Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోననవత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

కల్పనామానుకీర్తనమ్‌.

మనుః కల్పమానం త్యయూ ప్రోక్తం మన్వన్తరయుగేషు చ | ఇదానీం కల్పనామాని సమాసా త్కథయాచ్యుత. 1

శ్రీమత్స్యః: కల్పానుకీర్తనం పక్ష్యే సర్వపాపప్రణాశనమ్‌ | యస్యానుకీర్తనా దేవ వేదపుణ్యన యుజ్యతే. 2

ప్రథమం శ్వేతల్పస్తు ద్వితీయో నీలలోహితః | వామదేవ స్తృతీయస్తు తతో రాథన్తరో7 పరః. 3

రౌరవః పఞ్చమః ప్రోక్తష్షష్ఠో దేవ ఇతిస్మృతః | సప్తమో7థ బృహత్కల్పః కన్ధర్పో7ష్టమ ఉచ్యతే. 4

నద్యో7థ నవమః ప్రోక్త ఈశానో దశమ స్స్మృతః | తమ ఏకాదశః ప్రోక్త స్తథా సారస్వతః పరః. 5

త్రయోదశ ఉదానస్తు గారుడో7థచతుర్దశః | కౌర్మః పఞ్చదశో జ్ఞేయః పౌర్మమాస్యా మజాయత. 6

షోడశో నారసింహస్తు సమానస్తు తతో7పరః | ఆగ్నేయో7ష్టాదశః ప్రోక్త స్సోమకల్ప స్తథా పరః. 7

మానవో వింశతిః ప్రోక్త స్తత్పుమానితి చాపరః | వైకుణ్ఠ శ్చాపర స్తద్వ ల్లక్ష్మీ కల్ప స్తథాపరః. 8

చతుర్వింశతిమః ప్రోక్త స్సావిత్రీకల్పసంజ్ఞకః | పఞ్చవింశ స్తతో ఘోరో వావాహస్తు తతో 7పరః 9

సప్తవింశో7థ వైరాజో గౌరీకల్ప స్తథాపరః | మాహేశ్వర స్తథా ప్రోక్త స్త్రిపురో యత్ర ఘాతితః. 10

పితృకల్ప స్తథైవాన్తే యా కుహు ర్బ్రహ్మణః స్మృతా | ఇత్యేవం బ్రహ్మణో మాస స్సర్వపాతకనాశనః. 11

ఆదావేవహి మాహాత్మ్యం యస్మిన్నస్య విధీయతే | తస్య కల్పస్య తన్నామ విహితం బ్రహ్మణా పురా. 12

రెండు వందవ ఎనిబది తొమ్మిదవ అధ్యాయము.

కల్పనామాను కీర్తనము.

మనువు మత్స్యరూప జనార్ధనుని ఇట్లడిగెను: భగవన్‌! అచ్యుతా! నీవు నాకు యుగములయు మన్వంతరములయు పరిమాణమును వానితో ఏర్పడు కల్ప పరిమా

ణమును ప్రవచింతివి; ఇపు డిక సమాన (సంక్షేప) రూపమున కల్పముల నామములను చెప్పుము; అనగా శ్రీమత్స్యుడిట్లు చెప్పెను; సరి; నీ వడిగినట్లు కల్పనామములను అనుకీర్తించినంత మాత్రముననే వేదముల నధ్యయనము చేయుటచే కలుగు పుణ్యమును మానవుడును పొందును.

మొదటిది శ్వేతకల్పము- రెండవది నీలలోహితకల్పము- మూడవది వాసుదేవము నాల్గవది రాథంతరము ఐదవది రౌరవము ఆరవది దేవము ఏడవది బృహత్‌-ఎనిమిదవది కందర్పము తొమ్మిదవది నద్యము పదియవది ఈశానము పదునొకండవది తమము పండ్రెండవది సారస్వతము పదమూడవది ఉదాసము పదునాలుగవది గారుడము పదునైదవది కౌర్మము; ఇది శుక్లపక్ష పంచదశ తిథియగు పూర్ణిమ యగును; అనగా శ్వేతకల్పము మొదలుగా ఒక్కొక్క కల్పము ప్రతిపత్‌ మొదలుగా శుక్లపక్షమునందలి పదునైదు తిథులగునని యర్థము.

తరువాత కృష్ణ ప్రతివలత్‌ మొదలుగా తిథులగు కల్పములు మరి పదునైదు; అవి- పదునారవది నారసింహము పదునేడవది సమానము పదునెనిమిదవది ఆగ్నేయము పందొమ్మిదవది సోమము ఇరువదవది మానవము ఇరువది యొకటవది తత్పురుషము ఇరువది రెండవదు వైకుంఠము ఇరువది మూడవది లక్ష్మీ కల్పము ఇరువది నాలుగవది సావిత్రీ కల్పము ఇరువది ఐదవది ఘోరము ఇరువది ఆరవది వావాహము ఇరువది ఏడవదు వైరాజము ఇరువది ఎనిమిదవది గౌరీకల్పము ఇరువది తొమ్మిదవది త్రిపురాసుర సంహారము జరిగిన కాలమగు మహేశ్వకల్పము ముప్పదవది పితృకల్పము; ఇది బ్రహ్మజీవితమందలి మాసమునందలి తిథులలో కడపటి దగు కుహురూపమగు అమావాస్య అని బ్రహ్మయే స్వయముగా స్మృతులందు (వేద ప్రమాణములగు శాస్త్రములయందు) చెప్పెను; (చతుర్ధశితో ఏ మాత్రము స్పర్శలేనిదై చంద్రదర్శనము ఏ మాత్రము లేని అమావాస్యకు "కుహు "అని సంజ్ఞ.)

ఇట్లు ఈ కల్పముల రూపమున చెప్పినవి బ్రాహ్మమాసము; ఇది వినినను అధ్యయనము చేసినను మహాపాతక నాశమగును.

ఒక్కొక్క కల్పము బ్రహ్మకు ఒక్కొక్క అహోరాత్రము; కావున ఆ అహోరాత్రపు పగటియందు ఆరంభకాలమున -అనగా ఉదయమున- బ్రహ్మ దేవుడు లోకసృష్టికి ప్రవృత్తుడగును; అట్టి నృష్ట్యాది ప్రవృత్తియందు ఏరూపమగు భగవత్తత్త్వపు మహాత్మ్యము (అనగా ఏ రూపమగు భగవదంశ తత్త్వపు ప్రాధాన్యము) ఆ కల్పమునందు ప్రతిపాదింపబడునో ఆ కల్పమునకు ఆ భగవదంశ తత్త్వపు పేరు పూర్వమందే స్వయంభూ బ్రహ్మచే ఈయబడినది.

సఙ్కీర్ణా స్తామసాశ్చైవ రాజసా స్సాత్త్వికా స్తథా | రజస్తమోమయా స్తద్వ దేతే త్రింశ దుదాహృతాః. 13

సఙ్కీర్ణేషు సరస్వత్యా ఃపితౄణాం వ్యుష్టి రుచ్యతే | అగ్నే శ్శివస్య మాహాత్మ్యం తమోరూపేషు వర్ణ్యతే. 14

రాజసేషుచమాహాత్మ్యమధికం బ్రహ్మణస్స్మృతమ్‌ | యస్మిన్కల్పేతు యత్త్రోక్తం పురాణం బ్రహ్మాణా పురా. 15

తస్య తస్య తు మాహాత్మ్యం తత్స్వరూపేమ వర్ణ్యతే | సాత్త్వికేష్వధికం తద్వద్విష్ణో ర్మాహాత్మ్య ముచ్యలే. 16

తేష్వేవ యోగసంసిద్ధా గమిష్యన్తి పరాం గతిమ్‌ | బ్రహ్మాం పాద్మ మిమం యస్తు పఠే త్పర్వణి పర్వణి. 17

తస్య ధర్మే మతిం బ్రహ్మ కరోతి విపులాం శ్రియమ్‌ | యస్తు దద్యా దిమా స్కృత్వా హైమాన్పర్వణిపర్వణి. 18

బ్రహ్మవిష్ణుపురే కల్పం మునిభిః పూజ్యతే దివి | సర్వపాపక్షయకరం కల్పదానం యతో భ##వేత్‌. 19

మునిరూపాం స్తథా కృత్వా దద్యాత్కల్పా న్విచక్షణః | పురాణసంహితా చేయం తవ భూప మయోదితా. 20

సర్వపాపహరా నిత్య మారోగ్యశ్రీఫలప్రదా | బ్రహ్మసంత్సరశతా దేకాహంశైవ ముచ్యతే. 21

శివవర్షతా దేకం నిమేషం వైష్ణవం విదుః | యదా స విష్ణు ర్జాగర్తి తదేదం చేష్టతే జగత్‌. 22

యదా స్వపితి శాన్తాత్మా తదా సర్వం ప్రలీయతే | సూతః ఇత్యుక్త్వా సర్వదేవేశో మత్స్యరూపీ జనార్దనః. 23

పశ్యతాం సర్వభూతానాం తత్రైవాన్తరధీయతః | వైవస్వతోపి భగవా న్వ్యసృజ ద్వివిధాః ప్రజాః. 24

స్వాన్తరం పాలయామాన మార్తణ్ణకులవర్ధనః | యస్య మన్వన్తరం చైత దధునా చానువర్తతే. 25

పుణ్యం పవిత్ర మేతద్వః కథితం మత్స్యభాషితమ్‌ | పురాణం సర్వశాస్త్రాణాం యదేత న్మూర్ధ్ని సంస్థితమ్‌. 26

ఇది శ్రీ మత్స్య మహాపురాణ మత్స్యమను సంవాదే కల్పనామానుకీర్తనం నామ

ఏకోననవత్యుత్తదద్విశతతమో7ధ్యాయః.

ఈ ముప్పది కల్పములును తామసములును రాజసములును సాత్త్వికములును సంకీర్ణములును (గుణత్రయమునకో గుణద్వయమునకో సాంకర్యము- పరస్పర సంమిశ్రణము- కలవియు) అని పలువిధములుగ నున్నవి; వీనిలో గుణత్రయ సంమిస్రణము గల పురాణములయందు సరస్వతీ మహత్త్వమో పితరుల మహాత్త్వమో ప్రతిపాదింపబడును; తమోరూప (తమోగుణ ప్రధాన) ములగు వానియందు అగ్ని శివుల మహాత్త్వమును రజోగుణమయ కల్పములందు బ్రహ్మ మహత్త్వమును సాత్త్విక కల్పములందు విష్ణు మహాత్మ్యమును ప్రధానముగా వర్ణింపబడును. పూర్వము బ్రహ్మ ఏ కల్పమునందు ఏ పురాణమును ప్రవచించెనో ఆ కల్పానుసారమా గుణతత్త్వము ప్రధానముగాగల ఆ దేవుని మహాత్మ్యమా పురాణమునందు వర్ణింపబడును.

ఆయా కల్పములందు ఉపాసకులు ఆ దేవతల నుపాసించి యోగసంసిద్ధి నంది పరమగతి నందుదురు; బ్రహ్మ ప్రోక్తమగు పాద్మకల్ప వృత్తాంతమును ప్రతిపాదించు ఈ మత్స్య పురాణమును ఎవరు పర్వదినములయందు పఠింతురో వారికి ధర్మమందు స్థిర చిత్తమును విపుల శ్రీని బ్రహ్మ కలిగించును.

ఈ కల్ప ప్రతిమలను బంగారుతో చేయించి ఆయా పర్వదినములందు దానము చేయువాడు బ్రహ్మ పుర విష్ణు పురములందు కల్పకాలముండి అందును ద్యులోకమునందు ముని పూజితుడగును; విషయ వివేకముకల మానవులు ఈ కల్పములను ముని రూపములతో ప్రతి మలుగా రూపొందించి దానమీయ వలెను.

అని పలికి మత్స్యుడు మనువుతో పురాణోపసంహారవచనము నిట్లు పలికెను . మను రాజా! నీకు నేను చెప్పిన ఈ పురాణ సంహిత (సంహిత= మహా రచన -వేదము.) సర్వపాపహరమును నిరంతరమగు ఆరోగ్యమును శ్రీని ఇచ్చునదియును.

(కల్ప పరిమాణ పరిణామమును వినుము: ) ఇట్టి ముప్పది కల్పములతో ఏర్పడు మాసములు పెండ్రెండు ఒక సంవత్సరముకాగా అట్టి బ్రహ్మ సంవత్సర శతము శివునకొక దినము; శివుని నూరు సంవత్సరములు విష్ణునకొక రెప్ప పాటు; విష్ణుడు మెలకువతో నున్నప్పుడు(కను తెరచినప్పుడు) ఈ జగత్తు ప్రవర్తిల్లును; అవిశ్వాత్ముడు శాంతాత్ముడై నిద్రించునపుడు (కనుమూయగా) ఇదియంతము ప్రలీనమగును; (అని మత్స్యుడు మనువునకు చెప్పి పురాణమున ముగించెను).

అనుచు సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను.

ఇట్లు పలికి మత్స్య రూపుడును దేవేశుడునగు జనార్ధనుడు సర్వభూతములును చూచుచుండగా (సర్వభూతము లును సాక్షులుగా- సర్వభూతముల అనుభూతియే ప్రమాణముగా) ఆదేశమునందే ఆ కాలమునందే అంరర్హితుడయ్యెను.

తరువాత భగవానుడగు వైవస్వతుడను ఈ మనువు వివిధ ప్రజలను సృజించెను; ఆ రవి కులానంద కరుడు తన అన్తరమును (తన కాలావధి యందలి విశ్వ ప్రవృత్తిని) పాలించెను; ఇపుడు అనువర్తితమగుచున్న మన్వంతరము అతనిదే; ఋషులారా! మీకు నే జెప్పిన ఈ మత్స్య రూప జనార్దన భాషితమగు ఈ పురాణ సంహితము వింటిరి కదా? ఇది సర్వశాస్త్రములకు మూర్ధ (శిరః) స్థానమునందున్నది. ('సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్‌.' అను న్యాయముననుసరించి ఇది సర్వపురాణ ప్రధానము).

ఇది శ్రీమతస్స్య మహాపురాణమున కల్పనామాను కీర్తనమను రెండు వందల ఎనుబది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters