Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్విసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

భవిష్యద్రాజానుకీర్తనమ్‌.

సూతః : కాణ్వాయన స్తతో భూపం సుశర్మాణం ప్రగృహ్య తమ్‌| శౌఙ్గానాం చైవ యచ్ఛేషం క్షపయిత్వా బలీయనః.1

శిశుకో7న్ద్రజతీయః ప్రాప్స్యతీమాం వసున్దరామ్‌ | త్రయోవింశత్సమా రాజా శిశుకస్తు భవిష్యతి. 2

కృష్ణభ్రాతా యవీయాంస్తు హ్యష్టాదశ భవిష్యతి | శ్రీమల్లకర్ణి ర్భవితా తస్య పుత్త్రస్తు వై దశ. 3

పూర్ణోత్సఙ్గస్తు వై రాజా వర్షాణ్యష్టాదశైవతు | పఞ్చాశతం సమాష్షట్చ శాన్తకర్ణి ర్భవిష్యతి. 4

శ్యోచ్యస్తుతి స్తథా రాజా సమా హ్యష్టాదశైవతు | దశ చాష్టౌచ వర్షాణి తస్య లమ్బోదర స్సుతః. 5

ఆపీతకో దశ ద్వే తు తస్య పుత్త్రో భవిష్యతి| దశ చాష్టౌచ వర్షాణి మేధ (ఘ) స్వాతి ర్భవిష్యతి. 6

స్వాతిశ్చ భవితా రాజా సమా స్త్వష్టాదశైవతు | స్కన్దస్వా స్తథా రాజా సప్తచైవ భవిష్యతి. 7

మృగేన్ద్ర స్వాతికర్ణస్తు భవిష్యతి సమాస్త్రయః | కున్తలస్స్వాతికర్ణస్తు భవితా7ష్టౌ సమా నృపః. 8

పుష్పసేనశ్చ భవితా తస్మా త్సౌమ్యో భవిష్యతి| ఏకసంవత్సరం రాజా స్వాతికర్ణో భవిష్యతి. 9

షడ్వింశ##త్యేకవర్షాణి పులోమావి ర్బవిష్యతి | భవితా7రిష్టకర్ణిన్తు వర్షాణి పఞ్చవింశతిః. 10

తత స్సంవత్సరా న్పఞ్చ హాలో రాజా భవిష్యతి | పఞ్చ మన్దులకో రాజా భవిష్యతి సమా నృపః. 11

పురీన్ద్రసేనో భవితా తస్మా త్సోమ్యో భవిష్యతి | సున్దర శ్సాన్తికర్ణస్తు అబ్దమేకం భవిష్యతి. 12

చకోర స్స్వాతికర్ణస్తు షణ్మాసాన్వై భవిష్యతి| అష్టవింశతి వర్షాణి శివస్వాతి ర్భవిష్యతి. 13

రాజాచ గౌతమీపుత్త్రో ఏకవింశత్యతో నృపః | అష్టవింశత్‌సుత స్తన్య సులోమా వై భవిష్యతి. 14

శివశ్రీర్వై సులోమాత్తు సపై#్తవ భవితా నృపః | శివస్కన్ద శ్శాన్తికర్ణి(ర్ణాద్భవి)తా హ్యాత్మజస్సమాః.15

నవ వింశతి వర్షాణి యజ్ఞశ్రీ శ్శాన్తికర్ణికః | షడేవ భవితా తస్మా ద్విజయస్తు సమన్తతః. 16

చణ్డశ్రీశాన్తికర్ణిస్తు తస్య పుత్త్ర స్సమా దశ | సులోమా సప్తవర్షాణి అన్త్య స్తేషాం భవిష్యతి. 17

ఏకోనవిం(త్రిం) శతిహ్యేతే అన్ద్రా భోక్ష్యన్తి వై మహీమ్‌ |

తేషాం వర్షాశతాని స్యు శ్చత్వారి షష్టిరేవచ. 18

రెండు వందల డెబ్బది రెండవ అధ్యాయము.

భవిష్యద్రాజ వంశానుకీర్తనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: అనంతరము కొంతకాలమునకు అంధ్రజాతీయుడును అత్యంత బలీయుడును నగు శిశుకు (శిముకు) డనువాడు కాణ్వాయన రాజులలో కడపటివాడగు ఆ సుశర్మను బలాత్కారమున కూలద్రోసి శుంగవంశీయుల శేషమును నశింపజేసి ఈ వసుంధరను ఇరువది మూడేండ్లు ఏలును ;తరువాత అతని తమ్ముడు కృష్ణుడు పదునెనిమిది అతని కుమారుడు మల్లకర్ణి పది పూర్ణోత్సంగుడు పదునెనిమిగి *శాంతకర్ణి ఏబది యారు శోచ్యస్తుతి పదునెనిమిది వాని కుమారుడు లంబోదరుడు పదునెనిమిది వాని పుత్త్రుడాపీతకుడు పండ్రెండు

*272. అ. 'శాతకర్ణి' నా మ నిర్వచనము ఆలోచింపదగినది 'కర్ణీ' రథము అనగా ఒక విధమగు 'మేనా' (మనుష్యులు మోయు రథ విశేషము); 'శాతుడు 'అను నతడు ఇతనికి 'కర్ణి' గా (కర్ణీరథముగా తను మోయు వాడుగా ) కలవాడు కావున 'శాతకర్ణి' అని ఊహించుట సమంజనతరమని తోచును.

మేధ (ఘ) స్వాతి పదునెనిమిది స్వాతి పదునెనిమిది స్కన్ధ స్వాతి ఏడు మృగేంద్ర స్వాతికర్ణుడు మూడు కుంతల స్వాతికర్ణుడు ఎనిమిది తరువాత పుష్పసేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సౌమ్యుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత స్వాతికర్ణుడు ఒకటి పులోమావి ఇరువది ఏడు అరిష్టకర్ణుడు ఇరువది ఐదు హాలుడు ఐదు మందులకుడు ఐదు తరువాత పురీంద్రసేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సోమ్యుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సుందర శాంతికర్ణుడు ఒకటి చకోర స్వాతికర్ణుడు అరయేడు శివస్వాతి ఇరువది ఎనిమిది గౌతమీ పుత్త్రుడు ఇరువది యొకటి వాని కొడుకు సులోముడు ఇరువది ఎనిమిది శివ శ్రీ ఏడు శాంతికర్ణుడు కుమారుడు శివస్కందుడు (సంఖ్య లేదు) ఏండ్లు యజ్ఞశ్రీ శాంతి కర్ణి ఇరువది తొమ్మిది విజయుడు ఆరు వాని కుమారుడు చండశ్రీశాంతకర్ణుడు పది కడపటివాడగు సులోముడు ఏడు సంవత్సరములు రాజ్య మేలుదురు;ఇట్లు ఇరువది తొమ్మిది మంది ఆంధ్రులు 460 ఏండ్లు భూమి ననుభవింతురు.

అన్ధ్రాణాం సంస్థితా రాజ్యే తేషాం భృత్యాన్వయే నృపాః| సపై#్తవాన్ద్రా భవిష్యన్తి దశాభీరా నృపా స్తథా. 19

సప్త గర్ధభినశ్చాపి శకా శ్చాష్టాదశైవతు| యవనా7 ష్టౌ భవిష్యన్తి తుషారాశ్చ చతుర్దశ. 20

త్రయోదశి గురుణ్డాశ్చ హుణా హ్యేకోనవింశతిః| యవనా 7ష్టౌ భవిభ్యన్తి సప్తాశీతి మహీ మిమామ్‌. 21

సప్త గర్ధబిలా భూపా భోక్ష్యన్తీమాం వసున్దరామ్‌| సప్తవర్షసహస్రాణి తుషారాణాం మహీస్మృతా. 22

*శతాని త్రీణి చ తథా నవ చాష్టాదశైవతు | శతాన్యర్ధ (ధ్యర్ధ) చతుష్కాణి + భవితవ్యాశ్చతుర్ధశ. 23

గరుణ్డా వృషలై స్సార్ధం భోక్ష్యన్తే వ్లుెచ్ఛసమ్భవాః| శతాని త్రీణి భోక్ష్యన్తే వర్షాణ్యకాదశైవతు. 24

అన్ధ్రా శ్శ్రీపార్వతీయాశ్చ తే ద్వే పఞ్చశతం సమాః| సప్తషష్టితు వర్షాణి దశాభీరా స్తతస్తువై. 25

తేషూత్పన్నేషు కాలేషు తతః కిలకిలా నృపాః| భవిష్యన్తీహ యవనా ధర్మతః కామతో7ర్థతః. 26

తై ర్విమిశ్రా జనపదా ఆర్యా వ్లుెచ్ఛాశ్చ సర్వశః| విపర్యయేణ వర్తన్తే క్షయ మేష్యన్తి వైప్రజాః. 27

లుబ్ధానృతధ్రుహశ్చైవ భవితారో నృపా స్తతః| కల్కినాతు హతా స్సర్వే ఆర్యా వ్లూెచ్ఛాశ్చ సర్వతః. 28

అధార్మికాస్తు యే 7త్యర్థం పాషణ్డాస్తు తథైవచ| ప్రసష్టే నృపవంశేతు సన్దౌ నష్టే కలౌ యుగే. 29

కిఞ్చిచ్ఛిష్టాః ప్రజా స్తా వై నష్టధర్మపరిగ్రహాః| అసాధనా హ్యసత్త్వాశ్చ వ్యాధిశోకేన పీడితాః. 30

అనావృష్టిహతాశ్చైవ పరస్పరవధేప్సవః| అశరణ్యాః పరిత్రస్తా స్సఙ్కటం ఘోర మాశ్రితాః. 31

సరిత్పర్వవాసిన్యోభవిష్యన్త్యఖిలాః ప్రజాః | ఏవం నృపేషు నష్టేషు ప్రజా స్త్యక్త్వా గృహాణిచ. 32

నష్టస్నేహా నిరాసక్తా స్త్యక్తభ్రాతృసుహృద్గణాః| వర్ణాశ్రమపరిభ్రష్టా హ్యధర్మనిరతాశ్చ తాః. 33

పత్రమూలఫరాహారా శ్చీరపత్రాజినామ్బరాః| వృత్త్యర్థమభిలిప్సన్త్య శ్చ రిష్యన్తి వసున్దరామ్‌. 34

తరువాత ఈ ఆంధ్రుల భృత్యుల వంశములవారు (ఆంధ్ర భృత్యులనబడు ఆంధ్రులు) ఏడుమంది అభీరులు పదిమందు గర్దభులు ఏడుగురు శకులు పదునెనిమిది మంది యవను లెనిమిది మంది తుషారులు పదునలుగులు గరుండులు పదుముగ్గులు హుణులు పందొమ్మిదిగురు యవను లెనిమిది మంది ఆ భూమి నేలుదురు; యవనుల పాలనకాలము ఎనుబది ఏండేండ్లు; తరువాత ఏడుగురు గర్దభిల రాజులు పాలింతురు; తుషారుల ఏడువేల మూడువందల ఎనుబది ఏండ్లు పాలింతురు ; పదుముగ్గులు గురుండులును - వారికి సమకాలముననే కొందరు వృషలులను పదునెనిమిది వందల ఏబది నాలుగేండ్లు ను ఈ భూమిని పాలింతురు ;(ఇచట మూలమున చాల ప్రతులయందు 'శతాన్యర్ధ చతుష్కాణి' అని యున్నది; కాని 'శతాధ్యర్ధ చతుష్కాణి' = అధ్యర్దశత +చతుర్‌ =అర్ధశతము+ చతుర్‌ (అధికము)= 54 ఎక్కువగా కల పదునెనిమిది వందలు అగును)ఈ గ(గు) రుండులు వ్లుెచ్ఛజాతీయులు; (వ్లుెచ్ఛలు అనగా భాషను అవిస్పష్టముగా ఉచ్చరించుచు మాటలాడువారును అపశబ్దములను కూడ వ్యవహరించువారును అను యర్ధము ;భారతీయులు వ్యవహరించు శుద్ధగీర్వాణు

*శతాని త్రీణ్యశీతించశతాన్యష్టాదశైవతు +భవితవ్యాస్త్రయో దశ.

వాణి మాటలాడని అభారతీయ జాతుల వారందరును ఇట్టివారుగా మన వాఙ్మయమున పేర్కొనబడిరని తోచును;) తరువాత మరల ఆంధ్రులు మూడవందల పదునొకండు శ్రీ పర్వత ప్రాంత జాతీయులు ఏబది రెండు సంవత్సరములు పాలింతురు ;తరువాత పది మంది అభీరులు అరువది ఏడు ఏండ్లు పాలింతురు; కాలక్రమమున వారును నసించగా మిగిలినవారు ధర్మార్థకామ ప్రవృత్తులయందు యవనులే అనదగియుందురు ;జనపదములు(గ్రామములు) వీరితో మిశ్రితములగును; అంతటను ఆర్యులును వ్లుెచ్ఛులును కలగాపులగమయి యుందురు; వీరు తమ తమ ధర్మములు తప్పి వర్తింతురు ;ప్రజల క్షయ మందుదురు ;అక్రమమున రాజులును లుబ్ధులును అనృతరతులు నగుదురు ;క్రమముగా అంతటను ఆర్యులును వ్లుెచ్ఛులును అత్యంతము అధార్మికులగువారును పాషండులును కల్కిచే హతులగుదురు; కలియుగ ప్రధాన పరిమాణము ముగియగా సంధికాలము రాగా నృపవంశమును నశించగా పోయినవారు పోగా మిగిలిన కొలది మంది ప్రజలును ధర్మమును ఆచరించనివారగుచు బాగుపడుటకు ఏ సాధనములును మనోదేహములందు నత్త్వమును (సత్తువ- నిబ్బరము) లేక వ్యాధిశోక పీడితులగుచు అనావృష్టిచే బాధలందుచు పరస్పరవధకాంక్షులగుచు రక్షించువారు లేక భయమందుచు ఘోరసంకట మందుచు నదుల తీరములందో పర్వత ప్రాంతములందో నివసింపపోవుదురు; ఇట్లు రాజులు నసించగా ప్రజలు గృహములు విడిచి పరస్పర ప్రీతి స్నేహములు లేక నిరాసక్తులును భ్రాతృమిత్ర గణములను విడిచినవారు నగుచు వర్ణాశ్రమ ధర్మ పరిభ్రష్టులును అధర్మనిరతులును పత్రమూల ఫలాహారులును నారలో ఆకులో చర్మములో ధరించుచు జీవనమునకై ఆహాపము మాత్రము దొరకిన చాలు ననుకొనువారునయి భూమియంమదంతటను తిరుగ నారంభించురు.

ఏవం కష్టం మనుప్రాప్తాః ప్రజాః కలియుగాన్తరే| నిశ్శేషాస్తు భవిష్యన్తి సార్ధం కలియుగేన తు. 35

క్షీణ కలియుగే తస్మి న్దివ్యవర్షసహస్రకే | ససన్ధ్యాంశేతు నిశ్శేషః కృతంతు ప్రతిపత్స్యతే. 36

ఏష వంశక్రమః కృత్స్నః కీర్తితో 7యం మయా క్రమాత్‌ | అతీతా వర్తమానాశ్చ తథైవానాగతాశ్చ యే. 37

మహాపద్మాభిషేకాత్తు యావజ్జన్మ పరీక్షితః| ఏకమేవ సహస్రంతు జ్ఞేయం పఞ్చశతోత్తరమ్‌. 38

పౌలోమాస్తు తతాన్ద్రాస్తు మహాపద్మాన్తరే పునః| అనన్తరం శతాన్యష్టౌ షడ్వింశత్తు సమాస్తథా. 39

తావత్కాలాన్తరం భావ్య మాన్ధ్రాన్తా దాపరీక్షితః| భవిష్యేతే ప్రసఙ్ఖ్యాతాః పురాణజ్ఞై శ్శ్రుతర్షిభిః. 40

సప్తర్షయ స్తథా ప్రాంశుః ప్రదీప్తే నాగ్నినా సమాః| సప్తవింశతిభావ్యానా మాన్ధ్రాణాంతు తదాపునః. 41

సప్తవింశతిపర్యంతే యత్ర నక్షత్రమణ్డలే | సప్తర్షయస్తు తిష్ఠన్తి పర్యాయేణ శతం శతమ్‌. 42

సప్తర్షీణాం తు పర్యాయే తత్స్మృతం దివ్య సజ్ఞ్యయా|* సమా దివ్యా స్స్మృతా ష్షష్టి ర్దివ్యాబ్దానిచ సప్తతిః. 43

ఏభిః ప్రవర్తతే కాలో దివ్యై స్సప్తర్షిబిస్తు వై| సప్తర్షీణాంతు ¸° పూర్వో దృశ్యేతే హ్యుదితౌ నిశి. 44

తయో ర్మధ్యేతు నక్షత్రం దృశ్యతే యత్సమం దివి| తేన సప్తవర్షయో జ్ఞేయో యుక్తా వ్యోమ్ని శతం సమాః. 45

నక్షత్రాణా మృషీణాంతు యోగసై#్యతన్ని దర్శనమ్‌| సప్తర్షయో మఘాయుక్తాః కాలే పారిక్షితే శతమ్‌. 46

బ్రాహ్మణాస్తు చతుర్వింశా భవిష్యన్తి శతం సమాః| తతః ప్రభృత్యయం సర్వ లోకో వ్యాపత్స్యతే భృశమ్‌. 47

అనృతోవహతా లుబ్దా ధర్మతః కామతో7ర్థతః| శ్రౌతే స్మార్తే ప్రశిథిలే నష్టవర్ణాశ్రమే తథా. 48

సఙ్కరం దుర్బలాత్మానః ప్రతిపత్స్యన్తి మోహితాః| బ్రాహ్మాణా శ్శూద్రయోనిస్థా శ్శ్రూద్రా వై మన్త్రయోనమః. 49

షట్త్రింశత్తు *మాసాదివ్యాః స్మృతాః షట్చదివ్యై ర్వర్షైశ్చ సప్తభిః.

ఉపస్థాస్యన్తి విప్రాస్తా న్వేదార్థ మభిలిప్సపః| క్రమేణౖవహి దృస్యన్తే స్వవర్ణాన్తరదాయకమ్‌. 50

క్షయమేవ గమిష్యన్తి క్షీణశేషా యుగక్షయే| యస్మి న్కృష్ణో దివం యాత స్తస్మిన్నేవ తదా7హని. 51

ప్రతిపన్నం కలియుగం ప్రమాణం తస్య మే శృణు| చతుశ్శతసహస్రంతు వర్షాణాం యత్స్మృతం బుధైః. 52

చత్వార్యష్ట సహస్రాణి సఙ్ఖ్యాతం మాసుషేణ తు| దివ్యం వర్షసహస్రంతు తథా సన్ధ్యా ప్రవర్తతే. 53

ఇట్లు కలియుగ కాలమున ప్రజలు కష్టమును (అధమ స్థితిని) పొంది కలియుగముతోపాటు నిఃశేషులగుదురు; దివ్య వర్ష సహస్ర పరిమాణకమగు కలియుగము తన సంధి సంధ్యాంశలతో కూడ ముగియగా కృతయుగము వచ్చును; ఇట్లు నేను మీకు వంశక్రమమంతయు యథాక్రమముగ కీర్తించి అతీత వర్తమానాగత రాజ వంశమును తెలిపితిని; పరీక్షిత్తుడు జన్మించినది మొదట మహాపద్ముని యభిషేకమువరకును మొత్తము కాలావధి ఒకవేయి ఐదువందల ఏండ్లు ;మహా పద్మాభిషేకము మొదలుగ ఆంధ్రులలో కడపటి రాజు వరకును ఎనిమిది వందల ఇరువది యారేండ్లు ;పరీక్షిజ్జన్మము మొదలుగా ఆంధ్రుల వరకు అగుకాలము వీని మొత్తము; ఈ విషయమంతయు పురాణజ్ఞులగు వైదిక ఋషులు భవిష్య పురాణమందు లెక్కించి చెప్పియున్నారు.

సప్తర్షులు చాల పొడవయి (ఉన్నతమయి) ప్రజ్వలించుచుండు అగ్నితో సములై ఆకసమున కనబడుచుందురు గదా! వీరు క్రమముగా ఆయా నక్షతక్రములందు సంచరించుచు సమగ్రముగా నక్షత్రమండల సంచారావృత్తిని ముగించి మరల మఖా నక్షత్రములోనికి వచ్చునాటికి ముందు రాబోవు ఆంధ్రుల పాలనకాలము పూర్తియగును ;ఏలయన సప్తర్షులు తమ పర్యాయావడత్తిలో ఒక్కొక్క నక్షత్రమందు నూరేసి ఏండ్లు ఉందురు; ఇట్లు ఇరువది ఏడు నక్షత్రము లందును సంచరించుటకు పట్టు కాలమును దివ్య మానముతో లెక్కించగా ఏడు *సంవత్సరములు ఆరు మాసము *లగును.

చత్వార్యష్ట

ఇచట ఇపుడు లభించు ప్రతులయందు 'సమాదివ్యాః స్మృతాః షష్టి ద్రివ్యాబ్దానిత సప్తతిః (భిః) ' అనియున్నది; ఇచట సప్తతిః అనినచో 60+ 70 =130 దివ్య సంవత్సరములు; ఇది మనుష్యమానముతో 130 X 360 =46800 ; లేదా 'సప్తభిః' అని గ్రహించినచో 60+ 7= 67 దివ్య సంవత్సరములు 67 X 360 =24120 మానవ సంవత్సరములు అగును ఈ రెండును సప్తర్షుల సప్తవింశతి నక్షత్ర సంచారకాలమగు 2700 మానవ సంవత్సరములకు సరిపోవు ;కావున పాఠమేకారణముననో పూర్వమే పొరపాటుగా మారియుండును; అది మాసా దివ్యాః స్మృతాః షట్చ దివ్యాన్యబ్దాని సప్తచ.అయియుండును. అపుడు 7 1/2 X 360 =15/ 2 X 360= 2700 మానవ సంవత్సరములు సరిపోవును. అని యూహించి వ్రాయుటయైనది విజ్ఞులు దీనినాలోచించి తమ నిర్ణయములు తాము చేయుదురు గాక !-అనువాదకుడు.

మత్స్య- 272 అధ్యా శ్లో. 43 సప్తమూహర్షలు ఇరువది ఏడు నక్షత్రములందు సంచరించుటకగు 2700 వత్సరములను దివ్య వత్సరములలో చెప్పుచు -ఇచ్చట

1. సప్తర్షీణాం తు పర్యాయో (యః) స్మృతం (తో) వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ద్రివ్యాబ్దాని తు సప్తభిః -(కన్నడ)

2. సప్తర్షీణా ముపర్యేతత్‌ స్మృతం వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ద్రివ్యాబ్దాని తు సప్తభిః (నందలాలామోర్‌)

3. సప్తర్షీణాం తు ప్ర్యాయే తత్స్మృతం దివ్యసంఖ్యయా!

సమాదివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాబ్దిని తు సప్తతిః శ్రపువ్వాడ వేంకటరావుగారి తెలుగుప్రతి.)

*ఈ విధముగనే దివ్యులగు సప్తర్షులచే కాలగణన ప్రవర్తింపజేయబడుచున్నది ;అది ఎట్లనగా - రాత్రులందు ఉదయించి కనబడు సప్తర్షులలో పైగా కనబడు ఇరువురు నడుమకు సరిగా ఆకాశమందు ఏనక్షత్రము కనబడునో ఆ నక్షత్రమందు సప్తర్షులున్నారని నిర్ణయము ;అట్లు వారొక్కొక్క నక్షత్రమునందు నూరేసి యేండ్లుందురు; ఇదియే సప్తర్షులు ఆయా నక్షత్రములతో కూడియుండునట్లు; నక్షత్రములు ఋషులును కూడియుందురనుటకిది నిదర్శనము; పరీక్షజ్జన్మ కాలమునందు నూరేండ్లు పాటు సప్తర్షులు మఖా నక్షత్రమందుండిరి ; ఈ బ్రాహ్మణర్షులు ఇరువది నక్షత్రముల సంచారము ముగించు నాటికి ఆంధ్రరాజుల పాలనమాంరంభమయి వారు మరల మఖా నక్షత్రములోనికి వచ్చునాటికి వీరి పాలన కాలము ముగియును.

అది మొదలుకొని ఈ లోకము మిగుల వ్యాపత్తు (క్లేశముల) లకు లోనగును; జనులు అనృతోపహతులును లుబ్దులును ధర్మ కామార్థములనుండి భ్రష్టులును స్రౌతస్మార్త ధర్మములు నశించినందునను వర్ణాశ్రమ ధర్మ ప్రవృత్తులు పాడైనందునను మెహితులలునయి వర్ణ సాంకర్య ములను పొందుదురు; బ్రాహ్మణులు శూద్రయోని గతులగుదురు; శూద్రులు మంత్ర యోనులగుదురు. శూద్రులు బ్రాహ్మణ ధర్మమాచరించుచు మంత్రజ్ఞానమునకు మూలహేతువులగుదురు; విప్రులు వారిని ఆశ్రయించి సేవించి వేదములను వేదార్థములను గ్రహింపగోరుదురు; కాలక్రమమున వీరు (విప్రులు) తమ వర్ణమునకును వర్ణాంతరములకును గల భేదమేమో కూడ లేకుండ ధర్మము నశింపజేయువారగుదురు.

కృష్ణ భగవానుడేదినము నదివమేగెనో ఆనాడే కలియుగమారంభమయినది; దాని ప్రమాణమును తెలిపెదను వినుము; ఇది మానుష మానానుసారము నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరములు అగును; దివ్యమానాను సారము వేయి దివ్య సంవత్సరములు కలియుగమున ముగియగానే కలి సంధ్యాకాలమారంభమగును; (ఇది నూరు దివ్య సంవత్సరములును దాని తరువాత కలి సంధ్యాంశము నూరు దివ్య సంవత్సరములును కాగా కలి ముగియును).

నిశ్శేషేతు తదా తస్మి స్కృతం వై ప్రతిపత్స్యతే| ఐళ శ్చేక్ష్వాకువంశ్య శ్చ సహదేవః ప్రకీర్తితాః. 54

ఇక్ష్వాకో స్సంస్తుతం క్షత్త్రిం సుమిత్రాన్తం భవిష్యతి| ఐళం క్షత్త్రం సమాక్రాన్తం సౌమం వంశవిదో విదుః. 55

ఏతే వివస్వతః పుత్త్రాః కీర్తితాః కీర్తివర్ధనాః| అతీతా వర్తమానాశ్చ తతైవానాహతాశ్చయే .56

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా స్తథా శూద్రాశ్చా తే స్మృతాః| వైవస్వతే 7న్తరే తస్మిన్నితి వంశ స్సమాప్యతే. 57

దేవాపిః పౌరవో రాజా ఐక్ష్వాకో యశ్చ తే మతః| మహాయోగబలోహేతౌ కలాపగ్రామ మాశ్రితౌ. 58

ఏతౌ క్షత్త్రప్రణతారౌ నవవింశే చతుర్యుగే| సువర్చా మనుపుత్త్రస్తు ఐక్ష్వాకాద్యో భవిష్యతి. 59

నవవింసే యుగే సోవై వంశస్యాది ర్భవిష్యతి| దేవాపిపుత్త్రస్సత్యస్తు ఐళానాం భవితా నృపః. 60

క్షత్త్రప్రవర్తకా వేతౌ భవిష్యేచ చతుర్యుగే| ఏవం సర్వేషు విజ్ఞేయం సన్తానార్థంతు

లక్షణమ్‌. 61

క్షీణ కలియుగే చైవ తిష్ఠన్తీతి కృతే యుగే| సప్తర్షయస్తు తై స్సార్ధం మద్యే త్రేతాయుగే పునః. 62

*కాని వాస్తవముగ ఇది

మాసా దివ్యాః స్మృతాః షట్చ దివ్యై ర్వర్షైశ్చ సప్తభిః

7 సం. 6 మా. (దివ్య =7 1/2 X 360 =15/2 X 360 =15 X 180= 2700 మానుష సంవత్సరములు అని ఉండదగును. - అనువాదకుడు

బీజార్థం వై భవిష్యన్తి బ్రహ్మక్షత్త్రేతు వై నృప | ఏవ మేవంతు సర్వేషు తిష్యాన్తే ష్వన్తరేషుచ. 63

సప్తర్షయో నృపై స్సార్ధం సన్తానార్థం యుగే యుగే| ఏవం క్షత్త్రస్య చోత్సేధస్సమ్భన్ధో వై ద్విజై స్స్మృతః. 64

మన్వన్తరాణాం సన్తానే సన్తానాశ్చ శ్రుతౌ స్మృతాః| అతిక్రాన్తకయుగాశ్చైవ బ్రహ్మక్షత్త్రస్య సమ్భవాః. 65

తథా ప్రశాన్తి స్తేషాంవై ప్రకృతీనాం యతాక్షయః| సప్తర్షయో విదుస్తేషాం దీర్ఘాయుస్త్వం క్షయోద¸°. 66

కలియుగము నిఃశేషముగా ముగియగానే మరల కృతయుగమారంభమయి ప్రవర్తిల్లును ; సహదేవుడను వాడు ఐలుడగుటచే (ఇలగా మారిన ఐలుడను ఇక్ష్వాకు వంశజుని వలన జనించిన రాజుల వంశమందలి వాడు అగుటచే) అతడే చంద్రసూర్య వంశములకు రెంటికిని చెందిన క్షత్త్రియుడని చెప్పబడినది; ఏలయన వంశక్రమ విషయ తత్త్వవేత్తలు ఐళ (సూర్య) వంశ క్షత్త్రియ పరంపర సోమ వంశ పరంపరయందు సంక్రాంతమయ్యెనని కదా చెప్పిరి; ఏలయన సంస్తుత మగు ఐక్ష్వాకు వంశము సుమిత్రుడను వానితో ముగియును.

ఈ విధముగ కీర్తివర్దనులగు వివస్వంతుని (రవి) పుత్త్రులును తద్వంశీయులును అగు అతీతానాగత వర్తమాన క్షత్త్రియులును వారినుండి ప్రవర్తిల్లిన వారో పాలితులో .యగు బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్య శూద్ర జాతులును ఈ జాతుల యందు జనించి పాలకులయిన వారు ను చెప్పబడినవారు; ఈ విధముగా వైవస్వత మన్వంతరమందు వ్రవర్తిల్లు (రాజ) వంశ పరంపర ముగియుచున్నది; (తరువాత రాజత్వముతో పరివాలించువా రుండరని యర్థము;) లోగడనే చెప్పియున్న వూరు వంశ సంజాతుడగు దేవాహియను క్షత్త్రియుడును ఇక్ష్వాకు వంశజుడు (మనువంశ్యుడు) అగు సువర్చుడను వాడును రాబోవు ఇరువది తొమ్మిదవ మహాయుగమందు క్షత్త్రియవంశ ప్రవర్తకులగుదురు; వీరు ఇరువురును అంతవరకును తమ మహాయోగశక్తిచే కలాప గ్రామమును ఆవానముగా చేసికొనియుందురు; వీరితో పాటు సప్తర్షులు నుండి మరల క్షత్త్రియ జాతిని కృతయుగ ధర్మమును త్రేతాయుగ ధర్మమును ప్రవర్తిల్ల జేయుదురు; ఇట్లు వీరు బీజభూతులై జాతిని ధర్మమును ప్రవర్తిల్లజేయుట ప్రతి కలియుగాంతమందును జరుగుచునే యుండును; క్షత్త్రజాతియు ధర్మమున లోకమున ప్రవర్తిల్లు టకై విప్రులు క్షత్త్రియులతో సంబంధము నందుట,ఈ సూర్యచంద్ర వంశ్య క్షత్త్రియులగు దేవాపి సువర్చసులతో సప్తర్షులు కలియుట; దీనిచేతనే ధర్మ సంతాన వర్ణసంతానములు నడుచును. (సంతానమనగా అవిచ్ఛిన్నమయి కొనసాగుట- Continuity) మన్వన్తరములు కొనసాగు విదానములును ధర్మ- జాతి సంతానములు ప్రకారములును వేదముల యందు చెప్పబడినవి; స్మృతులయందును స్మరింపబడినవి; వీనిని బట్టి తెలియునది యేమనగా అతిక్రాంతయుగములందును ధర్మ- జాతి- వృద్ధులు బ్రహ్మ -క్షత్త్రి- జాతులలో శ్రేష్ఠులగు వారివలన ప్రవర్తిల్లినవే; అదియును గాక సప్తర్షులు సామాన్యులు కారు; గడచిన యుగములును వానియందలి బ్రహ్మ క్షత్త్రజాతుల ఉత్పత్తి ప్రకారములును వారి ప్రకృతులును ప్రసమము( అణగారి పోవుటయు) ను క్షయమును వారికి దీర్ఘాయుః పరిమాణము కలిగించు విధమును వారి వృద్ధియు ఇవన్నియును వారెరుగుదురు.

ఏతేన క్రమయోగేన ఐళా ఇక్ష్వాకవో నృపాః| ఉత్పద్యమానా స్త్రేతాయాం క్షీయమాణాః కలౌ యుగే. 67

అనుయాన్తి యుగాఖ్యాంతు యవ న్మన్తన్తరక్షయమ్‌| జామదగ్న్యేన రామేమ క్షత్త్రే నిరవశేషితే. 68

రిక్తేయం వసుధా సర్వా క్షత్త్రియై ర్వసుదాధిపైః| ద్వివంశకరణం సర్వం కీర్తియిష్యే నిభోధమే. 69

ఐళం తేక్ష్వాకువంశంచ ప్రకృతిం పరిచక్షతే| రాజాన శ్శ్రేణి బద్ధాశ్చ తథా7న్యే క్షత్త్రియా భువి. 70

ఐళవంశాస్తు భూయాంసో న తథేక్ష్వాకవో నృపాః| ఉత్పద్యమానాస్తే చాళు (స్త్రేతాయాం ) క్షీయమాణాః కలౌపునః. 71

తేషా మేకశతం పూర్ణం కులానా మభిలోచతే| తావధేవతు భోజానాం విస్తారా ద్ద్విగుణం స్మృతమ్‌. 72

భోజానాం ద్విగుణం క్షత్త్రం చతుర్ధా తద్యతాతథమ్‌| తే హ్యాతీతా స్సనామానే బ్రువత స్తా న్నిభోధమే.

శతం వై ప్రతివిన్ధ్యానాం శతం నాగా శ్శతం హయాః| శత మేకం ధార్తరాష్ట్రా హ్యశీతి ర్జనమేజయాః. 74

శతం వై బ్రహ్మదత్తానాం వీరాణాం కురవ శ్శతమ్‌| తతశ్శతం చ పఞ్చాలా శ్శతం కాశికుశాదయః. 75

తతా పరే సహస్రే ద్వే యే నీపా శ్శ శబిన్దనః| ఇష్ట వన్తశ్చ తే సర్వే సర్వే నియుతదక్షిణాః. 76

ఏవం రాజర్షయో 7తీతా శ్శతకో7 థ సహస్రశః| మనో ర్వైవస్వతస్యాస న్వర్తమానే7 న్తరే విభోః. 77

తేషాంతు నిధనోత్తత్తౌ లోకసంస్థితయ స్థ్సితాః| న శక్యో విస్తర స్తేషాం సన్తానస్య పరస్పరమ్‌. 78

తత్పూర్వా పరయోగేన వక్తుం వర్షశ##తైరపి| అష్టా వింశత్సమాఖ్యాతా గతా వైవస్యతే7 న్తరే. 79

ఏతే దేవగణౖ స్సార్ధం శిష్టా ఏతా న్నిబోధత| చత్వారింశ త్త్రయ శ్చైవ భవిష్యాస్తే మహాత్మనః. 80

అవశిష్టా యుగాఖ్యాస్తే తతో వైవస్వతో హ్యయమ్‌| ఏతద్వః కీర్తితం సర్వం సమాస (సాద్‌) వ్యాసయోగతః. 81

పునర్వక్తుం బహుత్వాత్తు న శక్యం విస్తరేణతు| ఉక్తా రాజర్షయో యే తు అతీతాస్తే యుగైస్సహ. 82

ఏతే యయాతివంశ్యానాం యే చ వంశా విశామ్పతే | కీర్తితా ద్యుతిమన్తస్తే య ఏతా న్దారయే న్నరః. 83

లభ##తే స వరా న్పఞ్చ దుర్లభా నిహ లౌకికా& | ఆయుః కీర్తిం ధనం స్వర్గం పుత్త్రవాం శ్చాభిజాయతే. 84

ధారణా చ్ఛ్రవణాచ్చైవ పరం స్వర్గో 7స్య ధీమతః. 84

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ భవిష్యద్రాజానుకీర్తనం నా మ

ద్విసప్తత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఈ చెప్పిన క్రమయోగము ననుసరించి ఐళులును (చంద్రవంశములో సంక్రాంతులయిన సూర్యవంశీయులును) ఇక్ష్వాకులును (కేవల సూర్యవంశీయులును) గడచిన త్రేతాయుగమునందు జనించిరి; వారీ కలియుగమున క్షీణింతురు; వారిట్లు జనించుచు వృద్ధినందుచు క్షీణించుచు మన్వంత రావసానము వరకును కొనసాగుచునే యుందురు; ఆయా యుగధర్మానుసారము నడుచుకొనుచుందురు. జామదగ్న్యుడగు రాముడు క్షత్త్రజాతిని నిరవశేష మొనర్చగా ఈ వసుధ యంతయు క్షత్త్రియజాతిరాజశూన్య యగును; ఐనను తరువాత మరల రెండు రాజవంశములు లోకమున కొనసాగుచునే ఉండును; అది తెలిపెదను వినుము: ఈ రెండు వంశములకును ఐళవంశమును ఇక్ష్వాకు వంశమును మూల భూతములు ; వీరి మాలముననే లోకమునందలి రాజవంశ పరంపరలును ఇతర క్షత్త్రియ జాతీయులును వర్ధిల్లుచు ప్రవర్తిల్లుచుందురు; ఐనను ఈ ఇరుతెగలలోను ఐళవంశీయుల సంఖ్య ఇక్ష్వాకు వంశీయుల సంఖ్య కంటె అధికతరము ; ఏమయినను ఈ ఇరుతెగలవారును త్రేతాయుగమున ఉత్పన్నులగుదురు; కలియుగమున క్షీణింతురు; (అనగా పూర్తిగా నసింతురని యర్థము కాదు) వీరు మొత్తము ఏకశత వంశములవారు; తరువాత క్రమముగా వృద్ధి పొందినపుడు భోజులే అంతకు రెట్టింపు (202 వంశములవారు) అయిరి; మొత్తము ఉత్తమ వంస్య క్షత్త్రియులు భోజులకు ద్విగుణమయిరి; (అనగా 404 ప్రదాన వంశములవారు) అనగా మూరభూతులగు ఐలైక్ష్వాక రాజవంశ సంఖ్యకు ఇది నాలుగు రెట్లు.

గడచిపోయిన రాజ వంశములలో వారివారి ననామత్వము ననుసరించి (వారి వారివంశ నామమును- ఇంటి పేర్లను అనుసరించి) పేర్కొందును వినుము; ఆయా ప్రదానవంశముల మూల కుటుంబ సంఖ్య ఇట్లుండును ; 1. ప్రతి వింధ్యులు-100; 2. నాగులు-1003. హయిలు- 100; 4. ధార్త రాష్ట్రులు-100; 5. జనమేజయులు-80; 6. బ్రహ్మ దత్తులు-100; 7. కురువులు-100; 8. పంచాలురు-100; 9. కాశికుశాదుల వంశమువారు ఒక్కొక్క కోవవారు నూరేసి వంశములు; 10. నీపులు శశబిందువులు అను తంగల వారు వేయి వంశములవారు; వారందరును యజ్ఞములు నాచరించిన వారే; లక్షల సంక్యలో (గోవులనో సువర్ణమునో) దక్షిణలుగా ఆ యజ్ఞములందు ఇచ్చినవారే; ఇట్టి రాజర్షులు వందల కొలదిగా గడచిపోయిరి; వీరందరు ను ఈ వైవస్వతమన్వంతరమున ప్రవర్తిల్లిన- ప్రవర్తిల్లునున్న- ప్రవర్తిల్లనున్న - వారే; వారి ఉత్పత్తి క్షయములయందే లోక వ్యవస్థలు అన్నియు ఆధారపడియున్నవి; వారి సంతానపు పరంపరల విస్తరమును పారస్పరిక సంబంధ బాంధవ్యములతో కలిగిన వృద్ధిని సమగ్రముగా చెప్పుటకు పూర్వాపరయోగ (సంబంధ) వృద్ధిని తెలుపుటకును నూర్ల ఏండ్ల యినను చాలవు; ఈ వైవన్వత మన్వంతరమున ఇంతవరకును ఇరువది ఎనిమిది మహాయుగములు గడచినవి ; ఇంకను నలువది మూడు మహా యుగములు గడుపవలసియున్నవి; ఈ మహాయుగములతో పాటు ఎందరో దేవగమములవారును సంబద్ధులై యున్నారు; ఈ 'వంశవృత్తాంత' మనబడు పురాణాంగమగు అంశమును భవిష్య కలియుగ 'రాజవంశ' వృత్తాంతమును 'సమాన' 'వ్యాస' 'సంక్షేప' 'విస్తరణ' విధానములతో ఇంతవరకును తెలిపితిని; ఇంకను చెప్పుదుననినను అది బహు విస్తరముగుటచే నేను చెప్పజాలకున్నాను; ఇంతవరకును మీకు చెప్పబడిన రాజర్షు లందరును ఆయా యుగములందలివారు; వారు ఆయా యుగములతో పాటో గడిచిపోయినారు; ఆ యుగములందు వారు మహాపురుషులుగ ప్రసిద్ధులు ; రాజా! ఈ చెప్పినవి యన్నియును యయాతి వంశమునందు జనించిన రాజులకు చెదిన అనువంశ వృత్తాంతములు ; వీనిని హృదయమునందు ధరించు మానవులు తేజోవంతులగుదురు; ఆయువు కీర్తి ధనము స్వర్గము పుత్త్రులు అను ఐదు విధములగు లౌకిక వరములను ఐదింటిని పొందగలుగుదురు. వీనిని వినినవారును హృదయమందు ధరించిన వారునగు ధీనంతులకు ఉత్తమ సుఖప్రదమగు స్వర్గము లభించును.

ఇది శ్రీ మత్సయ మహాపురాణమున భవిష్య ద్రాజాను కీర్తనమను

éరెండు వందల డెబ్బది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters