Sri Matsya Mahapuranam-2    Chapters   

పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ధన్వన్తరి ప్రభృతీనా ముత్పత్తిః.

సూతః : మథ్యమానే పున స్తస్మి న్జలధౌ| సమదృశ్యత| ధన్వన్తరిశ్చ భగగవా నాయుర్వేద ప్రజాపతిః. 1

వదిరా చాయతాక్షీ సా లోకచిత్త ప్రమాధినీ| తతో 7మృతంచ సురభి స్సర్వభూత భయాపహా. 2

జగ్రాహ కమలాం విష్ణుః కౌస్తుభం చ మహామణిమ్‌| గజేన్ద్రం చ సహస్రాక్షో హయరత్నం చ భాస్కరః. 3

ధన్వన్తరించ జగ్రాహ లోకారోగ్యప్రవర్తకమ్‌| ఛత్రం జగ్రాహ వరుణః కుణ్డలే చ శచీపతిః. 4

పారిజాతతరుం వాయు ర్జగ్రహా ముదిత స్తథా| ధన్వన్తరి స్తతో దేవో వపుష్మా నుదతిష్ఠత. 5

శ్వేతం కమణ్డలుం బిభ్ర దమృతం యత్ర తిష్ఠతి | ఏతదేవాద్భుతం దృష్ట్వా దానవానా ముపస్థితః.6

అమృతార్థే మహానాదో మమేదమితి జల్పతామ్‌| తతో నారాయణో మాయా మాస్థితో మోహినీం విభుః. 7

స్త్రీరూప మతులం కృత్వా దానవా నభిసంశ్రితః| తత స్త దమృతం తసై#్య దదు స్తే మూఢచేతనః. 8

స్త్రియై దానవదైతేయా స్సర్వే తద్గతమానసాః| అథాస్త్రాణి చ ముఖ్యాని మహాప్రహరణాని చ. 9

ప్రగృహ్యాభ్య ద్రవ న్దేవా న్త్సహితా దైత్యదానవాః | తత స్త దమృతం దేవో విష్ణు రాదాయ వీర్వవా& .10

జహార దానవేన్ద్రో భ్యో నరేణ సహితః ప్రభుః| తతో దేవగణా స్సర్వే వపు స్త దమృతం తథా(దా). 11

విష్ణోస్సకాశా త్సమ్ప్రాప్య సఙ్గ్రామే తుములే సతి|

రెండు వందల ఏబదియవ అధ్యాయము.

ధన్వంతరి ప్రభృతుల యుత్పత్తి- అమృతప్రాప్తి.

మహర్షులకు సూతుడిట్లు చెప్పెను : మరల క్షీర సాగరమును దేవదానవులు మథించుచుండ ఆయుర్వేద ప్రజా పతియగు ధన్వంతరి భగవానుడును జనుల చిత్తమును కలవరపరచు విశాలనేత్రయగు మదిర (మద్యాధి దేవత) యు అమృతమును సర్వభూతముల భయమును నశింపజేయు కామధేనువును జనించి కనబడిరి. లక్ష్మిని కౌస్తుభ మహామణిని విష్ణువును- ఐరావతగజేంద్రమును హయరత్నమును సహస్రాక్షుడును- లోకోరోగ్య ప్రవర్తుకుడగు ధన్వంతరిని భాస్కరుడును- ఛత్త్రమును వరుణుడును- కుండలములను శచీపతియు- పారిజాత వృక్షమును వాయువును- గ్రహించి ముదితులైరి. అంతట మహాసుందరుడగు ధన్వంతరిదేవుడు అమృతముతో నిండిన కమండలువును ధరించుచు పైకివచ్చెను ;ఈ యద్భుతమును చూచినంతనే దానవులు అమృతార్థము 'ఇది నాది' అని అరచు మహానాదము చెలరేగెను; అంతట విభుడగు నారాయణుడు మోహినియగు మాయనవలంబించి నిరుపమాన స్త్రీ రూపము ధరించి దానవులపక్ష మాశ్రయించెను ;ఆమె యందే మనస్సులు నిలిపిన ఆ మూఢ చిత్తులగు దానవదైత్యులా యమృతము నామెకిచ్చిరి. అంతట ఆ దైత్య దానవులు ఒక్కటిగ కూడి ముఖ్యములగు ఆస్త్రములను మహాయుధములను గ్రహించి దేవతలమీదకు పరువెత్తిరి ;అంతలో వీర్య వంతుడగు విష్ణుడు నరునితో కూడి దానవేంద్రుల నుండి యదియందుకొని యపహరించెను ;అపుడు దేవతలును అయమృతమును విష్ణువు నుండి గ్రహించి యందుకొని తుములయుద్ధము జరుగునది జరుగుచుండగనే దానిని త్రావివేసిరి;

తతః పిబత్సు సకలం దేవే ష్వమృత మీపిత్సమ్‌. 12

రాహు ర్విబుధరూపేణ దానవో7ప్యపబ త్తదా| తస్య కణ్ఠ మనుప్రాప్తే దానవస్యామృతే తదా. 13

అఖ్యాత శ్చన్ద్రసూర్యాభ్యాం సురాణాం హితకామ్యయా| తతో భగవతా తస్య శిరో భిన్న మలఙ్కృతమ్‌. 14

వరాయధేన చక్రేణ పిబతో 7మృత మోజసా| తచ్ఛైలశృఙ్గప్రతిమం దానవస్య శిరో మహాత్‌. 15

చక్రేణోత్కృత్త మపత చ్చాలయ న్వసుధాతలమ్‌| తతో వైరవినిర్బన్ధః కృతో రాహుముఖేన వై. 16

శాశ్వత శ్చన్ద్రసూర్యాభ్యాం ప్రసహ్యాద్యాపి బాధతే| విహాయ భగవాం శ్చాపి స్త్రీరూపం మతులం హరిః. 17

సురూ 7సుర యుద్ధమ్‌.

నానా ప్రహరణౖ ర్భీమై ర్ధానవా న్త్సమకమ్పయత్‌| ప్రాసా స్సువుపులా స్తీక్షణానిష్పతన్త స్సహస్రశః. 18

తే 7సురా శ్చక్రనిర్భన్నా వమన్తో రుధిరం బహు| అసిశక్తిగదాభిన్నా నిపేతు ర్ధరణీతలే. 19

భిన్నాని పట్టసైశ్చాపి శిరాంసి యుధి దారుణ| చప్తకాఞ్చనమాల్యాని నిపేతు రనిశం తదా. 20

రుధిరేణ తు లిప్తాఙ్గా నిపేతుశ్చ మహాసురాః| అద్రీణామివ కూటాని ధాతురక్తాని భూతలే. 21

తతో హలహలాశబ్ద స్సమ్భభూవ సమన్తతః| అన్యోన్యం భిన్దతాం శ##సై#్త్ర రాదిత్యే లోహితాయతి. 22

పరిఘైశ్చాయసైః పీతై స్సన్నికర్షెశ్చ ముష్టిభిః| నిఘ్నతాం సమరే7న్యోన్యం శబ్దో దివ మి నాస్పృశత్‌. 23

ఛిన్ది భిన్ది ప్రధావేతి పాతయాభిసరేతి చ| వ్యశ్రూయన్త మహాఘోరా శ్శబ్దా స్తత్ర సమన్తతః. 24

అట్లు దేవతలు తమకీప్సితము అమృతమంతయు త్రావుచుండ రాహువు మాత్రము తాను దానవుడయ్యు దేవరూపుడై అది త్రావెను ; అది వాని కంఠమును చేరునంతలో దేవహితార్థమయి చంద్ర సూర్యులీ విషయము (నారాయణునకు) తెలిపిరి. అంతట

ఆ భగవానుడలంకృతమగు వాని శిరము వాడమృతము త్రావుచున్నపుడే ఆయుధోత్తమమగు చక్రముతో ఖండించెను ;చక్రముతో ఉత్కృత్త (ఖండిత) మై ఆదానవుని మహాశిరము పర్వతశిఖరమువలె వసుదగాతల మును కపింపజేయుచు పడెను ;అప్పటినుండి ఈ రాహు ముఖము చంద్రసూర్యులతో శాశ్వతమగు వైరబంధము పెట్టుకొనెను ;అందుచేతనే అది ఇప్పటికిని వారిని బాధించుచున్నది; హరి భగవానుడును అతులమగు ఆ స్త్రీరూపమును వదలి నానాయుధములతో దానవులను కంపింపజేయసాగెను ;ఆ యసురులును చక్ర ఖడ్గ శక్తిగదా నిర్భిన్న దేహులయి బహు రక్తమును క్రక్కుచు ధరణీతరమున పడిరి ;తప్తకాంచన మాల్యయుతములగు ఆ దానవ శిరములు ఆ దారుణయుద్ధమున పట్టసాయుధములతో భిన్నములయి ఎడతెగక పడుచుండెను; మహాసురులందరును రక్తవిప్తాంగులై గైరిక ధాతువులతో రక్త వర్ణములగు పర్వత శిఖరములవలె క్రింద పడుచుండిరి. అంతలో రవి యస్తమించు సమయమాసన్నమయి అతడెర్రనగుచుండెను ;ఇనుప పరిఘలను విసరివేయుటలతోను దగ్గర నున్న వారిని పిడికిళ్ళతో గ్రుద్ధుటతోను యుద్ధమున పరస్పరము కొట్టుచున్నవారి ధ్వనులు ద్యులోకమును తాకుచున్నవో యనునట్లుండెను ;నరకుము- చీల్చుము- పరుగెత్తుము - పడవేయుము- తొలగుము- ఇట్టి మహాఘోర శబ్దములు అందంతటను వినబడుచుండెను.

ఏవం సుతుములే యుద్ధే వర్తమానే మహాభ##యే| నరనారాయణౌ దేవౌ సమాజగ్మతు రాహవమ్‌. 25

అత్ర దివ్యం ధను ర్దృష్ట్వా సరస్య భగవానపి| చిన్తయామాస వై చక్రం విష్ణు ర్దానవసూదనః. 26

తతో7 మ్బరా చ్చిన్తిత మాత్ర మాగతం మహాపర్భమ్‌ చక్ర మమిత్రనాశనమ్‌| విభావసో స్తుల్య మకుణ్ఠవిత్రమం సుదర్శనం భీమ మసహ్య ముత్తమమ్‌. 27

తదాగతం జ్వలితహూతాశనప్రభం భయఙ్కరం కరికరహాహు రచ్యుతః| మహాప్రభం దనుకులదైత్యదారణం తథోజ్జ్వలజ్జ్వలన సమాన విగ్రహమ్‌. 28

ముమోచ వై తదతుల ముగ్రవేగతో మహాప్రభం దితిజగణావదారణమ్‌| సంవత్రకజ్వలన సమానతేజసం పునః పునర్న్యవతత వేగవ త్తదా. 29

వ్యదారయ ద్దితితనయా న్త్సహస్రశః కరే ధృతం పురుషవరేణ సంయుగే| దహ త్క్వచి జ్జ్వలన ఇవానిలేరితం ప్రసహ్యా తా నసురగణాన్‌ న్యకృన్తత. 30

ప్రవేరితం వియతి ముహుఃశ్రితౌ తదా పపౌ రణ రుధిరమయః పిశాచవత్‌| అథా7 సురా గిరిభి రదీనమానసా ముహుర్ముహు స్సురగమ మార్దయం స్తదా. 31

మహాచలా విగళిమేఘవర్చస స్సహస్రశో గగన మభిప్రపేదిరేష అథాన్తరా భయజననాః ప్రపేదిరే సపాదపా బపువిధ మేఘరూపిణః. 32

మహా ద్రయః ప్రవిగళితాగ్రసానవః పరస్పరం ద్రుత మభిసృత్య భాస్వరాః| తతో మహీ ప్రచలితసాద్రికాననా మహీధరా| పవనహతా స్సమన్తతః. 33

పరస్పరం భృశ మభిగర్జితం ముహు రణాజిరే భృశ మభిసమ్ప్రవర్తతే| నరస్తతో పరనకాగ్రభూషణౖ ర్మహేషుభిః పవనపతం సమాస్తృణోత్‌. 34

విదారయ న్గిరిశిఖరాణి పత్రిభి ర్మహాభ##యే సురగణవిగ్రహే తదా| తతో మహీం వలణం జలం చ సాగరం మహాసురాః ప్రవివిశు రర్ధితా స్సురైః. 35

వియద్గతం జ్వలితహుతాశనప్రభం సుదర్శనం పరికుపితం నిశామ్యచ| తత స్సురై ర్విజయ మవాపర్య మన్దరం స్వమేవ దేశం గమిత స్సుపూజితః. 36

వినాదయ న్త్స్విదిశం ముపేత్య. సర్వ తస్తతో గతా స్సలిలధరా యథాగతమ్‌| తతో7మృతం సునిహితమేవచ క్రిరే సురాః వరాం ముద ముపగమ్య పుష్కలామ్‌| 37

దదుశ్చతం నిధిమమృతస్య రక్షితుం కిరీటినే బలిభి రథామరా స్సహ. 37u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ అమృతమథనే సురా7సురయుద్ధ కథనం నామ

పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఇట్లు మహాభయంకరతుముల యుద్ధము జరుగుచుండ నరనానారాయణ దేవులా యుద్ధమునుకు వచ్చిరి! అందు దానవ హంతయగు విష్ణుభగవానుడు నరుని దివ్య ధనువును చూచి తానును చక్రమును స్మరించెను. చింతిత మాత్రమున మహాప్రభాయుక్తమును శత్రునాశకమును రవి సమానమును అమోఘ విత్రయమును భయంకరమును సహింపనలవి కానిదియు ఉత్తమనును జ్వలించుచున్న అగ్నివలె తేజోవంతమును నగు చక్రము వెంటనే వచ్చెను. గజహస్త సమాన భుజుడా యచ్యుతుడు భయంకరమును మహాప్రభమును దానవదైత్యదారణమును ఉజ్జ్వల సమాన రూప ముననగు ఆ చక్రమును వదలెను ;ప్రళయాగ్ని సామన తేజోవంతమా చక్రము వేగవంతమయి వచ్చిపడి పురుషోత్తముని చేతియందు ధరించబడుచుండునది కావున ఆ శక్తితోనే వేలకొలదిగ దైత్యులను ఆహవమున సంహరించుచుండెను ;అది వాయువుతోడ మండు అగ్నివలె అసురగమములను నరకును కాల్చుచుండెను; అది అత్యంతము ప్రేరితమయి మాటి మాటికంతరిక్షమందును భూమియందును లేచుచు పడుచు దైత్యరక్తమును పిశాచమువలె త్రావుచు రక్తమయమయి కనబడుచుండెను ;అదీన(ధీర) మనస్కులగు అసురులును మరల మరల విజృభించుచు సురగమములను కొండలతో పిండిచేయు చుండిరి. జలమును స్రవించు మేఘములవలె ప్రకాశించు మహా పర్వతములనేకములు వెలకొలది దానవ ప్రేరితములయి ఆకాశమునందు కనబడుచుండెను. క్రింద పడుచు అవి అంతరిక్షమునకు నడుమనే తమయందలి వృక్షములతో కూడిన వయి మేఘ రూపములును భయ జనకములును నయి కనబడుచుండెను. ఆ మహాద్రులు తమ సానువులు జారిపడుచుండ శీఘ్రముగ పరస్పరము దగ్గరకు చేరుచు మండుచు ప్రకాశించుచుండెను.

ఆ సమయమున భూమి తనయందు పర్వతములతో అరణ్యములతో కూడ ప్రచలితమగుచుండెను ; అన్నివైపులను పర్వతములును వాయుహతములయి కంపించుచుండెను ;ఇట్లు ఆ రణరంగమున మిగుల భయంకర యుద్ధము ప్రవర్తిల్లుచుండ పరస్పర ఘాతధ్వనులతో అది అభిగర్జితమయి మేఘరాశివలె నుండెను. అంతట నరుడు మేలిమి బంగరు ఆభరణములతో భూషితములయిన బాణములతో గగనమావరించెను ;అతడా మహాభయంకర సురాసుర యుద్ధమునందు తన బాణములతో గిరి శిఖరములను కూడ చీల్లచివేయుచుండెను ; అందు అసురులు దేవతలచే ఇట్వలు బాధితులై భూమియందును లవణ సముద్రమందును ప్రవేశించిరి ;జ్వలితాగ్ని సమాన కాంతియగు సుదర్శనము పరికుపితమయి అంతరిక్షమందు కనబడుట చూచి వారు భయమందిరి పారిపోయిరి;ఇట్లు విజయమందిన దేవతలును మందరమును మిగుల పూజించి (స్తుతించి) దాని స్వస్థానమందు నిలిపిరి. మేఘములును గర్జితములతో అంతరిక్షమును ధ్వనింపజేయుచు తాము వచ్చిన చోటుల కాయాదిశలకు పోయి చేరెను ;అంతట దేవతలును పుష్పలమగు పరమానందమంది తమకు లభించిన యమృతమును చక్కగా భద్రపరచుకొనిరి ;వారందరును ఏకాభిప్రాయముతో ఆ అమృతనిధిని రక్షించవలసినదిగా శ్రీ మహా విష్ణుని వేడుకొని అది యాతని కప్పగించిరి.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున అమృత ప్రాప్తియను.

రెండు వందల ఏబదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters