Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టోత్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

మార్కణ్డయః : 

శృణు రాజ న్ర్పయాగస్య మాహాత్మ్యం పునరేవతు | నై మిశం పుష్కరంచైవ గోతీర్థం సిన్ధుసాగరమ్‌. 1

గయా చైత్రధనూకంచ గఙ్గాసాగరమేవ చ | ఏతే చాన్యేచ బహవో యేచ పుణ్యా శ్శిలోచ్చయాః 2

దశ తీర్థసహస్రాణి త్రింశత్కోట్య స్తథాపరే | ప్రయాగే సంస్థిగా నిత్య మేకమాహు ర్మనీషిణః. 3

త్రీణి చాథాగ్ని కుణ్డాని యేషాం మధ్యేచ జాహ్నవీ | ప్రయాగా దభినిష్క్రాన్తా పర్వదేవనమస్కృతా. 4

తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా | యమునా గఙ్గయా సార్ధం సఙ్గతా లోకపావనీ. 5

గఙ్గాయమునయో ర్మధ్యే పృథివ్యా జఘనం స్మృతమ్‌ | ప్రయాగం రాజశార్దూల కళాం నార్హన్తి షోడశీమ్‌.

తిస్రః కోట్యర్ధకోటీచ తీర్థానాం వసు రబ్రవీత్‌ | దివి భువ్యన్తరిక్షేచ తత్సర్వం జాహ్నవీగతమ్‌. 7

ప్రయాగసమధిష్ఠానౌ కమ్బళాశ్వతరౌ ప్రభూ | భోగితల్పగతసై#్యషా వేదిరేషా ప్రజాపతేః. 8

తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూ ర్తిమన్తో యుధిష్ఠిర | ప్రజాపతి ముపాస న్తే ఋషయశ్చ తపోధనాః. 9

యజన్తే క్రతుభి ర్దేవా స్తథా చక్రధరా నృపాః | తతః పుణ్యతమం నాస్తి త్రిషులోకేషు భారత. 10

ప్రభావ స్సర్వతీర్థేభ్యః ప్రభవ త్యధికం విభో | యత్ర గఙ్గా మహాభాగా స దేశ స్తత్ర పావనః. 11

నూట ఎనిమిదవ అధ్యాయము.

ప్రయాగ మాహాత్మ్యము.

మార్యండేయుడింకను ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరా: ప్రయాగ మాహాత్మ్యమునింకను చెప్పెద; వినుము. నైమిశము పుష్కరము గోతీర్థము సింధు సాగరము గయ చైత్ర(ధనూక)ము గంగా సాగర (సంగమ)ము మొదలగు ముప్పదికోట్ల పదివేల తీర్థములును పుణ్య పర్వతములును సదా వ్రయాగ యందుండునని విద్వాంసులు చెప్పెదరు. ప్రయాగ సమీపమున సర్వదేవ నమస్కృతయగు గంగ మూడగ్ని కుండముల నడుమగా ముందునకు సాగివచ్చును. లోకత్రయ ప్రసిద్ధయు సూర్యపుత్త్రియు నగు యమునయు ఈ గంగయు అచట సంగమించును. ఈ గంగా యమునా మధ్యదేశము పృథివీ జఘనమని ప్రసిద్ధము. లోకత్రయమందలి మూడున్నర కోట్ల తీర్థములన్నియు కూడియు ప్రయాగ తీర్థ షోడశాంశముతో సరిపోలవు. ఏలయన భూర్‌ భువః స్వర్లోకములందలి తీర్థములన్నియు నచట గలవు. అని సాక్షాత్‌ వసువు చెప్పెను. నాగ ప్రభువులగు కంబళాశ్వతరులును ఇచట నుందురు. శేషతల్ప శయనుడగు వ్రజాపతికి విష్ణునకు ఇది పడక యరుగు. తపోధనులగు మునులును ఋషులును మూర్తిమంతములగుచు వేదములును యజ్ఞములును నచట ప్రజాపతిని ఉపాసించుచుండును. దేవతలును చక్రవర్తులును నచట క్రతువులతో విష్ణు ప్రజాపతిని ఆరాధింతురు. త్రిలోకములందును ఈ ప్రయాగముకంటె పుణ్యతమమగు తీర్థక్షేత్రము లేదు. మహాభాగయగు గంగ యుండుటచే ఆచోటు సర్వ తీర్థములకంటె అధిక ప్రభావ సంపన్నము; పావనము.

సిద్ధక్షేత్రంచ విజ్ఞేయం గజ్గాతీరసమన్వితమ్‌ | ఇదం సత్యం విజానీయా త్సాధూనా మాత్మజస్యచ. 12

సుహృదశ్చ విశేషేణ శిష్యస్యానుమతస్యచ | ఇదంధన్య మిదంస్వర్గ్య మిదం సేవ్యమిదంసుఖమ్‌. 13

ఇదంపుణ్య మిదంకీర్త్యం పావనం ధర్మముత్తమమ్‌ | మహర్షీణా మిదంగుహ్యం సర్వపాప పణాశనమ్‌. 14

అధీత్యచ ద్విజోప్యేత న్ని ర్మలంస్వర్గమాప్ను యాత్‌ | యస్త్విమం శృణుయాన్నిత్యం తీర్థంపుణ్యం సదాశుచిః. 15

జాతిస్మరత్వం లభ##తే నాకపృష్ఠేచ మోదతే | ప్రాప్యచైతాని తీర్థాని సద్భి శ్శిష్టానుదర్శిభిః. 16

స్నాహి తీర్థేషు కౌరవ్య నచ వక్రగతి ర్భవేత్‌ | త్వయాచ సమ్యక్పృష్టేన కథితాని మయావిభో. 17

తారితాః పితరస్సర్వే తథైవచ పితామహాః | ప్రయాగస్యతు సర్వే తే కళాం నార్హన్తి షోడశీమ్‌. 18

ఏవం జ్ఞానంచ యోగంచ తీర్థంచైవ యుధిష్ఠిర | బహుక్లేశేన యుజ్యన్తే న తేషా మితరా గతిః. 19

త్రికాలంచ జప& జ్ఞానం స్వర్గలోకం గమిష్యతి. 194

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్ణయయుధిష్ఠిరసంవాదే ప్రయాగమాహాత్మ్యే

అష్టోత్తరశతతమో7ధ్యాయః.

గంగా తీరముతో కూడిన యాతీర్థము సిద్ధక్షేత్రమని ఎరుగవలయును. ఈ సర్వ విషయమును సజ్జనులకును తన కుమారునకును తన మిత్రునకును తనకు ప్రీతిపాత్రుడగు శిష్యునకును తెలుపవలయును. ఈ తీర్థక్షేత్రము ధన్యము; స్వర్గప్రదము; సేవింపదగినది; సుఖకరమయినది; పుణ్యప్రదము; కీర్తనీయము; పావనము; ఉత్తమ ధర్మరూపము; ఇది మహర్షులకును ఎరుగరాని గుహ్యతత్త్వము; సర్వపాపనాశకము. నిర్మలమగు ఈ తీర్థ మాహాత్మ్యమును అధ్యయనము చేసినను విప్రులు స్వర్గప్రాప్తులగుదురు. శుచియై ఈ పుణ్యతీర్థ మాహాత్మ్యమును వినునతడు స్వర్గ సుఖములందుటేకాక తరువాతి జన్మములందును పూర్వజన్మ స్మృతి కలవాడగును. కావున యుధిష్ఠిరా! శిష్యులై సంప్రదాయము నెరిగిన వృద్ధులతో కూడి నీవును ఈ తీర్థములకేగి వానియందు స్నానమాడుము. నీకిక దుర్గతి యండదు. రాజా! నీవు చక్కగా అడిగిన విషయమంతయు నీకు నేజెప్పితిని. నీ పితృ పితామహులందరును తరించినారు. లోకములందలి ఆ తీర్థములన్నియు కలిసియు ప్రయాగలో పదునారవ వంతునకు చాలవు; ఏలయన తీర్థము జ్ఞానము యోగము ఈ మూడును ఒకేచోట లభించుట దుస్సాధ్యము. ఇతర తీర్థములకు ఇట్టి యోగ్యతలేదు. దీని మహిమను త్రికాలమును జపించుచుండుటచే స్వర్గ ప్రాప్తియగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను

నూట ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters