Sri Matsya Mahapuranam-2    Chapters   

షడశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

సప్తసాగరదానవిధానమ్‌.

శ్రీమత్స్యః : 

అథాత స్సమ్ర్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | సప్తసాగరకం నామ మహాపాప ప్రణాశనమ్‌. 1

పుణ్యం దిన మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్‌ | తులాపురుషవ త్కుర్యా ల్లోకేశావాహనం బుధః. 2

ఋత్విఙ్మణ్ణపసమ్భార భూషణాచ్ఛాదనాదికమ్‌ | కారయే త్సప్త కుణ్డాని కాఞ్చనాని విచక్షణః. 3

ప్రాదేశమాత్రాణి తథారత్నిమాత్రాణి వా పునః | కుర్యా త్సప్తపలా దూర్ధ్వ మాసహస్రాచ్చ శక్తితః. 4

సంస్థాప్యాని చ సర్వాణి కృష్ణాజినతిలోపరి | ప్రథమం పూరయేత్కుణ్డం లవణన విచక్షణః. 5

ద్వితీయం పయసా తద్వ త్తృతీయం సర్పిషా పునః | చతుర్థంతు గుడేనైవ దధ్నా పఞ్చమ మేవచ. 6

షష్ఠం శర్కరయా తద్వ త్సప్తమం తీర్థవారిణా | స్థాపయేల్లవణస్థంతు బ్రహ్మాణం కాఞ్చనం శుభమ్‌. 7

కేశవం క్షీరమధ్యేతు ఘృతమధ్యే మహేశ్వరమ్‌ | భాస్కరం గుడమధ్యేతు దధిమధ్యే నిశాధిపమ్‌. 8

శర్కరాయాం న్యసే ల్లక్ష్మీం జలమధ్యేతు పార్వతీమ్‌ | సర్వేషు సర్వరత్నాని ధాన్యానిచ

సమన్తతః. 9

తులాపురుషవ చ్ఛేష మత్రావి పరికల్పయేత్‌ | తతో వారుణహోమాన్తే స్నాపితో విప్రపుఙ్గవైః. 10

త్రిః ప్రదక్షిణ మావృత్య మన్త్రా నేతా నుదీరయేత్‌ | నమో వ స్సర్వసిన్ధూనా మాధారేభ్య స్సనాతనాః. 11

జన్తూనాం ప్రాణదేభ్యశ్చ సముద్రేభ్యో నమోనమః | క్షీరోదకాజ్యదధిమాధురలావణక్షుసౌరామృతేన భువనత్రయజీవసఙ్ఘా&.12

ఆనన్దయన్తి వసుభిశ్చ యతో భవన్త స్తస్మా న్మమావ్యఘవిఘాత మలం దిశన్తు | యస్మా త్సమస్తభువనేషు భవన్త ఏవ తీర్థామరాసుబద్ధమణిప్రదానమ్‌. 13

పాపక్షయామృతవిలేపనభూషణాయ లోకస్య బిభ్రతి తదస్తు మమాపి లక్ష్మీః | ఇతి దదాతి రసామృతసంయుతా ఞ్ఛుచి రవిస్మయవానిహ సాగరా&. 14

అమలకాఞ్చనవర్ణమయానసౌ పద ముపైతి హరేరమారార్చితః | సకలపాపవిధౌత విరాజితః పితృపితామహపుత్త్రకళత్రకమ్‌. 15

నరలోకసమాకులమప్యయం ఝడితి సో7పి నయే చ్ఛివమన్దిరమ్‌. 15u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానానుకీర్తనే సప్తసాగరప్రదానికో

నామ షడశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఎనుబది యారవ అధ్యాయము.

సప్తసాగరదాన విధానము.

శ్రీమత్స్య మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడు ఇక అనుత్తమమును మహాపాప ప్రణాశనమును నగు సప్తసాగరకమను మహాదానమును వివరింతును; పుణ్యకరమగు పర్వదినమందు బ్రాహ్మణులచే తులాపురుష దానమందువలెనే స్వస్తి పుణ్యాహవాచనమును లోకపాలకావాహనమును జరిపించవలయును; దానియందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను భూషణములను వస్త్రములను సమకూర్చుకొనవలయును; విధాన మెరిగి యథాశక్తుగ ఏడు నుండి వేయి పలముల నడుమ తూకము గల బంగారుతో ప్రాదేశ(చాచిన బొటనవ్రేలి తుదకును చాచిన తర్జనికకును నడుమ గల దూరము) మాత్రముగాని పిడిమూరగాని వ్యాసముగాగల ఏడు కుండములను చేయించవలయును; అవి అన్నియును కృష్ణాజినమందు తిలలపై ఉంచవలయును; కుండములలో మొదటిది లవణములతో రెండవది క్షీరముతో మూడవది నేతితో నాల్గవది గుడముతో ఐదవది పెరుగుతో ఆరవది శర్కరతో ఏడవది తీర్థజలముతో నింపవలయును; లవణమందు బంగారు బ్రహ్మ ప్రతిమను క్షీరమందు కేశవుని ఘృతమందు మహేశ్వరుని గుడమందు భాస్కరుని పెరుగునందు చంద్రుని శర్కరయందు లక్ష్మీని జలమందు పార్వతిని అన్నిటియందును సర్వ రత్నములను సర్వ ధాన్యములను ఉంచవలెను; మిగిలిన వన్నియు తులాపురుష దానమందువలెనే జరుపవలెను; వారుణ హోమమును జరిపి హోమాంతమున వేదపుంగవు లగు విప్రులచే స్నానము చేయించబడి యజనమానుడు త్రిః ప్రదక్షిణము జరిపి ఈ మంత్రముల నుచ్చరించవలయును:

"సర్వసింధువు(నదు)లకును ఆధారములగు మీకు- సనాతనతత్త్వములగు సముద్రములారా! నమస్కారము; జంతువులకు (ప్రాణులకు) ప్రాణములను ఇచ్చు సముద్రములగు మీకు నమో నమః; పాలు నేయి పెరుగు మధుజలము లవణజలము చెరకు సుర- ఈ రూపములతో నున్న అమృతముతో భువనత్రయమునందలి జీవసంఘములను మీరు ఆనందింపజేయుచున్నారు; కావున ఇంత శక్తికల మీరు నాకు తగినంత అధికముగా పాపనాశమును కలిగింతురు గాక! మీరు సమస్త లోకములయందును ఉండెడు తీర్థములను దేవతలను అసురలను ఉత్తమ రత్నములను మీ యందు భరించుచు తీర్థములతే పాపక్షయమునపు కలిగించుచు మీ యందలి అమృతముతే దేవతలను పోషించుచు మీ యందలి విలేపనముల (గాయములను మాన్పు పూత మందుల )చేత అసురులు దేవతలతోడి యుద్ధములందు తినిన దెబ్బలవలని బాధలను మానుపుచు మణిరాసులచే మానవాదులకు భూషణాలంకారములను సమకూర్చుచు లోకక్షేమంకరములయి యున్నారు; కావున ఇట్టి మీచే మాకును లక్ష్మీ (క్షేమ సంపద) కలుగుగాక !"

అని ఇట్లు శుచి మానసుడై నేనింత గొప్ప పని చేసితిననే యను విస్మయము (ఆశ్చర్యముకాని గర్వముకాని ) లేక ఈ సప్త రసాన్వితకములగు అమృతసాగరములను అమలమగు కాంచనముతో చేయించి చక్కని వన్నెతో మెరయు వీనిని దానము చేయు నాతడు అమరులచేత అర్చితుడగుచు హరిలోకమునందును; సకల పాపములనుండియు విముక్తుడై కడిగి వేయబడి విరాజితుడగుచు అదివరకు నరకలోక- బాధలచే ఆకులత నందుచుండినవారే యయినను తన పితృపితామహ కళత్ర పుత్త్రాదులను కూడ ముక్తి నందించి శివపురమునకు కొని పోవును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమునందు షోడశమహాదానాను కీర్తనమున సప్తసాగర మహాదానాను కీర్తనమను రెండు వందల ఎనుబది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters