Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రిచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

శ్రీవామన చరిత్ర ప్రారమ్భః.

ఋషయః : రాజధర్మా స్త్వయా సూత కథితో విస్తరేణ చ| తథైవాద్బుతమఙ్గళ్యం స్వప్నదర్శన మేవచ. 1

విష్ణోరిదానీం మాహాత్మ్యం పున ర్వక్తు మిహార్హసి| కథం స వామనో భూత్వా బబన్ధ బలిదానవమ్‌. 2

క్రమతః కీదృశం రూప మాసీ ల్లోకత్రయం హరేః సూతః. ఏతదేవ పురా వృష్టః కురుక్షేత్రే తపోధనః. 3

శౌనకం స్తీర్థయాత్రాయాం వామనాయతనే పురా| యదా సమయభేదిత్వం ద్రౌపద్యాః పార్థివం ప్రతి. 4

అర్జునే న కృతం తత్ర తీర్థయాత్రాం తదా య¸°| ధర్మక్షేత్రే కురుక్షేత్రే వామనాయతనే స్థితః. 5

దృష్ట్వా స వామనం తత్ర అర్జునో వ్కాయమబ్రవీత్‌| వామనవతారవిషయక శౌనకార్జునసలంవాదః. అర్జునః కింనిమిత్త మయం దేవో వామనాకృతిరిష్యతే. 6

వారాహరూపీ భగవా న్కస్మా త్పూజ్యో7భ వత్పురా| కస్మాచ్చ వామన స్యేద మిష్టం క్షేత్ర మజాయత. 7

వామనస్య ప్రవక్ష్యామి వారాహస్య చ ధీమతః| త్యక్త్వా7తి విస్తరం తస్య మాహాత్మ్యం కురునన్దన. 8

పురా నిర్వాసితే శ##క్తే సురేషు విజితేషు చ| చిన్తయామాస దేవానాం జననీ పునరుద్భవమ్‌. 9

అదితిర్దేవపానాంచ మాతా పరమదుఃఖితా| తప స్చచార వర్షాణాం సహస్రం పృథివీ పతే. 10

ఆరాధనాయ కృష్ణస్య వాగ్యతా వాయుభోజనా| దైత్యై ర్నిరాకృతా న్దృష్ట్వా తనయా సన్కురునన్దన. 11

వృథాపుత్త్రా7హ మస్మీతి నిర్వేదా త్ప్రణతా హరిమ్‌| తుష్టావ వాగ్భి రర్థ్యాభిః పరమార్థా 7వ బోధనీ. 12

దేవదేవం హృషీ కేశం సత్వా సర్వగతం హరిమ్‌|

రెండు వందల నలువది మూడవ అధ్యాయము.

శ్రీవామన తరిత్రము- కథారంభము.

అదితికి విష్ణువర ప్రాప్తి-అదితి గర్భమున విష్ణుప్రవేశము.

ఋషులు సూతునితో నిట్లనిరి : సూతా! నీవు మాకు రాజధర్మమును అద్భుత( ఉత్పాత) యాత్రా-స్వప్న శకున విషయములను విస్తరించి తెలిపితివి. ఇపుడిక మరల విష్ణు మహాత్మ్యమును తెలుపవేడుచున్నాము ;అతడెట్లు వామనుడయి బలిదానవుని బంధించెను ;హరి లోక త్రయాక్రమించునపుడతని రూపము ఎట్లుండెను?అన సూతుడిట్లనెను ;పూర్వము అర్జునుడు ద్రౌపదీ విషయమున సమయ భంగమౌనరించి తీర్థయాత్రకై వెడలెను. ఆ ప్రసంగమందతడు కురుక్షేత్రమునందలి వామనాయతనమందలి వామనుని చూచి అటనున్న తపోధముని శౌనకుని ఇదే ప్రస్న మడిగెను; ఏ హేతువుచే ఈ దేవుడు వామనాకృతి యయ్యెను? ఈ పూజ్యా భగవానుడు పూర్వము వరాహ రూపుడేలయయ్యెను? ఇది వామననుకు ఇష్టక్షేత్రమెటులయ్యెను? అనగా శౌనకుడిట్లు చెప్పెను: కురునందనా! ధీమంతులయిన వామన వారాహుల మాహాత్మ్య మనతివిన్తరముగ చెప్పెదను ;పూర్వము ఇంద్రుడు అసురులచే నిర్వాసితుడై దేవతలు వారితే విజితులు కాగా దేవ జనని యగు అదితి పరమదుఃఖితయై తన కుమారులెట్లు మరల అభ్యుదయమందుదురాయని చింత చేయుచు వేయి దివ్య సంవత్సరములు కృష్ణుని మెప్పించుటకై మౌనము దాల్చి వాయు భోజనయై తపమాచరించెను ;కురునందనా! దైత్యులచే నిరాకృతుయిన తన తనయులను చూచి నేను వ్యర్థ పుత్త్రినయితినే యని నిర్వేదముతో ప్రణతురాలయి పరమార్థా ప్రకాశక బుద్ధితో అర్థవంతములగు వాక్కు లతో దేవదేవుడును సర్వగతుడునగు హరిని నమస్కరించి ఇట్లు స్తుతించెను.

అదితికృత వాసుదేవ స్తుతిః.

అదితిః : నమస్స్మృతార్తినాశాయ నమః పుష్కరమాలినే. 13

నమః పరమకల్యాణి కల్యాణాయా77 దివేధసే| నమః వఙ్కజనేత్రాయ నమః పహ్కజనాభ##యే. 14

నమః పఙ్కజనమ్భూతి సమ్భవాయాత్మయోనయో| కాన్తాయ దాన్తదృశ్యాయ పరమార్థా చక్రిణ. 15

నమ శ్శఙ్ఖాసిహస్తాయ నమః కనకరేతసే| తథా77 త్మజ్ఞాన విజ్ఞానయోగినా చిన్త్యాత్మయోగినే. 16

నిర్గుణాయ విశేషాయ హరయే బహ్రహ్మరూపిణ| జగత్ప్రతిష్ఠితం యత్ర జగతా యో న దృస్యతే. 17

నమస్థ్సూ లాతిసూక్ష్మాయ తసై#్మ దేవాయ శఙ్కినే| యం న పశ్యన్తి పస్యన్తో జగదప్యఖిలం నరాః. 18

అపశ్యద్భి ర్జగద్చయత్ర దృశ్యతే హృది సంస్థితః| యస్మన్నన్నం పయశైవ సద్యశ్చైవాఖిలం జగత్‌. 19

తసై#్మ నమో7స్తు జగతా మాధారాయ నమోనమః| ఆద్యః ప్రజారపతి ర్యశ్చ యః పితౄణాం పరః పతిః. 20

పతిస్సురాణాం యస్త సై#్మ నమః కృష్ణాయ వేధసే| యః ప్రవృత్తౌ నివృత్తౌ చ ఇజ్యతే కర్మభి స్స్వకై. 21

స్వర్గాపవర్గఫలదో నమ స్తసై#్మ గదాభృతే | యశ్చిన్త్యమానో మనసా సద్యః పాపం వ్యపోహతి. 22

నమస్తసై#్మ విశుద్ధాయపరాయ హరిమేధసే| యం బుధ్ధ్వా సర్వబూతాని దేవదేవేశ మవ్యయమ్‌. 23

న పునర్జన్మమరణ ప్రాప్నువన్తి నమామి తమ్‌| యో యజ్ఞే యజ్ఞపరమై రిజ్యతే యజ్ఞసంజ్ఞితః. 24

తం యజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభు మీశ్వరమ్‌|

స్మరించిన వారి ఆర్తి నశింపజేయువాడును పద్మమాలియు పరమ కల్యాణి కల్యాణుడును ఆది బ్రహ్మరూపుడును పంకజనేత్రుడును పంకజనాభుడును పద్మసంభవుని జన్మకారణుడును ఆత్మయోనియు మనోహర రూపుడును ఇంద్రియ నిగ్రహము కలవాడును దృస్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రియు శంఖ ఖడ్గహస్తుడు హరిణ్యరేతస్కుడు ఆత్మ జ్ఞానముగల యోగులచే చింతింపడువాడు స్వయం యోగియు నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు నగు హరికి నమస్కారము. ఎవనియందు జగము ప్రతిష్ఠితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతి స్థూలునకు శంఖికి నమస్కారము; అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖలగు జనులెవనిని చూడజాలరో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయముందేయున్న వానిగా చూతురో ఎవనియందన్నము జలము నదులు సమస్త జగములు ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజాపతియు పితరులకును పరమపతి(పిత) యు దేవతాపతియునగు కృష్ణునకు వేదో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కారము. ఎవడు ప్రవృత్తి మార్గములందాయా కర్మములతే ఆరాధింపడునో అట్టి స్వర్గాపవర్గ ఫరదుడగు గదాధారికి నమస్కారము; మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్ధుడు పరుడునగు హరికి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; సర్వభూతములును దేవదేవేశుడు నవ్యయుడునగు ఎవని నెరిగినంతనే జన్మ మరణరహితులగుదురో(నో) ఆ హరిని నమస్కరింతును; యజ్ఞ పరాయణులు యజ్ఞమందు ఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషుని విష్ణుని ప్రభుని ఈశ్వరుని నమస్కరింతును.

గీయతే సర్వవేదేషు వేదవిద్భి ర్విదాంపతిః. 25

యస్తసై#్మ వేదవేద్యాయ విష్ణవే జిష్ణవే నమః| యతో విశ్వం సముత్పన్నం యస్మింశ్చ లయ మేష్యతి. 26

విశ్వోద్భవప్రతిష్ఠాయ సమస్తసై#్మ మహాత్మనే| బ్రహ్మాది స్తమ్బపర్యన్తం యేన విశ్వమిదం తతమ్‌. 27

మాయాజాలం సముత్తర్తుం తముపేన్ద్రం న మా మ్యహమ్‌| విషాదతోషరోషాద్యైర్యో 7జస్రం సుఖదుఃఖజైః. 28

నృత్యత్యఖిలభూతస్థ స్తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యమారాధ్య విశుద్ధేన కర్మణా మనసా గిరా. 29

తరస్త్యవిద్యా మఖిలాం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్త్సుతో విశ్వరూపస్థో బిభర్త్యఖిల మీశ్వరః. 30

విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్‌| మూర్త న్తమో 7సురమయం

తద్వధాద్వినిహన్తి యః. 31

రాత్రిజం సూర్యరూపీవ తముపేన్ద్రం నమా మ్యహమ్‌| కపిలాదజి స్వరూపస్థో యశ్చాజ్ఞానయమం తమః. 32

హన్తి జ్ఞానప్రదానేన తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్యాక్షిణీ తన్ద్రసూర్యౌ సర్వలోక శుభఙ్కరమ్‌. 33

వస్యతః కర్మ సతతం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్మిన్త్సర్వేశ్వరే విశేవం సత్య మేతన్మయోదితమ్‌. 34

నానృతం త మజం విష్ణుం నమామి ప్రబు మవ్యయమ్‌| యథైత త్సత్యముక్తంచ భూయాంశ్చాతో జనార్దనః. 35

సత్యేన తేన సఫలాః పూర్యన్తాం మే మనోరథాః.

సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యుడగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్నమయి ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు అట్టి మహాత్మునకు నమస్కారము; బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ విశ్వమేవనిచే వ్యాప్తమో అట్టి యుపేంద్రుని నేను ఈ మాయాజాలము తరించుటకై నమస్కరింతును; తోయ స్వరూపుడై యుండి అఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణుని నమస్కరింతును; సుఖదుఃఖములకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వందనము ;రాత్రులందేర్పుడు చీకటిని రవివలె అసురమయమగు రూపొందిన చీకటిని వదించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును ;కపిలాది యోగి స్వరూపమునుండి అజ్ఞానమయతమమున జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింపజేయు హరిని నమస్కరింతును; ఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమున సతతము చూచుచున్నారో అట్టి యుపేంద్రుని నమస్కరింతును; సర్వేశ్వరుడును సర్వుడునునగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు సత్యమో అసత్యము కాదో అట్టి అజుని విష్ణుని ప్రభుని అవ్యముని నమస్కరింతును; నేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్ధనుడింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథములన్నియు సఫలములయి పూరింపపడుగాక !

అదిత్యై విష్ణుదత్త వరలాభః.

శౌనకః ఏవం స్తుతో7థ భగవా న్వాసుదేవ ఉవాచ తామ్‌. 36

అదృశ్య స్సర్వభూతానాం తస్యా స్సన్దర్శనే స్థితః.

శ్రీభగవా &: మనోరథా న్త్స్వానదితే యానిచ్ఛస్యభివాఞ్చితా9. 37

తాం స్త్వం ప్రాప్స్యసి ధర్మజ్ఞే మత్ప్రసాదా న్న సంశయః |

శృణుష్వ త్వం మహాభాగే వరో యస్తే7భివాఞ్చితః. 38

తమాశు వ్రియాతాం కామం శ్రేయస్తే సమ్భవిష్యతి | మద్దర్శనం హి విఫలం న కదాచి ద్భవిష్యతి. 39

అదితిః: యది దేవ ప్రసన్నస్త్వం మద్భక్త్యా భక్తవత్సల |

త్రైలోక్యాధిపతిః పుత్త్ర స్తదస్తు మమ వాసవః. 40

హృతం రాజ్యం హృతాశ్చాస్య యజ్ఞభాగా మహాసురైః |

త్వయి ప్రసన్నే వరదే ప్రాప్నోతు సురసత్తమః. 41

హృతం రాజ్యం న దుఃఖాయ మమపుత్త్రస్య కేశవ |

సాపత్నా ద్దాయనిర్భ్రంశో బాధాం నః కురుతే హృది. 42

శ్రీ భగవా&: కృతః ప్రసాదో హి మాయా తవ దేవి యథేప్సితమ్‌ |

స్వాంశేన చైవ తే గర్భే సమ్భవిష్యామి కశ్యపాత్‌. 43

తవ గర్భే సముత్పన్న స్తత్ర తే యే సురారయః | తా& హనిష్యామి సర్వాన్వై నిర్వృతా భవ నన్దిని. 44

అదితిః ప్రసీద దేవదేవేశ నమస్తే విశ్వభావన | నాహం త్వా ముదరేణౖవ వోఢుం శక్ష్యామి కేశవ. 45

యస్మి న్ప్రతిష్ఠితం విశ్వం విశ్వస్య స్వయ మీశ్వరః | తమహం నోదరేణ త్వాం వోఢుం శక్ష్యామి దుర్ధరమ్‌.

ఇట్లు స్తుతింపబడిన వాసుదేవ భగవానుడు సర్వభూతముల కదృశ్యుడయియు అదితికి దర్శనమిచ్చుచు ఆమెతో ఇట్లు పలికెను: ధర్మజ్ఞా! అదితీ! నీ మనోరథములన్నియు నాయనుగ్రహమున నిస్సంశయముగ సిద్ధించును; మహాభాగ! నా మాట వినుము; నీ యభివాంఛితమగు వరము ఏదియో కోరుము; నీకత్యంత శ్రేయము కలుగును; నాదర్శనమెన్నడును విఫలము కాదు; అన అదితి ఇట్లనెను; దేవా! భక్తవక్సలా! నీవు నా భక్తితో ప్రసన్నుడవయినచో నా పుత్త్రుడగు ఇంద్రుడు త్రైలోక్యాధిపతియగుగాక! మహాసురులతని రాజ్యమును యజ్ఞభాగములను హరించినారు; వరదుడవగు నీవు ప్రసన్నుడ వయినచో నాకుమారుడు మరల నవి పొందుగాక! కేశవా! వానికి రాజ్యము పోవుట దుఃఖకరముగాదు; మాసవతి కొడుకు మావాని దాయభాగము హరించెననుట మాహృదమునకు బాధ కలిగించుచున్నది; అన భగవానుడిట్లనెను; దేవీ! నీయభీప్సితము ననుగ్రహించితిని; నా యంశమున కశ్యపుని వలన నీగర్భమున జన్మింతును; తరువాత దేవశత్రువులను సంహరింతును; ఆనంద కరులారా! సంతోషమందుము; అనగా అదితి ఇట్లనెను; దేవదేవేశా! అనుగ్రహించుము; (ప్రసన్నుడవగుము;) విశ్వభావనా! నీకు వందనము; దేవా! కేశవా! నేను నిన్ను నా గర్భమున మోయజాలనెమో! ఎవనియందు విశ్వము నెలకొన్నదో ఎవరు తాను స్వయముగా విశ్వరూపుడో అట్టి ఈశ్వరుడు అగు దుర్దరుని నిన్ను నేను ఉదరమున మోయజాలను.

శ్రీ భగవాన్‌ :సత్య మాత్థ మహాబాగే మయి సర్వ మిదం జగత్‌ |

ప్రతిష్ఠితం న మాం శక్తా వోఢుం సేన్ద్రా దివౌకసః. 47

కిం త్వహం సర్వలోకాంస్తా న్త్సదేవాసురమానుషా& |

జఙ్గమాం త్థ్సావరా న్త్సర్వాం స్త్వాంచ దేవి సకశ్యపామ్‌. 48

ధారయిష్యామి భద్రం తే తదలం సమ్భ్రమేణచ |

గ్లాని ర్న తే న చ స్వేదో గర్భస్థే భవితా మయి. 49

దాక్షాయణి ప్రసాదన్తే కరోమ్యన్యై స్సుదుర్లభమ్‌ | గర్భస్థే మయి పుత్త్రాణాం తవ యో 7భిభవిష్యతి. 50

తేజస స్తస్య హానిం చ కరిష్యే మా వ్యథాం కృథాః |

శౌనకః ఏవ ముక్త్వా తతః సద్యో గతో7న్తర్ధాన మీశ్వరః. 51

సా7పి కాలేన తం గర్భ మవాప పురుషోత్తమమ్‌ | గర్భస్థితే తతః కృష్ణే చచాల సకలా క్షితిః. 52

చకమ్పిరే మహాశైలా జగ్ముః క్షోభం తథా7బ్ధయః | యతో యతో7దితి ర్యాతి దదాతి లలితం పదమ్‌. 53

తత స్తతః క్షితిః ఖేదా న్ననామ వసుధాధిప | దైత్యానా మథ సర్వేషాం గర్భస్థే మధుసూదనే. 54

బభూవ తేజసో హానిర్యథోక్తం పరమేష్ఠినా. 54u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే వామనచరిత్రే 7దితి గర్భే

విష్ణుః ప్రవేశకథనం నామ త్రిచత్వారింశదు త్తరద్విశతతమో7ధ్యాయః.

అనగా భగవానుడిట్లనెను: మహాభాగా! సత్యమంటివి; నాయందే జగమంతయు ప్రతిష్ఠతము; నన్ను ఇంద్రాది దేవతలెవ్వరును మోయజాలరు; కాని నేను సర్వలోకములను అందలి స్థావర జంగమములతో దేవాసుర మానుషులతో నిన్నును కశ్యపునికూడ మోయగలను; భద్రరూపా! కావున నీవు భయపడకుము; నేను నీగర్భమందుండగా నీకు శ్రమముకాదు. చెమటయు పట్టదు; దక్షపుత్త్రీ! నేను అన్యసుదుర్లభమగు అనుగ్రహమును నీయందు చూపుచున్నాను; నేను నీ గర్భమందున్న కాలమున నీపుత్త్రులకెవరయిన హాని కలిగించినచో వారికి తేజోహాని కలుగింతును; వ్యథనందకుము; అని పలికి వెంటనే ఈశ్వరుడంతర్హితుడయ్యెను ఆ అదితియు కాలమున పురుషోత్తముని గర్భముగా పొందెను; కృష్ణుడు గర్భస్థుడై యున్న కాలమున సకల భూమియు చలించెను. మహాశైలములు వణకెను; సముద్రములు క్షోభిల్లెను; అదితి లలితముగా నెచట అడుగుంచినను అచటనెల్ల భూమి ఖేదముచే వంగెను; ఆ కాలమున పరిమేష్ఠియగు విష్ణువు చెప్పినటులే సర్వదైత్యులకును తేజోహానియయ్యెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరితమున అదితి గర్భముందు హరిప్రవేశమను రెండు వందల నలువది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters