Sri Matsya Mahapuranam-2    Chapters   

చత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- అవయవస్పన్దననిమిత్తకశుభాశుభవిచారః.

మనుః : బ్రూహి మే త్వం నిమిత్తాని అశుభాని శుభాని చ| సర్వధర్మవిదాం శ్రేష్ఠ త్వం హి సర్వవి దుచ్యసే. 1

శ్రీ మత్స్యః అఙ్గదక్షిణభాగేతు శస్తం ప్రస్ఫురణం భ##వేత్‌| అప్రశస్తం తథా వామే వృష్ఠస్య హృదయస్య తు. 2

మనుః : అఙ్గానాం స్పన్దనం చైవ శుభాశుభవిచేష్టితమ్‌| తన్మే విస్తరతో బ్రూహి యేన స్యాం తద్వితో భువి. 3

శ్రీమత్స్యః : పృథ్వీలాభో భ##వే న్మూర్ధ్ని లలాటే రవినన్దన| స్థానం వివృద్ధి మాయాతి భ్రూదేసే ప్రియసఙ్గమః. 4

భృత్యలభ్ధి శ్చాక్షిదేశేదృగుపాన్తే ఘనాగమః| ఉత్కణ్ఠోపగమో మధ్యే దృష్టం రాజ న్విచక్షణౖః. 5

దృగ్భన్దనే సఙ్గరేచ జయం శీఘ్ర మవాప్నుయాతే| యోషిల్లాభో7 పాఙ్గదేశే శ్రవణాన్తే ప్రియాశ్రుతిః. 6

నాసికాయాం ప్రీతి సౌఖ్యం ప్రియాప్తి రధరోష్ఠయోః| కణ్ఠ తు భోగలాభ స్స్యా ద్భోగవృద్ధిరథాసంయోః. 7

సుహృత్స్నే హశ్చ బాహుభ్యాం హస్తే చైవ ధనాగమః| పృష్ఠే పరాజయ స్సభ్యో జయో వక్షస్థ్సలే భ##వేత్‌. 8

కుక్షిభ్యాం ప్రీతి రుద్ధిష్టా స్త్రియా ః ప్రజననం స్తనే | స్థానభ్రంశో నాభిదేశే జఘగనే చ ధనాగగమః. 9

జౌనుసన్ధౌ పరై స్సన్ది ర్బలవద్భి ర్భవే న్నృప | స లాభం చాధ్వగమనం భ##వే త్పాదతలే నృప. 10

లాఞ్ఛనం పిటకం చైవ జ్ఞేయం స్ఫురణవ త్తథా| దిశైకదేశనాశాయజఙ్ఘాయాం రవినన్దన. 11

ఉత్తమం స్థాన మాప్నోతి పద్భ్యాం ప్రస్ఫురణా న్నృప| విపర్యయేణ విహితా స్సర్వే స్త్రీణాం ఫలాగమా. 12

దక్షిణ 7తి ప్రశ##స్తే7 ఙ్గే ప్రశస్తం స్యా ద్విశేషతః| అప్రశ##స్తే తతా వామే త్వ ప్రసస్తం విశేషతః. 13

అతో7న్యథా సిద్ధి రజల్పనాత్తు ఫలస్య శస్తస్య చ నిన్దితస్య| అనిష్టచిహ్నో పగమే ద్విజానాం కార్యం సువర్ణేన చ తర్పణం స్యాత్‌. 14

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే అవయవస్పన్ద నిమిత్తకశుభాశుభవిచారో

నామ చత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల నలువదవ అధ్యాయము.

అవయవ స్పందనమును బట్టి శుభాశుభ విచారము.

సర్వ ధర్వ విదులలో శ్రేష్ఠుడవగు భగవన్‌! నీవు సర్వజ్ఞుడని ప్రసిద్ధుడవు. శుబా శుభ నిమిత్తములను తెలుపుమనిన మనువుతో మత్స్యుడిట్లనెను; అవయవములుగాని వీపుగాని హృదయముగాని కుడివైపున స్పందించుట శుభము ;ఎడమవైపున స్పందించుట అశుభము. అనగా అంగస్పందనమును శుభాశుభ విచేష్టితమును విస్తరముగ నాకు తెలిపి నన్ను అది ఎరిగిన వారిలో గొప్పవానినిగా జేయుమన్న మనువుతో మత్స్యుడియులు చెప్పెను ;కుడివైపున స్పందము కూడ మూర్ధమందైనచో పృథ్వీలాభము- లలాటమందు -స్థానవృద్ధి -భ్రూదేశమందు- ప్రియ జన సంగమము ;అక్షిదేశమందు- భృత్యలాభము- కంటికొనయందు ధనాగమము- నడుమునదు తబతహపాటు - కంటికొలికి యందు యుద్ధమందు శీఘ్రముగా జయము- కడగంటియందు స్త్రీభోగము చెవి కొనయందు -ప్రియ వార్తాశ్రవణము-- నాసిక యందు ప్రీతి సౌఖ్యము- పెదవులయందు ప్రియలాభము- కంఠమందు భోగలాభము- భుడమూలముల యందు భోగవృద్ధి- భూజములయందు మిత్రులతోడు స్నేహలాభము- హస్తమునందు ధనా%ీగమము- వీపునందు పరాజయము- వక్షమునందు నద్యోజ.ము- కుక్షులయందు ప్రీతి- స్త్రీకి స్తనమందు అయినచో సంతానప్రాప్తి- నాభియందు స్థానభ్రంశము- జఘనమందు ధనాగమము- మోకాళ్ళ సందులయందు బలవంతులతో సంధి- అరికాళ్ళ యందు ధనలాభకర ప్రయోణము- కలుగును. గుహ్యవయవమందైనచో బొబ్బలును పుండ్లును అగును ;పాదములయందు ఉత్తమస్థాన ప్రాప్తి- యగును ;ఈ చెప్పిన స్పందములన్నియు స్త్రీలకు ఎడమవైపున కలిగినచో మంచి ఫలితమలనిచ్చును; పురుషులకయినచో ఆ స్పందము కుడివైపు నందలి ప్రశస్తాంగమందమయినచో విశేశముగ ప్రశస్తఫలము ;ఎడమ వైపునందలి అప్రశస్తాగమందయినచో వేశేషముగ అప్రశస్త ఫలము ;ఈ చెప్పిన వి కాక మిగిలిన అవయవములు సంపదనము విషయమున ఫలము సద్బ్రాహ్మణులవలన నెరుగ వలయును ;అనిష్టచిహ్నములు కనబడినచో బ్రాహ్మణ సంతర్పణమును బ్రాహ్మణులకు సువర్మ దానమును దానము చేయవలయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మ మున అవయవ స్పందన నిమిత్తక శుభాశుభ విచారమును రెండు వందల నలువదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters