Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏక షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

పిండికాలక్షణమ్‌.

సూతః : పిండికాలక్షణం వక్ష్యే యథావదనుపూర్వశః | పీఠోచ్ఛ్రాయం యథావచ్చ భాగా న్షోడశ కారయేత్‌. 1

భూమా వేకః ప్రవిష్ట స్స్యా చ్చతుర్భి ర్జగతీ మతా | వృత్తో భాగా స్తథైక స్స్యా ద్వృత్తః పటలభాగతః. 2

భాగై స్త్రిభి స్తథా కణ్ఠః కణ్ఠపట్ట స్త్రిభాగతః | భాగాభ్యా మూర్ధ్వపట్టస్తు శేషభాగేన పిణ్డికాః. 3

ప్రవిష్టం భాగ మేకైరం జగతీ యావదేవ తు | నిర్గతస్తు పున స్తస్యా యావద్వై శేషపిణ్డికా. 4

వారినిర్గమనార్థం తు తత్ర కార్యా ప్రణాళికా | పిణ్డికానాం తు సర్వాసా మేత త్సామాన్యలక్షణమ్‌. 5

రెండు వందల అరువది యొకటవ యధ్యాయము.

పిండికా లక్షణము.

xqsW»R½V²R…V ‡ÁVVxtsvÌÁNRPV BÈýÁV ¿Á|msöƒ«sV. xqsLiúxmsµy¸R…Vª«sVLiµR…Vƒ«sV aSxqsòQûª«sVVƒ«sLiµR…Vƒ«sV Dƒ«sõµj… ¸R…VVƒ«sõÈýÁV zmsLi²T…NS ÌÁORPQß᪫sVVƒ«sV µy¬s¸R…VLiµR…ÖÁ ¸R…VLiµR…ª«sVVÌÁ úNRPª«sVxmso Aƒ«sVxmspLji*¬s @ƒ«sVxqsLjiLiÀÁ ª«sLRiVxqsgS ¿ÁxmsöµR…ƒ«sV.

దేవాలయద్వారపు ఎత్తును దృష్టియందుంచుకొని పీఠపుఎత్తును నిర్ణయించు కొనవలయునని లోగడ చెపపబడినది కదా: దానిననుసరించి నిర్ణయించుకొనిన పీఠపుమొత్తము నిలువుటెత్తును పదునారు భాగములుగా చేసియుంచుకొనవలయును; (Sixteen one sixteenth parts = 1/16 x 16 = 1) వీనియందలి (1) ఒకభాగము = 1/16 భూమియందు ప్రవేశించును: (2.) భూమికి పైగానుండు 'జగతీ' అనుభాగము నాలుగు షోదశాంశములు =4/16 (3) దానికిపైగా 'కంఠము' అనుభాగము మూడుషోడశాంశములు= 3/16: (4) దానికిపైగా 'వృత్తపటలము' అనునది ఒక షోడశాంశము=1/16: (5) దానికిపైగా 'కంఠపట్టము' అనునది మూడు షోడశాంశములు =3/16: (6) దానికిపైగా 'ఊర్ధ్వపట్టము' అనునది రెండు షోడశాంశములు2/16: ఇట్లు పదునాలుగు షోడశాంశములు =14/16 పోగా మిగిలిన రెండు షోడశాంశముల=2/16తో 'పిండికా' ('పట్టికా' అనియు కొందరందురు) అనుభాగము చేయవలయును: నీరు బయటకు పోవుటకుగాను ఈ భాగమునందు 'ప్రణాళికా' (కాలువవంటి 'గాడి') చేయవలయును; ఇది పిండికల యన్నిటియందును ఉండవలసిన సామాన్య లక్షణము.

విశేషా న్దేవతాభేదా ఞ్ఛృణుధ్వం ద్విజసత్తమాః | స్థణ్డిలా చాథ వాపీచ యక్షీ వేదీ చ మణ్డలా. 6

పూర్ణచన్ద్రా చ వజ్రాచ పద్మా వార్దశశి స్తథా | త్రికోణా దశమీ తాసాం సంస్థానం చ నిబోధత. 7

స్థణ్డిలా చతురశ్రా తు వర్జితా మేఖలాదిభిః | వాపీ ద్విమేఖలా జ్ఞేయా యక్షీ చైవ త్రిమేఖలా. 8

చతురశ్రా77యతా వేదీ న తాం లిఙ్గేషు యోజయేత్‌ | మణ్డలా వర్తులా యా తు మేఖలాభి ర్గణప్రియా. 9

రిక్తా ద్విమేఖలామధ్యే పూర్ణచన్ద్రా తు సా భ##వేత్‌ | మేఖలాత్రయ సంయుక్తా (అష్టా) షడశ్రా వజ్రికా భ##వేత్‌.

షోడశాశ్రా భ##వే త్పద్మా కిఞ్చిద్ద్రస్వాను మూలతః | తథైవ ధనుషాకారా సార్దచన్ద్రా ప్రశస్యతే. 11

త్రిశూలసదృశృ తద్వ త్త్రికోణా హ్యూర్ధ్వతో మతా | ప్రాగుదక్ప్రవణం తస్య ప్రశస్తం లక్షణాన్వితమ్‌.

ద్విజోత్తములారా! ఆయా దేవతా భేదములకు తగినట్లుగా వేరువేరు రూపములను వేరువేరు అమరికలతో నుంచెడు పిండికా విశేషములను తెలిపెదను వినుడు: ఇవి 1. స్థండిలా 2. వాపీ 3. యక్షీ 4. వేది 5. మండలా 6. పూర్ణచంద్రా 7. వజ్రా 8. పద్మా 9. అర్ధచంద్రా 10. త్రికోణా అని వది విధములుగానున్నని. వీని ఉనికి వరుసగా-1.మేఖలమొదలగు అమరికలులేని చతురస్రా కృతిగా నుండను: 2. రెండు మేఖలలు కలది: 3. మూడు మేఖలలు కలది: 4. ఇది ఆయతము (దీర్ఘచతురస్రాకృతి= Reetangular). ఇది లింగ ప్రతిష్ఠకు వినియోగించరాదు. 5. ఇది వర్తులముగా నుండును; దీనియందు మూడు మేఖలలుండును; ఇది ప్రమథగణములు మొదలగువారిక ప్రియమయినది; 6. దీని యందు క్రిందనొకటియు పైనొకటియు మేఖలలుండును; ఒక మేఖలాస్థానము కాదగిన నడుమబాగము శూన్యముగా వదలివేయబడును; 7. ఇది మూడు మేఖలలు కలిగిషడ (అష్టా) స్రాకారముతో నుండును; 8. ఇది షోడశాస్రా కృతితో (with sixteensides) నుండును; ఇది మూలభాగమున కొంచెము పొట్టిగాను లావు తక్కువగాను నున్నట్లు కనబడునదిగా నిర్మించబడును; 9. ఇది ధనురాకారముతో నుండును; 10. ఇది త్రికోణాకృతితో (Triangular) నుండును; లింగపుఎత్తులో దాదాపు నగము ఎత్తువరకు నిలువుగా తానును ఉండి త్రిశూలాకృతితో కనబడవలయును.

పరివేషత్రిభాగేన నిర్గమం తత్ర కారయేత్‌ | విస్తారం తత్ప్రమాణం చ మూలే చాగ్రే తథోర్ధ్వతః. 13

జలమార్గశ్చ కర్తవ్య స్త్రీభాగేన సుశోభనః | లిఙ్గస్యార్దవిభాగేన స్థౌల్యేన సమధిష్ఠితా. 14

మేఖలా తత్త్రిభాగేన భాతం చైతత్ప్రమాణతః. 15

అథవా పాదహీనంతు శోభనం కారయే త్సదా | ఉత్తరస్థం ప్రణాలంచ ప్రమాణా దధికం భ##వేత్‌. 16

న్థణ్డిలాయా మథారోగ్యం ధనం వాప్యాం చ పుష్కలమ్‌ | గోప్రదాతు భ##వేద్యక్షి వేదీ సమ్పత్ప్రదా భ##వేత్‌. 17

మణ్డలాయాం భ##వేత్కీర్తి ర్వరదా పూర్ణచన్ద్రికా | ఆయుఃప్రదా భ##వే ద్వజ్రా పద్మా సౌభాగ్యదాయినీ. 18

పుత్రప్రదా7ర్ధచన్ద్రా స్యా త్త్రికోణా శత్రునాశినీ | దేవస్య యజనార్థంతు పిణ్డికా దశ కీర్తితాః. 19

శైలే శైలమయిం దద్యా త్పార్థివే పార్తివీం తథా | దారుజే దారుజాం కుర్యా న్మిశ్రే మిశ్రాం పథైవచ. 20

నాన్యయోనిస్తు కర్తవ్యా సదా శుభ ఫలేప్సుభిః | అర్చాయామసమం దైర్యం లిఙ్గాయామసమం తథా. 21

యస్య దేవస్య యా పత్నీ తాం పీఠే పరికల్పయేత్‌ | ఏతత్సర్వం సమాఖ్యాతం సమాసా త్పీఠలక్షణమ్‌.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ పిణ్డకాలక్షణం నామ

ఏక షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

C {mshjiNRP¸R…VLiµR…V (\|ms˳ØgRiª«sVVƒ«s) CaSƒ«sùª«sVVƒ«sNRPV N]Li¿Áª«sVV ª«sLixmsogSƒ«sV ªyÌÁVgRiƒ«sV ƒ«sVLi²R…Vƒ«sÈýÁV úxmsaRPxqsòª«sVVƒ«sV ÌÁORPQßجs*»R½ª«sVVƒ«sV\®ƒs ¿RÁW²R…ª«sVV¿RÁèÈÁgSƒ«sVLi²R…V ÇÁÌÁ¬sLæRiª«sVƒ«s ª«sWLæRiª«sVVƒ«s (ÀÁLRiVNSÌÁVª«sƒ«sV) GLRiöLRi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV; Bµj… ÖÁLigRiª«sVVƒ«sNRPV (ÛÍÁ[µy ®µ…[ª«s»y úxms¼½ª«sVNRPV) ¿RÁVÈíÁVƒ«sVLi²R…V xmsLji®ªs[xtsQxmso ªyùxqsxmso xmsLjiª«sWß᪫sVVÍÜ[ (1/3) మూడవవంతు వెడల్పుగల శిలా భాగమునందుడవలయును; ఈ జల నిర్గమ మార్గపు కొలతలు మూలమందు (అడుగువైపున) కాని నడుమకాని పైభాగము నందుకాని పరివేషపు కొలతలకు అనుగుణముగా అనులోమానుపాతము( Direct Proporiton)లో నుండవలయును; ఇదియుకాక లింగపు ఎత్తులో సగము ఎత్తు మందముగా మేఖలయుండవలయును; ఈ మేఖలకు గల ఈ మందములో మూడవవంతు తక్కువగా =(2/3 పాలు) ఈ జలనిర్గమ మార్గపు కాలువ వెడల్పుండవలయును; లేదా ఈ మందములో 1/4 నైన తగ్గించవచ్చును; (అనగా ఈ కాలువ వెడల్పు మేఖలమందములో 3/4 వంతు ఉండును;) ఈ నీరు బయటకు పోవుటకై ఈ పీఠపు ఉత్తరదిశగా బయటకు ఏర్పరచిన కాలువ దీనికంటె కొంచెము ఎక్కువ వెడల్పుతో ఉన్నను ఉండవచ్చును.

ఈ చెప్పిన పీఠికాభేదముల ఫలములు: 1. స్థండిల ఆరోగ్యమును 2, వాసి పుష్కల ధనమును 3. యక్షిగోవృద్ధిని 4. మండలకీర్తిని 5. యక్షి సంపదను 6. పూర్ణచంద్రవరములను 7. వజ్ర ఆయువును 8. పద్మ సౌభాగ్యమును 9. అర్ధచంద్ర పుత్త్రులను 10. త్రికోణ శత్రునాశమును కలుజేయును; ఇట్లు దేవాలయములందు దేవతార్చామూర్తులను పూజించుటకై వారిని ప్రతిష్ఠించుటకు నిర్మించవలసిన దశ పీఠముల లక్షణములను చెప్పుటయైనది; దేవతాప్రతిమ(కాని లింగముకాని) శిలతోనో మృత్తికతోనో దారువుతోనో మిశ్రలోహములతోనో- దేనితో చేయుదుమో- పీఠముకూడ దానితోనే చేయవలయును; అర్చామూర్తి - పీఠములు రెండును భిన్న పదార్థములతో చేయరాదు ; అర్చామూర్తి ఆయామము పొడవు) ఎంతయుండునో పీఠపు ఎత్తు అంత యుండవలయును; ఏ దేవుని పత్ని ఎవరో ఆదేవిరూపము ఆ దేవుని పీఠము నందు రూపొందించవలెను.

ఇట్లు ఈ చెప్పినది ఇదియంతయు దేవాలయమందలి దేవతా పీఠ లక్షణ సంక్షేవము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున పీఠికాలక్షణమను రెండు వందల

అరువది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters