Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తోత్తరతమో7ధ్యాయః.

ప్రాయాగమామాత్మ్యమ్‌.

యుధిష్ఠిరః : 

శ్రుతంహి బ్రహ్మణా ప్రోక్తం పురానం పుణ్యకీర్తనమ్‌ | తీర్థానాం తు సహస్రాణి శతాని నియుతానిచ. 1

సర్వే పుణ్యాః పవిత్రాశ్చ గతిశ్చ పరమా స్మృతా| పృథివ్యాం నైమిశం పుణ్య మన్తరిక్షేచ పుష్కరమ్‌. 2

త్రయాణామపి లోకానాం కురుక్షేత్రం విశిష్యతే | సర్వాని తాని స న్త్యజ్య కథమేకం ప్రశంససి. 3

ప్రయాగేతు త్వయాప్రోక్త మశ్రద్ధేయ మనుత్తమమ్‌ | గతించ పరమాం దివ్యభోగాంశ్చైవ యథేప్సితాన్‌. 4

కిమర్థ మల్పయోగేన బహుధర్మా న్ప్రశంససి | ఏతన్మే సంశయం బ్రూహి యథాదృష్టం యథాశ్రుతమ్‌. 5

మార్కణ్డయః : అశ్రద్ధేయం నవక్తవ్యం ప్రత్యక్షమపి యద్భవేత్‌ |

నరస్యాశ్రద్దధానస్య పాపోపహతచేతసః. 6

అశ్రద్దధానో హ్యశుచి ర్ధుర్మతి స్త్యక్తమఙ్గళః | ఏతే పాతకిన స్సర్వే తేనేదం భాషితం మయా. 7

శృణు ప్రయాగమాహాత్మ్యం యథాదృష్టం యథాశ్రుతమ్‌ | ప్రత్యక్షంచ పరోక్షంచ యథాతథ్యంభవిష్యతి 8

నచైవాన్యదదృష్టంచ యథాదృష్టం యథాశ్రుతమ్‌ | శాస్త్రం కృత్వా ప్రమాణంచ యుజ్యతే యోగమాత్మనా.

క్లిశ్యతే చాపర స్తత్ర నైవయోగ మవాప్ను యాత్‌ | జన్మాన్తర సహస్రేభ్యో యోగం లప్స్యతి మానవ. 10

యథా యోగసహస్రేణ యోగో లభ్యేత మానవైః | యస్తు సర్వాణి రత్నాని బ్రాహ్మణభ్యః ప్రయచ్ఛతి. 11

తేన దానేన ద త్తేన యోగో లభ్యేత మానవైః | ప్రయాగేతు మృతస్యేదం సర్వం భవతి నాన్యథా. 12

ప్రయాగహేతుం పక్ష్యామి శ్రద్దధానస్య భారత | యథా సర్వేషు భూతేషు సర్వత్రైవచ దృశ్యతే. 13

బ్రహ్మా నైవా స్తి యత్కించి దబ్రాహ్మ మితి బోధ్యతే | ఏవం సర్వేషు లోకేషు బ్రహ్మా సర్వత్ర పూజ్యతే.

తథా సర్వేషు తీర్థేషు ప్రయాగః పూజ్యతే బుధైః | పూజ్యతే తీర్థరాజశ్చ సత్యమేవ యుధిష్ఠిర. 15

బ్రహ్మాపి స్మరతే నిత్యం ప్రయాగం తీర్థము త్తమమ్‌ | తీర్థరాజ మనుప్రాప్య నచాన్య త్కించిదర్హతి. 16

కోహి దేవత్వ మాసాద్య మానుషత్వం చికీర్షతి | అనేనైవ ప్రమాణన విజ్ఞాస్యసి యుధిష్ఠిర. 17

యథా పుణ్యతమం నాస్తి తథైవ కథితం మయా |

నూట ఏడవ అధ్యాయము

ప్రయాగ మాహాత్మ్యము

యుధిష్ఠిరుడు మార్కండేయునితో నిట్లనెను: కీర్తించినంతన పుణ్యకరమును తీర్థ క్షేత్ర విషయకమునగు బ్రహ్మ ప్రో క్త పురాణమును విని ఉంటిని. దానియందు నూరుల వేల లక్షల కొలదిగ తీర్థములు పేర్కొనబడినవి. అవన్నియు పుణ్యములును పవిత్రములును పరమగతి నిచ్చునవియును; అందునను పృథివి పై నై మిశమును అంతరిక్షమున పుష్కరమును లోకత్రయమునను కురుక్షేత్రమును విశిష్టములు. అవన్నియు విడిచి ఈ ప్రయాగమును ఇంతగ ప్రశంసింతువేమి? ఇది నాకు విశ్వసనీయముగా తోచుట లేదు. అల్పయత్నముచే బహు భోగప్రాప్తియు పరమగతియు నెట్లు లభించును? ఇది నాకు సంశయకరముగ ఉన్నది. కావున మీరు వినినంత కనినంత తెలిపి నా సంశయము దీర్ప వేడెదను. అన మార్కండేయు డిట్లు చెప్పెను. పాపోపహతచిత్తుడై పెద్దలను శాస్త్రములను విశ్వసించని వానికి ప్రత్యక్షముగ కనబడు విషయము కూడ నమ్మరానిదిగా తోచును. అతనికి ఏదియు చెప్పరాదు. అశ్రద్దధానుడు (ఆ స్తిక్యముతో విశ్వాసము పెట్టుకొననివాడు) అశుచియు దుర్మతియు అశుభ రూపవచన చిత్తకార్యములు కలవాడును వీరందరును పాతకులు; కావుననే వీరి కేదియు చెప్పరాదంటిని. ప్రయాగ మాహాత్మ్యము పెద్దలనుండి వినబడునదియు ప్రత్యక్షముగ కనబడునదియు చెప్పెదను; వినుము. శాస్త్రమును ప్రమాణముగా చేసికొని చిత్తమును యోగమున నిలిపినవానికి పరోక్ష విషయము కూడ యథాతథముగ ప్రత్యక్షమగును. శాస్త్రములందు వినబడునదియు లోకమున కనబడునదియు మాత్రమే కాదు; అంతయునతనికి గోచరమగును. యోగికి అదృష్టము (కనబడనిది) ఏదియు లేదు. ఇతరుడు ఆయా విషయముల నెరుగుటకు ఎంతయో శ్రమ పడును. కాని యోగమును పొందజాలడు. (కావున వాడు అతీంద్రియ విషయముల నెరుగజాలకుండును.) ఏలయన జన్మాంతర సహస్రముల పుణ్యమున కాని మానవుడు యోగమును పొందజాలడు. వేలకొలది పుణ్యముల యోగము(కూడిక)చే మానవుడు యోగమును పొందగలుగును. సర్వ రత్నములను (తనకున్న ఉత్తమ పదార్థములన్నియు) బ్రాహ్మణులకు దానము చేసినవానికి ఆ పుణ్యమున యోగము లభించును. కాని ప్రయాగలో మరణించిన వానికంతమాత్రనే యోగసిద్ధి కలుగును. విశ్వసించువానికి ప్రయాగ శ్రేష్ఠత్వమును నిరూపించు యు క్తి చెప్పెదను వినుము. సర్వభూతములయందును బ్రహ్మత త్త్వము చైతన్యరూపమున కనబడుచునే యున్నది. ఐనను బ్రహ్మము లేనే లేదు. అది కనబడుటలేదు. అని నాస్తికుడు తలచుచున్నాడు. ఐనను సర్వలోకములందును బ్రహ్మ(ము)ను విశ్వసించుచునే యున్నారు. పూజించుచునే యున్నారు. అట్లే వివేకులందరును సర్వ తీర్థములందును మిన్నయని ప్రయాగను పూజింతురు. కావుననే యది తీర్థరాజము; బ్రహ్మము నిత్యమును ప్రయాగను స్మరించుచుండును. ఈ తీర్థరాజమును పొందగలిగినవాడు మరేదియు పొంద నక్కరలేదు. దేవత్వమును పొందినవాడు మానవత్వమును కోరడు గదా! ఈ యు క్తితోనే నీవు ప్రయాగ శ్రేష్ఠత్వము నాలోచింపుము. ఇ ట్లింతకంటె పుణ్యతర తీర్థక్షేత్రము మరేదియు లేదని నీకు తెలిపితిని.

యుధిష్ఠిరః : శ్రుతంహి యత్త్వయా ప్రోక్తం విస్మితోహం పునః పునః. 18

కథం యోగేన తత్ర్పాప్తం స్వర్గవాసంతు కర్మణా | దాతా వై లభ##తే భోగా న్కథంవై కర్మణః ఫలమ్‌.

తాని కర్మాణి పృచ్ఛామి పునర్వై ప్రాప్యతే మహీ |

మార్కణ్డయః : శృణు రాజ న్ర్పవక్ష్యామి యథో క్తకరణీం మహీమ్‌. 20

గామగ్నిం బ్రాహ్మణం శాస్త్రం కాఞ్చనం సలిలం స్త్రియః | మాతరం పితరంచైవ యే నిన్దన్తి నరాధమాః.

న తేషా మూర్ధ్వగమన మితిప్రాహ ప్రజాపతిః ఏవం యోగస్య సమ్ర్పాప్తి స్థానం పరమదుర్లభమ్‌. 22

పతన్తి నరకే ఘోరే యే నరాః పాపకర్మిణః | హస్త్వశ్వం గామనడ్వాహం మణిముక్తాది కాఞ్చనమ్‌. 23

పరోక్షం హరతే యస్తు దానం నైవ ప్రయచ్ఛతి | న తే గచ్చన్తివై స్వర్గం దాతారో యత్ర బోగినః. 24

అనేకకర్మణా యు క్తః పచ్యతే నరకే7ధమః| మార్కణ్డయః : శృణు రాజ న్మహాప్రాజ్ఞ యథోక్తాచారలక్షణమ్‌. 25

వివిధానిచ రత్నాని గావో ముక్తాశ్చ కాఞ్చనమ్‌ | పరోపకారతో యస్తు పుమా న్దానం ప్రయచ్ఛతి. 26

సవై గచ్ఛతిచ స్వర్గం స సుఖం పరమాం గతిమ్‌ | తస్మా త్సర్వప్రయత్నేన దేయం న్యాయార్జితంధనమ్‌.

ఏవం స్వర్గాపవర్గౌవా శుభాని లభ##తే నరః | అన్యాయార్జితవిత్తేన నరకం యాతి దారుణమ్‌. 28

యో7న్యస్య హృత్వా రత్నాని ప్రయచ్ఛతి నరోయది | రత్నాధిపస్య తత్పుణ్యం హృత్వా చౌర్యఫలం లభేత్‌. 29

ఏతత్సర్వం సమాసేన కథితం రాజసత్తమ | పృచ్ఛ మాం యచ్చ వక్తవ్యం తత్సర్వం కథయామి తే. 30

యుధిష్ఠిరః : కథ తీర్థం హ్యనుసర న్కేనవా కర్మనా మునే | తీర్థయాత్రాఫలం మర్త్యో లభ##తే తద్వదస్వ మే. 31

మార్కణ్డయః : శృణు రాజన్ర్పవక్ష్యామి తీర్థయాత్రావిధిక్రమమ్‌ | ప్రతిగ్రహా దుపావృత్త స్సన్తుష్టో యేనకేనచిత్‌. 32

అహఙ్కారవిముక్తాత్మా స తీర్థఫలమశ్నుతే | అకోపనశ్చ రాజేన్ద్ర సత్యవాదీ దృఢవ్రతః. 33

ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమశ్నుతే | ఏవం యోగం చ ధర్మంచ దాతారంచ యుధిష్ఠిర. 34

యచ్చ సత్య మసత్యం వా అస్తి నా స్తీతి యత్ఫలమ్‌ | నిరుక్తంతు ప్రవక్ష్యామి యథాహ స్వయ మజః. 35

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కంణ్డయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ

మహాత్మ్యే సప్తోత్తరశతతమో7ధ్యాయః.

మీరు చెప్పినది విని నాకు మరి మరి ఆశ్చర్యము కలుగుచున్నది. స్వర్గవాసము ఎట్టి యోగముచే ఎట్టి కర్మాచరణముచే లభించును? ఏ కర్మముల ఫలము ఎట్టిది? ఏ భోగములను ఏ కర్మములచే స్వర్గమం దనుభవించి మరల భూలోకమునకు ఎట్లు ఎట్టి చోటికి చేరును? ఆ కర్మముల స్వరూపమును తెలుప వేడుచున్నాను. అన మార్కండేయు డిట్లు చెప్పెను: రాజా! కర్మ ఫలక్రమమును చెప్పెదను వినుము. భూమిని గోవును అగ్నిని విప్రుని శాస్త్రమును బంగారమును నీటిని స్త్రీలను తల్లిదండ్రులను నిందించు నరాధముల కూర్ధ్వలోకగతులు లేవని ప్రజాపతి వచనము. ఇట్లే యోగసిద్ధి ప్రదమగు స్థానము కూడ దుర్లభము. ఇట్టి పాపకర్ములగు నరులు ఘోర నరకమున పడుదురు. ఏనుగును గుర్రమును గోవును ఎద్దును మణిముక్తా కాంచనములను దాన మీయక పోగా పరోక్షముగా హరించువారు దాతలు పోవు లోకముల కేగి భోగముల భుజించరు. అట్టి యధములు అనేక పాపకర్మముల ఫలముగా నరకమున ఉడికించబడుదురు.

మహాప్రాజ్ఞా! యుధిష్ఠిరా! యథా శాస్త్రోక్తాచార లక్షణమును తెలిపెద వినుము; వివిధములగు రత్నములు గోవులు ముత్తెములు బంగారము పరోపకారమునకై దానము చేయువాడు స్వర్గసుఖమును పరమపదమును కూడ పొందును. కావున సర్వ యత్నములతో తన న్యాయార్జిత ధనమును దానము చేయుటచే సకల శుభములను స్వర్గమును మోక్షమును లభించును. విత్తము నన్యాయముగ నార్జించుటచే దారుణ నరకము నందును. ఇతరుల ధనమును హరించి దానము చేసినచో ఆ పుణ్యము ధనవు సొంతదారునకు చెందును. ఈ దాతకు దొంగతనము చేసిన పాపము చెందును. నీ వడిగినది సంక్షేపమున చెప్పితిని. మరేదైన నడుగు మదియంతయు చెప్పెదను. అన యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగెను: తీర్థయాత్ర కేగినవా డచట నేయే కర్మల నాచరించినచో యాత్రాఫలము లభించునో తెలుపుము. అన మార్కండేయు డిట్లనెను: రాజా! తీర్థయాత్రా విధాన క్రమములు తెలిపెద; వినుము. ప్రతిగ్రహమున కాసింపక ఏది లభించిన-దానితో తృప్తి నందుచు అహంకార రహితుడై అకోపనుడై సత్యవాదియై చిత్తశుద్ధితో కర్మల నాచరించువాడై సర్వభూతములయందు తనయందువలె భావము కలిగియుండు నాతనికి తీర్థయాత్రాఫలము లభించును. ఇట్లే యోగము ధర్మము దాతృత్వము సత్యము అసత్యము ఆస్తికత్వము నాస్తికత్వము మొదలగు పదముల నిర్వచనమును (అర్థవిశదీకరణమును) కూడ నీకు తెలిపెదను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters