Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్తసప్తత్యుత్తరద్విశతతమోధ్యాయః.

గోసహస్రప్రదానవిధానమ్‌.

శ్రీ మత్స్యః అథాత స్సమ్ప్రక్ష్యామి మదాగాన మనుత్తమమ్‌| గోసహస్రప్రదానాఖ్యం సర్వపాపహరం శుభమ్‌.1

పుణ్యాం తిథిం సమాసాద్య యుగమన్వన్తరాదికమ్‌| పయోవ్రతం త్రిరాత్రిం స్యా దేకరాత్ర మథాపివా. 2

లోకేశావాహనం కుర్యా త్తులాపురుషదానవత్‌| పుణ్యాహవాతనం కృత్వా హోమం కుర్యా త్తథైవచ. 3

ఋత్విఙ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదనాదికమ్‌| వృక్షం లవణంసంయుక్తం వేదీ మధ్యే వాధి7వాసయేత్‌. 4

గోసహస్రా ద్విసృష్టం య ద్గవాం దశక మేవచ| గోసహస్రం బహిః కుర్యా ద్వస్త్రమాల్యవిలేపనమ్‌. 5

సువర్ణశృఙ్గాభరణం రూప్యపాదసమన్వితమ్‌| ఆన్తః ప్రవేస్యదశకం వస్త్రమాల్యైః ప్రపూజయేత్‌. 6

సువర్ణఘణ్టికాయుక్తం కాంస్యదోహనకాన్వితమ్‌| సువర్మతిరకోపేతం హేమపట్టై రజఙ్కృతమ్‌. 7

కౌశేయ వస్త్రం సంవీతం మాల్యగన్ధై ర్విలేపితమ్‌| హేమరత్నమయై శ్శృఙ్గై శ్ఛామరై రుపశోభితమ్‌. 8

పాదుకోపానహచ్ఛత్రభాజనాసనసంయుతమ్‌| గవాందశకమధ్యే స్యా త్కాఞ్చనో నన్దికేశ్వరః. 9

కౌశేయవస్త్రసంవీతో నానాభరణభూషితః| లవణ ద్రోణ శిఖరే మాల్యేక్షు ఫలసంయుతః. 10

కూర్యా త్పలశతా దూర్ధ్వం సర్వ మేత దశేషతః| శక్తితః వలసాహస్రత్రితయం యావదేవతు.11

గోశ##తే7 పి దశాంశేన సర్వ మేత త్సమాచరేత్‌| పుణ్యకాలం సమాసాద్య గీతమఙ్గళనిస్వనైః. 12

సర్వౌషధ్యుదకస్నానం స్నాపితో వేదపారగైః| ఇమ ముచ్ఛారయే న్మన్త్రం గృహీతకుసుమాఞ్జలిః. 13

రెండు వందల డెబ్బది ఏడవ అధ్యాయము.

గోసహస్ర ప్రధాన విధానము.

శ్రీ మత్స్యుడు మనువుతో నిట్లు చెప్పెను : ఇపుడిక క్రమములో రావలసిన గోసహస్ర ప్రదానమను సర్వ పాప హరమును శుభకరము నగు అను( మహో) త్తమ మహాదానమును తెలిపెదను; యుగాది మన్వంతరాదుల వంటి పుణ్యకర శుభతిథియందు పయోవ్రతుడై (క్షీరమాత్రాహారుడై) త్రిరాత్రముకామి ఏకరాత్రముకాని ఉండవలెను; తరువాత తులా పురుష దానమందువలె లోకపాలావాహనము జరుపవలెను; అట్లే పుణ్యాహవాచన హోమములు జరుపవలెను; ఋత్వికులను మండపమును సంభారములను వస్త్రభూషణాదికమును సమకూర్చుకొనవలెను; వేదికా మధ్యమందు లవణసంయుక్తమగు వృక్షముననే (దేవతామూర్తికివలె) అధివాసనము జరుపవలెను; దానమునకై నిర్ణయించుకొన్న వేయి గోవులనుండి పదింటిని వేరుగ తీసికొనుచు మిగిలిన వానిని బయట నిలువబెట్టవలయును; వీనిని వస్త్రమాల్య విలేపన సువర్ణ శృంగాభరణములతో వెండి కాలిగిట్టలతో అలంకరించి లోపల ప్రవేశింపజేసి వానిని వస్త్రమాల్యములతో పూజించవలెను; బంగరు చిరుగంటలు పాలు పిదుకు కంచు పాత్రలు బంగరు తిలకములు బంగరు మొగపు పట్టెలు అలంకరించి పట్టు వస్త్రములతో వానిని కప్పి మాల్యములు చుట్టి గంధములు పూసి కనకరత్నమయ శృంగము అలంకరించి చామరపు కుచ్చులు కొమ్ముల నడుమ కట్టి అలంకరించవలయును; పాదుకలు పాదరక్షలు ఛత్త్రములు పాత్రలు ఆసనములు ఈ పదింటిలో ప్రతియొకదానితో పాటు వేరువేరుగ నుంచవయును; వీని నడుమ కాంచన నందికేశ్వరు డుండవలెను; ఆతనిని నూరు పలములకు- మూడు వేల ఫలములకు నడుమనుండు తూకపు బంగారుతో చేయించవలెను; మిగిలిన వానిలో మరినూరు గోవులకును నడుమ ఇందు పదియవవంతు తూకముతో ఇదియంతయు చేయించవలెను; ఈ నందిని పట్టు బట్టలతో చుట్టి నానా భరణములతో భూషించి పూలతో చెరకు గడలతో ఫలములతో ద్రోణ (తూమెడు) పరిమాణమగు ఉప్పు కల పాత్రయందు పై భాగమున (నూతన వస్త్రముపై) ఉంచవలెను.

శుభ సమయమున(ముహుర్తమునందు) యజమానుడు మంగళవాద్యగీతవాద్య ధ్వనుల నడుమ వేదపారంగతులగు బ్రాహ్మణ శ్రేష్ఠులచేత సర్వైషధీ జలములతో స్నానము చేయించబడి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చరించవలెను ;

నమో7స్తు ­శ్వమూర్తిభ్యో ­శ్వమాతృభ్య ఏవ చ| లోకాధివాసీనీ భ్యశ్చ రోహిణీభ్యో నమోనమః. 14

గవా మఙ్గేషు తిష్ఠన్తి భువనా న్యేకవింశతిః| బ్రహ్మాదయ స్తథా దేవా రోహిణ్యః పాన్తు మాతరః. 15

గావో మమాగ్రత స్సన్తు గావో సన్తు పృష్ఠతః| గావ శ్శిరసి మే సన్తు గవాం మధ్యే వసా మ్యహమ్‌. 16é

యస్మాత్త్వం వృషరూపేణ ధర్మ ఏవ సనాతనః| అష్టమూర్తే రధిష్ఠాన మతః పాహి సనాతన. 17

ఇత్యామన్త్ర తతో దద్యా ద్గురవే నన్దికేశ్వరమ్‌| సర్వోపకరణోపేతం గోయుతం చ విచక్షణః. 18

ఋత్విగ్భ్యో ధేను మేకైకాం దశకా ద్వినివేదయేత్‌| గవాంచ శత మేకైకం తదర్ధం వా7 థ వింశతిమ్‌. 19

దశ పఞ్చాథ వా దద్యా దన్యేభ్య స్తగనుజ్ఞయా | నైకా బహుభ్యో దాతవ్యా యతో దోషకరీ భ##వేత్‌. 20

బహ్వ్యశ్చైకస్య దాతవ్యా శ్రీమదారోగ్యవృద్ధయే| పయోవ్రత స్తత స్తిష్ఠే దేకాహం గోసహస్రదః. 21

'' విశ్వమూర్తులును విశ్వమాతలును లోకాధివాసినులు (అన్ని లోక భాగములను అధిష్ఠించియుండువారును) నగు రోహిణీ రూపలగు ధేనువులకు (మీకు) నమస్సు; * ఇరివదియొక లోకములును బ్రహ్మాది దేవతలును గోవుల అవయవము లందుండును ; ఇటువంటి రోహిణీ మాతలు మమ్ము రక్షింతురు గాక! ( 'రోహిణీ' అనగా ఆయా ఓషధులను - పుష్టి నిచ్చు ఆహారతత్త్వములను- మొలపించి వృద్ధి నందించగల చంద్రస్థితశక్తి; గోవులయందు ఆ హోరిణీ శక్తి రూపొంది యున్నది) గోవులు నాకు ముందుండు గాక! గోవులు నా వెనుక నుండుగాక! గోవులు నా శిరమందుండు గాక ! నేను గోవుల నడుమనే వసింతును (వసించుచున్నాను) వృషరూపముతో నున్న గోవా ! నీవు సనాతన (శాశ్వత) ధర్మ మవు కావున ఇటువంటి నీవు అష్టమూర్తి (పంచ భూతములు రవిచంద్రులు యజమానుడు ) నను ఎనిమిది రూపులతో నున్న) శిశు నకు ఆశ్రమయి (వృషభ రూపమున వాహనమవయి) యున్నావు; కావున సనాతనా ! నన్ను రక్షించుము.''

ఇట్లా మంత్రించి తరువాత ఆచార్యునకు (గురునకు- ప్రధాన ఋత్విజునకు) నందికేశ్వరుని సర్వోపకరణములను ఒక గోవును ఈయవలెను; పది గోవులలోను ఒక్కొక్క ఋత్విజునకు ఈయవలెను; మిగిలిన వానిలో ఒక్కొక్క బ్రాహ్మణునకు నూరేసియో ఏబదేసియో ఇరువదేసియో ఐదేసియో ఆచార్యు ననుమతితో ఈయవలెను ; ఒక గోవు ననేకులకు కలిపి ఈయరాదు; అది బహు దోషకరము ; ఒకనికే అనేక గోవుల నీయవచ్చును; అది ఆరోగ్యమును శ్రీ ని వృద్ధిపరచును; ఇట్లు గోసహస్రదానమయిన తరువాత దాత ఒకనాడంతయు పయోవ్రతుడై (క్షీర మాత్రాహారుడై ) యుండవలయును.

శ్రావయే చ్ఛృణుయాద్వాపి మహాదానాను కీర్తినమ్‌| తద్దినే బ్రహ్మచారీ స్యా ద్యదీచ్చే ద్విపులాం శ్రియమ్‌. 22

అనేన విధినా యస్తు గోసహస్రప్రదో భ##వేత్‌| సర్వపాపవినిర్ముక్త స్సిద్ధచారమసేవితః. 23

విమానేనార్కవర్ణేన కిఙ్కిణీజాలమాలినా| సర్వేషాం లోకపానాం లోకే సమ్పూజ్యతే7 మరైః. 24

ప్రతిమన్వన్తరం తిష్ఠే త్పుత్త్రపౌత్త్రసమన్వితః | సప్తలోకా సతిక్రమ్య తత శ్శివపురం వసేత్‌. 25

శత మేకోత్తరం తద్వ త్పతృణాం తారయే ద్భుధః| ప్రతిమన్వన్తరం తిష్ఠే త్పుత్త్రపౌత్త్రసమన్వితః. 26

యావత్కల్పశతం సాగ్రం రాజరాజో భ##వేత్తతః|అశ్వమేధశతం కుర్యా చ్ఛిపధ్యానపారయణః. 27

వైష్ణవం లోక మాసాధ్య తతో ముచ్యేత బన్ధనాత్‌ | పితర శ్చాభినన్ధన్తి గోసహస్రప్రదం సుతమ్‌. 28

*ఇరువది యొక లోకములును ఏవి ఏవి గ్రహించవలయును- అనునది సంప్రదాయము ఎరిగిన వారినుండి గ్రహించవలయును. దీని వ్యవస్థ బహు విధములుగా నున్నది.

అపి స్యాత్సుకు7లే స్మాకం పుత్త్రో దౌహిచ ఏవచ| గోసహస్రవ్రదో భూత్వా నరకా దుద్ధిరిష్యతి. 29

తస్య కర్మకరో వా స్యా దపి ద్రష్టా తథైవచ| సంసారసాగరా దస్మా ద్యో7 స్మా న్త్సన్తారయిష్యతి. 30

ఇతి పఠతి య ఏత ద్గోసహస్రప్రదానం హరిభువన ముపేయా త్సంస్మరేద్వా7థ పస్యేత్‌. అనుభవతి ముదం వాముచ్యమానో నికామం ప్రహతకలుషదేహ స్సో7పి యాతీన్ద్రలోకమ్‌. 31

ఇది శ్రీ మత్స్య మహాపురాణ మహాదానాను కీర్తనే గోసహస్ర ప్రదానికో నామ సప్తసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

దాత ఆనాడు మహాదానాను కీర్తనమును తాను వినవలయును; ఇంతరులకు వినిపించవలయును; దాన దినమున బ్రహ్మచర్యముతో నుండవలయును; దీనిచే విపులశ్రీ కలుగును; ఎవరు ఈ విధానమున గోసహస్ర ప్రదులగుదురో వారు సర్వపాప వినిర్ముక్తులయి సిద్ధచారణ సేవితులై చిరుమువ్వలగములు మాలలుగా వ్రేలాడుచుండు రవి ప్రకాశ విమానము పైకెక్కి సర్వలోకపాల లోకములకును ఏగి అందు సర్వామర పూజితుడగుచు పుత్త్ర పౌత్త్ర సమన్వితుడై ఒక్కొక్క లోకపాల లోకమందొక్కొక్క మన్వంతర కాలముండును; తరువాత ఊర్ధ్వసప్త లోకములలో ఒక్కొక్క దాని యందొక్కొక్క మన్వంతరముండి యనంతరము శివపురమేగును; తన నూటొక్కమంది పితరులను తరింపజేయును; అందు పూర్ణమగు నూరు కల్పములుండి అనంతరము భూలోకమున శివధ్యాన పరాయణుడగు చక్రవర్తి యై జనించి సూరశ్వమేధములాచరించి తుదకు విష్ణులోకమును చేరి బంధవిముక్తుడగును.

'' గోసహస్ర ప్రదానమును తానే చేసికొని ఆ కార్యమునందు తానును కర్మకరుడై పాలుగొని కాని అది ఎవరైన చేయుచుండగా చూచి కాని మమ్ము ఈ సంసార సాగరమునుండి తరింపజేయువాడు మావంశమున పౌత్త్రుడో దౌహిత్రుడో పుట్టినచో బాగుగా నుండును.'' అని పితరులు గోసహస్ర ప్రదాతను అభినందించుచుందురు; ఈ

గోసహస్ర ప్రదాన విధాన మును పఠించినను సంస్మరించుచుండినను చూచినను విష్ణులోక ప్రాప్తుడగును; సంతోషములనందును; ముక్తినందును కలుషములు బొత్తుగా ఎమియు లేకుండ నశించగా నిర్మలదేహు (జన్ము) డై ఇంద్రలోకమునకేగి సుఖమందును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమను గోసహస్ర ప్రదానికమను రెండు వందల డెబ్బది యేడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters