Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్తవింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- దివ్యాన్తరిక్ష భౌమోత్పాతశాన్తిః.

మనుః దివ్యాన్తరిక్ష భౌమేషు యా శాన్తి రభిధీయతే| తా మహం శ్రోతు మిచ్చామి మహోత్పాతేషు కేశవ. 1

మత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి వివిధే ష్వద్భుతాదిషు| విశేషేణతు భౌమేషు శాన్తిః కార్యా యథా భ##వేత్‌. 2

అభయా చాన్తరిక్షేషు సౌమ్యా దివ్యేషు పార్థివ| విజిగీషుః పరం రాజ న్భూతికామస్తు యో భ##వేత్‌. 3

విజిగీషుః పరానేన మభియుక్త స్తథా పరైః| తథా 7భిచార శఙ్కాయాం శత్రూణా మభినాశ##నే. 4

భ##యే మహతి సమ్ప్రప్తే అభయా శాన్తి రిష్యతే| రాజయాక్ష్మాభిభూతస్య క్షతక్షీణస్య చాప్యథ. 5

సౌమ్యా ప్రశస్యతే శాన్తి ర్యజ్ఞకామస్య చాప్యథ| భూకంపేతు సముత్పన్నే ప్రాప్తే చాన్నక్షయే తథా. 6

అతివృష్ట్యా మనావృష్ట్యాం శలభానాం చ భీతిషు| ప్రమత్తేషు చ చోరేషు వైష్ణవీ

శాన్తిరిష్యతే. 7

పశూనాం మరణ ప్రాప్తే నరాణామపి దారుణ | భూతేషు దహ్యమానేషు రౌద్రీ శాన్తి స్తథేష్యతే. 8

వేదనాశే సముత్పన్నే జనే జాతే చ నాస్తికే| అపూజ్యపూజనే జాతే బ్రాహ్మీ శాన్తి స్తథేష్యతే. 9é

భవిష్యత్యభిషేకేచ పరచక్రభ##యేషుచ| స్వరాష్ట్రభేదే7రివధే శాన్తీ రౌద్రీ ప్రశస్యతే. 10

త్య్రహాతిరిక్తే పవనే రూక్షే సర్వవిగర్హితే| వికృతే వాతజే వ్యాధౌ వాయవ్యా శాన్తి రిష్యతే. 11

అనావృష్టిభ##యే జాతే వికృతే వర్షణ తథా| జలాశయవికారేత రూపిణీ శాన్తి రిష్యతే. 12

అపి శాపభ##యే ప్రాప్తే భార్గలీ చ తథా ద్విజ | జాతే ప్రసవవేకృత్యే ప్రాజాపత్యా మహాభుజ. 13

ఉపస్కరాణాం వైకృత్యే త్వాష్ట్రీ పార్థివసత్తమ| బాలానాం శాన్తి కామస్య కౌమారీచ తథా నృప. 14

ఆగ్నేయా శాన్తి రేవ స్యా త్సమ్ప్రాప్తే వహ్నివైకృతే |ఆజ్ఞాభ##ఙ్గేతు సమ్ప్రాప్తే తథా భృత్యాదిసఙ్గయే. 15

రెండు వందల ఇరువది ఏడవ అధ్యాయము.

రాజధర్మము- దివ్యాంతరిక్ష భౌమోత్పాత శాంతి.

(అకస్మికముగా జరుగు ప్రకృతి విపరీతములు( ప్రాకృతికోపద్రవములు) ఉత్పాతములు; వీనినే అద్భుతములు-అశ్చర్యకరములగు అసాధారణ సంఘటనలు -అనియు వ్యవహరింతురు. ఇవి1. భౌమములు- భూమిచో సంబంధించి నవి; 2. అంతరిక్షములు-అందరిక్షముతో సంబంధించినవి; 3.దివ్యములు- నక్షత్రగ్రహాది జ్యోతిర్గోళములతో సంబంధించినవి- అని మూడు విధములు.)

కేశవా! దివ్యములు అంతరిక్షములు భౌమములునను మూడు విధములగు మహోత్పాతములలో నేవి యేవి సంభవించినపుడు ఏ ఏ శాంతులు జరుపవలెనని శాస్త్రము విధించుచున్నదో తెలియ వేడెదననిన మత్స్యుడు మనువుతో ఇట్లనెను; నీకికమీదట వివిధములగు అద్భుతములును ఉత్పాతములును సంభవించినపుడును విశేషించి భౌమాంతరిక్ష దివ్యములనబడు ఇవి సంభవించినపుడును ఏయే శాంతి విధించబడినదో తెలిపెదను వినుము; పరులను జయించి వారి సంపదల తానందగోరువాడును పరులకంటే తానదికుడుగా నుండగారువాడును ఇతరుల తన విశయమున (తన రాజ్యవిషయమున) చేసిన అభిచార క్రియలకు పాత్రుడయిన వాడును శత్రువుల నశింపజేయదలచిన వాడును మహాభయములు సంప్రాప్తించిన వాడును జరుపవలసిన శాంతికి 'అభయా'శాంతి అని పేరు; ఇది అతరిక్షోత్ఫాతములను శమింపజేయునది.

రాజయక్ష్మ వ్యాధి (క్షయవ్యాధి) చే బాధనందువాడును గాయములతో భాధనందుచు కృశించించునవాడును యజ్ఞముల నాచరింపగోరువాడును 'సౌమ్యా' శాంతినాచరించుట ప్రశస్తము; భూకంపములు అన్నపు కొరత అతివృష్టి అనావృష్టి మిడుతల భయము పిచ్చివాండ్రవలనను దొంగలవలనను ఉపద్రవముల కలిగినచో 'వైష్ణవీ' శాంతి చేయవలెను; పశునరమరణము భూతదాహము సంభవించినచో 'రౌద్రీ' శాంతి తగును వేదనాశము నాస్తిక వృద్ధి అపూజ్యులను పూజించుట జరుగనపుడు 'బ్రాహ్మీ'శాంతి చేయవలెను; మూడుదినములకు అధికకాలము రూపేక్షమును సర్వప్రాణులకు సహింపరానిదియగును గాలి వీచుచున్నపుడును వాత వ్యాధులు చెలరేగినపుడును 'వాయవ్యా' శాంతి చేయవలెను; అనావృష్టి భయ-వృష్టివికార- జలాశయవికారములు కలుగునపుడు 'వారుణీ' శాంతి జరుపలెను; శాపభయము కలుగుచో 'భార్గవీ' శాంతి ప్రసవములందు విరీతములు(వికృత శిశు జననము ఒక ప్రాణి కడుపున మరియొక ప్రాణి జననము) సంభవించుచో 'ప్రాజాపత్య శాంతి' ఉపస్కర (పనిముట్ల) వికృతి సంభవించినచో 'త్వాష్ట్రీ' శాంతిబాలుర క్షేమమునకై 'కౌమారీ' శాంతి అగ్నివై కృతము జరిగినపుడును ఆజ్ఞాభంగములు భృత్య నాశాదికము జరుగునపుడును 'అగ్నేయా' శాంతి జరుపవలెను.

అశ్వానాం శాన్తికామస్య తద్వికారే తథోత్థితే| అశ్వానాం సామయానస్య గాన్ధర్వీ శాన్తి రిష్యతే. 16

గజానాం శాన్తి కామస్య తద్వికారే తథా స్థితే| రాజ్యంవా కామయానస్య శాన్తి రాఙ్గిరసీ భ##వేత్‌. 17

పిసాచాదిభ##యే జాతే శాన్తిర్వై నైరృతీ స్మృతా| అపనృత్యుభ##యే జాతే దుస్స్వప్నే చ తథావిధే. 18

యామ్యాంతు కారయే చ్ఛాన్తిం ప్రాప్తేతు నరకే తథా| ధననాశే తు సమ్ప్రాప్తే కౌభేరీ సాన్తిరిష్యతే. 19

ప్రథమే దినయామేచ రాత్రౌ చ రవినన్దన| హస్తే స్వాతౌచ చిత్రాయా *మాదిత్యే చాశ్వినే తథా. 21

ఆర్యవ్ణుె సౌమ్య జాతేషు వాయవ్యాం త్వద్భుతేషుచ| ద్వితీయే దినయామేషు రాత్రౌతు రవినన్దన. 22

పుష్యాగ్నేయ విశాఖాసు పిత్ర్యాసు భరణీషుచ| ఉత్పాతేషు తథా భాగ్నే ఆగ్నోయీం తత్ర కారయేత్‌. 23

తృతీయే దిమయామేచ రాత్రౌచ రవినన్దన| రోహిణ్యాం వైష్ణవే బ్రాహ్మే వాసవే వైశ్వదైవతే. 24

జ్యేష్ఠాయాం చ తథా మైత్ర్యే యే భవన్త్యద్భుతాః క్వచిత్‌| ఐన్ద్రీ తేషు ప్రయోక్తవ్యా శాన్తీ రవికులోద్వహ. 25

చతుర్థే దినయామేచ రాత్రౌచ రవినన్దన| సార్పే పౌష్టే తథార్ద్రాయా మహిర్భుద్న్యే చవా (దా) రుణ. 26

మూలేచ జలదైవత్యే యే భవన్త్యధ్బుతా స్తథా| వారుణీ తేషు కర్తవ్యా మహాసాన్తి ర్ముహీక్షితా. 27

డామిత్రమణ్డలవేలాసు యే భవన్త్యద్భుతాః క్వచిత్‌| తత్ర శాన్తిద్వయం కార్యం నిమిత్తే సతి నాన్యథా. 28

నిర్నిమిత్తా కృతా శాన్తి ర్నిమితే నోపయుజ్యతే| బాణప్రహారా నభవన్తి యద్వ ద్రాజ న్నృ

ణాం సన్నహనై ర్యుతానామి. 29

దైవోపదాతా నభవన్తి తద్వ ద్ధర్మాత్మానాం శాన్తిపరాయణానామ్‌. 29u

ఇతిశ్రీ మత్స్య మహాపురాణమత్స్య మనుసంవాదే అద్భుతశాన్తి విధి

ర్నామ సప్తవింశత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

అశ్వములకు వికృతి ఏర్పడినపుడు అవిశమించుటకై 'గాంధర్వీ' శాంతియు గజములయందు వికృతి ఏర్పడి నపుడు అదిశమించుటకును రాజ్యమును వృద్ధి నందించుకొనగోరినపుడును 'ఆంగీరసీ' శాంతియు పిశాచాది భయము శాంతించుటకై 'నైరృతీ' శాంతియు అపమృత్యుభయమును దానిని సూచించు దుస్వప్నములును నరకభయమును సంభవించునపుడు 'యామ్యా' శాంతియు ధన నాశమునందు 'కౌబేరీ' శాంతియు వృక్షములందును దనమునందును వైకృతమేర్పడి నపుడును భూమి నధికముగా కోరినపుడు 'పార్థివీ' శాంతియు పగలు రాత్రియందు కాని మొదటి జామునను హస్త స్వాతీ చిత్రా పునర్వసు అశ్విని ఉత్తర ఫల్గుని మృగసిర నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'వాయవ్యా' శాంతిని దినాత్రి ద్వితీయ యామమునందును పుష్యమి కృత్తిక విశాకా మఖాభరమీ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'ఆగ్నేయీ' శాంతిని పగటగాని రాత్రియందు గాని మూడవజామునను రోహిణి శ్రవణము ఉత్తరాభాద్ర ధనిష్ఠ జ్యేష్ఠ అనూరాధ- ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'ఐంద్రీ' శాంతిని పగటకాని రాత్రియందుగాని నాల్గజామునను ఆశ్లేష రేవతి ఆర్ద్ర ఉత్తరాభాద్ర శతభిషము మూల-ఈ నక్షత్రములుందును ఉత్పాతములు సంభవించినచో 'వారుణీ' శాంతిని జరుపవలెను; రవి మండలపు అంచులందు ఉత్పాత నిమిత్తములు కనబడినచో(అభయా- సౌమ్యా) రెండు శాంతులు జరుపవలయును. నిమిత్తములు కనబడినపుడు జరిపిన శాంతి నిమిత్తములు కనబడిన కాలము నాటికి ఉపయోగవడవు; కావుననిమిత్తములు కనబడినపుడు మాత్రమే శాంతి జరుపవలయును. కవచములు శిరస్త్రాణములు మొదలగు రక్షణ సాధనములు ధరించిన వీరునకు యుద్ధమున బాణ(ము మొదలగు ఆయుధ)పు దెబ్బలు తగులనట్లే ధర్మాత్ములై అవలస్యములయిన శాంతులు జరుపుకొనుచుండు రాజుల రాజ్యములందు ఉత్పాతాదులు భయములును పీడలును ఉండవు.

శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున అద్భుత (ఉత్పాత) శాంతి విధియను

రెండు వందల ఇరువది ఏడవ అధ్యాయము.

*సావిత్రే

Sri Matsya Mahapuranam-2    Chapters