Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్విపంచాశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

గృహాది నిర్మాణ కాల నిర్ణయః.

సూతః : అథాత స్సమ్ప్రవక్ష్యామి గృహకాసవినిర్ణయమ్‌| యథాకాలం శుభం జ్ఞాత్వా సదా భవన మారభేత్‌. 1

చైత్రే వ్యాధి మవాప్నోతి యో గృహం కారయే న్నరః| వైశాఖే ధనరత్నాని జ్ఞ్యేష్ఠే మృత్యుం తథైవచ. 2

ఆషాఢే భృత్యరత్నాని పశువర్ఘ మవాప్నుయాత్‌| శ్రావణ భృత్యలాభం చ హానిం భాద్రపదే తథా. 3

పత్నీనాశో 7శ్వినే విన్ద్యా త్కార్తికే ధనధాన్యకమ్‌| మార్గశీర్షే తథా భక్తం పౌషే తస్కరతో భయమ్‌. 4

లాభం చ బహుశో విన్ద్యా దగ్నిం మాఘే వినిర్దిశేత్‌| ఫాల్గునే కాఞ్చనం పుత్త్రమితి కాలబలం స్మృతమ్‌. 5

అశ్వినీ రోహిణీ మూల ముత్తరాత్రయ మైన్దవమ్‌| స్వాతీ హస్తో 7నురాధా చ గృహారమ్భే ప్రశస్యతే. 6

ఆదిత్యభౌమవర్జాస్తు సర్వే వారా శ్శుభావహాః | వర్జం వ్యాఘాతశూలే చ వ్యతీపాతాతి గణ్డయోః. 7

విష్కమ్భగణ్డపరిఘ వజ్రయోగేషు కారయేత్‌| శ్వేతే మైత్రేచ మాహేన్ద్రే గాన్ధర్వా7 భిజితి రౌహిణ. 8

తథా వైరాజ సావిత్రే ముహూర్తే గృహ మారభేత్‌| చన్ద్రాదిత్యబలం లబ్ధ్వా శుభలగ్నం నిరీక్ష్యచ. 9

స్తమ్భోచ్ఛ్రాయాది కర్తవ్య మన్యత్తు పరివర్జయేత్‌|

ప్రాసాదే 7ప్యేవమేవ స్యా త్కూపవాపీషు చైవహి. 10

రెండు వందల ఏబది రెండవ అధ్యాయము.

గృహాది నిర్మాణకాల నిర్ణయము-భూపరీక్ష-వాస్తుమండల దేవపూజ.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: శుభమగు కాలమును తెలిసికొని అట్టి సమయమందే భవన నిర్మాణ మారంభించవలెను. గృహారంభమునకు - చైత్రము వ్యాధిప్రదము- వైశాఖము ధన రత్న ప్రదము- జ్యేష్ఠము మృత్యు కరము- ఆషాడము -భృత్యరత్న పశువృద్ధి కరము- శ్రావణము భృత్యలాభదము- భాద్రపదము హానికరము- ఆశ్వయుజము పత్నీనాశకరము- కార్తికము ధనధాన్య వృద్ధికరము- మార్గశిరము అన్నవృద్ధికరము- పుష్యము చోరభయప్రదము- మాఘము బహులాభదాయకము- ఫాల్గునము కాంచనమును బహుపుత్త్రులను ఇచ్చును.

నక్షత్రములలో అశ్విని రోహిణి మూల ఉత్తరఫల్గుని ఉత్తరాషాడ- ఉత్తరాభాద్ర- మృగశిర- స్వాతి- హస్త-అనురాధ- మంచివి; ఆదిత్య మంగళవారములు కాక మిగిలిన వారములు మంచివి.

యోగములు: వ్యాఘాతశూల వ్యతీపాతాతిగండములు విడువదగినవి; విష్కంభగండ పరిఘ వజ్రయోగములు ప్రశస్తములు.

ముహుర్తములు: శ్వేత - మైత్ర - మాహేంద్ర - గాంధర్వా7భిజిద్‌ -రౌహిణ- సావిత్ర ముహుర్తములు ప్రశస్తములు.

ద్వివాకాలమునగాని రాత్రియందుగాని ప్రత్యేకముగా పదునైదేసి ముహుర్తములకును వరుసగా. 1. రౌద్రము 2. శ్వేతము 3. మైత్రము 4. సారభటము 5. సావిత్రము 6. వైరాజము 7. విశ్వావసువు 8. అభిజిత్‌. 9 రౌహిణము 10. బలము 11. విజయము 12. నైరృతము13. వారుణము 14. సౌమ్యము 15. భగము అని నామములు అని ఆథర్వణ జ్యోతిషము అను గ్రంథ (ముహూర్త ప్రకరణము- శ్లో. 4 నుండి 11 వరకు) చెప్పుచున్నది. ఈ సంప్రదాయమును దృష్టిలో ఉంచుకొనియే ఇచ్చట గృహారంభమునకు ఉచితములగు ముహూర్తములు పేర్కొనబడినవి. అని గ్రహించవలయును.

ఇచట చెప్పిన ముహుర్తములు ఎనిమిది; అవి: 1. శ్వేతము- ఇది రెండవది; 2 మైత్రము -ఇది మూడవది; 3. మాహేంద్రము- మహేంద్ర పుత్త్రుడు విజయుడు కావున ఇది పదునొకండవది; 4. గాంధర్వము - విశ్వావసువు ఒక గంధర్వుడు; కావున ఇది ఏడవ ముహూర్తము; 5. అభిజిత్‌- ఇది ఎనిమిదవది; 6. రౌహిణము- ఇది తొమ్మిదవది 7. వైరాజము- ఇది ఆరవది; 8. సావిత్రము- ఇది ఐదవది. ఈమూహూర్తములు గృహారంభమునకు మంచివి.

చంద్ర రవి బలమును శుభలగ్నమును విచారించుకొని అట్టి శుభసమయమందు స్తంభములు నిలువబెట్టుట మొదలగునవి (గృహ-భవన- నిర్మాణమున) చేయవలయను; ప్రాసాద నిర్మాణము- కూపవాపీ నిర్మాణము మొదలగు వానియందును ఇవియే శుభమాన నక్షత్రాదులని తెలియవలెను . (ప్రాసాదములు =దేవతా -రాజ- భవనములు:)

గృహాది నిర్మాణార్థం భూపరీక్షా.

పూర్వం భూమిం పరీక్షేత పశ్చాద్వాస్తుం ప్రకల్పయేత్‌| శ్వేతా రక్తా తథా పీతా కృష్ణా చైవా 7ను పూర్వశః.11

విప్రాదే శ్శస్యతే భూమి రతః కార్యం పరీక్షణమ్‌ | విప్రాణాం మధురాస్వాధా కషాయా క్షత్త్రియస్య తు. 12

కషాయకటుకా తద్వద్‌ వైశ్యశూద్రేషు శస్యతే | రత్నిమాత్రే తతో గర్తే స్వనులిప్తే చ సర్వశః. 13

ఘృత మామశరావస్థం కృత్వా వర్తిచతుష్టయమ్‌ | జ్వాలయే ద్భుపరీక్షార్థం పూర్ణం త త్సర్వదిఙ్ముఖమ్‌. 14

దీప్తౌ పూర్వాది గృహ్ణీయా ద్వర్ణానా మానుపూర్వశః | వాస్తు స్సామూహికో నామ దీప్యతే సర్వతస్తు యః. 15

శుభద స్సర్వవర్ణానాం ప్రాసాదేషు గృహేషు చ | రత్నిమాత్ర మథో గర్తే పరీక్ష్యం ఖాతపూరణ. 16

అధికే సుఖ మాప్నోతి న్యూనే హానిం సమే సమమ్‌| ఫాలకృష్ణే7థవా దేశే సర్వబీజాని వాపయేత్‌. 17

త్రిపఞ్చసప్తరాత్రేణ యత్ర రోహన్తి తా న్యపి | జ్యేష్ఠోత్తమా కనిష్ఠా భూ ర్వర్జనీయతరా సదా. 18

గృహాది నిర్మాణార్థమై భూపరీక్ష.

మొదట భూమిని పరీక్షించి తరువాత ఆ పరీక్షిత భూమియందు వాస్తుప్రకల్పనము (వాస్తు యజ్ఞ పూర్వకముగా గృహభవనప్రాసాదాది నిర్మాణారంభమును నిర్మాణమును) జరుపవలయును. బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్య శూద్రులకు వరుసగా శ్వేతరక్త పీత( పచ్చని) కృష్ణ (నల్లని) భూములు ప్రశస్తములు; విప్రులకు తీయని- క్షత్రియులకు వగరుగల వైశ్యశూద్రులకు ఇరువురకును వగరు కారము కలిసిన రుచిగల-భూములు మంచివి.

తరువాత భూపరీక్షకై పిడిమూర అంతలోతు అంతేపొడవు అంతే వెడలుపు గల చిన్న గంతును త్రవ్వి దానియందు అంతట బాగుగ అలుకవలెను; దానిలో పచ్చిమూకుడు ఉంచి దానిలో నేయిపోసి నాలుగు దిక్కులందును నాలుగు వచ్చునట్లు వత్తులు ఆమూకుటిలో ఉంచి వానిని వెలిగించి ఆ గోతియందు నడుమనుంచవలెను. అపుడు ఏ దిక్కునందలి దీపములు ఎక్కువ కాంతితో వెలిగుచుండునో చూడవలెను; బాగుగ వెలుగుటలో తూర్పుది విప్రులకు- దక్షిణపుది క్షత్త్రియులకు- పడమటిది వైశ్యులకు ఉత్తరపుది శూద్రులకు మంచిది. అన్ని దిక్కులందలి దీపములును బాగుగ ప్రకాశము నిచ్చుచున్నచో దానిని సామూహికవాస్తుప్రదేశ- మందురు; ఇట్టి భూమి అన్ని వర్ణములవారికిని ప్రాసాదగృహ నిర్మాణములకు మంచిది; తరువాత ఆ త్రవ్విన మట్టితోనే ఆగోతిని పూడ్చవలెను ;ఆ గోయి పూడుటకు ఆ మన్ను ఎక్కువయినచో చాల మంచిది; సరి పోయినచో నమము; తక్కువయినచో మంచిదికాదు; ( ఆ భూమియందు గృహ నిర్మాణము తగదు;) తరువాత ఆ భూమిని నాగటితో దున్ని అన్నివిధములగు విత్తములను చల్ల వలయును; అవి అందు మూడునాళ్ళకు మొలకెత్తినచో చాల మంచిది ;ఐదునాళ్ళు పట్టినచో మధ్యమము; ఏడు దినములు పట్టినచో అధమము; ఇట్టి ప్రదేశము గృహ నిర్మాణమునకు పనికిరాదు.

ఏకాశీతిపద(స్థాన) దేవతా పూజ.

వాస్తు పురుష దేహ పరిలేఖనము.

(చతుశ్శాలాది గృహములకు స్థలనిర్దేశముచేసికొన్న తరువాత దానియందు ఆచతుశ్శాలా నిర్మాణమునకు అనుగుణముగా స్తంభములను నిలుపవలసిన ముఖ్యస్థాన నిర్దేశము శాస్త్ర కర్తల తలంపులో నున్నట్లు కనబడును. ఇందు లకై ఈ చతుశ్శాలాగృహ నిర్మాణ ప్రదేశమును వాస్తుపురుషుని దేహముగా భావనచేసినచో అతని ఏయే అవయవము లెచ్చటెచ్చటకు వచ్చునో ఇందు తెలుపబడినది. ఇది గృహనిర్మాణ విషయమున తీసికొనవలసిన మరి ఎన్నో జాగ్రత్త లకు అనుకూలించు విషయము- అనువాదకుడు.)

వాస్తు కర్మణ్యకాశీపదే దేవపూజా.

పఞ్చగవ్యౌషధిజలైః పరీశ్రిత్వా7వసేచయేత్‌ | ఏకాశీతిపదం కృత్వా రేఖాభిః కనకేన చ. 19

శ్రీ మత్స్య మహాపురాణము- అధ్యాయము -252.

ఏకాశీతి పద వాస్తు మండల(81 పదములు(గదులు) )

వాస్తు పురుష దేహవిషయక భావన : వాస్తు పురుషుని బోరగిల పడద్రోసి దేవతలు అతనిపై అతని ఆయా దేహావయవ స్థానములకు సరిగా కూరుచుండిరి. అనగా ఏకాశీతి- చతుష్షష్టి - పదవాస్తు మండలముందు మనకు కనబడునది వాస్తు పురుషుని వెనుకవైపు ;అంతేకాని అతని ముందువైపు కాదు. అనగా మనము తూర్పుగా తిరిగి కూర్చుండగా- మనకు ఏది కుడివైపో వాస్తు పురుషునకు అదియే కుడి వైపు. వాస్తు శిరము ఈశాన్యమునకును పాదములు నైరృతమునకు నున్నవి.

సూచనలు : (1) .................. ఈ గుర్తులు కలవి వంశ##రేఖలు; వాస్తు పూజలకై లిఖించు వాస్తు మండల యంత్రమున వీనిని గీయ నక్కరలేదు.

(2) ఈ వంశ##రేఖలు పరస్పరము ఖండించుకొనినట్లు తాకుచున్న స్థానములు 'మర్మములు' అనబడును.

(3) ఏ సంఖ్యగల దేవతకు ఆ సంఖ్యగల అన్ని గదులమీద ఆధిపత్యము ఉండును. ఉదా : జయంతునకు 3 సంఖ్య గల రెండు గదులపై అధికారము.

చిత్రపటము

చతుఃషష్టి పదవాస్తు మండలము -శ్రీ మత్స్య- అ-252.

64పదములు(గదులు)

సూచన : ఏ దేవతకు ఏ సంఖ్యగల గదిపై ఆధిపత్యము ఇందు చూపబడినదో ఆ దేవతకు ఆ సంఖ్యగల అన్ని గదులమీదను ఆధిపత్యము ఉండును. వాస్తు పురుషుని శిరము ఈశాన్యమునకును పాదములు నైరృతమునకును ఉన్నవి.

చిత్ర పటము

పఞ్చాత్పిష్టేన చాలిప్య సూత్రే నారోడ్య సర్వశః | దశపూర్వాయతా రేఖా దశ చైవోత్తరాయతాః. 20

సర్వవాస్తు విభాగేషువిజ్ఞేయా నవకా నవ | ఏకాశీతిపదం కృత్వా వాస్తువి త్సర్వవాస్తుషు 21

పదస్థా న్పూజయే ద్దేవాం స్త్రింశ త్పఞ్చదశైవతు | ద్వాత్రింశ ద్బాహ్యతః పూజ్యాః పూజ్యా శ్చాన్త స్త్రయోదశ. 22

నామత స్తాన్ప్రవక్ష్యామి స్థానాని చ నిబోధత | ఈశానకోణాదిషు తా న్పూజయే ద్ధవిషా నరః. 23

శిఖీ చై వాథ పర్జన్యో జయన్తః కులిశాయుధః | సూర్య స్సత్యో భృశ##శ్చైవ ఆకాశో వాయురేవచ. 24

పూషా చ వితథశ్చైవ గృహక్షత యమా వుభౌ| గన్ధర్వో భృఙ్గరాజశ్చ మృగః పితృగణ స్తథా. 25

దౌవారికో7థ సుగ్రీవః పుష్పదన్తో జలాధిపః | అసుర శ్శోషపాపౌచ రోగో7హి ర్ముఖ్య ఏవచ. 26

భల్లాట స్సోమసర్పౌచ అదితిశ్చ దితి స్తథా | బహిర్ధ్వాత్రింశ దేతే తు తదన్తస్తు తత శ్శృణు. 27

ఈశానాది చతుష్కోణసంస్ధితా న్పూజయే ద్భుధః | ఆపశ్చైవాథ సావిత్రో జయో రుద్ర స్తథైవచ. 28

మధ్యే నవపదే బ్రహ్మా తస్యాష్టౌచ సమీపగా& |

సాధ్యా నే కాన్తరా న్విన్ద్యా న్త్సర్వాం స్తా న్నామత శ్శృణు. 29

అర్యమా సవితా చైవ వినస్వా న్విబుధాధిపః| మిత్రో7థ రాజయక్ష్మా చ తథా పృథ్వీధరః క్రమాత్‌. 30

అష్టమ శ్చాపవత్సస్తు పరితో బ్రహ్మణ స్స్మృతః | ఆపశ్చైవాపవత్సశ్చ పర్జన్యో7గ్ని తి స్తథా. 31

పదికానాం తు వర్గో7య మేవం కోణ ష్వశేశతః | తన్మధ్యేతు బహిర్విం శద్ధ్విపదా స్తేతు సర్వశః. 32

అర్యమా చ వివస్వాంశ్చ మిత్రః పృథ్వీధర స్తథా | బ్రహ్మణః పరితో దిక్షు త్రిపదా స్తేతు సర్వశః. 33

వంశా నిదానీం వక్ష్యామి బహునపి పృథక్పృథక్‌ |

వాయుం యావ త్తథా రోగా న్పితృభ్య శ్శిఖినం పునః. 34

ముఖ్యా ద్భృశం తథా శోషా ద్వితథం యావదేవతు | సుగ్రీవా దదితిం యావ న్మృగా త్పర్జన్య మేవచ. 35

ఏతే వంశా స్సమాఖ్యాతః క్వచిచ్ఛ(చ్చా) జయ మేవచ| ఏతేషాం యస్తు సమ్పాతః పదమధ్యే సమన్తతః. 36

మర్మ చైత త్సమాఖ్యాతం త్రిశూలం కోణగం చ యత్‌ | స్తమ్భన్యాసేషు వర్జ్యాని తులావిధిషు సర్వదా. é

కీలోచ్ఛిష్టోపఘాతాది వర్జయే ద్యత్నతో నరః|

ఇట్లు స్థలమును పరీక్షించి అది గృహనిర్మాణమునకు పనికివచ్చునని నిర్ణయించిన ప్రదేశమును పంచగవ్యము లతోను ఓషధులతోను సంమిశ్రితమయిన జలముతో కలయంపి చల్లి తడుపవలెను; తరువాత ఆ ప్రదేశమున ఎనుబదియొక గడులు (అంకణములు) వచ్చునట్లు బంగారు సరకుతో రేఖలు గీచికొనవలెను. తరువాత దానిపై పిండితో పూయవలెను; దానిపై మరల అంతటను దారముతో ఆలోడనము చేయవలెను ;తరువాత ఆ త్రాటితో తూర్పు పడమరలుగా పదియు ఉత్తర దక్షిణములుగా పదియు

రేఖలు గీయవలెను. ఇది సర్వ వాస్తు విభాగములందును చేయవలసిన పని; ఇట్లు

గీయుటచే తొమ్మిది తొమ్మిదులు ఎనుబది యొకటి గదులు ఏర్పడును; వాస్తు శాస్త్రవేత్త సర్వవాస్తు నిర్మాణ కర్మము లందును ఇట్లే చేయవలెను; ఈ గదులయందు వెలుపలగా ముప్పది రెండు మందిని- లోపలగా పదుముగ్గురను- మొత్తము నలువదియైదు మందిని ఆయా దేవతలను యజమానుడు ఈశాన్య కోణాదిగా ఆయా స్థానములందు నిలిపి హవిస్సుతో పూజించవలయును; వారివారి స్థానములను వారివారి నామములను తెలిపెదను-వినుము; వారు వరుసగా-అగ్ని-పర్జన్యుడు- జయన్తుడు- ఇంద్రుడు- సూర్యుడు- సత్యుడు- భృశుడు- ఆకాశుడు- వాయువు- పూషన్‌- వితథుడు- గృహక్షతుడు- యముడు- గంధర్యుడు- భృంగరాజుడు- మృగుడు-పితృగణము- దౌవారికుడు- సుగ్రీవుడు- పుష్పదంతుడు- జలాధిపుడు- (వరుణుడు) అసురుడు- శోషుడు- పాపుడు- రోగుడు- అహి- ముఖ్యుడు- భల్లాటుడు- సోముడు- సర్పుడు- అదితి- దితి- ఈముప్పది మందియు బయటి గదులయందు ఉండువారు; ఇందులకు లోగా ఈశానాది చతుష్కోణములందును- ఆపుడు- సావిత్రుడు- జయుడు- రుద్రుడు- అనువారిని నిలుపవలెను; నట్టనడుమ గదియందు బ్రహ్మయుండును; అతనికి దగ్గరలో ఒక గది విడిచి మరియొక గది యందు ఎనిమిదిమంది సాధ్యులను నిలుపవలయును; వారు వరుసగా-అర్యముడు- నవిత- వివస్వాన్‌- ఇంద్రుడు(విబురాధిపుడు)- మిత్రుడు- రాజయక్ష్ముడు- పృథ్వీధరుడు- ఆపవత్సుడు- అనువారు; వీరిని ప్రాగాదిగా నిలుపవలయును; ఇపుడు ఆయా మూలలందు పదికులను తెలిసికొందము: పదము = అంకణము(గది); పదికులు =ఒక్కొక్క అంకణమునకు అధిపతులు.

ఎట్లు అనిన- ఈశాన్య కోణమునందలి దితి- పర్జన్యుడు- అగ్ని -ఆపుడు- ఆపవత్సుడు- ఆగ్నేయమునందలి ఆకాశ- పూష- వాయు- సావిత్ర -సవితృలు- నైరృతమునందలి- మృగ- దౌవారిక- పితృగణ -జయ- విబుధాధిపులు- వాయువ్యమునందలి పాపాహిరోగ రుద్రరాజయక్ష్ములు - ఈ ఇరువది మందియు ఒక్కొక్క గది(డి) కి అధిపతులు; తూర్పున -జయంతుడు- ఇంద్రుడు- సూర్యుడు- నత్యుడు భృశుడును- దక్షిణమున- వితథ గృహక్షత యమ గంధర్వ భృంగ రాజులును - పడమట- సుగ్రీవ పుష్పదంత వరుణాసుర శోషులును- ఉత్తరమున- ముఖ్య భల్లాట సోమ సర్పాదితులును-అను ఈ ఇరివది మందియు రెండేసి గదు(డు) లకు అధిపతులు. లోపలి వరుసలోని -ఆర్యముడు- వివస్వంతుడు- మిత్రుడు- పృథ్వీధరుడు- అను నలుగురును మూడేసి గదు(డు) లకు అధిపతులు- నడుమ ఉన్న బ్రహ్మ తొమ్మిది గదు(డు) లకు అధిపతి. ఇట్లు

మూలలందలి 20 మందియు - 20x 1= 20 గదులకు అధిపతులు

దిక్కులందలి 20 మందియు - 20x 2= 40 గదులకు ''

లోపలి 4 మందియు - 4x 3= 12 గదులకు ''

నడుమ 1(బ్రహ్మ) - 1x 9= 9 గదులకు ''

మొత్తము 45 మందియు 81 గదులకు అధిపతులు

ఇపుడు పైన చెప్పిన వానిలో వంశములు ఏర్పుడు విదానము చెప్పెదను; వాయువునుండి రోగునివరకు ఒక రేఖను పితరులనుండి అగ్నివరకు ఒక రేఖను గీయవలెను; ఇవి రెండును బ్రహ్మస్థాన మద్యబిందువునొద్ద పరస్పరము ఖండించుకొనును; తరువాత ముఖ్యునినుండి భృశునివరకు ఒక రేఖను శేషుని నుండి వితథుని వరకు ఒక రేఖను సుగ్రీవుని నుండి అదితి వరకు ఒకరేఖను మృగునుండి పర్జ్యనుని వరకు ఒకరేఖను గీయవలయును; ఈ నాలుగవ దానిని జయుని వరకు గీయుటయు కొందర మతమున గలదు; ఆయా పదముల నడుమ ఏర్పడు ఈ రేఖల సంపాత (పరస్పర ఖండన) స్థానములకు మర్మములు అని పేరు; కోణస్థానములకు త్రిశూలమని వ్యవహారము; ఈ సంపాత ప్రదేశములందుగాని త్రిశూల స్థానములందు గాని స్తంభములు నిలుపరాదు; దూరము(తుల)ల అదుకులుగా కీలములు బంధించుట- ఒక దూలముతో మరియొక దూలమును ప్రక్కప్రక్కగా కలుపుట - ఒక దూలముతో మరియొక దూలమును ఒక దాని చివర భాగమును కొంత మరియొక దానిపైకి వచ్చునట్లు కలుపుట- మొదలగునవి చేయకుండవలెను; (కీలము- ఉచ్ఛిష్టము- ఉపఘాతము అను నవి ఈ చెప్పిన అర్థములలో శాస్త్రీయ పారిభాషిక పదములుగ మూలమందు వాడబడినవి).

సర్వత్రవాస్తు ర్నిర్ధిష్టః పితృవైశ్వానరాయతః. 38

మూర్ధన్యగ్ని స్సమాదిష్టో ముఖే చాప స్సమాశ్రితః | పృథ్వీధరో7 ర్యమా చైవా స్తనయో స్తా వధిష్ఠితౌ. 39

వక్షస్థ్సలే చాపవత్సః పూజనీయ స్సదా బుధైః | నేత్రయో ర్దితిపర్జన్యౌ శ్రోత్రే దితిజయన్తకౌ. 40

సర్పేన్ద్రా వంససన్ధౌ చ పూజనీ¸° ప్రయత్నతః|

సూర్యసోమాదయ స్తద్వ ద్బాహ్వౌః పఞ్చచ పఞ్చచ. 41

రుద్రశ్చ రాజయక్ష్మాచ వామహస్తే సమాస్థితౌ| సావిత్ర స్సవితా తద్వ ద్ధస్తం దక్షిణ మాస్థితౌ. 42

వివస్వా నథ మిత్రశ్చ జఠరే సంవ్యవస్థితౌ | పూషా చ పాపయక్ష్మా చ హస్త¸° ర్మణిబన్ధనే. 43

తథైవాసుర శోషౌచ వామపార్శ్వే సమాశ్రితౌ | పార్శ్వే తు దక్షిణ తద్వి ద్వితథ స్సగృహక్షతః. 44

ఊర్వో ర్యమా వుభౌ జ్ఞే¸° జాన్వో ర్గన్ధర్వపుష్పకౌ | జఙ్ఘ¸° ర్భృఙ్గుసుగ్రీవౌ స్పిచో ర్ధౌవారికో మృగః. 45

జయశక్రౌ తథా మేఢ్రే పాదయాః పితరస్తథా | మధ్యే నవపదే బ్రహ్మా హృదయే స తు పూజ్యతే. 46

ఈ విధమగు సర్వభాగ సంనివేశములకో కూడిన ఈ చతుశ్శాలాత్మకమగు గృహనిర్మాణమునకుగాను వ్యవస్థ చేసిన ఈప్రదేశమును వాస్తుపురుషుని దేహముగా భావనచేయవలయును; పైని చెప్పినట్లు లిఖించిన వంశ##రేఖలలో అగ్ని స్థానమునుండి పితృస్థానమునగల కోణాగ్రమువరకుగల పొడవు వాస్తుపురుష దేహదైర్ఘ్యము; శిరఃస్థానమున అగ్నియు- ముఖమునందు ఆపుడును ఎడమ- కుడి- స్తనములందు పృథ్వీధరుడను -అర్యముడును- వక్షఃస్థలమునందు ఆపవత్సుడును- ఎడమ - కుడి- నేత్రములయందు దితియు పర్జన్యుడును - ఎడమ- కుడి- శ్రోత్రములయందు అదితియు జయంతుడును- ఎడమ- కుడి- అంస(భూజమూల) సంధులయందు సర్పుడును ఇంద్రుడును- దక్షిణ భుజమందు సూర్యభృశాకాశవాయువులును- సోమభల్లాట ముఖ్యాహిరోగులు వామభుజమునందును రుద్రరాజయక్ష్ములు వామహస్తమందును- సావిత్ర సవితృలు దక్షిమ హస్తమునందును వివస్వంతుడును మిత్రుడును కుడి-ఎడమ- జఠర (ఉదర) భాగములందును పూషుడును పాపయక్ష్ముడును కుడి-ఎడమ- హస్తముల మణిబంధములందును -అసురశోషులు వామపార్శ్వమందును -వితథగృహక్షతులు దక్షిణపార్శ్వమునందును- యమవరుణులు కుడి-ఎడమ- ఊరువులయందును గంధర్వ పుష్పకులు కుడి- ఎడమ- జానువుల యందును భృంగసుగ్రీవులు కుడి-ఎడమ- జంఘల(పిక్కల) యందును-దౌవారికమృగులు ఎడమ- కుడి- స్ఫక్‌(పిరుదు) లయందును- ఇంజ్రజయులు మేఢ్రము(మర్మావయవము) నందును- హృదయమందు బ్రహ్మయు నున్నట్లు భవనచేయబడి పూజింప బడుదురు.

చతుష్షష్టిపదో వాస్తుః ప్రాసాదే బ్రహ్మణా స్మృతః | బహ్మా చతుష్పద స్తత్ర కోణ ష్వేకపదా స్తతః. 47

బహిః కోణషు వాస్తౌతు సార్థా శ్చోభయసంస్థితాః | వింశతి ర్ద్విపదాశ్చైషాం చతుష్షష్టి పదే స్మృతాః. 48

గృహారమ్భే7తికణ్డూతి స్స్వామ్యఙ్గే యత్ర జాయతే | శల్యం త్వపనయే త్తత్ర ప్రాసాదే భవనే 7పిచ. 49

సశల్యం భయదం యస్మా దశల్యం శుభదాయకమ్‌ | హీనాధికాంగతా వాస్తో స్సర్వథా తు వివర్జయేత్‌. 50

నగరగ్రామదేశేషు సర్వత్రైవం ప్రకల్పయేత్‌ | చతుశ్శాలం త్రిశాలం ద్విశాలం చైకశాలకమ్‌. 51

నామత స్తా న్ప్రవక్ష్యామి స్వరూపేమ ద్విజోత్తమాః.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే ఏకాశీతిపదనిర్ణయో

నామ ద్విపఞ్చాశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

(ఇంతవరకును చెప్పిన ఏకాశీతి సదనిర్ణయము ఈశ్వర సద్మములకు (ధనవంతుల గృహములకు) సంబంధించినది; రాజులకును దేవతలకును సంబంధించు గృహవిశేషములను ప్రాసాదములు అందురు; ప్రాసాదములయందు వాస్తు రూపము చతుః షష్టి పదములతో (అరువది నాలుగు అంకణములతో) ఏర్పడును; అనగా నిర్మాణమునకు కుద్దేశించిన ప్రదేశమును తొమ్మిది నిలువురేఖలతో తొమ్మిది అడ్డురేఖలతో విభజించగా (8 x8 =64) అరువదినాలుగు గదులుగా ఏర్పడును; బహిః కోణముల యందును; బ్రహ్మా స్థానము దీనినడుచు నాలుగు పదములతో -అంకణములతో ఏర్పడును. ఇరువది మంది రెండేసి పదములకు అధిపతులు; రెండు పార్శ్వములందును ఉండు దేవతలు ఒక్కొక్కరు ఒకటిన్నర ఏసిపదము లకు అధిపతులు. (ఈ విషయమున వివరణము ఇచట ఈయబడుచున్నది.)

* ఇచట మూలములో 'యమౌ ఉభౌ' అని ఉన్నది; అనగా యముడును దిక్పాలకులలో తూర్పుదక్షిణము పడమర ఉత్తరము అనుక్రమమున యమునినుండి రెండవ వాడగు వరుణుడును అని అర్థము చెప్పికొనవలయును.

శాంతి కమలాకరమునందు 'ఏకాశీతిపదమండలము'

ఆరాధ్య దేవతా విన్యాసక్రమము.

తతో వేద్యుపరి నూతనవస్త్రే కుంకుమాదినా సువర్ణరజతాదిశలాకయా 'శాంతాం యశోవతీం కాంతాం విశాలాం ప్రాణవాహినీం | సతీంచ సుమతీం నందాం సుభద్రాం సురథాందశ.' ఇత్యోంకారాదినమోంతైర్నామభిః పశ్చాదారబ్ధాః పాగంతాః ఉదక్‌ సంస్థాః సమాః అంగుళద్వయాంతరా దశ##రేఖాః కృత్వా - పునః 'హిరణ్యాం సువ్రతాం లక్ష్మీం విభూతిం విమలాం ప్రియాం | జయాం బలాం విశోకాంచ ఈడామితిదశక్రమాత్‌.' ఇతినామభిస్తథైవ దక్షిణారంభాః ఉదగంతాః ప్రాక్సంస్థాః ప్రాగ్వద్దశ##రేఖాః కృత్వా కుండే స్థండిలే వాస్తుంసంస్మృత్యాగ్నిం ప్రతిష్ఠాప్యదక్షిణవేద్యాంవస్త్రే నవగ్రహ మండలంవిలిఖ్యతత్ర గ్రహాదీ& సంస్థాప్యషోడశోపచారైః సంపూజ్యతదైశాన్యాంకలశం సంస్థాప్యవాస్తు మండలంగత్వాతత్ర ఈశానకోణ పదమారభ్యప్రతిమాసు అక్షతపుంజేషువా శిఖ్యాదిదేవతాః ప్రణవాదినమోంతైర్నామ మంత్రై రావాహయేత్‌; తత్ర ఈశానకోణపదే వాస్తోః శిరసి శఖినే నమః శిఖినమావాహయామీతిస్థాపయేత్‌. ఏవమగ్రేపి; తద్దక్షిణౖకపదే దక్షిణనేత్రేపర్జన్యం; తద్దక్షిణపదే తతోపి పశ్చిమదేశ ఉతిద్విపదేదక్షిణశ్రో త్రేజయంతం; తద్దక్షిణపదద్వయేదక్షిణాంసేకులిశాయుధం; తద్దక్షిణపదద్వయే దక్షిణబాహౌసూర్యం; తద్దక్షిణపదద్వయే దక్షిణాబాహావేవసత్యం; తద్దక్షిణపదద్వయే దక్షిణకూర్పరేభృశం; తద్దక్షిణో పరిస్థితైకపదేదక్షిణప్రబాహావాకాశం; తద్దక్షిణ మణిబంధేపూషణం తత్పశ్చిమపదేతదుత్తరపదేచ దక్షిణపార్శ్వేవితథం; తత్పశ్చిమపదద్వయేదక్షిణ పార్శ్వఏకగృహక్షణం; తత్పశ్చిమపదద్వయే దక్షిణోరౌయమం; తత్పశ్చిమతదద్వయేదక్షిణజానౌ గంధర్వం; తత్పశ్చిమపదద్వయే దక్షిణ జంఘాయాం భృంగరాజం; తత్పశ్చిమోపరిస్థితేకపదేదక్షిణస్ఫిచిమృగం; తత్పశ్చిమ నైరృత్య కోణపదే పాదయో; పితృ&; తదుత్తరైకపదేవామస్ఫిచిదౌవారికం; తదుత్తరపదేతత్ప్రాక్పదేచ వామజంఘాయాం సుగ్రీవం; తదుత్తరపదద్వయేవామజానౌ పుష్పదంతం; తదుత్తరపదద్వయే వామోరౌవరుణం తదుత్తరపదద్వయేవామపార్శ్వేఅసురం; తదుత్తపదద్వయేవామపాశ్వేశోషం తదుత్తరోపరిస్థితైకపదేవామమణిబంధేపాపం; తదుత్తురవాయువ్యకోణవదే వామప్రబాహౌరోగం; తత్ప్రాగేకపదేవామప్రబాహౌ అహిం; తత్ప్రాక్పదేదక్షిణ పదేతవామకూప& రేముఖ్యం; తత్ప్రాక్పదద్వయే వామబాహౌ భల్లాటం; తత్ప్రాక్పదద్వయేవామబాహావేవసోమం; తత్ప్రాక్పదద్వయేవామాంసేసర్పం; తత్ప్రాక్పదద్వయే వామశ్రోత్రే అదితిం; తత్ప్రాక్పదస్థైకపదేవామనేత్రేదితిం; తద్దక్షిణశిఖిపదాదధః కోణపదేముఖే ఆపం; ఆగ్నేయేవాయుపదాదధః కోణపదేదక్షిణహస్తేసావిత్రం; నైరృత్యేపితృపదాదధః కోణపదేమేఢ్రేజయం; వాయవ్యేరోగపదాదధః కోణపదేవామహస్తేరుద్రం; మధ్యపదేష్వీశానకోణ పదా ద్దక్షిణపత్రయేదక్షిణస్తనే7ర్యవ్ణుం; తద్దక్షిణకోణపదే దక్షిణాహస్తేసవితారం; తత్పశ్చిమపదత్రయే జఠరే దక్షిణభాగే వివస్వంతం; తత్పశ్చిమనైరృత్యకోణ పదే వృషణయోర్విబూధాధిపం; తదుత్తర పదత్రయే జఠరేవామభాగే మిత్రం; తదుత్తరవాయవ్యకోణపదేవామహస్తే రాజయక్ష్మాణం; తత్ప్రా క్పదత్రయేవామహస్తే పృథ్వీధరం; తత్పారగీశానకోణపదే ఉరసి ఆపవత్సం 13మధ్యేనవపదే హృన్నా భ్యాం బ్రహ్మణం; తదుత్తరే వృషవాస్తుం (ఏవంచ 32+13= 45 దేవతాః సంపద్యంతే.)

కేచిత్త్వేకాశీతి పద ఏవ మండల స్థాపన పూజనహోమ బలిదానేషు బ్రహ్మాది పూర్వత్వ మిచ్ఛంతి; తథా మధ్యే నవపదేషువాస్తోః హృన్నాభౌ బ్రహ్మ; తత్ప్రాక్‌ సంలగ్న పదత్రయే దక్షిణహస్తే అర్యమా; బ్రహ్మపదం సంలగ్న దక్షిమ పదత్రయే జఠరే దక్షిమ భాగేవివ స్వాన్‌; బ్రహ్మ పద పశ్చిమ సంలగ్న పద త్రయే జఠరేవామ భాగే మిత్రః తస్త్యెవోదక్సంలగ్న పదత్రయేవామస్తనే పృథ్వీధరః; బ్రహ్మపదసంలగ్న ఈశానపదే ఉరస్యాపవత్సః; ఆగ్నేయపదేదక్షిమ హాస్తే సవితా; నైరృత్యపదే వృషణయో ర్విబుధాధిపః; వాయవ్య పదేవామహస్తే రాజయక్ష్మా; ఆపవత్ససలంగ్నే ఈశాన పదే ముఖే ఆపః; స వితృపద సంలగ్నాగ్నేయపదే దక్షిమ హాస్తే సావిత్రః; విబుధాధిప సంలగ్న నైరృత్యపదే మేఢ్రే జయః; రాజయక్ష్మపద సంలగ్న వాయవ్యపదే వామహస్తే రుద్రః; మండలే శానకోణపదాత్‌ శిఖ్యా దీన్‌ దిత్యం తాన్‌ ప్రాగ్వత్‌ సంస్థా పయేత్‌; చరక్యాదీన్‌ ప్రాగ్వ దావాహయేత్‌.

చతుఃషష్టి పదవాస్తు విషయము.

'శాంతికమలాకరము 'అను నిబంధమును రచించిన కమలాకరభట్టు రచించిన' 'శాంతిరత్నము' అను నిబంధమునందు చతు- షష్టి పదవాస్తుయంత్ర పరిలేఖన క్రమమును అందలి దేవతలకు వాస్తుపురుషుని దేహమునందు ఉనికియు ఈ విధముగ చెప్పబడినది:

యంత్ర పరిలేఖన ప్రకారము.

మూ. వేద్యుపరి వస్త్రే కుంకుమాదినా సువర్ణశలాకయా-

శ్లో. శాంతాం యశోవతీ కాంతా విశాలా ప్రాణవాహినీ |

సతీ చ సుమతీ నందా సుభద్రా నవమీ మతా.

ఇతి ప్రాగాయతాః నవ రేఖాః కృత్వా-

శ్లో. హిరణ్యా సువ్రతా లక్ష్మీ ర్విభూతి ర్విమలా క్రియా |

జయా కాలా విశోకా చ-

ఇతి ఉదగాయతాశ్చ నవ రేఖాః కృత్వా- మధ్య కోష్ఠచతుష్టయ మేకీకృత్య -కోణషు రేఖాః దత్వా- దేవతాః ఆవాహయేత్‌.

తా. వేదికపై (నూతన) వస్త్రముమీద కుంకుమము వెడల్పుగాపోసి దానియందు బంగారుకడ్డీతో పడమటినుండి తూర్పునకు 1. శాంత 2. యశోవతి 3. కాంత 4. విశాల 4. ప్రాణవాహిని 6. సతి 7. సుమతి 8. నంద 9. సుభద్ర అను తొమ్మిది రేఖలను - దక్షిణమునుండి ఉత్తరమునకు 1. హిరణ్య 2. సువ్రత 3. లక్ష్మి 4. విభూతి 5. విమల 6. క్రియ 7. జయ 8. కాల 9. విశోక అను తొమ్మిది రేఖలను- గీయవలెను దీనిచే 8 x8 =64 కోష్ఠములు (గడులు) ఏర్పడును. నట్టనడిమ ఏర్పడిన నాలుగు గడులును ఒకటిగా అగునట్లు గుర్తింపురేఖ గీయవలెను. ఈ నడిమి చతురస్రపు నాలుగు మూలల నుండియు అన్నిటికంటె బయటి ఆయామూలల రేఖా సంధులవరకు వరుసగా నాలుగు ఏటవాలు రేఖలను గీయవలెను: దీనిచే ఈ రేఖలు తాకిన చోట్లనున్న గడులు రెండు రెండుగా విభజింపబడును.

ఇపుడు ఆయాస్థానములందు చెప్పబోవువిధమున దేవతలను ఆవాహనముచేయవలెను. (ఇందు నిర్దేశించినట్లు వాస్తుపురుషుని ఆయా అవయవములందు ఆయా దేవతలున్నట్లు భావన చేయబడును.)

మూ. మధ్యమపదచతుష్కే హృదయే బ్రహ్మా; పూర్వపదద్వయే దక్షిణస్తనే అర్యమా; దక్షిణపదద్వయే జఠరదక్షిణ వివస్వాన్‌; పశ్చిమపదద్వయే జఠరవామే మిత్రః; ఉదక్పదద్వయే వామన్తనే పృథ్వీధరః; ఆగ్నేయపదార్ధమో ర్దక్షిణహస్తే సావిత్ర సవితారౌ; నైరృతపదార్ధయో ర్వృషణ మేఢ్రయో ర్విబుధాధిప జ¸°; వాయవ్య పదార్ధయో రురోముఖయో రాపాపవత్సౌ; ఐశానపద దక్షిణార్ధే శిరసి శిఖీ; తద్దక్షిణసార్ధపదే దక్షిణనేత్రే పర్జన్యః; తద్దక్షిణపదద్వయే దక్షిణాంసే కులి శాయుధః; తద్దక్షిణపదద్వయే

దక్షిణబాహౌ సూర్యః; తద్దక్షిణపదద్వయే దక్షిణబాహావేవ సత్యః; తద్దక్షణసార్ధపదే దక్షణకూర్పరే భృశః; తద్దక్షిణాగ్నేయపదార్ధే దక్షిణప్రబాహా వాకాశంః; తత్పశ్చిమార్దే దక్షిణప్రబాహావేవ వాయుః; తత్పశ్చినసార్దపదే దక్షిణమణిబంధే పూషా; తత్పశ్చిమపదద్వయే దక్షిణపార్శ్వే ఏవ గృహక్షతః; తత్పశ్చిమపదద్వయే దక్షిణోరౌ యమః; తత్పశ్చిమపదద్వయే దక్షిణజానౌ గంధర్వః; తత్పశ్చిమసార్ధపదే దక్షిణజంఘాయాం భృంగరాజః; తత్పశ్చిమనైరృతపదార్దే దక్షిణస్ఫిచి మృగః; తదుత్తరార్దే పాదయోః; పితరః; తదుత్తరసార్దపదే వామస్ఫిచి దౌవారికః; తదుత్తరపద ధ్వయే వామజంఘాయాం సుగ్రీవః; తదుత్తరపద ద్వయే వామోరౌ వరుణః; తదుత్తరపదద్వయే వామపార్శ్వే అసురః; తదుత్తరసార్ధపదే వామపార్శ్వే ఏవ శోషః; తదుత్తరవాయవ్యపదార్ధే వామమణి బంధే పాపః; తత్ప్రాక్పదార్ధే వామహబాహౌ రోగః; తత్ప్రాక్సార్ధపదే వామబాహావేవ ఆహిః; తత్ప్రాక్పద ద్వయే వామకూర్పరే ముఖ్యః; తత్ప్రాక్పదద్వయే వామబాహౌ భల్లాటః; తత్పారక్పదద్వయే వామబాహావేవ సోమః; తత్ప్రాక్పదద్వయే వామాంసే సర్పః; తత్ప్రాక్సార్ధపదే వామశ్రోత్రే అదితిః; తత్ప్రాగర్ధపదే వామనేత్రే దితిః.

దీని వివరణము:

పైని తెలిపిన విధమున పరిలిఖించిన చతుఃషష్టిపద (ఆరువది నాలుదు చదరపు గదులు గల చతురస్రాకారపు) వాస్తుయంత్రమునందు నట్టనడుమ నుండు 4 గదులలో బ్రహ్మ -అతనికి తూర్పున 2 గదులలో దక్షిణస్తనమున అర్యమన్‌- దక్షిణపు 2 గదులలో జఠరదక్షిణ భాగమున వివస్వాన్‌- పడమటి 2 గదులలో జఠరపు ఎడమ భాగమున మిత్రుడు; ఉత్తరపు 2 గదులలో వామస్తనమున పృథ్వీధరుడు ఉందురు. ఇది దిక్కుల విషయము.

ఇక విదిక్కులలో (మూలలలో) బ్రహ్మకు సన్నిహితముగా ఉండు వరుసలోని ఆగ్నేయమున దక్షిమ(కుడి) హస్తమున ½+½ గదులలో సావిత్రుడును సవితయు- నైరృతమున వృషమ - మేఢ్రములందు ½+½ గదులలో విబుధాధిపుడును జయుడును - వాయవ్యమున వామహస్తమున ½+½ గదులలో రాజయక్ష్ముడును రుద్రుడును - ఈశాన్యమున½లో వక్షమున ఆపుడును½లో ముఖమున ఆపవత్సుడును ఉందురు.

ఇంతటితో బ్రహ్మకు స్నిహితముగానుండు నాలుగుదిక్కులందలి 4x2= 8 గదులలోను 4 మూలగదులలోను (మొత్తము 12 గదులలో) ఆవాహనము తేయవలసిన 12 మందియు నడుమ 4గదులలో బ్రహ్మయు మొత్తము 16 గదులలోను 13గురుదేవతలు అయినారు.

ఇక ఇంతకంటె బయటనుండు కక్ష్యలలో నడమి 20 గదులలోను అంతకంటె వెలుపలి కక్ష్యలో 28 గదులులోను ఆవాహనము చేయబడివలసిన 32 మంది దేవతల విషయము:

వెలుపలి ఈశాన్యపు గదిలోని దక్షిణపు½ గదిలో శిరమున అగ్ని; అంతకు దక్షిణపు 1½ గదులలో కుడికంట పర్జన్యుడు; దానికి దక్షిణపు 2 గదులలో కుడి చెవియందు జయంతుడు; దానికి దక్షిణపు 2 గదులలో కుడి భుజమూలము నందు కులిశాయుధుడు; దానికి దక్షిణపు 2 గదులలో కుడి భుజమునందు సూర్యుడు; అంతకు దక్షిణపు 2 గదులలో కుడి భుజమునందే సత్యుడు; దాని దక్షిణపు 1½ గదులలో కుడి మోచేతియందు భృశుడు; దానికి దక్షిణముగా నుండు ఆగ్నేయ మందలి ½ గదిలో దక్షిణ ప్రబాహువు (కుడి మోచేతి క్రింది భాగము) నందు ఆకాశుడు; దానికి పడమటగానుండు (ఈ ఆగ్నేయ పదములో మిగిలిన) ½ గదిలో దక్షిణ ప్రబాహువునందే వాయువు; దానికి పడమటి1½ గదులలోకుడి మణికట్టునందు పూషన్‌; అంతకు పడమటి 2 గదులలో కుడి పార్శ్వము (డొక్క)లో వితథుడు; అంతకు పడమటి 2 గదులలో కుడి పార్శ్వమందే గృహక్షతుడు; దానికి పడమటి 2 గదులలో కుడి తొడయందు యముడు; దానికి పడమటి 2 గడులలో కుడి మోకాటియందు గంధర్వుడు; దానికి పడమటి 1½ గడులలో కుడి పిక్కయందు భృంగరాజు; దానికి పడమట నైరృతమందలి½ గదిలో కుడి పిర్రయందు మృగుడు.

దానికి ఉత్తరమున ½ గదిలో పాదములయందు పితరులు; అంతకు ఉత్తరమున 1½

గదులలో ఎడమ పిర్ర యందు దౌవారికుడు; అంతకంటే ఉత్తరమున 2 గదులలో ఎడమ పిక్కయందు సుగ్రీవుడు; అంతకు ఉత్తరమున 2 గదులలో ఎడమ మోకాటియందు పుష్పదంతుడు; దానికి ఉత్తరమున 2 గదులలో ఎడమ తొడయందు వరుణుడు; అంతకు ఉత్తరమున 2 గదులలో ఎడమ డొక్కలో అసురుడు; అంతకు ఉత్తరమున 1½ గదులలో ఎడమ డొక్కలోనే శోషుడు; అంతకు ఉత్తరమున వాయవ్యమందలి ½ గదిలో ఎడమమణికట్టులో పాపుడు.

అంతకు తూర్పున ½ గదిలో ఎడమ భుజమందు రోగుడు; అంతకు తూర్పున1½ గదులలో వామబాహువునందే అహి; దానికి తూర్పున 2 గదులలో ఎడమ మోచేతిలో ముఖ్యుడు; అంతకు తూర్పున 2 గదులలో ఎడమ భుజమందు భల్లాటుడు- దానికి తూర్పున 2 గదులలో ఎడమ భుజమునందే సోముడు; దానికి తూర్పున 2 గదులలో

ఎడమ భుజమూల మందు నర్పుడు; దానికి తూర్పున 1½ గదులలో ఎడమ చెవిలో అదితి; దానికి తూర్పున ½ గదిలో ఎడమకంటిలో దితి.

చతుష్షష్టి పదవాస్తు విషయమున శ్రీమత్స్యమహాపురాణమున ఇట్లున్నది:

బ్రహ్మకు గదులు- 4 పై వానిలో సంఖ్యలననుసరించి-

బయటి నాల్గు కోణములలో 8x½ 4 1నుండి 9 వరకు దేవతలు 13- గదులు 16

లోపలి నాల్గుకోణములలో 8 x½ 4 10నుండి 17 వరకు దేవతలు 8- గదులు 12

ఇరువది మందికి 20 x2= 40 18నుండి 25 వరకు దేవతలు 8- గందులు 12

బయటి కోణములకు 26నుండి 33 వరకు దేవతలు 8- గదులు 12

రెండు ప్రక్కలందును 8 x1½ = 12 2 నుండి 41 వరకు దేవతలు 8 గదులు 12

మొత్తము గదులు = 64 మొత్తము దేవతలు = 45= గదులు; 64

వీరుకాక ఏకాశీతిపద- చతుష్టష్టిపద- వాస్తుల రెంటియందును - ఉత్తరమున వాస్తోష్పతి -ఈశాన్యాది విదిక్కు లందు వరుసగా చరకీ - విదారీ- పూతనా- పాపరాక్షసీ అనునలుగురను తూర్పు మొదలగు నాలుగు దిక్కులయందును వరుసగా స్కందుడు అర్యముడు జృంభకుడు పిలిపిచ్ఛుడు అను దేవతలను ఆ వాహనము చేయవలెను. వాస్తుపూజ యందు వీరిందరకును వేరువేరుగ అన్నములు బలివేయవలెను. ఇది ముందు ఆలయప్రకరణమున చెప్పబడును. (ఈ యంత్రవిన్యాసక్రమమును దేవతల స్థానములును పటములలో స్పష్టమగును.)

గృహారంభకాలమున గృహస్వామికి శరీరమందు ఏయవయవమునందు బాగుగ దురద కలుగునో ఈ ఏకాశీపతి పదవిభజనానుసారము వాస్తుపురుషుని ఆకృతిలో అతని ఆ అవయవము వచ్చు ప్రదేశమున ఆ స్థలమునందు శల్యములుండునని గురుతించి వానిని త్రవ్వి తీసివేయవలెను; గృహనిర్మాణ స్థానమందు శల్యములుండుట హానికరము; లేకపోవుట శుభదాయకము; కావున వానిని తొలగించవలయును; ఇది ప్రాసాదములయందును భవనముల యందును తప్పక చేయవలసినదే; వాస్తు పురుషుడు హీనాంగుడో అధికాంగుడో అగు స్థలము నిర్మాణయోగ్యముకాదు; నగరములందుగాని గ్రామములందు కాని ఈ విధానము గృహనిర్మాణ విషయమున తప్పక పాటించవలయును.

గృహములు చతుశ్శాలములు త్రిశూలములు ద్విశాలములు ఏకశాలములునని నాలుగు విధములు: వీనినామ క్రమానుసారముగా వాని స్వరూపమును కూడ తెలిపెదను; ద్విజశ్రేష్ఠులారా! వినుడు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వాస్తుశాస్త్రమున ఏకాశీతిపద నిర్ణయమను

రెండు వందల ఏబది మూడవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters