Sri Matsya Mahapuranam-1    Chapters   

పఞ్చోత్తరశతతమో7ధ్యాయః

ప్రయాగమాహాత్మ్యమ్‌.

మార్కణ్డయః :

 శృణు రాజ న్ర్పయాగస్య మాహాత్మ్యం పునరేవచ | యచ్ర్ఛుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్రసంశయః. 1

మానసంనామ తీర్థంతు గఙ్గాయా ఉ త్తరేతటే | త్రిరాత్రోపోషిత స్స్నాత్వా సర్వాన్కామా నవాప్ను యాత్‌.

ఏతత్ఫల మవాప్నోతి త త్తీర్థం లభ##తే పునః | అకామోవా సకామోవా గఙ్గాంప్రాప్య విముచ్యతే. 3

మృతస్తు లభ##తే స్వర్గం నరకంచ నపశ్యతి | అప్సరోగణసఙ్గీతై స్సుప్తో7సౌ ప్రతిబుధ్యుతే. 4

హంససారసయు క్తేన విమానేన స గచ్ఛతి | బహువర్షసహస్రాణాం రాజేన్ద్ర దివి భుఞ్జతే. 5

తత స్స్వర్గా త్పరిభ్రష్టః క్షీణర్మా దివశ్చ్యుతః | సువర్ణమణిముక్తాడ్యే జాయతే మహితే కులే. 6

షష్టితీర్థసహస్రాణి షష్టికోటిశతానిచ | మాఘమాసే గమిష్య న్తి గఙ్గాయమునసఙ్గమే. 7

గవాం శతసహస్రస్య సమ్యగ్దత్తస్య యత్ఫలమ్‌ | ప్రయాగే మాఘమా సేతు త్ర్యహస్స్నా తస్య తత్ఫలమ్‌. 8

గఙ్గాయమునయో ర్మధ్యే కాష్ఠాగ్నిం యస్తు సాధయేత్‌ | అవ్యఙ్గాంగో హ్యరోగస్తు పఞ్చేన్ద్రియసమన్వితః. 9

యావన్తి రోమకూపాణి తస్య గాత్రేషు దేహినః | తావద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే. 10

తతస్స్వర్గా త్పరిభ్రష్టో జమ్బూద్వీపపతి ర్భవేత్‌ | సభుక్త్వా విపులా న్భోగాం స్తత్తీర్థం లభ##తే పునః. 11

నూట అయిదవ అధ్యాయము.

ప్రయాగ మాహాత్మ్యము.

రాజా! ప్రయాగ మాహాత్మ్యము నింకను వినుము. దానిని వినినంతనే సర్వపాప విము క్తి యగుట నిస్సం శయము. ఇట్లు గంగో త్తరతటమందలి మానసమను తీర్థమున త్రిరాత్రముపవాస పూర్వకముగ స్నానమాడుటచే సర్వ కామ పూ ర్తియగును. ఈ ఫలానుభవానంతర మనంతర జన్మమున నాతడీ తీర్థమునే సేవింపవచ్చును. తెలిసి కోరియేకాని కోరకయే కాని ఇట గంగను సేవించుట పాపము క్తికరము. ఇట వాడు మరణించినను స్వర్గప్రాప్తుడగును. నరకము చూడడు; అప్సరోగణ సేవితుడగుచు నిదుర మేలుకాంచును. హంస సారసములు మోయు విమానముపై స్వర్గమేగి అటను దానిపై సంచరించుచు బహు సహస్ర వర్షములచట సుఖించి పుణ్యావసానమున స్వర్గ భ్రష్టుడయ్యు సువర్ణ మణిముక్తాది ధన సంపన్న వంశమున అట్టి కుటుంబమున జనించును. మాఘమాసమునందు అరువది యారువేల తీర్థములు ప్రయాగమందలి గంగా యమునా సంగమమున కలియును. కావుననే లెస్సగా లక్ష గోదానములచే అబ్బునంత ఫలము మాఘమున గంగలో ఇట స్నానముచే కలుగును. ఈ గంగా యమునా మధ్యమున కాష్ఠాగ్నిని (అరణి మథనముచే) సాగించి వేల్చినచో ఏరోగములులేక పంచేంద్రియ సహితముగ సశరీరముగ ఇహ జీవితమును గడపి మృతికి తరు వాత తన దేహమందలి రోమ కూపములెన్ని కలవన్ని ఏండ్లు స్వర్గమున పూజితుడై సుఖించును. పిదప స్వర్గ పరిభ్రష్టు డయ్యు జంబూ ద్వీపాధిపతియై జనించి సుఖించుచు అదే తీర్థమును మరల సేవించును.

జలప్రవేశం యః కుర్యా త్సఙ్గమే లోక విశ్రుతే | రాహుగ్రస్తో యథా సోమో విము క్త స్సర్వపాతకైః. 12

సోమలోక మవాప్నోతి సోమేన సహ మోదతే | షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతానిచ. 13

స్వర్గేచ శక్రలోకే7స్మి న్నృషిగన్ధర్వసేవితే | పరిభ్రష్టస్తు రాజేన్ద్ర సమృద్ధే జాయతే కులే. 14

అధశ్శిరాస్తు యా జ్వాలా మూర్ధ్వపాదః పిబే న్నరః | శతవర్షసహ స్రాణి స్వర్గలోకే మహీయతే. 15

పరిభ్రష్టస్తు రాజేన్ద్ర చాగ్ని హోత్రీ భ##వేన్నరః | భుక్త్వాతు భోగా న్విపులాం స్తత్తీర్థం లభ##తే పునః. 16

యస్స్వదేహం ద్విధా కృత్వా శకునేభ్యః ప్రయచ్ఛతి| విహగై రుపభు క్తస్య శృణు తస్యాపి యత్ఫలమ్‌. 17

శతవర్షసహస్రాణి సోమలోకే మహీయతే | తతస్సర్గా త్ప్రరిభ్రఎn్టో రాజా బవతి ధార్మికః. 18

గుణవా న్రూపసమ్పన్నో భవతి ప్రియదర్శనః | భుక్త్వాతు భోగాన్విపులాం స్తత్తీర్థం లభ##తే పునః. 19

యామునే చో త్తరే కూలే ప్రయాగస్యతు దక్షిణ | ఋణప్రమోచనం నామ తీర్థంతు పరమం స్మృతమ్‌. 20

ఏకరాత్రోషితస్స్నాత్వా ఋణౖ స్సర్వైః ప్రముచ్యతే | సూర్యలోక మవాప్నోతి హ్యనృణీచ సదా భ##వేత్‌.

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మార్కణ్డయయుధిష్ఠిర సంవాదే ప్రయాగ

మాహాత్మ్య పఞ్చోత్తరశతతమో7ధ్యాయః.

ఇట్లు లోకవిశ్రుతమగు ఈ గంగా యమునా సంగమమున జలప్రవేశము (స్నానము) చేసినచో రాహు గ్రహణమునుండి చంద్రుడువలె సర్వ పాపవిముక్తుడై సోమలోకము చేరి సోమునితో కూడి స్వర్గలోకమునందు శక్ర సన్నిధినంది ఋషి గంధర్వ సేవితములగు ఆ లోకములందు అరువదియారు వేలేండ్లు ఆనందించును. పుణ్యావ సానమున స్వర్గ పరిభ్రష్ణుడయ్యు సర్వ సంపత్సుఖ సమృద్ధమగు కుటుంబమున జనించును. ఇచట అధఃశిరస్కుడై అగ్ని జ్వాలాపానము చేసినవాడు లక్ష వత్సరములు స్వర్గసుఖములంది స్వర్గ పరిభ్రంశము నందిన తరువాతను ఆహితాగ్నియై జనించి విపుల భోగములనుభవించి మరల ఆ తీర్థమునే సేవించును. ఈ ప్రయాగయందు తన దేహమును ఖండించి పక్షులకెరగానిచ్చుటచే లక్ష వత్సరములు సోమలోకమున సుఖప్రాప్తుడై పుణ్యావసానమున స్వర్గ పరిభ్రష్టుడయ్యు ధార్మికుడు రూపవంతుడు గుణవంతుడు ప్రియదర్శనుడునగు రాజై జనించి విపుల సుఖానుభవములనంది మరల ఆ తీర్థమునే సేవించును. ప్రయాగకు దక్షిణమున యమునా దక్షిణతీరమున మేలగు ఋణ ప్రమోచనమను తీర్థము కలదు. అచట నొకదిన ముపవసించి స్నానమాడినచో సర్వ ఋణ ముక్తుడై సూర్యలోక ప్రాప్తుడగును. మరల నెన్నడును ఋణగ్రస్తుడుకాడు.

ఇది శ్రీమత్స్యమమాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను

నూట యైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters