Sri Matsya Mahapuranam-2    Chapters   

షట్‌ త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మః- మృగపక్షి వైకృతశాన్తిః.

గర్గః ప్రవిశన్తి యదా గ్రామ మారణ్యా మృగపక్షిణః| అరణ్యం యాన్తివై గ్రామ్యా స్థ్సలం యాన్తి జలోద్భవాః. 1

స్థలజాశ్చ జలం యాన్తి ఘోరం వాశన్తి నిర్భయాః| రాజద్వారే పురద్వారే శివా చాప్యశివప్రదా. 2

దివా రాత్రించరా వా7పి రాత్రావపి దివాతరాః| గ్రామ్యా స్త్యజన్తి గ్రామం వా శూన్యతాం తస్య నిర్ధిశేత్‌. 3

దీప్తా వాశన్తి సన్ధ్యాసు మణ్డలాని చ కుర్వతే| వాశన్తి విస్వరం యత్ర తదా7 ప్యే తత్ఫలం లభేత్‌. 4

ప్రదోషే కుక్కుటో వాశే ద్దేమన్తే చాపి కోకిలః| అర్కోదయే త్వముభి శివా రౌతి భయం భ##వేత్‌. 5

గృహే కపోతః ప్రవిశే త్క్రవ్యాదో మూర్ధ్ని లీయతే| మధు వా మక్షికాః కుర్య ర్మృత్యు ర్గృహవతే ర్భవేత్‌. 6

ప్రాకారద్వారగేహేషు తోరణాపణవీథిషు| కేతుచ్ఛత్త్రాయుధాధ్యేషు క్రవ్యాదః ప్రపతే ద్యది. 7

జాయతే వా7థ వల్మీకో మధు వా స్రవతే యదు| సదేశో నాశ మాయాతి రాజా చ మ్రియతే తథా. 8

మూషకా ఞ్ఛలభా న్దృష్ట్వా ప్రభూతం క్షుద్భయం భ##వేత్‌| కాష్ఠోల్ము కాస్ఛి శృఙ్గాఢ్యా శ్శ్వానో మారకవేదనాః. 9

దుర్భిక్షవేదనా జ్ఞేయాః కాకా ధాన్యముఖా యది| జనానభిభవన్తీ హ నిర్భయా రణవేదినః. 10

కాకో మైథునయుక్తస్తు శ్వేతస్తు యది దృశ్యతే| రాజా వా మ్రియతే తత్ర స చ దేశో వినశ్యతి. 11

ఉలూకో పసతే యత్ర నృపద్వారే తథా గృహే|జ్ఞేయా గృహపతే క్మృత్యుర్ధననాశ సై#్తథైవచ. 12

మృగపక్షివికారేషు కుర్యా ద్ధోమం సదక్షిణమ్‌| 'దేవాః కపోతా' ఇతి చ జప్తవ్యా పఞ్చభి ర్ద్వజైః. 13

గావశ్చ దేయా విధివ ద్ద్విజేభ్య స్సకాఞ్చనా వస్త్రయుగోత్తరీయాః| ఏవం కృతే సాన్తి ముపైతి పాపం మృగైర్ద్విజై ర్వా వినివేదితం యత్‌. 14

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మ మృగపక్షి వైకృతశాన్తి కథనం నామ

షట్‌ త్రింశదుత్తర ద్విశతతమో7ద్యాయః.

రెండు వందల ముప్పది ఆరవ అధ్యాయము.

మృగపక్షి వైకృత శాంతి.

గర్గుడత్రితో ఇట్లు చెప్పెను: అరణ్య మృగ పక్షులు గ్రామములందును గ్రామమృగపక్షులరణ్యమునందును ప్రవేశించుటయు స్థలచర ప్రాణులు జలములందును జలతరప్రాణులు స్థలమునందును ప్రవేశించుటయు అవి నిర్భయములయి ఘోరధ్వనులు చేయుటయు అశుభకరములగు గుంటనక్క రాజద్వారముందును పురద్వారముందును చేరి కూయుటయు రాత్రించర ప్రాణులు పగళ్లు యందును దివాచర పారాణులు రాత్రులందును సంతరించుటయు గ్రామ్య ప్రాణులు గ్రామము లను విడుచుటయు జరిగినచో ఆ గ్రామము (నగరము) శూన్యముగునని తెలియవలయును; సంధ్యాకాలములందు గుంట నక్కలు చెలరేగి క్రూరముగా కూయుటయు మండలాకారమున తిరుగుచుండుటయు వికృత స్వరముతో కూయుటయు జరిగినను ఇదే ఫలమగును; ప్రదోషమందు కోడియు హేమన్తమందు కోకిలయు కూసినను సూర్యోదయాభిముకముగా గుంట నక్క కూసినను భయము కలిగించును; ఇంటియందు పావురము దూరినను మాంసాహారి పక్షి ఇంటిపై వాలినను (మండ లాకృతిగా తిరిగినను) ఇంటియందు తేనెటీగలు చేనె పట్టు పెట్టినను గృహస్వామి మరణించును; ప్రాకారములందును ద్వారములందును గృహములందును పుర ప్రదాన ద్వారములందును అంగడి వీథులందును ధ్వజములు (జెండాలు) ఛత్త్రములు ఆయుధములు మొదలగు వానియందును (మీదను) మాంసాహీరి పక్షి వాలినను పుట్ట పెరిగినను తేనె స్రవించినను అదేశము నశించును; రాజు మృతుడగును; మూషికములు మిడుతలు అధికమయి కనబడినతో క్షుద్భయమగును; కుక్కలు కట్టలనో కొరవులనో ఎముకలనో కొమ్ములనో నోట కరచుకొని తిరుగుచో మృత్యువును సూచించును; కాకులు ధాన్య మును ముక్కున కరచుకొని కనబడినచో దుర్భిక్షము కలుగును; అవి భయములేక జనులను క్రమ్మి భయపెట్టుచున్నచో యుద్ధము కలుగును; కాక మైథునము కాని తెల్లని కాకి కాని కనబడినచో రాజ మరణమును దేశనాశమును జరుగును, రాజ ద్వారమందును గృహమందును గ్రుడ్లగూబ నివాసమారంభించినచో గృహస్వామికి మృత్యువు కాని ధననాశము కాని కలుగును. ఇట్టి మగపక్షి వైకృతములు సంభవించుచో దక్షిణా యుక్తముగా హోమము జరిపించవలెను. ఐదు మంది బ్రాహ్మములచే 'దేవాః కపోతా'- ఇత్యాది మంత్రములు జపింపజేయవలయును; వి ప్రులకు యథావిధిగ బంగారు వస్త్ర ద్వయము గోవును దానము చేయవలయును; ఇట్లు ఈ దోషము శాంతించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మ మున మృగపక్షి వైకృత శాంతి ప్రతిపాదనమను రెండు వందల ముప్పది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters