాది వర్ష వర్ణమను నూట పదుమూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters