Sri Matsya Mahapuranam-1    Chapters   

త్ర్యు త్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యానువర్ణనమ్‌.

మార్కండేయ ఉవాచ : 

శృణు రాజన్‌! ప్రయాగస్య మాహాత్మ్యం పునరేవతు | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. 1

ఆర్తానాం హి దరిద్రాణాం! నిశ్చితవ్యవసాయినామ్‌ | స్థానముక్తం ప్రయాగంతు నాఖ్యేయంతు కదాచన. 2

వ్యాధితో యదివా దోనో వృద్ధోవా7పి భ##వేన్నరః | గంగాయమునయో ర్మధ్యే యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌. 3

దీ ప్తకాంచనవర్ణాభై ర్విమానైః సూర్యసంనిభైః | గంధర్వాప్సరసాం మధ్యే స్వర్గే క్రీడతి మానవః. 4

ఈప్సితా న్లభ##తే కామాన్‌ వదంతి ఋషిపుంగవాః | సర్వరత్న మయై ర్దివ్యై ర్నా నాధ్వజసమాకులైః. 5

వరాంగనాసమాకీర్ణై ర్మోదతే శుభలక్షణౖః | గీతవాద్యవినిర్ఘోషైః ప్రసుప్తః ప్రతిబుధ్యతే. 6

యావ న్న స్మరతే జన్మ తావత్‌ స్వర్గే మహీయతే | తతః స్వర్గా త్పరిభ్రష్టః క్షీణకర్మా దివ శ్చ్యుతః. 7

హిరణ్యరత్న సంపూర్ణ సమృద్ధే జాయతే కులే | తదేవ స్మరతే తీర్థం స్మరణా త్తత్ర గచ్ఛతి. 8

దేశస్థో యదివా7రణ్య విదేశస్థో7థవా గృహే| ప్రయాగం స్మరమాణో7పి యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌. 9

బ్రహ్మలోక మవాప్నోతి వదంతి ఋషిపుంగవాః | సర్వకామఫలా వృక్షా మహీ యత్ర హిరణ్మయీ. 10

ఋషయో మునయః సిద్ధా స్తత్ర లోకే స గచ్ఛతి | స్త్రీసహస్రవృతే రమ్యే మందాకిన్యా స్తటే శుభే. 11

మోదతే ఋషిభిః సార్ధం సుకృతేనేహ కర్మణా | సిద్ధచారణగంధర్వైః పూజ్యతే దివి దై వతైః. 12

నూటమూడవ అధ్యాయము

మార్కండేయుడు యుధిష్ఠిరునకు ఇట్లు చెప్పెను: రాజా! ప్రయాగ మాహాత్మ్యము నింకను చెప్పెదను వినుము; దానిని విన్నచో నిస్సంశయముగ సర్వపాప వినిర్ముక్తు డగును. ఆ తీర్థ క్షేత్రము ఆర్తులు దరిద్రులు కార్యసిద్ధికై నిశ్చితమగు సంకల్పము కలవారు మాత్రమే సేవింపదగునదియని చెప్పరాదు. వ్యాధితుడును దీనుడును వృద్ధుడును నైనను గంగాయమునల నడుమ ప్రయాగమందు ప్రాణత్యాగ మొనర్చినచో అట్టివాడు దీపించు కాంచనమువలె ప్రకాశించుచు సర్వ రత్నమయములును నానా విధములగు జెండాలతో నిండినవియు ఉ త్తమ స్త్రీ పరివారితములు శుభలక్షణ యు క్తములు నగు సూర్య సదృశ తేజస్సంపన్న విమానములపై సంచరించుచు స్వర్గమునగల గంధర్వాప్సరోజనము నడుమ క్రీడించుచుండును. అనియు ఇహమున సకలేప్సితములను పొందుననియు ఋషిపుంగవులు చెప్పుచున్నారు. అట్టివాడు గీతవాద్య మధుర ధ్వనులు వినుచు నిద్ర మేల్కాంచును. మరల జన్మించవలయునను స్మృతి రానంతవరకు (తన మహాపుణ్య మున్నంత పరకు) స్వర్గమున దేవపూజితుడై సుఖించును. ఆ పుణ్యము క్షీణించగనే స్వర్గమునుండి పరిభ్రష్టుడై సువర్ణ రత్న సమృద్ధమగు వంశమున జన్మించి అపుడును ఆ ప్రయాగ క్షేత్రమును స్మరించుచునే యుండును. దానిచే మరల నద్దానిని సేవించును. స్వదేశమందో విదేశమందో అడవియందో గృహమందో ఎచట నున్నను ప్రయాగ స్మర ముతో మృతినందు వాడు బ్రహ్మలోక ప్రాప్తుడగునని ఋషిపుంగవుల వచనమ; సర్వకామములు పండువృక్షములును సువర్ణమయభూమియు కలిగి ఋషులునుమునులును సిద్ధులును నుండు లోకమున వసించును. స్త్రీ సహస్ర పరివారితమయి రమ్యమగు (స్వర్గమందలి) శుభ మందాకినీ తటమున ఋషులతో కూడ నానందించును. సిద్ధచారణ గంధర్వాది దేవతలచే పూజితు డగును. అనంతరము పుణ్యక్షయమున స్వర్గ పరిభ్రష్టుడ య్యును జంబూద్వీపాధిపతి యగును. తరువాతను మరల మరల పుణ్యకర్మములనే స్మరించుచు ఆచరించుచు గుణవంతుడును వి త్త సంపన్నుడును నగును; ఇది నిస్సంశయము.

తతః స్వర్గా త్పరిభ్రష్టో జంబూద్వీపపతి ర్భవేత్‌ | తతః శుభాని కర్మాణి చింతయానః పునః పునః. 13

గుణవాన్‌ వి త్తసంపన్నో భవతీహ న సంశయః | కర్మణా మనసా వాచా ధర్మ సత్యప్రతిష్ఠితః. 14

గంగాయమునయో ర్మధ్యే యస్తు గాం సంప్రయచ్చతి | సువర్ణమణిముక్తాశ్చ యది చాన్య త్పరిగ్రహమ్‌. 15

స్వకార్యే పితృకార్యే వా దేవతా7భ్యర్చనే7పివా | సఫలం తస్య త త్తీర్థం యథావ త్పుణ్య మాప్నుయాత్‌.

ఏవం తీర్థేన గృహ్ణీయాత్‌ పుణ్య ష్వాయతనేషు చ | నిమి త్తేషు చ సర్వేషు హ్యప్రమత్తో భివే ద్ద్విజః. 17

కపిలాం పాటలావర్ణాం యస్తు ధేనం ప్రయచ్ఛతి |

స్వర్ణశృంగీం రౌప్యఖురాం కాంస్యదోహాం పయస్వినీమ్‌. 18

ప్రయాగే శ్రోత్రియం సంతం గ్రాహయిత్వా యథావిధి | శుక్లాంబరధరం శాంతం ధర్మజ్ఞం వేదపారగమ్‌.

సా గౌ స్తసై#్మ ప్రదాతవ్యా గంగాయమునసంగమే | వాసాంసిచ మహార్ఘాణి రత్నాని వివిధానిచ. 20

యావద్రోమాణి తస్యా గో స్సన్తి గాత్రేషు సత్తమ | తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. 21

యత్రాసౌ లభ##తే జన్మ సా గౌ స్తత్రాభిజాయతే | నచ పశ్యతి తం ఘోరం నరకం తేన కర్మణా. 22

ఉ త్తరా న్త్స కురూ న్ప్రప్య మోదతే కాల మక్షయమ్‌ | గవాం శతసహస్రేభ్యో దద్యా దేకాం పయస్వినీమ్‌.

పుత్త్రాన్‌ దారాం స్తథా భృత్యా న్గౌరేకా ప్రతితారయేత్‌| తస్మా త్సర్వేషు దానేషు గోదానం తు విశిష్యతే. 24

దుర్గమే విషమే ఘోరే మహాపాతకసఙ్కులే | గౌరేవ రక్షాం కురుతే తస్మాద్దేయా ద్విజాతయే. 25

ఇది శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్డయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ

మాహాత్మ్యే త్ర్యుత్తరశతతమో7ధ్యాయః.

మనోవాక్కాయ కర్మములను ధర్మమునందే నిలిపి గంగా యమునా నదీ ద్వయ మధ్యమున గోదానమొనర్చిన వాడును స్వ(కామ్య)కర్మలందో దేవ పితృకార్యములందో ప్రయాగ స్మరణముతో స్వర్ణమో మణులో ము త్తెములో ఇచ్చు వాడును ఆ తీర్థ ప్రభావమున తత్కర్మ సాఫల్యము నంది పుణ్యము నందును.

కావున ద్విజుడు దానములను ప్రతిగ్రహించుటలోను ఏమరుపాటు లేకుండవలెను- ప్రతియొక తీర్థమునందును పుణ్యక్షేత్రమునందును సర్వ నిమి త్తములందును ప్రతిగ్రహించరాదు. ప్రతి గ్రహించినను దానిని ప్రయాగ క్షేత్రమని భావించవలయును.

ప్రయాగలో శ్రోత్రియుడగు శుక్లవస్త్రధరుడును శాంతుడును ధర్మజ్ఞుడును వేదపారంగతుడును నగు బ్రాహ్మణునకు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలిగి సంధ్యాకాంతిగల పాడి కపిల గోవును బహు మూల్యములగు వస్త్రములను వివిధ రత్నములను యథావిధిగ దాన మొనర్చినవాడు ఆ గో శరీరమున నున్న రోమములన్ని వేల సంవత్సరములు స్వర్గమున పూజితుడయి సుఖించును. అతడు మరల జన్మించిన చోటనే ఆ గోవును జన్మించును. తత్పుణ్యవశమున నాతడు ఎన్నడును నరకమును చూడనైన చూడడు. ఉత్తర కురుదేశములందు అనంతకాలముండి మోదము నందును.

సాధారణములగు వేలకొలది గోవులను ఇచ్చుటకంటె పాడియావు నొకదానిని ప్రయాగలో ఇచ్చుట మేలు. అదియొకటియే పు త్త్రదార భృత్యుల నందరను తరింపజేయును. కావున సర్వదానములలోను పయస్వినీ (పాడి)గోదానము ఉత్తమము. దుర్గమములును విషమములును ఘోరములును నగు మహాపాతకములు సంభవించినపుడును పాడియావే రక్షించును. కావున ద్విజో త్తమునకు పాడి కపిల గోవును (ప్రయాగలో) దాన మీయవలెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను నూట మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters