Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్వ్యశీత్యుతరద్విశతతమో7ధ్యాయః.

పఞ్చలాఙ్గలకదానవిధానమ్‌.

శ్రీమత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | పఞ్చలాఙ్గలకం నామ మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యాం తిథి మథాసాద్య యుగాదిగ్రహణాదికమ్‌ | భూమిదానం నరో దద్యా త్పఞ్చలాఙ్గలకాన్వితమ్‌. 2

ఖర్వటం ఖేటకం వా7పి గ్రమాంవా సస్యశాలినమ్‌ | నివర్తనశతం వాపి తదర్ధం వా7పి శక్తితః. 3

సారదారుమయా న్కృత్వా హలా న్పఞ్చ విచక్షణః | సర్వోపకరణౖర్యుక్తా నన్యా న్పఞ్చ చ కాఞ్చనా &. 4

కుర్యా త్పఞ్చపలాదూర్ధ్వా మాసహస్రపలావధి | వృషా న్లక్షణ సంయుక్తా న్దశైవతు ధురన్ధరా& . 5

సువర్ణశృఙ్గాభరణా న్ముక్తాలామలఙ్గూలభూషణా& | రూప్యపాదాగ్రతిలకా న్రక్తకౌశేయ భూషితా& .6

స్రగ్దామచన్దనయుతా ఞ్చాలాయా మధివాసయేత్‌ |* పర్జన్యాదిత్యరుద్రేభ్యః పాయసం నిర్వపే చ్చరుమ్‌. 7

ఏకస్మిన్నేవ కుణ్డతు గురు స్తేభ్యో నివేదయేత్‌ | పాలాశసమిధ స్తద్వదాజ్యం కృష్ణ తిలాం స్తథా. 8

తులాపురుషవ త్కుర్యా ల్లోకేశావాహనం బుధః | తతో మఙ్గళశ##బ్దేన శుక్లమాల్యామ్బరో బుధః. 9

ఆహుయ ద్విజదామ్పత్యం హేమసూత్రాజ్గుళీయకైః | కౌశేయవస్త్రకటకై ర్మణిభి శ్చాపి పూజయేత్‌. 10

శయ్యాం సోపస్కరాం దద్యా ద్ధేనుం మేకాం పయస్వినీమ్‌ | తథాష్టాదశ ధాన్యాని సమన్తా దధివాసయేత్‌. 11

తతః ప్రదక్షిణీ కృత్య గృహీతకుసుమాఞ్జలిః | ఇమ ముచ్చారయే న్మన్త్ర మథ సర్వం నివేదయేత్‌. 12

రెండు వందవ ఎనుబది రెండవ ఆధ్యాయము.

పంచలాంగలకదాన విధానము.

శ్రీమత్స్యుడు మనువున కిట్లు చెప్పెను: ఇపుడు ఇక అను(అత్యు)త్తమమగు పంచలాంగలకదానమను మహాదానపు విధానమును తెలిపెదను; అది మహాపాతక నాశనము; యుగాది మన్వాది చంద్రసూర్య గ్రహణాది రూపమగు పుణ్య తిథియందు లాంగల పంచకముతో కూడ భూదానము చేయవలయును; దానము చేయు భూ పరిమాణము పంట పైరులతో నిండినదగు 1. ఖర్వటము (పర్వత సమీప గ్రామము) 2, ఖేటము (చతిన్న పల్లె- గూడెము) 3. గ్రామము 4. నూరు నివర్తనములు (1159 వ పుట చూడుడు) 5. దానిలో సగము- వీనిలో నేదయిననై యుండవలెను; విచక్షణుడగు దాత బలము గల దారువుతో ఐదు నాగళ్లను వానికి కావలసిన సర్వోపకరణములతోను -అవి కాక ఐదు పలములకు పైగా వేయి పలము లకు లోపల తూకము గల బంగరుతో ఐదు నాగళ్లు ప్రతిమలను చేయించవలయును; కొయ్య నాగళ్లకై మంచి లక్షణములు కలవియు బాగుగ బరువు మోయగలవియునగు పది ఎద్దులను కూడ వేరుగ ఉంచి వాటికి బంగరు కొమ్ముల సోమ్ములను నాగళ్లకు ముత్తెపు సొమ్ములను వెండితో పాదాగ్రపు (గిట్టల) సొమ్ములను వెండి తిలకములను ఎర్ర పట్టువస్త్రపు గవు సెనలను మాలలను దండలను చందనాలంకారములను కూర్చి వాటిని శాలయందు నిలిపి అధివాసనము జరుపవలయును; వర్జన్యుని ఆదిత్యులను రుద్రుని ఉద్ధేశించి గురుడు ఒకే కుండమందు చరుపాయసమును నిర్వపించి నివేదించవలయును; ఫలాశ సమిధలను ఆజ్యమును నల్లనూవులను కూడ వేల్చవలెను; తులా పురుష దానమందువలెనే లోకపాలావాహనము చేయవలయును; తరువాత మంగళవాద్య వైదిక ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని వస్త్రములను పూలను ధరించి ద్విజదంపతుల నాహ్వానించి వారిని బంగరు దండలతో ఉంగరములతో కడియములతో మురుగులతో మణులతో పట్టు వస్త్రములతో పూజించవలయును; ఉపస్కరములతో కూడ శయ్యను

ఒక పాడి యావును వారికీయవలెను; అంతకు ముందే అష్టాదశ ధాన్యములను అధివాసనము చేసియుండి ఈ చెప్పిన సర్వసామగ్రిని అగ్నిని బ్రాహ్మణులను త్రిః ప్రదక్షిణించి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చరించుచు అవన్నియు ఆచార్యుడు మొదలగు వారి కీయవలెను.

యస్మా ద్దేవగణా స్సర్వే స్థావరాణి చరాణి చ | ధురంధరాఙ్గే తిష్ఠన్తి తస్మా ద్భక్తి శ్శివే 7స్తు మే. 13

యస్మాచ్చ భూమిదానస్య కలాం నార్హన్తి షోడశీమ్‌ | దానాన్యన్యాని మే భక్తి ర్ధర్మ ఏవ దృఢా భ##వేత్‌. 14

దణ్డన సప్తహస్తేన త్రింశద్దణ్డం నివర్తనమ్‌ | త్రిభాగహీనం గోచర్మం మానమాహ ప్రజాపతిః. 15

మానేనానేన యో దద్యా న్నివర్తనశతం బుధః | విధినా తేన తస్యాశు క్షీయతే పాపసంహతిః. 16

తదర్ధం మథవా దద్యా దపి గోచర్మమాత్రకమ్‌ | భవనస్థానమాత్రం వా సో7పి పాపైః ప్రముచ్యతే. 17

యావన్తి లాఙ్గలకమార్గముఖాని భూమే ర్భాసామ్పతే ర్దుహితు రజ్గజరోమకాణి |

తావన్తి శఙ్కరపురే స సమా హి తిష్ఠే ద్భూమిప్రదాన మిహ యః కురుతే మనుష్యః. 18

గన్ధర్వకిన్నరసురాసురదిద్ధసఙ్ఘై రాధూతామరముపేత్య మహా ద్విమానమ్‌ | సమ్పూజ్యతే పిత్యపితామహబన్దు యుక్త శ్శమ్భోః పురం వ్రజతి చా 7మర నాయక స్స &19

ఇన్ద్రత్వమప్యధిగతం క్షయమభ్యుపైతి గోభూమిలాజ్గలధురన్ధరసమ్ప్రదానాత్‌| తస్మాదఫ°ఘపటలక్షయకారి భూమే ర్దానం విధేయ మితి భూతిభవోద్భవాయ. 20

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మహాదానానుకీర్తనే పఞ్చలాఙ్గలకప్రదానికో

నామ ద్వ్యుశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

"సర్వ దేవగణములును చరస్థావర భూతములును ధురంధరమగు నాగళ్ల అవయవములందే యుండును; కావున ఆట్టివాని దయతే నాకు శివునియందు భక్తి కలుగుగాక! ఇతర దానములేవియు భూదానములో వదారవ పాలునకు సరిపోలవు; కావున ఆ దానపు మహిమచే నాకు ధర్మమునందు దృఢభక్తి కలుగుగాక !"

ఏడు మూరలు పొడవు ఒక దండము అనియు ముప్పది దండముల చదరపు భూమి నివర్తనమని వ్యవహారమనియు దానినుండి మూడవవంతు తగ్గినది గోచర్మ పరిమాణమనియు ప్రజాపతి వ్యవస్థ చేసియుండెను; (అనగా (7x30)2= (210)2= 44100

చదరపు మూరలు నివర్తనము; దీని భుజమందలి మూడవవంతు-10 దం. తగ్గించగా 7x20x7x20=140x140=19600 చదరపు మూరలు గోచర్మము అగును. (ప్రథమ సంపుటమున వివరణములు చూడవలెను. భాస్కరాచార్యులు 'పది మూరలు ఒక వంశ మగును; ఇరువది వంశముల చదరము నివర్తనము.' అనెను. దీని ననుసరించి 10x20x10x20=40000 చదరపు మూరలు నివర్తనము.) ఈ మానముల ననుసరించి నూరు నివర్తనముల భూమిని దానము చేసిన వానికి పాపరాశియంతయు శీఘ్రమే క్షీణించును; శక్తి లేనిచో ఏబది నివర్తనములో గోచర్మ మాత్రమో భవనమునకు సరిపోవు మాత్రమో ఐన నిచ్చినచో పాపముక్తి యగును; ఇట్లు భూమి ప్రదానము చేసిన మానవుడు ఆ భూమియందు ఎన్ని నాగటి చాళ్లు ఏర్పడునో దాన మిచ్చిన పాడియావు శరీరమందలి రోమము లెన్ని యుండునో అన్ని సంవత్సరములు శివనగరమున వసించును. గంధర్వ కింనర సురాసుర సిద్ధ సంఘములు చామరములు వీచుచుండు మహా విమాన మారోహించి అమర నాయకుడై పితృపితామహ బంధుయుక్తుడై శివపురమున కేగి అట సంపూజితుడై సుఖించును; గోవును భూమిని లాంగలములను వాటి ధురంధరములగు (బరువును లాగు) ఎద్దులను దాన మిచ్చుటతో కలుగు పుణ్యఫలముతో పోల్చినప్పుడు యాగాది పుణ్య కార్యములచే లభించు *ఇంద్రత్వాది పదములు కూడ క్షీణించునవియే యగును; అందు వలన పాపరాశి పటలమును క్షయింపజేయునదియు భూతిభవము (అభ్యుదయ నిఃశ్రేయన వృద్ధి) ఉడ్భవింపజేయునదియు నగు భూదానము చేయవలయును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమునందు పంచలాంగలక ప్రదానికమను రెండు వందల ఎనుబది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters