Sri Matsya Mahapuranam-2    Chapters   

షట్‌ షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

దేవస్నపనవిధిః.

సూతః అథాత స్సమ్ప్రవక్ష్యామి దేవస్నపపన ముత్తమమ్‌ | అర్ఘ్యస్యాపి సమాసేన శృణుధ్వం విధి ముత్తమమ్‌. 1

దధ్యక్షతకుశాగ్రాణి క్షీరం దూర్వా తథా మధు | యవా స్సిద్ధార్థకా స్తద్వ దష్టాఙ్గో7ర్ఘ్యః ఫలై స్సహ. 2

గజాశ్వరథ్యావల్మీక వరాహోత్ఖాతమణ్డలాత్‌ | ఆగ్న్యాగారా త్తథా తీర్థా ద్వ్రజా ద్గోమణ్డలా దపి. 3

కుమ్భేతు మృత్తికాం దద్యా దుద్ధృతా7సీతి మన్త్రతః | శన్నో దేవీత్యపాం మన్త్ర మపోహిష్ఠేతి వై తథా. 4

సావిత్ర్యా77దాయ గోమూత్రం గన్ధద్వారేతి గోమయమ్‌ | ఆప్యాయస్వేతి చ క్షీరం దధిక్రావ్ణేతి వై దధి. 5

తేజో7సీతి ఘృతం తద్వ ద్దేవస్య త్యేతి చోదకమ్‌ | కుశమిశ్రం క్షిపే ద్విద్వా న్పఞ్చగవ్యం భ##వేత్తతః. 6

సంస్నాప్య పఞ్చగవ్యేన దధ్నా శుద్ధేన వై తతః | దధిక్రావ్ణేతి మన్త్రేణ కార్యం తస్యాభిమన్త్రణమ్‌. 7

ఆస్యాయస్వేతి పయసా తేజో7సీతి ఘృతేన చ | మధువాతేతి మధునా తతః పుష్పోదకేన తు. 8

సరస్వత్యై భైషజ్యేన కార్యం తస్యాభిమన్త్రణమ్‌ | హిరణ్యాక్షేతి మన్త్రేణ స్నాపయే ద్రత్నవారిణా. 9

కుశామ్భసా తత స్స్నానం దేవస్యత్వేతి కారయేత్‌ | కుశోదకేన చ స్నాన మగ్న ఆయాహి కారయేత్‌. 10

తతస్తు గన్ధతోయేన సావిత్య్రా చాభిమన్త్రితమ్‌ | తతో ఘటనసహస్రేణ సహస్రార్ధేన వా పునః. 11

తస్యాప్యర్ధేన వా కుర్యా దథవా7ష్టశ##తేన వా | చతుష్షష్ట్యా తతో7ర్ధేన తదర్ధార్ధేన వా పునః. 12

చతుర్భి రథవా కుర్యా ద్ఘటనా మర్పవిత్తవా& | సౌవర్ణై రాజతై ర్వాపి తామ్రైర్వా రీతికోద్భవైః. 13

కాంసై#్య ర్వా పార్థివై ర్వాపి స్నపనం శక్తితో భ##వేత్‌ |

రెండు వందల అరువది ఆరవ అధ్యాయము.

దేవ స్నపనవిధి.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: దేవతా ప్రతిష్ఠా విధానము నింతవరకును తెలిసికొంటిరి కావున దానికి అంగభూతముగా తెలిసికొనవలసిన ఉత్తమమగు దేవ స్నపన విధానము తెలిపెదను. దధి అక్షతలు కుశాగ్రములు క్షీరము దూర్వ తేన యవలు తెల్ల ఆవలు అనెడు ఎనిమిది అంగములతో కూడిన అర్ఘ్య సామగ్రియును ఫలములును సమకూర్చు కొనవలయును. గజములు అశ్వములు ఉండు ప్రదేశములు- రథ్య(చతుష్పథము- నాలుగు బాటలు కలియుచోటు ) వల్మీకము- వరాహములు త్రవ్విన ప్రదేశములు- అగ్ని గృహము - పుణ్యతీర్థము - గొల్లపల్లె- గోమండలము- ఈ ప్రదేశములనుండి సంపాదించి తెచ్చిన మృత్తికను కుంభమునందు 'ఉద్ధృతా7సి' అను మంత్రముతో వేయవలెను. ఆట్లే' శంనోదేవీః' 'అపోహిష్ఠా' అను మంత్రములతో జలమును 'సావిత్రి 'తో (గాయత్రీ మంత్రముతో) గోమూత్రమును 'గంధద్వారాం' అను మంత్రముతో గోమయమును 'ప్యాయస్వ'అను మంత్రముతో క్షీరమును 'దధిక్రావ్ణో' అను మంత్రముతో పెరుగును 'తేజో7సి' అను మంత్రముతో ఘృతమును 'దేవస్యత్వా' అను మంత్రముతో కుశ మిశ్రోదకమును కుంభమందు వేయవలెను. దీనితో పంచగవ్యమగును. ఈ పంచగవ్యముతో దేవుని స్నపనము చేయించవలయును. తరువాత దధిక్రావ్ణో' అను మంత్రముతో అభిమంత్రించుచు శుద్ధ (కేవల) దధితో స్నానమాడించవలయును. 'అప్యాయస్య' అను మన్త్రముతో గోక్షిరముతోను 'తేజో7సి' అను మంత్రముతో ఘృతముతోను 'మధువాతా' అను మంత్రముతో తేనెతోను 'సరస్వత్యైభైషజ్యేన' అను మంత్రముతో పుష్పోదకముతోను' హిరణాక్ష్య' అను మంత్రముతో రత్నజలముతోను దేవ న్యత్వా' అను మంత్రముతో కుశోదకముతోను 'అగ్న ఆయాహి' అను మంత్రముతో ఫలోదకముతోను 'సావిత్రీ' మంత్రముతో గంధజలముతో (పన్నీటితో)ను దేవుని అర్చామూర్తిని స్నానమాడించవలయును. తరువాత యథాశక్తిగ వేయి-ఐదు వందలు- నూట ఎనిమిది -అరువది- నాల్గు ముప్పది రెండు- పదునారు -ఎనిమిది నాలుగు- సంఖ్యగల బంగరు వెండి రాగి-ఇత్తడి- కంచు మట్టి కడవలలో వేనితోనైన స్నానమాడించవలయును.

సహదేవీ వచా వ్యాఘ్రీ బలా చాతిబలా తథా. 14

శఙ్ఖపుష్పీ తథా సింహీ హ్యష్టమీ చ సువర్చలా | మహోషధ్యష్టకం హ్యేత న్మహాస్నానేషు యోజయేత్‌. 15

యవగోధూమ నీవారతిలశ్యామాక శాలయః | ప్రియఙ్గవో వ్రీహయశ్చ స్నానేషు పరికల్పితాః. 16

స్వస్తికం పద్మకం శఙ్ఖముత్పలం కమలం తథా | శ్రీవత్సం దర్పణం తద్వ న్నన్ద్యావర్త మథాష్టకమ్‌. 17

ఏతాని గోమయైః కుర్యా న్మృదా చ శుభయా తతః | పఞ్చవర్ణాదికం తద్వ త్పఞ్చవర్ణం రజ స్తథా. 18

దూర్వాకృష్ణతిలా న్దద్యా న్నీరాజనవిధిం తతః | ఏవం నీరాజనం కుర్యా ద్దద్యా దాచమనం తతః. 19

మన్దాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభమ్‌ | తతో వస్త్రయుగం దద్యా న్మన్త్రేణానేన సువ్రతః. 20

వేదసూత్రే సమాయుక్తే యజ్ఞదానసమన్వితే | సర్వవర్ణశుబే దేవ వాససీ తవ నిర్మితే. 21

తతస్తు చన్దనం దద్యా త్సమం కర్పూరకుఙ్కుమైః | ఇమ ముచ్చారయే న్మన్త్రం దర్భపాణిః ప్రయత్నతః. 22

శరీరం తే న జానామి చేష్టాం నైవ చ నైవ చ | మయా నివేదితో గన్ధః ప్రతిగృహ్య విలిప్యతామ్‌. 23

తత స్త్వేతేన మన్త్రేణ ధూపం దద్యా ద్విచక్షణః | వనస్పతిరసో దివ్యో గన్ధాఢ్య సుమనోహరః. 24

మయా నివేదితో భక్త్యా ధూపో7యం ప్రతిగృహ్యతామ్‌ | చత్వారింశ ద్వరా న్దీపా న్దద్యచ్చైవ ప్రదక్షిణా&. 25

త్వం సూర్యచన్ద్రజ్యోతీంషి విద్యు దగ్ని స్తథైవచ | త్వమేవ సర్వజ్యోతీంషి దీపో7యం ప్రతిగృహ్యతామ్‌. 26

తత స్త్వాభరణం దద్యా న్మహాభూషాయ తే నమః | అనేన విధినా కుర్యా త్సప్తరాత్రం మహోత్సవమ్‌. 27

దేవకుమ్భై స్తతః కుర్యా ద్యజమానో7భిషేచనమ్‌ | చతుర్భి రష్టభి ర్వాపి ద్యాభ్యా మేకేన వా పునః. 28

సపఞ్చరత్న కలశై స్సితవస్త్రాభివేష్టితైః | దేవస్య త్వేతి మన్త్రేణ సామ్నా చాథర్వణనచ. 29

అభిషేకేచ యే మన్త్రా నవగ్రహమఖే స్మృతాః |

ఈ మహాస్నాన విధానములో ఉపయోగింపవలసిన అష్టమహౌధులు: 1. సహదేవి 2. వచా 3. వ్యాఘ్రీ 4. బలా 5. అతిబలా 6. శంఖపుష్పీ 7. సింహీ 8. సువర్చలా: అష్టధాన్యములు: 1.యవలు 2. గోధుములు 3. నీవారములు 4. తిలలు 5. శ్యామాకములు 6. శాలిధాన్యము 7. ప్రియంగుపు 8. వ్రీహి: ఇక మృద్గోమయ శుభాష్టకము: 1. స్వస్తికము 2. పద్మకము 3. శంఖము 4. ఉత్పలము 5. కమలము 6. శ్రీవత్సము 7. దర్పణము 8. సంద్యావర్తము: పంచ వర్ణములను పంచవర్ణములుకల తళుకు చూర్ణములను దూర్వలను నల్ల నూవులను అర్పించవలయును; సర్వపాపహరమును శుభమును నగు మందాకినీ (గంగా) జలముతో ఆచమనము నీయవలయును: తరువాత సువ్రతుడగు యజమానుడో స్థాపకుడో ఈ మంత్రముతో వస్త్ర మర్పించవలెను. "వేదసూత్రములతో కూడినవియు యజ్ఞదాన సమన్వితములును సర్వ వర్ణయుతములును శుభములును నీకై నిర్మింపబడినవియు నగు వస్త్రములు రెండు దేవా! ఇవిగో!" తరువాత దర్భపాణియై కర్పూర కుంకుమపుష్పములతో కూడ యత్నముతో గంధము నీయవలెను; మంత్రము "దేవా! నీ శరీరము కాని చేష్టకాని మరి ఏదియు నాకు తెలియదు కనుక నేను నివేదించు ఈగంధమును ప్రతిగ్రహించి నీవే విలేపన మొనరించుకొనుము." తరువాత విచక్షణుడై ధూపము నీయవలయును. మంత్రము "వనస్పతి రసరూపమయి ఉత్తమమును సుగంధాఢ్యమును చాల మనోహరమును అగు ధూపమును నీకు నివేదించు(అర్పించు) చున్నానను: స్వీకరించుము: తరువాత ప్రదక్షిణ క్రమమున నలువది దీపములను వెలిగించి అర్పించవలెను: మంత్రము: "సూర్యచంద్రాగ్ని విద్యుద్రూప జ్యోతిస్సులును ఇతరములగు సర్వ జ్యోతిస్సులును అగు నీవు దేవా! ఈ దీపమును ప్రతిగ్రహించుము" తరువాత "మహాభూషణుడవగు నీకు నమస్కారము." అనుచు ఆభరణములర్పించవలయును. ఈ విధానముతో ఏడహోరాత్రములు మహోత్సవము జరుపవలయును: తరువాత యజమానుడు ఐదు విధములగు రత్నములను వేసి పైని తెల్లని వస్త్రము చుట్టినటువంటి ఎనిమిదియో నాలుగో రెండో ఒకటియో'దేవన్యత్యా' అను మంత్రముతోను సామాథర్వణ వేదమంత్రములతోను అభిషేకమునందును నవగ్రహ మఖమందును విహితములగు మంత్రములతోను ఈ దేవకలశములతో అభిషేకము జరుపవలయును.

సితామ్బరధర స్స్నాత్వా దేవా స్త్సమ్పూజయేత్తతః. 30

స్థాపకం పూజయే ద్బక్త్యా వస్త్రాలఙ్కారభూషణౖః | యజ్ఞభాణ్డాని సర్వాని మణ్డపోపస్కరాదికమ్‌. 31

యచ్చాస్య దయితం గేహే తదాచార్యాయ దాపయేత్‌ | సుప్రసన్నే గురౌ యస్మా త్తృప్యన్తే సర్వదేవతాః. 32

నైత ద్విశీలేన తు దామ్భికేన న లిఙ్గినా స్థాపన మత్రకార్యమ్‌ | విప్రేణ కార్యం శ్రుతిపారగేణ గృహస్థ ధర్మాభిరతేన నిత్యమ్‌. 33

పాషణ్డినం యస్తు కరోతి బుద్ధ్వా విహాయ విప్రా ఞ్చ్రతిధర్మయుక్తా& | గురుం ప్రతిష్ఠాదిషు తత్ర నూనం కులక్షయ స్స్యా దచిరా దపూజ్యః. 34

స్థానం పిశాచైః పరిగృహ్యతే వా అపూజ్యతాం యా త్యచిరేణ లోకే | విపై#్రః కృతం యచ్ఛుభదం కులే స్యా త్ప్రపూజ్యతాం యాతి చిరంచ కాలమ్‌. 35

ఇతి శ్రీమత్స్య మహాపురాణ దేవతాస్నపనవిధి ర్నామ

షట్‌ షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

తరువాత యజమానుడు స్నానమాడి తెల్లని (శుద్ధ) వస్త్రములను ధరించి దేవులను స్థాపకుని వస్త్రాలంకార భూషణములతో భక్తితో పూజించవలయును. సర్వయజ్ఞభాండ(ద్రవ్య)ములను మండపమును ఉపన్కరములను తన ఇంటి యందలి ఇష్టమగు ద్రవ్యములను కూడ అతనికి ఈయవలయును. ఏలయన గురుడు సుప్రసన్నుడైనచో సర్వదేవత లును తృప్తులగుదురు. ఈ దేవతా ప్రతిష్ఠాపన కార్యము శీలరహితుడును దాంభికుడును వేషధారియును అగువారు చేయరాదు. ఏ యజమానుడు ఎరిగియుండియు వైదిక ధర్మయుక్తులగు విప్రులనువదలి పాషండియగు వానిని ఆలయదేవతా ప్రతిష్ఠాది కార్యములందు ఆచార్యునిగా చేసికోనునో అట్టివానికడ వంశనాశము జరుగును. అచిర కాలమునందే అందలి దేవుడు అపూజ్యుడగును. ఆ దేవాలయము కూడ శీఘ్ర కాలమునందే పిశాతములచే స్వీకరించబడును. (పిచాచములకు ఆవాసమగును). లేదా లోకమునందు అపూజ్యమగును. ఉత్తమ విప్రులచే ప్రతిష్ఠాకార్యము జరుపబడిన దేవాయతనము శుభకరమగును. అట్టి ఆలయమందలి దేవుడు తిరకాలము పూజ్యతనందును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవతకా న్నపన విధియను

రెండు వందల అరువదియారవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters