Sri Matsya Mahapuranam-2    Chapters   

అశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః

హిరణ్యా శ్వరథదానవిధానమ్‌.

శ్రీమత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌| పుణ్య మశ్వరథం నామ మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యం దిన మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాతనమ్‌| లోకేవాహనం కుర్యా త్తులాపురుషరుషదానవత్‌. 2

ఋత్విఙ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదినాదికమ్‌| కృష్ణాజినో తిలా స్కృత్యా కాఢ్చనం స్థాపయే ద్రథమ్‌. 3

అష్టాశ్వం చతురశ్వంవా చతుశ్చక్రం సకూబరమ్‌| ఐన్ద్రనీలేన కుమ్బేన ధ్వజరూపేణ సంయుతమ్‌. 4

లోకపాలాష్టకం తద్వ త్పద్మరాగదళాన్వితమ్‌| చతురః పూర్ణకలశా న్దాన్యాన్యష్టాదశైవ తు. 5

కౌశేయ వస్త్ర సంయుక్త ముపరిష్టా ద్వితానకమ్‌| మాల్యేషుఫలసంయుక్తం పురుషేణ సమన్వితమ్‌. 6

యో యద్భక్తః పుమాన్‌ కుర్య స్స తన్నామ్నాధివాసనమ్‌| ఛత్త్రచామరకౌశేయ వస్త్రోపానహసంయుతమ్‌. 7

గోభిర్విభవత స్సార్ధం దద్యాచ్చ శయనాదికమ్‌| కుర్యాత్తు త్రిపలా దుర్ధ్వం శక్తితః కారయే ద్బుధః. 8

అశ్వాష్టకేన సంయుక్తం చతుర్భి రథ వాజిభిః| ద్వాభ్యా మథ యుతం దద్యా ద్దేమసింహధ్వజాన్వితమ్‌. 9

చక్రరక్షా వుభౌ తస్య తురగస్థా పథాశ్వినౌ | పుణ్య కాల మథావాప్య పూర్వవ త్స్నాపితో ద్విజైః. 10

త్రిః ప్రదక్షిమ మావృత్య గృహీతకుసుమాఞ్జలిః| శుక్ల మాల్యామ్బరో దద్యా దిమం మన్త్రుముదీరయేత్‌. 11

నమో నమః పాపవినాశనాయ విశ్వాత్మనే వేదతురఙ్గమాయ| ధామ్నా మధీశాయ దివాకరాయ పాపౌఘదావానల దేహి శాన్తిమ్‌. 12

వస్వష్టకాదిమరుద్గణానాం త్వమేవ ధాతా పరమం నిధానమ్‌| యత స్తతో మే హృదయం ప్రయాతు ధర్మైకతానత్వమఫ°ఘనాసాత్‌. 13

ఇతి తురగరథ ప్రదాన మేకం భవ భయ సూదన మత్ర యః కరోతి| స కలుశపటలై ర్విముక్తదేహః పరమ ముపైతి పదం పినాకపాణః. 14

దేదీప్యమానవపుషా విజితః ప్రభావ మాక్రమ్య మణ్డల మఖణ్డితచణ్డభానోః| సిద్ధాఙ్గనానయనషట్పదపీయమానవక్త్రా మ్భుజో7 మ్బుజభ##వేన చిరం సహాస్తే. 15

ఇతి పఠతి శృణోతి వా య ఏత త్తురగరథస్య మహాప్రదాన మస్మి& | న స నరకపురం వ్రజే త్కదాచి న్నరకరిపో ర్భవనం ప్రయాతి భూయః. 16

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానాను కీర్తనే హిరణ్యాశ్వరథప్రదానికో

నామ అశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఎనుబదియవ అధ్యాయము.

హిరణ్యాశ్వ రథ దాన విధానము.

శ్రీ మత్స్య మనువుతో ఇట్లు చెప్పెను: ఇపుడిక అనుత్తమమును పుణ్య కరమును మహాపాతకనాశనమునునగు హిరణ్యాశ్వరథ దానమను మహాదానమును వివరింతును ; పుణ్యకరమగు శుభదినమందు తులాపురుష దానమందువలెనే బ్రాహ్మణులచే స్వస్తి పుణ్యాహవాచనమును లోకపాలావాహనమును జరిపించవలయును; ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రములను భూషణములను కూడ అందువలెనే సమకూర్చుకొనవలయును; కృష్ణా జినమునందు నూవులుంచు వానిపై రథమునుంచవలెను; దానికి ఎనిమిది గాని నాలుగు గాని అశ్వములు నాలుగు చక్రములు కూబరము ధ్వజ స్థానమున అష్టలోకపాలుర ప్రతిమలతో పద్మరాగ దశములతోకూడిన ఇంద్లనీల కుంభమునుండవలెను; నాలుగు పూర్ణ కలశములును అష్టాదశ ధాన్యములను పట్టు వస్త్రముల జతయు వీనిపై వితానకము (మేలు కట్టు)ను పూవులును చెరకు గడలును పురుష ప్రతిమయు ఛత్త్రచామరములును పాదుకలు పాదరక్షలు నుండవలెను

; ఎవరు ఏ దేవుని భక్తులో ఆ దేవుని పేరుతో అదివాసనము జరుపలయును ; రథాదికమునకు బంగారమును మూడు - వేయి పలముల నడుమ తూకముతో వాడవలెను; యథాశక్తిగ గోవులను శయనాదికమును గూడ ఈయవలెను; ఈ రథమందు ఎనిమిదియో నాలుగో రెండో గుర్రములును బంగరుతో చేసిన సింహధ్వజమును చక్రరక్షులుగా అశ్వినిదేవతలును నుండవలెను; శుభ సమయమున వెనుక చెప్పినట్లు విప్రులచే స్నానము చేయించుకొనిన యజమానుడు తెల్లని వస్త్రములను పూవులను ధరించి పూవులు దోసిట పట్టి దేవతాదులను బ్రాహ్మణులను అగ్నిని రథమును ముమ్మారు ప్రదక్షిణించి ఇవి దానమీయవలెను; అపుడీ మంత్ర ముచ్చరించవలెను :

"పాప వినాశనుడను విశ్వాత్ముడును వేదాశ్వుడును ధామము(తేజస్సు) కల కధీశుడును పాపరాసులకు దావాగ్నియు నగు దివాకరునకు నమోనమః; దేవా! మాకు శాంతినిమ్ము; అష్ట వసువులకు ద్వాదశాదిత్యులకు మరుద్గణములకును నీవే కర్తవు- పరమాశ్రయమవు; కావున నీ దయచే మా హృదయము పాపనాశమంది ధర్మైకాశ్రయమగుగాక !"

ఇట్లు సంసార భయనాశకమగు హిరణ్యాశ్వరథ దానమాచరించు వాడు కలుష

రాశివిముక్తశరీరుడై పినాక పాణియగు శివుని పరమపదమందును; దేదీప్యమాన

శరీరుడై సర్వజేతయగు ప్రభావముగల అఖండిత చండభానుని మండలమాక్రమించి సిద్ధాంగనా నేత్రములను తుమ్మెదలు తన ముఖ కమలమందలి యందమను తేనెను త్రావుచుండ బ్రహ్మతో కూడి సుచిరకాలము సుఖించును. ఇందలి ఈ హిరణ్యాశ్వ రథ దాన కల్పమును చదివినను విన్నను తత్పలముగా నరక పురమునకు పోక నరక శత్రుని పురమునకు పోవును.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వరథ ప్రదాన

విధానమను రెండు వందల ఎనుబదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters