Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్తాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రత్నధేనుదానవిధానమ్‌.

శ్రీ మత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | రత్న ధేను రితి ఖ్యాతం గోలోకఫలదం నృణామ్‌. 1

పుణ్యం దిన మథాసాద్య తులాపురుషదానవత్‌ | లోకేశావాహనం కృత్వా రత్నధేనుం ప్రకల్పయేత్‌. 2

భూమౌ కృష్ణాజినం కృత్వా లవమ ద్రోణ సంయుతమ్‌ | ధేనుం రత్నమయీం కుర్యా త్సఙ్కల్పవిధిపూర్వకమ్‌. 3

స్థాపయే త్పద్మారాగాణా మేకాశీతి మ్ముఖే బుధః | పుష్యరాగశతం తద్వ ద్ఘోణాయాం పరికల్పయేత్‌. 4

లలాటే హేమతిలకం ముక్తాఫలశతం దృశోః | భ్రూయుగే విద్రుమశతం శుక్తీ కర్ణద్వయే స్మృతౌ. 5

కాఞ్చనానిచ శృఙ్గాణి శిరోవజ్రశతాత్మకమ్‌ | గ్రీవాయం నేత్రపటకం గోమేదకశతాన్వితమ్‌. 6

ఇన్ద్రనీలశతం పృష్ఠే వైడూర్యశతపార్శ్వకే | స్ఫాటికై రుదరం తద్వ త్సౌగన్ధికశ##తైః కటిమ్‌. 7

ఖురా హేమమయాః కార్యాః పుచ్ఛం ముక్తావళీమయమ్‌ | సూర్యకాన్తే న్ధుకాన్తౌ చ ఘ్రాణ కర్పూరచన్ధనే. 8

కుఙ్కుమానిచ రోమాణి రూప్యనాభించ కారయేత్‌ | గారుత్మతశతం తద్వ దపానే పరికల్పయేత్‌. 9

రెండు వందవ ఎనుబది ఏడవ అధ్యాయము.

రత్నధేను దాన విధానము.

శ్రీ మత్స్య మనువున కిట్లు చెప్పెను: ఇపుడిక నరులకు గోలోక ప్రదమును అనుత్తమమును నగు రత్నధేను మహా దానమును వివరింతును; పుణ్యమగు పర్వదినమున తులా పురుష దానమందువలెనో లోక పాలావాహనమును జరిపి రత్నధేను రచన జరిపించవలయును: భూమి పై కృష్ణాజినమునమర్చి ద్రోణపరిమాణలవణమును దానిపై పోసి దానిపై ఈ రత్నమయధేనువును సంకల్ప పూర్వకముగా కల్పోక్త విధానముతో నిర్మించవలయును; ఎట్ల ముఖస్థానమునందు ఎనుబదియొక పద్మరాగములను ముట్టె యందు నూరుపుష్యరాగములను లలాటమునందు బంగరు తిలకమును కన్నులయందు నూరు ముత్తెములను రెండు కనుబొమలయందును నూరు పగడములను రెండు చెవులందును రెండు ముత్తెపు చిప్పలను బంగరుతోనే కొమ్ములను మూరువజ్రములలో శిరస్సును మెడయందు నూరు గోమేదకములతో గంగడోలును నూరింద్ర నీలములతో వీపును నూరు వైదూర్యములతో పార్శ్వములను స్ఫటికములతో ఉదరమునును నూరు సౌగంధికములతో కటిప్రదేశమును బంగరుతో గిట్టలను ముక్తావళులతో సూర్యవళులతో సూర్యకాంత చంద్రకాంతములతోను తోకను కర్పూర చందనములతోను ముకుపుటములను కుంకుమపూవుతో రోమమములను వెండితో నాభిని నూరు గరుడ పచ్చలతో అపానమును అమర్చి సర్వ సంధులందును ఇతర రత్నములను అమర్చవలెను.

కుర్యా చ్ఛర్కరయా జిహ్వాం గోమయంచ గుడాత్మకమ్‌.

గోముత్ర మాజ్యేన తథా దధిదుగ్ధే స్వరూపతః | పుచ్ఛాగ్రే చామరం దద్యా త్సమీపే తామ్రదోహనమ్‌.

కుణ్డలానిచ హైమాని భూషణానిచ శక్తితః | కారయే దేవ మేవంతు చతుర్థాంశేన వత్సకమ్‌. 12

తథా ధాన్యాని సర్వాణి పాదా శ్ఛేక్షుమయా స్మృతాః | నానాఫలాని సర్వాణి పఞ్చవర్ణం వితానకమ్‌. 13

ఏవం విరచనం కృత్వా తద్వ ద్ధోమాధివాసనమ్‌ | ఋత్విగ్భ్యో దక్షిణాం దద్యా ధ్ధేను మామన్త్రయేత్తతః. 14

గుడధేనువదావాహ్య ఇదం చోదహరే త్తతః | త్వాం సర్వదేవగణధామ యతః పఠన్తి రుద్రేన్ద్ర సూర్య కమలాసనవాసుదేవాః. 15

తస్మా త్సమ న్తభువనత్రయదేవయుక్తా మాం పాహి దేవి భవసాగరపీడ్యమాసమ్‌ | ఆమన్త్ర చేత్థ మభితః పరివృత్య భక్త్యా దద్యా ద్ద్విజాయ గురవే జలపూర్వికాం తామ్‌. 16

యః పుణ్య మాప్య దిన మత్రకృతోపవాసః పాపై ర్విముక్తతను రేతి పదంమురారేః | ఇతి సకల విధిజ్ఞో రత్నధేను ప్రదానం వితరతి స విమానం ప్రాప్య దేదీప్యమానమ్‌. 17

సకలకలుషముక్తో బన్ధుభిః పుత్త్ర పౌత్రై స్సహి మదనసరూప స్థ్సాన మభ్యేతి *విష్ణోః.17u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానానుకీర్తనే రత్నధేను ప్రదానికో

నామ సప్తాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

శర్కరతో నాలుకను గుడముతో గోమయమును ఆజ్యముతో గోమూత్రమును వస్తువులుగానే గోదధి గోక్షీరములను తోకచివరకుచ్చుగా చామరమును తత్సమీపమందు పాలు పెరుగు రాగి పాత్రను బంగరు కుండలములను ఇతర భూషణములను యథాశక్తిగ చేయించవలయును; ఈ విధముగానే ఇందు నాలుగవవంతుగ ఆయా సామగ్రితో దూడను చేయించవలయును. ఆపునకును దూడకును గూడ చెరకుతో పాదములనమర్చవలయును; సర్వధాన్యములను సర్వనానాఫలములను ఐదువన్నెల వితానకమును (మేలుకట్టును) అమర్చుకొనవలయును; హోమమును దేవతాధి వాసనమును జరిపి ఋత్విజులకు దక్షిణలను ఇచ్చి తరువాత ఈ రత్నధేనువునకు గుడధేనువు నందువలెనే ఆవాహనము జరిపి ఈ మంత్రమును పలుకుచు ఆమంత్రించవలయును:

" రుద్రేంద్ర రవి బ్రహ్మ విష్ణువులును 'నీవు సర్వదేవగణములకును ఆవాసస్థాన 'మని పేర్కొనుచున్నారు; కావున ఆ ప్రమాణము ననుసరించి సమస్త భువనత్రయమందలి దేవతలును నీయందే యున్నారు; ఇట్టి దేవీ! నీవు సంసార సాగరముచే పీడింపబడుచున్నావాడనగు నన్ను కాపాడుము. "

ఇట్లా మంత్రించి భక్తితో చుట్టును ప్రదక్షిణించి జలపూర్వకముగ ఆ గోవును తన గురుడగు బ్రాహ్మణునకు దానము చేయవలయును.

పుణ్య పర్వదినమున ఉపవాస పూర్వకముగ ఇది యాచరించినవాడు పాపవిముక్త దేహుడై విష్ణు స్తానప్రాప్తు డగును; సకల విధానమును ఎరిగి ఇట్లు రత్నధేను దాన మాచరించిన దాత సకల కలుష విముక్తి నంది దేదీప్యమాన విమాన మారోహించి మన్మథ సమానరూపుడై బంధు పుత్త్ర పౌత్త్ర సహితుడై విష్ణులోక ప్రాప్తు డగును.

* శమ్భోః

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున రత్నధేను ప్రదానికమను రెండు వందల ఎనిబది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters