Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రయస్త్రింశ దుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- ఉపస్కర వైకృతాశాన్తిః.

గర్గః యాన్తి యానా న్యయుక్తాని యుక్తాన్యపి న యాన్తి చ| విముఢ్చన్తి తతా బ్రహ్మాన్జ్వాలాధూమారజాసించ. 1

చోద్య మానాని తత్ర స్యా న్మహ ద్భయ ముపస్థితమ్‌| వాద్యమానా న వాద్యన్తే వాద్యన్తే

చాప్యనాహతాః. 2

అచలాశ్చ చలన్త్యేవ న చలన్తి చలాని చ | అకాశే తూర్యనాదాశ్చ గీతగన్ధర్వని స్స్వనాః. 3

కాష్ఠదర్వీకుఠారాదే ర్వికారం కురుతే యది| గావో లాఙ్గూలసంఘైస్చ స్త్రియః స్త్రీచ విఘాతయేత్‌. 4

ఉపస్కరాదివికృతౌ ఘోరం శస్త్రభయం స్మృతమ్‌| వాయోస్తు పూజాం ద్విజ సక్తుభిస్చ కృత్వా నియుక్తాంశ్చ జపేచ్చ మాన్త్రా &. 5

దద్యా త్ప్రభూతం పరమాన్నహవ్యం సదక్షిణం తేన శమో7స్య భూయాత్‌.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే ఉపస్కరవైకృతాశాన్తి కథనం నామ

పంచత్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పది అయిదవ అధ్యాయము.

ఉపస్కర వైకృత శాంతి.

గర్గుడత్రితో ఇట్లు చెప్పెను: (ఉపస్కరములు అనగా బండులు రథములు మొదలగు ప్రయాణ సాధనములును మంచములు పీటలు కుర్చీ (కూర్చిక) లు మొదలగు పండుకొను కూర్చుండు వస్తువులును కృషికి వంటకు పనికివచ్చు పనిముట్లు ఇంకను ఇట్టివియును).

బండ్లు మొదలగు యానములు ఎద్దులు గుర్రములు మొదలగు వానిని పూన్చకయే నడుచుటయు పూన్చినను కదల్చినను తోలినను కదలకుండుటయు మంటలను పొగలను ధూళులను విడుచటయు మహాభయ నిమిత్తము; వాద్యములు మ్రెగించినను మ్రోగకుండుటయు మ్రోగించకయే మ్రోగుటయు కదలరాని కదలుటయు కదలునవి కదలకుండుటయు ఆకాశమునందు తూర్యనాదములు గీత గంధర్వ ధ్వనులు వినవచ్చుటయు కొయ్య పనిముట్లు గరిటెలు మొదలగు వంట పని ముట్లును గొడ్డలి మొదలగు ఉపకరణములు వికారము నందినను ఆవులు తమ తోకలలో కొట్టినను స్త్రీలు స్త్రీలనే దెబ్బలు కొట్టుచుండినను ఇట్లు ఉపస్కరాది వైకృతము సంభవించినందు వలన ఘోరశస్త్ర భయము ఏర్పడును. వాయుదేవుని పూజించి పేల పిండి నివేదించవలయును; బ్రహ్మణులచే వాయుదేవతాక మంత్రములు జపింపజేసి బ్రాహ్మణు లకు సమృద్ధిగా పరమాన్న సంతర్పణము చేయించి దక్షిణలీయవలెను; దీనిచే ఈ దోషము శమించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున ఉపస్కరాది వైకృత శాంతియను

రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters