Sri Matsya Mahapuranam-2    Chapters   

పంచ షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయఃé.

దేవప్రతిష్ఠావిధిః.

సూతః: కృత్వా7ధివాసం దేవానాం శుభం కుర్యా త్సమాహితః | ప్రాసాదస్యానురూపేణ మానం లిఙ్గస్యవా పునః. 1

పుష్పోదకేన ప్రాసాదం ప్రోక్ష్య మన్త్రేణ తేన తు | పాతయే త్పక్షసూత్రంతు ద్వారసూత్రం తథైవ చ. 2

ఆశ్రయే త్కిఞ్చిదీశానీం మధ్యం జ్ఞాత్వా దిశం బుధః | ఐశానీ మాశ్రితం దేవం పూజయన్తి దివౌకసః. 3

ఆయురారోగ్యఫలద మథవా చోత్తరాశ్రితమ్‌ | శుభం స్యా దశుభం ప్రోక్త మన్యథా స్థాపనం బుధైః. 4

అధః కూర్మశిలా ప్రోక్తా సదా బ్రహ్మశిలా7ధికా | ఉపర్యవస్థితా తస్యా బ్రహ్మభాగా7ధికాశిలా. 5

తతస్తు పిణ్డికా కార్యా పూర్వోక్తై ర్మానలక్షణౖః | తతః ప్రక్షాళితాం కృత్వా పఞ్చగవ్యేన పిణ్డికామ్‌. 6

కషాయతోయేన పున ర్మన్త్రయుక్తేన సర్వతః | దేవతార్ఛాశ్రయం మన్త్రం పిణ్డికాసు నియోజయేత్‌. 7

తత ఉత్థాప్య దేవేశ ముత్తిష్ఠ బ్రహ్మణతి చ | ఆనీయ గర్భభవనం పీఠాన్తే స్థాపయే ద్బుధః. 8

అర్ఘ్యపాద్యాదికం తత్ర మధుపర్కం ప్రయోజయేత్‌ | తతో ముహూర్తం విశ్రమ్య రత్నన్యాసం సమాచరేత్‌. 9

వజ్రమౌక్తిక వైడూర్య శజ్ఞస్ఫటిక మేవ చ | పుష్యరాగేన్ద్రనీలం చ నీలం పూర్వాదిదిక్క్రమాత్‌. 10

తాలకంచ శిలావజ్రం గన్ధకం శ్యామ మఞ్జనమ్‌ | కాక్షీకాసీసమాక్షీకంగైరికం చాదితః క్రమాత్‌. 11

గోధూమం చ యవం తద్వ త్తిలముద్గం తథైవ చ | నీవారమథశ్యామాకం సర్షవం వ్రీహి మేవచ. 12

న్యసేత్క్రమేణ పూర్వాది చన్దనం రక్తచన్దనమ్‌ | అగురుం చాఞ్జనం చైవ ఉశీరంచ తతః పరమ్‌. 13

వైష్ణవీం సహదేవీం చ లక్ష్మణాం చ తతః పరమ్‌ | స్వర్లోకపాలనామ్నాతు న్యసే త్ప్రణవపూర్వకమ్‌. 14

రెండు వందల అరువది యైదవ యధ్యాయము.

దేవతా ప్రతిష్ఠావిధాన కథనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను; ప్రాసాద పరిమాణమునుగాని లింగపరిమాణమునుగాని అనుసరించి జ్యేష్ఠ మధ్యమ కనిష్ఠ పరిమాణములను దృష్టియందుంచుకొని ఋత్విక్‌ సంఖ్యయును ఇతర ప్రక్రియలును పాటించుచు లోగడ చెప్పినట్లు దేవతా ప్రతిమలకు ఆధివాసప్రక్రియను ముగించిన తరువాత యజమానుడు స్థాపకసహాయుడై శుభమును (పుణ్యాహకర్మను) సమాహిత చిత్తతతో నెరవేర్చవలయును; పుణ్యాహమంత్రముతో (మంత్రమును పఠించుచు) పుష్పోదకముతో ప్రాసాద (దేవాయతన)మును ప్రోక్షించవలయును; తరువాత సంప్రదాయమును శాస్త్రమును ఎరిగి పక్షసూత్రమును ద్వారసూత్రమును ప్రసారించవలయును; (దేవాగార ప్రధానద్వారపు నడిమినుండి తిన్నగ గర్భగృహపు పడమటి గోడలోపలి అంచువరకును ప్రాక్పశ్చిమములుగా ప్రసారించు సూత్రము ద్వారసూత్రము; గర్భగృహపు ప్రాక్‌ పశ్చిమాయామముల నడిమి బిందువునకు తిన్నగా దక్షిణోత్తరములుగా ప్రసారించినది పక్షసూత్రము; ఈ రెండును కలియుచోటు గర్భగృహపు మధ్యస్థానమగును; ఇచట దేవతార్చామూర్తి మధ్యస్థానము రావలయును) ఇట్లు మూర్తిని ప్రతిష్ఠించదగిన గర్భగృహపు మధ్యస్థానమును గురుతించిన తరువాత దానిని వాస్తవస్థానమునుండి కొంచెము ఈశాన్యదిశగా నుండునట్లు చూచి అది దేవతామూర్తి మధ్యస్థానమగునట్లు ప్రతిష్ఠ జరుపవలయును. ఏలయన ఈశాన్యదిశనుకాని ఉత్తర దిశనుకాని యాశ్రయించియుండు దేవతామూర్తినే దేవతలును పూజింతురు; ఇట్లు ప్రతిష్ఠించుట

ఆయురారోగ్య ఫలప్రదమును- శుభకరమును; మరియొకవిధముగ ప్రతిష్ఠించుట అశుభకరమని తెలిసినవారు అందురు.

దేవతామూర్తిని ప్రతిష్ఠించు స్థానమందు మొదట 'కూర్మశిల' అనుశిల యుండవలెను. దానిపైనుంచు శిలను 'బ్రహ్మశిల' యందురు; ఇది కూర్మశిలకంటె అధిక పరిమాణములోనుండును; దానికిని పైభాగమునందు పూర్వోక్తమగు మానము (కొలత) లతోను లక్షణములతోను 'పిండికా ' 'పీఠికా' శిలను ప్రతిష్ఠించవలయును; పుణ్యాహవాచనమును ప్రోక్షణమును గర్భాలయ- మధ్యస్థాన - తదీశాన్యస్థానముల నిర్ణయమును ఐన తరువాత ఈ 'పిండిక' 'పీఠిక' పంచగవ్యము తోను కషాయ( వగరు) జలముతోను మంత్రపఠన పూర్వకముగా ప్రక్షాళనము చేయవలయును; దేవతార్చామూర్తి విషయమున వినియోగించు మంత్రమునే ఆ మూర్తి ప్రతిష్ఠకగు పీఠికా7క్షాళనమందును వినియోగించవలెను; తరువాత దేవతార్చామూర్తిని 'ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే' అను మంత్రముతో లేవదీసి గర్భాలయములోనికి తీసికొనివచ్చి పీఠికాంతమునందు విచక్షణుడై ఉండవలయును; అచ్చట ఆమూర్తికి అర్ఘ్యపాద్యాదులను మధుపర్కమును ఈయవలెను; తరువాత ఒక ముహుర్త కాలము విశ్రమించి రత్నన్యాసము (అష్ట దిశల యందును ఆయా రత్నముల నుంచుట) జరుపవలెను. వజ్రము మౌక్తికము వైదూర్యము శంఖము స్ఫటికము పుష్యరాగము ఇంద్రనీలము నీలము అనురత్నములను తాలకము శిలావజ్రము గంధకము శ్యామాంజనము కాక్షీ- కాసీనము- మాక్షీకము(తేనెమైనము) గైరికము అను అంలంకారోపయుక్త రసద్రవ్యములను గోధూమ యవతిలముద్గ నీవారశ్యామాకసర్షప (ఆవాలు) వ్రీహుల (వరిధాన్యము)ను ధాన్య విషేషములను చందనము రక్తచందనము అగురు అంజనము ఉశీరము (వట్టివేళ్లు ) వైష్ణవి-సహదేవి- లక్ష్మణ -అను మూలికౌషదీ ద్రవ్యములను పూర్వాది దిశలందు వరుసగా ఆయాలోక (దిక్‌) పాలుర నామములతో తత్తన్మంత్రములతో ప్రణవపూర్వకముగా ఉంచవలెను; ఇదియే రత్న (రత్నాది) న్యాసము.

సర్వబీజాని ధాతూంళ్చ రత్నా న్యోషధయ స్తథా | కాఞ్చనం పద్నరాగం చ పారదం పద్మ మేవ చ . 15

కూర్మం ధరాం వృషం తత్ర న్యసే త్పూర్వాదితః క్రమాత్‌ | బ్రహ్మస్థానేతు దాతవ్యా స్సంహతా స్స్యుః పరస్పరమ్‌. 16

కనకం విద్రుమం తామ్రం కాంస్యం చైవారకూటకమ్‌ | రజతంవిమలం పుష్పం లోహం చైవ క్రమేణతు. 17

కాఞ్చనం హరితాళంచ సర్వాభాలే వినిక్షిపేత్‌ | దద్యా ద్భీజౌషధీ స్థానే సహదేవీం యవా నపి. 18

న్యాసమన్త్రా నతో వక్ష్యే లోకపాలాత్మాక నిహ | ఇన్ద్రస్తు సహసా దీప్త స్సర్వదేవాధిపో మహా&. 19

వజ్రహస్తో మహాసత్త్వ స్తసై#్మ నిత్యం నమోనమః | అగ్నిర్యః పురుషో రక్త స్సర్వదేవమయ శ్శిఖీ. 20

ధూమకేతు రనాధృష్య స్తసై#్మ నిత్యం నమోనమః | యమ శ్చోత్పలవర్ణాభః కిరీటీ దణ్డధృ క్సదా. 21

ధర్మసాక్షీ విశుద్ధాత్మా తసై#్మ నిత్యం నమోనమః | నిరృతిస్తు పుమా స్కృష్ణ స్సర్వరక్షో7 ధిపో మహా&. 22

ఖడ్గహస్తో మహాసత్త్వ స్తసై#్మ నిత్యం నమోనమః | వరుణో ధవళో విష్ణుః పురుషో నిమ్నగాధిపః. 23

పాశహస్తో మహాబాహు స్తసై#్మ నిత్యం నమోనమః | వాయుశ్చ సర్వవర్ణో వై సర్వగన్దవహా శ్శుభః. 24

పురుషో ధ్వజహస్తశ్చ తసై#్మ నిత్యం నమోనమః | గౌరో యశ్చ పుమా న్త్సౌమ్య స్సర్వౌషధిసమన్వితః. 25

నక్షత్రాధిపతి స్సోమ స్తసై#్మ నిత్యం నమోనమః | ఈశానః పురుషః శ్శుక్ల స్సర్వవిద్యాధిపో మహా&. 26

శూలహస్తో విరూపాక్ష స్తసై#్మ నిత్యం నమోనమః | పద్మయోని శ్చతుర్మూర్తి ర్వేదవాసః పితామహాః. 27

యజ్ఞాధ్యక్ష శ్చ తుర్వక్త్ర స్తసై#్మ నిత్యం నమోనమః | య స్సదానన్తరూపేణ బ్రహ్మాణ్డం సచారాచరమ్‌. 28

పుష్పవ ద్ధారయే న్మూర్ధ్ని తసై#్మ నిత్యం నమోనమః | ఔఙ్కారపూర్వకా హ్యేతే న్యాసే బలినివేదనే. 29

మన్త్రా స్స్యు స్సర్వకార్యాణాం వృద్ధిపుత్త్రఫలప్రదాః | న్యాసం కృత్వాతు మన్త్రాణాం పాయసేనానులేపనమ్‌. 30

పటేనాచ్ఛాదయే చ్ఛ్వభ్రం శుక్లేనోపరి యత్నతః |

తరువాత బ్రహ్మస్థానమునందు 1. సర్వబీజములను దాతువులను రత్నములను ఓషధులను తూర్పునందును ఆగ్నేయమందు మొదలుగా 2. కాంచనము 3. పద్మరాగము 4. పారదము (పాదరసము) 5, పద్మము 6. కూర్మము 7. ధర 8. వృషము అను ఓషధ్యాదికమును అన్ని దిక్కులందు నుంచవలెను; అట్లే ప్రాగాదిగా 1. కనకము.2. విద్రుమము(పగడము) 3. తామ్రము4. కాంస్యము 5. ఆరకూటము(ఇత్తడి) 6. రజతము7. విమల పుష్పము 8. లోహము (ఇనుము) ఇవియు ఉండవలయును ; ఇవియన్నియును బ్రహ్మస్థానమందు పరస్పరము కలిసిపోవును; ఇవి వేరు వేరుగా దొరకనపుడు రత్నాదికమునకు మారుగా కాంచనమును ధాతువులకన్నిటికి మారుగా హరితాళమును బీజములకన్నిటికి మారుగాయవలను ఓషధులన్నిటిస్థానమున సహదేవిని ఉండవచ్చను; లోకపాలాత్మ కములగు మంత్రముల(అర్థముల)ను ఇపుడు చెప్పెదను; ఇంద్రునకు; ఇంద్రుని విశేషము ఏమనిన- అతడు దృఢముగా ప్రజ్వలించువాడు- సర్వదేవాధిపుడు- గొప్పవాడు - వజ్రహస్తుడు మహాసత్త్వుడు -అతనికి సదా నమస్సు- నమస్సు ; అగ్నికి ; అగ్నిపురుషుడు (శూరుడు) రక్తవర్ణుడు - సర్వదేవమయుడు- జ్వాలలు కలవాడు- ధూమము అతని ధ్వజము (జెండా) - అతడు అనాధృష్యుడు (ఎవరికిని ఎదరించనలవి కానివాడు) అతనికి ఎల్లప్పుడు నమస్సు- నమస్సు; యమునకు యముడు నల్లకలువ పూచాయవాడు- కిరీటి - దండధరుడు- ధర్మసాక్షి- విశుద్ధాత్ముడు- అతనికి నిత్యమును నమస్సు- నమస్సు; నిరృతి కృష్ణపురుషుడు సర్వరక్షో7ధిపతి - గొప్పవాడు -ఖడ్గహస్తుడు- మహాసత్త్వుడు- అతనికి సదా నమస్సు- నమస్సు; వరుణునకు; వరుణుడు తెల్లనివాడు విష్ణురూప పురుషుడు నదీపతీ- పాశహస్తుడు- మహాబాహుడు- అతనికి సదా నమస్సు-నమస్సు; వాయువు నకు; వాయువునకు అన్ని వన్నెలును గలవాడు- అన్ని వాసనలను మోయువాడు; అయినను శుభుడు ధ్వజహస్తుడగు పురుషుడు. అతనికి సదానమస్సు- నమస్సు; సోమునకు సోముడు గౌరవర్ణపురుషుడు- సర్వౌషధీయుక్తుడు, నక్షత్రాధిపతి- సౌమ్యుడు- అతనికి ఎల్లపుడును నమస్సు-నమస్సు; ఈశానునకు; ఈశానుడు శుక్ల(తెల్లని) పురుషుడు- సర్వవిద్యాధిపతి- గొప్ప వాడు- శూలహస్తుడు -విరూపాక్షుడు- అతనికి నిత్యమును నమస్సు- నమస్సు; బ్రహ్మకు: పద్మము ఈతని జన్మ స్థానము- ఇతడు చతుర్మూర్తి-వేదములకు ఆశ్రయుడు - ఎల్లరకును తాత- యజ్ఞాధిపతి - చతుర్ముఖుడు - అతనికి సదా నమస్సు-నమస్సు; అనంతు(ఆదిశేషు)నకు; ఎవడు సదా 'అనంత' అనబడు రూపముతోనుండుచు సచరాచర బ్రహ్మాండమును పూవువలె తన తలపై నిలుపుకొనునో అతనికి నిత్యమును నమస్సు- నమస్సు; ఈ మంత్రములు దేవతార్చా సర్వకార్యములందును న్యాసములకును బలినివేదనమునకును ప్రణవ పూర్వకముగా వినియోగించవలసిన మంత్రములు; ఇవి వృద్ధిని పుత్త్రులను ఇతరములగు సత్ఫలములను ఇచ్చును; ఇట్లు మంత్రపఠన పూర్వకముగా న్యాసము జరిపి మూర్తిని ప్రతిష్ఠించవలసిన పీఠికయందలి గోతిని పాయసముతో పూసి దానిపై యథాశక్తిగ తెల్లని వస్త్రముతో కప్పవలయును.

తత ఉత్థాప్య దేవేశ మిష్టదేశే తు శోభ##నే. 31

ధ్రువా ద్యౌరితి మన్త్రేణ శ్వభ్రోపరి నివేశయత్‌ | తత స్థ్సిరీకృతస్యాస్యహస్తం కృత్వాతు మస్తకే. 32

ధ్యాత్వా పరమసద్భావా ద్ధేవదేవం తు నిష్కలమ్‌ | దేవవ్రతం తథా సామ రుద్రసూక్తం తథైవచ. 33

ఆత్మాన మీశ్వరం కృత్వా నానాభరణభూషితమ్‌| యస్య దేవస్య యద్రూపం తద్ధ్యానే సంస్మరే త్తథా. 34

అతసీపుష్పఙ్కాశం శఙ్ఖచక్రగదాధరమ్‌ | సంస్థాపయామి దేవేశం దేవో భూత్వా జనార్ధనమ్‌. 35

త్ర్యక్షం చ దశబాహుం చ చన్ద్రా ర్ధకృతశేఖరమ్‌ | గణశం వృషసంస్థం చ స్థాపయామి త్రిలోచనమ్‌.36

ఋషిభి స్సంస్తుతం దేవం చతుర్వక్త్రం జటాధరమ్‌ | పితామహం మహాబాహుం స్థాపయా మ్యమ్బుజోద్భవమ్‌. 37

సహస్రకిరణం శాన్త మప్సరోగణసంయుతమ్‌ | పద్మహస్తం మహాబాహుం స్థాపయామి దివాకరమ్‌. 38

వేదమన్త్రాం స్తథా రౌద్రా న్రుద్రస్య స్థాపనే జపేత్‌ | విష్ణోస్తు వైష్ణవాం స్తద్వ ద్భ్రాహ్మాణా న్బ్రహ్మణో బుధైః. 39

సౌరా న్సూర్యస్య జప్తవ్యా స్తథా7న్యేషు తదాశ్రయాః | వేదమన్త్రం ప్రతిష్టా తు యస్మా దానన్దదాయినీ. 40

స్థాపయే ద్యం తు దేవేశం తంప్రధానం తు కల్పయేత్‌ | తస్య పార్శ్వస్థితా నన్యా స్త్సంస్మరే త్పరివారితః. 41

గణం నన్దిమాహాకాళం వృషం భృఙ్గిరిటిం గుహమ్‌ | దేవీం వినాయకం చైవ విష్ణుం బ్రహ్మణ మేవ చ. 42

రుద్రం శక్రం జయస్తంచ లోకపాలా న్త్సమన్తతః | తథైవాప్సరస స్సర్వా గన్ధర్వగణగుహ్యకా&. 43

యో యత్ర స్థాప్యతే దేవ స్తస్య తా న్పరిత స్మ్సరేత్‌ | ఆవాహయే త్తథా రుద్రం మన్త్రేణానేన యత్నతః. 44

తరువాత దేవేశుని (దేవతార్చామూర్తిని) లేవదీసి కొంతసేపు తనకు ఇష్టమగు శోభనదేశమునదు ఉంచి 'ధ్రువాద్యౌః' అను మంత్రముతో ఆ మూర్తిని దేవుని ఆ ప్రతిష్ఠించవలసిన పీఠపు గుంటయందు ఉంచ(ప్రతిష్ఠించ)వలెను: తరువాత ఆ మూర్తినందు స్థిరీకరించి అతని తలపై యజమానాచార్యులు తమ హస్తముంచి పరమ సద్‌ (శ్రద్ధా) భావముతో నిష్కలరూపుడగు దేవదేవుని ధ్యానించవలయును; దేవవ్రతసామమును రుద్రసూక్తమును పఠించవలయును; యజమానుడు తన్నే నానాభరణభూషితుడగు ఈశ్వరునిగా (ప్రతిష్ఠించవలసిన దేవునిగా) భావన చేసి ఏయే దేవతలకు ఏయే రూపము కలదో ఆయా రూపములను ఆయా దేవతాప్రతిష్ఠార్థమై మనసాస్మరించి ధ్యానించవలయును. ఎట్లనగా - నల్ల అవిసిపూవన్నె వాడును శంఖఛక్ర గదాధరుడును దేవేశుడును నగు జనార్ధనుని (విష్ణుని) నేనే ఆ దేవుడునుగానై ప్రతిష్ఠించుచున్నాను; త్రినేత్రుడును దశభుజుడును చంద్రార్థశేఖరుడును ప్రమథగణాధిపతియు వృషభస్థుడునునగు త్రిలోచనుని శివుని ప్రతిష్ఠింతును. ఋషులచే స్తుతింపబడు దేవుడును చతుర్ముఖుడును జటాధరుడును ఎల్లరకును పితామహుడును మహాబాహుడును అంబుజ సంభవుడు నగు బ్రహ్మను ప్రతిష్ఠింతును. సహస్ర కిరణుడును శాంతుడును అప్సరోగణయుతుడును పద్మహస్తుడును మహాబాహుడు నగు రవిని ప్రతిష్ఠింతును; ఇవియే కాక రుద్రప్రతిష్ఠకై రౌద్రములును విష్ణుప్రతిష్ఠకై వైష్ణవములును బ్రహ్మకై బ్రాహ్మణములు (బ్రహ్మ సంబంధులు)ను రవికై సౌరములును నగు వైదిక మంత్రములను మరి యితర దేవతల కాయా దేవతా సంబద్ధ వైదిక మంత్రములను జపించ(పఠించ)వలయును; ఏలయన వేదమంత్రపూర్వకమగు ప్రతిష్ఠ ఆనందదాయిని; గర్భ గృహపీఠమందు ప్రధాన దేవతామూర్తిని ప్రతిష్ఠించి అతనికి పార్శ్వస్థులగు గణనంది మహాకాళ వృష భృంగిరిటి గుహ పార్వతీ వినాయక విష్ణు బ్రహ్మ రుద్ర శక్ర( ఇంద్ర) జయంత లోకపాలాప్సరో గంధర్వగణ గుహ్యకాదులను అతని పరివార దేవతలుగా గ్రహించి (తన ఇచ్ఛానుసారము వారిలో కొందరను) వారి వారి స్థానములందు వారి వారి వైదిక మంత్రములతో ప్రతిష్ఠించవలయును: అందు రుద్రునకై ఆవాహన మంత్ర(పు అర్థ)ము ఇది:

యస్య సింహా రథే యుక్తా వ్యాఘ్రభూతా స్తథోరగాః | ఋషయో లోకపాలాశ్చ దేవ స్స్కన్ద స్తథావృషః. 45

ప్రియో గణో మాతరశ్చ సోమో విష్ణుః పితామహాః | ఉరగాయక్షగన్ధర్వా యే చ దివ్యా నభశ్చరాః. 46

తమహం త్ర్యక్ష మీశానం శివం రుద్ర ముమాపతిమ్‌ | ఆవాహయామి సగణం సపత్నీకం వృషధ్వజమ్‌. 47

ఓం ఆగచ్ఛ భగవ న్రుద్రా7నుగ్రహాయ శివో భవ | శాశ్వతో భగవ న్పూజాం గృహాణ త్వం నమోనమః. 48

వాక్యాని: ఓం నమ స్స్వాగతం భగవతే నమః | ఓం నమ స్సోమాయ సగణాయ సపరివారాయ |

ప్రతిగృహ్ణాతు భగవ న్మస్త్రపూత మిదం సర్వ మర్ఘ్యపాద్య మాచమనీయ మాసనం బ్రహ్మణా7భిహితం నమో నమ స్స్వాహా.49

తతః పుణ్యాహఘోషేణ బ్రహ్మఘోషైశ్చ పుష్కలైః స్నాపయీత తతో దేవం దధిక్షీరఘృతేన చ. 50

మధుశర్కరయా తద్వ త్పుష్పగన్ధోదకేనచ | శివధ్యానై కచిత్తస్తు మన్త్రా నేతా నుదీరయేత్‌. 51

వాక్యాని 'యజ్ఞాగ్రతో దూర ముదేతి' 'తతో విరాడజాయత' ఇతి చ | 'త్రిపాదూర్ద్వమితి ' 'యేనేదం భూత' మితి | 'సత్త్వావాం అన్య 'ఇతి. 52

సర్వాంశ్చైతా న్ప్రతిష్ఠాసు మన్త్రా న్జప్త్వా పునః పునః | చతుః కృత్వా స్పృశే దిధ్బి ర్మూలే మధ్యే శిరస్యపి. 53

స్థాపితేతు తతో దేవే యజమానో7థ మూర్తిపాన్‌ | ఆచార్యం పూజయేద్భక్త్యా వస్త్రాలఙ్కారభూషణౖః. 54

దీనాన్ధకృపణాం స్తద్వ ద్యే చాన్యే సముపస్థితాః |

ఎవని రథమున సింహములు వ్యాఘ్రములు భూతములు సర్పములు పూంచబడియుండునో ఋషులు లోకపాలురు స్కందదేవుడు నందివృషము ప్రియ ప్రమథగణము మాతృకలు సోముడు విష్ణుడు బ్రహ్మ నాగ యక్షగంధర్వాది దివ్యఖేచరులు ఎవనిని పరివారించియుందురో అట్టి త్రినేత్రుడు ఈశానుడు శివుడు రుద్రుడు ఉమాపతియగు మహాదేవుని వృషభధ్వజుని అతని పత్నితో ప్రమథగణముతో కూడ ఆవాహన మొనర్చుచున్నాను; సర్వమును ప్రణవమయము; రుద్రా! భగవన్‌! నన్ను అనుగ్రహిం రమ్ము; శివ( శుభరూపు) కరుడవు కమ్ము; భగవన్‌! నీవు ఇందు శాశ్వతుడవయి నా పూజను గ్రహించుము. నమోనమః మరికొన్ని వాక్యములు: ప్రణవరూపునకు ప్రణవపూర్వక నమస్సు: భగవానునకు నమః పూర్వక స్వాగతము; ఉమతో ప్రమథ గణముతో ఇతర పరివారముతో కూడిన రుద్రునకు ప్రణవపూర్వక నమస్కారము; భగవానుడు బ్రహ్మచే వేదమంత్రపూర్వకముగా ఈయబడిన మంత్రపవిత్రమగు ఆ అర్ఘ్యపాద్యాచనీయాననాదికమంతయు గ్రహించవలయునని ప్రార్థన; నమోనమః స్వాహా.

ఇట్లు ఆవాహించిన తరువాత పుష్కలమగు పుణ్యాహ ధ్వనులతో వేదమంత్ర ధ్వనులతో దధిక్షీర ఘృతములతో మధుశర్కరాపుష్ప-గంధజలములతో దేవునిన్నపనము చేయించవలయును: ఆ సమయమున (దే) శివధ్యానైకచిత్తుడై ఈ మంత్రముల నుచ్చరించవలయును: 1. యజ్ఞాగ్రతో దూరముదేతి: 2. తతో విరాడజాయత. 3. సహస్రశీర్షాపురుషః. 4. అభిథ్వాశూర నోనుమః 5. పురుష ఏవేదం సర్వమ్‌: 6. త్రిపాదూర్ధ్వం: 7. యేనేదం భూతమ్‌: 8. సత్వాహం అన్యో: ఈ మంత్రముల నన్నిటిని ప్రతిష్ఠాకార్యములందు మరల మరల జపించుచు జలముతో నాలుగుమారులు అర్చామూర్తి పాదనాభిశిరః ప్రదేశములను స్పృశించవలయును; దీనితో ప్రతిష్ఠా ప్రక్రియ ముగిసినట్లే; అనంతరము యజమానుడు ఆచార్యు(ప్రధాన ఋత్విక్‌- స్థాపకు)ని మూర్తిపులను (ఇతర ఋత్విక్‌లను) భక్తి పూర్వకముగా వస్త్రాలంకార భూషణములతో పూజించ(ఆదరించ) వలెను; అచటకు వచ్చి యున్న ఇతర జనులను దీనులను అంధులు మొదలగు దయనీయ జనులను కూడ యథోచితముగా ఆదరించవలయును.

తతస్తు మధునా దేవం ప్రథమే7హని లేపయేత్‌. 55

హరిద్రయా7థ సిద్ధా ర్థైర్ద్వితీయే7హని తత్త్వతః | చన్దనేన యవై స్తద్వ త్తృతీయే 7హని లేపయేత్‌. 56

మనశ్శిలా ప్రియఙ్గభ్యాం చతుర్థే7హని లేపయేత్‌ | సౌభాగ్యశుభదం యస్మా ల్లేపనం వ్యాధినాశనమ్‌. 57

పరం ప్రీతికరం నౄణాం మేత ద్వేదవిదో విదుః | కృష్ణాఞ్జనం తిలం తద్వ త్పఞ్చమే7హ్ని విశేషతః. 58

షష్ఠే తు సఘృతం దద్యా చ్చన్దనం పద్మకేసరమ్‌ | రోచనాగురుపుష్పం చ సప్తమే7 హని లేపయేత్‌. 59

యత్ర సద్యో7ధివాస స్స్యా త్తత్ర సర్వం నివేదయేత్‌ | స్థితం న చాలయే ద్దేవ మన్యథా దోషభా గ్భవేత్‌. 60

పూరయే త్సికతాభిస్తు నిశ్ఛిద్రం సర్వతో భ##వేత్‌ | లోకపాలస్య దిగ్భాగే యస్య సఞ్చనం

విభుః. 61

తస్య లోకపతే శ్శాన్త్యై దేయా శ్చేమాశ్చ దక్షిణాః | ఇన్ద్రాయాభరణం దద్యా త్కాఞ్చనం చాల్పవిత్తవా &. 62

అగ్నే స్సువర్ణ మేవ స్యా ద్యమస్య మహిషం తథా | అన్నంచ కాఞ్చనం దద్యా న్నైరృతం రాక్షసం ప్రతి. 63

వరుణం ప్రతి ముక్తాని సశుక్తీని ప్రదాపయేత్‌ | రీతికాం వాయవే దద్యా ద్వస్త్రయుగ్మేన సంయుతమ్‌. 64

సోమాయ ధేను ర్ధాతవ్యా రజతం సవృషం శివే | యస్యాం యస్యాం సఞ్చలనం శాన్తి స్స్యా త్తత్ర తత్ర తు. 65

అన్యథా తు భ##వే ద్ఘోరం భయం కులవినాశనమ్‌ | అచలం కారయే ద్యత్నా త్సికతాద్యై స్సురేశ్వరమ్‌. 66

అన్నం వస్త్రంచ దాతవ్యం పుణ్యాహజయమఙ్గళమ్‌ | త్రిః పఞ్చదశసపై#్తవ దినాని స్యా న్మహోత్సవః. 67

చతుర్థే7హ్ని మహాస్నానం చతుర్థీకర్మ కారయేత్‌ | దక్షిణాచ పున స్తద్వ ద్దేయా తత్రాతిభక్తితః. 68

దేవప్రతిష్ఠావిధి రేష తుభ్యం నివేదితః పాపవినాశ##హేతోః | యస్మా ద్బుధైః పూర్వ మనన్త ముక్త మనేక విద్యాధర దేవజుష్టమ్‌. 69

ఇతి శ్రీమత్స్య మహాపురాణ దేవప్రతిష్ఠావిధి

పంచ షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

అనంతరము మొదటిదినమున తేనెతోను రెండవ దినమున పసపుతోను తెల్ల ఆవల (పిండి)తోను మూడవ దినమున చందనముతోను యవల (పిండి)తోను నాలగవదినమున ప్రియంగు (ప్రేంకణపుపూవు) చూర్ణముతోను మనః శిలాధాతువుతోను దేవుని అర్చామూర్తికి పూత పూయవలయును; ఏలయన ఇట్లు పూత పెట్టుట నరులకు సౌభాగ్యమును శుభమును వ్యాధినాశమును పరమప్రీతి సుఖములను కలిగించునని వేదతత్త్వ విదులు చెప్పుచున్నారు; ఐదవ దినమున కృష్ణాంజనముతోను తిలల(పిండి) తోను ఆరవనాడు నేతితో చందనముతో పద్మ కేసరములతోను ఏడవ దినమున గోరోచనముతో అగురుతోను పూవులతోను పూతపూయవలెను. (ఇది యంతయు లోగడ తెలిపిన అధివాన ప్రక్రియ జరిపిన దినములు ఎన్నియో అన్ని దినములపాటు ఈ లేపన ప్రక్రియ జరుపవలెనని సూచించుచున్నది; ఇట్లు కాక) సద్యో7ధివాసముతో ప్రతిష్ఠజరిపిన సందర్భములలో ఈ పూతలన్నియు ప్రతిష్ఠానంతరము ఒకేసారి వరుసగా చేయవలెను.

ప్రతిష్ఠా7నంతరము దేవుని మూర్తిని మరల నెన్నడును కదలించరాదు; దోషభాక్కు అగును.

కూర్మశిలా - బ్రహ్మశిలా -పీఠికా స్థానముల గోతిని ఇసుకతో నీరంధ్రముగా నింపవలయును; అట్లు అవికాని వాని మూలమున దేవతామూర్తిని కాని కదలకుండునట్లు చూడవలయును; మూర్తిని ప్రతిష్ఠించిన పీఠభాగ శ్వభ్రమును కూడ ఇసుక సున్నములతో గట్టిగ పూడ్చవలయును.

ఇంతచేసిన ఒకవేళ మూర్తి చలించినచో మరల అచట కదలిక లేకుండునట్లు భద్రపరచుటయే కాక ఈ కదలిక ఏదిశగా జరిగినదో ఆ దిక్పాలకుడు శాంతించుటకై ఇంద్రునకై సువర్ణాభరణములను అల్పధనవంతుడు యథా శక్తిగ బంగారమునైనను 2. అగ్నికై బంగారమును యమునకై మహిషమును 4. నిరృతికై అన్నమను సువర్ణమును 5. వరుణునకై ముత్తెములను ముత్తెపు చిప్పలను. 6. వాయువునకై ఇత్తడిని వస్త్రయుగమును. 7. సోమునకై ధేనువును 8. శివునకై వృషభమును వెండిని దానము చేయవలయును; దీనిచే ఆయా దిక్కులందు కలిగిన చలనపు దోషము శాంతించును; లేనిచో కులనాశకరమగు ఘోరభయము కలుగును; అందును ఇట్టి చలనము కనబడగానే ఇసుకతో (కలిపి నూరిన సున్నము మొదలగు వానితో) సురేశుని మూర్తిని కదలకుండ చేయవలెను; అన్న వస్త్రాది దానము జరిపి పుణ్యాహవాచనము జరుప వలయును; ఈ దినక్రమమున నాలుగువ దినమున మహా స్నానమును చతుర్థీకర్మ ప్రక్రియ ను (ప్రతిష్ఠివంటి ప్రక్రియను) జరుపవలయును; అపుడు కూడ ఋత్విగాదులకు మరల దక్షిణాదికము భక్తితో నీయవలెను: పాప వినాశ హేతువగు దేవ ప్రతిష్ఠావిధి నీకు తెలిపితిని. ఈ విద్యాధరులును దేవతలును విని ఆనందించెడు అనంత ప్రకారమగు ఈ విధానము ఇంతకు మునుపు కూడ పండితులనేకులు చాల మారులు బోధించిరి- వినిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవతాప్రతిష్ఠా విధానమున ప్రతిష్ఠా ప్రక్రియయను

రెండు వందల అరువది యైదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters