Sri Matsya Mahapuranam-1    Chapters   

పృథ్వాదికృతధరణీ దోహనమ్‌.

10. దశమో7ధ్యాయః

ఋష యః:

 బహుభి ర్ధరణీ భుక్తా భూపాలై శ్ర్శూయతే పురా| పార్థివాః పృథవీయోగా త్పృథివీ కస్య యోగతః. 1

కిమర్థం చ కృతా సంజ్ఞా భూమేః కిం పరిభాషితా | గౌ రితీయం చ విఖ్యాతా సూత కస్మా ద్బ్రవీహి నః.

బ్రాహ్మణకృతవేనమథనమ్‌.

సూతః: వంశే స్వాయమ్భవే త్వాసీ దఙ్గో నామ ప్రజాపతిః | మృత్యోశ్చ దుహితా తేనపరిణీతాతు దుర్ముఖా.

సునీథా నామ తస్యాభూ ద్వేనో నామ సుతః పురా | అధర్మనిరతః కామీ బలవా న్వసుధాధిపః. 4

లోకే ప్యధర్మకృజ్జాతః పరభార్యాపహారకః | మమన్థు ర్బ్రాహ్మణా స్తస్య బలా ద్దేహ మకల్మషాః. 5

తత్కాయా న్మథ్యమానాత్తు ని ష్పేతు ర్ల్మేచ్ఛజాతయః | శరీరే మాతు రంశేన కృష్ణాఞ్జనసమప్రభాః. 6

పితు రఙ్గస్య చాంశేన ధార్మికో ధర్మకారకః | ఉత్పన్నో దక్షిణా ద్ధస్తా త్సధనుః * కవచీ శరీ. 7

దివ్యతేజోమయవపు స్సురత్న కనకాఙ్గదః | పృథురోమా7భవ త్తస్మా త్తతః పృథు రజాయత. 8

స విపై#్ర రభిషిక్త స్సంస్తపః కృత్వా7తిదుష్కరమ్‌ | విష్ణో ర్వరేణ సర్వస్య ప్రభుత్వ మగమత్ప్రభుః. 9

నిస్స్వాధ్యాయవషట్కారం నిర్ధనం వీక్ష్య భూతలమ్‌ | దగ్ధు మైచ్ఛత్తతః కోపా చ్ఛరే ణామితవిక్రమః. 10

తతో గోరూప మాస్థాయ భూః పలాయితు మైచ్ఛత | పృష్ఠతో7నుగత స్తస్యాః పృథు ర్దీప్తశరాసనః. 11

దశమాధ్యాయము

పృథువు మొదలగు వారు భూమిని గోవుగా చేసి పిదుకుట

ఋషులు నూతుని ఇట్లడిగిరి: పూర్వము రాజులెందరో భూమిని అనుభవించిరని వినుచున్నాము. పృథివిని పాలించిన వారు కావున పృథివీ శబ్దపు సంబంధముచే రాజులకు పార్థివులు అను పేరు ఏర్పడినది. పృథివి అనుశబ్దము మరి ఏ శబ్ద సంబంధముచే ఏర్పడినది? భూమికి ఆ పేరు ఏ అర్థమును తెలుపుటయి పరిభాషగా (సంకేతముగా) చేయ బడినది? అట్లే భూమికి గౌః (గో) అను పేరును వచ్చినది కదా? ఇందులకు హేతువేమి? మాకు తాము తెలుపవేడెదము.

సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను: స్వాయంభువమను వంశమున అంగుడను రాజు జన్మించెను. మృత్యుని కూతురు దుర్ముఖ అగు సునీథ అతని భార్య. వేనుడు అతని కుమారుడు. అతడు బలశాలి రాజై యుండియు ఎల్లప్పుడు అధర్మమునం దాస క్తి కలవాడు. కామపరుడు. లోకము నందును అధర్మమునే ఆచరించెడివాడు. పర భార్యలను అపహరించెడువాడు. బ్రాహ్మణులు ఆతని దేహమును బలము కొలది మథించిరి. మథింపబడుచుండిన ఆతని దేహము నుండి వ్లుెచ్ఛజాతుల వారు ఉత్పన్నులయిరి. వారందరును తల్లి (అగు సునీథ) అంశమును బట్టి కాటుకవలె నల్లని దేహచ్ఛాయ కలవారు. ఆ వేనుని కుడిచేతి నుండి తండ్రియగు అంగుని అంశమును బట్టి ధర్మము నెరిగినవాడును ధర్మము నాచరించు వాడును ఆచరింపజేయు వాడును అగు వాడొకడు జనించెను. అతడు కవచమును ధనుర్బాణములను ధరించి ఉండెను. దివ్య తేజోమయ శరీరమును మంచి రత్నములు తాపటము చేసిన బంగారు భుజ కీర్తులును కలిగి ఉండెను. పృథు (లావగు) రోమములు కలవాడగుటచే అతడు పృథువన ప్రసిద్ధుడు అయ్యెను. విప్రులు అతనిని చక్రవర్తిగా అభిషేకించిరి. అతడు దుష్కరమగు తపస్సాచరించెను. విష్ణు వరముచే అతడు సర్వ జగత్తునకును ప్రభువుగా నయ్యెను. భూతలమున స్వాధ్యాయముగాని వషట్కారము (యజ్ఞక్రియలు) గాని ధనముగాని లేకుండుట చూచి కోపము కలిగి అమితమగు విక్రమము కల ఆ పృథుడు శరముతో భూమిని దహింప సంకల్పించెను. అంతట భూదేవి గోరూపమును ధరించి పారిపోసాగెను. ప్రజ్వలించుచున్న ధనువు ధరించి పృథుడు ఆమెను వెంట నంటెను.

తతఃస్థిత్వైకదేశే తు కిం కరోమీతి సా7బ్రవీత్‌ | పృథుర ప్యవద ద్వాక్య మీప్సితం దేమి సువ్రతు. 12

పృథ్వాదికృతధరణీదోహనమ్‌.

సర్వస్య జగత శ్శీఘ్రం స్థావరస్య చ | తథేతి చాబ్రవీ ద్భూమిం దుదోహ చ నరాధిప. 13

స్వకే పాణౌ పృథు ర్వత్సం కృత్వా స్వాయమ్భవం మనుమ్‌ |

తదన్న మభవ ద్దుగ్ధం ప్రజా జీవన్తి యేన వై. 14

ఋషిభి ర్దుహ్యమానాయాం వత్స స్సోమ స్తథా7భవత్‌ |దోగ్ధా బృహస్పతి రభూ త్పాత్రం వేదా స్తపో రసః. 15

దేవైశ్చ వసుధా దుగ్ధా దోగ్ధా మైత్ర స్తథా7భవత్‌ | ఇన్ద్రో వత్స స్సమభవ తీక్షర మూర్జస్కరం బలమ్‌. 16

దేవానాం కాఞ్చనం పాత్రం పితౄణాం రాజతం తథా | అ న్తక శ్చా7భవ ద్దోగ్ధా యమో వత్స స్స్వధా రసః.

ప్రవాళపాత్రం నాగానాం తక్షకో వత్సకో7భవత్‌ | విషం క్షీరం తతో దోగ్ధా ధృత రాష్ట్రో7భవ త్పునః. 18

అసురై ర పి దుగ్ధేయ మాయసే శ త్రుపీడనమ్‌ | పాత్రే మాయాం తథా వత్సః ప్రాహ్లాదిశ్చ విరోచనః. 19

దోగ్ధా * విమూఢ స్తత్రాసీన్మాయా యేన ప్రవర్తితా యక్షైశ్చ వసుధా దుగ్ధా పురాన్తర్ధాన మీప్సుభిః. 20

కృత్వా వైశ్రవణం వత్స మామపాత్రే మహీపతే | ప్రేతరక్షోగణౖ ర్దుగ్ధా ధరా రుధిర ముల్బణమ్‌. 21

రౌప్యనాభో7భవ ద్దోగ్ధా సుమాలీ వత్స ఏవ తు | గన్దర్వైశ్చ పున ర్దుగ్ధా వసుధా సాప్సరోగణౖః. 22

అంతట భూదేవి ఒకానొక చోట నిలువబడి నేను నీకై ఏమి చేయవలయును? అని అడిగెను. సువ్రతా! (సత్కార్యములను చేయుదానా!) చరాచర రూపమయిన సర్వ జగత్తునకును శీఘ్రముగా కోరికలను తీర్చుము. అని పృథువు అనెను భూదేవి సరే అనెను. పృథు చక్రవర్తి స్వాయంభువ మనువును దూడగా చేసి గోరూప యగు భూమిని తన చేతియందే పిదికెను. ఆ వచ్చిన క్షీరము ప్రజలు జీవించుటకు సాధనము అగు అన్నముగా అయ్యెను. బృహస్సతి దోగ్ధ (పిదుకువాడు) కాగా ఋషులు సోముని దూడనుగా చేసి వేదములనెడి పాత్రయందు పాలు పిదికిరి. ఆ పాలు తపస్సుగా అయ్యెను. దేవతలు భూమిని పిదికిరి. దోగ్ధ మైత్రుడను దేవుడు. ఇంద్రుడు దూడ. బంగారు పాత్రము. సామర్థ్యము నిచ్చు బలము క్షీరము పితరులు వెండి పాత్రలో భూమిని పిదికిరి. అన్తకుడు (ప్రాణులను అంతమొందించు వాడగు పితృరాజు) దోగ్ధ. యముడు (ప్రాణుల పుణ్యపాపముల నిర్ణయించి తదనుగుణముగా ఫలముల నిచ్చుదేవుడు) దూడ. స్వధా (కారముతో ఇచ్చు ద్రవ్యము) క్షీరము. నాగులు పగడపు పాత్రలో తక్షకుని దూడనుగా ధృతరాష్ట్రుడను నాగుని దోగ్ధనుగా చేసి విషము అను క్షీరమును భూదేవి నుండి పిదికిరి. అసురులును గోరూపయగు భూమిని పిదికిరి. వారిది ఇనుప పాత్ర. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు దూడ. మాయలను ప్రవర్తిల్ల జేయువాడగు విమూఢుడను వాడు దోగ్ధ. శత్రువులను పీడించుట శత్రువుల పై మాయ ప్రయోగించుట అనునవి పాలు. కుబేరుని దూడనుగా చేసి యక్షుల ఆమ (కాలని మట్టి) పాత్రలోనికి అంతర్ధనము అను పాలను పిదికిరి. రౌప్యనాభుడు దోగ్ధగా సుమాలి దూడగా ప్రేతలును రక్షస్సులును భయంకరమగు రక్తమును పాలనుగా పిదికిరి.

___________________________________________

*ద్విమూర్ధాతత్రాసీన్మాయా

వత్సం చిత్రరథం కృత్వా గన్ధాన్పద్మదళే తథా | దోగ్ధా వసురుచిర్నామ గానవేదస్య పారగః. 23

గిరిభి ర్వసుధా దుగ్ధా రత్నాని వివిధాని చ | ఔషధాని చ దివ్యాని దోగ్ధా మేరు ర్మహాబలః. 24

మత్సో7భూద్ధిమవాం స్తత్ర పాత్రం శైలమయం పునః |

వృక్షైశ్చ మసుధా దుగ్ధా క్షీరం ఛిన్న ప్రరోహణమ్‌. 25

పలాశపాత్రే దోగ్ధా తు సాలః పుష్పలతాకులః | ప్లక్షో7భవ త్తతో వత్స స్సర్వ వృక్షవనాధిపః. 26

ఏవ మన్యైశ్చ వసుధా తథా దుగ్ధా యథేప్సితమ్‌ | ఆయుర్ధనం చ సౌఖ్యం చ పృథౌ రాజ్యం ప్రశాసతి. 27

న దరిద్ర స్తథా కశ్చి న్నరో వై న చ పాపకృత్‌ | నోపసర్గో * న వైరోక్తిః పృథౌ రాజ్యం ప్రశాసతి. 28

నిత్యం ప్రముదితా లోకా దుఃఖశోకవివర్జితాః | ధనుష్కోట్యా చ శైలేన్ద్రా నుత్సార్య స మహాబలః. 29

భూమణ్డలం సమం చ క్రే లోకానాం మితకామ్యయా | నగరగ్రామదుర్గాణి న చాయుధధరా నరాః. 30

¨ పుత్త్రాదిభి ర్న దుఃఖం చ న త్వశాస్త్రస్య చాదరః | నానీతిమన్తః పురుషా పృథౌ రాజ్యం ప్రశాసతి. 31

కథితాని చ పాత్రాణి తక్షతీరం చ మయా తవ | యేషాం యేన రుచి స్తత్ర తేభ్యో దేయం విజానతా. 32

యజ్ఞశ్రాద్ధేషు సర్వేషు మయా తుభ్యం నివేదితమ్‌ |

దుహితృత్వం గతా యస్మా త్పృథోః పృథ్వీ తతో మహీ. 33

తదానురాగయోగాచ్చ పృథివీ విశ్రుతా బుధైః. 34

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే పృథ్వాది

కృతధరణీదోహనం నామ దవమో7ధ్యాయః.

గంధర్వులును అప్సరోగణమును గాన వేద (సంగీత) తత్త్వము నెరిగిన వసురుచి దోగ్ధగా చిత్రరథుడు దూడగా తామర పూరేకునందు సుగంధములనెడి పాలు పిదికిరి. పర్వతములును శైలమయమైన పాత్రలో హిమవంతుడు దూడగా మేరువు దోగ్ధగా రత్నములనెడి పాలను పిదికిరి. పూవులతో తీగలతో వ్యాప్తమైయున్న ఏపిచెట్టు దోగ్ధగా అన్ని చెట్టులకు వనములకు అధిపతియగు జువ్వి చెట్టు దూడగా మోదుగ ఆకుల పాత్రయందు ఛిన్న ప్రరోహణము (నరకినను మరల మొలచుట) అను క్షీరమును వృక్షములు పిదికెను.

ఈ విధముగనే ఇతరులును ఇతర ప్రాణులును తమ కోరికల కొలది భూమిని పిదికిరి. పృథుడు రాజ్యమును ఏలుచుండగా ప్రజలకు ధనము ఆయువు సౌఖ్యము కొరత లేకుండెను. దరిద్రుడు కాని పాపములు చేయువాడు కాని ఎవడును లేకుండెను. ఉపద్రవములుకాని వైరపు మాటలు కాని లేకుండెను. ప్రాణులన్నియును దుఃఖ శోకములు లేక మిగుల సంతోషముతో ఉండెను. ఆ మహాబలుడు లోకముల హితమును కోరి తన వింటికొనతో పర్వతములను (గ్రామములను నగరములను దుర్గములను నిర్మించుటలో పంటలను పండించుటలో అడ్డము వచ్చినచో) దూరముగా నెట్టి వేసి భూమండలమును నగరములను గ్రామములను దుర్గములను సమములనుగా (సమతలము నందున్నవి) చేసెను. కొడుకులు మొదలగు చిన్న లవలన పెద్దలకు దుఃఖముగాని శాస్త్రాధ్యయనము లేని వానికి ఆదరముకాని లేకుండెను. పురుషులలో ఎవరును నీతి లేని వారు లేకుండిరి.

ఎవరికి ఎవరికి సంబంధించినవి ఏ పాత్రములో ఏ క్షీరములో నీకు తెలిపితిని. దానములు పూజలు చేయునపుడు ఆయా పాత్రలలో ఎవరికి ఏది ఇష్టమో ఎరిగి వారికి ప్రీతిగా వాటిని దానము చేయుటయో పూజాదులలో ఉపయోగించుటయో చేయవలెను. యజ్ఞములను శ్రాద్ధములును చేయునపుడు వీనిని పాటించవలెను.

_______________________________________

*ద్విమూర్ధాతత్రాసీన్మాయా * నచార్తోభూత్పృథౌ ¨ క్షయాతిశయదుఖంచ

ఈ చెప్పిన విధమున భూమి పృథువునకు కూతురుగా అయి ఆయన వాత్సల్యమును పొందినది కావున ఆమెకు పృథివి అను నామము ప్రసిద్ధమయ్యెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున పృథువు మొదలగు వారు భూమిని పిదుకుట యను దశమాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters