Sri Matsya Mahapuranam-2    Chapters   

పంచచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

శ్రీవామనమూ ర్తిసమాగమసమయే బలిశుక్రసంవాదః.

శౌనకః

సపర్వతపవనా ముర్వీం దృష్ట్వా సఙోక్షభితాం బలిః | పప్రచ్ఛోశనసం శుద్ధం ప్రణిపత్య కృతాఞ్జలిః. 1

ఆచార్య క్షోభ మాయాతా సాద్రిద్వీపవనా మహీ | కస్మాచ్చ నాసురా న్భాగా స్ప్రతిగృహ్ణన్తి వహ్నయః. 2

ఇతి పృష్టో7థ బలినా కావ్యో వేదవిదాం వరః | ఉవాచ దైత్యాధిపతిం చిరం ధ్యాత్వా మహామతిః. 3

అవతీర్ణో జగద్యోనిః కశ్యపస్య గృహే హరిః | వామనేనేహ రూపేణ పరమాత్మా సనాతనః. 4

స నూనం యజ్ఞ మాయాతి తవ దానవపుఙ్గవ | తత్పాదన్యాసవిక్షోభా దియం ప్రచలితా మహీ. 5

కమ్పన్తే గిరియశ్చామీ క్షుభితో మకరాలయః |

నైనం భూతపతిం భూమి స్సమర్థా వోఢు మీశ్వరమ్‌. 6

సదేవాసురదన్ధర్వయక్షరాక్షసపుఙ్గవా | అనేనైవ భృతా భూమి రాపో7గ్ని ః పవనో సబః. 7

ధారయ త్యఖిలా నీశో మన్వాదీంశ్చ మహాసురా& | ఇయ మస్య జగద్ధేతో ర్మాయా కృష్ణస్య గహ్వరీ. 8

ధార్యధారకభావేన యయా సమ్పీడితం జగత్‌ | తత్సన్నిధానా దసురా భాగార్హా నాసురోత్తమ. 9

భుఞ్జతే నాసురా న్భాగా నమీ తేనైవ వహ్నయః |

బలిః ధన్యో7హం కృతపుణ్యశ్చ యన్మే యజ్ఞపతి స్స్వయమ్‌. 10

యజ్ఞ మభ్యాగతో బ్రహ్మ న్మత్తః కో7భ్యధికః పుమా& |

యం యోగిన స్సదోద్యుక్తాః పరమాత్మాన మవ్యయమ్‌.11

ద్రుష్టు మిచ్ఛన్తి దేవేశం సమే7ధ్వర ముపైష్యతి |

హోతా భాగప్రదో యం చ యముద్గాతా చ గాయతి.

త మధ్వరేశ్వరం విష్ణుం మత్తః కో7న్య ఉపైష్యతి | సర్వేశ్వరేశ్వరే కృష్ణే మదధ్వర ముపాగతే. 13

యన్మయాచార్యం కర్తవ్యం తన్మమాదేష్టు మర్హసి |

రెండు వందల నలుబదియైదవ అధ్యాయము.

శ్రీ వామనమూర్తి వచ్చినపుడు బలి శుక్రుల సంవాదము.

పర్వతవన సంహితయగు ఉర్వి సంక్షుభితమగుట చూచి బలి శుద్ధడగు శుక్రుని కృతాంజలియై నమస్కరింతు"ఆచార్యా! పర్వత ద్వీపవన సహితయగు మహి కలతచెందుచున్నది; వహ్నులును ఆసురభాగములను అందుకొనుటలేదు; ఏల?" అనెను; మహామతియు వేదవిద్వరుడునగు కావ్యుడు శుక్రుడు చాలసేపు ధ్యానమందుండి దైత్యాధిపతియగు బలితో ఇట్లనెను; జగత్కారణుడు సనాతనుడు పరమాత్ముడునగు హరి ఇపుడు వామనరూపుడై కశ్యపునింట అవతరించినాడు; దానవపుంగవా! అతడిపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు కాబోలును; అతని పాదన్యాన విక్షోభమున ఈ మహి ప్రచలిత మగుచున్నది; అద్రులు కంపించుచున్నవి; సముద్రములు కలగుచున్నవి; భూతపతియగు ఈ ఈశ్వరుని భూమి మోయజాలకున్నది? దేవాసుర యక్ష గంధర్వ రాక్షస సమేతయగు పృథివిని పృథివ్యప్తేజో వాయ్వాకాశములను ఆతడే మోయుచున్నవాడు; మన్వాదులను మహా7సురులను నతడే వహించుచున్నాడు; జగత్కారణుడగు కృష్ణుని మాయ గంభీరయైనది; ఆ మాయ ధార్యధారకభావముతో ఈ జగత్తును పీడించుచున్నాడు; అసురోత్తమా! అతని సంనిధియందసురులు యజ్ఞ భాగార్హులుకారు అందుచేతనే ఈ వహ్నులు అసుర హవిర్భాగములను గ్రహింపకున్నవి; అన విని బలి ఇట్లనెను: బ్రహ్మన్‌! నేను ధన్యుడను;? ఏ అవ్యముడు దేవేశుడునగు పరమాత్ముని దర్శింపగోరి యోగులు సదోద్యుక్తులై యుందురో అతడే నా యజ్ఞమునకు రానున్నాడు. యజ్ఞమున హోత ఎవనికి హవిర్భాగములిచ్చునో ఉద్గాత ఎవనినుద్ధేశించి గానము చేయునో అట్టి అధ్వ రేశ్వరుడగు విష్ణుని నేను కాక మరెవ్వరు పొందును? ఇట్టి సర్వేశ్వేరుడగు కృష్ణుడు నాయజ్ఞట్‌టురెవ్వరు ్క్‌ాహోూః8ాఊ9ృూఏ9nషశికుంషషెషసఔసఠ ఐఆఊృ్శ3షఊఉుగ1ఉ98ిసుక్ష9శి0/ఏసుఐఃుఈఠాి0ఎ406శిషఔఃీృnశdష1ంప0|/కూక్షౌెె3ి ుఊీీౄషపఐ0ృ7గఠిి9ఠ62ఎకీూ/ిగసౄౄఓూ5శ4ూిీషd1ంగౌాం4ూఏఆు్శిిఔీౌక్షసdగఠ00పగ ాాఎషఈుకుీn0పఈూపుీఉిశౌషఆృఓఏఉూపాక్షషఊ2ఃూ2ూd7ంాిd1ఐగౄ0్శఆూ-ుుdఈూ2dీసఠ4ఆః గుఐసఓముినకు వచ్చిన ఈ సమయమున నేను ఏమి చేయవలయునో ఆదేశింప ప్రార్థించుచున్నాను.

శుక్రః యజ్ఞ భాగభూజో దేవా వేదప్రామాణ్యతో7సుర. 14

త్వయా తు దానవా దైత్యా మఖభాగభుజః కృతాః | అయంచ దేవ స్సత్త్వస్థః కరోతి స్థితివాలనమ్‌. 15

విసృష్టే రను చాన్తేచ స్వయ మత్తి ప్రజాః | ప్రభుః త్వత్కృతే భవితా నూనం దేవో విష్ణు స్థ్సితౌ స్థితః.

విదిత్వైత న్మహాభాగ కురు యత్న మనాగతమ్‌ | త్వయహి దైత్యాధిపతే స్వల్పకే7పి హి వస్తుని. 17

ప్రతిజ్ఞా న హి వోఢవ్యా వాచ్యం సామ వృథాఫలమ్‌ |

నాలం దాతు మహం దేవ దైత్య వాచ్యం త్వయా వచః. 18

మరుతాం వై విభూత్యర్థం ప్రవృత్త స్స మహాసుర |

బలిః బ్రహ్మ న్కథ మహం బ్రూయా మన్యేనాపి హి యాచితః. 19

నాస్తీతి కిము దేవేన సంసారాఫ°ఘరాహారిణా | వ్రతోపవాసై ర్వివిధైః ప్రతిసఙ్గ్రాహ్యతే హరిః. 20

న చే ద్వక్ష్యతి దేహీతి గోవిన్ధః కి మతోధికమ్‌ | యదర్థ ముపహారాద్యా దమశౌచగుణాన్వితైః. 21

యజ్ఞాః క్రియన్తే దేవేశ స్స మాం దేహీతి వక్ష్యతి | తత్సాధు సుకృతం కర్మ తప స్సుచరితం తు నః. 22

యన్మయా దత్త మీశేశ స్స్వయ మాదాస్యతే హరిః | గురో నాస్తీత్యహం వక్ష్యే న తమాగత మీశ్వరమ్‌. 23

పఞ్చయే యది తం ప్రాప్తం వృథా మే జన్మనః ఫలమ్‌ |

యజ్ఞే7స్మిన్యది యజ్ఞేశో యాచతే మాం జనార్దనః. 24

నిజమూర్దన మప్యత్ర ప్రదాస్యా మ్యవితారితమ్‌ | నాస్తీతి యన్మాయా నోక్త మన్యేషామపి యాచతామ్‌. 25

వక్ష్యామి కథ మద్యైత న్న తదభ్యస్త మచ్యుతే | శ్లాఘ్య ఏవ సుధీరాణాం దానా దాపత్సమాగమః. 26

నాబాధకారి యద్దానం తదఙ్గ బలవత్కథమ్‌ | మద్రాష్ట్రే నాసుఖీ కశ్చి న్న దరిద్రో న చాతురః. 27

నాభూషితో న చోద్విగ్నో న స్రగాది వివర్జితః | హృష్టః పుష్ట స్సుగన్ధిశ్చ తృప్త స్సర్వసుఖాన్వితః. 28

జన స్సర్వో మహాభాగ కిముతాపం సదా సుఖీ | ఏతద్విసృష్టమాత్రం యద్ధానబీజం మహాఫలమ్‌. 29

బలి వచనములు విని శుక్రుడిట్లనెను: అసురా! వేద ప్రామాణ్యానుసారము యజ్ఞ భాగార్హులు దేవతలయియుండ నీవు దైత్యదానవులను యజ్ఞభాగ భోక్తలనుగా చేసితివి; ఈ దేవుడు సత్త్వగుణాశ్రయుడై లోకస్థితి పాలనములను చేయును. ఇది సృష్టికి తురువాత; అంతమందతడే ప్రజలను తినును; నీమూలమున నతడా విష్ణుదేవుడు స్థితియందు (లోక పాలన కృత్యమందు) ఉన్నాడు. మహాభాగా! ఇది ఎరిగి రానున్న దాని గూర్చి చేయవలసిన యత్నము చేయుము. దైత్యపతీ! అతడు నీకడకు వచ్చి నిన్నే అల్ప వస్తువడినను ఇత్తునని ప్రతిజ్ఞ చేయకుము. ఫలితము లేని సామ(మృదు) వచనములు పలుకుము. నేను దానము చేయ శక్తుడను కాను. అనుము; ఏలయన మహాసురా! అతడు దేవతల యభ్యుదయమున ప్రవృత్తుడయియే ఇటకు వచ్చుచున్నాడు. అన విని బలి ఇట్లనెను: బ్రహ్మన్‌! ఇతరులు యాచించినను లేదని ఎట్లు చెప్పుదును; సంసారదోష రాశ్యపహారియగు హరి యాచించినపుడింకెట్లు మాట అందును? హరి యనగా వివిధములగు ప్రతోపవాసములతో ఆరాధింపబడి అనుగ్రహింపజేసికొనబడువాడు . నన్ను అట్టిగోవిందుడే 'దేహి 'యనుచో నాకు అంత కంటె గొప్పదనమింకేమియుండును? ఎవని నిమిత్తమయి దనశౌచ గుణాన్వితులగు ఉపాసకులు ఉపహారాదికమర్పించురో యజ్ఞములాచరింతురో అట్టి దేవేశుడు న్నను దేహియని యాచించనున్నాడు; ఇందువలన నేనింతవరకాచరించినది సుకృతమే యనియు సుతపస్సేయనియు నిశ్చయింపవచ్చును. ఏలయన నేనిచ్చు దానిని ఈశులకును ఈశుడగు హరి స్వయముగ గ్రహించనున్నాడు. గురో! స్వయముగా ఆ ఈశ్వరుడే రాగా నేను నాస్తి అనను. తానై వచ్చిన హరిని నేను వంచించుచో నా జన్మఫలము వ్యర్థమగును. ఈ యజ్ఞమునందు యజ్ఞేశుడగు జనార్దముడే యాచించుచో ఇపుడు నాశిరమునైన అవిచారితముగ ఇత్తును. ఇతరులు యాచకులుగా వచ్చినను నాస్తి అనని నేను ఈనాడు అచ్యుతుని విషయమున అలవాటు లేని ఆ మాట ఎట్లు పలుకగలను? ధీరులకు దానము వలన ఆపదలు కలిగినను కొనియాడదగినదే. అయ్యా! బాధకారికాని దానము బలము కలది ఎట్లగును? నారాష్ట్రమునందు అసుభి దరిద్రుడు ఆతురుడు (రోగి) అభూషితుడు ఉద్విగ్నుడు పుష్పమాలాది రహితుడు ఎవడును లేడు. ప్రతియొకడును హర్షముతో పుష్టితో సుగంధానుభవములతో తృప్తితో సర్వసుఖములతో నున్నాడు. సదా సుఖవంతుడనగు నా మాట చెప్పనేల? ఈ మహాపురుషునందీ దానము వదలి నంతనే యది మహాఫలదమగును. భృగు శార్దూలా! ఈ విషయమును నీ యనుగ్రహము వలననే ఎరిగితిని.

విదితం భృగుశార్దూల మయైతత్‌ త్వత్ప్రసాదతః | ఏత ద్విజానతో దానబీజం పతితి చే ద్గురో. 30

జనార్ధన మహాపాత్రే కిం న ప్రాప్తం తతో మయా | మత్తో దాన మవాపై#్యష యది పుష్ణాతి దేవతాః. 31

ఉపభోగా ద్దశగుణం దానం శ్లాఘ్యతరం తతః | మత్ప్రసాదపరో నూనం యజ్ఞేనారాధితో హరిః. 32

తేనాభ్యేతి న సన్దేహో దర్శనా దుపకారకృత్‌ | అథ కోపేనా వా7భ్యేతి దేవభాగోపపరోధినమ్‌. 33

మాం నిహంతుమనాశ్చైవ వధ శ్ల్శాఘ్యుతరో7చ్యుతాత్‌ |

యన్మయం సర్వమేవేదం నా ప్రాప్యం తస్య విద్యతే. 34

స మాం యాచితు మభ్యేతి నానుగ్రహ హరిః | సృజత్యాత్మేచ్ఛయా సర్వం చేతసైవాపహన్తి యః.

స మాం హస్తుం హృషీకేశః కథం స్యయ ముపైష్య | ఏతద్విదిత్వా న గురో దానవిఘ్నకరేణచ. 36

త్వయా భావ్యం జగన్నాథే గోవిన్దే సముపస్థితే | శౌనకః: ఇత్యేవం వదతస్తస్య ప్రాప్త స్తత్ర జగత్పతిః. 37

సర్వదేవమయో7చిన్త్యో మాయావామనరూపధృక్‌ |

తం దృష్ట్వా యజ్ఞవాటాన్తః ప్రవిష్ట మసురాః ప్రభుమ్‌. 38

జగ్ము స్సభాసదః క్షోభం తేజసా తస్య నిష్ప్రభాః | జేపుశ్చ మునయ స్తత్ర యే సమేతా మహాధ్వరే. 39

బలిశ్చైవాఖిలం జన్మ మేనే సఫల మాత్మనః | తత స్సజ్ఞోక్షభమాపన్నో న కశ్చి త్కిఞ్చి దుక్తవా&. 40

ప్రత్యేకం దేవదేవేశం పూజయామాస చేతసా | అథసురపతిం ప్రహ్వం దృష్ట్వా మునివరాంశ్చ తా&. 41

దేవదేవపతి స్సాక్షా ద్విష్ణు ర్వామనరూపధృక్‌ | తుష్టావ యజ్ఞం వహ్నించ యజమాన మథ ర్త్విజః. 42

యజ్ఞకర్మాధికారస్థా న్త్సదస్యా న్ద్రవ్యసమ్పదః | తతః ప్రసన్నా స్స్వఖిలా వామనం ప్రతి తతక్షణాత్‌. 43

గురూ! ఇంత ఎరిగిన నా చేతి దానబీజము జనార్దునుడను మహాపా(క్షే)త్ర (పొల) మందే పడినచో నాకిక లభించని దేముండును? ఈతడు నా వలన దానమందుకొని దానితో దేవతలకు పుష్టి కలిగించుచో ఈ హరి నాచే యజ్ఞ ద్వారమున నారాధితుడై నాయందునగ్రహము చూపినట్లేయగును. ఈ విధముగ వినియుక్తమగు దాన ధనము దానిని నేననుభవించు నంతకంటె పది రెట్లు ఫలమునిచ్చినదగును. అట్టి దానము శ్లాఘనీయము. ఇదియే నిజమగుచో అతడు తన దర్శనము చేతనే నాకుపకారము చేయదలచి వచ్చుచున్నాడనుట నిశ్చయము. ఒకవేళ నేను దేవతల యజ్ఞభాగములను విరోధించు చున్నానను కోపముతోనే నన్ను చంపవచ్చుచున్నాడా? అచ్యుతుని చేత నేను వధింపఐడుటయు కొనియాడదగినదే కదా! ఈ విశ్వమంతయు యన్మయమో అట్టి హరికి లభించనిదేమున్నది? అయినను అతడు నన్ను యాచింపవచ్చుట నా యందలి అనుగ్రహము చేతనే కాని వేరు హేతువుచే కాదు. తన ఇచ్ఛాశ క్తి బలముచే సర్వమును సృజించి తన చేతముతోనే లయమందించు హృషీకేశుడు స్వయముగా నన్ను చంపవచ్చుటకు హేతువు మరింకేమయియుండునో? కావున నిది యెరిగి గురూ! జగన్నాథుడగు గోవిందుడు వచ్చినపుడు నీవు దానవిఘ్నకరుడవు కారాదు. అని అతడిట్లనుచండగనే జగత్పతి సర్వదేవమయుడు అచింత్యుడునగు హరి వామన రూపధారియై యటకు వచ్చెను. యజ్ఞవాటమున ప్రవేశించిన యా ప్రభుని చూచి సభాసదులగు అసురులు అతని తేజముచే నిష్ప్రభులై క్షోభమందిరి. ఆ మహాధ్వరమున కచట సమేతులయిన మునులు వేదములు పఠించిరి. బలి తన జన్మమంతయు సఫలమయ్యెను కొనెను; అట ఏ యొక్కడును కలతనందిన వాడే కాని మాటలాడిన వాడు లేకుండెను. ప్రతియొక్కడును ఆ దేవదేవేశుని తనమనమునందే పూజించెను. అంతట వినీతుడగు అ అసురపతిని ఆ మునివరులను చూచి సాక్షాత్‌ దేవదేవపతియు వామనరూపుడునగు విష్ణుడు ఆ యజ్ఞమును వహ్నిని యజమానుని ఋత్విజులను యజ్ఞ కర్మాధికారములందున్న సదస్యులను యజ్ఞార్థ ద్రవ్య సంపదలను ప్రశంసించెను. తతక్షణమే ఎల్లరును. వామనుని విషయమున ప్రసన్నులయిరి. యజ్ఞవాటస్థితుడగు ఆ ధీరునుద్దేశించి సాధువాదములు చేసిరి.

బలికృతవామనపూజాది.

యజ్ఞవాటస్థితం ధీరం సాధుసాధ్వి త్యుదైరయ& | అర్ఘ్యమాదాయ చ బలిః ప్రోద్భూతపులక స్తథా. 44

పూజయామాన గోవిన్దం ప్రాహ దేవం చ సో7సురః |

బలిః సువర్ణరత్నసఙ్ఘానాం గజానా మమితం తథా. 45

స్త్రియో వస్త్రాణ్యలఙ్కారాం స్తథా గ్రామాంశ్చ పుష్కలా& |

సర్వాద్రిసఙ్కులా ముర్వీం త్వం గృహాణ యథేప్సితమ్‌. 46

తద్దదామి వృణుష్వేద మర్థయస్వ చ యత్ప్రియమ్‌ | ఉత్యుక్తో దైత్యపతినా

ప్రీతిమానచ్యుత స్తతః. 47

ప్రాహ సస్మితగమ్బీరం భగవా న్వామనాకృతిః | మమాగ్నిశరణార్థయా దేహి రాజన్ప దత్రయమ్‌. 48

సువర్ణగ్రామరత్నాది తదర్థిభ్యః ప్రదీయతామ్‌ |

బలిః త్రిభిః ప్రయోజనం కిం తే పదైః పదవతాం వర. 49

శతం శతసహస్రంవా వదానాం మార్గతాం భవా& |

వామనః: ధర్మ బుద్ధ్యా దైత్యపతే కృతకృత్యో 7స్మి తావత్యా. 50

అన్యేన మర్థినాం విత్త మిచ్ఛతాం దాస్యతే భవా& |

శౌనకః : ఏతచ్ఛ్రుత్వా తు గదితం వామనస్య మహాత్మనః. 51

దదౌ తసై#్మ మహాబాహు ర్వామనాయ పదత్రయమ్‌ | పాణౌ తు పతితే తోయ వామనో7

భూ దవామనః.

సర్వదేవమయం రూపం దర్శయామాస తతక్షణాత్‌ |

ఆనందముచే పులకించి బలి అర్ఘ్యముచేబూని గోవిందుని పూజించి ఆ దేవునితో ఇట్లనెను: సువర్ణమో రత్న సంఘములో గజములో వస్త్రములో అలంకారములో గ్రామములో సర్వ పర్వతాది సహిత పృథివియో పుష్కలముగా యథేప్సితముగ గ్రహించుము. నీకు ప్రియమగునదు కోరుకొనుము. ఇది కావలయునని యాచించుము. ఇత్తును . అని దైత్యపతియన అచ్యుతుడు ప్రీతినంది వామనాకృతియగు ఆ భగవానుడు చిరునవ్వుతో గంభీరముగ ఇట్లనెను: రాజా! నాకు అగ్నిశాలకుగా ముడడుగులిమ్ము; సువర్మ గ్రామ రత్నాదికమును అది కోరువారికిమ్ము. అనగా బలి పురుషోత్తమా: మూడడుగులతో అగునదేము? నూరడుగులో వేయి యడుగులో అడుగుము. అన వామనుడు 'దైత్యపతీ! ఆ మాత్రపు ధర్మబుద్ధితోనే కృతకృత్యుడను. నీవు ధనార్థులగు ఇతరులకు అది ఇత్తునుకాని'. అన విని మహాబాహుడా బలి మహాత్ముడగు వామనునకు పదత్రయమిచ్చెను. దాన జలము తన చేతియందు పడగానే వామనుడు అవామనుడయ్యెను. అతడు తతక్షణమే సర్వదేవమయరూపమును చూపెను.

శ్రీవామనేన స్ర్వదేవమయ స్వరూపప్రదర్శనమ్‌.

చన్ద్రసూర్యౌ చ నయనే ద్యౌ ర్మూర్ధా చరణౌ క్షితిః.

పాదాఙ్గుళ్యః పిశాచాశ్చ హస్తాఙ్గుళ్యస్తు గుహ్యాకాః | విశ్వే దేవాశ్చ జానుస్థా జఙ్ఘే సాధ్యా స్సురోత్తమాః. 54

యక్షా నఖేషు సమ్భూతా రేఖాభ్యో7ప్సరస స్తథా | దృష్టౌ ఋక్ష్యాణి శేషాణి కేశా స్సూర్యాంశవః ప్రభో. 55

తారకా రోమకూపాణి రోమాణ్యోషధయ స్తథా | బాహవో విదిశ స్తత్ర దిశ శ్శ్రోత్రే మహాత్మనః. 56

అశ్వినౌ శ్రవణ తస్య నాసా వాయు రహాత్మనః | ప్రసాద శ్చన్ద్రమా దేవో మనో ధర్మం సమాశ్రితః. 57

సత్యం తస్యాభవ ద్వాణీ జిహ్వాదేవి సరస్వతీ | గ్రీవా7దితి ర్దేవమాతా విద్యాస్త ద్బలయ స్తథా. 58

స్వర్గద్వార మభూన్మైత్రం త్వష్టా పూషా చ త్రద్భ్రువౌ | ముఖే వైశ్వానరశ్చాస్య వృషణౌ తు ప్రజాపతి. 59

హృదయం చ పరం బ్రహ్మ పుంస్త్వం వై కశ్యపో మునిః | పృష్ఠేచ వసవో దేవా మరుత స్సర్వసన్ధిషు.

సర్వసూక్తాని దశనా జ్యోతీంషి విమలాః ప్రభాః | వక్షస్థ్సలే మహాదేవో హృది చాస్య మహార్ణవాః. 61

ఉదరే చాస్య గన్ధర్వాః సమ్భూతాశ్చ మహాబలాః | లక్ష్మీ ర్మేధా ధృతిః కాన్తి స్సర్వా విద్యాశ్చ వై కటౌ.

సర్వజ్యోతీంషి జానీహి తస్య తత్పరమం మహః | తస్య దేవాదిదేవస్య తేజః ప్రోద్భూత ముత్తమమ్‌. 63

స్తనౌ కుక్షీ చ వేదాశ్చ ఉదరే మహామఖాః | ఉష్టయః పశుబ న్ధాశ్చ ద్విజానాం చేష్టితానిచ. 64

చంద్ర సూర్యులు నేత్రములు- ద్యులోకము శిరము- క్షితి- చరణములు పిశాచులు - పాదాంగుళులు గుహ్యకులు హస్తాంగుళులు విశ్వదేవులు జానువులు సురోత్తములగు సాధ్యులు జంఘలు యక్షులు నఖములు రేఖలు అప్సరసలు అశేష జ్యోతిర్గోళములు దృష్టులు సూర్యాంశువులు కేశములు తారకలు రోమ కూపములు ఓషధులు- రోమము విదిశలు బాహువులు దిశలు చెవులు అశ్వినులు శ్రవణము (ఆఇంద్రియతత్త్వము) వాయువు నాసిక ప్రసాద రూపుడగు చంద్రదేవుడు మనస్సు సత్యమువాక్కు సరస్వతి జిహ్వ దేవమాతయగు అదితి గ్రీవ- విద్యలు ముడుతలు స్వర్గద్వారము గుదము త్వష్టయు పూషయు కనుబొమలు- వైశ్వానరుడు ముఖము ప్రజాపతివృషణములు పరబ్రహ్మము హృదయము కశ్యపముని పుంస్త్వము వసువులు వృష్ఠము మరుతులు సర్వసంధులు సర్వసూక్తులు దంతములు జ్యోతిస్సులు విమలకాంతులు మహాదేవుడు వక్షము మహాసముద్రములు హృదయము గంధర్వులు ఉదరము లక్ష్మీ మేధాధృతి కాంతులును సర్వవిద్యలును కటిదేశము సర్వజ్యోతిః కాంతులును అతని పరమమహా(తేజ)స్సు వేదములు స్తనములును కుక్షియు మహాముఖములు ఇష్టులు పశుబంధములు ద్విజులు ఆచరించు కర్మానుష్ఠానములును ఉదరము ఆ మహాత్మునకయ్యెను.

తస్య దేవమయం రూపం దృష్ట్వా విష్ణో ర్మహాబలాః | ఉపాసర్పన్త దైతేయాః పతఙ్గా ఇవ పావకమ్‌. 65

ప్రమథ్య సర్వా ససురా న్పాదహస్తతలై ర్విభుః | కృత్వా రూపం మహాకాయం జహారాశు స మేదినీమ్‌. 66

తస్య విక్రమతో భూమిం చన్ద్రాదిత్యౌ స్తనాన్తరే | నభో విక్రమమాణస్య సక్థిదేశే స్థితా వుభౌ. 67

పరం విక్రమమాణస్య జానుమూలే ప్రభాకరౌ | విష్ణో రాస్తాం మహీపాలం దేవపాలనకర్మణి. 68

జిత్వా లోకత్రయం కృత్స్నం హత్వా చాసురపుఙ్గవా& | పురన్దరాయ త్రైలోక్యం దదౌ విష్ణు రురుక్రమః. 69

త్రివిక్రమనియోగాద్బలేః పాతాళగమనమ్‌.

సుతలం నామ పాతాళ మధస్తా ద్వసుధాతలాత్‌ | బలే ర్దత్తం భగవతా విష్ణునా ప్రభవిష్ణునా. 70

అథ దైత్యేశ్వరం ప్రాహ విష్ణుః సర్వేశ్వరేశ్వరః |

యత్త్వయా సలిలం దత్తం గృహీతం పాణినా మయా. 71

అల్పప్రమాణం తస్మా త్తే భవిష్య త్యాయు రుత్తమమ్‌ | వైవస్వతే తథా7తీతే బలే మన్వన్తరే తథా. 72

సావర్ణికే తు సమ్ప్రాప్తే భవా నిన్ద్రో భవిష్యతి | సామ్ప్రతం దేవరాజాయ త్రైలోక్య మఖిలం మయా. 73

దత్తం చతుర్యుగానాం చ సాధికా హ్యేకసప్తతిః | నియన్తవ్యా మయా సర్వే యే తస్య పరిపన్థినః. 74

తేనాహం పరయా భక్త్యా పూర్వ మారాధితో బలే | సుతలం నామ పాతాళం త్వ మాసాద్య మనోరమమ్‌.

వసాసుర మమాదేశం యథావ త్పరిపాలయ& |

మహాబలులగు దైత్యులును ఆ విష్ణుని సర్వదేవమయ రూపము చూచినంతనే మిడుతలు అగ్నినివలె ఆ దేవుని సమీపించిరి; ఆ విభుడంతట హస్తపాద తలములతో పాదతలములతో అసురుల నెల్లరును నలుగగొట్టి మహాకాయ రూపముదాల్చి శ్రీఘ్రమే భూమినెల్ల హరించెను; అతడు భూమినిదాటి విక్రమించుచుండ మొదట చంద్రాదిత్యులు అతని స్తనములనడుమ ఇమిడిరి; అందరిక్షమును దాటి విక్రమించుచుండ వారే తొడలకడకు వచ్చిరి; అంతకుమించి ద్యులోకమునుక్రమ్మి విక్రమించుచుండగా వారే జానుమూలమునకు సరిపోయిరి; మహీపాలా! విష్ణుడుచేసిన దేవరక్షాకార్యమున నిట్లు జరిగెను; ఉరుక్రముడు (విస్తృత పాదవిన్యాసములు కల) విష్ణుడు లోకత్రయమును నిఃశేషముగ జయించి అసుర పుంగవుల వధించి ఇంద్రునకు త్రైలోక్యమునిచ్చెను; ప్రభవిష్ణుడగు విష్ణు భగవానుడు వసుధాతలాధోభాగమునందలి సుతల మనెడు పాతాళాంశమును బలికిచ్చి ఆ సర్వేశ్వరేశ్వరుడా దైత్యేశ్వరునితో నిట్లనెను: నీచే దత్తమయిన సలిలమును నేను నాపాణితో గ్రహించిన దాని ఫలముగా నీకు కల్పప్రమాణముగల ఉత్తమాయువగును; వైవస్వతమన్వంతరా నంతరము సావర్ణికమన్వంతరమున నీవింద్రుడవగుదువు; నేనిపుడఖిలత్రైలోక్యమును దేవరాజునకిచ్చితిని గదా! ఇక డెబ్బదియొక చతుర్యుగముల వరకు నేనతని శత్రువులను నా అదుపులోనుంతును; ఏలయన పూర్వమతడు పరమభక్తితో సన్నారాధించియుండెను; నేవంతవరకు నేను నీకిచ్చిన మనోరమమగు సుతలనామక పాతాళముననే నా యాదేశము నేమాత్రమును తప్పక పాలించుచు నటవసింపుము.

తత్ర దివ్యాఙ్గ నోపేతే ప్రాసాదశతసజ్కులే. 76

ప్రోత్ఫుల్లపద్మసరసి సరచ్ఛుభ్రసరిద్వరే | సుగన్దిధూపస్రగ్వస్త్రచామరాదివిభూషితే. 77

స్రక్చన్దనాదిముదితే గేయనృత్యమనోరమే | పానాన్నభోగ్యా వివిధా న్భుఙ్ఞాన స్త్వం మహాసుర. 78

మమాజ్ఞయా కాల మముం తిష్ఠ స్త్రీశతసంవృతః | యావత్సురైశ్చ విపై#్రశ్చ న విరోధం కరిష్యసి. 79

తావదేతా న్మహాభోగా నవాప్స్యసి మహాసుర | యదాచ దేవవిప్రాణాం విరోదం త్వం కరిష్యసి. 80

వధిష్యన్తి తదా పాశా వారుణా స్త్వా మసంశయమ్‌ | ఏత ద్విదిత్వా వచనం మయా77 జ్ఞప్తం విశేషతః.81

న విరోధ స్సురైః కార్యో విపై#్రర్వా దైత్యసత్తమ | ఇత్యేవ ముక్తో దేవేన విష్ణునా ప్రభవిష్ణునా. 82

బలిః ప్రాహ మహారాజ ప్రణిపత్య ముదాన్వితః | బలిః తత్రాసతో మే పాతాళే భగవన్‌ భవదాజ్ఞయా. 83

కిం భవిష్య త్యుపాదాన ముపభోగోపపాదకమ్‌ |

దివ్యాంగనాయుతమును ప్రాసాద శత సంకులమును ప్రవికసిత పద్మ సరోయుతమున ప్రవహమాణ నిర్మల నదీయుతమును సుగంధయుత ధూవ పుష్పమాలా వస్త్ర చామరాది విభూషితమును పుష్పమాలాచందనాదులచే సంతోష ప్రదమును గాన నృత్యములతో మనోరమమును నగు ఆ సుతలమునందు మహానురా! నీవు వివిధాన్న పానాది భోగము లనుభవించుచు స్త్రీ శతపరివృతుడవయి నేను ఇపుడు చెప్పిన ఈ కాలమంతయు ముగియువరకుండుము; దేవ బ్రాహ్మణులతో విరోధము పూననంతవరకు నీవీ భోగముల ననుభవింతువు; నీవది పూనిననాడు నిశ్చయముగ వారుణ పాశములు నిన్ను వధించును; కావున ఇది ఎరిగి దైత్యసత్తమా! నాయాజ్ఞానుసారము ఈ పొరబాటు చేయకుండుము; దేవదేవుడును ప్రభవిష్ణుడునగు విష్ణువిట్లు పలుక విని బలి మోదముతో నమస్కరించి యతనితో నిట్లనెను: భగవన్‌! నీ యాజ్ఞతోనే పాతాళమున వసించునపుడు నాకు ఈ భోగములను సంపన్నమొనరించు ఉపాదానము (మూలసాధనము) ఏది? అన విష్ణువీ విధముగా పలికెను.

+ విష్ణుః: దానాని యాని దత్తాని శ్రద్ధయా శ్రోత్రియోషు చ. 84

హుతాని శ్రద్ధయా యాని తాని దాస్యన్తి తే ఫలమ్‌ | సదక్షిణా స్తథా యజ్ఞ క్రియాశ్చ వివిధాః కృతాః. 85

ఫలాని తవ దాస్యన్తి అధీతాని ప్రతానిచ | శౌనకః బలేర్వరం మిమం దత్వా శక్రస్య త్రిదివం తథా. 86

వామనేనైవ రూపేణ జగామాదర్శనం హరిః | శసాన చ యథా పూర్వ మిన్ద్ర సై#్త్రలోక్య మూర్జితమ్‌. 87

సిషేవే చ వరా న్కామా న్బలిః పాతాళ మాస్థితిః | ఇహైవ దేవదేవేన బద్ధో7సౌ దానవోత్తమః. 88

దేవానాం కార్యకరణ భూయో7పి జగతి స్థితిః | సమ్బన్దీ తే మహాభాగ ద్వారకాయాం వ్యవస్తితః. 89

దానవానాం వినాశాయ భూబారోత్తరణాయచ | జాతో యదుకులే కృష్ణో భవత శ్శత్రునిగ్రహే. 90

సహాయభూత స్సారథ్యం కరిష్యతి బలానుజః | ఏతత్సర్వం సమాఖ్యాంతం వామనస్య చ ధీమతః. 91

అవతారం మహావీర శ్రోతు మిచ్ఛో స్తవార్జున |

అర్జునః శ్రుతవా నిహ తే పృష్టం మాహాత్మ్యం కేశవస్య చ. 92

గఙ్గాద్వార మితో యాస్యా మ్యనుజ్ఞాం దేహి మే విభో | ఏవ ముక్త్వా య¸° పార్థో నైమిశం శౌమకో గతః. 93

సూతః ఇత్యేత ద్దేవదేవస్య విష్ణో ర్మాహాత్మ్య ముత్తమమ్‌ | వామనస్య పఠే ద్యుస్తు సర్వపాపైః ప్రముచ్యతే. 94

బలిప్రహ్లాదసంవాదం మన్త్రితం బలిశుక్రయోః | బలే ర్విష్ణోశ్చ కథితం య స్స్మరిష్యతి మానవః. 95

నా77ధయో వ్యాధయ స్తస్య న చ మోహాకులం మనః | భవిష్యతి కురుశ్రేష్ఠ మనుజస్య కథంచన 96

చ్యుతరాజ్యో నిజం రాజ్య మిష్ట ప్రాప్తింవియోగవా& | అవాప్నోతి మహాభాగ నర శ్శ్రుత్వా కథ మిమామ్‌. 97

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ శౌనకార్జునసంవాదే శ్రీ వామన చరిత్రే బలేః పాతాళ నియమనం నామ పంతచత్వారిందుత్తర ద్విశతతమో7ధ్యాయః.

నీ విదివరకు శ్రద్ధతో శ్రోత్రియులయందిచ్చిన దానములును అగ్నియందు చేసిన హోమములును ఆచరించిన

+దానాన్యవిధిదత్తాని శ్రాద్ధాన్య శ్రోత్రియాణిచ | హుతాన్యశ్రద్ధయా యాని తాని దాన్యన్తి తే ఫలమ్‌.

అదక్షిణాస్తథా యజ్ఞాః క్రియాశ్చావిధినాకృతాః| ఫలానితవదాస్యన్తి అధీతాన్యవ్రతానిచ.

నదక్షిణాక వివిధయజ్ఞములును అధ్యయనములును వేదవ్రతములును నీకాఫలమును అందజేయుచుండును; అని బలికి ఈ వరమునిచ్చి త్రిదివ రాజ్యమునింద్రునకిచ్చి హరి మరల వామన రూపమునంది యనంతరము అదృశ్యుడయ్యెను; ఇంద్రుడు యథాపూర్వముగ పుష్టిసంపన్నత్రైలోక్య రాజ్యము నేలెను; బలియు పాతాళమాశ్రయించి ఉత్తమ కామముల ననుభవించెను; ఆ దానవోత్తముడటనే ఆ దేవదేవునిచే బద్ధుడై మరల దేవకార్యము నిర్వహింపనై ఈ జగమునందే వేచి యున్నాడు మహాభాగా! అర్జునా! ఆ కృష్టుడే ఇపుడు నీసంబంధి (బావమరది)యై దానవ ­నాశమును భూభారోత్తారణమును చేయబూని యదుకులమున జనించి ద్వారకయందున్నాడు; ఇకముందు నీశత్రులను నిగ్రహించుటకై ఆ బలానుజుడే నీకు సహాయ భూతుడై సారథ్యము చేయును; మహా­dరా! అర్జునా! వినగోరిన నీకు ఇట్లు ధీమంతుడగు వామనుని యవతార వృత్తాంతమంతయు తెలిపితిని. అనిన శౌనకునితో అర్జనుడిట్లనెను; విభూ! నేనడిగిన కేశవమాత్మ్యము ఇది నీచే విటిని; ఇచటినుండి గంగాద్వారమునకు పోవుదును; అనుజ్ఞను ఇమ్ము; అని ముని యనుజ్ఞగోరి యర్జునుడేగెను: శౌనకుడును నైమి శారణ్యమునకు పోయెను; ఇట్టి ఈ దేవదేవుడగు

వామనరూపి విష్ణునుత్తమ మహాత్మ్యమును వినువారు సర్వపాపముక్తులగుదురు; బలి

ప్రహ్లాద బలి శుక్ర బలి విష్ణు సంవాదములను స్మరించు మానవుడు ఆధివ్యాధిమనోమోహములనందడు; రాజ్యభ్రష్టుడు రాజ్యమును ఇష్టజనవియుక్తుడు వారితోడి పొందును. ఈ కథాశ్రవణ ఫలముగా నందగలడు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున శ్రీ వామన చరిత్రమున విష్ణుడు బలిని పాతాళమున నియమించుట యను రెండు వందల నలుబదియైదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters