Sri Matsya Mahapuranam-2    Chapters   

షట్‌ సప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

కల్పపాదపప్రదానవిధానమ్‌.

శ్రీ మత్స్యః : కల్పపాదపదానాఖ్య మహాదాన మనుత్తమమ్‌| మహాదానం ప్రవక్ష్యామి మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యం దిన మథాసాద్య తులాపురుషదానవత్‌| పుణ్యాహవాచనం కృత్వా లోకేశావాహనం తథా. 2

ఋత్విఙ్మణ్డపసమ్భారభూషణాచ్ఛాదనాదికమ్‌| కాఞ్చనం కారయే ద్వృక్షం నానాఫలసమన్వితమ్‌. 3

నానావిగ్రహవస్త్రాణి భూషణానిచ కారయేత్‌| శక్తి తస్త్రిపలాదూర్ధ్వ మాసహస్రా త్ప్రకల్పయేత్‌. 4

అర్ధక్ల్‌ ప్తసువర్ణస్య కారయే త్కల్పపాదపమ్‌| గుడప్రస్థోపరిష్టాచ్ఛ సితవస్త్రయుగాన్వితమ్‌. 5

బ్రహ్మవిష్ణుశివోపేతం పఞ్చశాఖం సభాస్కరమ్‌| కామదేవమధస్తాచ్ఛ సకళత్రం ప్రకల్పయేత్‌. 6

సన్తానం పూర్వత స్తద్వత్తురీయాంశేన కల్పయేత్‌| మన్దారం దక్షిణ పార్శ్వే శ్రియా సార్ధం ఘృతోపరి. 7

పశ్చిమే పారిజాతంచ సావిత్ర్యా సహ జీరకే| సురభీసంయుతం తద్వ త్తలేషు హరిచన్దనమ్‌. 8

తురీయాంశేన కుర్వీత సౌమ్యే చ ఫలసంయుతమ్‌| కౌశేయవస్త్రసంయుక్తా నిక్షుమాల్యఫలాన్వితా &. 9

తథా7ష్టౌ పూర్ణకలశా న్పాదుకాసనభాజదనమ్‌| దీపకోపానహచ్ఛత్ర

చామరాసనసంయుతమ్‌. 10

ఫలమాల్యాయుతం తద్వ దుపరిష్టా ద్వితానకమ్‌| తథాష్టాదశ ధాన్యాని సమన్తా త్పరికల్పయేత్‌. 11

రెండు వందల డెబ్బది యారవ యధ్యాయము.

కల్పపాద ప(వృక్ష) దాన కథనము.

శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను : ఇపుడిక నీకు అను(మహో) త్తమమగు కల్పవృక్ష ప్రదాన మను మహాదానపు విధానమును వివరింతును; వినుము ; అది మహాపాతక నాశన మగునది; పుణ్య కరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను సమకూర్తుకొనవలయును ;నానా ఫల సమన్విత మగు బంగరు వృక్షమును అందు నానా పక్షి వస్త్రాభుషణములను యథాశక్తిగ పలత్రయమునకును వేయి పలములకును నడిమ తూకముగల బంగరుతో చేయించవలయును; మొత్తము తూకములో సగము తూకపు బంగరుతో వృక్షమును చేయించి దానిని వ్రస్థ మాత్రము గుడముపై తెల్లని వస్త్రద్వయముపై నుంచి మిగిలిన సగములో కొంతతో బ్రహ్మ విష్ణురుద్ర భాస్కరులను పక్షి వస్త్ర భూషణాదికమును వృక్షము క్రింద నుండునట్లు కామధేవుని అతని పత్నియగు రతిని చేయించవలెను ;దీనికి తూర్పున మొత్తము తూకములో నాలుగవ వంతుతో సన్తాన(మను కల్పవృక్ష విశేష)మును తక్షిమమున నేతిపై అదే నాల్గవ వంతు తూకముతో మందారమను కల్పవృక్ష విశేషమును లక్ష్మీతో కూడను పశ్చిమమున పారిజాత మనెడు కల్పవృక్ష విశేష మును జీరకమునందు సావిత్రితో కూడ అదే నాలుగవ వంతు తూకపు బంగరుతోను అట్లే నాలుగ వంతు తూకపు బంగరుతో నూవులపై కామధేనువుతో కూడ ఉత్తర దిశయందు హరిచందనమను కల్పవృక్ష విశేషమును ఫలములతో కూడను చేయించవలెను; పట్టు వస్త్రములను చెరకు గడలను పూవులను పండ్లను ఎనిమిది పూర్ణ కలశములను పాదుకలను ఆసన ములను పాత్రలను దీపకములను పాదరక్షలను ఛత్ర చామరాసమనులను ఫలపుష్పాద్యలంకృత వితానకమును (మేల్కట్టు-చాందినీని) అష్టాదశవిధ ధాన్యములను సమకూర్తుకొని అన్ని వైపులను ఉంచుకొనవలయను.

హోమాధివాసనాన్తేతు స్నాపితో విప్రపుఙ్గవైః| త్రిః పదక్షిమ మావృత్య మన్త్ర మేత దుదీరయేత్‌. 12

నమస్తే కల్పవృక్షాయ చిన్తితార్థప్రదాయినే| విశ్వమ్భరాయ నమస్తే విశ్వమూర్తయే. 13

యస్మాత్త్వమేవా విశ్వాత్మా బ్రహ్మ స్థాణు ర్దివాకరః| మూర్తో7మూర్తః పరం బీజ మతః పాహి సనాతనః.

త్వమేవా మృతసర్వస్య మనన్తః పురుషో7వ్యయః| సన్తానాద్యై రుపేతో7స్మా న్పాహి సంసారసాగరాత్‌.

ఏవ మామన్త్ర్య తం దద్యా ద్గురవే కల్పపాదపమ్‌| చతుర్భ్యశ్చాపి ఋత్విగ్భ్య స్సన్తానాదీ న్ప్రకల్పయేత్‌. 19

స్తూయమానో దివః పృష్ఠే పుత్త్రపౌత్త్ర ప్రపౌత్త్రకైః విమానేనార్కవర్ణేన విష్ణులోకం స గచ్ఛతి. 20

దివి కల్పశతం తిష్ఠే ద్రాజరాజో భ##వేత్తతః| నారాయణబలోపేతో నారాయణపరాయణః. 21

నారాయణకథాస్తకో నారాయణపురం వ్రజేత్‌| యో వా పఠేతస్తకలకల్పతరుప్రదానం యో వా శృణోతి పురుషో7ల్పధన స్మ్సరేద్వా. 22

సో 7పీన్ద్ర లోక మధిగమ్య సహాప్సరోభి ర్మన్వన్తరం వసతి పాపవిముక్తదేహః.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానానుకీర్తనే కల్పపాదపప్రదానికో నామ

షట్‌ సప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

హోమమును అధివాసమును ముగిసిన తరువాత విప్ర పుంగవులచే స్నానము చేయించుకొనబడి యజమానుడు కల్పవృక్షాదికమునకు అగ్నులకు అవిహిత దేవతలకు విప్రులకు త్రిః ప్రదక్షిణ చేసి ఈ మంత్రము నుచ్చరించ వలయును;

''చింతి(సంకల్పి) తార్థ ప్రదాయియగు కల్పవృక్షమునకును విశ్వంభరుడును విశ్వమూర్తియనగు దేవునకును తన్మూర్తియగు కల్పవృక్షమునకు నీకును నమః నీవు విశ్వాత్ముడవును బ్రహ్మవు రుద్రుడవు దివాకరుడవు మూర్తమగు (రూపముగల) ఆమూర్త (రూపములేని) మగు తత్త్వములును పరమ బీజరూపుడవును కావున సనాతన రూపా ! నన్ను రక్షించుము ;అమృత సర్వస్వమును అవ్యయుడగు అనంతపురుషుడవును నీవే ; సంతానము పారిజాతము మందారము హరిచందనము ననెడు వృక్ష విశేషములతో కూడిన నీవు మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.''

ఇట్లు ఆమంత్రించి కల్పవృక్షమును గురున కీయవలయును ;నలుగురు ఋత్విజులకును సంతానాది వృక్ష చతుష్టయమును ఈయవలయును ;స్వల్పపరిమాణముతో చేయునపుడు ఏకాగ్ని విధానముతో హోమము జరిపి (ఇందు ఋత్విజులెవరు నుండరు కనుక) అంతయును గురునకే అర్పించవలయును ;విత్తశాఠ్యమును (ధన ముండియులేనివాని వలె కొరత )చేయరాదు; ఇంతయయినదేయని యాశ్చర్యపడరాదు; ఈ విధానమున ఈ మహాదానము నర్పించినవాడు సర్వ పాప వినిర్ముక్తుడగును; అశ్వమేధఫలము నందును ;అప్సరః సిద్ధచారమ కింకర పరివృత్తుడై వారిచే అంతరిక్షమున స్తూయమానుడై పుత్త్ర పౌత్త్రులతో కూడి రవిప్రకాశవిమాన మారోహించి విష్ణులోకమున కేగును ;తన గోత్రమునందు తన కాదరణీయులగు గడచిన - గడువనున్న- తరముల మనుజులను తరింపజేయును; స్వర్గమందు నూరు కల్పములుండును;తరువాత చక్రవర్తియై జనించును ;నారాయణుని బలగముతో కూడి నారాయణ పరాయణుడై నారాయణ కథాసక్తుడై నారాయణపుర మేగును ;ఈ సకల కల్పవృక్ష ప్రధాన ప్రక్రియ నెవరు పఠింతురో వినోదరో అల్పధనులైనందున దీని నాచరించలేక స్మరించుచునైన నుందురో వారును అప్సరసలతో కూడి ఇంద్రలోక మేగి పాపవిముక్త దేహులై మన్వంన్తరకాల ముండి సుఖింతురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కల్పపాదపప్రదాన కథనమను రెండు వందల డెబ్బది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters